Tuesday, February 18, 2020

Telugu Murli 19/02/2020

19-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీరు నడుస్తూ - తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. జ్ఞాన-యోగాలు ఈ రెండే ముఖ్యమైనవి. యోగమనగా స్మృతి ''

ప్రశ్న:- తెలివిగల(చురుకైన) పిల్లల నోటి నుండి ఏ మాటలు రావు ?
జవాబు:- మాకు యోగము నేర్పించమని తెలివిగల పిల్లలెవ్వరూ అడగరు. తండ్రిని స్మృతి చేయడం నేర్పించాలా? ఇది స్వయం చదువుకుంటూ, ఇతరులను చదివించే పాఠశాల. స్మృతి చేసేందుకు ఎవరి దగ్గరైనా ప్రత్యక్షంగా కూర్చోవాలనేదేమీ లేదు. మీరు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

ఓంశాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ఈ రథము ద్వారా మాకు అర్థము చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబా పిల్లలైనందున తండ్రితో గానీ, ఏ సోదరితో గానీ, సోదరునితో గానీ నాకు తండ్రిని స్మృతి చేయడం నేర్పించమని అడగడం తప్పవుతుంది. మీరు చిన్న పిల్లలేమీ కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరము వినాశమవుతుంది. ఆత్మయే గొప్పది కదా. అజ్ఞాన కాలములో నేను ఆత్మనని, శరీరము ద్వారా మాట్లాడుతున్నాననే జ్ఞానము ఎవ్వరికీ ఉండదు. దేహాభిమానములోనే నేను ఈ పని చేస్తున్నాను అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. ఈ శరీరము ద్వారా మాట్లాడుతున్నానని, కర్మలు ఆచరిస్తున్నానని ఆత్మ అంటుందని మీకు తెలుసు. ఆత్మ పురుషుడు. మమ్ములను యోగములో కూర్చోబెట్టమని చాలామంది అంటూ ఉంటారు. నేను కూడా తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నాను, నా ముందు ఉన్నవారు కూడా అలాగే కూర్చోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల దీనికొరకు కాదు. పాఠశాల చదువుకునేందుకు ఉంటుంది. అలాగని ఇక్కడే కూర్చొని నన్ను స్మృతి చేయాలని కూడా కాదు. లేస్తూ, కూర్చుంటూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. స్మృతి చేసేందుకు అదే పనిగా కూర్చునే అవసరము లేదని తండ్రి అర్థం చేయించారు. కొంతమంది రామ-రామ అని అనమంటారు. రామ-రామ అనకుండా స్మృతి చేయలేరా? నడుస్తూ, తిరుగుతూ కూడా స్మృతి చేయవచ్చు. మీరు కర్మలాచరిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ప్రేయసీ-ప్రియులు అదే పనిగా కూర్చొని ఒకరినొకరు స్మృతి చేయరు. పని పాట, వృత్తి, వ్యాపారాలు అన్నీ చేయాల్సిందే. అన్ని పనులు చేస్తూ మీ ప్రియుని స్మృతి చేస్తూ ఉండండి. అంతేకాని వారిని స్మృతి చేసేందుకు ఎక్కడికైనా పోయి అదే పనిగా కూర్చునే అవసరము లేదు.

