Tuesday, December 3, 2019

Telugu Murli 04/12/2019

04-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఆధారమంతా కర్మల పై ఉంది, మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి ఉల్టా(విరుద్ధ) కర్మలు జరగకుండా సదా గమనముంచాలి ''

ప్రశ్న :- తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధివంతులెవరు ?
జవాబు :- పవిత్రతా ధారణ ఉన్నవారే బుద్ధివంతులు. ఎవరు పతితులుగా ఉన్నారో వారు బుద్ధిహీనులు. లక్ష్మీనారాయణులను అందరికన్నా అధిక బుద్ధివంతులని అంటారు. పిల్లలైన మీరు కూడా బుద్ధివంతులుగా అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది పవిత్రతే. కనుక తండ్రి అప్రమత్తము చేస్తున్నారు - పిల్లలారా! ఈ కళ్ళు మోసము చేయరాదు, వీటిని సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లుండండి. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయండి.

ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలు - ఈ పాత ప్రపంచములో ఇప్పుడు మనము కొద్ది రోజుల యాత్రికులమని అర్థం చేసుకున్నారు. ఇంకా దాదాపు 40 వేల సంవత్సరాలు ఇక్కడ ఉంటామని ప్రపంచములోని మనుష్యులు భావిస్తారు. పిల్లలైన మీకైతే ఇక కొంత కాలమే అని నిశ్చయముంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నప్పటికీ మీరు ఆంతరికముగా గద్గదమవ్వాలి(సంతోషంగా ఉండాలి). ఈ కళ్ళ ద్వారా ఏమేం చూస్తారో అవన్నీ వినాశనమయ్యేవి. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలమైన మనము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వాపస్‌ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచము ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వస్తారు. క్రొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా ఎలా అవుతుందో మీ బుద్ధిలో ఉంది. మనము అనేకసార్లు చక్రము తిరిగి వచ్చాము. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. నూతన ప్రపంచములో మనము కొద్దిమంది దేవతలము మాత్రమే ఉంటాము. మనుష్యులు ఉండరు, కానీ అంతా కర్మల పై ఆధారపడి ఉంది. మనుష్యులు ఉల్టా కర్మలు చేసినట్లైయితే అది తప్పకుండా తింటూ ఉంటుంది. కనుక ఈ జన్మలో అలాంటి పాపాలు ఏవీ చేయలేదు కదా? అని బాబా అడుగుతారు. ఇది పతిత ఛీ-ఛీ రావణరాజ్యము. ఇది అంధకార అల్లరి ప్రపంచము. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు వారసత్వమునిస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. భక్తి అను అంధకారములో ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు బాబా చెయ్యి లభించింది. బాబా సహయోగము లేకుండా మీరు విషయవైతరిణీ నదిలో మునకలు వేస్తుండేవారు. అర్ధకల్పము భక్తి ఉంటుంది. జ్ఞానము లభించడం ద్వారా మీరు సత్యయుగ నూతన ప్రపంచానికి వెళ్లిపోతారు. ఇప్పుడిది సంగమ యుగము. పతితులుగా, ఛీ-ఛీగా ఉన్న మీరు పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారు? అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మ మరియు విష్ణువుల కర్తవ్యాలను కూడా తెలుసుకున్నారు. కనుక మీలో ఎంతటి శుద్ధమైన నషా ఉండాలి. మూల వతనము, సూక్ష్మ వతనము, స్థూల వతనము......... ఇవన్నీ సంగమ యుగములో మాత్రమే ఉంటాయి. తండ్రి ఇప్పుడు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - ఇది పాత, కొత్త ప్రపంచాల సంగమ యుగము. పతితులను పావనంగా చేసేందుకు రండి,........... అని పిలుస్తారు కూడా. ఈ సంగమ యుగములో తండ్రి కూడా పాత్రను అభినయిస్తారు. వారు సృష్టికర్త, దర్శకులు కూడా కదా. కనుక తప్పకుండా వారి కర్తవ్యమేదో ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరని, వారికి తమ స్వంత శరీరము లేదని అందరికీ తెలుసు. మిగిలిన వారందరినీ మనుష్యులు, దేవతలు అని అంటారు. శివబాబాను దేవత అని గాని, మనిషి అని గాని అనరు. వారు తాత్కాలికంగా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. గర్భము నుండి జన్మించలేదు. తండ్రే స్వయంగా చెప్తున్నారు - పిల్లలారా! శరీరము లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను! మనుష్యులు నా గురించి రాళ్లు-రప్పలలో పరమాత్మ ఉన్నారని చెప్తారు కాని నేను ఎలా వస్తానో పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని ఏ మనుష్యులూ నేర్పించలేరు. దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగములో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు.

