18-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - పాత ప్రపంచములోని ముళ్లను నూతన ప్రపంచములోని పుష్పాలుగా తయారు చేయడం - ఇది తెలివైన తోటమాలుల కర్తవ్యము ''
ప్రశ్న:- సంగమ యుగములో పిల్లలైన మీరు ఏ శ్రేష్ఠమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు?
జవాబు:- ముళ్ల నుండి సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వడమే అన్నిటికంటే శేష్ఠ్రమైన భాగ్యము. ఏ ఒక్క వికారమున్నా వారు ముల్లువంటి వారే. ముళ్ల నుండి పుష్పాలుగా అయినప్పుడు సతోప్రధాన దేవతలుగా అవుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు 21 తరాలకు మీ సూర్యవంశి భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు.
గీతము:- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను,....................(తక్దీర్ జగాకర్ ఆయీ హూ,............)
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. ఇది సాధారణవమైన పాట ఎందుకంటే మీరు తోటమాలులు, తండ్రి తోట యజమాని. ఇప్పుడు తోటమాలులైన మీరు ముళ్లను పుష్పాలుగా చేయాలి. పాటలో ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భక్తులు భగవంతుని వద్దకు వచ్చారు. వీరంతా భక్తులు కదా. ఇప్పుడు జ్ఞాన విద్యను చదువుకునేందుకు తండి వద్దకు వచ్చారు. ఈ రాజయోగ చదువు ద్వారానే నూతన పప్రంచానికి యజమానులుగా అవుతారు. అందుకే భక్తులు అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాము, కొత్త ప్రపంచాన్ని హృదయంలో అలంకరించుకొని వచ్చామని అంటారు. తండ్రి కూడా ప్రతిరోజు స్వీట్హోమ్(శాంతిధామము/ూషవవ్ నశీఎవ)ను స్వీట్ రాజ్యమును(సత్యయుగము/ూషవవ్ జaజూఱ్aశ్రీ) స్మృతి చేయమని చెప్తారు. ఆత్మయే గుర్తు చేసుకోవాలి. ప్రతి సెంటరులో పిల్లలు ముళ్ల నుండి పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు. పుష్పాలలో కూడా నంబరువారుగా ఉంటాయి కదా. శివుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకము పుష్పాలతో పూజిస్తారు. గులాబి పుష్పాలకు, జిల్లేడు పుష్పాలకు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది కూడా ఒక తోటనే. కొన్ని గుండుమల్లె పూలు, కొన్ని చంపక(సంపెంగ) పుష్పాలు, కొన్ని రతన జ్యోతి పుష్పాలు, కొన్ని వాసన లేని పుష్పాలు కూడా ఉన్నాయి. వీటిని ఇప్పుడు కొత్త ప్రపంచములోని పుష్పాలుగా చేయాలి. ఈ పాత ప్రపంచములో ఉన్నవన్నీ ముళ్లే. అందుకే పాత ప్రపంచములోని ముళ్ల నుండి పుష్పాలుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చామని పాటలో ఉంది. తండ్రియే ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ముళ్ల నుండి పుష్పాలు అనగా దేవీ దేవతలుగా తయారవ్వాలి. పాటలోని అర్థము చాలా సహజంగా ఉంది. మనము కొత్త ప్రపంచము కొరకు అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాము. కొత్త ప్రపంచమంటే సత్యయుగము. కొంతమందిది సతోప్రధాన భాగ్యము. మరి కొంతమందిది రజో, తమోల భాగ్యము. కొంతమంది సూర్యవంశి రాజులుగా అవుతారు. కొంతమంది ప్రజలుగా అవుతారు, మరి కొంతమంది ప్రజలకు కూడా నౌకర్లు, చాకర్లుగా అవుతారు. ఈ కొత్త ప్రపంచ రాజ్యము స్థాపనవుతూ ఉంది. భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు పాఠశాలకు వెళ్తారు కదా. ఇక్కడిది నూతన ప్రపంచ విషయము. ఈ పాత ప్రపంచములో ఇంకా ఏ అదృష్టాన్ని తయారు చేసుకుంటారు! మీరు భవిష్య నూతన ప్రపంచములో దేవతలుగా అయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆ దేవతలకు అందరూ నమస్కరిస్తూ వచ్చారు. ఒకప్పుడు మనమే దేవతలుగా పూజ్యులుగా ఉండేవారము, మళ్లీ మనమే పూజారులుగా అయ్యాము. 