Monday, December 9, 2019

Telugu Murli 09/12/2019

09-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు, ఎవరి సర్వస్వాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తారో, ఆ పిల్లలదే పరమ సౌభాగ్యము ''

ప్రశ్న :- పిల్లల ఏ ఒక్క మరుపు కారణంగా మాయ చాలా బలిశాలిగా అవుతుంది ?
జవాబు :- పిల్లలు భోజనము చేసే సమయములో బాబాను మర్చిపోతారు, బాబాకు స్వీకారము చేయించని(తినిపించని) కారణముగా మాయ ఆ భోజనాన్ని తినేస్తుంది. దాని వలన అది శక్తిశాలిగా అయిపోతుంది తర్వాత అది పిల్లలనే కష్టపెడ్తుంది. ఈ చిన్నమరపు(పొరపాటు, తప్పు) మాయ చేతిలో ఓటమి పొందేలా చేస్తుంది కనుక పిల్లలారా, స్మృతిలో తినండి. మీతోనే తింటాను............... అనిదృఢంగా పత్రిజ్ఞ చేయండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడది రాజీ అవుతుంది.

పాట :- నేడు కాకుంటే రేపైనా ఈ మేఘాలు చెదిరిపోతాయి.......(ఆజ్‌ నహీ తో కల్‌ బిఖ్‌రేంగే యే బాదల్‌.....)

