Sunday, December 1, 2019

Telugu Murli 02/12/2019

02-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ''

ప్రశ్న :- రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశమేది ?
జవాబు :- ఆదేశమేమంటే - ఒక్క తండ్రికి చెందినవారిగా అయి మళ్లీ ఇతరులతో మనసు లగ్నము చేయరాదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్లీ పతితంగా అవ్వరాదు. మీకు తండ్రి, టీచర్‌ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి. మీరు ఎంత సంపూర్ణ పవిత్రంగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించి, వారినే స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ శరీరమున్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. సన్ముఖములో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. ఏదైతే సన్ముఖములో (ఎదురుగా) అర్థం చేయిస్తారో, అది వ్రాత ద్వారా అందరి వద్దకు వెళ్తుంది. మీరు సన్ముఖములో వినేందుకు ఇక్కడకొచ్చారు. అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మయే వింటుంది. అన్ని పనులు ఈ శరీరము ద్వారా చేసేది ఆత్మయే. అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలు, పరమాత్మ చాలాకాలము నుండి వేరుగా ఉన్నారు(ఆత్మాయే పరమాత్మా అలగ్‌ రహే బహుకాల్‌..............) అనే గాయనముంది. ఇచ్చటకు పాత్ర చేసేందుకు అందరికంటే ముందు పరమాత్మ నుండి విడిపోయి వచ్చినవారెవరు? ఎంతకాలము మీరు తండ్రి నుండి వేరుగా ఉన్నారని అడిగితే, మీరు 5 వేల సంవత్సరాలని అంటారు. పూర్తి లెక్కాచారమంతా ఉంది కదా. నంబరువారుగా ఎలా వస్తారో పిల్లలైన మీకు తెలుసు. పైన ఉన్న తండ్రి మీ బ్యాటరీలను ఛార్జ్‌(భర్తీ) చేసేందుకు ఇప్పుడు క్రిందకు వచ్చేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు తండ్రి మీ సన్ముఖములోనే ఉన్నారు కదా. భక్తిమార్గములో ఉన్నవారికి తండ్రి కర్తవ్యమేమిటో తెలియనే తెలియదు. వారి నామ-రూప-దేశ- కాలాదుల గురించి తెలియనే తెలియదు. మీకు వారి నామ-రూప-దేశ-కాలాలన్నీ తెలుసు. ఈ రథము ద్వారా తండ్రి రహస్యాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. రచయిత-రచనల ఆదిమధ్యాంతాల రహస్యము అర్థం చేయించారు. ఇది ఎంతో సూక్ష్మమైనది. ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపులు ఆ తండ్రియే. వారు ఇక్కడకు తప్పకుండా వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం వారి కర్తవ్యమే. అంతేకాని అక్కడే కూర్చొని స్థాపన చేస్తారని కాదు. బాబా ఈ శరీరము ద్వారా మనకు సన్ముఖములో అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా తండ్రి చూపించే ప్రేమయే కదా. ఇతరులెవ్వరికీ వారి జీవితచరిత్ర(బయోగ్రఫి) గురించి తెలియదు. గీత ఆదిసనాతన దేవీ దేవతా ధర్మశాస్త్ర్రము. ఈ జ్ఞానము తర్వాత వినాశనము జరుగుతుందని కూడా మీకు తెలుసు. వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వినాశనము జరగదు. ఇది వినాశన సమయము. అందువలన మీకు లభించే ఈ జ్ఞానము మళ్లీ సమాప్తమైపోతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు రచయిత-రచనల గురించి తెలుసుకున్నారు. ఇరువురూ అనాది నుండే ఉన్నారు. పాత్ర చేసేందుకు ఆత్మలంతా వస్తారు. కానీ తండ్రి వచ్చే పాత్ర సంగమయుగంలో మాత్రమే ఉంది. భక్తి అర్ధకల్పము నడుస్తుంది. జ్ఞానము అలా నడవదు. జ్ఞాన వారసత్వము అర్ధకల్పానికి లభిస్తుంది. జ్ఞానము కేవలం సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ మీ క్లాసు ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ విషయాలు బాగా అర్థము చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. పదవికి ఆధారము సేవ. పురుషార్థము చేసి ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. దాని పైనే పదవి ఆధారపడి ఉంటుంది. