Thursday, December 12, 2019

Telugu Murli 13/12/2019

13-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థము మొదట మీరు చేయండి, తర్వాత మీ బంధు-మిత్రులతో కూడా చేయించండి. ధర్మము ఇంటి నుండే (ఛారిటీ బిగిన్స్‌ అట్‌ హోమ్‌ ) ప్రారంభమవుతుంది ''

ప్రశ్న :- సుఖ-శాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది ?
జవాబు :- పవిత్రత. ఎక్కడ పవితత్ర ఉంటుందో, అక్కడ సుఖ-శాంతులు ఉంటాయి. తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో, వారు వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది? అని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు శాంతి ప్రపంచములోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి.

ఓంశాంతి. ఓంశాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శివబాబా కూడా ఓంశాంతి అని చెప్తారు. సాలిగ్రామ పిల్లలు కూడా చెప్పవచ్చు. ఆత్మ ''ఓంశాంతి'' అని చెప్తుంది. శాంతి పిత సంతానము. శాంతి కొరకు అడవులు మొదలైన వాటికి వెళ్ళి ఏ ఉపాయము వెతకరు. ఆత్మ స్వరూపమే శాంతి. మరి ఉపాయము ఏం ఆలోచించాలి? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ సుఖ-శాంతులను పొందుతామో అక్కడికి తీసుకెళ్ళండి అని ఆ తండ్రినే అడుగుతారు. శాంతి-సుఖాలు మనుష్యులందరూ కోరుకుంటారు కాని సుఖ-శాంతుల కంటే ముందు పవిత్రత కావాలి. పవిత్రమైనవారిని పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వచ్చి మమ్ములను పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచములోని వారు పిలుస్తారు. వారు పతిత ప్రపంచము నుండి ముక్తులను చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్ళేవారు. సత్యయుగంలో పవిత్రత ఉంటుంది, కలియుగంలో అపవిత్రత ఉంది. అది నిర్వికార ప్రపంచము , ఇది వికారి ప్రపంచము. ప్రపంచము వృద్ధి చెందుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు. సత్యయుగము నిర్వికార ప్రపంచము కనుక అక్కడ తప్పకుండా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. ఆ కొద్ది మంది ఎవరై ఉంటారు? సత్యయుగములో పూర్తి దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది. దానినే శాంతి ప్రపంచము లేక సుఖధామము అని అంటారు. ఇది దుఃఖధామము. దుఃఖధామాన్ని పరివర్తన చేసి సుఖధామాన్ని తయారు చేయువారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. సుఖ వారసత్వము తప్పకుండా తండ్రి మాత్రమే ఇస్తారు. దుఃఖధామాన్ని మర్చిపోండి, శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రే చెప్తున్నారు. దీనినే ''మన్మనాభవ'' అని అంటారు. బాబా వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. దుఃఖధామాన్ని వినాశనము చేయించి శాంతిధామానికి తీసుకెళ్తారు. ఈ చక్రాన్ని అర్థము చేసుకోవాలి. 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఎవరు మొదట సుఖధామానికి వస్తారో వారికే 84 జన్మలుంటాయి. కేవలం ఈ మాటలు స్మృతి చెయ్యడం వలన కూడా పిల్లలు సుఖధామానికి అధికారులుగా అవ్వగలరు.

