Sunday, December 15, 2019

Telugu Murli 16/12/2019

16-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - అపారమైన ఖుషీ మరియు నషాలో ఉండేందుకు దేహాభిమానమనే జబ్బును వదిలి ప్రీతి బుద్ధిగలవారిగా అవ్వండి. మీ నడవడికలను సరిదిద్దుకోండి ''

ప్రశ్న :- ఎలాంటి పిల్లలకు జ్ఞాన ఉల్టా(వ్యతిరేక) నషా ఎక్కదు?
జవాబు :- ఎవరైతే బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారో, ఎవరైతే బాబాను హృదయ పూర్వంగా మహిమ చేస్తారో, ఎవరికైతే చదువు పై పూర్తి గమనము ఉంటుందో వారికి జ్ఞాన ఉల్టా నషా ఎక్కదు. ఎవరైతే బాబాను సాధారణంగా భావిస్తారో, వారు బాబాను స్మృతి చేయలేరు. స్మృతి చేసినప్పుడు తమ సమచారాన్ని(స్థితి, సేవలను) కూడా బాబాకు తప్పకుండా తెలియజేయాలి. పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వనట్లయితే పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా? అని బాబాకు ఆలోచనలు నడుస్తాయి.

ఓంశాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, ఎవరైనా క్రొత్తవారు వచ్చినప్పుడు వారికి మొదట హద్దు, బేహద్‌ తండ్రి - ఇరువురి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనగా అనంతమైన ఆత్మల తండ్రి. హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకు వేరు వేరుగా ఉంటాడు. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకే విధంగా ధారణ చేయలేరు. కొందరు ఒక శాతము, మరి కొందరు 95 శాతము ధారణ చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. సూర్యవంశ, చంద్రవంశ పరివారాలు ఉంటాయి కదా! రాజా, రాణి మరియు ప్రజలు. ప్రజలలో అన్ని రకాల మనుష్యులు ఉంటారు. ప్రజలు అంటేనే ప్రజలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది చదువు. ప్రతి ఒక్కరు తమ బుద్ధి అనుసారంగానే చదువుతారు. ప్రతి ఒక్కరికీ తమ - తమ పాత్ర లభించి ఉంది. కల్పక్రితము ఎవరెంత చదువును ధారణ చేశారో, వారు ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు. చదువు ఎప్పుడూ గుప్తంగా ఉండలేదు. చదువు అనుసారంగానే పదవి కూడా లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు - ముందు ముందు పరీక్షలు ఉంటాయి. పరీక్ష లేకుండా పై తరగతికి బదిలీ అవ్వలేరు. కనుక చివర్లో అంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా మేము ఏ పదవికి అర్హులము? అని తెలుసుకోగలరు. సిగ్గు వలన అందరూ చేతులు ఎత్తుతారు, కాని మేము అలా ఎలా అవ్వగలము! అని అర్థము చేసుకోగలరు. అయినా చేతులు ఎత్తుతారు. దీనిని కూడా అజ్ఞానము అనే అంటారు. వీరికన్నా లౌకిక విద్య చదివే విద్యార్థులలో ఎక్కువ తెలివి ఉంటుంది అని తండ్రి వెంటనే అర్థము చేసుకోగలరు. మేము స్కాలర్‌షిప్‌ తీసుకునేందుకు అర్హులము కాదు, పాస్‌(ఉత్తీర్ణులు) అవ్వలేము. టీచరు ఏమి చదివిస్తున్నారో, అందులో మేము ఎన్ని మార్కులు తీసుకుంటాము? అని విద్యార్థులు అర్థము చేసుకోగలరు. మేము గౌరవయుక్తంగా పాస్‌ అవ్వగలము అని వారు చెప్పరు. ఇక్కడ అనేక పిల్లలలో ఆ మాత్రము తెలివి కూడా లేదు, దేహాభిమానము చాలా ఉంది. మీరు భలే ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కాని అలాంటి నడవడికలు కూడా ఉండాలి కదా. తండ్రి చెప్తారు - వినాశకాలే విపరీత బుద్ధి ఎందుకంటే నియమానుసారంగా తండ్రి పై ప్ర్రేమ లేదు.

