Friday, December 20, 2019

Telugu Murli 21/12/2019

21-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఆత్మ రూపి బ్యాటరీని జ్ఞాన-యోగాల ద్వారా నింపి సతోప్రధానంగా చేసుకోవాలి, నీటి స్నానము ద్వారా కాదు ''

ప్రశ్న :- ఈ సమయంలో ఆత్మలందరిని అలమటింపచేసేదెవరు? ఎందుకు అలా అలమటింపచేస్తాడు?
జవాబు :- ఈ సమయములో అందరినీ అలమటింపజేసేవాడు రావణుడు, ఎందుకంటే స్వయం రావణుడే దారి తప్పి తిరుగుతూ, అలమటిస్తూ ఉంటాడు. రావణునికి తన స్వంత ఇల్లు ఏదీ లేదు. రావణుని ఎవ్వరూ ''బాబా'' అని అనరు. తండ్రి ఏమో పరంధామము నుండి తన పిల్లలకు ఆశ్రయమిచ్చేందుకు వస్తాడు. ఇప్పుడు మీకు మీ ఇంటి చిరునామా తెలిసింది. అందువలన మీరు వెతకరు. తండ్రి నుండి మొట్టమొదటే విడిపోయాము, ఇప్పుడు మళ్లీ మొట్టమొదట ఇంటికి వెళ్తామని మీరు చెప్తారు.

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చొని - ఇతనిలో(బ్రహ్మలో) వచ్చిన శివబాబా ఎలాగైనా మమ్ములను తమ వెంట తప్పకుండా జతలో ఇంటికి తీసుకు వెళ్తారని భావిస్తారు. అది ఆత్మల ఇల్లు కదా. కనుక పిల్లలకు తప్పకుండా ఖుషీ ఉంటుంది. బేహద్‌ తండ్రి వచ్చి మనలను సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు. అంతేకాని వస్త్రాలు మొదలైన వాటిని ధరింపజేయరు. దీనిని యోగబలము లేక స్మృతి బలము అని అంటారు. టీచరుకు ఎంత గౌరవముందో పిల్లలకు కూడా అంత గౌరవాన్ని ఇప్పిస్తారు. విద్యార్థులకు తమ చదువు ద్వారా, ఏ పదవి పొందుతారో తెలుస్తుంది. మన బాబా టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ఇది కొత్త విషయము. మన బాబా టీచరయ్యారు, వారిని మనము స్మృతి చేస్తున్నాము. మనకు చదువు నేర్పించి ఈ విధంగా(లక్ష్మీ నారాయణులుగా) తయారు చేస్తున్నారు. మన అనంతమైన తండ్రి మనలను వాపస్‌ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. రావణునికి ఏ ఇల్లూ లేదు. రామునికి ఇల్లు ఉంది. శివబాబా ఎక్కడ ఉంటారు? మీరు వెంటనే పరంధామములో అని అంటారు. రావణుని బాబా అని అనరు. రావణుడెక్కడుంటాడు? తెలియదు. రావణుడు పరంధామములో ఉంటాడని అనరు. అలా ఉండడు. రావణునికి స్థిరమైన స్థావరమే లేదు. తిరుగుతూ ఉంటాడు. మిమ్ములను కూడా తిప్పుతూ ఉంటాడు. మీరేమైనా రావణుని స్మృతి చేస్తారా? లేదు. ఎంతగానో తిప్పుతాడు. శాస్త్రాలు చదవమంటాడు, భక్తి చేయమంటాడు. అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. దీనిని భక్తిమార్గము, రావణరాజ్యమని అంటారని తండ్రి చెప్తున్నారు. గాంధీ కూడా రామరాజ్యము కావాలని కోరుకునేవాడు. ఈ రథములో మన శివబాబా వచ్చి ఉన్నారు. వారు గొప్ప తండ్రి కదా. వారు ఆత్మలతో పిల్లలూ! - పిల్లలూ! అంటూ మాట్లాడ్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మిక తండ్రి, ఆత్మిక తండ్రి బుద్ధిలో ఆత్మిక పిల్లలైన మీరు ఉన్నారు ఎందుకంటే మన సంబంధము మూలవతనము నుండే ఉంది. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు........... (ఆత్మా పరమాత్మా అలగ్‌ రహే బహుకాల్‌.........). అక్కడ ఆత్మలు తండ్రితో కలిసి ఒకే చోట ఉంటారు. తర్వాత తమ తమ పాత్రలు చేసేందుకు వేరవుతారు. చాలా కాలపు లెక్క కావాలి కదా. ఆ తండ్రే కూర్చొని ఆ లెక్క అంతా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీలో కూడా బాగా చదివేవారు నంబరువారుగా ఉన్నారు. వారే మొట్టమొదట నా నుండి విడిపోయారు. వారే నన్ను బాగా స్మృతి చేస్తారు, అందువలన మళ్లీ మొట్టమొదట్లోనే వచ్చేస్తారు.
