Thursday, February 20, 2020

Telugu Murli 21/02/2020

21-02-2020 ప్రాత: మురళి ఓంశాంతి" బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతము లభిస్తూ ఉందో, ఆ మతమును అనుసరిస్తూ, కలియుగములోని మనుష్యులను సత్యయుగములోని దేవతలుగా చేసే శ్రేష్ఠ కర్తవ్యము చేయండి. ''

ప్రశ్న:- మనుష్యులందరూ ఎందుకు దు:ఖితులుగా అయ్యారు? ముఖ్యమైన కారణమేది?
జవాబు:- రావణుడు అందరినీ శపించాడు. అందువల్లనే అందరూ దు:ఖితులుగా అయ్యారు. తండ్రి వారసత్వమునిస్తారు, రావణుడు శాపమిస్తాడు. ప్రపంచములోని వారికి ఇది కూడా తెలియదు. తండ్రి వారసత్వమునిచ్చినప్పుడు భారతీయులు ఇంత(చిత్రము చూపించి) సుఖంగా ఉన్న స్వర్గానికి అధికారులుగా అయ్యారు, పూజ్యులుగా అయ్యారు. శపించబడినందున పూజారులుగా అవుతారు.

ఓంశాంతి. పిల్లలు బాప్దాదా వద్దకు మధువనానికి వస్తారు. హాలులోకి వస్తూనే మొదట కూర్చొని ఉన్న సోదరీ-సోదరులను చూస్తారు. తర్వాత బాప్దాదా రావడం చూచి తండ్రి గుర్తుకొస్తారు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. ఆ బ్రాహ్మణులకు బ్రహ్మాబాబా ఎవరో తెలియనే తెలియదు. ఇక్కడకు తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. త్రిమూర్తి భగవానువాచ అని కూడా అంటారు. ఇప్పుడు ముగ్గురి ద్వారా అయితే మాట్లాడరు కదా. ఈ విషయాలు మంచిరీతిగా బుద్ధిలో ధారణ చేయాలి. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము తప్పకుండా లభిస్తుంది. అందువలన భక్తులందరూ భగవంతుని నుండి ఏం కోరుకుంటారు? జీవన్ముక్తి. ఇప్పుడిది జీవన బంధము. అందుకే మీరు ''బాబా, వచ్చి ఈ బంధనము నుండి ముక్తము చేయండి'' అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి కల్ప-కల్పము వస్తారు. మీరే తల్లి-తండ్రి,.......... అని కూడా పిలుస్తారు కదా. కాని దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. నిరాకార తండ్రినే పిలుస్తామని భావిస్తారు. పాట పాడ్తారు కాని ఏమీ లభించదు. ఇప్పుడు పిల్లలైన మీకు వారి నుండి వారసత్వము లభిస్తుంది. మళ్లీ కల్పము తర్వాత లభిస్తుంది. తండ్రి వచ్చి అర్ధకల్పము కొరకు వారసత్వమునిస్తారని, రావణుడు మళ్లీ శాపమిస్తాడని పిల్లలకు తెలుసు. మనమంతా శాపగ్రస్థులమని ప్రపంచములోని వారికి తెలియదు. రావణుని శాపము తగిలినందున అందరూ దు:ఖితులుగా ఉన్నారు. భారతవాసులు సుఖంగా ఉండేవారు. నిన్న ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము భారతదేశములో ఉండేది. దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు కాని సత్యయుగము ఎప్పుడుండేదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలు చూపించారు. తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు, ఈ లెక్కతో మనుష్యుల జనాభా ఎంత ఎక్కువైపోవావాలి! ఇది కేవలము సత్యయుగములోనే లెక్కలేనంత మంది మనుష్యులైపోవాలి. ఇది ఏ మనుష్యుల బుద్ధిలోనూ కూర్చోదు. 33 కోట్ల దేవతలనే గాయనము కూడా ఉంది కదా అని తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. వీరు తయారయ్యేందుకు లక్షల సంవత్సరాలేమీ పట్టదు. ఇది కూడా మనుష్యులకు అర్థము చేయించవలసి ఉంటుంది.

