29-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - శత్రువైన మాయ మీ ముందే ఉంది కనుక మిమ్ములను మీరు చాలా చాలా సంభాళన చేసుకోవాలి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖకు మీరే అడ్డుగీత గీసుకుంటారు. ''
ప్రశ్న:- రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యము ఏది ?
జవాబు:- చదవడం మరియు చదివించడమే మీ ముఖ్యమైన కర్తవ్యము. మీరు ఈశ్వరీయ మతమును అనుసరిస్తున్నారు. మీరు అడవులలోకి వెళ్లవలసిన అవసరము లేదు. గృహస్థములో ఉంటూ శాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. అల్ఫ్(తండ్రి) మరియు బే(వారసత్వము) ఈ రెండు శబ్ధాలలోనే మీ చదువంతా వచ్చేస్తుంది.
ఓంశాంతి. తండ్రి కూడా పిల్లలారా! శుభోదయము(గుడ్మార్నింగ్) అని బ్రహ్మ ద్వారా చెప్పగలరు. కాని మళ్లీ పిల్లలు కూడా బదులు చెప్పవలసి ఉంటుంది. ఇది తండ్రి మరియు పిల్లల సంబంధము. కొత్తవారు వస్తే వారు పక్కా అయ్యేవరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది చదువు, భగవానువాచ అని కూడా వ్రాయబడి ఉంది. భగవంతుడు నిరాకారుడు. ఇతరులకు ఈ విషయం అర్థము చేయించేందుకు దీనిని బాబా బాగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే ఆ వైపు మాయ తీక్షణంగా ఉంది. ఇక్కడ ఆ విషయము లేదు. తండ్రి అర్థం చేయిస్తారు - ఎవరైతే కల్పక్రితము వారసత్వము తీసుకున్నారో వారు తమంతకు తామే వచ్చేస్తారు. ఫలానావారు వెళ్లిపోకుండా వారిని పట్టుకోవాలని కాదు. వెళ్లిపోతే వెళ్లిపోనీ. ఇక్కడ జీవించి ఉంటూ మరణించాలి. తండ్రి దత్తత తీసుకుంటారు. ఏదైనా వారసత్వము ఇచ్చేందుకే దత్తత తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశతోనే వస్తారు. ధనవంతుల పిల్లలు ఎప్పుడైనా పేదవారి వద్దకు దత్తతకొస్తారా! అంత ధన-సంపదలను మొదలైనవాటిని వదిలి ఎలా వెళ్తారు? ధనవంతులు దత్తత తీసుకుంటారు. తండ్రి మనకు స్వర్గ సామ్రాజ్యాన్నిస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మరి తండ్రివారిగా ఎందుకు అవ్వరు? ప్రతి విషయములో ఆశ అయితే ఉంటుంది. ఎంత ఎక్కువగా చదువుతారో అంత గొప్ప ఆశ ఉంటుంది. తండ్రి మనకు అనంతమైన వారసత్వము ఇచ్చేందుకే దత్తత తీసుకున్నారని మీకు తెలుసు. మీ అందరినీ నేను మళ్లీ 5 వేల సంవత్సరాల క్రితము వలె దత్తత తీసుకుంటానని బాబా కూడా చెప్తారు. బాబా, మేము మీ వారము, 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీ వారిగా అయ్యాము అని మీరు కూడా చెప్తారు. ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలు ఉన్నారు! ప్రజాపిత కూడా ప్రసిద్ధమైనవారు. ఎంతవరకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది - మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్లీ దేవతలుగా అవ్వాలి. సత్యయుగములో మనము రాజ్యము చేస్తాము. కనుక ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వాలి. పూర్తి నిశ్చయము లేకుంటే వెళ్లిపోతారు. కచ్ఛాగా ఉండి పడిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మాయ శత్రువు మీ ఎదుటే నిలిచి ఉంది. కనుక అది తనవైపు ఆకర్షిస్తుంది. మాయలో చిక్కుకోకండి. లేకుంటే మీ భాగ్యరేఖకు అడ్డుగీత గీసుకున్నవారవుతారు అని తండ్రి ఘడియ-ఘడియ పక్కా చేయిస్తారు. ఇంతకుముందు నన్ను ఎప్పుడు కలిశారు? అని తండ్రి మాత్రమే అడగగలరు. ఇతరులెవ్వరికీ అడిగే ఆలోచనే ఉండదు. గీత వినిపించేందుకు నేను కూడా మళ్లీ వచ్చి రావణుని జైలు నుండి విడిపించవలసి వచ్చింది అని తండ్రి అంటారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, పతిత రాజ్యము. ఇది అర్ధకల్పము నుండి ప్రారంభమయింది. రావణునికి 10 తలలు చూపిస్తారు. విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. అలాంటి మనుష్యులెవ్వరూ ఉండరు. ఇది ప్రవృత్త్తి మార్గానికి గుర్తుగా చూపించబడింది. ఇది ముఖ్య లక్ష్యము. విష్ణువు ద్వారా పాలన. విష్ణుపురమును కృష్ణపురము అని కూడా అంటారు. కృష్ణునికి రెండు చేతులే చూపిస్తారు కదా. మనుష్యులు ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. అదంతా భక్తిమార్గము. ఇప్పుడు మీకు జ్ఞానముంది. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ ముఖ్య లక్ష్యము. జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేందుకే ఈ గీతా పాఠశాల ఉంది. ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుని రుద్రుడని కూడా అంటారు. జ్ఞాన-యజ్ఞము కృష్ణునిదా లేక శివునిదా? అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు. శివుని పరమాత్మ అని అంటారు. శంకరుని దేవత అని అంటారు. వారు శివ-శంకరులను ఒకటిగా చేసేశారు. నేను ఇతనిలో ప్రవేశించానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు బాప్దాదా అని అంటారు. వారు శివ-శంకరులని అంటారు. జ్ఞానసాగరులు ఒక్కరు మాత్రమే.