ఓంశాంతి. మా దుర్భాగ్యపు రోజులు మారిపోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని పిల్లలు అర్థం చేసుకున్నారు.నంబరువార్‌ పురుషార్థానుసారము భాగ్యము పరివర్తన అవుతూనే ఉంటుంది. పాఠశాలలో కూడా భాగ్యము పరివర్తన అవుతూ ఉంటుంది కదా అనగా శ్రేష్ఠంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి సమాప్తమవ్వనున్నది, భాగ్యము పరివర్తన అవుతూ ఉందని మీకు చాలా బాగా తెలుసు. జ్ఞాన వర్షము కురుస్తూ ఉంటుంది. మేము దుర్భాగ్యము నుండి సౌభాగ్యశాలురుగా అవుతున్నామని అనగా స్వర్గానికి అధికారులుగా అవుతున్నామని తెలివైన పిల్లలకు తెలుసు. నంబరువారు పురుషార్థానుసారము మనము దుర్భాగ్యాన్ని సౌభాగ్యంగా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి పగలుగా అవుతూ ఉంది. ఇది పిల్లలైన మీకు తప్ప ఇతరులకు తెలియదు. బాబా గుప్తమైనవారు కనుక వారి మాటలు కూడా గుప్తమైనవి. భలే మనుష్యులు సహజ రాజయోగము, సహజ జ్ఞానమనే మాటలు శాస్త్రాలలో వ్రాశారు. కానీ ఎవరైతే వ్రాశారో వారు మరణించారు. ఇక ఎవరు చదువుతున్నారో వారు ఏమీ అర్థము చేసుకోలేరు ఎందుకంటే వారు అవివేకులుగా ఉన్నారు. ఎంత వ్యత్యాసముంది. మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారము అర్థము చేసుకున్నారు. అందరూ ఒకే విధంగా పురుషార్థము చేయరు. దుర్భాగ్యమని దేనినంటారో, సౌభాగ్యమని దేనినంటారో కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన వారంతా గాఢాంధకారములో ఉన్నారు. వారికి అర్థము చేయించి మేల్కొల్పాలి. సూర్యవంశీయులను సౌభాగ్యశాలురని అంటారు. వారే 16 కళా సంపూర్ణులు. మనము స్వర్గాన్ని రచించే తండ్రి ద్వారా స్వర్గము కొరకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. ఇంగ్లీషు తెలిసిన వారికి కూడా మేము హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ ద్వారా స్వర్గ సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటామని మీరు అర్థము చేయించవచ్చు. స్వర్గములో సుఖముంది, నరకములో దుఃఖముంది. స్వర్ణిమ యుగమంటే సత్యయుగము సుఖము, ఇనుప యుగమంటే కలియుగము దుఃఖము. చాలా సహజమైన విషయము. ఇప్పుడు మనము పురుషార్థము చేస్తున్నాము. ఆంగ్లేయులు, క్రైస్తవులు మొదలైన వారు చాలా మంది వస్తారు. '' ఇప్పుడు మేము కేవలం ఒకే హెవన్లీ గాడ్‌ ఫాదర్‌ను స్మృతి చేస్తున్నాము, ఎందుకంటే మృత్యువు సమీపములోనే నిల్చొని ఉంది '' అని వారికి చెప్పండి. తండ్రి చెప్తారు - మీరు తీర్థ స్థానాలకు వెళ్లినట్లు నా వద్దకు రావాలి. బౌద్ధులకు తమ తీర్థ స్థానముంది, క్రైస్తవులకు తమ తీర్థ స్థానముంది. ప్రతి ఒక్కరికి వారివే అయిన ఆచార పద్ధతులుంటాయి. మనది బుద్ధి యోగము. ఎక్కడ నుండి పాత్ర చేసేందుకు వచ్చామో మళ్లీ అక్కడకు వెళ్ళాలి. వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్‌ఫాదర్‌. వారు మాకు తెలిపించారు, మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియజేస్తాము. గాడ్‌ఫాదర్‌ అయిన తండిన్రి స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి అయిపోతుంది. ఎవరైనా ఎప్పుడైనా అనారోగ్యము పాలైతే అందరూ వారి వద్దకు వెళ్ళి రామ రామ అనమని హెచ్చరిస్తారు. బెంగాళులో ఎవరైనా మరణిస్తున్నట్లయితే వారిని గంగా తీరానికి తీసుకెళ్లి హరి నామాన్ని చెప్పు అప్పుడు హరి వద్దకు వెళ్తావు అని చెప్తారు. అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. సత్యయుగంలో ఇలా రామ-రామ అని లేక హరి అని చెప్పమని ఎవ్వరూ చెప్పరు. ద్వాపరము నుండి ఈ భక్తిమార్గము ప్రారంభమయింది. సత్యయుగములో ఏ భగవంతుని లేక గురువును స్మృతి చేయరు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటానని అక్కడ కేవలం తమ ఆత్మ స్మృతి మాత్రమే ఉంటుంది. తమ సామ్రాజ్యము స్మృతి ఉంటుంది. మేము మా రాజ్యానికి వెళ్ళి జన్మ తీసుకుంటామని భావిస్తారు. ఇప్పుడు రాజ్యము తప్పకుండా లభిస్తుందనే నిశ్చయము పక్కాగా ఉంది కదా. మరి ఎవరిని స్మృతి చేస్తారు లేక ఎందుకు దాన-పుణ్యాలు చేస్తారు? అక్కడ దాన-పుణ్యాలు చేసేందుకు పేదవారు ఎవ్వరూ ఉండరు. భక్తి మార్గము ఆచారాలు - పద్ధతులు వేరు, జ్ఞాన మార్గము ఆచారాలు - పద్ధతులు వేరు. ఇప్పుడు తండిక్రి సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వాన్ని తీసేసుకున్నారు. ఇక దాన-పుణ్యాలు చేయవలసిన అవసరము లేదు. తండి అయిన ఈశ్వరునికి మనము సర్వస్వాన్ని ఇచ్చేస్తాము. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించకుంటే మరి ఇచ్చేది ఎలా ? స్వీకరించకుంటే అది కూడా దుర్భాగ్యమే. వారి మమకారాన్ని దూరము చేసేందుకు స్వీకరించవలసి వస్తుంది. ఈ రహస్యము కూడా పిల్లలైన మీకు తెలుసు. అవసరమే లేనప్పుడు ఎలా స్వీకరిస్తారు? ఇక్కడ ఏదీ కూడబెట్టుకోరాదు. ఇక్కడ నుండి మమకారాన్ని సమాప్తము చేసుకోవలసి ఉంటుంది.