బాబా ఇప్పుడు మనలను స్వచ్ఛ బుద్ధి గలవారిగా తయారు చేస్తారని రావణుడు దుర్మార్గ బుద్ధి(మలేచ్ఛ), అనాగరిక బుద్ధి గలవారిగా తయారు చేస్తాడని మీకు తెలుసు. ముఖ్యమైన విషయము - సత్యయుగములో పవిత్రత ఉంటుంది, ఇక్కడ అపవిత్రత ఉంది. రామరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకో, రావణరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటివరకో ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యము ఇక్కడే, రావణరాజ్యము కూడా ఇక్కడే ఉందని భావిస్తారు. అనేక మతమతాంతరాలున్నాయి కదా. ఎంతమంది మనుష్యులున్నారో అన్ని మతాలున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఒకే ఒక అద్వైత మతము లభిస్తుంది. ఆ మతమును తండ్రే స్వయంగా ఇస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు.......... అని దేవతలు మహిమ చేయబడ్డారు. వారు కూడా మనుష్యులే. మనుష్యులను ఎందుకు మహిమ చేస్తారు? తప్పకుండా వ్యత్యాసముంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారము మనుష్యులను దేవతలుగా చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు. కలియుగములోని మనుష్యులను మీరు సత్యయుగములోని దేవతలుగా చేస్తారు. అనగా శాంతిధామము, బ్రహ్మాండానికి, విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఇది శాంతిధామము కాదు కదా. ఇక్కడ తప్పకుండా కర్మలు చేయవలసి వస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోం. ఆత్మలమైన మనము స్వీట్హోం, బ్రహ్మాండానికి అధికారులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అక్కడ సుఖ-దు:ఖాలకు అతీతంగా ఉంటారు. మళ్లీ సత్యయుగములో విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు అందుకు అర్హులుగా అవుతున్నారు. ఆక్యురేట్ లక్ష్యము మీ ఎదుటనే నిలబడి ఉంది. పిల్లలైన మీరు యోగబలము గలవారు. వారు బాహుబలము గలవారు. మీరు కూడా యుద్ధ మైదానములోనే ఉన్నారు. కాని మీరు డబల్ అహింసకులు. వారు హింసకులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించుటను హింస అని అంటారు. సన్యాసులు కూడా దీనిని హింసగా భావిస్తారు. అందుకే పవిత్రంగా అవుతారు. అయితే మీకు తప్ప ఇతరులెవ్వరికీ తండ్రి పై ప్రీతి లేదు. ప్రేయసీ-ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేయసి-ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే మహిమ చేయబడ్తారు. మీరందరూ ప్రియుడైన నా ఒక్కరికే ప్రేయసులు. భక్తి మార్గములో ప్రియుడైన నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను - ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అయి యథార్థ పద్ధతిలో స్మృతి చేసినందున, తర్వాత స్మృతి చేయడం నుండే విడుదలైపోతారు. సత్యయుగములో స్మృతి చేసే అవసరమే ఉండదు. దు:ఖములో అందరూ స్మరణ చేస్తారు. ఇది నరకము. దీనిని స్వర్గమని అనరు కదా. ధనవంతులైన గొప్పవారు, మాకిదే స్వర్గమని భావిస్తారు. విమానాలు మొదలైన వైభవాలన్నీ మా వద్ద ఉన్నాయని అంటారు. చాలా గుడ్డి నమ్మకములో ఉంటారు. మీరే మాత-పిత,....... అని కూడా పాడ్తారు కాని కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. ఎటువంటి అపారమైన సుఖము లభించిందో ఎవ్వరికీ తెలియదు. మాట్లాడేది ఆత్మనే కదా. మాకు అపారమైన సుఖము లభించనున్నదని ఆత్మలైన మీకు తెలుసు. దాని పేరే స్వర్గము, సుఖధామము. స్వర్గము అందరికీ చాలా మధురమనిపిస్తుంది. ఇప్పుడు స్వర్గములో వజ్ర వైఢూర్యాల మహళ్లు చాలా ఉండేవని మీకు తెలుసు. భక్తిమార్గములో కూడా మీ వద్ద లెక్కలేనంత ధనముండేది. అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఒక్కొక్క చిత్రము(విగ్రహము) లక్షల రూపాయల విలువగలది. అవన్నీ ఎక్కడకు పోయాయి? ఎంతో దోపిడి(లూటీి) చేసుకొని తీసుకెళ్లిపోయారు. ముసల్మానులు తీసుకెళ్లి మసీదులు మొదలైన వాటిలో పొదిగించారు. ఇంత అపారమైన ధనముండేది. ఇప్పుడు మనము తండ్రి ద్వారా మళ్లీ స్వర్గానికి యజమానులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. మన భవనాలు బంగారుతో నిర్మించబడి ఉంటాయి. ద్వారముల పై కూడా వజ్ర వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. జైనుల మందిరాలు కూడా ఇలాగే నిర్మించబడి ఉంటాయి. ఇప్పుడు ముందున్న వజ్రాలు మొదలైనవి లేవు కదా. ఇప్పుడు మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. శివబాబా వచ్చేది కూడా భారతదేశములోనే. భారతదేశానికి మాత్రమే శివబాబా నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేదని అంటారు. అయితే రాజ్యపాలన ఎవరు చేస్తూ ఉండినారో ఎవ్వరికీ తెలియదు. పోతే భారతదేశము చాలా పురాతనమైనదని మాత్రము తెలుసు. కనుక భారతదేశమే స్వర్గంగా ఉండేది కదా. తండ్రిని హెవన్లీ గాడ్ ఫాదర్ అనగా స్వర్గ స్థాపన చేయు తండ్రి అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా వచ్చి ఉంటారు. అప్పుడు మీరు స్వర్గానికి అధికారులుగా అయ్యి ఉంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. లక్షల సంవత్సరాల మాటే బుద్ధి నుండి తొలగిపోవునట్లు చిత్రాల ద్వారా స్పష్టము చేసి చూపించండి. లక్ష్మీనారాయణులే కాదు, వారి వంశము కూడా ఉంటుంది కదా. తర్వాత వారి పిల్లలు కూడా రాజులుగా అవుతూ ఉంటారు. రాజులుగా చాలామంది అవుతారు కదా. మాల అంతా తయారై ఉంది. స్మరణ చేసేది మాలనే కదా. ఎవరైతే తండ్రికి సహాయకారులై సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది. అనగా మాలలో వారే ఉంటారు. ఎవరైతే పూర్తి చక్రములో వస్తారో, పూజ్యులుగా, పూజారులుగా అవుతారో వారిదే ఈ స్మృతిచిహ్నము. మీరు పూజ్యుల నుండి పూజారులుగా అయినప్పుడు మీ మాలను మీరే పూజిస్తారు. మొదట మాలను చేతితో తాకి పట్టుకొని తర్వాత నొసలుకు, కళ్లకు అద్దుకుంటారు. ఆ తర్వాత మాల తిప్పేందుకు ప్రారంభిస్తారు. మీరు కూడా చక్రములో పూర్తిగా తిరిగిన తర్వాత శివబాబా నుండి వారసత్వము పొందుతారు. ఈ రహస్యము మీకు మాత్రమే తెలుసు. కొంతమంది మనుష్యులు ఒక పేరును, మరి కొంతమంది మరొక పేరును జపిస్తూ మాలను తిప్పుతారు. వారికి మాల ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు మీకు మాల గురించిన జ్ఞానము పూర్తిగా ఉంది. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. ఎవరి మాల తిప్పుతున్నారో క్రైస్తవులకు తెలియనే తెలియదు. తండ్రికి సహాయకారులుగా అయి సేవ చేసిన వారిదే ఈ మాల. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారంతా ఇక్కడకు వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. మళ్లీ అందరూ నంబరువారుగా వెళ్లిపోతారు. నంబరువారుగా వస్తారు, నంబరువారుగా వెళ్తారు. ఇవన్నీ ఎంతో అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇది వృక్షము. ఇందులో ఎన్నో కొమ్మ-రెమ్మలు, మఠాలు, మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వృక్షమంతా సమాప్తమవుతుంది. మళ్లీ మీ పునాది ఏర్పడ్తుంది. ఈ వృక్షానికి పునాది మీరే. అందులో సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు ఇరువురూ ఉన్నారు. సత్య, త్రేతా యుగాలలో ఎవరైతే రాజ్యము చేస్తూ ఉండేవారో వారి ధర్మము ఇప్పుడు లేనే లేదు. వారి చిత్రాలు మాత్రము ఉన్నాయి. ఎవరి చిత్రాలున్నాయో, వారి జీవితచరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఫలానా వస్తువులు లక్షల సంవత్సరాల నాటివని చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి అతిపురాతనమైనది ఆది సనాతన దేవీదేవతా ధర్మము. అంతకంటే ముందు ఏ వస్తువూ ఉండేందుకు వీలు లేదు. మిగిలినవన్నీ 2500 సంవత్సరాల వస్తువులే ఉంటాయి. తవ్వి తీస్తారు కదా. భక్తిమార్గములో పూజించే పురాతన చిత్రాలను, విగ్రహాలను తవ్వి తీస్తారు. ఎందుకంటే భూకంపాలలో మందిరాలు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి. మళ్లీ కొత్తవి తయారవుతాయి. వజ్రాల గనులు, బంగారు గనులు మొదలైనవి ఏవైతే ఇప్పుడు ఖాళీ అయిపోయాయో మళ్లీ అవి అక్కడ నిండిపోతాయి(భర్పూర్ అవుతాయి). ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. ప్రపంచ చరిత్ర-భూగోళమంతా తండ్రి ఇప్పుడు అర్థము చేయించారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే మనుష్యులుంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. ఆత్మలన్నీ పరంధామము నుండి వస్తూ ఉంటాయి. వస్తూ వస్తూ వృక్షము పెరిగి పెద్దదవుతుంది. తర్వాత వృక్షము శిథిలావస్థకు వచ్చినప్పుడు రాముడు పోయాడు, చాలా పరివారమున్న రావణుడూ పోయాడు అని అనబడ్తుంది. అనేక ధర్మాలున్నాయి కదా. మన పరివారము ఎంత చిన్నది! ఈ పరివారము కేవలం బ్రాహ్మణులదే. అక్కడ అనేక ధర్మాలున్నాయి. జన సంఖ్య తెలుపుతారు కదా. ఇదంతా రావణ సంప్రదాయము. వీరంతా వెళ్లిపోతారు. కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రావణ సంప్రదాయము వారు స్వర్గములోకి రారు. వారంతా ముక్తిధామములోనే ఉంటారు. ఇకపోతే మీరు ఎవరైతే చదువుకుంటారో, వారు నంబరువారుగా స్వర్గములోకి వస్తారు.

