Sunday, February 16, 2020

Telugu Murli 17/02/2020

17-02-20

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేస్తారు. మీరు వాటిని మళ్లీ ఇతరులకు దానమిస్తూ ఉండండి, ఈ దానము ద్వారాసద్గతి జరుగుతుంది. ''

ప్రశ్న:- పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియని నూతన మార్గమేది ?
జవాబు:- ఇంటికి పోయే మార్గము లేక స్వర్గానికి వెళ్లే మార్గము తండ్రి ద్వారా ఇప్పుడు మీకు లభించింది. శాంతిధామము మన ఆత్మలందరి ఇల్లు అని మీకు తెలుసు. స్వర్గము వేరు, శాంతిధామము వేరు. ఈ నూతన మార్గము మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ''ఇప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి, కనులు తెరవండి, పవిత్రమవ్వండి'' అని మీరు చెప్తారు. పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్లగలరు.

గీతము:- మేలుకోండి ప్రేయసులారా ! మేల్కోండి,.......(జాగ్ సజనియా జాగ్,.........)
ఓంశాంతి. భగవానువాచ, తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను గానీ, దేవతలను గానీ భగవంతుడని అనరు. ఎందుకంటే వారికి సాకార రూపముంది. పరమపిత పరమాత్మకు ఆకార రూపము గానీ, సాకార రూపము గానీ లేవు. అందుకే వారిని శివపరమాత్మాయ నమ: అని అంటారు. జ్ఞానసాగరులు వారొక్కరు మాత్రమే. ఏ మనిషిలోనూ జ్ఞానము లేదు. దేని జ్ఞానము? రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము అనగా ఆత్మ-పరమాత్మల జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. తండ్రి వచ్చి, '' ఓ ప్రేయసులారా! భక్తులారా! మేలుకోండి '' అని మేల్కొల్పుతున్నారు. స్త్రీ-పురుషులందరూ భక్తులే. భగవంతుని స్మృతి చేస్తారు. వధువులంతా ఒక్క వరుని మాత్రమే స్మృతి చేస్తారు. ప్రేయసులైన ఆత్మలంతా ప్రియుడైన పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. అందరూ సీతలే. రాముడు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. రాముడనే పదము ఎందుకు వాడ్తారు. రావణ రాజ్యముంది కదా అందువలన దానిని పోల్చేందుకు రామరాజ్యమని అంటారు. రాముడు అనగా తండ్రి. వారిని ఈశ్వరుడని కూడా అంటారు, భగవంతుడని కూడా అంటారు. వారి వాస్తవిక నామము శివుడు. ఇప్పుడు వారు ''మేలుకోండి, నూతన యుగము వస్తూ ఉంది, పాతదంతా సమాప్తమైపోతుంది '' అని అంటున్నారు. ఈ మహాభారత యుద్ధము తర్వాత సత్యయుగము స్థాపనవుతుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. కలియుగము సమాప్తమైపోతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి, కనులు తెరవండి. నూతన ప్రపంచము వస్తుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, సత్యయుగమని అంటారు. ఇది కొత్త మార్గము. ఇంటికి లేక స్వర్గానికి వెళ్లే దారి ఎవ్వరికీ తెలియదు. స్వర్గము వేరు, ఆత్మలుండే శాంతిధామము వేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మేలుకోండి, మీరు రావణరాజ్యములో పతితులైపోయారు. ఈ సమయంలో ఒక్క పవిత్రాత్మ కూడా లేదు. ఒక్కరిని కూడా పుణ్యాత్మ అని అనరు. భలే మానవులు దాన-పుణ్యాలు చేస్తారు. కాని ఒక్క పవిత్రాత్మ కూడా లేదు. ఇక్కడ కలియుగములో ఉన్న వారంతా పతితాత్మలే. సత్యయుగంలో పావనాత్మలుంటారు. అందుకే ''ఓ శివబాబా, మీరు వచ్చి మమ్ములను పావనాత్మగా చేయండి'' అని అంటారు. ఇది పవిత్రత విషయము. