06-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు వికారాలను దానమిస్తే గ్రహణము తొలగిపోతుంది, ఈ తమోప్రధాన ప్రపంచము సతోప్రధానంగా అవుతుంది ''
ప్రశ్న :- పిల్లలైన మీరు ఏ విషయములో ఎప్పుడూ విసిగిపోరాదు ?
జవాబు :- మీకు మీ జీవితము పై ఎప్పుడూ విసుగు కలగరాదు. ఎందుకంటే ఇది వజ్ర సమానమైన జన్మగా మహిమ చేయబడింది. దీనిని బాగా కాపాడుకోవాలి కూడా. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానము వింటూ ఉండగలరు. ఇక్కడ ఎన్ని రోజులు జీవించి ఉంటారో, అన్ని రోజులు సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారాలు సమాప్తమవుతూ ఉంటాయి.
ఓంశాంతి. నేడు గురువారము పిల్లలైన మీరు సద్గురువారమని అంటారు. ఎందుకంటే బాబా(సద్గురువు) సత్యయుగాన్ని స్థాపన చేసేవారే కాక సత్యమైన నారాయణుని కథను కూడా ప్రాక్టికల్‌గా వినిపిస్తారు. ప్రాక్టికల్‌గా నరుని నుండి నారాయణునిగా చేస్తారు. సర్వుల సద్గతిదాత అని కూడా మహిమ చేయబడ్తుంది. అంతేకాక వృక్షపతి కూడా వీరే. ఇది మానవ సృష్టి వృక్షము, దీనిని కల్పవృక్షము అని కూడా అంటారు. కల్ప-కల్పము అనగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ యథావిధిగా పునరావృతమవుతుంది. వృక్షము కూడా పునరావృతమవుతుంది కదా. పుష్పములు 6 మాసాలు వస్తాయి, తర్వాత తోటమాలులు ఆ మొలకలను వేర్ల సహితంగా తీసి మళ్లీ నాటుతారు. అప్పుడు మళ్లీ పుష్పాలు వస్తాయి.
తండ్రి జయంతిని కూడా అర్ధకల్పము ఆచరిస్తారు, అర్ధకల్పము మర్చిపోతారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. భక్తిమార్గములో అర్ధకల్పము స్మృతి చేస్తారు. బాబా వచ్చి పుష్పాల తోటను ఎప్పుడు స్థాపన చేస్తారు? దశలు చాలా ఉంటాయి కదా, బృహస్పతి దశ కూడా ఉంది, కళలు తగ్గిపోయే దశలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో భారతదేశానికి రాహుగ్రహణము పట్టి ఉంది. చంద్రునికి కూడా గ్రహణము పట్టినప్పుడు దానమిస్తే గ్రహణము వదుల్తుందని చెప్తారు. ఈ 5 వికారాలను దానమిస్తే గ్రహణము వదులుతుందని ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి సృష్టి పై గ్రహణము పట్టి ఉంది, తత్వాల పై గ్రహణము ఉంది, ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నాయి. ప్రతి కొత్త వస్తువు పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదానిని సతోప్రధానమని, పాతదానిని తమోప్రధానమని అంటారు. చిన్న పిల్లలను కూడా సతోప్రధానంగా, మహాత్ముల కంటే శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తారు, ఎందుకంటే వారిలో పంచ వికారాలు ఉండవు. సన్యాసులు కూడా బాల్యము నుండే భక్తి చేస్తారు. రామ తీర్థుడు ఒకప్పుడు, కృష్ణుని పూజారి, సన్యాసము తీసుకుంటూనే పూజ ఆగిపోయింది. సృష్టి పై పవిత్రత కూడా కావాలి కదా. ఒకప్పుడు భారతదేశము అన్నిటికంటే పవిత్రంగా ఉండేది. తర్వాత దేవతలు వామమార్గములోకి వెళ్లినప్పుడు మళ్లీ భూకంపాలు మొదలైన వాటిలో స్వర్గ సామాగ్రి, బంగారు భవనాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్లీ కొత్తగా తయారవ్వడం ప్రారంభమవుతుంది. వినాశనము తప్పకుండా జరుగుతుంది. రావణ రాజ్యము ప్రారంభమయ్యాక ఉపద్రవాలు పెరుగుతాయి, ఈ సమయములో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో దేవతలు రాజ్యపాలన చేస్తారు. దేవతలకు, అసురులకు మధ్య యుద్ధాన్ని చూపించారు. కాని దేవతలు సత్యయుగములోనే ఉంటారు. అక్కడ యుద్ధము ఎలా జరుగుతుంది? సంగమ యుగములో దేవతలుండరు. మీ పేరే పాండవులు. వాస్తవానికి పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధము జరగదు. ఇవన్నీ అసత్యాలు. ఇది ఎంత పెద్ద వృక్షము! ఇందులో ఆకులు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిని లెక్కించడం ఎవ్వరికీ సాధ్యము కాదు. సంగమ యుగములో దేవతలుండరు. తండ్రి కూర్చొని ఆత్మలకు వినిపిస్తున్నారు, ఆత్మయే వింటూ తల ఊపుతుంది. మేము ఆత్మలము, బాబా మమ్ములను చదివిస్తున్నారని పక్కా చేసుకోవాలి. తండ్రి మనలను పతితుల నుండి పావనంగా చేస్తారు. ఆత్మలోనే కదా మంచి లేక చెడు సంస్కారాలుండేది. నన్ను బాబా చదివిస్తున్నారని, ఆత్మ తన అవయవాల ద్వారా చెప్తుంది. మీకు చెప్పేందుకు - నాకు కూడా అవయవాలు కావాలని తండ్రి అంటున్నారు. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనకు జ్ఞానాన్ని వినిపించేందుకు వస్తారు. మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు కదా. మహిమ మధువనానికే ఉంది. ఆత్మల తండ్రి వారే కదా, అందరూ వారినే పిలుస్తారు. ఇక్కడ సన్ముఖములో కూర్చున్నందున మీకు మజా లుగుతుంది, కానీ ఇక్కడే అందరూ ఉండలేరు. మీ కార్య వ్యవహారాలు, సర్వీసు మొదలైనవి కూడా చూసుకోవాలి. ఆత్మలు సాగరుని వద్దకు వస్తాయి, ధారణ చేసి అక్కడకు వెళ్లి ఇతరులకు వినిపించాలి, లేకుంటే ఇతరుల కళ్యాణము ఎలా చేస్తారు? మేము వెళ్లి ఇతరులకు కూడా అర్థం చేయించాలని యోగి, జ్ఞానీ ఆత్మలకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు శివజయంతిని ఆచరిస్తారు కదా. భగవానువాచ. భగవానువాచ అని కృష్ణుడిని అనేందుకు వీలు లేదు. అతను దైవీ గుణాలు కలిగిన మనిషి. దేవతా ధర్మము అని అంటారు. ఆ ధర్మమిప్పుడు లేదని, మళ్లీ స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. మేము దేవీ దేవతా ధర్మము వారమని ఇప్పుడు మీరు చెప్పరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు, దేవీ దేవతా ధర్మము వారిగా అవుతున్నారు. దేవతల నీడ కూడా ఈ పతిత సృష్టి పై పడదు. ఇందులోకి దేవతలు రాలేరు. మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి. లక్ష్మి దేవిని పూజించునప్పుడు ఇంటిని ఎంత శుభ్రపరుస్తారు. అలా ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంత శుభ్రమవ్వాలి. పాత ప్రపంచము పూర్తిగా సమాప్తమైపోతుంది. లక్ష్మి నుండి మనుష్యులు ధనమును మాత్రమే కోరుకుంటారు. లక్ష్మి గొప్పదా? లేక జగదంబ గొప్పదా?(అంబ). అంబ మందిరాలు కూడా చాలా ఉన్నాయి. మనుష్యులకు ఏమీ తెలియదు. లక్ష్మి స్వర్గానికి యజమాని అని, జగదంబ ఎవరినైతే సరస్వతి అని పిలుస్తారో, ఆ జగదంబనే మళ్లీ ఈ లక్ష్మిగా అవుతుందని మీకు తెలుసు. మీ పదవి ఉన్నతమైనది. దేవతల పదవి మీ పదవి కంటే చిన్నది. ఉన్నతాతి ఉన్నతులు బ్రాహ్మణులు, శిఖ సమానమైనవారు కదా. మీరు అందరికంటే ఉన్నతమైనవారు. సరస్వతి, జగదంబ నుండి ఏం లభిస్తుంది? విశ్వ సామ్రాజ్యము. అక్కడ మీరు