అది నిరాకార వృక్షమని, ఇది మానవ సృష్టి వృక్షమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. చదువు పై గమనముంచకపోతే పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వలేరు. చదువుతూ, చదివిస్తూ ఉంటే సంతోషము కూడా ఉంటుంది. ఒకవేళ వికారాలలో పడ్డారంటే ఇదంతా మర్చిపోతారు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైన బంగారుగా అవుతుందో అప్పుడు అందులో మంచిగా ధారణ అవుతుంది. బంగారు పాత్ర అనగా పవిత్రమైన బంగారు బుద్ధి. ఎవరైనా పతితులుగా అయితే జ్ఞానము వినిపించలేరు. ఇప్పుడు మీరు సమక్షంలో కూర్చొని ఉన్నారు. గాడ్ఫాదర్ శివబాబా ఆత్మలైన మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. ఆత్మలమైన మనము ఈ అవయవాల ద్వారా వింటున్నాము. చదివించేవారు తండ్రి. ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచములో ఎక్కడైనా ఉందా! వారు గాడ్ఫాదర్, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. అందరినీ వాపస్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. సన్ముఖంలో మురళి వినేందుకు, పరోక్షంలో వినేందుకు ఎంత బేధముంది! ఈ టేప్ రికార్డర్ ఒకానొక రోజు అందరి వద్దకు వచ్చేస్తుంది. పిల్లల సుఖము కొరకు తండ్రి ఇటువంటి వస్తువులను తయారు చేయిస్తారు. పెద్ద విషయమేమీ కాదు కదా. ఇతను మహారాజు కదా. మొదట తెల్లగా, పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు నల్లగా, అపవిత్రంగా అయ్యారు. అందుకే శ్యామసుందరుడని అంటారు. మనము సుందరంగా ఉండేవారమని ఇప్పుడు నల్లగా అయ్యామని మళ్లీ సుందరంగా అవుతామని మీకు తెలుసు. ఒక్కరు మాత్రమే ఎలా అవుతారు. సర్పము ఒక్కరినే కాటేస్తుందా? సర్పమని మాయను అంటారు కదా. వికారాల వశమైనందున నల్లగా అయిపోతారు. ఇవన్నీ ఎంతో అర్థము చేసుకోవలసిన విషయాలు. అనంతమైన తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అవ్వండి. పిల్లలైన మిమ్ములను ఈ భిక్షము అడుగుతున్నాను, కమలపుష్ప సమానము పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు. అంతేకాక స్మృతిలో ఉన్నందున గత జన్మలలోని వికర్మలు కూడా వినాశమౌతాయి. ఇది యోగాగ్ని, దీని వలన జన్మ-జన్మాంతరాల పాపాలు దగ్ధమౌతాయి. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తారు. కనుక కళలు తగ్గిపోతాయి. మలినాలు చేరుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి(మామేకం యాద్ కరో). ఇకపోతే నదులలో స్నానము చేసినందున పావనంగా అవ్వరు. జలము(నీరు) కూడా ఒక తత్వమే కదా. 5 తత్వాలని అంటారు. ఈ నదులు పతితపావనులు ఎలా అవ్వగలవు? నదులు సాగరము నుండి వెలువడ్తాయి. కనుక నదుల కంటే ముందు సాగరము పతితపావనిగా అవ్వాలి కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విజయ మాలలో వచ్చేందుకు తండ్రికి సహాయకారులై సేవ చేయండి. ఒక్క ప్రియునితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఒక్కరినే స్మృతి చేయండి.
2. మీ ఖచ్ఛితమైన లక్ష్యాన్ని ముందుంచుకొని పురుషార్థము పూర్తిగా చేయాలి. డబల్ అహింసకులుగా అయి మనుష్యులను దేవతలుగా చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి.