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి పిల్లలైన మీకు అవినాశి జ్ఞానరత్నాల దానమిస్తున్నారు. మీరు కూడా ఇతరులకు దానమిస్తూ ఉండండని అంటారు. అలా చేస్తూ ఉంటే మీకు పట్టిన పంచవికారాల గ్రహణము వదిలిపోతుంది. పంచవికారాలు దానమిస్తే దు:ఖమనే గ్రహణము వదిలిపోతుంది. పవిత్ర్రంగా అయి సుఖధామములోకి వెళ్తారు. పంచ వికారాలలో నంబరువన్ కామము. దానిని వదిలి పవిత్రులవ్వండి. స్వయం వారు కూడా ''ఓ పతితపావనా! మమ్ములను పావనము చేయండి'' అని అంటారు. వికారులను పతితులని అంటారు. ఈ సుఖ- దు:ఖాల ఆట భారతదేశము కొరకే. తండ్రి భారతదేశములోనే వచ్చి ఈ సాధారణ శరీరములో ప్రవేశించి వీరి చరిత్రను కూడా వినిపిస్తారు. వీరంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. ప్రజాపిత బ్రహ్మకు సంతానము. మీరు అందరికీ పవిత్రంగా అయ్యే యుక్తి తెలుపుతారు. బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలైన మీరు వికారాలకు వశమవ్వరాదు. బ్రాహ్మణ జన్మ ఇది ఒక్కటి మాత్రమే. దేవతా వర్ణములో మీరు 20 జన్మలు తీసుకుంటారు. వైశ్య-శూద్ర వర్ణాలలో 63 జన్మలు తీసుకుంటారు. బ్రాహ్మణ వర్ణానికి ఇది ఒక్కటే అంతిమ జన్మ. ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటున్నారు. తండ్రి స్మృతితో అనగా యోగబలముతో వికర్మలు భస్మమౌతాయి. ఈ ఒక్క జన్మలోనే పవిత్రమవ్వాలి. సత్యయుగములో పతితులెవ్వరూ ఉండరు. ఈ అంతిమ జన్మలో పావనంగా అయితే 21 జన్మలు పావనంగా ఉంటారు. ఒకప్పుడు పావనంగా ఉండినవారు ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే నన్ను పిలుస్తారు. పతితులుగా చేసిందెవరు? రావణుని ఆసురీ మతము నుండి, రావణ రాజ్యము నుండి, దు:ఖము నుండి నేను తప్ప పిల్లలైన మిమ్ములను ఇతరులెవ్వరూ ముక్తులుగా చెయ్యలేరు. అందరూ కామచితి పై కూర్చొని భస్మమైపోయారు. నేను వచ్చి జ్ఞానచితి పై కూర్చోపెట్టవలసి వస్తుంది. జ్ఞాన జలము పోయవలసి వస్తుంది. అందరికీ సద్గతినివ్వాల్సి వస్తుంది. ఎవరు బాగా చదువుకుంటారో వారే సద్గతిని పొందుతారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్లిపోతారు. సత్యయుగములో కేవలం దేవీ దేవతలుంటారు. వారికి మాత్రమే సద్గతి లభించింది. మిగిలిన వారికంతా గతి అనగా ముక్తి లభిస్తుంది. 5 వేల సంవత్సరాల క్రితము ఈ దేవీ దేవతల రాజ్యముండేది. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మన్మనాభవ మంత్రము చాలా ప్రసిద్ధి చెందినది. భగవానువాచ - ఏ దేహధారిని భగవంతుడని అనరు. ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాయి. ఒకప్పుడు స్త్రీగా, ఒకప్పుడు పురుషునిగా అవుతారు. భగవంతుడు ఎప్పుడూ జనన-మరణముల ఆటలోకి రారు. ఇది డ్రామానుసారము నిర్ణయింపబడింది. ఒక జన్మకు, మరో జన్మకు సంబంధముండదు. ఈ జన్మ రిపీట్ అయినప్పుడు ఇదే పాత్ర, ఇవే రూపురేఖలు మళ్లీ వస్తాయి. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇది మారదు. శ్రీ కృష్ణునికి సత్యయుగములో ఏ శరీరముండేదో అదే మళ్లీ అక్కడ లభిస్తుంది. ఆ ఆత్మ అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము ఇలా(దేవతలుగా) అవుతామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల రూపురేఖలు ఖచ్ఛితమైనవి కావు. మళ్లీ వారే తయారవుతారు. ఈ విషయాలు కొత్తవారెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఎవరికైనా బాగా అర్థము చేయిస్తే 84 జన్మల చక్రాన్ని అర్థము చేసుకుంటారు. ప్రతి జన్మలోని నామ-రూపాలు, రూపురేఖలు అన్నీ వేరు వేరుగా ఉంటాయని అర్థము చేసుకుంటారు. ఇప్పుడివి ఇతని అంతిమ 84వ జన్మలోని రూపురేఖలు. అందుకే నారాయణుని రూపురేఖలు దాదాపు ఇలాగే(బ్రహ్మలాగే) చూపించబడ్డాయి. అలా చూపించకుంటే మనుష్యులు అర్థము చేసుకోలేరు.

