26-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రికి సహయోగులుగా అయి ఈ ఇనుప యుగమనే పర్వతాన్ని బంగారు యుగముదిగా తయారు చేయాలి, పురుషార్థము చేసి కొత్త ప్రపంచము కొరకు ఫస్ట్‌క్లాస్ సీటును రిజర్వ్ చేయించుకోవాలి ''
ప్రశ్న :- తండ్రి కర్తవ్యము ఏమిటి ? ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగమ యుగములో తండ్రి రావలసి ఉంటుంది ?
జవాబు :- అనారోగ్యంగా, దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చెయ్యడం, మాయా బంధనము నుండి వెలికి తీసి అపారమైన సుఖమునివ్వడం - ఇది తండ్రి కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగములోనే పూర్తి చేస్తారు. బాబా చెప్తారు - నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తము చేసేందుకు, అందరి పై కృప చూపేందుకు వచ్చాను. ఇప్పుడు పురుషార్థము చేసి 21 జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి.
పాట :- భోలానాథునికి సాటి అయినవారు,......................( భోలానాథ్ సే నిరాలా,...............)
ఓంశాంతి. భోలానాథుడైన శివభగవానువాచ - బ్రహ్మ ముఖ కమలము ద్వారా తండ్రి చెప్తున్నారు - ఇది వెరైటీ భిన్న-భిన్న ధర్మాల మనుష్య సృష్టిరూపి వృక్షము కదా. ఈ కల్పవృక్షము లేక సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను పిల్లలకు అర్థము చేయిస్తున్నాను. పాటలో కూడా వీరి మహిమ ఉంది. శివబాబా జన్మ ఇక్కడే జరిగింది. నేను భారతదేశములోనే వచ్చానని తండ్రి చెప్తున్నారు. శివబాబా ఎప్పుడు ఆగమించారో(వచ్చారో) మనుష్యులకు తెలియదు. ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ద్వాపరయుగము మాటే లేదు. తండ్రి చెప్తారు - పిల్లలూ, 5 వేల సంవత్సరాల క్రితము కూడా నేను వచ్చి ఈ జ్ఞానాన్నిచ్చాను. ఈ వృక్షము ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వృక్షాన్ని బాగా చూడండి. సత్యయుగములో పూర్తి దేవీ దేవతల రాజ్యముండేది, త్రేతా యుగములో సీతా-రాముల రాజ్యముండేది. బాబా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము మాయ బంధనాలలో ఎప్పుడు చిక్కుకున్నాము? అని పిల్లలు అడుగుతారు. ద్వాపర యుగము నుండి అని బాబా చెప్తారు. నంబరువారుగా మళ్లీ ఇతర ధర్మాలు వస్తాయి. కనుక ఈ ప్రపంచములోకి మళ్లీ మనము ఎప్పుడు వస్తామో లెక్క వేసి తెలుసుకోగలరు. నేను 5 వేల సంవత్సరాల తర్వాత సంగమ యుగములో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు వచ్చానని శివబాబా చెప్తున్నారు. మనుష్య మాత్రులందరూ ముఖ్యంగా భారతవాసులు దుఃఖితులుగా ఉన్నారు. డ్రామానుసారము భారతాదేశాన్నే నేను సుఖప్రదంగా చేస్తాను. పిల్లలు అనారోగ్యము పాలైనప్పుడు వారికి వైద్యము చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అతిపెద్ద అనారోగ్యము(జబ్బు). అన్ని రోగాలకు మూలము ఈ 5 వికారాలు. ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయని పిల్లలు అడుగుతారు. ద్వాపర యుగము నుండి. రావణుని విషయము అర్థం చేయించాలి. రావణుని ఎవ్వరూ చూడలేరు. బుద్ధి ద్వారా అర్థము చేసుకోవచ్చు. తండ్రిని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకుంటారు. ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంది. మా తండ్రి పరమాత్మ అని ఆత్మకు తెలుసు. సుఖ-దుఃఖాలు, లేప చేపములలోకి(కర్మఫలము) ఆత్మ వస్తుంది. శరీరము ఉన్నప్పుడు ఆత్మకు దుఃఖము కలుగుతుంది. పరమాత్మ అయిన నన్ను దుఃఖింప చేయకండి అని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తున్నారు - నా పాత్ర కూడా ఉంది, కల్ప-కల్పము సంగమ యుగములో వచ్చి నేను పాత్ర చేస్తాను. ఏ పిల్లలనైతే నేను సుఖములోకి పంపించానో వారు దుఃఖములో ఉన్నారు కనుక డ్రామానుసారము నేను మళ్లీ రావలసి ఉంటుంది. అంతేకాని కచ్ఛ, మత్సావతారాల(తాబేలు, చేప) మాట లేదు. పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను సంహరించాడని చెప్తారు. ఇవన్నీ కాల్పనిక కథలు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు.