తండ్రి చెప్త్తున్నారు - పిల్లలూ, శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వము అనగా సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కనుక స్వయాన్ని శాంతిధామానికి, బ్రహ్మాండానికి అధికారినని భావించండిి. నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసిని అని భావించడం వలన ఈ పాత పప్రంచాన్ని నెమ్మదిగా మర్చిపోతారు. సత్యయుగము సుఖధామము కాని అందరూ సత్యయుగములోకి రాలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో, వారే ఈ మాటలను అర్థము చేసుకుంటారు. ఇది సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రే నేర్పిస్తారు. మిగిలినవన్నీ అసత్య సంపాదనలు. అవినాశి జ్ఞాన రత్నాల సంపాదననే సత్యమైన సంపాదన అని అంటారు. మిగిలిన వినాశి ధన సంపదలన్నీ అసత్య సంపాదన. ద్వాపర యుగము నుండి ఈ అసత్య సంపాదన చేస్తూ వచ్చారు. ఈ అవినాశి సత్యమైన సంపాదన ద్వారా లభించే ప్రాలబ్ధము సత్యయుగము నుండి ప్రారంభమై త్రేతా యుగములో పూర్తి అవుతుంది అనగా అర్ధకల్పము అనుభవిస్తారు. తర్వాత అసత్య సంపాదన ప్రారంభమవుతుంది. దీని ద్వారా అల్పకాల క్షణ భంగుర సుఖము లభిస్తుంది. ఈ అవినాశి జ్ఞాన రత్నాలను జ్ఞానసాగరులే ఇస్తారు. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు. భారతదేశము సత్య ఖండముగా ఉండేది. భారతదేశమే ఇప్పుడు అసత్య ఖండముగా అయింది. ఇతర ఖండాలను సత్య ఖండము, అసత్య ఖండము అని అనరు. సత్య ఖండాన్ని తయారు చేసే చక్రవర్తి, సత్యమైన భగవంతుడు వారే. సత్యమైనవారు ఒక్క గాడ్‌ఫాదరే. మిగిలినవారంతా అసత్య ఫాదర్‌లు(తండ్రులు)............. సత్యయుగంలో కూడా సత్యమైన తండ్రి లభిస్తారు ఎందుకంటే అక్కడ అసత్యముండదు, పాపాలు జరగవు. ఇది పాపాత్మల ప్రపంచము, అది పుణ్యాత్మల ప్రపంచము. కనుక ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థము చేయాలి! ఎవరైతే కల్పక్రితము సంపాదన చేశారో, వారే చేస్తారు. మొదట స్వయం ఈ సత్యమైన సంపాదన చేసి తర్వాత తండ్రి ఇంటిలో మరియు అత్తగారింటిలో ఈ సత్యమైన సంపాదన చేయించాలి. ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది.

సర్వవ్యాపి జ్ఞానం చెప్పేవారు భక్తి చేయలేరు. అందరూ భగవంతుని రూపమైనప్పుడు మరి ఎవరి భక్తి చేస్తారు? ఈ ఊబి నుండి వెలికి తీసేందుకు శ్రమ పడవలసి వస్తుంది. సన్యాసులు ఇంటి నుండే ధర్మము ఏం చేయగలరు? మొదట వారు ఇంటి సమాచారాన్ని చెప్పేవారే కాదు. ఎందుకు చెప్పరో చెప్పండి? అని అడిగితే చెప్పడంలో ఏముంది, ఫలానా ఇంటివారము, తర్వాత సన్యాసాన్ని ధారణ చేశాము అని చెప్తారు. మిమ్ములను అడిగితే మీరు వెంటనే చెప్పగలరు. సన్యాసులకు చాలా మంది అనుచరులు ఉంటారు. వారు ఒకవేళ కూర్చొని భగవంతుడు ఒక్కరే అని చెప్పినట్లయితే మీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? అని అందరూ వారిని అడుగుతారు. బి.కె.లు అని చెప్పినట్లయితే, వారి వ్యాపారమే పూర్తిగా సమాప్తమైపోతుంది. ఇలా ఎవరు వారి గౌరవాన్ని పోగొట్టుకుంటారు? తర్వాత వారికి భోజనము కూడా ఎవ్వరూ ఇవ్వరు. తర్వాత సన్యాసులకు చాలా కష్టమవుతుంది. మొదట మీ బంధు - మిత్రులు మొదలైన వారికి జ్ఞానమునిచ్చి సత్యమైన సంపాదన చేయించవలసి ఉంటుంది. దాని ద్వారా వారు 21 జన్మలకు సుఖము పొందుతారు. ఈ విషయము చాలా సహజము. కాని డ్రామాలో ఇన్ని శాస్త్రాలు, మందిరాలు మొదలైనవి తయారవ్వడం కూడా నిశ్చయింపబడింది.

