04-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు ఇప్పటి వరకు ఏమేమి చదివారో దానినంతా మర్చిపోండి. జీవించి ఉండగానే మరణించడం అనగా అన్నీ మర్చిపోవడం, వెనుకటి స్మృతులేవీ రాకూడదు. ''
ప్రశ్న :- ఎవరు జీవించి ఉండగానే పూర్తిగా మరణించి(మరజీవాగా)ఉండరో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు :- వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు. శాస్త్రాల ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించి ఉంటారో, వారు - బాబా ఏమి వినిపిస్తున్నారో అదే సత్యము. అర్ధకల్పము ఏదైతే విన్నామో అదంతా అసత్యము కనుక వాటిని గురించి మాట్లాడరాదు. చెడు వినకండి,........... అని బాబా చెప్పారు.
ఓంశాంతి. ఎప్పుడు శాంతిలో కూర్చుండబెడ్తారో దానిని నిష్ఠ(నేష్ఠా) అని అన్నారని తండ్రి అర్థం చేయించారు. ఈ డ్రిల్లు చేయించబడ్తుంది. ఇప్పుడు తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే జీవించి ఉండగానే మరణించారో వారు మేము జీవించి ఉంటూ మరణించాము అని అంటారు. మనష్యులు మరణిస్తే అంతా మర్చిపోతారు. కేవలం సంస్కారము మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందినవారిగా అయ్యి ప్రపంచము నుండి మరణించారు. తండ్రి చెప్తారు - మీలో భక్తి సంస్కారముండేది. ఇప్పుడు ఆ సంస్కారము పరివర్తన అవుతూ ఉంది. కనుక జీవించి ఉండగానే మీరు మరణిస్తారు కదా. మరణించడం వలన మనుష్యులు ఈ జన్మలో చదివినదంతా మర్చిపోతారు. మళ్లీ మరు జన్మలో కొత్తగా చదవడం జరుగుతుంది. మీరు ఏమేమి చదివారో అదంతా మర్చిపోండి అని తండ్రి కూడా చెప్తారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా. నేను మీకు కొత్త విషయాన్ని వినిపిస్తాను. కనుక ఇప్పుడు వేదాలు, శాస్త్రాలు, గ్రంథము, జప, తపాలు మొదలైనవన్నీ మర్చిపోండి. అందుకే చెడు వినకు, చెడు చూడకు.............. అని చెప్పారు. ఇది పిల్లలైన మీ కొరకే. చాలామంది శాస్త్రాలు మొదలైనవి చాలా చదివారు, పూర్తిగా మరణించలేదు. కనుక వ్యర్థంగా వాదిస్తారు. మరణిస్తే ఎప్పుడూ వాదించరు. తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యము. మిగిలిన విషయాలు మేము మా నోటితో ఎందుకు మాట్లాడాలి అని అంటారు. వాటిని నోటి పైకి తీసుకు రాకండి, చెడు వినకండి, ఏమీ వినకండి అని తండ్రి ఆదేశాన్నిచ్చారు కదా. ఇప్పుడు మేము జ్ఞానసాగరుని సంతానంగా అయ్యాము, కనుక భక్తిని ఎందుకు స్మృతి చేయాలి! అని అడగండి. మేము ఒక్క భగవంతుని మాత్రమే స్మృతి చేస్తాము. తండ్రి చెప్తున్నారు - భక్తిమార్గాన్ని వదలండి. నేను మీకు సహజమైన విషయాన్ని వినిపిస్తాను - బీజమైన నన్ను స్మృతి చేస్తే వృక్షము పూర్తిగా బుద్ధిలోకి రానే వస్తుంది. మీకు గీత ముఖ్యమైనది. గీతలోనే భగవంతుడు తెలియజేసిన విషయాలున్నాయి. ఇప్పుడివి కొత్త విషయాలు. కొత్త విషయాల పై సదా ఎక్కువ గమనము ఇవ్వబడ్తుంది. విషయము కూడా చాలా సాధారణమైనది. అన్నిటికంటే గొప్ప విషయము స్మృతి చేయడము. 'మన్మనాభవ' అని మాటిమాటికి చెప్పవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేయండి. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇందులోనే విఘ్నాలు వస్తూ ఉంటాయి. పూర్తి రోజులో రెండు నిముషాలు కూడా స్మృతి చేయని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. తండ్రికి చెందినవారిగా అయ్యి కూడా మంచి కర్మలు చేయకుంటే స్మృతి కూడా చేయరు. వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలోనే కూర్చోకుంటే వారు తండ్రి ఆజ్ఞను నిరాదరించినట్లవుతుంది. వారు చదవలేరు కనుక వారికి శక్తి లభించదు. దైహిక విద్య ద్వారా కూడా శక్తి లభిస్తుంది కదా! చదువు సంపాదనకు మూలము. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. అది కూడా అల్పకాలము కొరకే. ఎవరైనా చదువుతూ చదువుతూ మరణిస్తే ఆ చదువును వెంట తీసుకెళ్లరు. మరో జన్మ తీసుకొని మళ్లీ కొత్తగా చదవవలసి ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఎంత చదువుతారో దానిని మీ జతలో తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు మరు జన్మలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. పోతే అదంతా భక్తిమార్గము. ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తారు. ఒకేసారి తండ్రి, సుప్రీమ్ ఆత్మ(పరమ ఆత) వచ్చి ఆత్మలకు జ్ఞానమునిస్తారు. దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. భక్తిమార్గములో స్వర్గము ఉండదు. ఇప్పుడు మీరు ప్రభువుకు చెందినవారిగా అయ్యారు. మాయ చాలాసార్లు పిల్లలను కూడా అనాథలుగా చేసేస్తుంది. చిన్న-చిన్న విషయాలలో పరస్పరము కొట్లాడుకుంటారు. తండ్రి స్మృతిలో లేనందున అనాథలుగా అయ్యారు కదా. అనాథలుగా అయితే ఏదో ఒక పాప కర్మ తప్పకుండా చేసేస్తారు. తండ్రి చెప్తున్నారు - నా వారిగా అయ్యి నా పేరును పాడు చేయకండి. పరస్పరములో చాలా ప్రీతిగా నడుచుకోండి. ఉల్టా-సుల్టా మాటలను మాట్లాడకండి.
తండ్రి అలాంటి అహల్యలను, కుబ్జలను వికలాంగులను, కొండజాతి స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. బోయ స్త్రీ ఇచ్చిన రేగి పండ్లు తిన్నారని చెప్తారు. ఆమె ఇచ్చిన పండ్లను అలాగే తినలేదు. ఎప్పుడు ఆ బోయ స్త్రీ బ్రాహ్మణిగా అవుతుందో అప్పుడు ఎందుకు తినరు! అందుకే బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది. శివబాబా తినరు. వారు అభోక్త కానీ ఈ రథము తింటుంది కదా. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించనవసరము లేదు. సదా మిమ్ములను మీరు రక్షణ చేసుకోవాలి. శివబాబా చెప్తున్నారు అను రెండే అక్షరాలు చెప్పండి. శివబాబాను రుద్రుడని కూడా అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది. కనుక రుద్రుడు భగవంతుడయ్యాడు కదా. కృష్ణుని రుద్రుడని అనరు. వినాశనము కూడా కృష్ణుడు చేయించడు. తండ్రే స్థాపన, వినాశనము, పాలన చేయిస్తారు. స్వయంగా ఏదీ చేయరు. లేకుంటే దోషము వస్తుంది కదా. వారు చేసి చేయించేవారు. తండ్రి చెప్తారు - వినాశనము చేయమని నేనేమీ చెప్పను. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. శంకరుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు. శంకరుని ద్వారా వినాశనము అని కేవలం గాయనముంది. కానీ వినాశనము వారు తమకు తామే చేసుకుంటున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. దానిని గురించి అర్థం చేయించబడ్తుంది. రచయిత అయిన తండ్రిని అందరూ మర్చిపోయారు. గాడ్‌ఫాదర్‌ను రచయిత అని అంటారు కానీ వారిని గురించి తెలియనే తెలియదు. వారు ప్రపంచాన్ని సృష్టిస్తారని అనుకుంటారు. తండ్రి చెప్తారు - నేను సృష్టించను కానీ పరివర్తన చేస్తాను. కలియుగాన్ని సత్యయుగంగా చేస్తాను. నేను సంగమయుగములో వస్తాను. దానిని సర్వ శ్రేష్ఠ పురుషోత్తమ యుగమని మహిమ చేస్తారు. భగవంతుడు కళ్యాణకారి. అందరి కళ్యాణము చేస్తారు కానీ ఎలా చేస్తారో, ఏ కళ్యాణము చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆంగ్లములో లిబరేటర్(ముక్తిదాత), గైడ్(మార్గదర్శకుడు) అని అంటారు. కాని దాని అర్థము తెలియదు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తాడు, సద్గతి లభిస్తుందని అంటారు. సర్వులకు సద్గతి ఏ మనుష్యులూ ఇవ్వలేరు. లేకుంటే పరమాత్మను పతితపావనుడు, సర్వుల సద్గతిదాత అని ఎందుకు మహిమ చేస్తారు? తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు! అనాథలుగా ఉన్నారు. తండ్రితో విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? తండ్రి స్వయంగా మాలికులు, వారి శివజయంతిని కూడా భారతదేశములోనే ఆచరిస్తారు. తండ్రి చెప్తారు - నేను భక్తులకు ఫలాన్ని ఇచ్చేందుకు వస్తాను, భారతదేశములోనే వస్తాను. వచ్చేందుకు నాకు శరీరమైతే తప్పకుండా కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. ఇతనిలో ప్రవేశించి ఇతని నోటి ద్వారా మీకు జ్ఞానమునిస్తాను. గోముఖము మాట లేదు. అది ఈ నోటి విషయము. మనుష్యుల నోరు కావాలి, జంతువులది కాదు. అంతమాత్రము కూడా బుద్ధి పని చేయదు. మరోవైపు భగీరథుని చూపిస్తారు. వారు ఎలా, ఎప్పుడు వస్తారో కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలియదు. కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు మరణించారు కనుక భక్తిమార్గాన్ని పూర్తిగా మర్చిపోండి. శివ భగవానువాచ - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. నేనే పతిత పావనుడను. మీరు పవిత్రంగా అవుతారు తర్వాత అందరినీ తీసుకెళ్తాను. ఇంటింటిలో ఈ సందేశమునివ్వండి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, మీరు పావనంగా అవుతారు. వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. ఓ పతితపావనా! రండి, పతితులను పావనంగా చేయండి, రామరాజ్యాన్ని స్థాపన చేయండి, రావణరాజ్యము నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు. అక్కడ అందరూ తమ-తమ కొరకు మాత్రమే ప్రయత్నము చేస్తారు. నేను వచ్చి అందరికీ ముక్త్తినిస్తానని తండ్రి చెప్తారు. అందరూ 5 వికారాల రూపి రావణుని జైలులో పడి ఉన్నారు. నేను సర్వులకు సద్గతినిస్తాను. నన్ను దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. రామరాజ్యమైతే తప్పకుండా కొత్త ప్రపంచములో ఉంటుంది.