21 జన్మల వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. దీనిని 21 తరాలు అని అంటారు. బాల్యము నుండి వృద్ధావస్థ వరకు ఒక తరము అని అంటారు. తండ్రి 21 తరాల వారసత్వమునిస్తారు. ఎందుకంటే అక్కడ యువావస్థలో గాని, బాల్యములో గాని, మధ్యలో గాని అకాలమృత్యువు ఉండనే ఉండదు. అందుకే దానిని అమర లోకమని అంటారు. ఇది మృత్యులోకము, రావణ రాజ్యము. ఇక్కడ ప్రతి ఒక్కరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఒక్క వికారమున్నా అది ముల్లే కదా. ఒక్క వికారమున్నా రాయల్గా ఉన్న సుగంధ పుష్పాలుగా తయారు చేయడం తోటమాలికి తెలియదని తండ్రి భావిస్తారు. విజయమాలలో కూర్చబడేందుకు అర్హత గల పుష్పాలుగా అవ్వాలి. దేవతల వద్దకు మంచి మంచి పుష్పాలు తీసుకెళ్తారు కదా. ఎలిజబెత్ మహారాణి వస్తే ఫస్ట్క్లాస్ పుష్పాల మాల తయారు చేసుకొని తీసుకెళ్తారు కదా. ఇక్కడ మనుష్యులు తమోప్రధానంగా ఉన్నారు. శివుని భగవంతుడని అంటారు అనగా వారు అత్యంత ఉన్నతులు కదా. శివుడు ఉమ్మెత్త పూలు తినేవాడని, భంగు తాగేవాడని ఎంతగానో గ్లాని చేస్తారు అనగా నిందిస్తారు. పుష్పాలు కూడా జిల్లేడు పుష్పాలను తీసుకెళ్తారు కదా. అటువంటి పరమపిత పరమాత్మ వద్దకు ఏం తీసుకెళ్తారు? తమోప్రధానమైన మనుష్యుల వద్దకు ఫస్ట్క్లాస్ పుష్పాలు తీసుకెళ్తారు. శివుని మందిరానికి ఏం తీసుకెళ్తారు? పాలు కూడా ఎటువంటివి తీసుకెళ్తారు? 5 శాతము పాలు, మిగిలిన 95 శాతము నీరు. భగవంతునికి ఎటువంటి పాలు ఇవ్వాలి? భగవంతుని ఎలాంటి పాలతో అభిషేకము చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా తెలియదు. ఇప్పుడు మీకు చాలా బాగా తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. బాగా తెలిసిన వారిని సెంటరుకు పెద్దగా చేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు. చదువు ఒక్కటే అయినా మానవుల నుండి దేవతలుగా తయారయ్యే లక్ష్యముండినా టీచర్లు నంబరువారుగా ఉన్నారు కదా. విజయమాలలో వచ్చేందుకు ముఖ్యమైన ఆధారము చదువు. చదువేమో ఒక్కటే. కాని ఉత్తీర్ణులయ్యే వారు నంబరువారుగా ఉంటారు కదా. చదువే ముఖ్యమైన ఆధారము. కొంతమంది విజయమాలలో 8 పూసల మాలలో వస్తారు, కొంతమంది 108 మాలలో వస్తారు, కొంతమంది 16,108 మాలలో వస్తారు. వంశాన్ని తయారు చేస్తారు కదా. వంశ వృక్షము తయారైనప్పుడు మొట్టమొదట ఒక ఆకు, రెండు ఆకులు అలా వృద్ధి చెందుతూ వస్తాయి. ఇది కూడా వృక్షమే. కొన్ని వంశాలుంటాయి. ఉదాహరణకు కృపలాని వంశము మొదలైనవి ఉంటాయి. అవన్నీ హద్దు వంశాలు. ఇది బేహద్ వంశము. ఈ వంశానికి మొట్టమొదటి వారెవరు? ప్రజాపిత బ్రహ్మ. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్(+తీవa్ +తీవa్ +తీaఅస ఖీa్ష్ట్రవతీ) అని అంటారు. కాని ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి రచయిత ఎవరో మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. అహల్య వలె పూర్తిగా రాతిబుద్ధి గలవారిగా అయిపోయారు. అలా అయినప్పుడే తండ్రి ఇక్కడకు వస్తారు.