ఇప్పుడు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచములో ఉండేవారు చెప్తారు. సత్యయుగానికి 5 వేల సంవత్సరాలు అయింది. వారు కలియుగము ఆయువే లక్షల సంవత్సరాలని చెప్పారు. కనుక సుఖధామము ఎక్కడ ఉంది? ఎప్పుడు ఉండేది? అని మనుష్యులు ఎలా అర్థము చేసుకుంటారు. మహాప్రళయమవుతుంది అప్పుడు మళ్లీ సత్యయుగము వస్తుంది, మొట్టమొదట శ్రీ కృష్ణుడు బొటన వ్రేలు నోటిలో పెట్టుకొని చప్పరిస్తూ సాగరములో రాగి ఆకు పై వస్తాడని వారు చెప్తారు. ఎక్కడి మాట ఎక్కడకు తీసుకెళ్లారు! ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - బ్రహ్మ ద్వారా నేను సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను కనుక విష్ణు నాభి కమలము ద్వారా బ్రహ్మను చూపిస్తారు. వారికి చేతిలో శాస్త్రాలను ఇచ్చేశారు. ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటాడు. సూక్ష్మవతనములో శాస్త్రాలే ఉండవు కదా. బ్రహ్మ ఇక్కడే ఉండాలి. విష్ణువు అనగా లక్ష్మీనారాయణుల రూపము కూడా ఇక్కడే ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. మళ్లీ విష్ణువు బ్రహ్మగా అవుతాడు. ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణువు వస్తాడా లేక విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడా? ఇవన్నీ అర్థము చేసుకోవల్సిన విషయాలు. కాని ఎవరు బాగా చదువుతారో వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. బాబా చెప్తారు - మీరు శరీరము వదిలే వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు పూర్తి 100 శాతము అవివేకులు, భికారులుగా అయిపోయారు. మీరే వివేకవంతులైన దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్లీ మీరే దేవీదేవతలుగా అవుతున్నారు. మనుష్యులు తయారు చేయలేరు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూర్తి కళా విహీనంగా అయిపోయారు. మీరు సుఖధామంలో చాలా శాంతిగా ఉండేవారు. ఇప్పుడు అశాంతిలో ఉన్నారు. మీరు 84 జన్మల లెక్కాచారాన్ని అర్థం చేయించగలరు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, మఠాలు - మార్గాల వారంతా ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఈ లెక్క తీయడం చాలా సహజము. స్వర్గానికి అధికారులుగా భారతవాసులే అవుతారు. అంటు కట్టబడ్తుంది కదా. ఇదే జ్ఞానము. మీరు స్వయం అర్థం చేసుకుంటే మళ్లీ మొట్టమొదట మీ తల్లిదండ్రులకు, సోదరీ-సోదరులకు జ్ఞానాన్నివ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. తర్వాత ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. తండ్రి ఇంటివారికి, అత్త ఇంటివారికి జ్ఞానము వినిపించాలి. వ్యాపారంలో కూడా మొదట తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. తల్లి ఇంటిని, అత్త ఇంటిని ఉద్ధారము చేసేవారే కన్య అని గాయనము కూడా ఉంది. అపవిత్రులు ఉద్ధరించలేరు. మరి ఎలాంటి కన్య? ఈమె బ్రహ్మ పుత్రిక, బ్రహ్మకుమారి కదా. ఇక్కడ అదర్‌ కన్య, కుమారీ కన్యల మందిరాలు కూడా తయారై ఉన్నాయి కదా. ఇక్కడ మీ స్మృతిచిహ్నాలు తయారై ఉన్నాయి. భారతదేశాన్ని మళ్లీ స్వర్గముగా తయారు చేసేందుకు మనము మళ్లీ వచ్చాము. ఈ దిల్వాడా మందిరము ఖచ్ఛితమైనది. పైన స్వర్గాన్ని చూపించారు. స్వర్గమున్నట్లయితే ఇక్కడే ఉంది. రాజయోగ తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది. ఎవరి మందిరమో వారు దీనిని గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు లోపల జగత్పిత, జగదంబ, ఆదిదేవ్‌, ఆదిదేవి కూర్చుని ఉన్నారు. మంచిది, ఆదిదేవుడు ఎవరి సంతానము? శివబాబా సంతానము. మాతలు(అదర్‌ కుమారీలు), కన్యలు అందరూ రాజయోగములో కూర్చొని ఉన్నారు. బాబా చెప్తున్నారు - ''మన్మనాభవ.'' అలా ఉంటే మీరు వైకుంఠానికి అధికారులుగా అవుతారు. ముక్తి-జీవన్ముక్తిని స్మృతి చేయండి. ఇది మీ సన్యాసము. జైనుల సన్యాసము ఎంత కష్టమైనది! కేశాలు మొదలైనవి తొలగించటం ఎంత కఠినమైన పద్ధతి. ఇది సహజ రాజయోగము. ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది. ఇది డ్రామాలో రచింపబడింది. ఎవరైనా జైనుల ముని వచ్చి తమ కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము అని అనరు కదా. ఇప్పుడది ప్రాయ: లోపమైపోయింది. ఎవరో జైన ధర్మాన్ని నడిపించారు, అది కొనసాగింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఆదిదేవుని తండ్రి అని, జగదంబను తల్లి అని అంటారు. ఆది దేవుడు బ్రహ్మ అని అందరికి తెలుసు. ఆదమ్‌ - బీబీ, ఆడమ్‌ - ఈవ్‌ అని కూడా అంటారు. ఈ ఆడమ్‌ - ఈవ్‌లు ఇప్పుడు తపస్సు చేస్తున్నారని క్రైస్తవులకు తెలియదు. మనుష్య సృష్టి వంశానికి వీరు అధిపతి. ఈ రహస్యాన్ని కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివుని మరియు లక్ష్మి నారాయణుల మందిరాలు ఇన్ని ఉన్నాయి, మరి వారి జీవితచరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇది కూడా జ్ఞాన సాగరులైన తండ్రే అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మనే జ్ఞానపూర్ణులు, జ్ఞానసాగరులు, ఆనందసాగరులు అని అంటారు. పరమాత్ముని ఈ మహిమను గురించి ఏ సాధుసన్యాసులకు తెలియదు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మరి ఎవరిని మహిమ చేస్తారు? పరమాత్మను తెలుసుకోలేని కారణంగానే వారు తమను తాము శివోహం అని చెప్పుకుంటారు. లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత గొప్పది! వారు మనుష్య సృష్టికి బీజరూపము. ముసల్మానులు కూడా మనకు ఖుదా జన్మనిచ్చారని చెప్తారు. కనుక మనము వారి రచన. రచన రచనకు ఆస్తిని ఇవ్వలేరు. రచనకు సృష్టికర్త ద్వారా ఆస్తి లభిస్తుంది. ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థము చేసుకోరు. వారు బీజరూపులు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. బీజములో తప్ప పూర్తి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఏ మనుష్య మాత్రులలో ఉండదు. బీజము చైతన్యమైనది కనుక తప్పకుండా జ్ఞానము వారిలోనే ఉంటుంది. వారే వచ్చి మీకు పూర్తి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిస్తారు. ఈ చక్రమును తెలుసుకోవడం వలన మీరు సత్యయుగంలో చక్రవర్తి రాజులుగా లేక స్వర్గములో రాజులుగా అవుతారని కూడా బోర్డు వేయాలి. ఎంత సహజమైన విషయము. బాబా చెప్తున్నారు - జీవించి ఉన్నంత వరకు నన్ను స్మృతి చేయాలి. నేను స్వయంగా మీకు ఈ వశీకరణ మంత్రాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. ఈ స్వదర్శన చక్రము త్రిప్పుతూ ఉంటే మాయ తల తెగిపోతుంది. నేను ఆత్మలైన మిమ్ములను పవిత్రంగా చేసి తీసుకెళ్తాను. తర్వాత మీరు సతోప్రధాన శరీరము తీసుకుంటారు. అక్కడ వికారాలు ఉండవు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? అని అడుగుతారు. మీరు బహుశా దేవతల పూజారులు కాదని వారికి చెప్పండి. లక్ష్మీనారాయణులకు సంపూర్ణ నిర్వికారులని మహిమ చేస్తారు. జగదంబ, జగత్పితలు నిర్వికారులు. రాజయోగ తపస్సు చేసి పతితుల నుండి పావనంగా, స్వర్గానికి అధికారులుగా అయ్యారు. పుణ్యాత్మలుగా అయ్యేందుకే తపస్సు చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి. శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయించాలి.
2. రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్మలుగా చేసుకోవాలి. మాయ తలను ఖండించేందుకు స్వదర్శన చక్రము సదా తిప్పుతూ ఉండాలి.

వరదానము :- '' శాంతి శక్తిని ప్రయోగించుట ద్వారా కార్యములో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగీ ఆత్మా భవ ''
ఇప్పుడు సమయ పరివర్తన అనుసారం శాంతిశక్తినిచ్చే సాధనాలను ప్రయోగించి ప్రయోగీ ఆత్మగా అవ్వండి. ఎలాగైతే వాచా ద్వారా ఆత్మలలో స్నేహ సహయోగ భావనను ఉత్పన్నము చేస్తారో, అలా శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నము చేయండి. ఎలాగైతే ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుందో, అలా మీ శక్తిశాలి శుభ భావనలు ఇతరులలో సర్వ శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చేస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యాలలో కూడా చాలా సహజ సఫలతను ప్రాప్తి చేసుకోగలరు. కేవలం ప్రయోగం చేసి చూడండి.

స్లోగన్‌ :- '' అందరికి ప్రియంగా అవ్వాలంటే, వికసించిన ఆత్మిక గులాబి పుష్పాలుగా అవ్వండి, వాడిపోకండి. ''

No comments:

Post a Comment