బాబా అర్థం చేయిస్తున్నారు - ఎక్కడైనా వెలుపలకు వెళ్లునప్పుడు స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము బాబా పిల్లలము, మేము ఆత్మలము రాకెట్‌ కన్నా తీక్షణమైనవారము. ఇలా ఆత్మాభిమానిగా అయి నడిచి వెళ్తే అలసిపోరు. దేహ భావన రాదు. మేము కాళ్లతో నడవడం లేదు, ఎగురుతూ వెళ్తున్నామనిపిస్తుంది. ఆత్మాభిమానులుగా అయి మీరు ఎక్కడికైనా వెళ్లండి. ఇంతకుముందు మనుష్యులు తీర్థయాత్రలకు కాలినడకనే వెళ్లేవారు. ఆ సమయంలో మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా లేదు. చాలా శ్రద్ధతో వెళ్లేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయడం వలన సహాయము లభిస్తుంది కదా. భలే అది రాతి విగ్రహం అయినా ఆ సమయంలో బాబా అల్పకాలము కొరకు మనోకామనలను పూర్తి చేస్తారు. ఆ సమయములో రజోప్రధాన స్మృతి ఉండేది. కనుక దాని వలన కూడా శక్తి లభించేది, అలసట ఉండేది కాదు. ఇప్పుడు పెద్దవారు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థస్థానాలకు వెళ్తారు. ధనవంతులు చాలా ఆడంబరంగా గుఱ్ఱాలు మొదలైన వాటి పై వెళ్తారు. పేదవారు కాలినడకనే వెళ్తారు. భావనా ఫలము పేదవారికి లభించినంతగా ధనవంతులకు లభించదు. బాబా పేదల పెన్నిధి అని ఈ సమయములో కూడా మీకు తెలుసు. మరి ఎందుకు తికమక పడుతున్నారు?ఎందుకు మర్చిపోతున్నారు? బాబా చెప్తున్నారు - మీరు ఏమీ కష్టపడనవసరము లేదు. కేవలం ఒక్క ప్రియతముని స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయసులు కనుక ప్రియతముని స్మృతి చేయవలసి వస్తుంది. ఆ ప్రియునికి భోగ్‌ సమర్పించకుండా తినేందుకు సిగ్గు అనిపించదా? వారు ప్రియతముడే కాక తండ్రి కూడా అయినారు. నాకు మీరు తినిపించరా! అని అడుగుతున్నారు. మీరు నాకు తినిపించాలి కదా! చూడండి, బాబా యుక్తులు తెలియజేస్తున్నారు. మీరు తండ్రి లేక ప్రియతమునిగా అంగీకరిస్తున్నారు కదా. ఎవరు తినిపిస్తున్నారో వారికి మొదట తినిపించాల్సి ఉంటుంది. బాబా చెప్తారు - నాకు భోగ్‌ను స్వీకారము చేయించి, నా స్మృతిలో తినండి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబాను తప్పక స్మృతి చేయాలి అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. స్వయం ఈ బాబా కూడా పదే పదే పురుషార్థము చేస్తూ ఉంటారు. కుమారీలైన మీకు చాలా సహజము. మీరు మెట్లు ఎక్కనే లేదు. కన్యకు ప్రియునితో నిశ్చితార్థము జరగనే జరుగుతుంది. కనుక అలాంటి ప్రియతముని స్మృతి చేసి భోంచేయాలి. వారిని మనము స్మృతి చేస్తాము, వారు మన వద్దకు వచ్చేస్తారు. స్మృతి చేసినట్లయితే భావనను తీసుకుంటారు. కనుక బాబాతో ఇలా ఇలా మాట్లాడవలసి ఉంటుంది. రాత్రి మేల్కోవడం ద్వారా మీకు ఈ అభ్యాసము అవుతుంది. అభ్యాసమైనట్లైయితే పగలు కూడా స్మృతి ఉంటుంది. భోజనము చేయు సమయములో కూడా స్మృతి చేయాలి. ప్రియతమునితో మీ నిశ్చితార్థము జరిగింది. మీతోనే తింటాను............ అని పక్కా పత్రిజ్ఞ చేయాలి. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా. వారికి భావము మాత్రమే లభిస్తుంది ఎందుకంటే వారికి తన శరీరమైతే లేదు. కుమారీలకు చాలా సహజము. వారికి ఎక్కువ సౌకర్యాలున్నాయి. మన సుందర ప్రియతముడైన శివబాబా ఎంత మధురమైనవారు. అర్ధకల్పము మిమ్ములను స్మృతి చేశాము, ఇప్పుడు మీరు లభించారు. మేము ఏం తింటామో, అది మీరు కూడా తినండి అని వారికి చెప్పాలి. అలాగని ఒకసారి స్మృతి చేసి తర్వాత వారికి తినిపించడం మర్చిపోయి మీకు మీరే తినమని కాదు. వారిని మర్చిపోవడం ద్వారా వారికి లభించదు. చాలా పదార్థాలు తింటూ ఉంటారు. కిచడీ తింటారు, మామిడి పండు తింటారు, మిఠాయి తింటారు........... ప్రారంభములో స్మృతి చేస్తారు, అంతటితో సమాప్తం. మరి మిగిలింది వారు ఎలా తింటారు. పియ్రతముడు తినకుంటే మధ్యలో మాయ తినేస్తుంది, వారిని తిననివ్వదు. మాయ తిన్నట్లైతే అది శక్తిశాలిగా తయారవుతుంది, మిమ్ములను ఓడిస్తూ ఉంటుంది. బాబా యుక్తులన్నీ తెలియజేస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే తండ్రి లేక ప్రియతముడు చాలా సంతోషిస్తారు. పిల్లలు చెప్తారు - బాబా మీతోనే కూర్చుంటాము, మీతోనే తింటాము. మేము మిమ్ములను స్మృతి చేసి తింటాము, మీరు భావమునే తీసుకుంటారని జ్ఞానము ద్వారా తెలుసుకున్నాము. ఇది లోను తీసుకున్న శరీరము. స్మృతి చేయడం ద్వారా వారు వస్తారు. ఆధారమంతా మీ స్మృతి పైనే ఉంది. దీనిని యోగమని అంటారు. యోగములోనే శ్రమ ఉంది. సన్యాసులు - ఉదాసీనులు ఇలా ఎప్పుడూ చెప్పరు. ఒకవేళ మీరు పురుషార్థము చేయాలని అనుకుంటే బాబా శ్రీమతాన్ని నోట్‌ చేసుకోండి. పురుషార్థము పూర్తిగా చేయండి. ఈ బాబా తన అనుభవము తెలుపుతున్నారు - ''నేను ఏ కర్మలు ఎలా చేస్తానో, మీరు కూడా అలా చెయ్యండి'' అదే కర్మను నేను మీకు నేర్పిస్తానని చెప్తారు. బాబా అయితే కర్మ చేయరు. సత్యయుగములో కర్మ ఫలమును అనుభవించరు. బాబా చాలా సహజమైన విషయాలు తెలియజేస్తారు. మీతోనే కూర్చుంటాను, వింటాను, మీతోనే తింటాను.............. ఇది మీ గాయనమే. ప్రియతముని రూపములో లేక తండ్రి రూపములో స్మృతి చేయండి. విచార సాగర మథనము చేసి జ్ఞాన పాయింట్స్‌ తీస్తారని గాయనము చేయబడి ఉంది కదా. ఈ సాధన ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి. ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరు పురుషార్థము చేస్తారో వారికి

