28-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - తండ్రి మీ అతిథిగా వచ్చారు, కనుక మీరు వారిని ఆదరించాలి. ఎంత ప్రేమగా పిలిచారో, అంత ఆదరము కూడా చూపాలి, నిరాదరించరాదు. ''
ప్రశ్న:- పిల్లలైన మీకు సదా ఏ నషా ఎక్కి ఉండాలి? ఒకవేళ నషా ఎక్కకుంటే వారిని ఏమంటారు?
జవాబు:- అత్యంత ఉన్నతమైన ఆసామి(గొప్ప వ్యక్తి) ఈ పతిత ప్రపంచములో మన అతిథిగా వచ్చారు. సదా ఈ నషా ఎక్కి ఉండాలి. అయితే నంబరువారుగా ఈ నషా ఎక్కుతుంది. కొందరు తండ్రి వారిగా అయ్యి కూడా సంశయబుద్ధితో వారి చేతిని వదిలి వెళ్లిపోతే అప్పుడు వీరి భాగ్యము ఇంతేనని అంటారు.
ఓంశాంతి. ఓంశాంతి అని రెండు సార్లు అనవలసి ఉంటుంది. ఒకరు బాబా, మరొకరు దాదా అని పిల్లలకు తెలుసు. ఇరువురూ కలిసి ఉన్నారు కదా. భగవంతుని ఎంతో గొప్పగా మహిమ చేస్తారు కాని గాడ్ఫాదర్ అను పదము చాలా సాధారణమైనది. కేవలం ఫాదర్ అని అనరు. గాడ్ఫాదర్ అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచములోనే పిలుస్తారు. '' నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు '' అయితే పతిత పావనుడు ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదని స్వయంగా వారే వచ్చి తెలియజేస్తున్నారు. అర్ధకల్పము సత్య-త్రేతా యుగాలలో ఎవరి రాజ్యముండేదో, అది వారికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. పతితపావనులైన తండ్రి తప్పకుండా వస్తారు. కొంతమంది వారిని పతితపావనులని, కొంతమంది ముక్తిదాత అని అంటారు. స్వర్గానికి తీసుకెళ్లండని పిలుస్తారు. వారు అందరికంటే శ్రేష్ఠమైనవారు కదా. భారతీయులైన మమ్ములను శ్రేష్ఠంగా తయారు చేయండని పతిత ప్రపంచములో వారిని పిలుస్తారు. వారి హోదా ఎంతో గొప్పది. వారికి అత్యంత పెద్ద అధికారముంది. రావణ రాజ్యమున్నప్పుడు వారిని పిలుస్తారు. లేకుంటే ఈ రావణరాజ్యము నుండి విడిపించేదెవరు? ఈ విషయాలన్నీ వింటుంటే పిల్లలైన మీకు నషా కూడా ఎంత ఎక్కి ఉండాలి! కాని అంత నషా ఎక్కడం లేదు. మద్యపాన మత్తు అందరికీ ఎక్కుతుంది. కాని ఈ మత్తు అందరికీ ఎక్కదు. ఇందులో ధారణ చేయవలసిన విషయాలు, భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో కూడా ఏ కొందరికో పూర్తి నిశ్చయముంటుంది. ఒకవేళ అందరికీ నిశ్చయముంటే సంశయము కలిగి ఎందుకు పారిపోతారు? తండ్రిని ఎందుకు మర్చిపోతారు? లౌకికంలో తండ్రికి పిల్లలుగా అయ్యాక ఆ తండ్రి పై పిల్లలకు సంశయబుద్ధి కలగదు. కాని ఈ తండ్రి చాలా అద్భుతమైనవారు. ఆశ్చర్యపడునట్లు తండ్రిని తెలుసుకుంటారు, బాబా అని పిలుస్తారు, జ్ఞానము వింటారు, వినిపిస్తారు, వెళ్లిపోతారు........ అహో మాయ! మాయ సంశయబుద్ధి గలవారిగా చేస్తుందని గాయనము కూడా ఉంది. తండ్రి తెలిపిస్తున్నారు - ఈ భక్తిమార్గములోని శాస్త్రాలలో ఎలాంటి సారము లేదు. తండ్రి చెప్తున్నారు - నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా కష్టంగా కొందరు మాత్రమే నిలబడగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదని మీరు కూడా అనుభవము చేస్తారు. ఆత్మలైన మనము బిందువులము, బాబా కూడా బిందువే. వారు మన అందరి తండ్రి, వారికి తమ శరీరమే లేదు. వారు చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను, నా పేరు శివుడు. ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు. మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికే పేరు పెట్టబడ్తుంది. వివాహము అయితే పేరు కూడా మారిపోతుంది. తర్వాత ఆ పేరును పక్కా చేసుకుంటారు కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మేము ఆత్మలము అని పక్కా చేసుకోండి. ఎప్పుడెప్పుడు అత్యాచారాలు, గ్లాని పెరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రియే స్వయంగా తమ పరిచయాన్ని ఇచ్చారు. ఏ కొన్ని పదాలనో పట్టుకోరాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - రాళ్లు, రప్పలలో ఉన్నానని చెప్పి ఎంతో గ్లాని చేస్తారు. ఎంతగానో దూషిస్తారు. అయితే ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. మీరు కల్ప-కల్పము ఇలా పతితులుగా అయి నన్ను గ్లాని చేస్తారు. అలా చేసినప్పుడే నేను వస్తాను. ఇది నా కల్ప-కల్పాల పాత్ర. ఇందులో మార్పులు ఉండవు. డ్రామాలో నిర్ణయించబడింది కదా. కేవలం భారతదేశములో మాత్రమే వస్తారా? కేవలం భారతదేశము మాత్రమే స్వర్గమవుతుందా? అని మిమ్ములను కొందరు అడుగుతారు. అవును, ఇది అనాది, అవినాశి పాత్ర కదా అని చెప్పండి. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారు! పతితులను పావనంగా చేసే తండ్రి చెప్తున్నారు - నన్ను ఈ పతిత ప్రపంచములోనే పిలుస్తారు. నేను సదా పవిత్రుడను. నన్ను పవిత్ర ప్రపంచములో పిలవాలి కదా! కాని పిలువరు. పావన ప్రపంచములో పిలిచే అవసరమే ఉండదు. పతిత ప్రపంచములోనే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి ఈ సంవత్సరము రాకుంటే మరో సంవత్సరములో వస్తాడు కాని వీరిని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర ముందే నిర్ణయించబడింది. ఇది ఎవ్వరికీ తెలియదు. వీరు చాలా ఉన్నతోన్నతమైన తండ్రి. మనుష్యులు తండ్రిని ఒకవైపు ప్రేమతో పిలుస్తారు, మరోవైపు మహిమలో మచ్చ కూడా వేస్తారు అనగా తప్పుగా మహిమ చేస్తారు. వాస్తవానికి వీరు చాలా గొప్ప మహిమాన్వితులైన అతిథి(గెస్ట్ ఆఫ్ ఆనర్). వీరి మహిమకు మచ్చను వేశారు. అటువంటి మహిమ గలవారు రాళ్లు, రప్పలు అన్నిటిలో ఉన్నారని అనేస్తారు. ఎంత సర్వ శ్రేష్ఠ అథారిటి, ప్రేమగా పిలుస్తారు కూడా. కాని పూర్తి బుద్ధిహీనులుగా ఉన్నారు. నేను మీ తండ్రిని అని నేనే వచ్చి నా పరిచయమునిస్తాను. నన్ను గాడ్ఫాదర్ అని అంటారు. అందరూ ఎప్పుడైతే రావణుని జైలులో ఉంటారో అప్పుడే తండ్రి రావలసి వస్తుంది. ఎందుకంటే భక్తులు లేక వధువులందరూ - సీతలు, తండ్రి వరుడు - రాముడు. ఇది ఒక్క సీత విషయము కాదు. సీతలందరిని రావణుని జైలు నుండి విడిపిస్తాడు. ఇది అనంతమైన విషయము. ఇది పాత పతిత ప్రపంచము. ఇది పాతదిగా అయినందున మళ్లీ కొత్తదిగా, ఖచ్ఛితంగా అవుతుంది. ఈ శరీరము మొదలైనవైతే కొన్ని త్వరగా పాతవైపోతాయి. మరికొన్ని ఎక్కువ సమయము నడుస్తాయి. ఇది డ్రామాలో ఖచ్ఛితంగా నిర్ణయించబడి ఉంది. 5 వేల సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ నేను రావలసి వస్తుంది. నేను వచ్చి నా పరిచయమునిచ్చి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికీ నా పరిచయము గానీ, బ్రహ్మ-విష్ణు-శంకరుల పరిచయము గానీ లక్ష్మీనారాయణుల, సీతా-రాముల పరిచయము గానీ లేదు. డ్రామాలో ఉన్నతాతి ఉన్నతమైన పాత్రధారులు వీరే. ఇదంతా మనుష్యుల విషయమే. 