Friday, December 6, 2019

Telugu Murli 07/12/2019

07-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభము. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు, కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి ''

ప్రశ్న :- చిన్న పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన(అభ్యాసము) తప్పకుండా చేయాలి ?
జవాబు :- ప్రతి ఒక్కరు మురళిని చెప్పే సాధన(అభ్యాసము) తప్పకుండా చేయాలి, ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. ఒకవేళ మురళి నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడ్తుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. మీరు ఏం చదువుతారో, దానిని ఇతరులచే చదివించాలి. చిన్న పిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్‌ తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు.

ఓంశాంతి. ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది. దానిని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు అర్థం చేయించారు. అలా మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్ములను చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు. శివబాబా మిమ్ములను చదివించారు. ఈ శరీరము ద్వారా చదివించారని మీకు తెలుసు. మనము శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము. శివుని పేరే చెప్తాము. వారు నిరాకారులు. వారిని శివుడు అని అంటారు. శివుడు జనన-మరణ రహితుడని వారు చెప్తారు. మరి వారి జయంతి ఎలా జరుగుతుంది? నంబరువారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. ఇంకా ఆచరిస్తూనే ఉంటారు. కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి ఈ తనువును ఆధారంగా తీసుకుంటారు. నోరు తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికే మహిమ ఉంది. ఈ రహస్యము కొద్దిగా క్లిష్టమైనది. శివబాబా కర్తవ్యాన్ని అర్థము చేసుకోవాలి. మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, వారి నుండే మనకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. భారతదేశానికే బేహద్‌ వారసత్వము ఉండేది. ఇతరులెవ్వరికీ ఉండదు. భారతదేశాన్నే సత్య ఖండమని అంటారు, తండ్రిని కూడా సత్యము(ట్రూత్‌) అని అంటారు. ఈ విషయాలను అర్థము చేయించవలసి ఉంటుంది. కానీ కొందరికి త్వరగా అర్థము కాదు. కొందరు త్వరగా అర్థము చేసుకుంటారు. ఈ యోగము, చదువు రెండూ జారిపోయేవే. అందులో కూడా యోగము ఎక్కువగా జారిపోతుంది. జ్ఞానము బుద్ధిలో ఉంటుంది కాని స్మృతి చేయడం క్షణ-క్షణము మర్చిపోతారు. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అను జ్ఞానము మీ బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానము ఉంటుందో వారే బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు - ఎవరు మొట్టమొదటి నెంబరులో వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. మొట్టమొదటి సర్వ శ్రేష్ఠులని లక్ష్మీనారాయణులను అంటారు. నరుని నుండి నారాయణునునిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనది. పౌర్ణమి రోజున చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది. ఇప్పుడు మనము నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది పావనంగా అయ్యే చదువు, అన్ని చదువుల కంటే చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి, ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, యువకులు ఎవరైనా అందరికీ ఒకే చదువు. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. తల్లిదండ్రులు, పిల్లలకు కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉండాలి. సమయం చాలా ఉంటుంది. శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పించబడ్తుంది. ఆత్మ, శరీరము రెండింటి తండ్రి వేరు వేరుగా ఉన్నారు. ఆత్మ(పరమాత్ముని సంతానము) కూడా నిరాకారమే. తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని, చాలా సూక్ష్మంగా ఉంటారని కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మర్చిపోరాదు. ఆత్మలమైన మనము కూడా బిందువులము, సూక్ష్మమైనవారము. పైకి వెళ్తే పెద్దగా కనబడడము, క్రిందికి వస్తే చిన్నగా అవ్వడము ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే, మీకు కనిపించరు. బిందువు కదా, బిందువు ఏం కనిపిస్తుంది! ఈ విషయాల పై పిల్లలు బాగా మననము కూడా చేయాలి. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రను అభినయించేందుకు పై నుండి వచ్చాము. ఆత్మ పెరగడము, తరగడము ఉండదు. అవయవాలు మొదట చిన్నవిగా, తర్వాత పెద్దవిగా అవుతాయి.

