13-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - శాంతి కావాలంటే అశరీరులుగా అవ్వండి. దేహ భావములోకి వచ్చినందునే అశాంతి కలుగుతుంది. అందువలన మీ స్వధర్మములో స్థితులై ఉండండి ''
ప్రశ్న:- యదార్థమైన స్మృతి ఏది? స్మృతి చేసే సమయంలో ఏ విషయము పై విశేషమైన గమనముండాలి?
జవాబు:- స్వయాన్ని ఈ దేహము నుండి భిన్నమైన ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేయడమే యదార్థమైన స్మృతి. ఏ దేహమూ గుర్తు రాకుండా గమనముంచడం అవసరము. స్మృతిలో ఉండేందుకు జ్ఞాన నషా ఎక్కి ఉండాలి. బాబా మామ్ములను మొత్తం విశ్వానికంతా యజమానులుగా చేస్తున్నారు, మనము ఈ భూమ్యాకాశాలకు, సముద్రాలకు అన్నింటికీ అధికారులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి.
గీతము:- నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందాము,......... (తుమ్ హే పాకే హమ్నే, విశ్వాన్ని పొందాము,...........)
ఓంశాంతి. ''ఓం'' అంటే అహమ్ అనగా నేను ఆత్మను. కాని మానవులు ఓం అనగా భగవంతుడని భావిస్తారు. కాని అలా కాదు. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. ఓంశాంతి అని అంటారు కదా. ఓం అనగా నేను ఆత్మను. నా స్వధర్మము శాంతి. ఆత్మ తన పరిచయమునిస్తుంది. మనుష్యులు భలే ఓంశాంతి అని అంటారు కాని ఓం యొక్క అర్థము ఎవ్వరికీ తెలియదు. ఓంశాంతి అనే పదము బాగుంది. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము, ఇది ఎంతో సహజమైన అర్థము. అర్థము కానంత పొడవుగా లేదు. బడాయి కాదు. ఇప్పుడుండేది నూతన ప్రపంచమా? పాత ప్రపంచమా? అని కూడా మనుష్యులకు తెలియదు. నూతన ప్రపంచము పాతదిగా ఎప్పుడవుతుందో, పాత ప్రపంచము మళ్లీ కొత్త ప్రపంచముగా ఎప్పుడవుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచము కొత్తదిగా ఎప్పుడవుతుంది? మళ్లీ పాతదిగా ఎలా అవుతుందని ఎవరినైనా అడిగితే ఎవ్వరూ తెలుపలేరు. ఇప్పుడుండేది కలియుగ పాత ప్రపంచము, నూతన ప్రపంచమని సత్యయుగమును అంటారు. అచ్ఛా. కొత్తది పాతదిగా అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. మనుష్యులై ఉండి ఈ విషయము తెలియదు. అందువలన జంతువుల కంటే హీనమని అంటారు. జంతువైతే స్వయం తన గురించి ఏమీ చెప్పదు. కానీ మానవుడు నేను పతితుడని చెప్తాడు. ''ఓ పతితపావనా! రండి'' అని పిలుస్తారు. అయితే ఆయనెవరో వారికి తెలియనే తెలియదు. పావనము అనే పదము ఎంత బాగుంది! పావన ప్రపంచము స్వర్గము, నూతన ప్రపంచంగానే ఉంటుంది, దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. కాని ఈ లక్ష్మీనారాయణులు నూతన పావన ప్రపంచానికి యజమానులని ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నూతన ప్రపంచమని స్వర్గమును అంటారు. దేవతలను స్వర్గవాసులని అంటారు. ఇప్పుడుండేది పాత ప్రపంచము, నరకము. ఇక్కడ మానవులు