Monday, December 2, 2019

Telugu Murli 03/12/2019

03-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఈ రికార్డ్‌(పాట) సంజీవిని మూలిక. దీనిని ఆన్‌ చేసి మ్రోగించుట వలన బెంగ (ఉదాసీనత) తొలగిపోతుంది ''

ప్రశ్న :- స్థితి చెడిపోవుటకు కారణమేది ? ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగుంటుంది ?
జవాబు :- స్థితి చెడిపోవుటకు కారణాలు -1. జ్ఞాన డాన్స్‌ చేయరు. వ్యర్థ ప్రలాపాలతో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు. 2. ఇతరులకు దుఃఖము కలిగించినందున కూడా దాని ప్రభావము స్థితి పై పడ్తుంది. స్థితి బాగుండాలంటే మధురంగా నడుచుకోవాలి. స్మృతి పై పూర్తి గమనముంటే, రాత్రి నిదురించేందుకు ముందు కనీసము అర్ధగంట స్మృతిలో కూర్చొని మళ్లీ ఉదయము లేస్తూనే స్మృతి చేస్తే స్థితి బాగుంటుంది.

పాట :- నా మనోద్వారము వద్దకు ఎవరు వచ్చారు,...............( కౌన్‌ ఆయా మేరే మన్‌ కే ద్వారే,............)
ఓంశాంతి. ఈ రికార్డును కూడా పిల్లల కొరకు బాబా తయారు చేయించారు. దీని అర్థము కూడా పిల్లలు తప్ప ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలని, ఎప్పుడైనా ఉదాసీనంగా ఉంటే ఈ రికార్డును మ్రోగించి బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటే ఆ బెంగ వెంటనే తొలగిపోతుందని బాబా చాలాసార్లు తెలిపించారు. ఈ రికార్డు కూడా సంజీవిని మూలిక. బాబా ఆదేశమైతే ఇస్తారు, కానీ పిల్లలు దానిని అమలుపరచాలి. ఇప్పుడు ఈ పాటలో, అందరి మనసులోకి ఎవరు వచ్చారు! అని ఎవరంటారు? వచ్చి జ్ఞాన డాన్స్‌ చేసేవారు. గోపికలు కృష్ణుని నృత్యము చేయించేవారని అంటారు. నిజానికి అది లేనే లేదు. ఇప్పుడు బాబా 'ఓ సాలిగ్రామ పిల్లలారా!' అని అంటున్నారు అనగా అందరికీ చెప్తున్నారు కదా. స్కూలు అనగా స్కూలే. అక్కడ చదివిస్తారు. ఇది కూడా ఒక స్కూలే. మన హృదయంలో ఎవరి స్మృతి వస్తుందో పిల్లలైన మీకు తెలుసు. ఇతర మనుష్యులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఈ ఒక్క సమయములో మాత్రమే పిల్లలైన మీకు వారి స్మృతి ఉంటుంది. ఇతరులెవ్వరూ వారిని స్మృతి చేయరు. తండ్రి చెప్తారు - మీరు ప్రతి రోజు నన్ను స్మృతి చేస్తే ధారణ చాలా బాగా జరుగుతుంది. నేనెలా ఆదేశిస్తానో, అలా మీరు స్మృతి చేయరు. మాయ స్మృతి చేయనివ్వదు. నేను చెప్పినట్లు మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు. మాయ చెప్పినట్లు చాలా ఎక్కువగా నడుచుకుంటారు. రాత్రి నిదురించుటకు ముందు అర్ధగంట స్మృతిలో కూర్చోవాలి అని మీకు చాలాసార్లు చెప్పాను. స్త్రీ - పురుషులిరువురూ కలిసి అయినా కూర్చోండి లేక వేరు వేరుగా అయినా కూర్చోండి. బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కానీ ఇలా చాలా కొద్దిమంది మాత్రమే స్మృతి చేస్తారు. మాయ మరపింపజేస్తుంది. ఆజ్ఞానుసారము నడవకపోతే పదవిని ఎలా పొందుతారు? బాబాను చాలా స్మృతి చేయాలి - ''శివబాబా, సర్వాత్మల తండ్రి మీరే, అందరికీ మీ ద్వారానే వారసత్వము లభిస్తుంది.'' పురుషార్థము చేయనివారికి కూడా వారసత్వము లభిస్తుంది, ఎందుకంటే బ్రహ్మాండానికి అందరూ అధికారులుగా ఏమో అవుతారు. ఆత్మలందరూ డ్రామానుసారము నిర్వాణధామములోకి వచ్చేస్తారు. భలే ఏ పురుషార్థము చేయకున్నా వచ్చేస్తారు. అర్ధకల్పము భక్తి చేసినా నేను గైడ్‌గా(మార్గదర్శకునిగా) రానంతవరకు ఎవ్వరూ వాపసు వెళ్లలేరు. ఎందుకంటే దారి ఎవ్వరూ చూడనే లేదు. చూచి ఉంటే వారి వెనుక అందరూ దోమల వలె వెళ్లేవారు. మూలవతనమంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది తయారైన డ్రామా అని, ఇదే