వీరు జగదంబ-జగత్పితలు. తల్లి-తండ్రుల దేశము అని చెప్తారు కదా. మీరే మాతా - పితలు........... మీ కృప ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది అని భారతవాసులు స్మృతి కూడా చేస్తారు. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పొందుతారు. సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్‌క్లాస్ రిజర్వేషను చేయిస్తారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు - సూర్యవంశము కావాలన్నా, చంద్రవంశము కావాలన్నా సీటు రిజర్వ్ చేసుకోండి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పదవిని పొందగలరు. ఇప్పుడు అన్ని దుఃఖాలను సమాప్తము చేసేందుకు తండ్రి వచ్చారు. రావణుడు అందరికి చాలా దుఃఖమునిచ్చాడు. ఏ మనిషీ మరొక మనిషికి గతి - సద్గతులను ఇవ్వలేడు. ఇది కలియుగ అంతిమ సమయము. గురువులు శరీరము వదిలినట్లయితే మళ్లీ ఇక్కడే పునర్జన్మ తీసుకుంటారు. మరి వారు ఇతరులకు సద్గతిని ఏమివ్వగలరు! ఇంతమంది అనేక గురువులు కలిసి పతిత సృష్టిని పావనంగా చేయగలరా? గోవర్ధన పర్వతము అని చెప్తారు కదా! ఈ మాతలు ఈ ఇనుప యుగమనే పర్వతాన్ని బంగారు యుగంగా తయారు చేస్తారు. గోవర్ధన పర్వతానికి పూజ కూడా చేస్తారు, అది తత్వపూజ. సన్యాసులు కూడా బ్రహ్మమును అనగా తత్వాన్ని స్మృతి చేస్తారు. అదే పరమాత్మ అని, బ్రహ్మతత్వము భగవంతుడని భావిస్తారు. ఇది భ్రమ అని తండ్రి అంటారు. బ్రహ్మాండములో ఆత్మలు అండాల వలె ఉంటాయి, నిరాకారి వృక్షమును కూడా చూపడం జరిగింది. ప్రతి ఒక్కరికి తమ-తమ విభాగాలు(సెక్షన్లు) ఉంటాయి. భారతదేశపు సూర్యవంశీ, చంద్రవంశీ పరివారాలు ఈ వృక్షానికి పునాది. తర్వాత వృద్ధి చెందుతుంది. నాలుగు ధర్మాలు ముఖ్యమైనవి. కనుక ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వచ్చాయి అని లెక్క తీయాలి. ఉదాహరణానికి గురునానక్ 5 వందల సంవత్సరాల క్రితము వచ్చారు. సిక్కు ధర్మమువారు 84 జన్మల పాత్రను అభినయించరు. తండ్రి చెప్తారు - 84 జన్మలు కేవలం ఆల్‌రౌండర్ బ్రాహ్మణులైన మీరు మాత్రమే తీసుకుంటారు. మీదే ఆల్‌రౌండ్ పాత్ర. బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా మీరే అవుతారు అని తండ్రి అర్థం చేయించారు. ఎవరైతే మొట్టమొదట దేవీ దేవతలుగా అవుతారో వారే పూర్తి చక్రములో తిరుగుతారు.