పిల్లలైన మీరు పాటలు, కవితలు మొదలైనవి వినిపిస్తారు. అది భక్తిమార్గమని బాబా అంటారు. 'శాంతిదేవ' అని కూడా అంటారు. అలా పరమాత్మనే స్మృతి చేస్తారు. కృష్ణుని కాదు. డ్రామానుసారము ఆత్మ అశాంతిగా అయిపోయినప్పుడు తండ్రిని పిలుస్తుంది. ఎందుకంటే శాంతి-సుఖాలనిచ్చేది జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరే. ముఖ్యమైనవి రెండు - జ్ఞానము మరియు యోగము. యోగమంటే స్మృతి. వారు చేసేది హఠయోగము. అది పూర్తి వేరుగా ఉంటుంది. మీది రాజయోగము. ఆ తండ్రిని కేవలం స్మృతి చేయాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నందు వలన సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మనలను చదివించేది స్వయం భగవంతుడని తెలుసుకున్నందున మీకు అందరికంటే ఎక్కువ ఖుషీ ఉంది. మొట్టమొదట భగవంతుని పరిచయము పూర్తిగా తెలుసుకోవాలి. ఆత్మ ఎలాగైతే ఒక నక్షత్రము వలె ఉంటుందో, అలాగే భగవంతుడు కూడా ఒక నక్షత్రము వలె ఉంటారని ఇంతకు ముందు ఎప్పుడూ తెలియదు. భగవంతుడు కూడా ఒక ఆత్మనే. కానీ వారిని పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు జనన-మరణాలలోకి రారు. వారు పునర్జన్మ తీసుకోరు. వారెలా వస్తారో, వారే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తిని గురించిన గాయనము కూడా భారతదేశములోనే ఉంది. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రమును కూడా చూపిస్తారు. శివ పరమాత్మాయ నమ: అని అంటారు కదా. అత్యంత ఉన్నతమైన తండ్రిని మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుని చిత్రము తప్పకుండా ఉండాలి. దాని ద్వారా వీరి రచయిత శివుడని అర్థం చేసుకుంటారు. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వము లభించదు. బ్రహ్మ ద్వారా వారసత్వము కొంచెం కూడా లభించదని మీకు తెలుసు. విష్ణువుకు వజ్రవైఢూర్యాల కిరీటము ఉంది కదా. శివబాబా ద్వారా మీరు మళ్లీ పైసా(విలువలేని వారి) నుండి రూపాయి (విలువైనవారు, అమూల్యమైనవారు)గా తయారయ్యారు. శివుని చిత్రము లేనందున అంతా ఖండించబడింది. అత్యంత ఉన్నతులు పరమపిత పరమాత్మ. ఇదంతా వారి రచన. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి 21 జన్మల స్వర్గ వారసత్వము లభిస్తుంది. అక్కడ లౌకిక తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని భావిస్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి నుండి లభించిన ప్రాలబ్ధమని అక్కడ తెలియదు. ఈ విషయము మీకిప్పుడే తెలిసింది. ఇప్పటి సంపాదన అక్కడ 21 జన్మల వరకు కొనసాగుతుంది. అక్కడ ఈ జ్ఞానము గురించి తెలియనే తెలియదు. ఈ జ్ఞానము దేవతలకు గానీ, శూద్రులకు గానీ లేదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది. ఇది ఆత్మిక జ్ఞానము. ఆధ్యాత్మికతకు అర్థము కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి అని అంటారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్(ఆధ్యాత్మిక జ్ఞానమిచ్చు డాక్టర్.........) ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని సర్జన్ అని కూడా అంటారు కదా. సాధు సన్యాసులు మొదలైనవారెవ్వరూ సర్జన్లు కారు. వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదివిన వారిని డాక్టర్ అని అనరు. భలే టైటిల్ ఇచ్చినా, వాస్తవానికి ఆత్మిక సర్జన్ ఒక్క తండ్రి మాత్రమే. వారు ఆత్మకు ఇంజక్షన్ ఇస్తారు. అది భక్తి. వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి. అనగా వారు శాస్త్రాల జ్ఞానమునిస్తారు. దాని వలన లాభమేమీ ఉండదు. క్రిందకు దిగజారుతూనే ఉంటారు. కనుక వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ అంటే లాభము చేకూరుస్తారు కదా. ఈ తండ్రి అయితే అవినాశి జ్ఞాన సర్జన్. యోగబలముతో మీరు సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాహ్యములో ఉండేవారికి ఏం తెలుసు? వారిని అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మలో ఏర్పడిన వికారాల మలినాలను తొలగించాలి. పతితులను పావనంగా చేసి సద్గతినిచ్చే శక్తి తండ్రిలో ఉంది. సర్వశక్తివంతులు, పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. సర్వశక్తివంతులని ఏ మనిషినీ అనలేరు. తండ్రి ఎలాంటి శక్తిని చూపిస్తారు? తన శక్తితో సర్వులకు సద్గతినిస్తారు. వారిని డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి(జూష్ట్రస ) అనేకమంది మనుష్యులు ఉన్నారు. కానీ స్పిరిచువల్ డాక్టర్ ఒక్కరు మాత్రమే. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండని తండ్రి చెప్తున్నారు. పవిత్ర ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను మళ్లీ మీరెందుకు పతితమవుతారు? పవిత్రంగా అవ్వండి, పతితులుగా అవ్వకండి. సర్వాత్మలకు తండ్రి ఇచ్చే ఆదేశము - గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రమవ్వండి. బాలబ్రహ్మచారులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ భస్మమైపోతాయి. మూలవతనంలో పవిత్ర ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఒక్క పతిత ఆత్మ కూడా అక్కడకు వెళ్లలేదు. బాబా మనలను చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. విద్యార్థులు మాకు టీచరును స్మృతి చేయడం నేర్పించమని అంటారా? స్మృతి నేర్పించే అవసరమేముంది? ఇక్కడ గద్దీ పైన ఎవరూ కూర్చోకపోయినా ఫరవాలేదు. మన తండ్రిని స్మృతి చేయాలి. రోజంతా వృత్తి వ్యాపారాదులలో ఉన్నందున మర్చిపోతారు. అందువలన ఇక్కడ కూర్చోబెడ్తారు. 10-15 నిముషాలు స్మృతి చేసినా చాలు. పిల్లలైన మీరు పని-పాటలు చేసుకుంటూ స్మృతిలో ఉండు అలవాటు చేసుకోవాలి. అర్ధకల్పము తర్వాత ఈ ప్రియుడు లభిస్తాడు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మలోని మలినాలన్నీ తొలగిపోతాయి. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారని చెప్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు స్మృతి చేయరాదు? స్త్రీకి కంకణము కట్టినప్పుడు నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వము అని చెప్తారు. కాని ఆ స్త్రీ పతినే కాక బంధు-మిత్రులను, గురువులను మొదలైన వారందరినీ స్మృతి చేస్తూ ఉంటుంది. అది దేహధారుల స్మృతి. కాని వీరు పతులకు పతి. వారినే స్మృతి చేయాలి. కొంతమంది మమ్ములను యోగములో కూర్చోబెట్టమని అంటారు. కాని దాని వలన ఏమవుతుంది? ఇక్కడ 10 నిముషాలు కూర్చుంటారు అయినా ఏకరస స్థితిలో ఎవ్వరూ కూర్చోరు. భక్తిమార్గములో ఎవరినైనా పూజించేందుకు కూర్చుంటే బుద్ధి అనేక వైపులకు తిరుగుతూ ఉంటుంది. తీవ్రమైన భక్తి చేసేవారికి సాక్షాత్కారము కావాలనే ఆశ ఉంచుకొని కూర్చుని ఉంటారు. వారు సాక్షాత్కారము కావాలనే లగ్నములో ఉండిపోతారు. ఒక్కరి ప్రేమలో లవలీనమైపోతారు. అప్పుడు సాక్షాత్కారము అవుతుంది. దానిని నౌధా భక్తి