రిపీట్‌ అవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు పగటిపూట కర్మయోగులుగా అయి వృత్తి-వ్యాపారాదులలో నిమగ్నమవ్వాలి. భోజనము తయారు చేయడం మొదలైన కర్మలన్నీ చేయాలి. వాస్తవానికి కర్మ సన్యాసమనుట కూడా తప్పు. కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసులని అసత్యమైన పేరు పెట్టేశారు. కనుక పగలు వృత్తి వ్యాపారాదులను భలే చేసుకోండి, రాత్రుళ్ళు, ఉదయాలు తండ్రిని బాగా స్మృతి చేయండి. ఇప్పుడు ఎవరినైతే మీవారిగా చేసుకున్నారో వారిని స్మృతి చేస్తే సహయోగము కూడా లభిస్తుంది. లేకుంటే లభించదు. ధనవంతులకు తండ్రికి చెందిన వారిగా అయ్యేందుకు, వారి హృదయము దుఃఖముతో పగిలిపోతుంది(విదీర్ణమైపోతుంది). వారికి పదవి కూడా లభించదు. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. వారు మనకు తండ్రి, టీచరు, గురువు. ఈ ప్రపంచ చరిత్ర - భూగోళము ఎలా పునరావృతము అవుతుందనే రహస్యాన్నంతా మనకు తెలిపించారు. తండ్రిని స్మృతి చేయాలి, స్వదర్శన చక్రమును తిప్పాలి. అందరినీ ఇంటికి తీసుకు వెళ్లేవారు తండ్రి ఒక్కరే. ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. రాత్రి పూట నిదురించునప్పుడు కూడా ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఉదయం లేస్తూనే కూడా ఈ జ్ఞానము స్మృతిలో ఉండాలి. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. మళ్లీ బాబా వస్తారు. మళ్లీ మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము. బాబా త్రిమూర్తి, త్రికాలదర్శి, త్రినేత్రుడు కూడా. మన బుద్ధిని వికసింపజేస్తారు. జ్ఞాన మూడవ నేత్రము కూడా లభిస్తుంది. ఇటువంటి తండ్రి ఎవ్వరూ ఉండరు. తండ్రి రచిస్తారు కనుక వారు తల్లి కూడా అయ్యారు. జగదంబను నిమిత్తంగా చేస్తారు. తండ్రి ఈ శరీరములో ప్రవేశించి బ్రహ్మ రూపములో ఆడుతూ, పాడుతూ కూడా ఉంటారు. వాకింగ్‌కు కూడా వెళ్తారు. మనము బాబాను స్మృతి ఏమో చేస్తాము కదా! బాబా వీరి రథములో వస్తారని మీకు తెలుసు. బాప్‌దాదా మాతో ఆడుకుంటారని మీరంటారు. ఆటలో కూడా ఈ బాబా స్మృతి చేసే పురుషార్థము చేస్తారు. నేను ఇతని ద్వారా ఆడుకుంటున్నానని శివబాబా చెప్తారు. చైతన్యము కదా. ఇటువంటి ఆలోచనలుంచుకోవాలి. ఇటువంటి తండ్రి పై బలిహారము కూడా కావాలి. భక్తిమార్గములో మీరు ''సమర్పణ అయిపోతాము,........'' అని పాడుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఈ ఒక్క జన్మలో నన్ను మీ వారసునిగా చేసుకుంటే నేను 21 జన్మలకు మీకు రాజ్యభాగ్యమునిస్తాను. ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆదేశానుసారము నడుచుకోవాలి. అది కూడా గమనించి, దానిని బట్టి ఆదేశమునిస్తారు. ఆదేశానుసారము నడుచుకుంటే మమకారము నశిస్తుంది. అయితే భయపడ్తారు. బాబా అంటారు - మీరు బలిహారమవ్వకుంటే నేను వారసత్వమునెలా ఇవ్వాలి? మీ ధనము ఎవ్వరూ తీసుకోరు. మీ వద్ద ధనముంటే సాహిత్యములో ఉపయోగించండి అని చెప్తారు. ట్రస్టీలు కదా. బాబా సలహా ఇస్తూ ఉంటారు. బాబాదంతా పిల్లల కొరకే, పిల్లల నుండి ఏమీ తీసుకోరు, కేవలం మమకారము తొలగిపోవాలని యుక్తిగా తెలుపుతారు. మోహము కూడా చాలా గట్టిది(కోతి ఉదాహరణ). బాబా చెప్తారు - మీరు కోతి వలె వారి పై మోహము ఎందుకు ఉంచుకుంటారు? అలాగైతే ఇంటింటా మందిరమెలా తయారవుతుంది. నేను మిమ్ములను కోతిబుద్ధి(వానరత్వము) నుండి విడిపించి మందిరానికి అర్హులుగా చేస్తాను. మీరు ఈ మురికి చెత్త(కీచడ్‌ పట్టీ) పై మమకారము ఎందుకు ఉంచుకుంటారు? ఎలా సంభాళించుకోవాలో బాబా మతము మాత్రమే ఇస్తారు. అయినా బుద్ధిలో కూర్చోదు. ఇదంతా బుద్ధితో చేసే పని.