ధనవంతులుగా అవుతారు, విశ్వ రాజ్యము లభిస్తుంది. మళ్లీ పేదవారుగా అవుతారు, భక్తిమార్గము ప్రారంభమవుతుంది. మళ్లీ లక్ష్మిని స్మృతి చేస్తారు. ప్రతి సంవత్సరము లక్ష్మికి పూజ కూడా జరుగుతుంది, ప్రతి సంవత్సరము లక్ష్మిని పిలుస్తారు, కాని జగదంబను పిలువరు. జగదంబకు సదా పూజ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అంబ మందిరానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు జగదంబను కలుసుకోవచ్చు. మీరు కూడా జగదంబలే కదా. మీరు అందరికీ విశ్వానికి అధిపతులుగా అయ్యే మార్గాన్ని తెలియజేసేవారు. జగదంబ వద్దకు వెళ్లి అన్నీ వేడుకుంటారు, లక్ష్మిని కేవలం ధనాన్ని మాత్రమే కోరుకుంటారు. అన్ని కోరికలను జగదంబ ముందుంచుతారు. మీరు తండ్రి పిల్లలుగా అయిందున ఇప్పుడు మీది అందరికంటే శ్రేష్ఠమైన స్థానము. తండ్రి వారసత్వమునిస్తారు.
ఇప్పుడు మీది ఈశ్వరీయ సంప్రదాయము. తర్వాత దైవీ సంప్రదాయము వారిగా అవుతారు. ఈ సమయములోని సర్వ మనోకామనలు భవిష్యత్తులో పూర్తి అవుతాయి. మనుష్యులకు కోరికలుంటాయి కదా. మీ కోరికలన్నీ పూర్తి అవుతాయి. ఇది ఆసురీ ప్రపంచము. ఎంతమంది పిలల్లకు జన్మనిస్తారో చూడండి. సత్యయుగములో కృష్ణుని జన్మ ఎలా జరుగుతుందో పిల్లలైన మీకు సాక్షాత్కారము చేయించబడ్తుంది. అక్కడ అన్నీ నియమానుసారంగా జరుగుతాయి. దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. దాని పేరే సుఖధామము. మీరు అనేకసార్లు సుఖము అనుభవించారు, అనేకసార్లు ఓడిపోయారు, అనేకసార్లు విజయం కూడా పొందారు. మమ్ములను బాబా చదివిస్తారని ఇప్పుడు స్మృతి కలిగింది. పాఠశాలలో జ్ఞానము చదువుకుంటూ, దానితో పాటు మర్యాదలు కూడా నేర్చుకుంటారు కదా. కాని అక్కడ ఎవరూ ఈ లక్ష్మీనారాయణుల వంటి మర్యాదలు నేర్చుకోరు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. సర్వగుణ సంపన్నులు,.......... అని వారి మహిమనే గానము చేస్తారు. కనుక ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. పిల్లలైన మీకు మీ జీవితము పై విసుగు రాకూడదు, ఎందుకంటే ఇది వజ్ర సమానమైన జన్మగా మహిమ చేయబడింది. దీనిని సంభాళన కూడా చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానము వింటూ ఉంటారు. అనారోగ్యములో కూడా వినవచ్చు. తండ్రిని స్మృతి చేయవచ్చు. ఇక్కడ ఎన్ని రోజులు జీవించి ఉంటారో, అన్ని రోజులు సుఖంగా ఉంటారు. సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారాలు సమాప్తమవుతూ ఉంటాయి. బాబా సత్యయుగము ఎప్పుడు వస్తుంది? అని పిల్లలు అడుగుతారు. ఇది చాలా మురికి ప్రపంచము. తండ్రి చెప్తారు - అరే! మొదట కర్మాతీత స్థితిని తయారు చేసుకోండి. సాధ్యమైనంత ఎక్కువగా పురుషార్థము చేస్తూ ఉండండి. శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు నేర్పించాలి. ఇది అవ్యభిచారి స్మృతి. ఒక్క శివుని మాత్రమే భక్తి చేయాలి, అదే అవ్యభిచారమైన భక్తి, సతోప్రధాన భక్తి. దేవీ దేవతలను స్మృతి చేయడం సతో(సాత్విక) భక్తి. కూర్చుంటూ - లేస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఓ పతితపావనా, ఓ ముక్తిదాతా, ఓ మార్గదర్శకా!......... అని పిల్లలే పిలుస్తారు. ఇలా అనేది ఆత్మనే కదా.