ఇప్పుడు మీరు ఎలా అర్థము చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నంబరువారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. ఇది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి. తండ్రిలో జ్ఞానముంది. వారు అతిసూక్ష్మమైన పరమాత్మ, సదా పరంధామములో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమ యుగములో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖమునివ్వండి అని తండ్రిని పిలుస్తారు. బాబా, మీరు వచ్చి మమ్ములను పతిత ప్రపంచము నుండి నూతన సత్యయుగ సుఖీ పావన ప్రపంచానికి తీసుకు వెళ్ళండి లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియజేయండి అని మనము పిలుస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. ఇవి చాలా సాధారణ విషయాలు. నోట్‌ చేసుకోవాలి. ఈ రోజు బాబా ఇలా అర్థం చేయించారు. మేము కూడా ఇలా అర్థం చేయించాము. ఇలా అభ్యాసము చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది. మీరు మురళీధరుని సంతానము కనుక మీరు తప్పకుండా మురళిధరులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు కళ్యాణము చేస్తారో అప్పుడే నూతన ప్రపంచములో ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువు ఇక్కడి కొరకే. ఈ చదువు భవిష్య నూతన ప్రపంచము కొరకు. అక్కడ సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ సతాయించే 5 వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యము అనగా పరాయి రాజ్యములో మనమున్నాము. మీరే మొదట మీ రాజ్యములో ఉండేవారు, దానిని మీరు నూతన ప్రపంచము అని అంటారు. మళ్లీ అదే భారతదేశమునే పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచములో భారతదేశము,................. అను గాయనము కూడా ఉంది. నూతన ప్రపంచములో ఇస్లామీయులు, బౌద్ధులు అని అనరు. తండ్రి వచ్చి పిల్లలైన మనలను మేల్కొలుపుతున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది. వారు వచ్చి భారతదేశాన్నే స్వర్గంగా చేస్తారు. భారతదేశమే మొదటి దేశము. మొదటి భారతదేశమునే స్వర్గమని అంటారు. భారతదేశము ఆయువు కూడా పరిమితమయింది. లక్షల సంవత్సరాలని అనడం అపరిమితమైపోతుంది. లక్షల సంవత్సరాల విషయమేదీ స్మృతిలో ఉండదు. ఒకప్పుడు నూతన భారతదేశము ఉండేది, ఇప్పుడు దానిని పాత భారతమనే అంటారు. భారతదేశమే నూతన ప్రపంచంగా అవుతుంది. మనమిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా, పవిత్రంగా అవుతుంది మళ్లీ శరీరము కూడా కొత్తది లభిస్తుందని తండ్రి సలహా ఇస్తున్నారు. ఆత్మ, శరీరము రెండూ సతోప్రధానంగా అవుతాయి. మీకు సుఖము కొరకే రాజ్యము లభిస్తుంది. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. నూతన ప్రపంచములో సుఖ-శాంతులు రెండూ ఉన్నాయి. అక్కడ ఏ తుఫానులు మొదలైనవేవీ ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు. ఇక్కడ అశాంతి ఉంది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ శాంతిగా ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా! ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇవి బేహద్‌ విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టరి, ఇంజనీరింగు మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్‌ జ్ఞానముంది. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే బేహద్‌ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బేహద్‌ డ్రామా ఎలా నడుస్తుంది అను పేరు కూడా వినలేదు. సత్యయుగ, త్రేతా యుగాలు గడిచిపోయాయని వాటిలో వీరి రాజ్యాలుండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతా యుగములో రామ రాజ్యముండేది, తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లామ్‌, బౌద్ధ, క్రైస్తవ.................. అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపే వచ్చాయి. ఇందులో 1250 సంవత్సరాలు కలియుగము. అంతా లెక్క ఉంది కదా. సృష్టి ఆయువే 2500 సంవత్సరాలని కాదు. మంచిది, ఇంకా ఎవరు ఉండేవారు అని ఆలోచించబడ్తుంది. వారి ముందు దేవీదేవతలు,........... వారు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలున్నవారు. సూర్యవంశీ, చంద్ర వంశీయులు 2500 సంవత్సరములలో ఉన్నారు. మిగిలిన అర్ధములో వీరంతా ఉండేవారు. ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారము వెలువడదు. పూర్తి, ముప్పాతిక, అర్ధ, పాతిక - నాలుగు భాగాలున్నాయి. నియమానుసారము ముక్కలు-ముక్కలుగా చేస్తారు కదా. అర్ధములో అయితే ఇది ఉంది. సత్యయుగములో సూర్యవంశీ రాజ్యము, త్రేతా యుగములో చంద్రవంశీ రామరాజ్యము అని కూడా అంటారు. ఇది మీరు ఋజువు చేసి తెలియజేస్తారు. కనుక ఎవరైతే మొట్టమొదట సత్యయుగములో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. కల్పమే 5 వేల సంవత్సరాలు. వారు 84 లక్ష యోనులని అనేస్తారు. కనుక కల్పము ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు. ఎవరూ ఒప్పుకోరు కూడా. ఇంత పెద్ద ప్రపంచము ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానము, ఇది