అని అంటారు. ఆ భక్తి ప్రేయసీ-ప్రియుల వలె తీవ్రంగా ఉంటుంది. తింటూ-తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉంటుంది. వారిలో వికారాల మాట ఉండదు. కాని శరీరాల పై ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? బీజాన్ని స్మృతి చేస్తే మొత్తం వృక్షమంతా గుర్తుకొస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము కదా. భారతదేశము ఒకప్పుడు బంగారు యుగముగా ఉండేదని ఇప్పుడు ఇనుప యుగములో ఉందని పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఈ ఇంగ్లీషు పదాలు బాగున్నాయి. వాటి నుండి మంచి అర్థము వస్తుంది. ఆత్మ సత్యమైన బంగారుగా అవుతుంది. ఆ తర్వాత అందులో మలినాలు ఏర్పడ్తాయి. ఇప్పుడు పూర్తిగా అసత్యమైపోయింది. దీనిని ఇనుప యుగమని అంటారు. ఆత్మలు ఇనుప యుగమువిగా అయినందున ఆభరణాలు(శరీరాలు) కూడా అలాగే అయిపోయాయి. నేను పతితపావనుడను, నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పతితపావనా! రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కల్ప-కల్పము వచ్చి మీకు ఈ యుక్తి తెలుపుతున్నాను - 'మన్మనాభవ, మధ్యాజీభవ' అనగా స్వర్గానికి అధికారులుగా అవ్వండి. కొంతమంది మాకు యోగములో చాలా మజా కలుగుతుంది కానీ జ్ఞానములో అంత మజా ఉండదని అంటారు. కేవలం యోగము మాత్రము చేసి పరుగెత్తిపోతారు. మాకు యోగమే బాగుంటుంది, మాకు శాంతి కావాలని అంటారు. మంచిది, తండ్రిని ఎక్కడ కూర్చొని అయినా స్మృతి చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్లిపోతారు. ఇందులో యోగము నేర్పించే విషయమే లేదు. తండ్రిని స్మృతి చేయాలి. చాలా మంది సెంటర్లకు వెళ్లి అర్ధగంట, ముక్కాలు గంట కూర్చుంటారు. మమ్ములను నిష్టలో కూర్చోబెట్టండి లేక బాబా మాకు యోగం చేయమని ప్రోగ్రాం ఇచ్చారని అంటారు. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. యోగము చేయకుండా ఉండడం కంటే కూర్చొని స్మృతి చేయడం మంచిదే. బాబా వద్దనరు. కావాలంటే రాత్రి అంతా కూర్చోండి కాని రాత్రి మాత్రమే స్మృతి చేసే అలవాటు చేసుకోరాదు. పని-పాటలు చేసుకుంటూ స్మృతి చేసే అలవాటు చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బుద్ధి మాటిమాటికీ వేరే వైపుకు పరిగెత్తుతుంది. భక్తిమార్గములో కూడా బుద్ధి పరిగెత్తుతూ ఉంటే స్వయాన్ని గిల్లుకుంటారు. సత్యమైన భక్తులు వారితో వారే మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా స్వయం మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబాను ఎందుకు స్మృతి చేయలేదు? స్మృతి చేయకుంటే విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? ప్రేయసి-ప్రియులు నామ-రూపాలలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలమైన మనము ఈ శరీరము నుండి వేరుగా ఉన్నాము. శరీరములోకి రావడం వలన కర్మలు చేయవలసి వస్తుంది. మాకు సాక్షాత్కారము కావాలనే వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని సాక్షాత్కారము చేసుకుంటారు? అతను బిందువు కదా. కొంతమంది కృష్ణుని సాక్షాత్కారము కావాలని అంటారు. కృష్ణునిదైతే చిత్రము కూడా ఉంది కదా. జడముగా ఉన్న చిత్రాన్ని చైతన్యములో చూస్తారు, కాని లాభమేముంది? సాక్షాత్కారము వలన ఎలాంటి లాభమూ ఉండదు. తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అవుతుంది. నారాయణుని సాక్షాత్కారవమైనందున నారాయణునిగా అవ్వరు.

