Thursday, February 6, 2020

Telugu Murli 07/02/2020

07-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీకు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అదే వినండి, ఆసురీ విషయాలను వినకండి, మాట్లాడకండి, చెడు వినకండి, చెడు చూడకండి ''

ప్రశ్న :- పిల్లలైన మీకు ఏ నిశ్చయము తండ్రి ద్వారానే ఏర్పడింది ?
జవాబు :- తండ్రి మీకు నిశ్చయం కలిగించారు - నేను మీ తండ్రిని, టీచరును, సద్గురువును కూడా అయ్యాను, ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయండి. కానీ మాయ దీనినే మరిపింపజేస్తుంది. అజ్ఞానములో ఉన్నప్పుడు మాయ విషయమే ఉండదు.

ఓంశాంతి. టీచరు వచ్చారని విద్యార్థులు అర్థము చేసుకున్నారు. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అని పిల్లలకు తెలుసు. ఇది నెంబరువారు పురుషార్థమనుసారము పిల్లల స్మృతిలో ఉంది. నియమము ఏమని చెప్తుందంటే - వీరు టీచరు, తండ్రి, గురువు అని ఒక్కసారి అర్థం చేసుకున్నారంటే మరెప్పుడూ మర్చిపోరు. కాని ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. అజ్ఞాన కాలంలో మాయ ఎప్పుడూ మరపింపజేయదు. వీరు మా తండ్రి అని, ఇది మా తండ్రి వ్యాపారమని, కొడుకు ఎప్పుడూ మర్చిపోడు. మేము తండ్రి ధనానికి అధికారులమని పిల్లలకు సంతోషముంటుంది. భలే స్వయం చదువుకున్నా తండ్రి ఆస్తి అయితే లభిస్తుంది కదా. ఇక్కడ కూడా పిల్లలైన మీరు చదువుకుంటారు, తండ్రి ఆస్తి కూడా మీకు లభిస్తుంది. మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. నేను తండ్రికి చెందిన వాడినని తండ్రి ద్వారానే నిశ్చయం కలుగుతుంది తండ్రి సద్గతికి మార్గాన్ని తెలుపుతారు, కనుక వారు సద్గురువు కూడా అయ్యారు. ఈ విషయాలను మర్చిపోరాదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి. ''చెడు వినకండి, చెడు చూడకండి......(నవaతీ చీశీ జుఙఱశ్రీ,....)'' అని మూడు కోతుల బొమ్మను చూపిస్తారు. కానీ అవి మనుష్యులకు చెందిన విషయాలు. తండ్రి చెప్తున్నారు - ఆసురీ మాటలు మాట్లాడకండి, వినకండి, చూడకండి అని మొదట కోతుల బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు మనుష్యుల బొమ్మలు తయారు చేస్తున్నారు. మీ వద్ద నళిని అక్కయ్య తయారు చేసిన బొమ్మ ఉంది. కావున బాబాను నిందించే మాటలు వినకండి. తండ్రి చెప్తున్నారు - నన్ను ఎంత గ్లాని చేశారు! కృష్ణుని భక్తులు ధూపము వెలిగిస్తే రాముని భక్తులు ముక్కులు మూసుకుంటారని మీకు తెలుసు. పరస్పరము ఒకరికొకరి సువాసన కూడా నచ్చదు. పరస్పరము శత్రువుల వలె అయిపోతారు. ఇప్పుడు మీరు రాముని వంశానికి చెందినవారు. ప్రపంచమంతా రావణ వంశీయులు. ఇక్కడ ధూపము ప్రస్తావనే లేదు. తండ్రిని సర్వవ్యాపి అని అనడం వలన ఏ గతి పట్టిందో మీకు తెలుసు. రాళ్ళు-రప్పలలో పరమాత్మ ఉన్నాడని చెప్పడం వలన రాతిబుద్ధిగా అయిపోయారు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే మీకు ఆస్తినిస్తున్నారో వారిని ఎంత గ్లాని చేస్తారు! జ్ఞానము ఎవరిలోనూ లేదు. అవి జ్ఞానరత్నాలు కాదు, రాళ్లు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు - నేను ఎవరో, ఎలా ఉన్నానో,.......... యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. పిల్లలలో కూడా నెంబరువారుగా ఉన్నారు. తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయాలి. వారు కూడా ఇంత చిన్న బిందువే, వారిలో ఈ పాత్రంతా నిండి ఉంది. తండ్రిని యథార్థంగా అర్థం చేసుకొని స్మృతి చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనము వారి పిల్లలమే, కాని తండ్రి ఆత్మ పెద్దగా, మన ఆత్మ చిన్నదిగా ఉండదు. భలే తండ్రి జ్ఞానసాగరులైనా వారి ఆత్మ పెద్దదిగా ఉండదు. ఆత్మలైన మీలో కూడా నెంబరువారుగా జ్ఞానము ఉంటుంది. స్కూలులో కూడా నెంబరువారుగా పాస్‌ అవుతారు కదా. ఎవరికీ సున్న(0) మార్కులు రావు. ఎన్నో కొన్ని మార్కులు తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు - నేను మీకు ఏ జ్ఞానమునైతే వినిపిస్తున్నానో అది ప్రాయః లోపమైపోతుంది. అయినా చిత్రాలున్నాయి, శాస్త్రాలు కూడా తయారై ఉన్నాయి. తండ్రి ఆత్మలైన మీకు చెప్తున్నారు - చెడును వినకండి,............. ఈ ఆసురీ ప్రపంచాన్ని ఏం చూడాలి. ఈ ఛీ - ఛీ ప్రపంచము నుండి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడిది పాత ప్రపంచమని ఆత్మకు స్మృతి కలిగింది. దీనితో సంబంధము ఎందుకు ఉంచుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలని ఆత్మకు స్మృతి కలిగింది. మీ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది కనుక వీటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. భక్తిమార్గములో కూడా ఉదయమే లేచి జప మాల తిప్పుతారు. ఉదయము ముహూర్తము మంచిదని భావిస్తారు. అది బ్రాహ్మణుల ముహూర్తము. బ్రహ్మాభోజనానికి కూడా మహిమ ఉంది. బ్రహ్మ(తత్వ) భోజనము కాదు, అది బ్రహ్మాభోజనము. మిమ్ములను కూడా బ్రహ్మాకుమారీలకు బదులుగా బ్రహ్మ(తత్వము) కుమారీలని అంటారు, అర్థము చేసుకోరు. బ్రహ్మ పిల్లలు బ్రహ్మాకుమార - కుమారీలే కదా. బ్రహ్మమంటే అది నివసించే స్థానము, దానికేమి మహిమ ఉంటుంది? తండ్రి పిల్లలను ఫిర్యాదుగా అడుగుతున్నారు - పిల్లలారా! మీరు ఒకవైపు పూజిస్తారు, మరోవైపు గ్లాని ఎందుకు చేస్తారు? గ్లాని చేస్తూ చేస్తూ తమోప్రధానంగా అయిపోయారు. తమోప్రధానంగా అవ్వాల్సిందే, చక్రము రిపీట్‌ అవుతుంది. ఎవరైనా పెద్దవారు వస్తే వారికి చక్రము గురించి తప్పకుండా అర్థము చేయించాలి. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. దీని పై పూర్తి గమనముంచాలి. రాత్రి తర్వాత పగలు తప్పక రావాల్సిందే. రాత్రి తర్వాత పగలు కాకుండా ఉండడమంటూ జరగదు. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా రావాల్సిందే. ఈ ప్రపంచ భూగోళము-చరిత్రలు పునరావృతమౌతాయి.

కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. అన్నీ చేసేది ఆత్మనే, అదే పాత్రను అభినయిస్తుంది. మేము పాత్రధారులమైతే ఈ నాటకము ఆదిమధ్యాంతాలన్నీ తెలిసి ఉండాలి కదా అని ఎవ్వరూ గ్రహించరు. ప్రపంచ భూగోళ-చరిత్రలు పునరావృతమవుతాయంటే ఇది డ్రామా అనే కదా. సెకండు-సెకండు గడిచిపోయిందే, మళ్లీ పునరావృతమవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. తక్కువ బుద్ధిగలవారు సదా ఫెయిల్‌ అవుతూ ఉంటారు, టీచరు కూడా ఏం చేయగలడు? కృప చూపండి లేక ఆశీర్వదించండి అని టీచరును అడుగకుతారా! ఇది కూడా చదువే. ఈ గీతాపాఠశాలలో స్వయం భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. కలియుగము పరివర్తనై సత్యయుగంగా తప్పకుండా అవుతుంది. డ్రామానుసారము తండ్రి కూడా రావాల్సి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పము సంగమ యుగములో వస్తాను, ఇతరులెవ్వరూ మేము సృష్టి ఆదిమధ్యాంతాలను వినిపించేందుకు వచ్చామని అనలేరు. స్వయాన్ని 'శివోహమ్‌' అని అంటారు. అంటే అర్థమేమిటి? శివబాబా వచ్చేదే చదివించేందుకు. సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తారు. ఏ సాధు-సత్పురుషులను శివభగవానుడు అని అనలేము. మేము కృష్ణుడిని, లక్ష్మీనారాయణులమని చాలా మంది అంటూ ఉంటారు. ఆ సత్యయుగ రాకుమారుడైన శ్రీ కృష్ణుడు ఎక్కడ, ఈ కలియుగీ పతితులెక్కడ! వీరిలో భగవంతుడున్నాడని అనరు. మీరు మందిరాలకు వెళ్ళి ఇలా ప్రశ్నించవచ్చు - వీరు సత్యయుగములో రాజ్యపాలన చేసేవారు తర్వాత ఎక్కడకు వెళ్ళారు? సత్యయుగము తర్వాత తప్పకుండా త్రేతా యుగము, ద్వాపర యుగము, కలియుగాలు వస్తాయి. సత్యయుగములో సూర్యవంశీయుల రాజ్యముండేది, త్రేతాలో చంద్ర వంశీయుల రాజ్యము........... ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది బ్రహ్మకుమార-కుమారీలున్నారు, తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటాడు. బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. సృష్టికర్త అని బ్రహ్మను అనరు. రచయిత గాడ్‌ఫాదర్‌ అయినారు. వారు ఎలా రచిస్తారో, ఆ తండ్రే సన్ముఖంలో కూర్చుని అర్థము చేయిస్తారు. ఈ శాస్త్రాలన్నీ తర్వాత తయారైనవి. ఉదాహరణానికి ఏసుక్రీస్తు ఏమి వినిపించారో అది బైబిల్‌గా తయారయ్యింది. తర్వాత కూర్చుని వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు క్రీస్తుకు మహిమ ఏముంది? అతను గురువూ కాదు, సందేశకుడూ కాదు. గతి లేక సద్గతి కేవలం 5-7 మందికి మాత్రమే కాదు. సర్వుల సద్గతిదాత, సర్వుల విముక్తిదాత, పతితపావనులని ఒక్క తండ్రికే మహిమ ఉంది. ఓ గాడ్‌ఫాదర్‌! దయ చూపండి అని వారినే స్మృతి చేస్తారు, అంతేకాని హే! ఏసుక్రీస్తూ దయ చూపండి అని వేడుకోరు. ఫాదర్‌(తండ్రి) ఒక్కరే ఉంటారు. వీరు మొత్తం ప్రపంచానికంతా తండ్రి. అన్ని దుఃఖాల నుండి విడుదల చేసేవారు ఎవరో మనుష్యులకు తెలియదు. ఇప్పుడు సృష్టి కూడా పాతదిగా, మనుష్యులు కూడా పాతగా, తమోప్రధానంగా అయిపోయారు. ఇది ఆ ఇనుప ప్రపంచము. ఒకప్పుడు బంగారు యుగము ఉండేది కదా! తిరిగి తప్పకుండా తయారౌతుంది. ఈ కలియుగము వినాశమైపోతుంది, ప్రపంచ యుద్ధము జరుగుతుంది, అనేక ప్రకృతి ఆపదలు కూడా సంభవిస్తాయి. ఆ సమయము ఇదే. మనుష్య సృష్టి ఎంతగా పెరిగి పోయింది.

