31-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో, దాని పై విచార సాగర మథనము చేయండి, జ్ఞాన మథనము ద్వారానే అమృతము వెలువడ్తుంది''
ప్రశ్న :- 21 జన్మలకు మాలామాల్‌గా(మిక్కిలి ధనవంతులు) అయ్యే సాధనమేది?
జవాబు :- జ్ఞాన రత్నాలు. ఎంతెంత మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగములో ఈ జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారో అంతంత మిక్కిలి ధనవంతులుగా అవుతారు. ఇప్పటి జ్ఞాన రత్నాలే అక్కడ వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. ఎప్పుడైతే ఆత్మ జ్ఞాన రత్నాలను ధారణ చేస్తుందో, నోటి ద్వారా జ్ఞాన రత్నాలు వెలువరిస్తుందో, రత్నాలనే వింటూ మళ్లీ వినిపిస్తుందో అప్పుడు వారి హర్షితముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఆసురీ గుణాలు తొలగిపోయినప్పుడు మిక్కిలి ధనవంతులుగా అవుతారు.
ఓంశాంతి. తండ్రి పిల్లలకు జ్ఞానము, భక్తిని గురించి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదని పిల్లలకు తెలుసు. జ్ఞానము కూడా సత్యయుగములో లభించదు. కృష్ణుడు భక్తి చేయడు, జ్ఞాన మురళి కూడా మ్రోగించడు. మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వడము. మురళిలో ఇంద్రజాలముంది,........ (మురళీ మే హై జాదూ..........) అని గాయనముంది కదా. కనుక ఏదో ఇంద్రజాలముంటుంది కదా. కేవలం మురళి మ్రోగించడము సాధారణమైన విషయము. ఫకీర్లు కూడా మురళి మ్రోగిస్తారు. ఇందులో జ్ఞాన ఇంద్రజాలముంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలమని అనరు. కృష్ణుడు మురళి మ్రోగించేవాడని వారిని చాలా మహిమను చేస్తారు. తండ్రి చెప్తారు - కృష్ణుడు దేవత. మనుష్యుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా,....... ఇది జరుగుతూనే ఉంటుంది. దైవీసృష్టి కూడా ఉంటుంది, మనుష్య సృష్టి కూడా ఉంటుంది. ఈ జ్ఞానము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగము ఉన్నప్పుడు జ్ఞాన వారసత్వముంటుంది. సత్యయుగములో భక్తి ఉండదు. దేవతలు ఎప్పుడైతే మనుష్యులుగా అవుతారో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మనుష్యులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతలలో ఈ జ్ఞానముండదు. దేవతలు సద్గతిలో ఉంటారు, దుర్గతిలో ఉన్నవారికి జ్ఞానము అవసరము. ఈ జ్ఞానము ద్వారానే దైవీగుణాలు వస్తాయి. జ్ఞానధారణ ఉన్నవారి నడవడికలో దైవత్వముంటుంది. ధారణ తక్కువ ఉన్నవారి నడవడికలో మిక్స్ ఉంటుంది. ఆసురీ చలనము ఉన్నవారిని నా పిల్లలని చెప్పలేము. ధారణ లేకుంటే నా పిల్లలని ఎలా చెప్పుకోగలరు! పిల్లలు తండ్రిని తెలుసుకుంటే తండ్రి కూడా పిల్లలను ఎలా తెలుసుకోగలరు? ఎంత పచ్చి పచ్చిగా తండ్రిని నిందిస్తూ వచ్చారు. భగవంతుని నిందించడము ఎంత చెడ్డది! వారు బ్రాహ్మణులుగా అయినప్పుడు నిందించడము ఆగిపోతుంది. కనుక ఈ జ్ఞానాన్ని విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. విద్యార్థి విచార సాగర మథనము చేసి జ్ఞానాన్ని ఉన్నతి చేసుకుంటాడు. మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. దీని పై మీరు విచార సాగర మథనము చేయడం ద్వారా అమృతము వెలువడ్తుంది. విచార సాగర మథనం జరగకుంటే ఇంకే మథనము జరుగుతుంది? ఆసురీ విచార మథనము. దీని ద్వారా మలినాలే వస్తాయి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. దేవతలు చదివించరు. దేవతలనెప్పుడూ జ్ఞానసాగరులని అనరు. తండ్రియే జ్ఞాన సాగరులు. కనుక స్వయాన్ని - నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆసురీ గుణాలుంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలుగా అవుతారు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. పురుషోత్తములుగా అవుతున్నారు కనుక వాతావరణము కూడా చాలా బాగుండాలి. ఛీ-ఛీ మాటలు నోటి నుండి వెలువడరాదు. లేకుంటే తక్కువ కులము వారని అంటారు. వాతావరణము ద్వారా తక్షణమే తెలిసిపోతుంది. నోటి ద్వారా దు:ఖమిచ్చు మాటలే వెలువడుతాయి. పిల్లలైన మీరు తండ్రి పేరును ప్రఖ్యాతము చేయాలి. ముఖము సదా చాలా హర్షితంగా ఉండాలి. నోటి ద్వారా సదా ఈ రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణులు చాలా హర్షితముఖులుగా ఉన్నారు! వీరి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేశాయి. నోటి ద్వారా ఈ జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండేవి, ఈ రత్నాలనే వింటూ, వినిపిస్తూ ఉండేవారు. చాలా ఖుషీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలను తీసుకుంటున్నారో అవి తర్వాత సత్యమైన వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. నవరత్నాల మాల ఏ వజ్ర వైడూర్యాలది కాదు, ఇది చైతన్య రత్నాల మాల. మనుష్యులు వాటిని ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైనవాటిగా ధరిస్తారు. జ్ఞాన రత్నాల మాల ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే తయారవుతుంది. ఈ రత్నాలే 21 జన్మలకు మిక్కిలి సంపన్నులుగా చేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ ధరిస్తే తక్షణము ఎవరైనా దోచుకుంటారు, కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతంగా చేసుకోవాలి. ఆసురీ గుణాలను తొలగించుకోవాలి. ఆసురీ గుణాలు గలవారి ముఖమే అలా తయారవుతుంది. క్రోధములో అయితే ఎర్రగా రాగి వలె అయిపోతుంది. కామ వికారము కలిగిన వారి ముఖము పూర్తి నల్లగా అయిపోతుంది. కృష్ణుని కూడా నల్లగా చూపిస్తారు కదా. వికారాల కారణంగానే సుందరమైనవారు నల్లగా అయ్యారు. పిల్లలైన మీరు ప్రతి విషయము పై విచార సాగర మథనము చేయాలి. ఈ చదువు ద్వారా చాలా ధనము పొందవచ్చు. పిల్లలైన మీరు విని ఉంటారు - విక్టోరియా మహారాణి మంత్రి మొదట చాలా పేదవానిగా ఉండేవాడు. దీపము వెలిగించుకుని చదివేవాడు. కాని ఆ చదువు రత్నాల సమానము కాదు. జ్ఞానాన్ని చదివి గొప్ప హోదాను సంపాదించుకుంటారు. కనుక విద్య ఉపయోగపడింది, కాని ధనము కాదు. చదువే ధనము. అది హద్దులోనిది, ఇది బేహద్ ధనము. తండ్రి మనలను చదివించి విశ్వాధికారులుగా చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ధన సంపాదన కొరకు చదవరు. అక్కడ ఇప్పటి పురుషార్థము ద్వారా అపారమైన ధనము లభిస్తుంది. ధనము అవినాశిగా అయిపోతుంది. దేవతల వద్ద చాలా ధనముండేది. వారు వామమార్గములో రావణరాజ్యములోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనముండేది, ఎన్ని మందిరాలు కట్టించారు. తర్వాత ముసల్మానులు దోచుకున్నారు. ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ రోజులలోని చదువు ద్వారా ఇంత ధనవంతలుగా అవ్వలేరు. ఈ చదువు ద్వారా మనుష్యులు ఏమవుతున్నారో చూడండి. పేదవారి నుండి ధనవంతులుగా అవుతున్నారు. ఇప్పుడు భారతదేశము ఎంత పేదగా ఉందో చూడండి. ధనవంతులకు సమయమే ఉండదు. వారికి తమ ధనము, హోదాల అహంకారము చాలా ఉంటుంది. ఇందులో అహంకారము మొదలైనవన్నీ సమాప్తమైపోవాలి. మనము ఆత్మలము, ఆత్మల వద్ద ధన-సంపదలు, వజ్ర వైడూర్యాలు మొదలైనవేవీ ఉండవు.