8-10 భుజాలు గల మనుష్యులు ఎవ్వరూ లేరు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణుని 10 తలలు అంటే ఏమిటి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తండ్రియే వచ్చి - నేను పూర్తి ప్రపంచ ఆదిమధ్యాంతాల జ్ఞానము తెలియజేస్తారు. నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. అయితే తెలుసుకున్నా మళ్లీ మర్చిపోతారు. వారిని ఎంత గౌరవించాలి, వారిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నిరాకారమే, పరమాత్మ కూడా నిరాకారులే. ఇందులో ఫోటో అవసరము కూడా లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశి వస్తువును చూస్తూ ఉండాలి. మీరు వినాశి దేహాన్ని ఎందుకు చూస్తారు! దేహీ-అభిమానులుగా అవ్వండి, ఇందులోనే శ్రమ ఉంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత కర్మాతీత స్థితిని పొంది ఉన్నతపదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. అనేక రకాల యోగాలున్నాయి. స్మృతి అను అక్షరమే యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. మేము ఇంత సమయము స్మృతిలో ఉండినామని ఎవరో అరుదుగా సత్యాన్ని తెలియజేస్తారు. స్మృతి చేయనందున తెలిపేందుకు సిగ్గుపడ్తారు. రోజంతటిలో ఒక గంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. సిగ్గుపడాలి కదా. రాత్రింబవళ్లు స్మృతి చేయవలసిన తండ్రిని కేవలం ఒక గంట స్మృతి చేశాను అని అనడం ఏం బాగుంటుంది! ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. బాబాను పిలుస్తారు. వారు దూరము నుండి వచ్చే అతిథి కదా. తండ్రి చెప్తున్నారు - నేను నూతన ప్రపంచములో అతిథిగా అవ్వను. పాత ప్రపంచములోనే వస్తాను. నేను వచ్చి నూతన ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచము. ఈ విషయాలు ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. నూతన ప్రపంచ ఆయువు ఎంతో కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు - నేనే వచ్చి ఈ జ్ఞానమునిస్తాను. తర్వాత డ్రామానుసారము ఈ జ్ఞానము మళ్లీ అదృశ్యమైపోతుంది. కల్పము తర్వాత ఈ పాత్ర మళ్లీ పునరావృతమవుతుంది(రిపీట్ అవుతుంది). మళ్లీ నన్ను పిలుస్తారు, ప్రతి సంవత్సరము శివజయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్లిపోతారో, వారి జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా జయంతిని కూడా 12 మాసాల తర్వాత జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని ఊరకే అంటారు. కలియుగము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి చెప్తున్నారు - ఇది కేవలం 5 వేల సంవత్సరాల విషయమే. ఈ దేవతల రాజ్యము భారతదేశములో ఉండేది కదా. కనుక బాబా చెప్తారు - నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని. నన్ను అర్ధకల్పము నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు. దు:ఖితులుగా అయినప్పుడు ఓ పతితపావనా! రండి అని నన్ను పిలుస్తారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచములోనే. నాకు రథము కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి, ఇది(భృకుటి) దాని సింహాసనము. తండ్రి కూడా అకాలమూర్తులే. వారు వచ్చి ఈ సింహాసనము పై(బ్రహ్మ భృకుటిలో) విరాజమానమవుతారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. ఇతరులెవరైనా వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నా మతమును అనుసరించండి. శివబాబా మతమునిస్తున్నారని, శివబాబా మురళి నడిపిస్తున్నారని భావించండి. నేను కూడా