మమ్మా బాబానే ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ పంచ తత్వాలు పవిత్రంగా లేవు. ఈ శరీరాలన్నీ ఇప్పుడు పతితంగా ఉన్నాయి. సత్యయుగములో శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. కృష్ణుడు అత్యంత సుందరమైనవాడని అంటారు. స్వాభావిక అందముంటుంది. ఇక్కడ విదేశాలలో మనుష్యులు తెల్లగా ఉంటారు. కాని వారిని దేవతలని అనరు. వారిలో దైవీగుణాలు లేవు కదా. ఆ తండ్రి ఎంతో బాగా అర్థము చేయిస్తున్నా రు - ఇది అత్యంత ఉన్నతమైన చదువు. దీని ద్వారా మీకు చాలా శ్రేష్ఠమైన సంపాదన జరుగుతుంది. లెక్కలేనన్ని వజ్ర వైఢూర్యాలు, నగలు, ధనము ఉంటాయి. అక్కడ వజ్ర వైఢూర్యాల భవనాలుండేవి. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. కనుక మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా అవుతారు. 21 జన్మలకు అపారమైన సంపాదన ఉంటుంది. ఇందుకొరకు చాలా శ్రమ చేయాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. మనమంతా ఆత్మలము, ఈ పాత శరీరాలను వదిలి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్లాలి. ఇప్పుడు తండ్రి మనలను తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆత్మలమైన మనము ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. లేకుంటే ఇది వినాశన సమయము. శిక్షలు అనుభవించి వాపస్ వెళ్లిపోతారు. అందరూ లెక్కాచారాన్ని పూర్తి చేసుకునే తీరాలి. భక్తిమార్గములో కాశి కల్వట్లో(కత్తుల బావిలో) దూకేవారు. అయినా ఏ ఒక్కరూ ముక్తిని పొందలేరు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. ఇందులో జీవఘాతము చేసుకునే అవసరము లేదు. వారిది జీవఘాతము అయినా ముక్తి పొందాలనే భావముంటుంది. కనుక పాపాల లెక్కాచారము చుక్తా అయి మళ్లీ ప్రారంభమవుతుంది. ఇప్పుడు కాశీలోని కత్తుల బావిలో దూకేందుకు సాహసము చేయరు. వారికి ముక్తి-జీవన్ముక్తి లభించదు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఆత్మలు వస్తూనే ఉంటాయి. మళ్లీ వాపస్ ఎలా పోతాయి? ఆ తండ్రియే వచ్చి అందరికి సద్గతి కలిగించి వాపస్ తీసుకెళ్తారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. సత్యయుగములో దీర్ఘాయువు ఉంటుంది. దు:ఖము మాటే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటుంది. సర్పము కుబుసము వదిలినట్లు శరీరాన్ని వదులుతారు. దానిని మరణించడం అని అనరు. దు:ఖపడే విషయమే ఉండదు. ఇప్పుడు సమయము పూర్తి అయిందని, ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు ఈ శరీరము నుండి వేరయ్యే అభ్యాసము ఇక్కడే చేయాలి. మనము ఆత్మలము, ఇప్పుడు ఇంటికి వెళ్లి మరలా నూతన ప్రపంచములోకి వస్తాము, నూతన శరీరము తీసుకుంటాము - ఈ అభ్యాసము చేయండి. ఆత్మ 84 శరీరాలు తీసుకుంటుందని మీకు తెలుసు. మనుష్యులు 84 లక్షల జన్మలని అన్నారు. తండ్రినైెతే లెక్కలేనన్ని రాయి-రప్పలలో ఉన్నారని అనేశారు. దీనిని ధర్మగ్లాని అని అంటారు. మనుష్యులు స్వచ్ఛ బుద్ధి గలవారి నుండి తుచ్ఛ బుద్ధి గలవారిగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తారు. స్మృతి ద్వారా స్వచ్ఛంగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నూతన యుగము వస్తుంది, దాని గుర్తే ఈ మహాభారత యుద్ధము. ఇది అప్పటి ముసలాల(మిస్సైల్స్) యుద్ధమే. ఇందులో అనేక ధర్మాలు వినాశనమై ఒకే దేవీ దేవతా ధర్మము స్థాపన జరిగింది. కనుక భగవంతుడే అలా స్థాపన చేసి ఉంటారు కదా. కృష్ణుడు ఇక్కడకు ఎలా వస్తాడు? జ్ఞానసాగరులు నిరాకారులా? కృష్ణుడా? కృష్ణునికి ఈ జ్ఞానమే ఉండదు. ఈ జ్ఞానము అదశ్యమైపోతుంది. భక్తిమార్గములో మీ చిత్రాలు కూడా తయారవుతాయి. పూజ్యులైన మీరే పూజారులుగా అవుతారు. కళలు తగ్గిపోతాయి. ఆయువు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే భోగులైపోతారు. అక్కడ యోగులుంటారు. అలాగని వారు స్మృతి చేస్తారని కాదు. అక్కడ ఉండేదే పవిత్రులు. కృష్ణుని కూడా యోగేశ్వరుడని అంటారు. ఇప్పుడు కృష్ణుని ఆత్మ తండ్రితో యోగము చేస్తూ ఉంది. కృష్ణుని ఆత్మ ఈ సమయములో యోగేశ్వరునిగా ఉంది. సత్యయుగములో యోగేశ్వరుడని అనరు. అక్కడ రాకుమారునిగా అవుతుంది. కనుక చివర్లో తండ్రి తప్ప ఏ ఇతర శరీరధారులు గుర్తు రానంత స్థితి ఉండాలి. శరీరము నుండి, పాత ప్రపంచము నుండి మమకారము నశించాలి. సన్యాసులు ఉండేదేమో పాత ప్రపంచములోనే కానీ ఇల్లు, వాకిలి, పిల్లా జెల్లా నుండి మమకారము తొలగించుకుంటారు. బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడని భావించి తత్వముతో యోగము చేస్తారు. స్వయాన్ని బ్రహ్మ జ్ఞాని లేక తత్వజ్ఞాని అని చెప్పుకుంటారు. బ్రహ్మ తత్వములో లీనమవుతామని భావిస్తారు. ఇవన్నీ తప్పులేనని తండ్రి చెప్తున్నారు. రైటు(=ఱస్త్రష్ట్ర్) నేనొక్కరినే, నన్నే సత్యమని అంటారు.