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అంతేకాక రచన ఆదిమధ్యాంతాల పరిచయమును కూడా ఇవ్వాలి. జన్మ-జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఎంతవరకు తండ్రి చదివిస్తూ ఉంటారో, అంతవరకు వారిని తప్పకుండా స్మృతి చేయాలి. చదివించేవారితో యోగమైతే ఉంటుంది కదా. టీచరు చదివిస్తూ ఉంటే వారి జతలో యోగముంటుంది. యోగము లేకుంటే ఎలా చదువుతారు? యోగమంటే చదివించే వారి స్మృతి. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాలలోనూ పూర్తిగా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఈ సద్గురువు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి లభించిన తర్వాత గురువుల సంప్రదాయమే సమాప్తమై పోతుంది. తండ్రి, టీచర్ల ఆచారము కొనసాగుతుంది. కానీ గురువు పాత్ర(సంప్రదాయం) సమాప్తమైపోతుంది. సద్గతి లభించింది కదా. నిర్వాణధామానికి మీరు ప్రాక్టికల్‌గా వెళ్తారు మళ్లీ తమ సమయానుసారము పాత్ర చేసేందుకు వస్తారు. ముక్తి-జీవన్ముక్తులు రెండూ మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది. కొంత సమయము మాత్రమే ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఇక్కడైతే శరీరముతో పాత్ర చేయవలసి వస్తుంది. చివర్లో పాత్రధారులందరూ, స్టేజి పైకి వచ్చేస్తారు. నాటకము పూర్తి అయినప్పుడు పాత్రధారులందరూ స్ట్టేజి పైకి వచ్చి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చేశారు. ఎన్ని ఘోరమైన కలహాలు, అలజడులున్నాయి! సత్యయుగము అదిలో ఇంత ఘోరమైన దు:ఖాలు లేవు. ఇప్పుడైతే ఎంతో అశాంతి ప్రబలి ఉంది. ఇప్పుడు తండ్రికి సృష్టిచక్ర జ్ఞానమెలా ఉందో, పిల్లలైన మీకు కూడా సృష్టిచక్ర జ్ఞానముంది. వృక్షము వృద్ధి ఎలా చెంది, సమాప్తమవుతుందో దాని బీజానికి తెలుసు కదా. ఇప్పుడు మీరు నూతన ప్రపంచానికి అంటు కట్టేందుకు లేక ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి అంటు కట్టేందుకు కూర్చొని ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యమును ఎలా పొందుకున్నారో మీకు తెలుసు. మనమిప్పుడు నూతన ప్రపంచానికి రాజకుమారులుగా అవుతామని మీకు తెలుసు. ఆ ప్రపంచములో ఉండే వారందరూ స్వయాన్ని యజమానులమనే అంటారు కదా. ఇప్పుడు భారతదేశములోని వారంతా, ఈ భారతదేశము మాది(మేరా భారత్‌.............) అని అంటారు కదా. ఇప్పుడు మేము సంగమ యుగములో ఉన్నామని శివాలయానికి వెళ్ళేవారమని మీకు తెలుసు. ఇప్పుడు పోనే పోతాము. మనము వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము - మీ లక్ష్యమే ఇది. యథా రాజా రాణి, తథా ప్రజా............... అందరూ శివాలయానికి అధికారులుగా అవుతారు. పోతే రాజధానిలో భిన్న-భిన్న హోదాలు ఉండనే ఉంటాయి. ఇక్కడ మంత్రులెవ్వరూ ఉండనే ఉండరు. పతితులైనప్పుడు మంత్రులుంటారు. లక్ష్మీనారాయణులకు గానీ, సీతా-రాములకు గానీ మంత్రులున్నారని విని ఉండరు. ఎందుకంటే వారు స్వయం సతోప్రధాన పావన బుద్ధి గలవారు. తర్వాత మళ్లీ పతితులుగా అయినప్పుడు రాజా-రాణులకు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రి ఉంటారు. ఇప్పుడైతే ఎంత మంది మంత్రులున్నారో చూడండి.

