Thursday, February 20, 2020

Telugu Murli 20/02/2020

20-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - ఈశ్వరీయ సేవాధారులైన మీరే సత్యమైన ముక్తి దళము(సైన్యము). మీరు అందరికీ శాంతి ద్వారా ముక్తినివ్వాలి, పరిష్కారమునివ్వాలి. ''

ప్రశ్న:- ఎవరైనా మిమ్ములను శాంతికి మార్గము అడిగినచో వారికి ఏమని అర్థం చేయించాలి?
జవాబు:- వారికి ఇలా చెప్పండి - మీకు ఇప్పుడే ఇక్కడ శాంతి కావాలా? అని బాబా అడుగుతున్నారు. ఇది శాంతిధామము కాదు. శాంతి అయితే శాంతిధామములోనే ఉంటుంది. దానిని మూలవతనమని అంటారు. ఆత్మకు శరీరము లేనప్పుడు శాంతిగా ఉంటుంది. సత్యయుగములో పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉంటాయి. ఆ తండ్రే వచ్చి ఈ వారసత్వమునిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 'మాలో ఆత్మ ఉందని' మనుష్యులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మనమంతా ఆత్మలము, ఆ తర్వాత శరీరాలు లభిస్తాయి. ఎవ్వరూ తమ ఆత్మను చూడలేదు. కేవలం ఆత్మలమని తెలుసు ఎలాగైతే ఆత్మను గురించి తెలుసుకోవడమే కాని ఎవ్వరూ చూడలేదో, అలా పరమపిత పరమాత్మను గురించి కూడా అతను అత్యంత ఉన్నతమైన ఆత్మ(పరమ ఆత్మ) అనగా పరమాత్మ అని అంటారు, కానీ వారిని ఎవ్వరూ చూడలేదు. స్వయాన్ని గానీ, తండ్రిని గానీ ఎవ్వరూ చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అంటారు. కానీ యదార్థంగా ఎవ్వరికీ తెలియదు. 84 లక్షల యోనులని కూడా అంటారు. కానీ వాస్తవానికి 84 జన్మలే ఉంటాయి. కానీ ఏ ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది కానీ వారిని చూడలేదు, యదార్థంగా తెలియదు. మొదట ఆత్మను గురించి యదార్థంగా తెలుసుకుంటే తండ్రిని తెలుకోగలరు. మరి స్వయాన్ని గూర్చే తెలియకుంటే ఎవరు అర్థం చేయిస్తారు. దానినే సెల్ఫ్ రియలైజేషన్(ఆత్మానుభూతి) అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మానుభూతిని చేయించలేరు. ఆత్మ అనగా ఏమి? ఎలా ఉంటుంది? ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది? ఎలా జన్మ తీసుకుంటుంది? ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. స్వయం గురించి తెలియనందున తండ్రిని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మ్మీనారాయణులు కూడా మనుష్యుల పదవులే కదా. కాని వీరు ఆ పదవిని ఎలా పొందారో ఎవ్వరికీ తెలియదు. మనుష్యులే కదా తెలుసుకోవలసింది? వీరు వైకుంఠానికి యజమానులు అని అంటారు కూడా. కానీ వారు ఈ అధికారము ఎలా తీసుకున్నారో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఇంతకు ముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. చిన్న పిల్లలకు మొదట బ్యారిస్టర్ అంటే ఏమిటో తెలుస్తుందా? కాని చదువుకుంటూ చదువుకుంటూ బ్యారిష్టరుగా అయిపోతారు. అంటే ఈ లక్ష్మ్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఇలా అయ్యారు. బ్యారిష్టరు, డాక్టరు మొదలైన వాటన్నిటికీ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా. అలాగే వీరి పుస్తకము గీత. అది కూడా వినిపించింది ఎవరో, రాజయోగము ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదు. దానిలో పేరు మార్చేశారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి మిమ్ములను కృష్ణపురానికి యజమానులుగా చేస్తారు. కృష్ణుడు స్వర్గానికి అధికారి కదా, కానీ స్వర్గమంటే ఏమిటో కూడా తెలియదు. అలా తెలిసి ఉంటే కృష్ణుడు ద్వాపర యుగములో గీత వినిపించాడని ఎందుకు అంటారు? కృష్ణుని ద్వాపర యుగములోకి, లక్ష్మీనారాయణులను సత్యయుగములోకి, రాముని త్రేతా యుగములోకి తీసుకెళ్లారు. లక్ష్మీనారాయణుల రాజ్యములో ఉపద్రవాలున్నట్లు చూపించరు. కాని కృష్ణుని రాజ్యములో కంసుని, రాముని రాజ్యములో రావణుని మొదలైనవారిని చూపించారు. రాధా-కృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. పూర్తి అజ్ఞాన అంధకారములో ఉన్నారు. అజ్ఞానాన్ని అంధకారమని అంటారు. జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు ప్రకాశవంతముగా చేసేదెవరు? వారు మన తండ్రి. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. ఈ భక్తిమార్గము కూడా జన్మ-జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చిందని ఇప్పుడు మీకు తెలుసు. మెట్లు(తాపలు/ సోపానాలు) దిగుతూ వచ్చారు. కళలు తగ్గిపోతూ వస్తాయి. కొత్త ఇల్లు తయారవుతుంది. తర్వాత కాలము గడిచే కొలది ఆయువు తగ్గిపోతూ వస్తుంది. మూడు వంతులు పాతబడ్డాక దానిని పాతదనే అంటారు. మొదట వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు నిశ్చయముండాలి. వారే సర్వులకు సద్గతినిచ్చేవారు, అందరినీ చదువు కూడా చదివిస్తున్నారు. అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తారు. మీకు లక్ష్యముంది. ఈ చదువు పూర్తి అయిన తర్వాత మీరు మీ సింహాసనము పై కూర్చుంటారు. మిగిలినవారందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తారు. చక్రమును చూపించి అర్థం చేయించినప్పుడు సత్యయుగములో అనేక ధర్మాలు లేనే లేవని చెప్పాలి. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచములో ఉంటాయని తెలపాలి. ఈ ఆకాశము ఒక తత్వమని(పోలార్) మీకు తెలుసు. గాలిని, గాలి అని అంటారు, ఆకాశాన్ని ఆకాశమని అంటారు. అందరిని పరమాత్మ అని అనము. మానవులు వాయువులోనూ, ఆకాశములోనూ భగవంతుడున్నాడని భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. తండ్రి వద్ద జన్మ ఏమో తీసుకున్నారు, ఆ తర్వాత చదివించేదెవరు? ఆ తండ్ర్రే ఆత్మిక టీచరుగా అయి మిమ్ములను చదివిస్తారు. బాగా చదువుకొని ఈ చదువును పూర్త్తి చేస్తే వెంట తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యయుగములో మొట్టమొదట ఇక్కడకు వచ్చింది మీరే. ఇప్పుడు మళ్లీ అంతిమ జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మళ్లీ ప్రారంభంలోనే వస్తారు. ఇప్పుడు పరుగు తీయండని తండ్రి చెప్తున్నారు. తండ్రిని బాగా స్మృతి చేసి ఇతరులను కూడా బాగా చదివించండి. అలా చేయకుంటే ఇంతమందిని చదివించేదెవరు? తండ్రికి తప్పకుండా సహాయకారులుగా అవుతారు కదా. ఈశ్వరీయ సేవాధారులని పేరు కూడా ఉంది కదా. ఆంగ్లములో సాల్వేషన్ ఆర్మీ( ముక్తిదళము) అని అంటారు. ఏ సాల్వేషన్ కావాలి? అందరూ శాంతిని పరిష్కారంగా కోరుకుంటున్నారు. ఇతరులెవ్వరూ శాంతినివ్వలేరు. శాంతిని కోరేవారికి ఇప్పుడు ఇంకా మీకు ఇక్కడే శాంతి కావాలా? అని తండ్రి అడుగుతున్నారని చెప్పండి. శాంతిగా ఉండాలి కానీ ఇది శాంతిధామము కాదు అని చెప్పండి. శాంతి శాంతిధామములోనే ఉంటుంది. దానిని మూలవతనము అని కూడా అంటారు. ఆత్మ శరీరములో లేనప్పుడు శాంతిగా ఉంటుంది. తండ్రి స్వయంగా వచ్చి ఈ వారసత్వమునిస్తారు. ఇతరులకు అర్థం చేయించే యుక్తి మీకు కావాలి. ఎగ్జిబిషన్లో నిలబడి అందరూ చెప్పెేది వింటే చాలా తప్పులు దొరుకుతాయి. ఎందుకంటే అర్థం చేయించేవారు నంబరువారుగా ఉన్నారు కదా. అందరూ ఏకరస స్థితిలో ఉంటే బ్రాహ్మణీ ఫలానావారినే పంపమని ఎందుకు వ్రాస్తారు? అరే! మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా మాలో ఫలానావారు మా కంటే చాలా చురుకైనవారని అంటారు. చురుకుదనము, తెలివితేటలతోనే మనుష్యులు హోదాను పొందుతారు కదా. నంబరువారుగా ఉన్నారు కదా. పరీక్షా ఫలితాలు వెలువడ్త్తే మీవి మీకే సాక్షాత్కారమవుతాయి. మేము శ్రీమతము పై నడుచుకోలేదని అప్పుడు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు - ఇప్పుడు ఏ వికర్మలూ చేయకండి. దేహధారుల పై ఆకర్షణ ఉంచుకోకండి. ఇది పంచ తత్వాలతో తయారైన శరీరము కదా. పంచ తత్వాలను పూజించరాదు, స్మృతి చేయరాదు. భలే ఈ కనులతో చూడండి కానీ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మకు ఇప్పుడు జ్ఞానము లభించింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్లి మళ్లీ వైకుంఠములో వస్తామని మీకు తెలుసు. ఆత్మను అర్థం చేసుకోవచ్చు గానీ చూడలేము. అలాగే ఇది కూడా అర్థము చేసుకోగలరు. దివ్యదృష్టి ద్వారా మీ ఇంటిని గానీ, స్వర్గాన్ని గానీ చూడవచ్చు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మన్మనాభవ, మధ్యాజీభవ అనగా తండ్రిని మరియు విష్ణుపురమును స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యము. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లాలని మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్లాలని పిల్లలైన మీకు తెలుసు. అందరూ సత్యయుగములోకి రాలేరు. మీది దైవీ మతము, అది ఇప్పుడు మానవ ధర్మంగా అయిపోయింది. మూలవతనములో అయితే మనుష్యులు లేరు కదా. ఇది మానవ సృష్టి. మనుష్యులే తమోప్రధానంగా, మళ్లీ సతోప్రధానంగా అవుతారు. మీరు మొదట శూద్ర వర్ణములో ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసుల కోరకే. ఇతర ధర్మాలలో ఇలా బ్రాహ్మణ వంశము, సూర్య వంశము అని అనరు. ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి చెందినవారే. శిథిలావస్థకు చేరుకున్నారు. మీరు పురాతనమై పోయినందున వృక్షమంతా శిథిలావస్థకు, తమోప్రధాన స్థితికి చేరుకుంది. వృక్షమంతా ఉన్నదున్నట్లే సతోప్రధానంగా అవ్వదు. సతోప్రధానమైన నూతన వృక్షములో కేవలం దేవీదేవతా ధర్మము వారే ఉంటారు. మీరు మళ్లీ సూర్యవంశము నుండి చంద్ర వంశీయులుగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. తర్వాత వైశ్య, శూద్ర వంశీయులుగా అవుతారు. ఇవన్నీ కొత్త విషయాలు.