మనమిప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లలలో అపారమైన సంతోషముండాలి. తండ్రి కల్ప-కల్పము వస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఇది అనేక జన్మల అంతిమ జన్మ. శ్రీ కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడే మళ్లీ 84 జన్మల చక్రములో తిరుగుతాడు. శివబాబా 84 జన్మల చక్రములోకి రారు. శ్రీ కృష్ణుని ఆత్మనే సుందరము(తెలుపు) నుండి నల్ల(శ్యామం)గా అవుతుంది, శ్యామంగా అయిన తర్వాత మళ్లీ అదే నల్లగా అవుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగానే తెలుసు. మాయ చాలా కఠినమైనది. ఎవ్వరినీ వదలదు. తండ్రికి అన్ని విషయాలు తెలుస్తాయి. మాయ మొసలి ఒక్కసారిగా మింగేస్తుంది. ఇది తండ్రికి బాగా తెలుసు. అలాగని తండ్రి అంతర్యామి అని అనుకోకండి. కాదు, బాబాకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు. సమాచారమైతే వస్తుంది కదా. మాయ ఒక్కసారిగా పచ్చి-పచ్చిగానే కడుపులో వేసుకుంటుంది. ఇటువంటి చాలా విషయాలు పిల్లలైన మీకు తెలియవు. తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. కనుక మనుష్యులు పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు. తండ్రి అంటున్నారు - నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా తెలుస్తుంది కదా. చాలా ఛీ-చీ గా నడుస్తూ ఉంటారు. కనుక తండ్రి క్షణ-క్షణము పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు. మాయ నుండి కాపాడుకోవాలి. తండ్రి అర్థము చేయిస్తూనే ఉంటారు అయినా బుద్ధిలో నిలబడదు. కామము మహాశత్రువు, మేము వికారాల వశమైనామని తెలియను కూడా తెలియదు. అలా కూడా జరుగుతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు - ఏవైెనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా తండ్రికి తెలియజేయండి, వాటిని దాచకండి. తెలపకుంటే పాపము నూరు రెట్లు పెరుగుతుంది. అది లోపల తింటూ ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్కసారిగా క్రింద పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తి సత్యంగా వ్యవహరించాలి. లేకుంటే చాలా చాలా నష్టము కలుగుతుంది. ఇది రావణ ప్రపంచము. రావణ ప్రపంచాన్ని మనమెందుకు స్మృతి చేయాలి? మనము నూతన ప్రపంచములోకి వెళ్ళాలి. తండ్రి కొత్త ఇల్లు మొదలైనవాటిని కట్టిస్తున్నప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతోందని పిల్లలు భావిస్తారు, సంతోషమవుతుంది. ఇది బేహద్‌ విషయము. మన కొరకు నూతన ప్రపంచము, స్వర్గము తయారవుతోంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి వెళ్లేవారము. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము. మనము వికారాలకు వశమై ముళ్ళుగా తయారైనాము. రాని వారు మాయకు వశమైపోయి తండ్రి వద్ద ఉండనే ఉండరని, విశ్వాస ద్రోహులు(ట్రైటర్‌)గా అయ్యారని, పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారని పిల్లలైన మీకు తెలుసు. ఇలా చాలా మందిని మాయ మింగేస్తుంది. చాలా మంది సమాప్తమైపోతారు. మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, యజ్ఞము కొరకే ప్రాణము కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి-మంచి పిల్లలు కూడా నేడు లేరు. మాయతో మీకు యుద్ధము జరుగుతోంది. మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. దేవతలకు, అసురులకు యుద్ధము జరిగినట్లుగా శాస్త్ర్రాలలో చూపించారు. కౌరవ - పాండవ యుద్ధాన్ని కూడా చూపించారు. ఈ రెండు విషయాలు శాస్త్రాలలో ఎలా ఉన్నాయని మీరెవరినైనా ప్రశ్నించండి. దేవతలు అహింసకులు, వారు సత్యయుగములో ఉంటారు, వారు కలియుగములో యుద్ధము చేసేందుకు వస్తారా! వారికి కౌరవులు, పాండవుల అర్థము కూడా తెలియదు. శాస్త్రాలలో ఏమి వ్రాసి ఉన్నారో వాటినే చదువుతూ వినిపిస్తూ ఉంటారు. బాబా గీతనంతా చదివి ఉన్నారు. ఎప్పుడు జ్ఞానము లభించిందో అప్పుడు - గీతలో యుద్ధము మొదలైన విషయాలు ఎలా వ్రాశారనే ఆలోచన వచ్చింది. కృష్ణుడు గీతా భగవానుడు కాదు. వీరిలో తండ్రి కూర్చుని ఉన్నారు కనుక ఇతని ద్వారా ఆ గీతను కూడా విడిపించారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశము(జ్ఞానము) లభించింది. ప్రకాశముండేది అత్మకే. అందుకే తండ్రి చెప్త్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. బేహద్‌ తండ్రిని స్మృతి చేయండి. మీరు వచ్చినట్లయితే మేము మీకు బలిహారమవుతామని భక్తిమార్గములో స్మృతి చేస్తూ మీరు అనేవారు. కానీ వారు ఎలా వస్తారో, ఎలా బలిహారి అవుతారో తెలియదు.