ఇది చాలా మజా కలిగించే నాటకమని పిల్లలైన మీకు తెలుసు. నాటకము ఎల్లప్పుడు మజా (సంతోషము) కొరకే ఉంటుంది. సుఖ-దు:ఖాలు రెండూ ఉంటాయి. ఈ బేహద్‌ నాటకము గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇందులో రోధించి, బాదుకునే మాటే లేదు. గతం గత: (అయిపోయిందేదో అయిపోయింది) అనే గాయనము కూడా ఉంది కదా. తయారై, తయారవుతున్న ఈ నాటకము మీ బుద్ధిలో ఉంది. మనము ఇందులో పాత్రధారులము. మన 84 జన్మల పాత్ర చాలా ఖచ్చితమైనది. అంతేకాక అవినాశి అయినది. ఎవరు ఏ జన్మలో ఏ పాత్ర చేశారో, వారు మళ్లీ అదే పాత్ర చేస్తూ ఉంటారు. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా - నిన్ను నీవు ఆత్మ అని భావించమని చెప్పాము. గీతలో కూడా ఈ పదము ఉంది. ఆది సనాతన దేవీదేవతా సనాతన ధర్మము స్థాపన అయినప్పుడు కూడా తండ్రి ఇదే మాట చెప్పారు - '' దేహ సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. '' మన్మనాభవ అర్థమును తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. ఇక్కడ ఎన్ని భాషలున్నాయో చూడండి. భాషల పైన ఎంత గలాటా జరుగుతోంది! భాష లేకుంటే పని జరగదు. మాతృ భాషనే(మదర్‌ లాంగ్వేజ్‌) మర్చిపోయి ఇతర భాషలను నేర్చుకుని వస్తారు. ఎవరైతే ఎక్కువ భాషలు నేర్చుకుంటారో వారికి బహుమతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ఎన్ని ధర్మాలున్నాయో అన్ని భాషలుంటాయి. అక్కడ మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ప్రతి 100 మైళ్ళకు ఒక భాష ఉంది. కానీ అక్కడ ఒకే భాష ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. రథమైతే తప్పకుండా అవసరము కదా. శివబాబా మన తండ్రి. బాబా చెప్తున్నారు - నాకు అనంతమైన మంది పిల్లలున్నారు. బాబా వీరి ద్వారా చదివిస్తున్నారు టీచరును ఎప్పుడూ కౌగిలించుకోరు. తండ్రి మిమ్ములను చదివించేందుకు వచ్చారు. రాజయోగము నేర్పించేందుకు వస్తారు కావున టీచరు అయ్యారు కదా. మీరు విద్యార్థులు. విద్యార్థులు టీచరును ఎప్పుడైనా కౌగిలించుకుంటారా? ఒక్క తండ్రికి చెందినవారిగా అయిన పిదప ఇతరులతో మీ మనస్సును లగ్నము చేయరాదు.

తండ్రి చెప్తున్నారు - నేను మీకు రాజయోగమును నేర్పించేందుకు వచ్చాను కదా. మీరు శరీరధారులు, నేను అశరీరిని, పైన ఉండేవాడిని. ''బాబా పావనంగా చేసేందుకు రండి'' అని పిలుస్తారు అనగా మీరు పతితులుగా అయ్యారు కదా. అలాంటప్పుడు నన్ను ఎలా కౌగిలించుకుంటారు? ప్రతిజ్ఞ చేసి మళ్లీ పతితులుగా అయి పూర్తి పవిత్రంగా అయినప్పుడు చివర్లో కూడా స్మృతి ఉంటుంది. టీచరును, గురువును కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఛీ-ఛీగా(అపవిత్రంగా) అయి క్రింద పడిపోతారు, ఇంకా 100 రెట్లు శిక్షను అనుభవిస్తారు. ఇతను కేవలం మధ్యవర్తిగా(దళారిగా) లభించారు. కాని వారిని స్మృతి చేయాలి. నేను కూడా వారికి ప్రియమైన పుత్రుడను అని ఈ బాబా కూడా చెప్తున్నారు. నేను ఎలా కౌగిలించుకోగలను! మీరైనా ఈ శరీరము ద్వారా కలుస్తారు. వారిని నేనెలా కౌగిలించుకుంటాను? తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారినే ప్రేమించండి. ఈ స్మృతి వలన చాలా శక్తి లభిస్తుంది. తండ్రి సర్వశక్తివంతులు - తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది. మీరు ఎంతో గొప్ప బలవంతులుగా అవుతారు. మీ రాజధానిని ఎవ్వరూ గెలుచుకోలేరు. రావణరాజ్యమంతా సమాప్తమైపోతుంది. దు:ఖము ఇచ్చే వారెవ్వరూ ఉండరు. దానిని సుఖధామమని అంటారు. రావణుడు విశ్వమంతటికీ దు:ఖమునిచ్చేవాడు. జంతువులు కూడా దు:ఖిస్తూ ఉంటాయి. అక్కడ జంతువులు కూడా పరస్పరము ప్రేమపూర్వకంగా ఉంటాయి. ఇక్కడ ప్రేమ లేనే లేదు.