మనలను చదివించేవారు జ్ఞానసాగరులు, వారే పతితపావనులు, సర్వుల సద్గతిదాత. తండ్రి చెప్తున్నారు - నేను మీకు జ్ఞానమునిస్తున్నాను. మీరు దేవీ దేవతలుగా అవుతారు. ఆ తర్వాత ఈ జ్ఞానము ఉండదు. జ్ఞానము లేని వారికి జ్ఞానము ఇవ్వబడ్తుంది. మానవులందరూ అజ్ఞాన అంధకారములో ఉన్నారు. మీరు ప్రకాశములో ఉన్నారు. వీరి(లక్ష్మినారాయణుల) 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు? మోక్షము లభించదా! అని మనుష్యులు అడుగుతారు. అరే! ఇది తయారైన డ్రామా. అనాది డ్రామా కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరము తీసుకుంటుందని మీకు తెలుసు. ఇందులో చింతించే పని లేదు. ఆత్మ వెళ్ళి మరో పాత్రను అభినయిస్తుంది. వాపసు వస్తుందంటే ఏడ్వవచ్చు, రాదని తెలుసు. మరి ఏడ్వడం వలన లాభమేమి? ఇప్పుడు మీరంతా మోహజీతులుగా అవ్వాలి. శ్మశానము పై మోహము ఎందుకు? ఇందులో దు:ఖమే దు:ఖముంది. ఈ రోజు పిల్లలుగా ఉంటారు, ఆ పిల్లలే తండ్రి తలపాగాను(గౌరవము) తీసేందుకు కూడా వెనుకాడరు. తండ్రితోనే కొట్లాడ్తారు. అందుకే దీనిని దిక్కులేని అనాథ ప్రపంచమని అంటారు. శిక్షణనిచ్చే పెద్దలు ఎవ్వరూ లేరు. ఇటువంటి స్థితిని గమనించినప్పుడు మళ్లీ సనాథలుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆ తండ్రే వచ్చి అందరికీ ఆధారమునిచ్చి సనాథలుగా చేస్తారు. ఆ గొప్ప తండ్రి వచ్చి అందరి జగడాలు, గొడవలు సమాప్తము చేస్తారు. సత్యయుగములో జగడాలే ఉండవు. ప్రపంచములోని జగడాలన్నీ నశింపజేస్తారు. తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇక్కడ మాతల మెజారిటీ ఉంది. మాతలను దాసీలుగా భావిస్తారు. కంకణము కట్టేటప్పుడు ''నాకు ప్రత్యక్ష దైవము, ఈశ్వరుడు, గురువు, సర్వస్వము పతియే'' అని ప్రతిజ చేయిస్తారు. మొదట మిస్టర్, తర్వాత మిసెస్ అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందుంచుతున్నారు. మిమ్ములను ఎవ్వరూ జయించలేరు. మీకు తండ్రి అన్ని నియమాలు అర్థం చేయిస్తున్నారు. మోహజీత్ రాజు కథ కూడా ఒకటి ఉంది. అవన్నీ కట్టుకథలు. సత్యయుగంలో అకాల మృత్యువే ఉండదు. సమయము వస్తూనే ఒక శరీరము వదిలి మరొక శరీరము తీసుకుంటారు. ఈ శరీరము ముసలిదైపోయిందని, కొత్తది తీసుకోవాలని, చిన్న బాలునిగా జన్మ తీసుకోవాలని వారికి ముందే సాక్షాత్కారమవుతుంది. ఇక్కడ ఎంత ముసలివారైనా, రోగులైనా ఈ శరీరము వదిలితే మంచిదని అనుకుంటారు కానీ మరణించేటప్పుడు తప్పకుండా ఏడుస్తారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు సుఖమయ ప్రపంచానికి వెళ్తున్నారని తండ్రి చెప్తున్నారు. అక్కడ సంతోషమే సంతోషముంటుంది. మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషముండాలి! మనము ఈ విశ్వమంతటికీ అధికారులుగా అవుతాము! భారతదేశము ఒకప్పుడు విశ్వమంతటికీ అధికారి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భగవంతుడు తానే పూజ్యునిగా, తానే పూజారిగా అవ్వడు. వారు కూడా పూజారిగా అయితే పూజ్యులుగా చేసేదెవరు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరుగా ఉంది. వారొక్కరే జ్ఞానసాగరులు. అందువలన మహిమ వారొక్కరిదే. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఎప్పుడు వచ్చి ఇస్తారు? ఇచ్చేందుకు ఇక్కడకు తప్పనిసరిగా రావలసి పడ్తుంది. మొదట మనలను చదివించేదెవరో బుద్ధిలో బాగా కూర్చోబెట్టండి.