వినాశకాలే విపరీత బుద్ధి అనగా యథార్థమైన అర్థము ఏమిటో బాబా పిల్లలకు అర్థం చేయించారు. పిల్లలే పూర్తిగా అర్థము చేసుకోనప్పుడు మరి ప్రపంచములోని వారు ఏం అర్థము చేసుకోగలరు? తండ్రిని స్మృతి చేయడం గుప్తమైన విషయము. చదువైతే గుప్తంగా ఉండదు కదా! చదువులో నంబరువారుగా ఉంటారు. అందరూ ఒకే విధంగా చదవరు. ఇప్పుడు ఇంకా బేబీలు(చిన్న పిల్లలు)గానే ఉన్నారని భావిస్తున్నారు. ఇలాంటి బేహద్‌ తండ్రిని 3-3 మాసాలు, 4-4 మాసాలు స్మృతి కూడా చేయరు. స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? ''బాబా నేను ఇలా నడుస్తున్నాను, ఈ సర్వీసు చేస్తున్నాను'' అని తండ్రికి ఉత్తరము కూడా వ్రాయరు. పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా, మరణించలేదు కదా? అని పిల్లల గురించి తండ్రికి ఎంత చింత ఉంటుంది? కొందరు బాబాకు సర్వీసు సమాచారాలు చాలా బాగా వ్రాస్తారు. ఈ బిడ్డ(జీవించే) ఉన్నాడని తండ్రి కూడా భావిస్తాడు. సర్వీసు చేసే పిల్లలు గుప్తంగా ఉండలేరు. ఏ పుత్రుడు ఎలా ఉంటాడు? అని తండ్రి ప్రతి పుత్రుని మనసును తెలుసుకుంటారు. దేహాభిమానపు జబ్బు చాలా కఠినమైనది. బాబా మురళీలో అర్థం చేయిస్తారు, చాలామందికి జ్ఞాన (నాలెడ్జ్‌) ఉల్టా నషా ఎక్కుతుంది, అహంకారము వచ్చేస్తుంది. కనుక స్మృతి కూడా చేయరు, జాబులు కూడా వ్రాయరు. కనుక తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారు, హృదయపూర్వకంగా స్మృతి చేస్తారు. చాలామంది పిల్లలు సాధారణంగా అర్థము చేసుకుంటారు కనుక స్మృతి కూడా చేయరు. బాబా ఎలాంటి ఆడంబరము మొదలైనవి చూపించరు. భగవానువాచ - నేను మీకు విశ్వ రాజ్యాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాజ్యాన్ని పొందేందుకు బేహద్‌ తండ్రి వద్ద చదువుకుంటున్నామని మీరు భావించరు. ఈ నషా ఉంటే సదా అపారమైన సంతోషము ఎక్కి ఉండాలి. గీతను చదివేవారు కేవలం శ్రీ కృష్ణ భగవానువాచ - ''నేను రాజయోగాన్ని నేర్పిస్తాను'' అని మాత్రమే చెప్తారు, వారికి రాజ్యాన్ని పొందే సంతోషము ఉండదు. గీతను చదివి పూర్తి చేస్తారు. మళ్లీ వారి వారి కార్య వ్యవహారాలలో మునిగిపోతారు. మమ్ములను అనంతమైన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. వారి బుద్ధిలోకి ఇలాంటి ఆలోచన రాదు. కనుక ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి మొట్టమొదట ఇరువురు తండ్రుల పరిచయమును ఇవ్వాలి. భారతదేశము స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉందని చెప్పండి. ఇది కలియుగము, దీనిని స్వర్గమని అనరు. స్వర్గము సత్యయుగములోనూ ఉంటుంది, కలియుగములోనూ ఉంటుంది అని అనరు. ఎవరికైనా దు:ఖము కలిగితే నరకములో ఉన్నామని, సుఖము కలిగితే మేము స్వర్గములో ఉన్నామని అనుకుంటారు. దు:ఖీ మనుష్యులు నరకములో ఉన్నారు. మేము చాలా సుఖంగా కూర్చుని ఉన్నామని అంటారు. మహళ్లు, భవనాలు, కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి కనుక మేము స్వర్గములో ఉన్నామని అనుకుంటారు. బంగారు యుగము, (గోల్డెన్‌ ఏజ్‌), ఇనుప యుగము రెండూ ఇక్కడే ఉన్నాయని అనుకుంటారు.