తండ్రి చెప్తున్నారు - మీరు వేదశాస్త్రాలను చాలా విన్నారు. ఇప్పుడిది విని శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి తెలియజేస్తున్నది రైటా? అని మీరు నిర్ణయము తీసుకోండి. తండ్రిని సత్యము(ట్రూత్) అని అంటారు. నేను సత్యాన్నే తెలియజేస్తాను, దాని ద్వారా సత్యయుగము తయారవుతుంది. ద్వాపర యుగము నుండి మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు కనుక దాని వలన నరకంగా తయారయింది.
తండ్రి చెప్తున్నారు - నేను మీ సేవకుడను, భక్తిమార్గములో ''నేను సేవకుడను, నేను సేవకుడను,''............. అని మీరు పాటలు పాడ్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ సేవ కొరకు వచ్చాను. తండ్రిని నిరాకారి, నిరహంకారి అని మహిమ చేస్తారు. కనుక మిమ్ములను సదా సుఖవంతంగా తయారు చేయడం నా కర్తవ్యమని తండ్రి చెప్తున్నారు. అగమ్ నిగమ్‌కా భేద్ ఖోలే (డ్రామాలోని అన్ని రహస్యాలను తెలియచేయువారు)....................... అని పాట కూడా ఉంది. కానీ ఢమరుకము మొదలైనవి మ్రోగించే విషయమేదీ లేదు. వీరు ఆదిమధ్యాంతాల సమాచారమంతా వినిపిస్తారు. బాబా చెప్తున్నారు - పిల్లలైన మీరందరూ పాత్రధారులు, నేను ఈ సమయములో చేసి చేయించేవాడిని. నేను ఇతని(బ్రహ్మ) ద్వారా స్థాపన చేయిస్తాను. అంతేకాని గీతలో ఏది వ్రాసి ఉందో అది లేనే లేదు. ఇప్పుడిది ప్రాక్టికల్ విషయము కదా. పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని, సహజ యోగాన్ని నేర్పిస్తాను, యోగాన్ని జోడింపజేస్తాను. యోగాన్ని జోడింపజేసేవారు, జోలెను నింపేవారు, దుఃఖాన్ని దూరము చేసేవారు,......... అని అంటారు కదా. గీతకు పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తారు. యోగాన్ని నేర్పిస్తాను, నేర్పింపజేస్తాను కూడా. పిల్లలు యోగాన్ని నేర్చుకుని మళ్లీ ఇతరులకు నేర్పిస్తారు కదా. యోగము ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు................. అని అంటారు కదా. ఇలాంటి పాటలను కూడా ఇంట్లో కూర్చుని విన్నప్పటకీ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వాల నషా కూడా పెరుగుతుంది. కేవలం పరమాత్మ, భగవంతుడు అని అనడం వలన నోరు మధురంగా అవ్వదు. బాబా అంటేనే వారసత్వము.
ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆదిమధ్యాంతాల జ్ఞానము విని మళ్లీ ఇతరులకు వినిపిస్తారు. దీనినే 'శంఖ ధ్వని' అని అంటారు. ఏ పుస్తకాలు మొదలైనవి మీ చేతిలో లేవు. పిల్లలు కేవలం ధారణ చేయవలసి వస్తుంది. మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు, ఆత్మిక తండ్రి సంతానము. సత్యమైన గీత ద్వారా భారతదేశము స్వర్గంగా అవుతుంది. వారు కేవలం కూర్చుని కథలను తయారు చేశారు. మీరంతా పార్వతులు, మీకు ఈ అమరకథను వినిపిస్తున్నాను. మీరంతా ద్రౌపదులు, అక్కడ ఎవ్వరినీ వివస్త్రలుగా చెయ్యరు. అప్పుడు సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అరే! వారంతా నిర్వికారులు, కనుక వికారాల మాట ఎలా ఉంటుంది! యోగబలము ద్వారా సంతానోత్పత్తి ఎలా జరుగగలదో మీరు అర్థము చేసుకోలేరు. మీరు వాదిస్తారు. కానీ ఇవి శాస్త్రాలలోని మాటలు కదా. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ఇది వికారి ప్రపంచము, డ్రామానుసారంగా మాయ మళ్లీ మిమ్ములను దుఃఖితులుగా చేస్తుందని నాకు తెలుసు. నేను కల్ప-కల్పము నా కర్తవ్యము నిభాయించేందుకు వస్తాను. కల్పక్రితపు అపురూపమైన పిల్లలే వచ్చి తమ ఆస్తిని తీసుకుంటారని తెలుసు. లక్షణాలు కూడా కనబడ్తున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధము. మీరు మళ్లీ దేవీ దేవతలుగా, స్వర్గానికి అధికారులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఇందులో స్థూల యుద్ధము మాటే లేదు. అసురుల, దేవతల యుద్ధము జరగలేదు. అక్కడ యుద్ధము చేసేందుకు మాయనే లేదు. అర్ధకల్పము యుద్ధాలుండవు, జబ్బులుండవు, దుఃఖము-అశాంతులు కూడా ఉండవు. అరే! అక్కడ సదా సుఖము, సదా వసంత ఋతువు ఉంటుంది. ఆసుపత్రులుండవు కాని స్కూలులో చదవవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు. మనిషి చదువు ద్వారా తన కాళ్ల పై తాను నిలబడ్తాడు. దీని గురించి ఒక కథ కూడా ఉంది - నీవు ఎవరి సంపాదన తింటున్నావు? అని ప్రశ్నించినప్పుడు నేను నా భాగ్యాన్ని తింటున్నాను అని చెప్పారు. అది హద్దులోని భాగ్యము. ఇప్పుడు మీరు మీ బేహద్ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే 21 జన్మలు మీరు మీ రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తారు. ఇది బేహద్ సుఖమునిచ్చే వారసత్వము. భారతదేశము ఎంత సుఖప్రదంగా ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది! పిల్లలైన మీరు ఈ వ్యత్యాసాన్ని బాగా తెలుసుకున్నారు. ఎవరు కల్పక్రితము రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో, వారే ఇప్పుడు తీసుకుంటారు. డ్రామాలో ఏముంటే అది లభిస్తుందని అనుకోకండి, అలా అనుకుంటే ఆకలితో మరణిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థము చేసుకోవాలి. శాస్త్రాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయువును వ్రాసేశారు. అనేక మత-మతాంతరాలున్నాయి. మేము సదా సుఖంగా ఉండనే ఉన్నామని కొంతమంది చెప్తారు. అరే! మీకెప్పుడూ జబ్బులు రావా? రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి, ఆత్మ నిర్లేపి అని వారంటారు. అరే! దెబ్బ తగిలినప్పుడు దుఃఖము ఆత్మకే కలుగుతుంది కదా - ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇది పాఠశాల, చదివించే టీచరు ఒక్కరే. జ్ఞానము ఒక్కటే. నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము కూడా ఒక్కటే. ఎవరు ఫెయిల్ అవుతారో వారు చంద్ర వంశములోకి వెళ్ళిపోతారు. దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులుండరు, క్షత్రియులున్నప్పుడు వైశ్యులుండరు, వైశ్యులున్నప్పుడు శూద్రులుండరు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. మాతలకు కూడా ఇది చాలా సులభము. ఒకే పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారని అనుకోకండి. కాని ఇప్పుడు కొత్తవారు తీక్షణంగా ముందుకు పోతున్నారు. ప్రాక్టికల్‌గా జరుగుతూ ఉంది. మాయా రావణునికి ఏ రూపమూ లేదు. వీరిలో కామ భూతము ఉందని అంటారు కాని రావణునికి ఏ చిత్రమూ లేదు, శరీరమూ లేదు.