త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రము, కల్పవృక్షము - ఈ మూడు ముఖ్యమైన చిత్రాలు. వృక్షమును చూస్తూనే మనము ఏ ధర్మానికి చెందినవారమని వెంటనే తెలిసిపోతుంది. ఈ ధర్మము ద్వారా మనము సత్యయుగములోకి రాలేమని వెంటనే అర్థము చేెసుకుంటారు. ఈ చక్రము చాలా పెద్దదిగా ఉండాలి. అందులో పూర్తి వివరము వ్రాసి ఉండాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మము లేక నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు. శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము తర్వాత నూతన ప్రపంచాన్ని విష్ణువు ద్వారా పాలన చేయిస్తారని నిరూపించాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. వీరిరువురికి సంబంధముంది కదా. బ్రహ్మ, సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఉన్నతమయ్యే కళ ఒకే జన్మలో జరుగుతుంది. క్రిందికి దిగే కళకు 84 జన్మలు పడ్తుంది. ఇప్పుడు తండ్రి - ''ఆ శాస్తాలు రైటా? నేను రైటా?'' అని అడుగుతున్నారు. సత్యమైన సత్యనారాయణ కథను నేనే వినిపిస్తాను. సత్యమైన తండ్రి ద్వారా సత్య నారాయణునిగా అవుతున్నామని ఇప్పుడు మీకు నిశ్చయముంది. మొదట ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే తండ్రి, టీచరు, గురువు అని మహిమ చేయబడే మనుష్యులెవ్వరూ లేరు. గురువును ఎవరన్నా తండ్రి లేక టీచరు అని అంటారా? ఇక్కడ శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు, వారే మనలను చదివిస్తారు, వారే వెంట తీసుెళ్తారు. తండ్రి, టీచరు, గురువు అని పిలువబడే మనుష్యులు ఎవ్వరూ ఉండరు. అలాంటివారు ఆ తండ్రి ఒక్కరే. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ అలా సుప్రీమ్ ఫాదర్ అని అనరు. తండ్రిని అందరూ దు:ఖములోనే స్మృతి చేస్తారు. సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఆ తండ్రే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పంచ తత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తున్నా ఆ తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహధారి పైనా ఆకర్షణ(మోహము) ఉండరాదు, ఏ వికర్మలూ చేయరాదు.
2. ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదే అయిన అనాది పాత్ర ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు. మోహజీతులుగా అవ్వాలి.