మీరిక్కడకు అహల్య బుద్ధి నుండి పారస బుద్ధి గలవారిగా అయ్యేందుకు వచ్చారు. దాని కొరకు జ్ఞానము కూడా ధారణ చేయాలి కదా. తండ్రిని గుర్తించాలి. చదువును గురించి యోచించాలి. ఈ రోజు వచ్చారనుకోండి, రేపు అకస్మాత్తుగా శరీరము వదిలేస్తే ఏ పదవి పొందగలరు? జ్ఞానము కొద్దిగా కూడా తీసుకోలేదు. ఏమీ నేర్చుకోకుంటే ఏ పదవి పొందుతారు? సమయము గడిచే కొలది ఆలస్యంగా శరీరము వదిలే వారికి, సమయము చాలా కొద్దిగా లభిస్తుంది. ఎందుకంటే సమయం తగ్గుతూ వస్తుంది. అందులో జన్మ తీసుకొని ఏం చేయగలరు? మీలో ఎవరైనా వెళ్తే ఏదైనా మంచి కుటుంబములో జన్మ తీసుకుంటారు. సంస్కారాలు తీసుకెళ్తారు. కనుక ఆ ఆత్మ వెంటనే మేల్కుంటుంది. శివబాబాను స్మృతి చేయడం మొదలు పెడ్తుంది. సంస్కారమే లేకుండా అలాగే పడి ఉంటే ఏమీ జరగదు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థము చేసుకోవలసి ఉంటుంది. తోటమాలి మంచి మంచి పుష్పాలు తీసుకొస్తే అతని మహిమ కూడా గాయనము చేయబడ్తుంది. పుష్పాలు తయారు చేయడం తోటమాలి కర్తవ్యము కదా. తండ్రిని స్మృతి చేయడం రాని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అదృష్టము పై ఆధారపడి ఉంటుంది కదా. అదృష్టంలో లేకుంటే ఏ మాత్రం అర్థము చేసుకోలేరు. భాగ్యశాలి పిల్లలు తండ్రిని యదార్థంగా తెలుసుకొని వారిని పూర్తిగా స్మృతి చేస్తారు. తండ్రితో పాటు నూతన ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు. మేము నూతన ప్రపంచము కొరకు నూతన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పాటలో కూడా ఉంది కదా. 21 జన్మలకు తండ్రి నుండి రాజ్యభాగ్యము తీసుకోవాలి. ఈ నషాలో, ఖుషీలో ఉంటే ఇటువంటి పాటల అర్థమును సూచిస్తే చాలు అర్థము చేసుకుంటారు. స్కూలులో కూడా భాగ్యములో లేకుంటే ఫెయిల్ అయిపోతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. స్వయం భగవంతుడే కూర్చొని చదివిస్తున్నారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారికి తెలుపబడుచున్నది. తండి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రైన నన్ను స్మృతి చేయండి. ఏ దేహధారి మనిషిని భగవంతుడని అనరు. బ్రహ్మ-విష్ణు-శంకరులను కూడా భగవంతుడని అనరు. వారు సూక్ష్మవతన వాసులైన దేవతలు. ఇక్కడ ఉండేవారు మనుష్యులు. ఇప్పుడిక్కడ దేవతలు లేనే లేరు. ఇది మనుష్య లోకము. ఈ లక్ష్మీనారాయణులు దైవీ గుణాలు కలిగిన మనుష్యులు. దానిని దైవీ మతమని అంటారు. సత్యయుగములోని వారందరూ దేవీదేవతలు. సూక్ష్మవతనములో బ్రహ్మ-విష్ణు-శంకరులుంటారు. బ్రహ్మ దేవతాయ నమ:, విష్ణు దేవతాయ నమ: ........... అని పాడుతూ శివ పరమాత్మాయ నమ: అని అంటారు. శివుని దేవత అని అనరు. మనుష్యులను భగవంతుడని అనరు. 3 అంతస్తులు ఉన్నాయి కదా. మనము 3వ అంతస్తులో ఉన్నాము. సత్యయుగములోని దైవీ గుణాలు కల్గిన మానవులే ఆసురీ గుణాలు గలవారిగా అవుతారు. మాయా గ్రహణము పట్టిన వెంటనే నల్లగా(అపవిత్రంగా) అయిపోతారు. చంద్రునికి కూడా గ్రహణము పడ్తుంది కదా. అవన్నీ హద్దు విషయాలు. ఇవి బేహద్ విషయాలు. బేహ్ద్ పగలు, బేహద్ రాత్రి. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. మీరిప్పుడు ఒక్క తండ్రి ద్వారానే చదువుకోవాలి. మిగిలినవన్నీ మర్చిపోవాలి. తండ్రి ద్వారా చదువుకున్నందున మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇది సత్య సత్యమైన గీతా పాఠశాల. సదా పాఠశాలలోనే ఉండరు. భగవంతుని కలుసుకునే మార్గము భక్తిమార్గమని, ఎవరెంత ఎక్కువగా భక్తి చేస్తే భగవంతుడు అంత రాజీ పడ్తారని(సంతోషిస్తారని), వారు వచ్చి ఫలితాన్ని ఇస్తారని మనుష్యులు అనుకుంటారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. భగవంతుడు ఒక్కరే, ఇప్పుడు వారు భక్తికి ఫలితమునిస్తున్నారు. మొట్టమొదట ఎవరు సూర్యవంశ పూజ్యులుగా ఉండేవారో వారే అందరికంటే ఎక్కువగా భక్తి చేశారు. వారే ఇచ్చటకు వస్తారు. మొట్టమొదట శివబాబాను అవ్యభిచారి భక్తి చేశారు. అందువలన మొట్టమొదటి భక్తులు మీరే. తర్వాత క్రింద పడుతూ పడుతూ తమోప్రధానమైపోతారు. అర్ధకల్పము భక్తి చేశారు. అందుకే మొట్టమొదట మీకే జ్ఞానమునిస్తున్నారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు.