కనుక మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయము బుద్ధిలో కూర్చోబెట్టాలి. తండ్రియే స్వయంగా తమ పరిచయమునిస్తున్నారు. వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? లౌకిక తండ్రిని సర్వవ్యాపి అని అంటారా? ఆత్మ-పరమాత్మల రూపమైతే ఒక్కటే, ఇందులో వ్యత్యాసము లేదని మీరిప్పుడు చిత్రములో చూపిస్తారు. ఆత్మ చిన్నదిగా, పరమాత్మ పెద్దగా ఉండరు. అందరూ ఆత్మలే, వారు కూడా ఆత్మయే. వారు సదా పరంధామములో ఉంటారు అందుకే వారిని పరమ ఆత్మ అని అంటారు. ఆత్మలైన మీరు ఎలా వస్తారో నేను అలా రాను. నేను చివర్లో ఈ శరీరములో వచ్చి ప్రవేశిస్తాను. వెలుపలివారు ఎవ్వరూ ఈ మాటలను అర్థము చేసుకోలేరు. విషయము చాలా సహజమైనది. వ్యత్యాసమేమిటంటే కేవలం తండ్రికి బదులుగా వైకుంఠ నివాసియైన కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు వైకంఠము నుండి నరకములోకి వచ్చి రాజయోగాన్ని నేర్పించారా? దేహ సమేతంగా............ నన్నొక్కడినే స్మృతి చేయండి అని కృష్ణుడు ఎలా చెప్పగలడు! దేహధారుల స్మృతి వలన పాపాలు ఎలా సమాప్తమవుతాయి? కృష్ణుడు ఒక చిన్న బాలుడు, నేనేమో సాధారణ వృద్ధ మానవ శరీరములో వస్తానని చెప్పాను. ఎంత తేడా ఉంది. ఈ ఏకైక తప్పు వల్లనే మనుష్యులందరూ పతితులుగా, భికారులుగా అయ్యారు. నేను సర్వవ్యాపిని కాను, కృష్ణుడు కూడా సర్వవ్యాపి కాడు. ప్రతి శరీరములో ఆత్మ సర్వవ్యాపిగా ఉంది. నాకైతే నా శరీరము కూడా లేదు. ప్రతి ఆత్మకు తమ-తమ శరీరముంది. ప్రతి శరీరానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. నాకు శరీరమూ లేదు, శారీరిక నామమూ లేదు. నేను వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాను. కనుక ఇతని పేరును మార్చి బ్రహ్మ అని పెట్టాను. 'బ్రహ్మ' నా పేరు కాదు. నన్ను 'సదా శివ' అనే పిలుస్తారు. నేనే సర్వుల సద్గతిదాతను. ఆత్మను సర్వుల సద్గతిదాత అని అనరు. పరమాత్మకు ఎప్పుడైనా దుర్గతి కలుగుతుందా? దుర్గతి, సద్గతులు కలిగేది ఆత్మకే. ఇవన్నీ విచార సాగర మథనము చేయాల్సిన విషయాలు. లేకుంటే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు? కాని మాయ ఎంత ప్రబలమైనదంటే పిల్లల బుద్ధిని ముందుకు సాగనివ్వదు. పూర్తి రోజంతా వ్యర్థ చింతనలోనే గడుపుతూ సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉంటారు. తండ్రి నుండి దూరం చేసేందుకు మాయ ఎంత ఒత్తిడి చేస్తుంది! చాలామంది పిల్లలు భగ్నమైపోతారు. తండ్రిని స్మృతి చేయనందున స్థితి అచలంగా, స్థిరంగా ఉండలేదు. తండ్రి క్షణ-క్షణము నిలబెట్తాడు, మాయ పడేస్తుంది. తండ్రి చెప్తున్నారు - ఎప్పుడూ ఓడిపోకండి. కల్ప-కల్పము అలాగే జరుగుతుంది. క్రొత్త విషయమేమీ కాదు. అంతిమములో మాయాజీతులుగా అవ్వనే అవుతారు. రావణ రాజ్యము సమాప్తమవ్వాల్సిందే. మళ్లీ మనము క్రొత్త ప్రపంచములో రాజ్యము చేస్తాము. కల్ప-కల్పము మాయాజీతులుగా అయ్యాము. లెక్కలేనన్ని సార్లు క్రొత్త ప్రపంచములో రాజ్యపాలన చేశాము. బుద్ధిని సదా బిజీగా ఉంచుకుంటే సదా సురక్షితంగా ఉంటారని బాబా చెప్తున్నారు. వీరినే స్వదర్శన చక్రధారులని అంటారు. అంతేకాని ఇందులో హింస మొదలైనవాటి విషయమే లేదు. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలను స్వదర్శన చక్రధారులని అనరు. పతిత ప్రపంచములోని ఆచార-పద్ధతులకు, దేవీ దేవతల ఆచార పద్ధతులకు చాలా వ్యత్యాసముంది. మృత్యులోకములోనివారే పతితపావనులైన తండ్రితో, మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనము చేయండి, పావన ప్రపంచానికి తీసుకువెళ్లండి అని పిలుస్తారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము కొత్త ప్రపంచము ఉండేది, దానికి సత్యయుగమని అంటారు. త్రేతా యుగమును కొత్త ప్రపంచమని అనరు. అది ఫస్ట్‌క్లాస్‌(ప్రథమ శ్రేణి), ఇది సెకెండ్‌ క్లాస్‌(ద్వితీయ శ్రేణి) అని బాబా చెప్తారు. ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి. ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి. కొందరు ఆశ్చర్యపడ్తారు కూడా! కాని పురుషార్థము చేసేందుకు సమయము ఉండదు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలని వింటారు. ఈ కామ వికారమే మనుష్యులను పతితులుగా చేస్తుంది. దానిని జయించినట్లైతే మీరు జగత్‌జీతులుగా అవుతారు, కాని వారు ఈ కామ వికారాన్నే శక్తిగా భావిస్తారు అందుకే కామజీతులే జగత్‌జీతులు అని చెప్పరు. కేవలం మనసును అదుపులో ఉంచుకోండి అని చెప్తారు. కాని ఎప్పుడైతే ఆత్మ శరీరములో ఉండదో అప్పుడే మనసు అదుపులో ఉంటుంది. అంతేకాని మనసు ఎప్పుడూ అదుపులో ఉండదు. కర్మ చేసేందుకే దేహము లభించినప్పుడు కర్మాతీత అవస్థలో ఎలా ఉంటారు? కర్మాతీత స్థితి అని శవాన్ని(మరణించిన వారికి) అంటారు. జీవించి ఉండగానే మరణించడమంటే శరీరము నుండి భిన్నమవ్వడం. తండ్రి మీకు శరీరము నుండి భిన్నంగా అయ్యే అభ్యాసము చేయిస్తారు. శరీరము నుండి ఆత్మ భిన్నమైనది. ఆత్మ పరంధామములో నివసిస్తుంది. ఆత్మ శరీరములోకి వచ్చినప్పుడు దానిని మనిషి అని అంటారు. కర్మ చేసేందుకే శరీరము లభిస్తుంది. ఒక శరీరము వదిలి కర్మ చేసేందుకు మళ్లీ రెండవ శరీరాన్ని తీసుకోవాలి. ఎప్పుజైతే శరీరములో ఉండరో అప్పుడు శాంతి ఉంటుంది. మూలవతనంలో కర్మ ఉండదు. సూక్ష్మవతనం ప్రసక్తే లేదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది. బాబాను, సృష్టి చక్రాన్ని తెలుసుకొనుటనే జ్ఞానమని అంటారు. సూక్ష్మ వతనములో శ్వేత వస్త్రధారులు, అలంకారధారులు, పాములను దండలుగా ధరించిన శంకరుడు మొదలైన వారెవ్వరూ ఉండరు. బ్రహ్మ, విష్ణువుల రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. విష్ణువు యొక్క రెండు రూపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కేవలం ఆ సాక్షాత్కారము పాత్ర డ్రామాలో ఉంది. దానిని దివ్యదృష్టి ద్వారా మాత్రమే చూడవచ్చు. వికారి కనులకు(క్రిమినల్‌) పవిత్ర వస్తువులు కనిపించవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచార సాగర మథనములో బిజీగా ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వ్యర్థంగా పరచింతన చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోరాదు.
2. శరీరము నుండి భిన్నమయ్యే ఏ చదువును బాబా నేర్పిస్తున్నారో, దానిని నేర్చుకోవాలి. మాయ ఒత్తిడుల నుండి సురక్షితంగా ఉండేందుకు మీ స్థితిని అచలంగా, స్థిరంగా చేసుకోవాలి.