తండ్రి కూర్చొని పిల్లలకు సృష్టి చక్ర గుహ్య రహస్యాన్నంతా అర్థం చేయిస్తారు. దీనిని గురించి మరెవ్వరికీ తెలియదు. దీనిని గుహ్యము, గుహ్యతమము అని కూడా అంటారు. తండ్రి పైన కూర్చొని అర్థం చేయించరని మీకు తెలుసు. ఇక్కడకు వచ్చి - నేను ఈ కల్పవృక్షానికి బీజమునని అర్థం చేయిస్తాను. ఈ మానవ సృష్టి రూపి వృక్షమును కల్పవృక్షమని అంటారు. ప్రపంచములోని మనుష్యులకు ఈ జ్ఞానము ఏ మాత్రము తెలియదు. కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు. ఆ తండ్రి మళ్లీ వచ్చి మేల్కొల్పుతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను మేల్కొలిపారు. ఇతరులందరూ నిదురిస్తున్నారు. మీరు కూడా కుంభకర్ణుని వలె ఆసురీ(రాక్షస) నిద్రలో నిదురిస్తూ ఉండినారు. బాబా వచ్చి మేల్కొల్పారు. పిల్లలూ! మేలుకోండి. మీరు సోమరులై నిదురలో నిదురిస్తూ ఉండినారు. దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు. సాధారణ నిద్ర అందరూ నిదురిస్తారు. సత్యయుగములో కూడా నిదురిస్తారు. ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో మునిగి ఉన్నారు. తండ్రి వచ్చి జ్ఞానము తెలిపి అందరినీ మేల్కొల్పుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు. బాబా మనలను తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శరీరము, ఆత్మ - రెండూ పనికి రాకుండా ఉన్నాయి. రెండూ పతితమైపోయాయి. ఆత్మ పూర్తిగా కల్తీ అయిపోయింది. 9 క్యారెట్ల బంగారు అంటే చాలా కొద్ది బంగారుతో సమానము, స్వచ్ఛమైన బంగారమంటే 24 క్యారెట్ల బంగారము. ఇప్పుడు తండ్రి మిమ్ములను 24 క్యారెట్ల బంగారు ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆత్మలైన మిమ్ములను సత్యమైన బంగారు యుగానికి అర్హులుగా చేస్తారు. భారతదేశాన్ని బంగారు పిచుక(సోనే కీ చిడియా) అని అనేవారు. ఇప్పుడు ఇనుప పిచుక, రాతి పిచుక అని అంటారు. నిజానికి చైతన్యము కదా. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఆత్మను అర్థం చేసుకున్నట్లే పరమాత్మను కూడా అర్థం చేసుకోగలరు. మెరిసే నక్షత్రమని కూడా అంటారు. చాలా చిన్న నక్షత్రము, డాక్టర్లు మొదలైనవారు కూడా దానిని చూచేందుకు చాలా ప్రయత్నించారు. కాని దివ్యదృష్టి లేకుండా చూడలేరు. చాలా సూక్ష్మమైనది. కొంతమంది ఆత్మ కంటి నుండి వెళ్లిపోయిందని, కొంతమంది నోటి నుండి వెళ్లిపోయిందని అంటారు. ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? మరో శరీరములో ప్రవేశిస్తుంది. కాని ఇప్పుడు మీ ఆత్మ అత్యంత పైకి శాంతిధామానికి వెళ్ళిపోతుంది. తండ్రి వచ్చి మనలను ఇంటికి తీసుకెళ్తారని పక్కాగా తెలుసుకున్నారు. ఒకవైపు కలియుగము, మరోవైపు సత్యయుగము ఉంది. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నాము. చాలా అద్భుతము. ఇచ్చట కోట్ల కొలది మనుష్యులున్నారు. సత్యయుగములో కేవలం 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగిలినవారంతా ఏమవుతారు? నాశనమౌతారు. తండ్రి వచ్చేదే నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. తర్వాత పాలన కూడా రెండు రూపాల ద్వారా జరుగుతుంది. అంతేకాని నాలుగు భుజాల మనిషి(చతుర్భుజులు) ఎవ్వరూ ఉండరు. అలా ఉంటే శోభించదు. పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు - చతుర్భుజుడనగా శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణుల సంయుక్త రూపము. శ్రీ అనగా శ్రేష్ఠము. త్రేతా యుగములో రెండు కళలు తగ్గిపోతాయి. పిల్లలకు లభించే ఈ జ్ఞానము స్మృతిలో ఉండాలి. ముఖ్యమైనవి రెండే పదాలు - ''తండ్రిని స్మృతి చేయండి'' ఇతరులెవ్వరికీ అర్థము కాదు. తండ్రియే పతితపావనుడు, సర్వశక్తివంతుడు. బాబా మీరు మాకు భూమ్యాకాశాలతో పాటు సర్వస్వము ఇచ్చేశారని పాట కూడా పాడ్తారు. మీరు మాకు పూర్తి భూమ్యాకాశాలను ఇచ్చేశారు. ఇవ్వని వస్తువంటూ ఏమీ లేదు. మొత్తం విశ్వరాజ్యాన్నంతా ఇచ్చేశారు.
ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు. మళ్లీ డ్రామా చక్రము తిరుగుతుంది. నంబరువారు పురుషార్థానుసారము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. వికారుల నుండి నిర్వికారులు, నిర్వికారుల నుండి వికారులుగా అవుతారని మీకు తెలుసు. ఈ 84 జన్మల పాత్రను లెక్కలేనన్ని సార్లు అభినయించారు. ఎన్నిసార్లో లెక్కించలేము. భలే జనాభాను లెక్కిస్తారు. కాని మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా, సతోప్రధానము నుండి తమోప్రధానముగా ఎన్నిసార్లు అయ్యారో లెక్కించలేరు. బాబా అంటున్నారు - ఇది 5 వేల సంవత్సరాల చక్రము. ఇది సత్యము. లక్షల సంవత్సరాలు అయితే గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు మీలో గుణధారణ జరుగుతుంది. జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. ఈ కనులతో మీరు పాత ప్రపంచమును చూస్తున్నారు. మీకు లభించిన మూడవ నేత్రము ద్వారా నూతన ప్రపంచాన్ని చూడాలి. ఈ ప్రపంచము దేనికీ పనికి రాదు. ఎందుకంటే పాతదైపోయింది - కొత్త ప్రపంచానికి, పాత ప్రపంచానికి ఎంత వ్యత్యాసముందో చూడండి. మనమే నూతన ప్రపంచములో యజమానులుగా ఉండేవారమని, మళ్లీ 84 జన్మలు తీసుకొని ఇలా అయ్యామని మీకు తెలుసు. దీనిని చాలా బాగా అర్థము చేసుకొని మళ్లీ మనము ఇలా అవుతామని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ, విష్ణువుకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా. విష్ణువు ఎంత బాగా అలంకరింపబడి ఉన్నారో, బ్రహ్మ ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారో చూడండి. అయితే ఈ బ్రహ్మయే ఆ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు. దీనిని ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభము. బ్రహ్మ, విష్ణువు, శంకరులకు పరస్పరము ఏ సంబంధముంది? విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులు అని మీకు తెలుసు. ఈ విష్ణువే దేవత నుండి మళ్లీ ఈ మనుష్య బ్రహ్మగా అవుతారు. విష్ణువు సత్యయుగంలో ఉంటారు. ఈ బ్రహ్మ ఇక్కడే ఉంటారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క సెకెండు, విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5 వేల సంవత్సరాలని తండ్రి అర్థము చేయించారు. దీనినే తతత్వమ్‌(నీవే, నేను) అని అంటారు. బ్రహ్మను ఒక్కరినే తయారు చేయరు కదా. ఈ విషయాలు తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ ఏ మనుష్య గురువు మాటే లేదు. ఇతని గురువు కూడా శివబాబా, బ్రాహ్మణులైన మీకు కూడా గురువు శివబాబాయే. వారిని సద్గురువని అంటారు. అందువలన పిల్లలు శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలి. శివబాబాను స్మృతి చెయ్యమని ఎవ్వరికైనా సులభంగా అర్థం చేయించవచ్చు. శివబాబా నూతన ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, శివుడు. వారు ఆత్మలైన మనకు తండ్రి. అందువలన భగవంతుడు పిల్లలకు చెప్తున్నారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడం ఎంతో సులభము. పిల్లలు జన్మిస్తూనే, అమ్మా-అమ్మా అని దానంతటకదే వారి నోటి నుండి వెలువడ్తుంది. తల్లిదండ్రి వద్దకు తప్ప వేరెవ్వరి వద్దకు పోరు. తల్లి మరణిస్తే అది వేరే విషయము. మొదట తల్లి మరియు తండ్రి, ఆ తర్వాత బంధు-మిత్రులు వగైరా, అందులోనూ జంట జంటలుగా ఉంటారు. చిన్నాయన, పిన్నమ్మ ఇద్దరు కదా. కుమారి పెరిగి పెద్దదవుతూనే కొంతమంది పిన్నమ్మ అని, కొంతమంది అమ్మా అని అంటారు.
ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - మీరంతా భాయి - భాయి(సోదరులు), అంతే. మిగిలిన సంబంధాలన్నీ రద్దు చేస్తున్నారు. మనమంతా సోదరులమని భావిస్తే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. తండ్రి కూడా - పిల్లలూ, తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండని చెప్తున్నారు. ఆయన ఎంతో గొప్ప అనంతమైన తండ్రి. ఆ గొప్ప తండ్రి మీకు అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. మాటి మాటికీ ''మన్మనాభవ '' అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ మాటను మర్చిపోకండి. దేహాభిమానములోకి వచ్చినంతనే మర్చిపోతారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనము సాలిగ్రాములము. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను పతితపావనుడను. నన్ను స్మృతి చేసినందున ఖాళీ అయిన మీ బ్యాటరీ పూర్తిగా నిండిపోతుంది. మీరు సతోప్రధానంగా అవుతారు. గంగలో జన్మ-జన్మాంతరాలుగా మునుగుతూ వచ్చారు. కాని పావనంగా అవ్వలేకపోయారు. గంగలోని నీరు పతితపావని ఎలా అవుతుంది? జ్ఞానము ద్వారా మాత్రమే సద్గతి జరుగుతుంది. ఈ సమయంలో ఉండేదే - పాపాత్మల అసత్య ప్రపంచము. ఇచ్చి పుచ్చుకోవడం కూడా పాపాత్మలతోనే జరుగుతుంది. మనసా, వాచా, కర్మణా పాపాత్మలుగానే అవుతారు. పిల్లలైన మికిప్పుడు జ్ఞానము లభించింది. మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మీరంటారు. ఇప్పుడు మీరు భక్తి చేయడం సమాప్తమైపోయింది. జ్ఞానము ద్వారా సద్గతి అవుతుంది. వీరు(దేవతలు) సద్గతిలో ఉన్నారు కదా. తండ్రి అర్థం చేయించారు - ఈ బ్రహ్మ అనేక జన్మల అంతములో ఉన్నాడు. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు. కల్ప-కల్పము శ్రమ చేస్తారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని తయారు చెయ్యాలి. భగవంతుడు ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారస్థుడని అంటారు కదా. ఇంద్రజాలికుడు కదా. పాత ప్రపంచాన్ని నరకము నుండి స్వర్గంగా చేస్తాడు. ఇది ఎంత గొప్ప ఇంద్రజాలము. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. ఇప్పుడు మనము నరకవాసులమని మీకు తెలుసు. నరకము, స్వర్గము వేరు వేరుగా ఉన్నాయి. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ మాటలు మర్చిపోరాదు. భగవానువాచ కదా. ఎవరో పునర్జన్మ లేనివారు తప్పకుండా ఉన్నారు. శ్రీ కృష్ణునికేమో శరీరముంది. శివునికి లేనే లేదు వారికి నోరు తప్పకుండా కావాలి. మీకు వినిపించేందుకు వారు వచ్చి చదివిస్తున్నారు కదా. డ్రామానుసారము మొత్తం జ్ఞానమంతా వారి వద్ద ఉంది. దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు వారు కల్పములో ఒక్కసారి మాత్రమే వస్తారు. సుఖ-శాంతుల వారసత్వము తండ్రి ద్వారానే లభించింది. అందుకే మనుష్యులు కోరి తండ్రిని స్మృతి చేస్తారు.