మేము దూరంగా ఉన్నాము, అందువలన ప్రతిరోజు చదువుకోలేమని సాకులు చెప్పరాదు. కొంతమంది 10 మైళ్ల దూరములో ఉన్నామని అంటారు. అరే! మీరు బాబా స్మృతిలో 10 మైళ్లు నడిచినా, అలసట రాదు. ఎంత గొప్ప ఖజానాను తీసుకునేందుకు వెళ్తున్నారు! దర్శనము కొరకు తీర్థయాత్రలకు మనుష్యులు కాలినడకన వెళ్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఇది ఒకే ఊరిలోని మాట (సెంటరు మీ ఊరిలోనే ఉంది కదా). నేను మీ కోసం ఎంతో దూరము నుండి వస్తుంటే మీరు ఇల్లు 5 మైళ్ల దూరముందని అంటారా.......... వహ్వా! ఖజానాలు తీసుకునేందుకు పరుగెత్తుకొని రావాలి. కేవలం దర్శనము చేసుకునేందుకు అమరనాథ్కు ఎక్కడెక్కడి నుండో వస్తారు. అమరనాథుడైన బాబా ఇక్కడ చదివించేందుకు స్వయంగా తానే వచ్చారు. మిమ్ములను ఈ విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. మీరు సాకులు చెప్తూ ఉంటారా! ఉదయము అమృతవేళలో ఎవరైనా రావచ్చు. అప్పుడు ఏ భయమూ ఉండదు. ఎవ్వరూ మిమ్ములను దోచుకోరు కూడా. ఏవైనా నగలు మొదలైనవి ఉంటేనే లాక్కుంటారు. దొంగలకు కావలసినవి ధనము, వస్తువులు. కాని అదృష్టములో లేకుంటే సాకులు చాలా చెప్తారు. చదువుకోకుంటేÄ మీ పదవిని కోల్పోతారు. తండ్రి భారతదేశములోనే వస్తారు. భారతదేశాన్నే స్వర్గంగా తయారు చేస్తారు. సెకండులో జీవన్ముక్తికి మార్గాన్ని తెలుపుతారు. కాని పురుషార్థము చేస్తే కదా. ఒక్క అడుగు కూడా వేయకుంటే ఎలా చేరుకోగలరు?
ఇది ఆత్మ-పరమాత్మల కలయిక అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. స్థాపన పూర్తి అవుతూనే వినాశనము మొదలవుతుంది. ఇది అదే మహాభారత యుద్ధము కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఇస్తున్న జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరుగెత్తుకొని రావాలి. ఎలాంటి సాకులు చెప్పరాదు. తండ్రి స్మృతిలో 10 మైళ్లు నడిచినా, అలసట కలగదు.
2. విజయమాలలో వచ్చేందుకు ఆధారము చదువు. చదువు పై పూర్తి గమనముంచాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. స్వీట్హోమ్), స్వీట్ రాజ్యము ను స్మృతి చేయాలి.
వరదానము:- '' నిశ్చయమనే పాఠాన్ని స్థిరంగా ఉంచుకునే సదా నిశ్చయబుద్ధి నిశ్చింత భవ ''
అన్నిటికంటే పెద్ద జబ్బు చింత. దీనికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు. చింతించే వారు ఎంతగా ప్రాప్తి వెనుక పరుగెత్తుతారో, అంత ప్రాప్తి వారి కంటే ముందు పరుగెత్తుతుంది. అందువలన నిశ్చయమనే పాదము సదా స్థిరంగా చలించకుండా ఉండాలి. ' సదా ఒకే బలము, ఒకే నమ్మకము.' ఈ పాదము అచలంగా ఉంటే విజయము నిశ్చితము. నిశ్చిత విజయులు సదా నిశ్చింతులుగా ఉంటారు. మాయ నిశ్చయమనే పాఠాన్ని కదిలించేందుకే భిన్న-భిన్న రూపాలలో వస్తుంది. కానీ మాయ కదలాలి కాని మీ నిశ్చయమనే పాదము కదలరాదు. అప్పుడు నిశ్చింతగా ఉండే వరదానం లభిస్తుంది
స్లోగన్:- '' ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉంటే, విశేష ఆత్మగా అవుతారు. ''
No comments:
Post a Comment