వరదానము:- '' బాహ్యముఖ చతురత నుండి ముక్తంగా ఉండే తండ్రికి ఇష్టమైన సత్యమైన సౌదాగర్ (వ్యాపారి) భవ ''
బాప్దాదాకు ప్రపంచంలోని బాహ్యముఖత ఇష్టముండదు. వారిని అమాయకుల భగవంతుడని అంటారు. చతురుడైన తండ్రిని అమాయకులైన పిల్లలే ఇష్టపడ్తారు. పరమాత్మ డైరక్టరీలో అమాయకమైన పిల్లలే ఇష్టమైనవారు. పరమాత్మ డైరక్టరీలో అమాయకమైన పిల్లలే విశేషమైన వి.ఐ.పిలు. ప్రపంచంలోని వారి కన్ను ఎవరి మీద పడదో, వారే తండ్రితో వ్యాపారము చేసి పరమాత్మ కంటి నక్షత్రాలుగా(కంటి పాపలుగా) అయ్యారు. అమాయకమైన పిల్లలే హృదయపూర్వకంగా 'మేరా బాబా' అని అంటారు. ఒక్క సెకండులో, ఒకే మాటలో లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారము చేసే సత్యమైన వ్యాపారస్థులుగా అయ్యారు.

స్లోగన్:- '' అందరి స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే, నోటితో సదా మధురమైన మాటలే మాట్లాడండి. ''

1 comment:

  1. This is how my colleague Wesley Virgin's report starts with this shocking and controversial VIDEO.

    As a matter of fact, Wesley was in the military-and soon after leaving-he discovered hidden, "MIND CONTROL" tactics that the CIA and others used to obtain whatever they want.

    THESE are the EXACT same methods many celebrities (notably those who "come out of nothing") and top business people used to become wealthy and famous.

    You probably know that you only use 10% of your brain.

    That's mostly because most of your brain's power is UNCONSCIOUS.

    Perhaps this conversation has even taken place INSIDE your own brain... as it did in my good friend Wesley Virgin's brain around 7 years ago, while driving an unlicensed, garbage bucket of a car without a license and with $3.20 on his bank card.

    "I'm very fed up with living paycheck to paycheck! When will I become successful?"

    You took part in those types of conversations, ain't it right?

    Your success story is waiting to be written. All you have to do is in YOURSELF.

    UNLOCK YOUR SECRET BRAINPOWER

    ReplyDelete