స్మృతియాత్ర చాలా పక్కాగా ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానమేమో చాలా సులభము. దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఎవరి దేహమూ గుర్తు రాకూడదు. అలా వస్తే భూతాలను స్మృతి చేయడం లేక భూత పూజ అవుతుంది. తండ్రి చెప్తున్నారు - నేను అశరీరిని, మీరు నన్ను మాత్రమే స్మృతి చేయాలి. ఈ కనులతో చూస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఆదేశానుసారము నడుచుకుంటే ధర్మరాజు శిక్షల నుండి విడుదలవుతారు. పావనంగా అయితే శిక్షలు సమాప్తమైపోతాయి. ఇది చాలా గొప్ప గమ్యము. ప్రజలుగా అవ్వడం చాలా తేలిక. అందులో కూడా షాహుకారు ప్రజలు, పేద ప్రజలుగా ఎవరెవరు అవుతారు ? ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. చివరిలో మీ బుద్ధియోగము ఒక్క తండ్రితో, ఇంటితో మాత్రమే ఉండాలి. పాత్రధారుల పాత్రలు నాటకములో సమాప్తమవుతూనే వారి బుద్ధి ఇంటి వైపుకు వెళ్తుంది. ఇది బేహద్ విషయము. అది హద్దు సంపాదన, ఇది బేహద్ సంపాదన. మంచి నటులకు ఆదాయము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందువలన గృహస్థములో ఉంటూ బుద్ధియోగాన్ని అక్కడ జోడించాలి అని తండ్రి చెప్తారు. ఆ ప్రేయసి ప్రియులు ఒకరినొకరు తలంపు చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ప్రేయసులే. ప్రియుడు వారొక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. అద్భుతమైన ప్రయాణికుడు కదా. ఈ సమయంలో అన్ని దు:ఖాల నుండి విడిపించి సద్గతికి తీసుకెళ్లేందుకు వారు వచ్చారు. వారిని సత్య-సత్యమైన ప్రియుడని అంటారు. అక్కడ వారికి ఒకరి శరీరము పై ఒకరికి ప్రీతి ఉంటుంది. వికారాల కొరకు కాదు. వారిది దేహాభిమాన యోగమని అంటారు. అది భూతాలను గుర్తు చేసుకోవడం అవుతుంది. మనుష్యులను స్మృతి చేయడం అనగా పంచ భూతాలను, ప్రకృతిని స్మృతి చేయడం. తండ్రి చెప్తున్నారు - ప్రకృతిని మర్చిపోయి నన్ను స్మృతి చేయండి. ఇది కష్టము కదా. అంతేకాక దైవీ గుణాలు కూడా ఉండాలి. ఎవరి పై అయినా ప్రతీకారము తీర్చుకోవడం కూడా ఆసురీ గుణము. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. ప్రతీకారమనే మాటే ఉండదు. అది అద్వైత దేవతా ధర్మము. శివబాబా తప్ప ఆ ధర్మమును ఇతరులెవ్వరూ స్థాపించలేరు. సూక్ష్మవతన వాసులైన దేవతలను ఫరిస్తాలని అంటారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు, మళ్లీ మీరే ఫరిస్తాలుగా అవుతారు. తర్వాత వాపస్ ఇంటికి