తండ్రి ఎలా ఉన్నారో ఆత్మలైన మనము అలా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిది అలౌకిక జన్మ. పిల్లలైన మిమ్ములను ఎంతో బాగా చదివిస్తున్నారు. కల్ప-కల్పము మా తండ్రిగా అయ్యే బాబా వీరే అని మీరు స్వయంగా చెప్తారు. మనమంతా బాబా - బాబా అని అంటాము. బాబా కూడా పిల్లలూ! పిల్లలూ! అని అంటారు. వారే టీచరు రూపంలో రాజయోగము నేర్పిస్తారు. విశ్వానికి మిమ్ములను అధికారులుగా చేస్తారు. అలాంటి తండ్రికి చెందినవారిగా అయి మళ్లీ అదే టీచరు నుండి శిక్షణ కూడా తీసుకోవాలి. వింటూ వింటూ గద్గదమవ్వాలి. ఒకవేళ ఛీ-ఛీ గా అయ్యారంటే ఈ సంతోషము కలగనే కలుగదు. తర్వాత ఎంతగా తల బాదుకున్నా వారు మళ్లీ మన జాతికి చెందిన సోదరునిగా అవ్వలేడు. ఇక్కడ మనుష్యులకు ఎన్ని ఇంటి పేర్లు(సర్‌నేమ్‌) ఉంటాయి, కానీ అవన్నీ హద్దులోని విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దగా ఉందో చూడండి. అందరికన్నా పెద్దవారు గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ బ్రహ్మ. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ-విష్ణువు-శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మను సూక్ష్మ వతనములోకి తీసుకెళ్లారు. వారి జీవితచరిత్ర ఏ మాత్రము తెలియదు. సూక్ష్మవతనంలో మళ్లీ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడ దత్తత ఎలా తీసుకుంటాడు? ఇతడు నా రథము, అనేక జన్మల అంతిమములో నేను వీరిలో ప్రవేశించానని తండ్రి అర్థం చేయించారు. ఈ పురుషోత్తమ సంగమ యుగము గీతా అధ్యాయము. దీనిలో పవిత్రత ముఖ్యమైనది. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఎవ్వరికీ తెలియదు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలన్నీ మరచి తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లైయితే మాయ చేయించిన సర్వ పాప కర్మలు భస్మమైపోతాయని సాధు-సన్యాసులు ఎప్పుడూ చెప్పరు. వారికి తండ్రి గురించి తెలియనేే తెలియదు. ఈ సాధువులు మొదలైనవారిని కూడా నేను వచ్చి ఉద్ధరిస్తానని గీతలో తండ్రి చెప్పారు.

ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలు పాత్రాభినయము చేస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మనే. ఇతడే మళ్లీ బ్రహ్మగా అయ్యాడు. ఇతడే చిన్నతనములో పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. ఆది నుండి అంతిమము వరకు ఇతడు 84 జన్మలు పూర్తి చేశాడు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అవుతున్నారు. మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు. బుద్ధిహీనులు అని పతితులనే అంటారు. ముఖ్యమైనది పవిత్రత. మాయ మమ్ములను క్రింద పడేసింది, వికారి దృష్టి తయారయిందని వ్రాస్తారు కూడా. తండ్రి క్షణ-క్షణము హెచ్చరిస్తూనే ఉంటారు - పిల్లలారా, ఎప్పుడూ మాయ చేతిలో ఓడిపోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. మనము పావనంగా అవుతున్నప్పుడు మనకు పావన ప్రపంచము కూడా కావాలి కదా. పిల్లలైన మీరే పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యోగము చేయరు. యోగము చేసేందుకు తండ్రి పతితులుగా అవ్వరు. బాబా చెప్తారు - నేను మీ సేవలో ఉపస్థితమౌతాను. మీరే వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయండి అని కోరుకున్నారు. మీరు పిలిచినందునే నేను వచ్చాను. కేవలం మన్మనాభవ అని మీకు సహజ మార్గము తెలుపుతున్నాను. భగవానువాచ కదా. మీరు కేవలం కృష్ణుని పేరు చెప్పడం వలన తండ్రిని అందరూ మర్చిపోయారు. తండ్రి ఫస్టు, కృష్ణుడు సెకండు. వారు పరంధామానికి యజమాని, ఇతడు వైకుంఠానికి యజమాని. సూక్ష్మవతనములో ఏమీ ఉండదు. అందరిలో నంబరువన్‌ కృష్ణుడు. వారిని అందరూ ప్రేమిస్తారు. మిగిలినవారంతా వెనుక వెనుక వస్తారు. స్వర్గములోకి అందరూ రాలేరు కూడా.