ఇప్పుడు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు - ఓ దు:ఖహర్తా-సుఖకర్తా రండి, వచ్చి దు:ఖము నుండి విడిపించండి. ముక్తినివ్వండి, శాంతిధామానికి తీసుకెళ్లండి అని మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. మిమ్ములను శాంతిధామానికి తీసుకెళ్తాను, తర్వాత సుఖధామములో మీ జతలో ఉండను. ఇప్పుడు మాత్రమే తోడు ఉంటాను. ఆత్మలందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు నేను చదివించేందుకు జతలో ఉంటాను తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు జతలో ఉంటాను, అంతే. పిల్లలైన మీకు నా పరిచయాన్ని చాలా బాగా వినిపిస్తాను, ఎవరు ఎలా పురుషార్థము చేస్తారో, దాని అనుసారంగా అక్కడ ప్రాలబ్ధాన్ని పొందుతారు. తండ్రి చాలా వివేకమునిస్తారు. సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఆత్మకు ఇటువంటి రెక్కలేవీ ఉండవు. ఆత్మ ఒక చిన్న బిందువు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా రచింపబడి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ ఆత్మ పరిచయమూ లేదు, పరమాత్ముని పరిచయమూ లేదు. తండ్రి చెప్తున్నారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా ద్వారానే నన్ను గురించి, నా రచనను గురించి తెలుసుకోగలరు. నేనే స్వయంగా వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను. దీనిని ఆత్మానుభూతి అని అంటారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. భృకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్రమైన నక్షత్రము,......... అని కూడా అంటారు. కాని ఆత్మ ఎలాంటి వస్తువో ఎవ్వరికీ తెలియదు. ఆత్మ సాక్షాత్కారము కలగాలి అని ఎవరైనా అన్నప్పుడు, వారికి అర్థం చేయించండి - భృకుటి మధ్యలో నక్షత్రముందని మీరు అంటారు. నక్షత్రాన్ని ఏం చూస్తారు? నక్షత్రపు తిలకమునే పెడతారు. చంద్రునిలో కూడా నక్షత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి ఆత్మ ఒక నక్షత్రము. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - మీరు జ్ఞాన నక్షత్రాలు మిగిలిన ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ నాటక రంగానికి ప్రకాశాన్నిచ్చేవి. అవి దేవతలు కావు. భక్తి మార్గములో సూర్యునికి కూడా నీటిని అర్పిస్తారు(అర్ఘ్యమిస్తారు). భక్తిమార్గములో ఈ బాబా కూడా అన్నీ చేసేవారు. సూర్యదేవతాయ నమ:, చంద్రదేవతాయ నమ:, అని చెప్పి అర్ఘ్యమిచ్చేవారు. ఇదంతా భక్తి మార్గము. ఇతను చాలా భక్తి చేశాడు. నంబరువన్ పూజ్యులుగా ఉండేవాడు మళ్లీ నంబర్‌వన్ పూజారిగా అయ్యాడు. నంబరు లెక్కపెడతారు కదా. రుద్రమాలలోని నంబరు కూడా ఉంది కదా. భక్తి కూడా అందరికంటే ఎక్కువగా ఇతనే చేశాడు. ఇప్పుడు తండ్రి చెప్తారు - చిన్న, పెద్ద అందరిదీ వానప్రస్థ స్థితియే. ఇప్పుడు నేను అందరినీ తీసుకెళ్తాను, మళ్లీ ఇక్కడకు రానే రారు. శాస్త్రాలలో ఏమి చూపిస్తారో - ప్రళయము జరిగింది, జలమయమైపోయింది, మళ్లీ రాగి ఆకు పై కృష్ణుడు వచ్చాడు,....... తండ్రి అర్థం చేయిస్తున్నారు - సాగరము