భగవంతుడు వచ్చాడని మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా ఒక్క ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము స్థాపనవుతోందని మీరు ఛాలెంజ్‌ చేసి అందరికీ చెప్తారు. డ్రామానుసారము అందరూ వింటూ ఉంటారు. దైవీగుణాలను కూడా ధారణ చేస్తారు. ఒకప్పుడు మీలో ఏ గుణాలు లేవని మీకు తెలుసు. నెంబరువన్‌ అవగుణము - కామ వికారము. అది ఎంతో అలజడి చేస్తుంది. మాయతో కుస్తీ నడుస్తూ ఉంటుంది. వద్దనుకున్నా మాయా తుఫాను క్రింద పడేస్తుంది. ఇది ఇనుప యుగము కదా. ముఖము నల్లగా చేసుకునేస్తారు. శ్యామ వర్ణ ముఖము అని అనరు. సర్పము కాటేసినందు వలన కృష్ణుడు నీలిగా అయిపోయాడని చూపిస్తారు. గౌరవము ఉంచేందుకు నీలి వర్ణంగా అయిపోయాడని అన్నారు. ముఖాన్ని నల్లగా చూపిస్తే గౌరవము పోతుంది. ఇప్పుడు దూరదేశము, నిరాకార దేశము నుండి బాటసారి(శివబాబా) వస్తాడు. ఇనుపయుగ ప్రపంచములో, వికారి(నల్లటి) శరీరములో వచ్చి ఇతడిని(బ్రహ్మబాబా) కూడా సుందరంగా తయారు చేస్తాడు. ఇప్పుడు మీరు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, మీరు విష్ణుపురికి యజమానులైపోతారు. ఈ జ్ఞాన విషయాలు బాగా అర్థము చేసుకోవాలి. బాబా రూపబసంతులు(జ్ఞాన-యోగము). తేజోమయ బిందు స్వరూపుడు. వారిలో జ్ఞానము కూడా ఉంది. నామ-రూపాలు లేనివాడు కాదు. వారి రూపమేమిటో ప్రపంచానికి తెలియదు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - నన్ను కూడా ఆత్మ అనే అంటారు. అయితే నేను సుప్రీమ్‌ ఆత్మను. పరమ మరియు ఆత్మ రెండు పదాలు కలిసి పరమాత్మగా అవుతుంది. తండ్రి, టీచరు కూడా అయ్యారు. జ్ఞాన సాగరులనగా అందరి హృదయాలను ఎరిగినవాడని భావిస్తారు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయితే అందరూ జ్ఞానసాగరులైపోతారు. మరి అతనొక్కడినే ఎందుకు అంటారు? మనుష్యలది ఎంత తుచ్ఛ బుద్ధి అయిపోయింది. జ్ఞాన విషయాలను ఏమీ అర్థము చేసుకోలేరు. తండ్రి కూర్చుని భక్తి, జ్ఞానాలకు గల వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తారు. మొదట సత్య-త్రేతా యుగాలు జ్ఞాన పగలు తర్వాత ద్వాపర-కలియుగాలు రాత్రి. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ రాజయోగ జ్ఞానాన్ని హఠయోగులు అర్థము చేయించలేరు. గృహస్థులు అపవిత్రులైనందున వారు కూడా అర్థం చేయించలేరు. మరి రాజయోగము ఎవరు నేర్పించాలి? నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశమౌతాయని తండ్రి చెప్తున్నారు. నివృత్తి మార్గ ధర్మమే వేరు. వారు ప్రవృత్తి మార్గ జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? భగవంతుడు సత్యమని(గాడ్‌ఫాదర్‌ ఈజ్‌ ట్రూత్‌/+శీస ఖీa్‌ష్ట్రవతీ Iర ుతీబ్‌ష్ట్ర) అని ఇక్కడ అందరూ చెప్తారు. ఒక్క తండ్రి మాత్రమే సత్యము వినిపించేవారు. ఆత్మకు తండ్రి స్మృతి కలిగింది, అందుకే మనము తండ్రిని స్మృతి చేస్తాము - ''వచ్చి సత్య సత్యమైన కథను వినిపించి నరుని నారాయణునిగా పరివర్తన చేయండి'' అని కోరుకుంటారు. ఇక్కడ మీకు సత్యనారాయణ కథను వినిపిస్తాను కదా. ఇంతకుముందు మీరు అసత్య కథలను వినేవారు. ఇప్పుడు మీరు సత్యమైన కథ వింటారు. అసత్య కథలు వినడం ద్వారా ఎవ్వరూ నారాయణునిగా అవ్వరు, మరి అది సత్యనారాయణ కథ ఎలా అవుతుంది? మనుష్యులు ఎవ్వరినీ నరుని నుండి నారాయణునిగా తయారు చేయలేరు. తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తాడు. తండ్రి