ఈ డ్రామా ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైన మీకు తెలుసు. దీని ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఆ తండ్రే అర్థం చేయిస్తారు. కొంతమంది చాలా బాగా చదువుకుంటారు. కొంతమంది తక్కువగా చదువుకుంటారు. అందరూ చదువుకుంటారు కదా. ప్రపంచమంతా చదువుతుంది అంటే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం కూడా చదువే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వుల సద్గతిదాత. అందరికీ సుఖమిచ్చేవారు. మీరు వచ్చి పావనము చేయమని కూడా అంటారు అనగా తప్పకుండా పతితులుగానే ఉన్నారు కదా. వారు వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకే వస్తారు. ''ఓ అల్లా! మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి'' అని కూడా పిలుస్తారు. పావనంగా చేయడమే వారి కర్తవ్యము కావున పిలుస్తారు.

మీ భాష కూడా కరెక్టుగా ఉండాలి. వారు ''అల్లా'' అని అంటారు, వీరు ''గాడ్‌ '' అని అంటారు. గాడ్‌ఫాదర్‌ అని కూడా అంటారు. వెనుక వచ్చేవారి బుద్ధి చాలా బాగుంటుంది. వారికి అంత దు:ఖముండదు. ఇప్పుడు మీరు నా ముందు కూర్చొని ఏం చేస్తున్నారు? బాబాను ఈ భృకుటిలో చూస్తున్నారు. బాబా మళ్లీ మీ భృకుటిలోకి చూస్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడిని చూడగలనా? అతను నా ప్రక్కనే కూర్చుని ఉన్నారు, ఇది చాలా అర్థము చేసుకోవలసిన విషయము. నేను ఇతని ప్రక్కన కూర్చొని ఉన్నాను. నా ప్రక్కన కూర్చొని ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. మేము మీ ముందు కూర్చొని ఇద్దరినీ చూస్తున్నామని మీరంటారు. బాప్‌దాదాల ఆత్మలను రెండింటినీ చూస్తారు. మీకు జ్ఞానముందని బాప్‌దాదా ఎవరిని అంటారు? ఆత్మ ఎదురుగా కూర్చొని ఉంది. భక్తిమార్గములో అయితే కనులు మూసుకొని వింటారు. చదువును కనులు మూసుకొని ఎవ్వరూ చదువుకోరు. టీచరును చూడవలసి వస్తుంది కదా. వీరు తండ్రే కాక టీచరు కూడా అయినారు. అందువలన మీరు చూస్తూ ఉండాలి కదా. ఎదురుగా కూర్చుని, కళ్లు మూసుకొని తూగుతూ ఎవ్వరూ చదువుకోరు. విద్యార్థి టీచరును తప్పకుండా చూస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకుంటే, తూగుతూ ఉంటాడని టీచరు అంటాడు. వీడు భంగాకు తాగి వచ్చాడని అనుకుంటారు. బాబా ఈ శరీరములో ఉన్నారని, నేను బాబాను చూస్తున్నానని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది సాధారణ క్లాసు కాదు, ఇందులో ఎవ్వరూ కళ్లు మూసుకొని కూర్చోరాదు. పాఠశాలలో ఎప్పుడైనా ఎవరైనా కళ్లు మూసుకొని కూర్చుంటారా? ఇతర సత్సంగాలను పాఠశాల అని అనరు. భలే కూర్చొని గీతను చదివి