జ్ఞానము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము ఎక్కడ నుండి వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరులైతే తండ్రి ఒక్కరే. వారే ఈ నోటి ద్వారా జ్ఞానమునిస్తున్నారు. గోముఖము అని అంటారు, ఈ గోమాత ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజము. ఒక రోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్లీ ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. పాఠశాలలో ఒక రోజు చదివిస్తారా లేక రెగ్యులర్‌గా రోజూ చదవాల్సి వస్తుందా? జ్ఞానము ఒక్క రోజులో అర్థం చేసుకోలేరు. బేహద్‌ తండ్రి మనలను చదివిస్తున్నారు కనుక తప్పకుండా బేహద్‌ చదువే అయ్యి ఉంటుంది. బేహద్‌ రాజ్యాన్నిస్తారు. భారతదేశములో బేహద్‌ రాజ్యముండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు బేహద్‌ రాజ్యము చేసేవారు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు? అని ప్రశ్నించేందుకు ఎవ్వరికీ ఈ విషయాలు స్వప్నములో కూడా స్పురించి ఉండవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనము కూడా యోగులుగా ఉండేవారము. తర్వాత మళ్లీ 84 జన్మలు తీసుకుని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మినారాయణులు కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుష్యులకు తెలియదు. వీరిని భగవాన్‌ - భగవతి అని అనలేరు. వీరి కంటే ముందు 84 జన్మలు తీసుకున్నవారు ఎవ్వరూ లేరు. మొట్టమొదట సత్యయుగములో ఎవరు రాజ్యము చేస్తారో, వారే 84 జన్మలు తీసుకుని నంబరువారుగా క్రిందకు వస్తారు. ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాము తర్వాత మనమే క్షత్రియులము,.......... డిగ్రీ తగ్గిపోతుంది. పూజ్యుల నుండి పూజారులు అని మహిమ కూడా ఉంది. సతోప్రధానము నుండి మళ్లీ తమోప్రధానంగా అవుతారు. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజమైనది! కాని మాయ ఎలాంటిదంటే అన్ని విషయాలను మరిపింపజేస్తుంది. ఈ అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు. కానీ అవేవీ ఉండవు. ఇది తాత్కాలికము. తండ్రి ఏ గీతనూ వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారౌతాయి. మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయములో కాలిపోతాయి. సత్య, త్రేతా యుగాలలో ఏ పుస్తకాలు ఉండవు. తర్వాత భక్తిమార్గములో మళ్లీ తయారవుతాయి. ఎన్నో వస్తువులు తయారవుతాయి. రావణుని కూడా తయారు చేస్తారు కానీ రావణుడంటే ఎవరో ఏమీ తెలుపలేరు. ప్రతి సంవత్సరము తయారు చేస్తారు, తగులబెట్తారు కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడని తండ్రి చెప్తున్నారు. కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవ్వరికీ తెలియదు. సీతను అపహరించాడు కనుక బహూశా శత్రువుగా ఉంటాడని వారు భావిస్తారు. రాముని సీతను అపహరించాడంటే పెద్ద గజదొంగ అయ్యి ఉంటాడు కదా! ఎప్పుడు దొంగతనము చేస్తాడు! త్రేతాలోనా, త్రేతా యుగము అంత్యములోనా! ఈ విషయాల పై కూడా విచారము చేయబడ్తుంది. ఎప్పుడు దొంగతనము జరగాలి! ఏ రాముని సీత అపహరించబడింది. రామ-సీతల రాజధాని కూడా నడిచిందా? ఒకే రామ-సీతలు ఉన్నారా? శాస్త్ర్రాలలో ఇది ఒక కథలాగా వ్రాయబడి ఉంది. ఏ సీత? అని ఆలోచించబడ్తుంది. 12 మంది రామ-సీతలు ఉంటారు కదా. మరి ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అయ్యి ఉంటుంది. రాముని సీత అపహరించబడిందని చెప్తారు. ఇప్పుడు రామరాజ్యములో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు. తప్పకుండా వారి వంశముంటుంది. కనుక ఏ నంబరు సీత అపహరించబడింది. ఇవన్నీ చాలా అర్థము చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - భక్తిమార్గములో మనుష్యులు ఎన్ని దెబ్బలు తింటూ తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు, ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు - ''బాబా, ఈ దుఃఖము నుండి విడిపించండి,..............'' అని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువేమీ కాదు కదా. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్ర్రతి సంవత్సరము ఎందుకు చంపుతారు! రావణునికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రమును తయారు చేసి తగులబెట్టడం ఎప్పుడూ చూడలేదు. కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య కాయము..... ఇప్పుడు మీరు అసత్య మనుష్యుల నుండి సత్య దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వ్యత్యాసముంది కదా! అక్కడైతే సదా సత్యమే చెప్తారు. అది సత్య ఖండము, ఇది అసత్య ఖండము. కనుక అసత్యమే చెప్తూ ఉంటారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానసాగరులైన తండ్రి ప్రతి రోజు ఏ బేహద్‌ చదువును చదివిస్తున్నారో, దాని పై విచార సాగర మథనము చేయాలి. ఏం చదివారో దానిని ఇతరులచే కూడా తప్పకుండా చదివించాలి.
2. ఈ బేహద్‌ డ్రామా ఎలా నడుస్తోంది, ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా, ఈ రహస్యాన్ని బాగా అర్థము చేసుకొని మళ్లీ అర్థము చేయించాలి.

