05-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు మీ లక్ష్యాన్ని, లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దు:ఖమివ్వడం, గ్లాని చేయడం - ఇవన్నీ ఆసురీ లక్షణాలు ''
ప్రశ్న :- తండ్రికి పిల్లలైన మీ పై చాలా శ్రేష్ఠమైన ప్రేమ ఉంది అందుకు గుర్తు ఏది ?
జవాబు :- తండ్రి నుండి ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో, ఆ శిక్షణలు ఇవ్వడమే వారి శ్రేష్ఠమైన ప్రేమకు గుర్తు. తండ్రి ఇచ్చే మొదటి శిక్షణ - '' మధురమైన పిల్లలారా! - శ్రీమతము లేకుండా ఎలాంటి ఉల్టా-సుల్టా కర్మలు చేయకండి. 2. మీరు విద్యార్థులు, మీరు మీ చేతిలోకి ఎప్పుడూ చట్టాన్ని తీసుకోరాదు. మీరు మీ నోటి నుండి సదా రత్నాలనే వెలువరించండి, రాళ్ళను కాదు.
ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని(లక్ష్మీ నారాయణులను) బాగా చూస్తున్నారు. ఇది మీ లక్ష్యము అనగా మీరు ఈ వంశానికి చెందినవారు. ఎంతటి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది! కనుక క్షణ-క్షణము వారిని చూస్తూ ఉండాలి. మేము ఇలా అవ్వాలి. వీరి మహిమ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు. ఇది జేబులో ఉంచుకోవడం వల్లనే సంతోషము కలుగుతుంది. మనస్సులో సంకోచము ఉండరాదు. దానిని దేహాభిమానమని అంటారు. దేహీ-అభిమానులుగా అయి ఈ లక్ష్మీనారాయణులను చూసినట్లయితే మేము ఇలా తయారవుతున్నాము, కనుక తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుందని అనుకుంటారు. మీరు ఇలా అవ్వాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ''మధ్యాజీభవ'', వీరిని(లక్ష్మీనారాయణులను) చూడండి, స్మృతి చేయండి. ఒక దృష్టాంతము చెప్తారు కదా - నేను ఎనుము(గేదెను) అని అనుకున్న కారణంగా స్వయాన్ని గేదెగానే భావించసాగాడు. ఇది మా లక్ష్యము అని మీకు తెలుసు. ఇలా అవ్వాలి. ఎలా అవుతారు? తండ్రి స్మృతి ద్వారా. మేము వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా? అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా మమ్ములను దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా స్మృతి చేయాలి. నిరంతరము స్మృతి అయితే ఉండదని తండ్రి చెప్తున్నారు కానీ అందుకు పురుషార్థము చేయాలి. భలే గృహస్థ వ్యవహారాలు చేస్తూ కూడా వీరిని(లక్ష్మీనారాయణులను) స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మేము ఇలా అవ్వాలని తప్పకుండా గుర్తుకొస్తుంది. పూర్తి రోజంతా ఇదే స్మృతి ఉండాలి. అప్పుడు ఒకరినొకరు ఎప్పుడూ గ్లానీ చేసుకోరు. వీరు ఇలా ఉన్నారు, ఫలానా అలా ఉన్నారు........... ఎవరైతే ఇలాంటి మాటలలో లగ్నమై ఉంటారో వారు ఉన్నత పదవిని పొందలేరు, అలాగే ఉండిపోతారు. ఎంత సహజము చేసి అర్థం చేయించబడ్తుంది! వీరిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తే మీరు ఇలా తప్పకుండా అవుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అందరి ఇండ్లలో ఈ లక్ష్మీనారాయణుల చిత్రము తప్పకుండా ఉండాలి. ఇది ఎంత ఖచ్ఛితమైన చిత్రము! వీరిని స్మృతి చేస్తే బాబా గుర్తుకొస్తారు. మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులు ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానావారు ఇలా, వీరు ఇలా అని ఎవరినైనా నిందించడాన్ని సంకోచము అని అంటారు. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దు:ఖాన్ని ఇవ్వడము, గ్లాని చేయడం, చంచలమవ్వడం ఇలాంటి స్వభావము ఉండరాదు. అర్ధకల్పము ఇలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత మధురమైన శిక్షణ లబిస్తోంది! దీనికంటే ఉన్నతమైన ప్రేమ మరేదీ ఉండదు. శ్రీమతము లేకుండా ఏ ఉల్టా - సుల్టా పనులు చేయరాదు. తండ్రి ధ్యానము(ట్రాన్స్) గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు - కేవలం భోగ్‌ను స్వీకరింపచేసి రండి. వైకుంఠానికి వెళ్ళండి, రాసవిలాసాలు మొదలైనవి చేయమని తండ్రి చెప్పరు. వేరే స్థానానికి వెళ్తే మాయ ప్రవేశించిందని భావించండి. పతితులుగా తయారుచేయడమే మాయ మొదటి కర్తవ్యము. నియమ విరుద్ధమైన నడవడికల ద్వారా చాలా నష్టము కలుగుతుంది. ఒకవేళ స్వయాన్ని సంభాళన చేసుకోకుంటే కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన(అనేక జన్మల) లెక్కాచారము ఉంటుంది. రావణుని జైలులో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించారు. ఈ ప్రపంచములో ఎంతటి అపార దు:ఖముంది! మిగిలిన అన్ని విషయాలను మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. అన్ని సంశయాలను మనస్సు నుండి తొలగించండి అని తండ్రి చెప్తున్నారు. వికారాలలోకి ఎవరు తీసుకెళ్తారు? మాయా భూతము. మీ లక్ష్యమే ఇది. మీది రాజయోగము కదా. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వము లభిస్తుంది. కనుక ఈ వ్యవహారములో లగ్నమవ్వాలి. మలినమంతా మనస్సు నుండి తొలగించి వేయాలి. మాయ చరమదశ(పరాకాష్ఠ) కూడా చాలా కఠినమైనది. కానీ వాటిని ఎగురవేస్తూ ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా తండ్రి స్మృతిలో ఉండాలి. ఇప్పుడింకా నిరంతర స్మృతి ఉండజాలదు. చివరిలో నిరంతరము వరకు ఉంటుంది. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. ఒకవేళ ఆంతరికములో సంశయము, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమైతే ఓడిపోతారు.
తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలారా, చెడు పనులు చేసి ఓడిపోకండి. నిందన మొదలైనవి చేయడం వలన మీ గతి చాలా చెడిపోయింది. ఇప్పుడు సద్గతిని పొందాలి, కావున చెడు కర్మలు చేయకండి. మాయ గొంతు వరకు మింగి ఉండటాన్ని బాబా చూస్తున్నారు. తెలియను కూడా తెలియదు. మేము చాలా బాగా నడుస్తున్నామని భావిస్తారు. కానీ అలా లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనసా-వాచా-కర్మణా నోటి ద్వారా రత్నాలే వెలువడాలి. చెడు మాటలు మాట్లాడడం అనగా అవి రాళ్ళ సమానము. ఇప్పుడు మీరు రాళ్ళ నుండి బంగారు సమానంగా అవుతారు. కనుక నోటి ద్వారా ఎప్పుడూ రాళ్లు వెలువడరాదు. బాబా అర్థము చేయించవలసి వస్తుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు. సోదరుడు సోదరుని హెచ్చరించరు. శిక్షణనివ్వడం టీచర్ కర్తవ్వము. వారు ఏమైనా చెప్పగలరు. విద్యార్థి తన చేతిలోకి చట్టాన్ని తీసుకోరాదు. మీరు విద్యార్థులు కదా. తండ్రి అర్థం చేయించగలరు. ఒక్క తండ్రిని స్మృతి చేయమని తండ్రి ఆదేశిస్తున్నారు. మీ భాగ్యము ఇప్పుడు తెరవబడింది. శ్రీమతమును అనుసరించకుంటే మీ భాగ్యము పాడవుతుంది. తర్వాత చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. తండ్రి శ్రీమతమును అనుసరించకపోతే ఒకటి శిక్షలు అనుభవించవలసి వస్తుంది, రెండవది పదవి కూడా తగ్గిపోతుంది. ఇది జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాల ఆట. తండ్రి వచ్చి చదివిస్తున్నారు కనుక - బాబా మా టీచరు, వీరి ద్వారా స్వయం ఆత్మ అని తెలుసుకునే నూతన జ్ఞానము లభించిందని బుద్ధిలో ఉండాలి. ఆత్మ-పరమాత్మల మేళా అని అంటారు కదా. 