నరకవాసులుగా ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు అనగా ఇక్కడ ఉండేది నరకవాసులనే కదా. లెక్కవేసి చూపిస్తే తప్పకుండా ఇది నరకమే అని అంటారు. కాని మీరు నరకవాసులని చెప్తే కోపపడతారు. చూచేందుకు రూపము భలే మనుష్యులదే కాని నడవడికలు కోతులవి అని తండి అర్థము చేయిస్తున్నారు. అందుకే గాయనము కూడా ఉంది కదా. స్వయం మందిరాలలో దేవతల ముందుకెళ్లి మీరు సర్వ గుణసంపన్నులని మహిమ చేస్తారు. స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? మేము పాపులము, నీచులము అని చెప్పుకుంటారు. కాని నేరుగా మీరు వికారులని అంటే తిరస్కరిస్తారు, కోపపడతారు. అందువలన తండ్రి కేవలం పిల్లలతో మాత్రమే మాట్లాడ్తారు, అర్థము కూడా చేయిస్తారు. బయటివారితో మాట్లాడరు. ఎందుకంటే కలియుగములోని మనుష్యులు నరకవాసులు. ఇప్పుడు మీరు సంగమ యుగములో నివసిస్తున్నారు. మీరు పవిత్రంగా అవుతున్నారు. బ్రాహ్మణులైన మనలను శివబాబా చదివిస్తున్నారని, వారు పతితపావనులని మీకు తెలుసు. ఆత్మలమైన మనందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇవి ఎంతో సహజమైన (సింపుల్) విషయాలు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఆత్మలైన మీరు శాంతిధామము నుండి పాత్రను అభియించేందుకు ఇక్కడకు వస్తారు. ఈ దు:ఖధామములోని వారంతా దు:ఖములో ఉన్నారు. అందువలన మన:శ్శాంతి ఎలా లభిస్తుందని అంటూ ఉంటారు. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? అని అనరు. అరే! మీరు ఓంశాంతి అని అంటారు కదా. 'నా స్వధర్మము శాంతి.' అయితే శాంతి కావాలని ఎందుకు వేడుకుంటారు. మీరు స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయి దేహాభిమానములోకి వచ్చేస్తారు. ఆత్మలైతే శాంతిధామములో ఉండేవి. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? అశరీరిగా అయితేనే శాంతి లభిస్తుంది. ఆత్మ శరీరముతో పాటు ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడవలసి వస్తుంది, నడవాల్సి వస్తుంది. మనము ఆత్మలము. పాత్రను అభినయించేందుకు శాంతిధామము నుండి ఇక్కడకు వచ్చాము. రావణుడే మన శత్రువని కూడా ఎవ్వరూ భావించరు. ఈ రావణుడు ఎప్పటి నుండి మనకు శత్రువుగా అయ్యాడు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు మొదలైనవారికి కూడా రావణుడెవరో తెలియదు. అతని బూతుబొమ్మను తయారుచేసి తగులబెట్తారు. జన్మ-జన్మాంతరాలుగా తగులబెట్తూ వచ్చారు. కాని ఎందుకు కాలుస్తారో కొంచెము కూడా తెలియదు. రావణుడెవరని ఎవరిని అడిగినా, ఇదంతా కల్పన అని అంటారు. తెలియనే తెలియకుంటే జవాబు ఏం చెప్తారు? శాస్త్రాలలో కూడా ''ఓ రామా! అసలు ఈ ప్రపంచమే తయారు కాలేదు(మిథ్య), ఇది అంతా కల్పన'' అని చాలామంది అంటారు. కల్పన అంటే అర్థమేమిటి? అని అడిగితే ఇది సంకల్పాల ప్రపంచమని అంటారు. ఎవరు