వెళ్తారు. మళ్లీ నూతన ప్రపంచములోకి వచ్చి దైవీగుణాల మనుష్యులు అనగా దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వకుంటే వారసత్వము ఎలా తీసుకుంటారు? ఈ ప్రజాపిత బ్రహ్మ మరియు మమ్మాలే తర్వాత లక్ష్మీ- నారాయణులుగా అవుతారు. జైన్ ధర్మము వారు - ''మా ధర్మమే అతి పురాతన ధర్మము'' అని అంటారు. వాస్తవానికి మహావీరుడని ఆది దేవుడైన బ్రహ్మనే అంటారు. బ్రహ్మ ఒక్కరే కాని, ఎవరో జైన ముని వచ్చి ఆ బ్రహ్మకు మహావీరుడని పేరు పెట్టాడు. ఇప్పుడు మీరంతా మహావీరులే కదా. మాయ పై విజయము పొందుతున్నారు. మీరంతా మహావీరులుగా అవుతారు. సత్య-సత్యమైన మహావీరులు, వీరనారీలు మీరే. మీ పేరే శివశక్తులు. సింహము పై సవారి చేస్తారు. మహారథులు ఏనుగు పై సవారి చేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యమని తండ్రి చెప్తున్నారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర మార్గమూ లేదు. యోగబలము ద్వారా మీరు మొత్తం విశ్వము పై రాజ్య పాలన చేస్తారు. ఆత్మ చెప్తుంది - ఇప్పుడు నేను ఇంటికి వెళ్లాలి. ఇది పాత ప్రపంచము. ఇది బేహద్ సన్యాసము. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. సృష్టిచక్రాన్ని అర్థము చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునేందుకు ఎవ్వరి దేహమునూ స్మృతి చేయరాదు. ఈ కనులతో అన్నీ చూస్తున్నా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. పావనంగా అవ్వాలి.
2. ముక్తి-జీవన్ముక్తుల దారిని అందరికీ తెలపాలి. ఇప్పుడు నాటకము పూర్తి అయింది. ఇంటికి వెళ్లాలనే స్మృతి ద్వారా బేహద్ ఆదాయాన్ని జమ చేసుకోవాలి.
వరదానము:- '' లక్ష్యమనే గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థము చేసే సదా హోలి మరియు హ్యాపి భవ ''
బ్ర్రాహ్మణ జీవిత లక్ష్యము - ఎలాంటి హద్దు ఆధారము లేకుండా సదా ఆంతరిక సంతోషములో ఉండుట. ఎప్పుడైతే ఈ లక్ష్యము మారి హద్దు ప్రాప్తులనే చిన్న చిన్న సందు రస్తాలలో ఇరుక్కుపోతారో అప్పుడు గమ్యము నుండి దూరమైపోతారు. అందువలన ఏం జరిగినా, హద్దు ప్రాప్తులను త్యాగము చేయాల్సి వచ్చినా, వాటిని వదిలేయండి. కాని అవినాశి సంతోషాన్ని ఎప్పుడూ వదలకండి. '' హోలి మరియు హ్యాపి భవ '' అనే వరదానాన్ని గుర్తుంచుకొని తీవ్ర పురుషార్థము ద్వారా అవినాశి ప్రాప్తులు చేసుకోండి.

స్లోగన్:- '' గుణ మూర్తులుగా అయి గుణ దానము చేస్తూ ఉండండి. ఇదే అన్నిటి కంటే గ్పొప సేవ ''

No comments:

Post a Comment