అమృతవేళలో బాబాతో ఎలా మాట్లాడాలో బాబా సలహానిస్తారు. '' బాబా, మీరు అనంతమైన తండ్రి, టీచరు. ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర-భూగోళాలను గురించి మీరు ఒక్కరు మాత్రమే తెలుపగలరు.'' లక్ష్మీనారాయణుల 84 జన్మల జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. జగదంబను మాత-మాతా అని కూడా అంటారు. ఆమె ఎవరు? సత్యయుగములో ఉండరు. అక్కడ మహారాణి - మహారాజులు - లక్ష్మీనారాయణులు. వారికి వారి సింహాసనము పై కూర్చునే పిల్లలుంటారు. ఆ సింహాసనము పై కూర్చునేందుకు వారి పిల్లలుగా మనమెలా అవుతాము! ఈ జగదంబ బ్రాహ్మణి అని, బ్రహ్మ కొమార్తె సరస్వతి అని మనకిప్పుడు తెలుసు. మనుష్యులకు ఈ రహస్యము తెలియదు. రాత్రి పూట తండ్రి స్మృతిలో కూర్చునే నియమము చాలా మంచిది. నియమాలు తయారుచేసుకుంటే మీకు అపారమైన సంతోషము కలుగుతుంది. తర్వాత ఎలాంటి కష్టమూ ఉండదు. ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరీ-సోదరులమని అంటారు. వికారి దృష్టి ఉంచుకోవడం నేరమవుతుంది. నషాలో కూడా సతో, రజో, తమో గుణాలుంటాయి కదా. తమోగుణపు నషా ఎక్కితే మరణిస్తారు. కొంత సమయమైనా తండ్రిని స్మృతి చేసి తండ్రి సేవ చేసేందుకు వెళ్లే నియమము ఉంచుకోండి. అప్పుడు మాయావి తుఫానులు రావు. ఆ నషా రోజంతా కొనసాగుతుంది, స్థితి కూడా చాలా రిఫైన్‌గా (శుద్ధంగా) అవుతుంది. యోగములో కూడా లైను క్లియర్‌గా ఉంటుంది. ఇటువంటి రికార్డులు కూడా చాలా బాగుంటాయి. రికార్డు వింటూ ఉంటే డాన్స్‌ చేయడం ప్రారంభిస్తారు, రిఫ్రెష్‌ అయిపోతారు. నాలుగైదు రికార్డులు చాలా బాగున్నాయి. పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నమౌతే వారికి భవనాలు లభించగలవు. శివబాబా భండారము నుండి అన్నీ లభిస్తాయి. సేవాధారులకు బాబా ఎందుకు ఇవ్వరు? శివబాబా భండారము సదా నిండు(భర్‌పూర్‌)గా ఉంటుంది.