ఇప్పుడు పాండవులైన మీది ప్రీతిబుద్ధి. కొందరు వెంటనే ప్రీతిబుద్ధి గలవారిగా అవుతారు. కొందరికి నెమ్మది నెమ్మదిగా ప్రీతి కలుగుతుంది. మేము సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తామని కొందరు అంటారు. ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేనే లేరు. సర్వులకు ఆధారము ఒక్క భగవంతుడు మాత్రమే. ఎంత సాధారణమైన విషయము. తండ్రిని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి, చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. ఇది విశ్వాధికారులుగా చేసే పాఠశాల. అందుకే చక్రవర్తి రాజా అని పేరు వచ్చింది. చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తులుగా అవుతారు. ఇది తండ్రే అర్థం చేయిస్తారు. ఏ వాదవివాదాలూ చేయరాదు. భక్తిమార్గములోని అన్ని విషయాలను వదిలేయమని చెప్పండి. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఇదే ముఖ్యమైన విషయము. ఎవరైతే తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారు తీవ్రంగా చదువులో నిమగ్నమైపోతారు. ఎవరికైతే చదువు పై ఆసక్తి ఉంటుందో వారు ఉదయమే లేచి చదువుతారు. భక్తులు కూడా ఉదయమే లేస్తారు. నౌధా భక్తి కూడా ఎంతగా చేస్తారు! ఎప్పుడైతే శిరస్సును ఖండించుకునే సమయము వస్తుందో అప్పుడు సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడ తండ్రి చెప్తారు - ఈ సాక్షాత్కారము కూడా నష్టము కలిగించేదే. సాక్షాత్కారములోకి వెళ్లడం వలన చదువు, యోగము రెండూ ఆగిపోతాయి. సమయము వ్యర్థమవుతుంది. కనుక ధ్యానము మొదలైనవాటిలో ఆసక్తి ఉండరాదు. ఇది కూడా పెద్ద జబ్బు. దీని ద్వారా మాయ ప్రవేశిస్తుంది. ఎలా యుద్ధ సమయంలో వార్తలు వినిపించునప్పుడు మధ్యలో అవి ఎవరూ వినకుండా ఉండేందుకు ఏదైనా పాడు చేస్తారో అలా మాయ కూడా చాలామందికి విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. వీరి భాగ్యములో విఘ్నముందని అర్థం చేసుకోవచ్చు. మాయ ప్రవేశించలేదు కదా అని గమనించుకోవాలి. నియమ విరుద్ధంగా ఏదైనా మాట్లాడితే తక్షణము బాబా క్రిందికి దించేస్తారు. మాకు కేవలం సాక్షాత్కారము జరిగితే మేము ఇంత ధనాన్ని, సంపాదనను మీకు ఇచ్చేస్తామని చాలామంది అంటారు. బాబా అంటారు - మీది మీ వద్దనే ఉంచుకోండి. భగవంతునికి మీ ధనము అవసరమేముంది? ఈ పాత ప్రపంచములో ఏమేమి ఉందో అదంతా భస్మమైపోతుందని తండ్రికి తెలుసు. బాబా ఏం చేసుకుంటారు? బాబా వద్ద ఒక్కొక్క నీటిబొట్టు చేరి చెరువైపోతుంది. తండ్రి ఆదేశానుసారము నడవండి. ఆసుపత్రి కమ్ యూనివర్సిటీని తెరవండి. అచ్చటికి ఎవరైనా వచ్చి విశ్వాధికారులుగా కావచ్చు. 3 అడుగుల భూమి పై కూర్చొని మీరు మనుష్యులను నరుల నుండి నారాయణులుగా చేయాలి. కాని 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి చెప్తారు - నేను మీకు సర్వ వేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఈ శాస్త్రాలన్నీ భక్తిమార్గములోనివి. బాబా ఏమీ నిందించడం లేదు, ఇది తయారైన డ్రామా. ఇది కేవలం అర్థం చేయించేందుకు చెప్పబడ్తుంది. అయినా ఇది ఆటనే కదా. ఆటను మనము నిందించలేము. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అని మనము అంటాము. వారు ఆ చంద్రుడు మొదలైన వాటిలో అక్కడ ఏదైనా రాజ్యముందా? అని వెతుకుతారు. జపాన్ వారు సూర్యుని అంగీకరిస్తారు. మనము సూర్యవంశము అని చెప్తాము. వారు కూర్చొని సూర్యుని పూజిస్తారు, సూర్యునికి అర్ఘ్యమిస్తారు(నీటిని అర్పిస్తారు). కనుక బాబా పిల్లలకు అర్థం చేయించారు - ఏ విషయములోనూ ఎక్కువగా వాదించరాదు. ఒకే విషయాన్ని వినిపించండి. ''తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు.'' ఇప్పుడు రావణరాజ్యములో అందరూ పతితులుగా ఉన్నారు కానీ ఎవ్వరూ తమను తాము పతితులమని ఒప్పుకోరు.