తండ్రి ఎంత సహజంగా జ్ఞానమిస్తున్నారో గమనించండి. ఇక్కడ కూర్చుని ఉన్నా తండ్రిని స్మృతి చేయండి. పల్టీలాట(బాజోలీ) గుర్తు పెట్టుకున్నా 'మన్మనాభవ' అవుతుంది. ఈ జ్ఞానమునిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మేము అనంతమైన తండ్రి వద్దకు పోతున్నామని మీరంటారు. తండ్రి మనకు శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకు దారి చూపుతున్నారు. ఇక్కడ కూర్చొని ఇంటిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇంటిని స్మృతి చేయాలి, నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. ఆ పాత ప్రపంచము సమాప్తమయ్యే తీరాలి. పోను పోను మీరు వైకుంఠాన్ని కూడా చాలా స్మృతి చేస్తారు. మాటి మాటికి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు. ప్రారంభములో కన్యలు మాటి మాటికి పరస్పరములో కూర్చొని వైకుంఠానికి వెళ్ళేవారు. ఇది చూచి సంపన్న కుటుంబీకులు తమ పిల్లలను పంపేవారు. పేరే ఓంనివాస్‌ అని పెట్టారు. చాలామంది పిల్లలు వచ్చేశారు. తర్వాత గలాటాలు జరిగాయి. పిల్లలను చదివించేవారు. వారంతకు వారే ధ్యానము(ట్రాన్స్‌)లోకి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ధ్యానము, సాక్షాత్కారాల పాత్రను మూసేశారు. ఇక్కడ కూడా కబరిస్తాన్‌(శ్మశానము) తయారు చేసేవారు. అందరినీ పడుకోబెట్టేవారు, ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండి అని చెప్పగానే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంద్రజాలికులే. బ్రహ్మబాబా ఎవ్వరిని చూచినా(దృష్టిచ్చినా) వారు వెంటనే ధ్యానములోకి వెళ్లిపోతారు. ఈ ఇంద్రజాలము ఎంత బాగుంటుంది! నవ విధములైన భక్తిలో భక్తులు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైనప్పుడు వారికి సాక్షాత్కారమయ్యేది. ఇక్కడ ఆ తండ్రే స్వయంగా వచ్చారు. పిల్లలైన మిమ్ములను చదివించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. పోను పోను పిల్లలైన మీరు చాలా సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా తండ్రిని ఎవరైనా అడిగితే - గులాబి పుష్పాలెవరో, చంపక పుష్పాలెవరో, సువాసన లేని(టాంగర్‌) పుష్పాలెవరో, విషపూరిత(టూహ్‌) పుష్పాలెవరో బాబా చెప్పగలరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహ సంబంధాలన్నీ రద్దుపరచి(క్యాన్సల్‌ చేసి) ఆత్మలన్నీ భాయి-భాయి(సోదరులు) అని నిశ్చయము చేసుకోవాలి. అంతేకాక తండ్రిని స్మృతి చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారులుగా అవ్వాలి.
2. ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోరాదు. అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేల్కొల్పాలి. శాంతిధామము, సుఖధామానికి వెళ్ళే మార్గము అందరికీ తెలపాలి.

వరదానము :- '' కమల పుష్పం గుర్తును(సింబల్‌) బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని స్యాంపుల్‌గా భావించే న్యారా మరియు ప్యారా భవ ''
ప్రవృత్తిలో ఉండేవారి గుర్తు - 'కమల పుష్పము' కనుక కమలంగా అవ్వండి, అమలు చేయండి. ఒకవేళ అమలు చేయకుంటే కమలంగా అవ్వలేరు. కనుక కమలపుష్ప సింబల్‌ను(గుర్తును) బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని స్యాంపుల్‌గా భావించి నడవండి. సేవ చేస్తూ న్యారాగా, ప్యారాగా(అతీతంగా, ప్రియంగా) అవ్వండి. కేవలం ప్రియంగా అవ్వకండి, అతీతంగా అయి ప్రియంగా అవ్వండి. ఎందుకంటే ప్రేమ అప్పుడప్పుడు ఆకర్షణ రూపంలోకి మారిపోతుంది. అందువలన ఏ సేవ చేస్తున్నా న్యారాగా, ప్యారాగా అవ్వండి.

స్లోగన్‌ :- '' స్నేహమనే ఛత్రఛాయలోకి మాయ రాజాలదు ''

No comments:

Post a Comment