వరదానము :- '' సదా ఉమంగ - ఉత్సాహాలలో ఉంటూ మనసులో సంతోషంగా పాటలు పాడే అవినాశి భాగ్యశాలి భవ. ''
భాగ్యశాలి ఆత్మలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ్‌ వాహ్‌ (భేష్‌, భేష్‌) అంటూ పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్‌ బాబా! వాహ్‌ నా భాగ్యము! వాహ్‌ మధురమైన పరివారము! వాహ్‌ శ్రేష్ఠమైన మనోహరమైన సంగమ సమయము! ప్రతి కర్మ వాహ్‌ వాహ్‌! అందువలన మీరు అవినాశి భాగ్యశాలురు. మీ మనసులో ఎప్పుడూ 'ఎందుకు, నేను' అనే పదాలు రాజాలవు. ఎందుకు? అనేందుకు బదులు వాహ్‌ వాహ్‌, 'నేను(మై)' అనేందుకు బదులు బాబా-బాబా అనే శబ్ధాలే వస్తాయి.

స్లోగన్‌ :- '' ఏ సంకల్పం చేస్తారో, దానికి అవినాశి ప్రభుత్వ స్టాంపు వేసుకుంటే అది స్థిరంగా ఉంటుంది ''

No comments:

Post a Comment