(పాట) ఇది జ్ఞాన డాన్స్‌. తండ్రి వచ్చి గోప-గోపికలతో జ్ఞాన డాన్స్‌ చేయిస్తారు. ఎక్కడ కూర్చున్నా బాబాను స్మృతి చేస్తూ ఉంటే స్థితి చాలా బాగుంటుంది. బాబా ఎలాగైతే ఈ జ్ఞాన - యోగాల నషాలో ఉంటారో, అలా ఉండేందుకు పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. అలా ఉంటే ఖుషీ యొక్క నషా ఉంటుంది లేకుంటే వ్యర్థ ప్రలాపము వలన స్థితే చెడిపోతుంది. ఉదయమే నిదుర లేవడం చాలా మంచిది. బాబా స్మృతిలో కూర్చొని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. ఉపన్యసించేవారైతే విచార సాగర మథనము చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ పాయింట్ల పై ఇలా అర్థం చేయించాలని ప్లాను చేసుకోవాలి. బాబాను చాలామంది - ''మేము మా ఉద్యోగాలు వదిలేయమంటారా!'' అని అడుగుతారు. కానీ బాబా మొదట సేవకు ఋజువు చూపమంటారు. స్మృతి చేసేందుకు బాబా చాలా మంచి యుక్తులు తెలిపించారు. కానీ స్మృతి చేసేందుకు అలవాటు పడేవారు కోట్లలో ఏ కొద్దిమంది మాత్రమే వెలువడ్తారు. కొంతమందికి చాలా కష్టంగా స్మృతి నిలుస్తుంది. కుమారీలైన మీ పేరు ప్రసిద్ధి పొందింది. జనులంతా కుమారీల కాళ్ల పై పడ్తారు. మీరు 21 జన్మలకు భారతదేశానికి స్వతంత్రమిప్పిస్తారు. మీ స్మృతిచిహ్నంగా మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మకుమార - కుమారీల పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా. కుమారీలనగా 21 కులాలను ఉద్ధరించువారు. అయితే దాని అర్థము కూడా తెలుసుకోవాలి. ఇది 5 వేల సంవత్సరాల రీలు అని, జరిగిపోయినదంతా డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు. తప్పు జరిగిపోయింది - అది కూడా డ్రామాయే. జరగబోవు దాని కొరకు మీ రిజిస్టరును సరిచేసుకోవాలి. మళ్లీ రిజిస్టరు చెడిపోరాదు. ఇది చాలా శ్రమతో కూడిన పని. అప్పుడే ఇంత గొప్ప పదవి లభిస్తుంది. బాబాకు చెందిన వారిగా అయితే వారికి బాబా వారసత్వము కూడా ఇస్తారు. సవతి పిల్లలకు వారసత్వమునివ్వరు. సహాయము చేయడం మన కర్తవ్యము. వివేకవంతులు ప్రతి విషయములో సహాయము చేస్తారు. తండ్రి ఎంత సహాయము చేస్తారో చూడండి. మానవుడు ధైర్యము చేస్తే ఖుదా(భగవంతుడు) సహాయము చేస్తాడు. మాయ పై విజయము పొందేందుకు కూడా శక్తి కావాలి. ఒక్క ఆత్మిక తండ్రినే స్మృతి చేయాలి, ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్కరితోనే సాంగత్యమును జోడించాలి. బాబా జ్ఞానసాగరులు. నేను ఇతనిలో ప్రవేశించి మాట్లాడ్తానని తండ్రి చెప్తున్నారు. తండ్రి, టీచరు, గురవు నేనే అని ఇతరులెవ్వరూ చెప్పలేరు. బ్రహ్మ-విష్ణువు-శంకరులను రచించేవాడిని నేనే. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పాత మురికి(మలినాల) పై, మమకారము ఉంచుకోరాదు, తండ్రి ఆదేశానుసారము నడుచుకుంటూ మీ మమకారమును నిర్మూలించుకోవాలి, నిమిత్తులై(ట్రస్టీలుగా) ఉండాలి.
2. ఈ అంతిమ జన్మలో భగవంతుని మీ వారసునిగా చేసుకొని వారికి సమర్పణవ్వాలి. అప్పుడు 21 జన్మలకు రాజ్య భాగ్యము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసి, సేవ చేయాలి, నషాలో ఉండాలి, రిజిస్టరు ఎప్పుడూ పాడవకుండా గమనముంచాలి.

వరదానము :- '' పరమాత్మ లగ్నంలో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వీ మూర్త్‌ భవ ''
ఒక్క పరమాత్మ లగ్నంలో ఉండడమే తపస్సు. ఈ తపస్యా బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకొరకు(శాశ్వతంగా) నిర్విఘ్నంగా చేయగలదు. నిర్విఘ్నంగా ఉంటూ, ఇతరులను నిర్విఘ్నంగా చేయడమే సత్యమైన సేవ. ఈ సేవ అనేక ప్రకారాలైన విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది. ఇటువంటి సేవాదారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తిని వరదానంగా తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతారు.

స్లోగన్‌ :- '' చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహముంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు ''

No comments:

Post a Comment