అన్ని విషయాల స్యాక్రిన్(సారము) మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగ అగ్నిలో వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తారు. తండ్రి మార్గదర్శకునిగా అయి వస్తాడు. బాబా చెప్తున్నారు - పిల్లలారా! నేను సన్ముఖములో పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను. కల్ప-కల్పము నా కర్తవ్యాన్ని పాలన చేస్తాను. పారలౌకిక తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీ సహయోగముతో నా బాధ్యతను నిర్వహించేందు వచ్చాను. సహయోగమిచ్చినట్లయితే మీరు పదవి కూడా పొందుతారు. నేను ఎంత శ్రేష్ఠమైన తండ్రిని, ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ - బ్రాహ్మణీలైన మీరంతా సోదరీ-సోదరులు. ఎప్పుడైతే సోదరి-సోదరులుగా అయ్యారో అప్పుడు స్త్రీ - పురుషులనే దృష్టి పరివర్తన అవుతుంది. తండ్రి చెప్తున్నారు - ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితము చేయండి, పవిత్రంగా ఉండేందుకు యుక్తులున్నాయి. ఇరువురూ జతలో ఉంటూ ఇలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా జరిగేందుకు వీలు లేదు అని మనుష్యులు అంటారు. బాబా చెప్తారు - మధ్యలో జ్ఞాన ఖడ్గముంటే ఎప్పుడూ అగ్ని అంటుకోదు, కాని ఇరువురూ మన్మనాభవ స్థితిలో ఉంటూ, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి. మనుష్యులు ఈ మాటలను అర్థము చేసుకోలేని కారణంగా హంగామా చేస్తారు. వీరు నిందలు కూడా వినవలసి ఉంటుంది. కృష్ణుని ఎవ్వరూ నిందించరు. కృష్ణుడు అలా వచ్చినట్లయితే విదేశాల నుండి కూడా ఒక్కసారిగా విమానాలలో వచ్చేస్తారు. పెద్ద గుంపు తయారవుతుంది. ఇంకా భారతదేశములో ఏమేం జరుగుతుందో చెప్పలేము.
మంచిది, ఈ రోజు భోగ్(నైవేద్యము) ఉంది - ఇది తండ్రి ఇల్లు, అది అత్తగారిల్లు. సంగమ యుగములో మిలనము జరుగుతుంది. కొందరు దీనిని ఇంద్రజాలమని అనుకుంటారు. సాక్షాత్కారమంటే ఏమిటో భక్తిమార్గములో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయో బాబా అర్థం చేయించారు. ఇందులో సంశయబుద్ధి గలవారిగా అవ్వరాదు. ఇది సాంప్రదాయము, ఆచారము. శివబాబా భండారము కనుక వారిని స్మృతి చేసి భోగ్ స్వీకారము చేయించాలి. యోగములో ఉండడం మంచిదే. బాబా స్మృతి ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని బ్రహ్మ ముఖ వంశావళి అని భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ బ్రాహ్మణ కులాన్ని కళంకితము చేయరాదు.
2. తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారులుగా అయి మీ బాధ్యతను పూర్తి చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులుగా ఉండాలి.
వరదానము :- '' సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసులుగా అయ్యే అంతర్ముఖీ భవ ''
సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అయ్యే ఆవశ్యకత ఉంది. చాలా మంది పిల్లలు అంతర్ముఖ స్థితిని అనుభవం చేసేందుకు, ఏకాంతవాసులుగా అయ్యేందుకు సమయమే లభించదని అంటారు. ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాచా ప్రవృత్తి చాలా పెరిగింది. కాని దీని కొరకు ఒకేసారి అర్ధగంట, ఒక గంట తీసుకునేందుకు బదులు మధ్య మధ్యలో కొంత సమయం కేటాయించినా(తీసుకున్నా) శక్తిశాలి స్థితి తయారవుతుంది.
స్లోగన్ :- ''బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేసేందుకు బదులు ఆనందంగా గడిపితే, కష్టం కూడా సహజమైపోతుంది ''
No comments:
Post a Comment