మాటే లేదు. అక్కడ గర్భ మహలు ఉంటుంది, అందులో పిల్లలు చాలా సుఖంగా ఉంటారు. ఇక్కడ గర్భ జైలు అని అంటారు. పాపాలకు శిక్ష, గర్భములోనే లభిస్తుంది. అయినా 'మన్మనాభవ' నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. మెట్ల చిత్రములో వేరే ధర్మాలను ఎందుకు చూపించలేదని ప్రదర్శనీలలో ఎవరైనా ప్రశ్నిస్తారు. వారికి చెప్పండి - ఇతరులకు 84 జన్మలు లేనే లేవు. అన్ని ధర్మాలు వృక్షములో చూపించారు, దాని ద్వారా నేను ఎన్ని జన్మలు తీసుకొని ఉంటానని మీరు మీ లెక్క తీయండి. 84 జన్మల సీఢీని చూపించాలి. మిగిలినవన్నీ చక్రములో, వృక్షములో చూపించారు. వీటిలో అన్ని విషయాలను అర్థం చేయించారు. ప్రపంచ పటము(మ్యాప్) చూసిినప్పుడు లండన్ ఎక్కడుందో, ఫలానా పట్టణము ఎక్కడుందో బుద్ధిలోకి వస్తుంది కదా. తండ్రి ఎంతో సహజము చేసి అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రము ఇలా తిరుగుతుంది అని అందరికీ తెలియజేయండి. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. కనుక బేహద్ తండ్రిని స్మృతి చేయండి, మీరు పావనంగా అవుతారు, పావనంగా అయి పావన ప్రపంచములోకి వెళ్ళిపోతారు. కష్టపడే విషయమేదీ లేదు. ఎంత సమయము లభిస్తుందో అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పక్కా అలవాటు అవుతుంది. తండ్రి స్మృతిలో మీరు ఢిల్లీ వరకు నడిచి వెళ్లినా అలసట కలగదు. సత్యమైన స్మృతి ఉన్నట్లయితే, దేహ భావన తొలగిపోతుంది, తర్వాత అలసట కలగదు. చివరిలో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీక్షణంగా వెళ్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండి, దేహ భావమును సమాప్తము చేయాలి. మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునే పురుషార్థము చేయాలి. ఈ శరీరములో ఉంటూ అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి.
2. జ్ఞానయుక్త ఆత్మలుగా అయి ఇతరులకు సేవ చేయాలి. తండ్రి నుండి ఏమి విన్నారో, దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. 5 వికారాలను దానమిచ్చి రాహు గ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి.
వరదానము :- '' మనసా శక్తిని అనుభవం చేయడం ద్వారా విశాల కార్యములో సదా సహయోగీ భవ ''
ప్రకృతిని, తమోగుణి ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చేయడం మరియు అనవసర రక్తపాత వాయుమండలం వైబ్రేషన్లతో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం, ఇతర ఆత్మలకు సహయోగమివ్వడం, నూతన సృష్టిలో నూతన రచనను యోగబలముతో ప్రారంభించడం మొదలైన విశాల కార్యాలన్నిటి కొరకు మనసా శక్తి ఆవశ్యకత చాలా ఉంది. మనసా శక్తి ద్వారానే మీ అంతము శోభాయమానంగా ఉంటుంది. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఒక్కరితోనే లైన్ క్లియర్‌గా ఉండాలి - ఇప్పుడు దీని అనుభవీలుగా అవ్వండి. అప్పుడు బైహద్ కార్యములో సహయోగిగా అయి బేహద్ విశ్వరాజ్యాధికారిగా అవుతారు.
స్లోగన్ :- '' నిర్భయత మరియు నమ్రతలే యోగి మరియు జ్ఞానీ ఆత్మల స్వరూపము ''
No comments:
Post a Comment