Friday, February 7, 2020

Telugu Murli 08/02/2020

08-02-2020 ఉదయము మురళి ఓంశాంతి ని బాప్‌దాదా కు మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ ఆత్మిక హాస్పిటల్‌ మిమ్ములను అర్ధకల్పం కొరకు ఎవర్‌హెల్దీగా తయారుచేసేది, ఇక్కడ మీరు దేహీ - అభిమానులుగా అయ్యి కూర్చోండి. ''

ప్రశ్న :- వ్యాపారము మొదలైనవి చేస్తున్నా ఏ డైరెక్షన్‌ బుద్ధిలో గుర్తుండాలి ?
జవాబు :- మీరు ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకండి, ఇది తండ్రి డైరెక్షన్‌. ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో ఎవ్వరూ తీరిక లేదని చెప్పరాదు. అన్నీ చేస్తున్నా స్మృతిలో ఉండవచ్చు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్‌మార్నింగ్‌. గుడ్‌మార్నింగ్‌ తర్వాత తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు చెప్తారు. హే పతితపావనా! వచ్చి పావనంగా చెయ్యండని పిల్లలు పిలుస్తారు కూడా. ఆత్మిక తండ్రిని స్మృతి చేయండని తండ్రి మొట్టమొదటే చెప్తారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. ఫాదర్‌ను సర్వవ్యాపి అని ఎప్పుడూ అనరు. కనుక పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చెయ్యండి, ఎవరి సాకారాన్ని లేక ఆకారాన్ని స్మృతి చేయకండి, ఒక్క తండ్రిని తప్ప. ఇది చాలా సహజం కదా! మేము చాలా బిజీగా ఉంటాము, తీరిక లేదని మనుష్యులంటారు. కానీ ఇందులో తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తి చెప్తారు. తండ్రిని స్మృతి చేస్తేనే మా పాపం భస్మం అవుతుందని కూడా మీకు తెలుసు. ఇది ముఖ్యమైన విషయం. వ్యాపారము మొదలైన వాటికి ఎటువంటి అభ్యంతరము లేదు. అవి అన్నీ చేస్తూనే కేవలం తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. మేము పతితంగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. సాధువులు - సన్యాసులు, ఋషులు, మునులు మొదలైనవారందరు సాధన చేస్తారు. భగవంతుని కలిసేందుకు సాధన చేస్తారు. ఎప్పటివరకైతే వారి పరిచయం ఉండదో అప్పటివరకు కలవలేరు. ప్రపంచంలో తండ్రి పరిచయం ఎవ్వరికీ లేదని మీకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికి ఉంది. పెద్ద వస్తువు వెంటనే పరిచయమైపోతుంది. ఆత్మ పరిచయం అయితే తండ్రి రావాలి, అర్థం చేయించాలి. ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక స్టార్‌(నక్షత్రము), చాలా సూక్ష్మమైనది. దానిని ఎవ్వరూ చూడలేరు. అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ- అభిమానులుగా అయ్యి కూర్చోవాలి. అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది ఒక హాస్పిటల్‌ కూడా అయింది కదా! ఆత్మ అవినాశి. ఎప్పటికీ వినాశనం అవ్వదు. మొత్తం పార్టు అంతా ఆత్మదే. నేను ఎప్పుడూ వినాశనం అవ్వను అని ఆత్మ అంటుంది. ఇన్ని ఆత్మలు అన్నీ అవినాశి. శరీరము వినాశి. ఇప్పుడు మీ బుద్ధిలో నేను ఆత్మ అవినాశి అని కూర్చుంది. మేము 84 జన్మలు తీసుకుంటాము, ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలు అని ఏదైతే గాయనం ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానిదే అయి ఉండాలి, అన్నిటిది అవ్వజాలదు. అన్ని ధర్మాలు కలిసి అయితే రావు. మనము ఇతరుల లెక్కలన్నీ కూర్చొని ఎందుకు తీయాలి? ఫలానా ఫలానా సమయంలో ధర్మ స్థాపన చేసేందుకు వస్తారని తెలుసు. తర్వాత దాని వృద్ధి అవుతుంది. అందరూ సతోప్రధానం నుండి తమోప్రధానం అవ్వవలసే ఉంది. ప్రపంచం ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్లీ తండ్రి వచ్చి సతోప్రధాన సత్యయుగాన్ని తయారు చేస్తారు. భారతవాసులైన మేమే మళ్లీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తామని, అప్పుడు ఇతర ఏ ధర్మమూ ఉండదని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నతమైన పదవి తీసుకోవాలో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తారు. అంతేకాక బాబా మేము ఇంత సమయం స్మృతిలో ఉంటున్నామని సమాచారం కూడా వ్రాస్తారు. చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం ఇవ్వరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. అయినా తెలిసిపోతుంది కదా! స్కూలులో టీచరు స్టూడెంటుతో, నీవు చదవకపోతే ఫెయిల్‌ అవుతావు అని చెప్తారు కదా! లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా అర్థం చేసుకుంటారు, ఇది చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నంబరువార్‌గా అయితే కూర్చోబెట్టరు. బుద్ధితో అర్థం చేసుకుంటారు. నంబరువార్‌గా ఉండనే ఉంటారు కదా! ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికి పంపిస్తారో అక్కడకు వెళ్లిపోతారు, ఎంతోమంది మాకు మహారథి కావాలి అని వ్రాస్తారు. అప్పుడు వారు తప్పకుండా మన కంటే తెలివైనవారని, ప్రఖ్యాతమైనవారని అర్థం చేసుకుంటారు. నంబరువార్‌గా అయితే ఉంటారు కదా! ప్రదర్శినిలో కూడా అనేక రకాలవారు వస్తూ ఉంటారు కనుక గైడ్స్‌ కూడా అర్థం చేయించేందుకు నిలబడి ఉండాలి. రెసీవ్‌ చేసుకునేవారికి ఇతను ఎటువంటి మనిషి అనేది తెలుస్తుంది. కనుక వీనికి నీవు అర్థం చేయించు అని సైగ చెయ్యాలి. ఫస్ట్‌ గ్రేడ్‌, సెకండ్‌ గ్రేడ్‌, థర్డ్‌ గ్రేడ్‌ అన్నీ ఉంటాయని మీరు కూడా అర్థం చేసుకోగలరు. అక్కడ అందరికి సేవ చెయ్యాలి. ఎవరైనా గొప్ప మనిషి అయితే తప్పకుండా అందరూ గొప్ప మనిషిని ఆదరిస్తారు, ఇది నియమం. తండ్రి లేదా టీచరు పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు, ఇది కూడా అన్నిటికంటే గొప్ప సత్కారం. పేరు గాంచిన పిల్లలు మహిమ చేయబడ్తారు లేదా గౌరవించబడ్తారు. వీరు ఫలానా ధనవంతులు, రిలిజియస్‌ మైండెడ్‌ (ధర్మపరాయణులు) అని మహిమ చేస్తారు. ఇది కూడా సత్కారమే కదా! ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడని ఇప్పుడు మీకు తెలుసు. ఖచ్ఛితంగా ఉన్నతాతి ఉన్నతమైన వారని కూడా అంటారు కాని వారి బయోగ్రఫీ ఏమిటో చెప్పండి అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు. అంతే! ఒక్కసారిగా నీచంగా చేసేస్తారు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారు మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. సూక్ష్మవతనంలో ఉండేవారు దేవతలు. ఇక్కడ మనుష్యులు ఉంటారు. మరి ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు వారు నిరాకారులు.