ఏ సంకల్పము చేస్తారో అలా అవుతారని అంటారు. కాని దాని అర్థము తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. కొంతమంది బాగా అర్థము చేసుకుంటారు. కొంతమందికి అర్థమే కాదు. ఎవరు బాగా అర్థము చేసుకుంటారో వారిని స్వంత పిల్లలని అంటారు. అర్థము చేసుకోనివారిని సవతి పిల్లలని అంటారు. సవతి పిల్లలు వారసులుగా అవ్వలేరు. తండ్రి వద్ద స్వంత పిల్లలూ ఉన్నారు, సవతి పిల్లలు కూడా ఉన్నారు. స్వంత పిల్లలు తండి శీమ్రతమును పూర్తిగా అనుసరిస్తారు. సవతి పిల్లలు అనుసరించరు. వీరు నా మతముననుసరించక రావణ మతమును అనుసరిస్తారని తండ్రి అంటున్నారు. రాముడు, రావణుడు అని రెండు పదాలున్నాయి. రామ రాజ్యము, రావణ రాజ్యము ఉన్నాయి. ఇది సంగమ యుగము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ బి.కెలంతా శివబాబా నుండి వారసత్వము తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకుంటారా? శ్రీమతమును అనుసరిస్తారా? అని అడిగి, ఏ మతము? అని అంటారు. తండ్రి శ్రీమతమునిస్తున్నారు - ' పవిత్రంగా ఉండండి. ' నేను పవిత్రంగా ఉండేందుకు నా పతి ఒప్పుకోకుంటే నేను ఎవరి మాటను వినాలి? ఆయన నా పతి పరమేశ్వరుడు. ఎందుకంటే భారతదేశములో పతియే మీకు గురువు, ఈశ్వరుడు,.... సర్వస్వమూ వారే అని నేర్పించబడుతుంది. కాని ఈ విధంగా ఎవ్వరూ భావించరు. ఆ సమయములో అలాగే అని అంటారు. కాని వాస్తవానికి ఎవ్వరూ అంగీకరించరు. మళ్ళీ గురువుల వద్దకు, మందిరాలకు వెళ్తూ ఉంటారు. నీవు బయటకు వెళ్ళకు. నేను నీకు రాముని విగ్రహాన్ని ఇంటికే తీసుకొస్తాను. నీవు అయోధ్యకు మొదలైన స్థానాలకు ఎందుకు వెళ్తావు? అని పురుషులు - స్త్రీలతో అంటారు. అయినా అంగీకరించరు. ఇవి భక్తిమార్గములోని ఎదురుదెబ్బలు. స్త్రీలు అలా తింటూనే ఉంటారు. ఎప్పుడూ భర్త మాటను అంగీకరించరు. అది రాముని మందిరమని భావిస్తారు. అరే! మీరు రాముని స్మృతి చేయాలా? లేక మందిరాన్ని స్మృతి చేయాలా? అయినా అర్థము చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భక్తిమార్గములో ఓ భగవంతుడా! మీరు వచ్చి మాకు సద్గతినివ్వండి అని కూడా అంటారు. ఎందుకంటే అతడొక్కరే సర్వుల సద్గతిదాత కానీ వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - రావణుడే మీ శత్రువు - రావణుని విషయము అద్భుతమైనది, రావణుని తగులబెడ్తూనే ఉంటారు కానీ మరణించడు. రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. శివజయంతిని కూడా ఆచరిస్తారు. కాని శివుని గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వానికి కూడా మీరు అర్థము చేయిస్తారు. శివుడు భగవంతుడు. అతనే కల్ప-కల్పము వచ్చి భారతీయులను నరకవాసులను స్వర్గవాసులుగా, భికారుల నుండి రాకుమారులుగా చేస్తారు. పతితులను పావనంగా చేస్తారు. వారే సర్వుల సద్గతిదాత. ఈ సమయములో