మన లక్ష్యము నారాయణునిగా అవ్వడం అని మీకు తెలుసు. కాని చదువుకోకుండా అవ్వలేరు. చదువుకొని తెలివైనవారిగా అవ్వండి. ప్రజలను కూడా తయారు చేసుకోండి. అప్పుడు లక్ష్మినారాయణులుగా అవుతారు. శ్రమ ఉంటుంది. ధర్మరాజు శిక్షలను అనుభవించకుండా గౌరవ పూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ ప్రియమైన పుత్రుడు కూడా మీ జతలోనే ఉన్నాడు. మీరు తీవ్రంగా ముందుకు వెళ్లగలరని ఇతను కూడా చెప్తున్నాడు. బాబా పై ఎంత భారముంది!. రోజంతా అనేక రకాలైన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అందువలన అంత స్మృతి చేయలేను. భోజనము చేయునప్పుడు కొంచెం సేపు స్మృతి ఉంటుంది తర్వాత మర్చిపోతాను. బాబా, నేను ఇరువురం కలిసి వాకింగ్కు వెళ్తున్నామని అనుకుంటాను. అలా వాకింగ్ చేస్తూ చేస్తూ బాబాను మర్చిపోతాను. జారిపోయే వస్తువు కదా. మాటిమాటికి స్మృతి జారిపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. చాలామందిని చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. బాగా అర్థము చేసుకునేవారు మంచి పదవి పొందుతారు. ఎగ్జిబిషన్(ప్రదర్శినీ)లో చాలామంది ప్రజలుగా అవుతారు. మీలో ఒక్కొక్కరు లక్షల మందికి సేవ చేస్తారు. మీ స్థితి కూడా ఇలా ఉండాలి. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు శరీరము ఉండదు. పోను పోను యుద్ధాలు తీవంగా జరుగుతాయని మీకు ముందే తెలుస్తుంది. అప్పుడు చాలామంది మీ వద్దకు వస్తారు. మహిమ పెరుగుతూ ఉంటుంది. చివర్లో సన్యాసులు కూడా వస్తారు. తండిన్రి స్మృతి చేస్తారు. వారిది ముక్తిధామానికి పోయే పాత. జ్ఞానమునైతే తీసుకోరు. సందేశము ఆత్మలందరి వద్దకు చేరాలి. వార్తాపత్రికల ద్వారా చాలామంది వింటారు. పల్లెలన్నిటిలో సందేశమివ్వాలి. సందేశకులు(పైగంబర్లు), మెసంజర్లు మీరే. తండి తప్ప పతితుల నుండి పావనంగా చేసేవారు మరెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు ఎవ్వరినీ పావనము చేయలేరు. వారి ధర్మము వృద్ధి చెందాల్సి ఉంటుంది. కనుక వాపస్ పోయే మార్గాన్ని వారెలా తెలుపగలరు ? సర్వుల సద్గతిదాత ఒక్కరే. ఇప్పుడు పిల్లలైన మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రులుగా ఉండనివారు చాలామంది ఉన్నారు. కామము మహాశత్రువు కదా. మంచి -మంచి పిల్లలు క్రింద పడిపోతారు. చెడు దృష్టి కూడా కామము యొక్క అంశమే. ఇది పెద్ద సైతాను(పిశాచము). కామమును జయిస్తే జగత్జీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పని పాటలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. తండ్రి జతలో వెళ్లేందుకు లేక పావన నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
2. ఉన్నత పదవిని పొందేందుకు చాలామందికి సేవ చేయాలి. చాలామందిని చదివించాలి. సందేశకులై ఈ సందేశమును అందరి వద్దకు చేర్చాలి.

వరదానము:- '' మేరేపన్ (నాది) యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగము చేసే సదా నిర్భయ చింతలేని చక్రవర్తి (బే ఫికర్ బాద్షాహ్) భవ ''
ఈనాటి ప్రపంచంలో ధనమూ ఉంది, భయమూ ఉంది. ఎంత ధనముంటుందో అంత భయములోనే తింటారు, భయములోనే నిదురిస్తారు. ఎక్కడైతే 'నాది' అనేది ఉందో అక్కడ తప్పకుండా భయముంటుంది. ఏదైనా బంగారు జింక నాదిగా ఉందంటే భయముంది. కాని ఒక్క శివబాబాయే నా వారైతే నిర్భయులుగా అవుతారు. కనుక సూక్ష్మ రూపములో కూడా 'నాది, నాది' అనే దానిని చెక్ చేసుకొని దానిని త్యాగం చేశారంటే నిర్భయులుగా ఉంటారు. చింతలేని చక్రవర్తిగా ఉండే వరదానము లభిస్తుంది.

స్లోగన్:- '' ఇతరుల ఆలోచనలను గౌరవిస్తే, మీకు స్వతహాగానే గౌరవం లభిస్తుంది ''

No comments:

Post a Comment