లాభముంటుంది. ఎవరు చేయరో, వారికి నష్టము కలుగుతుంది. ప్రపంచములోని వారంతా స్వర్గాధిపతులుగా అవ్వరు. ఇది కూడా

లెక్కాచారమే.బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. మేము యాత్రకు వెళ్తున్నామని పాట విన్నారు. యాత్రలో భోజనము మొదలైనవి తినవలసి ఉంటుంది. ప్రేయసి ప్రియతముని జతలో, కొడుకు తండ్రి జతలో తింటారు. ఇక్కడ కూడా అలాగే. మీకు ప్రియతముని పై ఎంత లగన్‌ ఉంటుందో అంత ఖుషీ పెరుగుతుంది. నిశ్చయబుద్ధి గలవారు విజయులుగా అవుతూ ఉంటారు. యోగము అనగా పరుగు. ఇది

బుద్ధియోగము యొక్క పరుగు. మనము విద్యార్థులము, టీచరు మనకు పరుగు తీయడం నేర్పిస్తారు. తండి చెప్తున్నారు - పగలు కేవలం కర్మనే చేయాలని అనుకోకండి. తాబేలు వలె కర్మ చేసి మళ్లీ స్మృతిలో కూర్చోండి. భ్రమరము పూర్తి రోజంతా భూ - భూ చేస్తూనే ఉంటుంది. కొన్ని ఎగిరిపోతాయి, కొన్ని మరణిస్తాయి, అది ఒక దృష్టాంతము(ఉదాహరణ). ఇక్కడ మీరు భూ - భూ చేసి మీ సమానంగా తయారు చేస్తారు. అందులో కొందరికి చాలా ప్రేమ ఉంటుంది, కొందరు పాడవుతారు, కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు, కొందరు పారిపోయి మళ్లీ పురుగులుగా అయిపోతారు. కనుక ఇలా భూ - భూ చేయడం చాలా సహజము. మనుష్యుల నుండి దేవతలుగా చేసేవారి గొప్పతనాన్ని వర్ణించలేము...... ఇప్పుడు మనము యోగాన్ని జోడిస్తున్నాము, దేవతలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నాము. ఇదే జ్ఞానము గీతలో ఉంది. వారు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్లారు. సత్యయుగములో అయితే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారిని సంగమ యుగములోనే వచ్చి దేవతలుగా చేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా అయ్యే యోగాన్ని నేర్పించరు. సత్యయుగము ఆదిలో దేవీ దేవతా ధర్మముండేది, కలియుగ అంత్యములో ఆసురీ ధర్మముంది. ఈ విషయము కేవలం గీతలోనే వ్రాయబడి ఉంది. మనుష్యులను దేవతలుగా చేసేందుకు సమయము పట్టదు ఎందుకంటే లక్ష్యమును తెలియజేస్తారు. అక్కడ మొత్తం ప్రపంచమంతా ఒకే ధర్మముంటుంది. ప్రపంచమంతా ఉంటుంది కదా. చైనా, యూరోప్‌ ఉండవని కాదు, ఉంటాయి కానీ అక్కడ మనుష్యులుండరు. కేవలం దేవతా ధర్మము వారుంటారు. మిగిలిన ధర్మాలవారు ఉండరు. ఇప్పుడిది కలియుగము. మనము భగవంతుని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. మీరు 21 జన్మలు సదా సుఖంగా ఉంటారని తండ్రి చెప్తారు. ఇందులో కష్టపడే మాటే లేదు. భక్తిమార్గములో భగవంతుని వద్దకు వెళ్లేందుకు ఎంత కష్టపడ్డారు. నిర్వాణధామానికి వెళ్లారని చెప్తారు. భగవంతుని వద్దకు వెళ్లారని ఎప్పుడూ చెప్పరు. స్వర్గానికి వెళ్ళారని చెప్తారు. ఒక్కరు వెళ్లడం ద్వారా స్వర్గము తయారవ్వదు. అందరూ వెళ్లాలి. భగవంతుడు మృత్యువుకే మృత్యువని గీతలో వ్రాయబడి ఉంది. దోమల వలె అందరినీ వాపస్‌ తీసుకెళ్తారు. చక్రము పునరావృతమవుతుందని బుద్ధి కూడా చెప్తుంది. కనుక మొట్టమొదట సత్యయుగ దేవీదేవతా ధర్మము తప్పకుండా రిపీట్‌ అవుతుంది. తర్వాత మళ్లీ ఇతర ధర్మాలు పునరావృతమవుతాయి. మన్మనాభవ అని బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు! 5 వేల సంవత్సరాల క్రితము కూడా గీతా భగవానుడు ప్రియమైన పిల్లలారా! అని చెప్పారు. ఒకవేళ కృష్ణుడు చెప్పినట్లైయితే ఇతర ధర్మాల వారు ఎవ్వరూ వినలేరు. భగవంతుడు చెప్పినట్లైతే గాడ్‌ఫాదర్‌ స్వర్గాన్ని స్థాపన చేస్తారని అందరికీ అనిపిస్తుంది. అందులో మేము వెళ్లి చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇందులో ఖర్చు మొదలైన మాటలేవీ లేవు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. పిల్లలైన మీరు విచార సాగర మథనము చేయాలి. కర్మ చేస్తూ రాతింబవళ్ళు ఇలా పురుషార్థము చేస్తూ ఉండండి. విచార సాగర మథనము చేయకుంటే లేక తండ్రిని స్మృతి చేయకుంటే కేవలం కర్మలే చేస్తూ ఉంటే రాతి కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇల్లు కట్టేవారికి ఇంటిని గురించిన ఆలోచనలే వస్తాయి. భలే విచార సాగర మథనము చేసే బాధ్యత వీరి పై ఉంది కానీ కలశము లక్ష్మికి ఇచ్చారు. కనుక మీరు లక్ష్మీగా అవుతారు కదా. మంచిది.మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు

ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శ్రీమతాన్ని నోట్‌ చేసుకుని పురుషార్థము చేయాలి. తండ్రి ఏ కర్మలు చేసి నేర్పించారో, ఆ కర్మలే చేయాలి. విచార సాగర మథనము చేసి జ్ఞాన పాయింట్లు తీయాలి.
2. మేము బాబా స్మృతిలోనే భోజనము తింటాము అని స్వయం మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను.............. ఈ ప్రమాణాన్ని పక్కాగా నిభాయించాలి.

వరదానము :- '' సాధనాలను నిర్లేపంగా లేక అతీతంగా అయి కార్యములో ఉపయోగించే బేహద్‌ వైరాగీ భవ ''
బేహద్‌ వైరాగులంటే ఎందులోనూ ఆకర్షణ లేనివారు, సదా ఒక్క తండ్రినే ప్రేమించేవారు. ఈ ప్రేమయే అతీతంగా చేస్తుంది. తండ్రి పై ప్రేమలేకుంటే అతీతంగా కూడా అవ్వలేరు. ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణలకు దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లేప స్థితి అని అంటారు. ఎలాంటి హద్దు ఆకర్షణ ప్రభావంలోకి రానివారు. రచన లేక సాధనాలను అతీతంగా(నిర్లేపంగా) ఉండి కార్యములో ఉపయోగించండి. ఇటువంటి బేహద్‌ వైరాగులనే రాజఋషులని అంటారు.

స్లోగన్‌ :- '' సత్యమైన, శుభ్రమైన హృదయముంటే సాహెబ్‌ (బాబా) రాజీ అవుతారు (సంతోషిస్తారు) ''

No comments:

Post a Comment