మనుష్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఏసుక్రీస్తు ఆత్మ కూడా ఏదో ఒక జన్మ తీసుకొని ఇక్కడే ఉంది. వాపస్ ఎవ్వరూ వెళ్లలేరు. వీరందరికి సద్గతిని కలుగజేయువారు ఒక్కరే. వారు చాలా గొప్ప తండ్రి. వారు భారతదేశములోనే వస్తారు. వాస్తవానికి ఎవరు సద్గతినిస్తారో వారినే భక్తి చేయాలి. ఆ నిరాకార తండ్రి ఇక్కడ లేనే లేరు. వారిని సదా పైనే ఉన్నారని భావించి స్మృతి చేస్తారు. శ్రీ కృష్ణుడిని పైన ఉన్నారని భావించరు. మిగిలిన వారందరినీ ఇక్కడే స్మృతి చేస్తారు. శ్రీ కృష్ణుడిని కూడా ఇక్కడే స్మృతి చేస్తారు. పిల్లలైన మీరు చేసేది యదార్థమైన స్మృతి. మీరు స్వయాన్ని ఈ దేహము నుండి భిన్నంగా ఉన్న ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. బాబా చెప్తున్నారు - మీకు ఏ దేహమూ గుర్తు రాకూడదు. దీని పై తప్పకుండా గమనముంచాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. బాబా మనలను మొత్తం విశ్వానికంతా యజమానులుగా చేస్తున్నారు. భూమ్యాకాశాలకు, సమస్త సముద్రాలకు అన్నిటికీి యజమానులుగా చేస్తారు. ఇప్పుడైతే ప్రపంచము ఎన్నో ముక్కలు ముక్కలుగా అయిపోయింది. పరస్పరము ఒకరి హద్దులోకి మరొకరిని రానివ్వరు. అక్కడ ఇలాంటి భేదాలు ఉండవు. తండ్రి ఒక్కరినే భగవంతుడని అంటారు. అలాగని అందరూ తండ్రులేనని కాదు. హిందూ-చీని(చైనీయులు) భాయి-భాయి(సోదరులు), హిందూ-ముస్లిమ్ భాయి-భాయి(సోదరులు) అని అంటారు కాని దాని అర్థము తెలియదు. హిందువులు ముస్లిమ్ సోదరీ-సోదరులు అని ఎప్పుడూ అనరు. పరస్పరము సోదరులు ఆత్మలే, శరీరాలు కాదు. కానీ ఈ విషయాలు వారికి తెలియదు. శాస్త్రాలు మొదలైన వాటిని వింటూ అన్నిటికీ ఇది 'సత్యము-సత్యము' అని అంటూ ఉంటారు. కాని వారికి ఏ మాత్రము అర్థము తెలియదు. వాస్తవానికి వాటిలో ఉండేవన్నీ అసత్యాలు. సత్య ఖండములో అంతా సత్యమే మాట్లాడ్తారు. ఇక్కడ అంతా అసత్యమే అసత్యము. ఎవరినైనా నీవు అసత్యము చెప్తున్నావని అంటే విరుచుకుపడ్తారు. మీరు నిజము చెప్పేందుకు పోతే కొందరు తిట్టడము, నిందించడము మొదలుపెడ్తారు. ఇప్పుడు తండ్రిని బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థము చేసుకున్నారు. పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తారు. ఇప్పుడు పంచ తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయని మీకు తెలుసు. ఈ రోజుల్లో మనుష్యులు పంచ తత్వాలను(భూతాలను) కూడా పూజిస్తూ ఉంటారు. భూతాల స్మృతే ఉంటుంది. తండ్రి అంటున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. భూతాలను స్మృతి చేయకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధి యోగము బాబా జతలో ఉంచండి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో వికర్మలు అంతగా వినాశనమవుతాయి. జ్ఞాన మూడవ నేత్రము మీకు లభిస్తుంది.