వినిపిస్తారు కానీ దానిని పాఠశాల అని అనరు. వారెవ్వరూ తండ్రి కారు. కూర్చొని ఇలా చూడరు. శివుని భక్తులు ఎవరైనా ఉంటే వారు శివుని మాత్రమే స్మృతి చేస్తారు. చెవులతో కథ వింటూ ఉంటారు. శివుని భక్తి చేసేవారు శివుని మాత్రమే స్మృతి చేయాల్సి వస్తుంది. ఏ సత్సంగములోనూ ప్రశ్నోత్తరాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఇందులో మీకు చాలా లాభముంది. లాభము వచ్చినప్పుడు ఎప్పుడూ ఆవళింతలు రావు. ధనము లభిస్తూ ఉంటే ఖుషీ ఉంటుంది. ఆవళింతలు దు:ఖానికి గుర్తు. జబ్బు పడినప్పుడు లేక దివాలా తీసినప్పుడు ఆవళింతలు వస్తూ ఉంటాయి. ధనము లభిస్తూ ఉంటే ఆవళింతలు ఎప్పుడూ రానే రావు. ఈ బాబా వ్యాపారి కూడా. రాత్రుళ్ళు స్టీమరు వచ్చినప్పుడు రాత్రంతా మేల్కోవాల్సి వచ్చేది. ఎవరైనా రాణి(బేగమ్‌) రాత్రులు అంగడికి వస్తే, కేవలం స్త్రీల కొరకే అంగడి తెరచి ఉంచేవారు. ప్రదర్శనీలు మొదలైనవాటిలో విశేషంగా స్త్రీల కొరకే ప్రత్యేక రోజులుంచితే చాలామంది వస్తారు. బురఖా ధరించినవారు కూడా వస్తారు. పర్దా లోపలనే ఉంటారు. కారులో కూడా పర్దా ఉంటుంది. ఇక్కడ ఇది ఆత్మల విషయము. జ్ఞానము లభిస్తే పర్దా కూడా తొలగిపోతుంది. సత్యయుగములో పర్దాలు మొదలైనవి ఉండవు. ఇది ప్రవృత్తి మార్గపు జ్ఞానము కదా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది చాలా మజా ఇచ్చే తయారైన డ్రామా. ఇందులో సుఖ-దు:ఖాల పాత్ర నిర్ణయించబడి ఉంది. కావున ఏడ్చి, తలలు బాదుకునే మాటే లేదు. ఇది తయారైన తయారవుతున్న డ్రామా అని బుద్ధిలో ఉండాలి. గతించిన విషయాల గురించి చింతించరాదు.
2. ఇది సాధారణ క్లాసు(తరగతి) కాదు. ఇందులో కళ్లు మూసుకొని కూర్చోరాదు. ఎదురుగా టీచరును చూస్తూ ఉండాలి. ఆవళింతలు మొదలైనవి తీయరాదు. ఆవళింతలు దు:ఖానికి గుర్తు.

వరదానము :- '' ప్రసన్నతనిచ్చే ఆత్మిక పర్సనాలిటి ద్వారా అందరినీ అధికారులుగా చేసే గాయన యోగ్య, పూజనీయ యోగ్య భవ ''
ఎవరైతే అందరి నుండి సంతుష్టతా సర్టిఫికెట్‌ తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు అంతేకాక ప్రసన్నత కలిగించే ఈ ఆత్మిక పర్సనాలిటి కారణంగా ప్రసిద్ధులుగా అనగా మహిమా యోగ్యులుగా, పూజనీయ యోగ్యులుగా అవుతారు. శుభ చింతకులు, ప్రసన్నచిత్తులుగా ఉండే ఆత్మలైన మీ ద్వారా అందరికి ప్రాప్తించే సంతోషము, ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు కొంతమందిని అధికారులుగా చేస్తుంది, కొంతమంది భక్తులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' తండ్రి నుండి వరదానాలు ప్రాప్తి చేసుకునే సహజ సాధనం హృదయపూర్వక స్నేహం ''

No comments:

Post a Comment