వారి మురళి విని ఇతరులకు వినిపిస్తానని ఈ బ్రహ్మ చెప్తున్నారు. వినిపించేవారైతే వారే కదా. ఇతను నంబరువన్ పూజ్యుని నుండి మళ్లీ నంబరువన్ పూజారిగా అయ్యారు. ఇప్పుడితను ఒక పురుషార్థి. పిల్లలు ఎల్లప్పుడూ మాకు శివబాబా శ్రీమతము లభించిందని భావించాలి. ఒకవేళ ఏవైనా ఉల్టా విషయాలు వినిపించినా, వారు(శివబాబా) సుల్టా అనగా చక్కదిద్దుతారు. ఈ నిశ్చయము స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునిగా ఉంటారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. విఘ్నాలు తప్పకుండా రావాల్సిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. మీ పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. కనుక సదా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మబాబా తన మతమునిస్తున్నారని భావిస్తారు, కానీ అలా కాదు. శివబాబాయే బాధ్యుడు కానీ దేహాభిమానముంటే క్షణ-క్షణము ఈ బ్రహ్మనే చూస్తూ ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి! అయినా రైల్వే అధికారులు మొదలైనవారు వారిని గుర్తించగలరా? నిరాకారుని ఎలా గుర్తించాలి లేక అర్థం చేసుకోవాలి! వారికెప్పుడూ అనారోగ్యము కలుగదు. కనుక అనారోగ్యము మొదలైన వాటికి కారణం బ్రహ్మ ఆత్మ తెలుపుతుంది. ఇతనిలో ఎవరున్నారో వారికేం తెలుసు? పిల్లలైన మీకు కూడా నంబరువారుగా తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. ఇతను ప్రజాపిత అనగా మనుష్యుల తండ్రి. కనుక వీరిరువురు(బాప్దాదా) ఎంతో గొప్ప అతిథులు.
తండ్రి చెప్తున్నారు - ఏమేమి జరుగుతుందో అదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. డ్రామాలో రచింపబడకుంటే ఏమీ చేయలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. డ్రామాలో రాముడు-రావణుడు ఇరువురి పాత్రలు ఉన్నాయి. డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామానుసారమే వస్తానని చెప్పేవాడు. ఇది సుఖ-దు:ఖముల ఆట. సుఖము కొత్త ప్రపంచములో, దు:ఖము పాత ప్రపంచములో ఉంటుంది. కొత్త ప్రపంచములో మనుష్యులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పాత ప్రపంచములో ఎంతమంది మనుష్యులున్నారు! వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతితపావనులైన తండ్రినే పిలుస్తారు, ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖముండేది. అందుకే కల్ప-కల్పమూ పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖమునిచ్చి వెళ్తారు. ఇప్పుడు వారి పాత్ర పునరావృతమవుతుంది. ప్రపంచము ఎప్పుడూ పూర్తిగా సమాప్తమవ్వదు. సమాప్తమవ్వడం అసంభవం. సముద్రము కూడా ప్రపంచములో ఉంది కదా. ఇది 3వ అంతస్తు కదా. జలమయమవుతుంది, అంతా నీటిమయమవుతుంది అని అంటారు. అలా అయినా పృథ్వి అనే అంతస్తు ఉంది కదా. ఇక్కడ నీరు కూడా ఉంది కదా. ఈ పృథ్వి అనే అంతస్తు ఎప్పటికీ వినాశనమవ్వదు. ఈ అంతస్తులో నీరు కూడా ఉంది. రెండవ అంతస్తు అయిన సూక్ష్మవతనములో, మొదటి అంతస్తు అయిన మూలవతనములో నీరు ఉండదు. ఇవి అనంతమైన సృష్టిలోని మూడు అంతస్తులు. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది సంతోషకరమైన విషయము. అందరికీ సంతోషంగా వినిపించండి. ఎవరు పూర్తిగా పాస్ అవుతారో వారు అనుభవించే సుఖమునే అతీంద్రియ సుఖమని మహిమ చేయబడింది. ఎవరైతే రాత్రింబవళ్లు సేవలో తత్పరులై ఉంటారో, సర్వీసే చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషముంటుంది. మనుష్యులు రాత్రి కూడా మేలుకొని ఉండే రోజులు వస్తాయి కాని ఆత్మ అలసిపోతుంది కనుక నిద్రించవలసి వస్తుంది. ఆత్మ నిద్రించినందున శరీరము కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరము కూడా నిద్రించదు. అలసిపోయేది ఆత్మయే. ఈ రోజు నేను అలసిపోయానని ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే, ఆత్మాభిమానులుగా అవ్వకుంటే దేహ సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తారు. తండ్రి చెప్తున్నారు - మీరు అశరీరులుగా వచ్చారు, మళ్లీ అశరీరులుగానే వెళ్లాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ మర్చిపోండి. ఈ శరీరములో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటి అయ్యారో పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - నేను పేదల పెన్నిధిని. అందరూ సాధారణమైనవారు. పతితపావనులైన తండ్రి వచ్చారని తెలుసుకుంటే ఎంత పెద్ద గుంపు తయారవుతుందో చెప్పలేము. గొప్ప-గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు తయారవుతుంది. అయితే గుప్తంగా ఉండడమే డ్రామాలో వీరి పాత్ర. పోను పోను నెమ్మది నెమ్మదిగా ప్రభావము వెలువడ్తుంది. తర్వాత మళ్లీ వినాశనమైపోతుంది. అందరూ తండ్రిని కలుసుకోలేరు. స్మృతి చేస్తారు. కనుక వారికి తండ్రి పరిచయము మాత్రము లభిస్తుంది. కాని వారు ఇక్కడకు వచ్చి చేరుకోలేరు. బంధనములో ఉన్న పిల్లలు కలుసుకోలేరు. ఎన్నో అత్యాచారాలు సహిస్తారు. వికారాలను వదలలేరు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది? అని అడుగుతారు. అరే! ఈ సృష్టి భారము తండ్రి పై ఉందా లేక మీ పై ఉందా? తండ్రిని తెలుసుకుంటే తర్వాత ఇటువంటి ప్రశ్నలు అడగరు. మొదట తండ్రిని తెలుసుకోండి. తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి అవసరము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా సర్వోన్నత అథారిటి అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశి దేహాన్ని చూడక ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సత్యమైన స్మృతి చార్టునుంచాలి.
2. రాత్రింబవళ్లు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి. మూడు లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియజేయాలి. శివబాబా ఇచ్చు శ్రీమతములో దృఢమైన నిశ్చయముంచుకొని నడవాలి. ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు. బాధ్యత శివబాబాది. అందువలన సంశయము రాకూడదు.
వరదానము:- '' సమయము మరియు సంకల్పాలను సేవలో అర్పించే మాస్టర్ విధాత, వరదాత భవ ''
ఇప్పుడు స్వంత చిన్న చిన్న విషయాల వెనుక, శరీరము వెనుక, మనసు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిభాయించడంలో సమయాన్ని మరియు సంకల్పాలను ఉపయోగించేందుకు బదులు వాటిని సేవలో అర్పించండి. ఈ సమర్పణ సమారోహాన్ని జరుపుకోండి. శ్వాస శ్వాసలో సేవ చేయాలనే లగ్నముండాలి. సేవలో నిమగ్నమై ఉండండి. దాని వలన సేవ పై లగ్నమున్నందున స్వ ఉన్నతి అనే గిఫ్ట్ స్వతహాగా ప్రాప్తిస్తుంది. విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణము ఇమిడి ఉంది. అందువలన నిరంతర మహాదాని, మాస్టర్ విధాత, వరదాతలుగా అవ్వండి.
స్లోగన్:- '' మీ కోరికలను తగ్గించుకుంటే సమస్యలు తగ్గిపోతాయి ''
No comments:
Post a Comment