కనుక మధుర సంతానమైన మీకు అపారమైన సంతోషముండాలి. ఎప్పుడూ పవిత్రంగా ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు. వారిని బాబా - వికారాలలోకి వెళ్తూ మళ్లీ బాబా వద్దకు ఎందుకు వచ్చారు? అని అడుగుతారు. '' ఏం చెయ్యాలి, ఉండలేకపోతాము కానీ ఇక్కడకు రావడం వలన బహూశా ఎప్పుడైనా బాణము తగలవచ్చు, మీరు కాక మాకు సద్గతినిచ్చేవారు ఎవరు? అందువలన వచ్చి కుర్చుంటాము '' అని అంటారు. మాయ ఎంత తీవ్రమైనది! బాబా మమ్ములను పతితుల నుండి పావన పుష్పాలుగా తయారుచేస్తున్నారనే నిశ్చయము కూడా ఉంటుంది. కానీ ఏం చేయాలి, అయినా సత్యము చెప్పడం వలన ఎప్పటికైనా పరివర్తన అవుతాను. మీ ద్వారానే పరివర్తన అవుతామనే నిశ్చయము మాకుంది అని అంటారు. బాబాకు అలాంటి పిల్లల పై జాలి కలుగుతుంది. మళ్లీ ఇలాగే జరుగుతుంది. ఏదీ కొత్తది కాదు(నథింగ్‌ న్యూ). బాబా ప్రతిరోజూ శ్రీమతమునిస్తారు. కొందరు అమలులోకి కూడా తెస్తారు. ఇందులో బాబా ఏం చేయగలరు. బహుశా వీరి పాత్ర అంతే అని బాబా అంటారు. అందరూ రాజా-రాణులుగా అవ్వలేరు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. రాజధానిలో అందరూ కావాలి. అయినా పిల్లలారా! - ధైర్యాన్ని వదలకండి. ముందుకు వెళ్ళగలరని బాబా చెప్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాబా జతలో సదా సత్యంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దానిని దాచరాదు. ఎప్పుడూ వికారి దృష్టి (క్రిమినల్‌) కలుగకుండా కనులను సంభాళించుకోవాలి.
2. అనంతమైన తండ్రి మమ్ములను పతిత ఛీ-ఛీల వారి నుండి సుగంధ పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మాకు బాబా చెయ్యి(ఆసరా) లభించింది. దీని ఆధారముతో మేము విషయ వైతరిణి నదిని దాటుతామనే శుద్ధమైన నషా సదా ఉండాలి.

వరదానము :- '' బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా లైటు (ప్రకాశ) కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహా భాగ్యశాలి ఆత్మా భవ ''
సంగమ యుగ బ్రాహ్మణ జీవితంలోని విశేషత - ''పవిత్రత''. పవిత్రతకు గుర్తు - లైటు కిరీటము. ఈ కిరీటము ప్రతి బ్రాహ్మణాత్మకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది. ఈ పవిత్రతా ప్రకాశ కిరీటము ఆ రత్నజడిత కిరీటము కంటే అతిశ్రేష్ఠమైనది. ఈ కిరీటము మహాన్‌ ఆత్మకు, పరమాత్మ భాగ్యశాలి ఆత్మకు, ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మకు గుర్తు. బాప్‌దాదా ప్రతి పుత్రుడు జన్మిస్తూనే ''పవిత్ర భవ'' అనే వరదానమునిస్తారు. దీనిని ప్రకాశ కిరీటము సూచిస్తుంది.

స్లోగన్‌ :- '' అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై వ్యాకులపడే ఆత్మల వ్యాకులతను దూరం చేయండి ''

No comments:

Post a Comment