పిల్లలారా! మీ ఒక కంటిలో శాంతిధామము మరొక కంటిలో సుఖధామము ఉండాలి. పోతే ఈ దు:ఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్య లైట్‌హౌస్‌లు. ఇప్పుడు ప్రదర్శినీలో కూడా భారతదేశము లైట్‌హౌస్......... అని పేరు పెట్టారు కానీ దానిని వారెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీరు లైట్‌హౌస్‌లు కదా. సాగర తీరములోని లైట్‌హౌస్ స్టీమర్లకు మార్గాన్ని చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి-జీవన్ముక్తి ధామాలకు మార్గాన్ని తెలుపుతారు. ఎవరైనా ప్రదర్శినీకి వచ్చినప్పుడు వారికి చాలా ప్రీతిగా చెప్పండి - గాడ్‌ఫాదర్ సర్వులకు ఒక్కరే కదా. గాడ్‌ఫాదర్ లేక పరమపిత నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. అనగా తప్పకుండా నోటి ద్వారానే చెప్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, బ్రాహ్మణ - బ్రాహ్మణీలమైన మనమంతా బ్రహ్మ ముఖ వంశస్థులము. ఆ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ దేవతాయ నమ: అని బ్రాహ్మణులైన మీ మహిమ చేస్తారు. అత్యంత ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు చెప్తున్నారు - నేను మీకు ఉన్నతాతి ఉన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. విశ్వము పై భారతదేశ పాలన ఉండేది. భారతదేశానికి చాలా మహిమ ఉంది. మేము శ్రీమతానుసారము ఈ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువు పై ఆసక్తిని ఉంచుకోవాలి. ఉదయము ఉదయమే లేచి చదువుకోవాలి. సాక్షాత్కారము అవ్వాలనే ఆశ ఉంచుకోరాదు. ఇందులో కూడా సమయం వ్యర్థమవుతుంది.
2. శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి. ఈ దు:ఖధామాన్ని మర్చిపోవాలి. ఎవ్వరితోనూ వాదించరాదు. ప్రేమగా ముక్తి-జీవన్ముక్తులకు మార్గము చూపించాలి.
వరదానము :- '' నిమిత్త భావము ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ సేవాధారీ భవ ''
సేవలో నిమిత్త భావము స్వతహాగా సఫలతను ఇప్పిస్తుంది. నిమిత్త భావము లేకుంటే సఫలత ఉండదు. శ్రేష్ఠమైన సేవాధారి అనగా ప్రతి అడుగు తండ్రి అడుగు పై ఉంచేవారు. ప్రతి అడుగు శ్రేష్ఠ మతమును అనుసరించి శ్రేష్ఠంగా చేసుకునేవారు. సేవలో, స్వయంలో వ్యర్థము ఎంత సమాప్తమై పోతుందో అంత సమర్థంగా అవుతారు. సమర్థమైన ఆత్మలు ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఎవరైతే స్వయం ఉమంగ-ఉత్సాహములో ఉంటూ ఇతరులకు కూడా ఉమంగ - ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్ఠమైన సేవాధారులు.
స్లోగన్ :- '' ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేసుకుంటే, ఆఫరీన్ లభిస్తూ ఉంటుంది ''
No comments:
Post a Comment