ఈ జ్ఞానము ద్వారా బ్రహ్మనే విష్ణువుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. చిత్రము కూడా సరిగ్గా(ఖచ్ఛితంగా) తయారు చేశారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ చేతికి శాస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రాల సారాన్ని తండ్రి తెలియజేస్తున్నారా లేక బ్రహ్మనా? ఇతను కూడా మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు. పోతే అనేక చిత్రాలు తయారుచేశారు. అవేవీ యథార్థమైనవి కావు. అవన్నీ భక్తిమార్గానికి చెందినవి. 8-10 భుజాలు కల్గిన మనుష్యులెవ్వరూ ఉండరు. ఈ చిత్రములో కేవలం ప్రవృత్తిమార్గాన్ని చూపించారు. రావణుడంటే అర్థము కూడా తెలిపించారు. అర్ధకల్పము రావణరాజ్యము రాత్రి, అర్ధకల్పము రామరాజ్యము పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. మీరందరూ ఒకే తండ్రి సంతానము. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తారు. అంతేకాక మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. సంగమ యుగములోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపర యుగములో గీతను వినిపించారని చెప్పడం తప్పు. తండ్రి సత్యమునే తెలిపిస్తారు. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారము, విష్ణువు సాక్షాత్కారము జరుగుతుంది. శ్వేత వస్త్రధారి అయిన బ్రహ్మనే చూస్తారు. శివబాబా బిందువు. బిందువును సాక్షాత్కారములో చూసినా ఏమీ అర్థము చేసుకోలేరు. మేము ఆత్మలము అని మీరు చెప్తారు. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? ఎవ్వరూ చూడలేదు. అది ఒక బిందువు. అర్థము చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి అదే సాక్షాత్కారము అవుతుంది. ఒకవేళ వేరే రూపాన్ని చూసినట్లయితే తికమకపడ్తారు. హనుమంతుని పూజ చేస్తే వారికి అతనే సాక్షాత్కారమవుతాడు. గణేశుని పూజారులకు గణేశుడే కనిపిస్తాడు. తండ్రి అడుగుతున్నారు - నేను మిమ్ములను ఎంత ధనవంతులుగా చేశాను! వజ్రవైఢూర్యాల భవనాలుండేవి, మీ వద్ద లెక్కలేనంత ధనముండేది. మీరు ఇప్పుడు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయిపోయారు. భిక్ష వేడుకుంటున్నారు, అడుక్కుంటున్నారని తండ్రి అనవచ్చు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారని, మనము మళ్లీ విశ్వానికి అధికారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎవరైనా ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే విషయము ఏముంది? సత్యయుగములో ఎప్పుడూ ఏడ్వరు. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. ఈ లక్ష్మినారాయణులు మొదలైనవారు మోహజీత్ రాజులు. అక్కడ మోహము ఉండదు. బాబా అనేకమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి నిరాకారులు. మనుష్యులు వారిని నామ-రూపాలకు భిన్నమైనవారని అంటారు. కానీ నామ-రూపాలు లేకుండా ఏ వస్తువూ ఉండదు. ఓ భగవంతుడా! ఓ గాడ్ఫాదర్! అని అంటారు కదా. మరి నామ-రూపాలు ఉన్నాయి కదా. లింగమును శివపరమాత్మ, శివబాబా అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా ఉన్నారు కదా, తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుని, నిరాకార ఆత్మయే బాబా అని అంటుంది. మందిరాలకు వెళ్తే వారిని శివబాబా అని పిలుస్తారు. మళ్లీ ఇంటికి వచ్చి తండ్రిని కూడా బాబా అని పిలుస్తారు. మనము వారిని శివబాబా అని ఎందుకు అంటున్నామో అర్థము తెలియదు. తండ్రి అతిగొప్ప చదువును రెండే శబ్ధాలలో నేర్పిస్తున్నారు - ''అల్ఫ్(తండ్రి) మరియు బే(వారసత్వము).'' అల్ఫ్ను స్మృతి చేస్తే బే(సామ్రాజ్యము) మీది అవుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనుష్యులు పెద్ద పరీక్షను పాస్ అయితే ముందు చదివిన చదువు ఏదీ జ్ఞాపకముండదు. చదువుతూ చదువుతూ చివరికి సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది కూడా అలాగే. మీరు చదువుతూ వచ్చారు. చివర్లో మళ్లీ తండ్రి 'మన్మనాభవ' అని చెప్తారు. అలా చేస్తే దేహాభిమానము సమాప్తమైపోతుంది. ఈ మన్మనాభవకు అలవాటు పడ్తే చివర్లో కూడా తండ్రి మరియు ఆస్తి జ్ఞాపకము వస్తాయి. ఇదే ముఖ్యమైనది. ఎంత సహజమైనది. ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేమి చదువుతారో తెలియదు. రాజు ఎలాంటివారో అలా వారు తమ పద్ధతిని నడుపుతారు. మొదట మణుము, శేరు, పావుల లెక్క ఉండేది. ఇప్పుడు కిలో మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి. ఎన్ని వేరు వేరు ప్రాంతాలైపోయాయి. ఢిల్లీలో ఏ వస్తువు శేరు, ఒక రూపాయి ఉంటుందో అది ముంబాయిలో 2 రూపాయలకు లభిస్తుంది. ఎందుకంటే ప్రాంతాలు వేరు వేరుగా ఉన్నాయి. మేము మా ప్రాంతాన్ని ఆకలితో చంపము అని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎన్ని జగడాలు మొదలైనవి జరుగుతాయి. ఎంత అల్లరి, ఎన్ని గలాటాలున్నాయి!
భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. మళ్లీ 84 జన్మల చక్రములో తిరుగుతూ దివాలా తీసింది. వజ్రములాంటి అమూల్యమైన జన్మను గవ్వల కొరకు పోగొట్టుకున్నావు......... అని చెప్తారు. మీరు గవ్వల కొరకు ఎందుకు ప్రాకులాడ్తారు? అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోండి, పావనంగా అవ్వండి. ఓ పతితపావనా! రండి, పావనము చేయండి అని కూడా పిలుస్తారు. కనుక మొదట పావనంగా ఉండేవారము, ఇప్పుడు పావనంగా లేము అని దీని నుండి ఋజువవుతుంది. ఇప్పుడుండేది కలియుగము. నేను పావన ప్రపంచాన్ని తయారుచేస్తాను కనుక పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది అని తండ్రి చెప్తారు. అందుకే ఈ మహాభారత యుద్ధము. అది ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా ప్రజ్వలితమయ్యింది. ఈ వినాశనము కావడము కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ప్రారంభములో బాబాకు సాక్షాత్కారమయ్యింది. ఇంత గొప్ప రాజ్యము లభిస్తుంది అన్నప్పుడు చాలా సంతోషము కలిగింది తర్వాత వినాశనాన్ని కూడా సాక్షాత్కారము చేయించారు. మన్మనాభవ, మధ్యాజీభవ ఇవి గీతలోని పదాలు. గీతలో కొన్ని-కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. మీకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను, ఇది మళ్లీ ప్రాయ: లోపమైపోతుంది అని తండ్రి కూడా చెప్తున్నారు. లక్ష్మినారాయణుల రాజ్యమున్నప్పుడు వేరే ఏ ఇతర ధర్మముండేది కాదని ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో జన సంఖ్య ఎంత తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది! కనుక ఈ పరివర్తన జరగాలి. తప్పకుండా వినాశనము కూడా అవ్వాలి. మహాభారత యుద్ధము కూడా ఉంది. భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. శివజయంతిని ఆచరిస్తారు. అయితే శివబాబా వచ్చి ఏం చేశారో కూడా తెలియదు. గీత ద్వారా కృష్ణుని ఆత్మకు రాజ్యము లభించిందని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. గీతను 'మాత-పిత' అని అంటారు. దాని ద్వారా మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. అందుకే కృష్ణుడు గీతను వినిపించలేదని చిత్రములో కూడా చూపించారు. కృష్ణుడు గీతా జ్ఞానము ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని ఇలా అయ్యాడు. రేపు మళ్లీ కృష్ణుడు ఉంటాడు. వారు శివబాబాకు బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. కనుక తండ్రి చెప్తున్నారు - ఇది మీలో