5 వేల సంవత్సరాల తర్వాత కలుస్తాము. ఇందులో ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటారో అంత తీసుకోవచ్చు లేకుంటే చాలా చాలా పశ్చాత్తాపపడ్తారు, ఏడుస్తారు. అంతా సాక్షాత్కారమవుతుంది. పాఠశాలలో పిల్లలు బదిలీ అయినప్పుడు చివరిలో కూర్చునేవారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ మీరు శరీరాన్ని వదిలి మళ్లీ సత్యయుగంలోకి వెళ్ళి రాజకుమారుల కళాశాలలో భాష నేర్చుకుంటారని మీకు తెలుసు. అక్కడి భాషను అందరూ చదవవలసి ఉంటుంది. చాలామందిలో పూర్తి జ్ఞానము లేనందున రెగ్యులర్‌గా కూడా చదవరు. ఒకటి రెండు సార్లు మిస్ చేస్తే, మిస్ చేయడం అలవాటైపోతుంది. మాయ శిష్యుల సాంగత్యముంటుంది. శివబాబా శిష్యులు కొంతమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు వశులై ఉన్నారు. మీరు శివబాబా శిష్యులుగా అవ్వడం చూసి మాయ సహించలేదు. కనుక చాలా సంభాళన చేసుకోవాలి(కాపాడుకోవాలి). ఛీ-ఛీ మురికి మనుష్యుల నుండి సంభాళన చేసుకోవాలి. హంసలు, కొంగలున్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణనిచ్చారు - రోజంతా ఎవరో ఒకరిని నిందించడం, పరచింతన చేయడం వీటిని దైవీ గుణాలని అనరు. దేవతలు ఇలాంటి పని చేయరు. తండ్రిని, ఆస్తిని స్మృతి చేయండని తండ్రి చెప్పినా నిందిస్తూ ఉంటారు. జన్మ-జన్మలుగా నిందిస్తూ వచ్చారు. ఆంతరికంగా సంశయము ఉండనే ఉంటుంది. ఇది కూడా ఆంతరికములోని యుద్ధము. అనవసరంగా స్వయాన్ని ఖూనీ చేసుకుంటారు. చాలా మందిని నష్టపరుస్తారు. ఫలానావారు ఇలా ఉన్నారని అంటూ ఉంటారు. ఇందులో మీదేం పోతుంది. అందరి సహాయకులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు శ్రీమతమును అనుసరించాలి. మనుష్యుల మతము చాలా మురికిగా చేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. గ్లాని చేయడం మాయా భూతము. ఇది పతిత ప్రపంచము. మనమిప్పుడు పతితుల నుండి పావనంగా అవుతున్నామని మాలో ఈ చెడు గుణాలున్నాయని మీకు తెలుసు. ఈ రోజు నుండి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయమని, మీ చెవిని మీరే పట్టుకోవాలని అర్థం చేయించబడ్తుంది. ఏదైనా చూసినట్లయితే బాబాకు రిపోర్టు చేయాలి. మీదేం పోతుంది? మీరు ఒకరినొకరు ఎందుకు నిందించుకుంటారు. తండ్రి అన్నీ వింటూ ఉంటారు కదా. తండ్రి కళ్ళను, చెవులను అప్పుగా తీసుకున్నారు కదా. తండ్రి కూడా చూస్తారు, ఈ దాదా కూడా చూస్తారు. కొందరి నడవడికలు, వాతావరణము పూర్తి నియమ విరుద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథలని అంటారు. వారికి తమ తండ్రి కూడా తెలియదు, స్మృతి కూడా చేయరు. బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు. కనుక తమ పదవినే పోగొట్టుకుంటారు. శ్రీమతమును అనుసరించకపోతే వారు అనాథలే. తల్లి - తండ్రుల శ్రీమతమును అనుసరించరు. త్వమేవ మాతాశ్చ పితా,........ బంధువు మొదలైనవారిగా కూడా అవుతారు.
కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదరే లేనట్లయితే తల్లి ఎక్కడి నుండి వస్తుంది, అంతమాత్రము కూడా బుద్ధి లేదు. మాయ బుద్ధిని ఒక్కసారిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకుంటే శిక్ష పడ్తుంది. కొద్దిగా కూడా సద్గతి జరగదు. తండ్రి చూసినట్లయితే వీరికి ఎలాంటి దుర్గతి పడ్తుందో అని అంటారు కదా. వీరు సువాసన లేని విష పుష్పాలు, జిల్లేడు పువ్వులాంటి వారు. వారిని ఎవ్వరూ ఇష్టపడరు. కనుక బాగుపడాలి కదా. లేనట్లయితే పదవీ భ్రష్టులైపోతారు. జన్మ-జన్మలకు నష్టము కలుగుతుంది. కానీ దేహాభిమానుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలరు. అర్పణమవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారమైతే అవ్వలేరు. వారికి బలి అవ్వడం అనగా అర్థము కూడా తెలియదు. హృదయము విదీర్ణమవుతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వారెవ్వరు కూడా ఉండరు. బాబా, మీరే మా సర్వస్వము అని కూడా అంటారు, కేవలం నోటి ద్వారా అంటారు కాని అది సత్యము కాదు. తండ్రితో కూడా అసత్యము చెప్తారు. బలిహారమైనట్లయితే తమ మమకారాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు అంతిమ సమయము కారణంగా శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. ఆస్తి మొదలైన వాటి పై కూడా మమకారాన్ని దూరము చేసుకోవాలి. ఇలాంటి బంధనముక్తులు చాలామంది ఉన్నారు. శివబాబాను తమవారిగా చేసుకున్నారు, దత్తు చేసుకుంటారు కదా. వీరు మన తండ్రి, టీచరు, సద్గురువు, వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనము వారిని మనవారిగా చేసుకుంటాము. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు ఆ వంశములో తప్పకుండా వస్తారు. కానీ అందులో మళ్లీ ఎన్ని పదవులున్నాయి! ఎంతోమంది దాస-దాసీలు ఉంటారు! ఒకరి పై ఒకరు అధికారము చలాయిస్తారు. దాసీలలో కూడా నంబరువారుగా అవుతారు. రాయల్ ఇళ్లలోకి వెలుపలి దాస-దాసీలు రారు కదా. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో వారు అవ్వాలి. కొద్దిగా కూడా వివేకము లేని పిల్లలు కూడా ఉంటారు.
మమ్మాను స్మృతి చేయండి, నా రథాన్ని స్మృతి చేయండని బాబా చెప్పరు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండని చెప్తారు. సర్వ దేహ బంధనాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమించాలంటే ఒక్కరినే ప్రేమించండి, అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఆదేశానుసారము నడవండి. మోహాజీత్ రాజు కథ కూడా ఉంది కదా. పిల్లలు మొదటి నంబరులో ఉన్నారు. పిల్లలైతే ఆస్తికి అధికారులుగా అవుతారు. పత్ని అయితే అర్ధ భాగస్వామి. పిల్లలైతే పూర్తి యజమానులుగా అవుతారు. కనుక బుద్ధి ఆ వైపుకు వెళ్తుంది. బాబాను పూర్తి యజమానిగా చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు. ఇచ్చి పుచ్చుకునే మాటే లేదు. ఇది అర్థము చేసుకోవాల్సిన విషయము. భలే మీరు వింటున్నారు, మళ్లీ రేపు అంతా మర్చిపోతారు. బుద్ధిలో ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇది చాలా సహజము. చెప్తూనే ఉండండి, లక్ష్యమును తెలియజేస్తూ ఉండండి. విశాల బుద్ధిగలవారైతే వెంటనే అర్థము చేసుకుంటారు. అంతిమములో ఈ చిత్రాలు మొదలైనవే ఉపయోగపడ్తాయి. ఇందులో పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీనారాయణులకు, రాధా-కృష్ణులకు పరస్పరములో గల సంబంధమేదో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులకు తప్పకుండా