వరదానము :- '' మీ సూక్ష్మ శక్తుల పై విజయులుగా అయ్యే రాజఋషి స్వరాజ్య అధికారి ఆత్మా భవ ''
కర్మేంద్రియాజీతులుగా అవ్వడం సులభమే కాని మనసు, బుద్ధి, సంస్కారాలనే సూక్ష్మ శక్తుల పై విజయులుగా అయ్యేందుకు సూక్ష్మ అభ్యాసం కావాలి. ఏ సమయంలో ఏ సంకల్పము, ఏ సంస్కారము ఎమర్జ్‌ అవ్వాలనుకుంటే(ఉత్పన్నము చేయాలనుకుంటే) అదే సంకల్పము, అదే సంస్కారాన్ని సహజంగా స్వతం చేసుకోవాలి. దీనినే సూక్ష్మ శక్తుల పై విజయము అనగా రాజఋషి స్థితి అని అంటారు. ఒకవేళ సంకల్ప శక్తిని ఇప్పటికిప్పుడే ఏకాగ్రంగా అయిపో అని ఆజ్ఞాపిస్తే అది వెంటనే రాజాజ్ఞను అదే ఘడియ అదే విధంగా అంగీకరించడమే - రాజ్యధికారానికి గుర్తు. ఈ అభ్యాసముతో అంతిమ పరీక్షలో పాస్‌ అవుతారు.

స్లోగన్‌ :- '' సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలైతే లభిస్తాయో, అదే అన్నిటికంటే గొప్ప వరము ''

No comments:

Post a Comment