పక్కా నిశ్చయం చేసుకోండి. ఉల్టా-సుల్టా మాటలు చెప్పి ఎవ్వరూ మిమ్ములను క్రింద పడేయరాదు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? ఇది ఎలా జరుగుతుంది? అని చాలామంది ప్రశ్నిస్తారు. అరే! అది నిర్వికారి ప్రపంచము. సంపూర్ణ నిర్వికారులని మీరే స్వయంగా చెప్తారు కదా. మళ్లీ వికారాల మాట ఎలా ఉండగలదు? అనంతమైన తండ్రి నుండి అనంతమైన సామ్రాజ్యము లభిస్తుందని మీకిప్పుడు తెలుసు. మరి అలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? ఇది పతిత ప్రపంచము. కుంభమేళాకు ఎన్ని లక్షలమంది వెళ్తారు. అక్కడ ఒక నది గుప్తముగా ఉందని చెప్తారు. నది గుప్తంగా ఉండగలదా? ఇక్కడ కూడా గోముఖాన్ని తయారుచేశారు. అందులో గంగ వస్తుందని చెప్తారు. అరే! గంగ తన మార్గములో ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా లేక ఈ పర్వతము పైకి వస్తుందా? భక్తిమార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము. ఒకటి హద్దులోని వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. సన్యాసులు వారి ఇండ్లను వదిలి అడవులలో ఉంటారు. ఇక్కడ ఆ మాటే లేదు. మీరు బుద్ధి ద్వారా పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యము చదవడము, చదివించడము. ఇప్పుడు రాజయోగము అడవులలో నేర్పించబడదు. ఇది పాఠశాల, దాని శాఖలు వెలువడుతూ ఉంటాయి. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఇతరులకు నేర్పిస్తారు. అందరికి ఒక్క శివబాబాయే కూర్చొని నేర్పించరు. ఇది పాండవ ప్రభుత్వము. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చుని ఉన్నారు! వెలుపల అనేక గలాటాలున్నాయి. తండ్రి చెప్తున్నారు - 5 వికారాలను దానము చేస్తే గ్రహణము వదిలిపోతుంది. నా వారిగా అయితే నేను మీ కోరికలన్నీ పూర్తి చేస్తాను. ఇప్పుడు మనము సుఖధామానికి వెళ్తున్నాము. దు:ఖధామానికి నిప్పు అంటుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలకు వినాశనము కూడా సాక్షాత్కారమయ్యింది. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కనుక స్మృతియాత్రలో తత్పరులైతే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక ఉన్నత పదవిని పొందుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాబా వారసత్వము పై పూర్తి అధికారాన్ని పొందేందుకు మరజీవులుగా అవ్వాలి. 'దత్తు' పుత్రులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ శ్రేష్ఠ భాగ్యానికి అడ్డుగీత గీసుకోరాదు.
2. ఏ ఉల్టా-సుల్టా(తప్పుడు) మాటలు విని సంశయములోకి రాకూడదు. నిశ్చయము కొద్దిగా కూడా కదలరాదు. ఈ దు:ఖధామానికి నిప్పు అంటుకోనున్నది. కనుక దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి.
వరదానము:- '' సమస్యలను సమాధాన రూపములోకి పరివర్తన చేసే విశ్వ కళ్యాణి భవ ''
' నేను విశ్వ కళ్యాణిని ' అనే శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల సంస్కారాన్ని ఉత్పన్నము (ఎమర్జ్) చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారము ముందు హద్దు సంస్కారాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తనైపోతాయి. ఇప్పుడు యుద్ధము చేస్తూ సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీతనపు సంస్కారాన్ని ఎమర్జ్ చేయండి. ఇప్పుడు సర్వస్వము సేవలో ఉపయోగిస్తే శ్రమ నుండి విడుదల అవుతారు. సమస్యలలోకి వెళ్లేందుకు బదులు దానమివ్వండి, వరదానమివ్వండి. అలా చేస్తే స్వయానికి పట్టిన గ్రహణం స్వతహాగా సమాప్తమైపోతుంది.
స్లోగన్:- '' ఇతరుల లోపాలను, బలహీనతలను వర్ణించేందుకు బదులు గుణ స్వరూపులుగా అవ్వండి, గుణాలనే వర్ణించండి. ''
No comments:
Post a Comment