మొదటి రాకూమారునిగా ఉంటాడు. భికారి నుండి రాకుమారుడు కదా! భికారి నుండి రాజు అని అనరు. రాకుమారుడైన తర్వాతనే రాజుగా అవుతాడు. ఇది చాలా సహజమైనది. కాని కొందరిని మాయ పట్టుకుంటుంది. ఎవరినైనా నిందించడము, గ్లాని చేయడం - ఈ అలవాటు చాలా మందిలో ఉంది, ఇక వేరే పనేమీ ఉండదు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయరు. ఇతరులను గ్లాని చేయడమే వారి పని. ఇది మాయ పాఠము. తండ్రి చెప్పే పాఠము చాలా స్పష్టమైనది. చివర్లో ఈ సన్యాసులు మొదలైనవారు కూడా జాగృతమవుతారు. జ్ఞానము ఉంది అంటే అది బ్రహ్మకుమారీల వద్దనే ఉందని అంటారు. కుమారులు, కుమారీలైతే పవిత్రంగా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానము. మనలో ఎలాంటి చెడు సంకల్పాలు కూడా రాకూడదు. చాలామందికి ఇప్పటికీ చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి. దీనికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి చాలా అర్థము చేయిస్తూ ఉంటారు. ఒకవేళ మీ నడవడికలలో మళ్లీ చెడు చూసినట్లయితే ఇక్కడ ఉండలేరు. కొద్దిగా శిక్ష కూడా ఇవ్వవలసి వస్తుంది. మీరు యోగ్యులు కాదు, తండ్రిని మోసం చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేయలేరు. స్థితి పూర్తిగా పడిపోతుంది. స్థితి పడిపోవడమే శిక్ష. శ్రీమతానుసారము నడవనందు వలన మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు. తండ్రి ఆదేశానుసారము నడవనందు వలన ఇంకా భూతాలు ప్రవేశిస్తాయి. చాలా కఠినమైన పెద్ద శిక్షలు ఇప్పుడే ప్రారంభమవ్వరాదని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎక్కువ దు:ఖము, బాధ కలగరాదు. చాలా మంది పడిపోతారు. శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంతా సంకేతాలలో అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మంది తమ భాగ్యరేఖనే పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు - ఇది తప్పులు చేసే సమయము కాదు. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతిమ సమయము వచ్చేందుకు ఎక్కువ సమయము లేదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎలాంటి నియమ విరుద్ధమైన, శ్రీమతానికి విరుద్ధమైన నడవడికలు ఉండరాదు. మిమ్ములను మీరే పరివర్తన(బాగు) చేసుకోవాలి. ఛీ - ఛీ మలిన మనుష్యుల నుండి మిమ్ములను మీరు కాపాడుకోవాలి.
2. బంధనముక్తులుగా ఉంటే పూర్తిగా బలిహారమవ్వాలి. మీ మమకారాన్ని సమాప్తము చేసుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరినీ నిందించరాదు, పరచింతన చేయరాదు. మలినమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి.
వరదానము :- '' స్వరాజ్య అధికారిని అనే నశాతో, నిశ్చయంతో సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి, నిరంతరయోగీ భవ ''
స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియం పై తమ రాజ్యముండాలి. ఎప్పుడూ సంకల్పములో కూడా కర్మేంద్రియాలు మోసం చేయరాదు. ఏ కొంచెం దేహాభిమానం వచ్చినా ఆవేశము లేక కోపం వచ్చేస్తుంది. కాని ఎవరైతే స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారులుగా అయి సేవ చేస్తారు. అందువలన 'నేను స్వరాజ్య అధికారి ఆత్మను' అను నశా మరియు నిశ్చయంతో శక్తిశాలిగా అయి మాయాజీత్‌ల నుండి జగత్‌జీతులుగా అయితే సహజయోగి, నిరంతర యోగులుగా అవుతారు.
స్లోగన్ :- '' లైట్‌హౌస్‌గా అయి మనసు, బుద్ధి ద్వారా లైటును వ్యాపింపజేయడంలో బిజీగా ఉంటే ఏ విషయంలోనూ భయముండదు ''
No comments:
Post a Comment