వజ్రం వలె ఉండే మనమే మళ్లీ గవ్వ వలె అయిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుడిని మీ కంటే ఎక్కువగా క్రిందికి తీసుకెళ్లారు. గుర్తించనే గుర్తించరు. భారతవాసులైన మీకే పరిచయము లభిస్తుంది. తర్వాత మళ్లీ పరిచయం తక్కువైపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయం అందరికి ఇస్తారు. చాలామందికి తండ్రి పరిచయం లభిస్తుంది. మీ ముఖ్య చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము. వీటిలో ఎంత ప్రకాశం(జ్ఞానం) ఉంది! ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారని ఎవరైనా చెప్తారు. మంచిది, సత్యయుగానికి ముందు ఏం ఉండేదో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతము, ప్రజల పై ప్రజల రాజ్యం ఉంది. ఇప్పుడు రాజ్యమైతే లేనే లేదు, ఎంత తేడా ఉంది! సత్యయుగం ఆదిలో రాజులు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు, భలే వారెవరూ పావనంగా లేరు కాని కొంతమంది డబ్బులిచ్చి కూడా టైటిల్‌ తీసుకుంటారు. మహారాజులైతే ఎవ్వరూ లేరు. టైటిల్సు కొని తీసుకుంటారు. ఎలాగైతే పాటియాలా మహారాజా జోధ్‌పూర్‌, బికనీర్‌ మహారాజా..... పేరు తీసుకుంటారు కదా! ఈ పేరు అవినాశిగా కొనసాగుతుంది. ఇంతకుముందు పవిత్ర మహారాజులుండేవారు, ఇప్పుడు అపవిత్ర మహా రాజులున్నారు. మహారాజులనే పదము నడుస్తూ వస్తోంది. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారని అంటారు, రాజ్యం ఎవరు పొందారు? సామ్రాజ్యం ఎలా స్థాపన అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి చెప్తారు - ఇప్పుడు నేను మిమ్ములను 21 జన్మల కొరకు చదివిస్తాను. వారైతే చదువుకొని ఈ జన్మలోనే బ్యారిస్టర్‌ మొదలైనవి అవుతారు. మీరు ఇప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజు, మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాన్‌ అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇప్పుడిది పాత ప్రపంచం. భలే ఎంత మంచి-మంచి పెద్ద మహళ్లు ఉన్నా, వజ్రాలు, రత్నాల మహళ్లు నిర్మించేందుకు ఎవ్వరిలోనూ శక్తి లేదు. సత్యయుగంలో అన్నీ వజ్రాలు - రత్నాల మహళ్లు నిర్మిస్తారు. నిర్మించేందుకు ఏమాత్రం సమయం పట్టదు. ఇక్కడ కూడా ఎర్త్‌క్వేక్‌ (భూకంపం) మొదలైనవి సంభవిస్తే చాలామంది భవనశిల్పులు చేరి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం పట్టణాన్ని మళ్లీ నిలబెట్టేస్తారు. కొత్త ఢిల్లీ నిర్మాణానికి 8-10 సంవత్సరాలు పట్టింది, కాని ఇక్కడి లేబర్‌(కార్మికులు), అక్కడి పనివారిలో తేడా ఉంటుంది కదా! ఈ రోజుల్లో కొత్త కొత్త నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణ సైన్సు కూడా జోరుగా ఉంది. అన్నీ తయారై దొరుకుతున్నాయి. తక్షణం ప్లాట్‌ సిద్ధం. చాలా త్వర త్వరగా తయారు చేస్తారు, అయితే ఇవన్నీ అక్కడ పనికొస్తాయి కదా! అన్నీ వెంట వస్తాయి. సంస్కారం అయితే ఉంటుంది కదా! ఈ సైన్సు సంస్కారం కూడా వస్తుంది. పావనంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చెయ్యమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి కూడా గుడ్‌మార్నింగ్‌ చెప్పి తర్వాత శిక్షణనిస్తారు. పిల్లలూ, తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి, ఎందుకంటే తల పై జన్మ-జన్మాంతరాల భారం ఉంది, మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే ఆరోహణ(పైకి ఎక్కే) కళ ఉంటుంది. తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉంటే అంత సంతోషం కూడా ఉంటుంది, శక్తి లభిస్తుంది. ముందు నంబరులో ఉంచబడే పిల్లలు చాలామంది ఉన్నారు. కాని బొత్తిగా స్మృతిలో ఉండరు. భలే జ్ఞానంలో చురుకుగా ఉన్నా స్మృతియాత్ర లేనే లేదు. తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు. ఇతడు కూడా నంబరువన్‌లో ఉన్నాడంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటాడు కదా! మీరు ఎల్లప్పుడూ శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి, అప్పుడు బుద్ధియోగము అక్కడ తగులుకొని ఉంటుంది. ఇతడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు కదా. అయినా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలున్నాయి, భగవంతుడని నిరాకారుడినే అంటారు. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఆత్మలందరు ఒక్క భగవంతుని సంతానము. అందరు సోదరులు. ఇప్పుడీ శరీరములో విరాజమానమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులు. ఇది అకాలమూర్తికి(ఆత్మకు) ఆసనము. అకాల సింహాసనము ఏదో విశేషమైన వస్తువు కాదు. ఈ ఆసనం అకాలమూర్తిది. భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనిని అకాల సింహాసనం అని అంటారు. అకాల సింహాసనం అకాల మూర్తిది. ఆత్మలన్నీ అకాలమూర్తులు. ఎంత అతిసూక్ష్మమైనవి! తండ్రి నిరాకారులు. వారు తమ సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు! తండ్రి ఈ సింహాసనం నాది కూడా అని చెప్తారు. నేను వచ్చి ఈ సింహాసనాన్ని లోన్‌(అప్పు) తీసుకుంటాను. బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ శరీరంలోని అకాల సింహాసనం పై వచ్చి కూర్చుంటాను. ఇది ఆత్మలందరి సింహాససనం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుష్యుల ఆసనం గురించే మాట్లాడ్తారు, జంతువుల విషయం కాదు. మొదట ఏ మనుష్యులైతే జంతువు కంటే కూడా బహు హేయమైనవారిగా అయిపోయారో వారు బాగుపడాలి. ఎవరైనా జంతువుల విషయం అడిగితే, మొదట తమను(స్వయాన్ని) బాగు చేసుకోండి అని చెప్పండి. సత్యయుగంలో జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్‌ క్లాస్‌గా ఉంటాయి. చెత్త మొదలయింది ఏదీ ఉండదు. రాజమహలులో పావురాలు మొదలైన వాటి మురికి ఉంటే దండన విధిస్తారు. కొంచెం కూడా మురికి ఉండదు. అక్కడ చాలా జాగ్రత్త వహిస్తారు. కాపలా కాస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏ జంతువు మొదలైనవి లోపలికి దూరి రాలేవు. చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది! శంకర-పార్వతుల మందిరంలో పావురాలు కూడా కనిపిస్తాయి. మరి తప్పకుండా మందిరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. శాస్త్రాలలో అయితే చాలా కట్టుకథలు వ్రాసేశారు.
ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, వారిలో కూడా ధారణ చేయగలిగినవారు కొంతమందే ఉన్నారు, మిగిలినవారు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమతో అర్థం చేయిస్తారు - పిల్లలూ, చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలు వెలువడ్తూ ఉండాలి. మీరు రూప-బసంతులు. మీ నోటి నుండి రాళ్లు వెలువడరాదు. ఆత్మకే మహిమ ఉంటుంది. ఆత్మ చెప్తుంది - నేను ప్రెసిడెంట్‌ను, నేను ఫలానా,........ నా శరీరం పేరు ఇది, అచ్ఛా, ఆత్మలు ఎవరి పిల్లలు? ఒక్క పరమాత్ముని పిల్లలు. కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంటుంది. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు! మాకు కూడా ముందు ఏమీ తెలిసేది కాదని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బుద్ధి ఎంతగా వికసించింది! మీరు ఏ మందిరానికి వెళ్లినా ఇవి అన్నీ అసత్యపు చిత్రాలని భావిస్తారు.10 భుజాల వారు, ఏనుగు తొండం వారు ఇలాంటి చిత్రం గల వారెవరైనా ఉంటారా! ఇదంతా భక్తిమార్గపు సామాగ్రి. వాస్తవానికి అందరికి సద్గతిదాత అయిన ఒక్క శివబాబాదే భక్తి జరగాలి. ఈ లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. మళ్లీ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే వచ్చి అందరికి సద్గతినిస్తారు. వారి కంటే గొప్ప వారెవ్వరూ లేనే లేరు. ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నంబరువార్‌గా ధారణ చేస్తారు. ధారణ చేయలేకపోతే ఎందుకు పనికొస్తారు. చాలామంది అంధులకు ఊతకఱ్ఱగా అయ్యేందుకు బదులు అంధులైపోతారు. ఆవు ఏదైతే పాలు ఇవ్వదో దానిని గొడ్లచావిడిలో(పింజరపురంలో) ఉంచుతారు. వీరు కూడా జ్ఞాన పాలు ఇవ్వలేరు. ఏ పురుషార్థం చేయనివారు చాలామంది ఉన్నారు. మేము ఎవరికైనా కొంతైనా కళ్యాణం చెయ్యాలని భావించరు(అనుకోరు). తమ అదృష్టం గురించిన ధ్యాసే ఉండదు. ఏం దొరికిందో అదే మంచిదని అనుకుంటారు. కనుక తండ్రి, వీని అదృష్టంలో లేదని అంటారు. తమ సద్గతిని తయారు చేసుకునే పురుషార్థం అయితే చెయ్యాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారు, పతిత ప్రపంచంలో, పతిత దేహంలో ఎలా వస్తారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో. ఎప్పుడైతే రావణుడు దు:ఖం ఇస్తాడో, పూర్తిగా భ్రష్టు పట్టిస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్ఠంగా తయారు చేస్తారు, ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజు-రాణిగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చేయరో వారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు. కొందరు చాలా మంచి అదష్టాన్ని తయారు చేసుకుంటారు. మేము ఏ సర్వీస్‌ చేస్తున్నామని ప్రతి ఒక్కరు చూసుకోగలరు. మంచిది.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రూప్‌- బసంత్‌గా(యోగి-జ్ఞానిగా) అవ్వాలి, నోటి ద్వారా సదా రత్నాలు రావాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడూ రాళ్లు(కటు వచనాలు) వెలువడరాదు.
2. జ్ఞాన-యోగాలలో చాలా తీక్షణంగా తయారై తమ మరియు ఇతరుల కల్యాణం చెయ్యాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. అంధులకు ఊతకఱ్ఱగా అవ్వాలి.

వరదానము :- '' ప్రవృత్తిలోని విస్తారంలో ఉంటూ ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తి భవ! ''
ప్రవృత్తి విస్తారంగా ఉన్నా విస్తారాన్ని సర్దేసి, అతీతంగా ఉండడం అభ్యాసం చెయ్యండి. ఇప్పుడిప్పుడే స్థూల కార్యం చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోయారు - ఈ అభ్యాసం ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉండడం వలన వ్యక్త భావంలోని విషయాలు చిన్న చిన్నవిగా అనుభవం అవుతాయి. ఉన్నతంలోకి వెళ్లడంతో నీచత్వము దానంతట అదే వదిలిపోతుంది. శ్రమించడం నుండి రక్షింపబడ్తారు. సమయం కూడా మిగులుతుంది, సేవ కూడా ఫాస్ట్‌గా అవుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతుందంటే ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు.

స్లోగన్‌ :- '' సంతోషాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ఆత్మ రూపీ దీపంలో రోజూ జ్ఞానమనే నేతిని వేస్తూ ఉండండి. ''

No comments:

Post a Comment