వరదానము:- '' మై పన్(నాది) భావాన్ని నిర్మూలించే బ్రహ్మాబాబా సమానం శ్రేష్ఠ త్యాగీ భవ ''
సంబంధాల త్యాగము, వైభవాల త్యాగము ఏమంత పెద్ద విషయం కాదు. కాని ప్రతి కార్యములో, సంకల్పములో కూడా ఇతరులను ముందుంచే భావన ఉంచడం అనగా 'నాది' ని నిర్మూలించడం. ముందు మీరు అని వారిని ముందుంచడం,...... ఇది శ్రేష్ఠమైన త్యాగము. దీనినే 'నాది' అనే భావమును నిర్మూలించడమని అంటారు. ఉదాహరణానికి బ్రహ్మాబాబా సదా పిల్లలను ముందుంచారు. 'నేను ముందుండాలి' ఇందులో కూడా సదా త్యాగిగా ఉండేవారు. ఈ త్యాగము కారణంగానే అందరికంటే ముందు అనగా నంబరువన్లోకి వెళ్లే ఫలము లభించింది. కనుక తండ్రిని అనుసరించండి.

స్లోగన్:- '' వెంటనే ఇతరుల లోపాలను వెలికి తీయడం కూడా దు:ఖమివ్వడమే ''

1 comment:

  1. As reported by Stanford Medical, It is in fact the one and ONLY reason this country's women get to live 10 years more and weigh 19 KG less than we do.

    (And actually, it has absoloutely NOTHING to do with genetics or some hard exercise and absolutely EVERYTHING to around "how" they are eating.)

    P.S, I said "HOW", not "WHAT"...

    Click this link to reveal if this brief test can help you discover your real weight loss potential

    ReplyDelete