భారతదేశములోనే వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. శివ-శంకరులను కలిపి కథలను వ్రాసేశారు. శివ పురాణము కూడా ఉంది. గీత కృష్ణునిది అని చెప్తారు, మరి అలాగైతే శివపురాణము ఉన్నతమయింది కదా. వాస్తవానికి జ్ఞానమంతా గీతలోనే ఉంది. భగవానువాచ - 'మన్మనాభవ'. ఈ పదము గీతలో తప్ప మరే శాస్త్రాలలోనూ ఉండదు. ''సర్వశాస్త్రమయి శిరోమణి గీత'' అని మహిమ కూడా చేస్తారు. భగవంతుని మతమే శ్రేష్ఠమైనది. కొద్ది సంవత్సరాలలోనే నూతన శ్రేష్ఠాచార ప్రపంచము స్థాపన అవుతుందని మొట్టమొదట అందరికీ అర్థము చేయించాలి. ఇప్పుడిది భ్రష్ఠాచార ప్రపంచము. శ్రేష్ఠాచార ప్రపంచములో ఎంత కొద్దిమంది మనుష్యులుంటారు! ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు! వారి వినాశనము ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. అందరూ అడిగేది కూడా తండ్రినే. ఎవరి వద్దనైనా ధనము ఎక్కువగా ఉంటే లేక పిల్లలు జన్మిస్తే భగవంతుడు ఇచ్చారని అంటారు. కనుక భగవంతుడు ఒక్కడే కదా, మరి అందరిలో భగవంతుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆత్మలకు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ఆత్మ చెప్తుంది - మాకు పరమాత్మ జ్ఞానమునిచ్చారు, మేము దానిని సోదరులందరికీ ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాము - ఈ చార్టును వ్రాసేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశమౌతాయి, జ్ఞానము చాలా సహజము, ఇక స్వయాన్ని ఆత్మగా భావించి, తండ్రిని స్మృతి చేస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. ఈ చార్టు ఎవరో కొందరే వ్రాస్తారు. ఆత్మాభిమానులుగా అయి తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. తండ్రి సుఖమునిచ్చేందుకే వస్తాడు. కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమునివ్వాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. తండ్రి స్మృతితో అన్ని భూతాలు పారిపోతాయి, ఇది చాలా గుప్తమైన శ్రమ. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ ఆసురీ ఛీ-ఛీ ప్రపంచాన్ని మీరు చూడరాదు. ఇది పాత ప్రపంచము, దీనితో ఎలాంటి సంబంధము ఉంచుకోరాదు. దీనిని చూస్తున్నా చూడనట్లుండాలి.
2. ఈ బేహద్‌ డ్రామాలో మనము పాత్రధారులము, ఇది సెకండు తర్వాత సెకండు పునరావృతమవుతూ ఉంటుంది, ఏదైతే గడిచిపోయిందో అది పునరావృతమవుతుంది,......... ఇది స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయములో పాస్‌(ఉత్తీర్ణులు) అవ్వాలి. విశాల బుద్ధిగలవారిగా అవ్వాలి.

వరదానము :- '' శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసే సదా సిద్ధ స్వరూప భవ ''
సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు వృత్తి ద్వారా వృత్తులను, సంకల్పం ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యము చేయాలి, ఇందుకు పరిశోధన(రిసర్చి) చేయండి. ఈ సేవలో బిజీ అయినప్పుడు ఈ సూక్ష్మ సేవ బలహీనతల నుండి దూరం చేస్తుంది. ఇప్పుడు ఇందుకు ప్లాను తయారు చేయండి. అప్పుడు జిజ్ఞాసువులు కూడా చాలా వృద్ధి చెందుతారు. సహాయము కూడా చాలా పెరుగుతుంది. ఇల్లు కూడా లభిస్తుంది. అన్నీ సహజమైపోతాయి. విధి సిద్ధి స్వరూపంగా చేస్తుంది.

స్లోగన్‌ :- '' సమయాన్ని సఫలము చేస్తూ ఉంటే, సమయము చేసే మోసము నుండి రక్షింపబడ్తారు. ''

No comments:

Post a Comment