ఇప్పుడు మీరు వికర్మాజీతులు ( వికర్మలను జయించినవారు )గా అవ్వాలి. అది వికర్మజీతుల శకము. ఇది వికర్ముల శకము. మీరు యోగబలము ద్వారా వికర్మల పై విజయము పొందుతారు. భారతదేశ యోగము ప్రసిద్ధి చెందినది. కాని మనుష్యులకు దానిని గురించి ఏమీ తెలియదు. మేము భారతదేశ ప్రాచీన యోగము నేర్పించేందుకు వచ్చామని చెప్తారు. కాని వీరు హఠయోగులని వారికి తెలియదు. వారు రాజయోగమును నేర్పించలేరు. మీరు తప్ప రాజయోగమును మరెవ్వరూ నేర్పించలేరు. మీరు రాజఋషులు, వారు హద్దులోని సన్యాసులు, మీరు బేహద్ సనాన్యసులు. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఇవన్నీ క్రొత్త విషయాలు. కొత్తవారెవ్వరూ అర్థము చేసుకోలేరు. అందుకే కొత్తవారిని ఎప్పుడూ అనుమతించరు. ఇది ఇంద్ర సభ కదా. ఇప్పుడు అందరూ రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి గలవారిగా ఉంటారు. ఇప్పుడిది సంగమ యుగము. రాతి నుండి పారసబుద్ధి గలవారిగా బాబా తప్ప ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. మీరు ఇక్కడకు పారసబుద్ధి గలవారిగా అయ్యేందుకు వచ్చారు. భారతదేశము ఒకప్పుడు బంగారు పిచుకగా ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు. వీరు రాజ్యమును ఎప్పుడు పాలించారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యముండేది. తర్వాత వీరు ఎక్కడకెళ్లారు? 84 జన్మలు తీసుకున్నారని మీరు చెప్పగలరు. ఇప్పుడు వారు తమోప్రధానంగా ఉన్నారు. తండ్రి ద్వారా మళ్లీ సతోప్రధానంగా అవుతూ ఉన్నారు. దీనిని తతత్వమ్ అని అంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఏ సాధు-సత్పురుషులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. పిల్లలైన మీ వద్ద మంచి-మంచి పాటలున్నాయి, వాటిని వింటే ఆనందముతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషాన్ని చూపించే పాదరస మీటరు ఒక్కసారిగా పైకెక్కుతుంది. ఆ నషా స్థిరంగా కూడా ఉండాలి. ఇది జ్ఞానామృతము. సారాయి తాగితే వారికి నషా ఎక్కుతుంది. ఇది జ్ఞానామృతము. మీకు నషా తగ్గరాదు. సదా ఏకరసంగా పెరిగే ఉండాలి. మీరు లక్ష్మీనారాయణులను చూసి చాలా సంతోషిస్తారు. మనము శ్రీమతమును అనుసరించి మళ్లీ శ్రేష్ఠాచారులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా బుద్ధియోగము తండ్రి, వారసత్వము పై ఉంచాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వికర్మాజీతులుగా అయ్యేందుకు యోగబలము ద్వారా వికర్మల పై విజయము ప్రాప్తి చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నా బుద్ధియోగము తండ్రి పై, వారు ఇచ్చే వారసత్వము పై లగ్నమై ఉండాలి.
2. తండ్రి వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు స్వంత పిల్లలుగా అవ్వాలి. ఒక్క తండ్రి శ్రీమతమునే అనుసరించాలి. తండ్రి ఏమి వినిపిస్తారో, దానిని అర్థము చేసుకొని ఇతరులకు కూడా అర్థము చేయించాలి.
వరదానము:- '' సంపూర్ణతా ప్రకాశము ద్వారా అజ్ఞానమనే పర్దాను తొలగించే సత్యమైన లైట్ భవ ''
ఇప్పుడు ప్రత్యక్షతా సమయం సమీపానికి వస్తోంది. అందువలన అంతర్ముఖులుగా అయి గుహ్య అనుభవాల రత్నాలతో స్వయాన్ని నిండుగా(భర్పూర్గా) చేసుకోండి. మీ సంపూర్ణతా ప్రకాశము ద్వారా అజ్ఞానమనే పర్దా తొలగిపోవునంత సర్చిలైటుగా అవ్వండి. ఎందుకంటే మీరు ఈ భూమి పై గల నక్షత్రాలు. ఈ విశ్వాన్ని ఆందోళన నుండి రక్షించి సుఖమయ ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖ-శాంతుల శ్వాసనిచ్చేందుకు నిమిత్తులు.
స్లోగన్:- '' మాయ మరియు ప్రకృతి ఆకర్షణల నుండి దూరంగా ఉంటే, సదా హర్షితంగా ఉంటారు. ''
No comments:
Post a Comment