తండ్రి చెప్తారు - మధురమైన పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఆ శ్రీమంత స్థితి అంతా సమాప్తమైపోతుంది. మళ్లీ కొత్తగా చదవాలి, ధనాన్ని సంపాదించినప్పుడే ధనవంతులుగా అవుతారు లేక దాన-పుణ్యాలు బాగా చేసి ఉంటే శ్రీమంతుల ఇంటిలో జన్మిస్తారు. ఇది జరిగిపోయిన కర్మల ఫలమని అంటారు. జ్ఞానదానము చేసినప్పుడు, కాలేజీలు, ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే అందుకు ఫలము లభిస్తుంది కాని అది అల్పకాల ఫలము. ఈ దాన-పుణ్యాలు మొదలైనవన్నీ ఇక్కడే చేస్తారు. సత్యయుగములో చేయరు. సత్యయుగములో మంచి కర్మలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వారసత్వము లభించి ఉంటుంది. అక్కడ ఏ కర్మా వికర్మగా అవ్వదు. ఎందుకంటే రావణుడే ఉండడు. వికారాలకు వశమగుట వలన వికారీ కర్మలుగా అవుతాయి. వికారాల వలన వికర్మలు తయారవుతాయి. స్వర్గములో వికర్మలేవి జరగవు. పూర్తి ఆధారమంతా కర్మల పై ఆధారపడి ఉంది. ఈ మాయా రావణుడు అవగుణాలు గలవారిగా చేస్తాడు. తండ్రి వచ్చి సర్వగుణ సంపన్నులుగా చేస్తారు. రామ వంశీయుల, రావణ వంశీయుల యుద్ధము జరుగుతుంది. మీరు రాముని సంతానము, ఎంతో మంచి-మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. బాబా వారి పేర్లు చెప్పరు, అయినా ఆశను ఉంచుకుంటారు. అధమాతి అధములను(అత్యంత కనిష్ఠమైనవారిని) కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. తండ్రి పూర్తి విశ్వాన్నంతా ఉద్ధరించవలసి ఉంటుంది. రావణ రాజ్యములో అందరూ అధోగతిని పొంది ఉన్నారు. రక్షణ చేసుకునేందుకు, రక్షణ చేసేందుకు తండ్రి ప్రతి రోజూ యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. అయినా క్రిందపడుతూ అధమాతి అధములుగా అవుతారు మళ్లీ వారు ఇంత ఉన్నతిని పొందలేరు. ఆ అధమత్వము ఆంతరికములో తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరి స్మృతిలో శరీరాన్ని వదుల్తారో తదనుసారంగా గతి,........ అని చెప్తారు కదా. వారి బుద్ధిలో ఆ అధమత్వమే గుర్తు వస్తూ ఉంటుంది.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - కల్ప-కల్పము సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీరు మాత్రమే వింటారు, జంతువులు తెలుసుకోలేవు కదా. మీరే వింటారు, అర్థము చేసుకుంటారు. మనుష్యులు మనుష్యులే. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ముక్కు, చెవులు మొదలైనవన్నీ ఉన్నాయి, వారు కూడా మనుష్యులే కదా. కాని దైవీగుణాలు ఉన్న కారణంగా వారిని దేవతలని అంటారు. వారలాంటి దేవతలుగా ఎలా అవుతారు? మళ్లీ ఎలా పడిపోతారు, ఈ చక్రము గురించి మీకు మాత్రమే తెలుసు. ఎవరు విచార సాగర మథనము చేస్తూ ఉంటారో వారికే ధారణ జరుగుతుంది. విచార సాగర మథనము చేయనివారిని మూర్ఖులని అంటారు. మురళి నడిపించేవారికి ఈ టాపిక్ పై ఇలా - ఇలా అర్థం చేయించాలని విచార సాగర మథనము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థము చేసుకోకపోయినా ముందు - ముందు తప్పకుండా అర్థము చేసుకుంటారు అని నమ్మకము ఉంచబడ్తుంది. నమ్మకము ఉంచడము అనగా సర్వీసు చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు, వారు అలసిపోరు. ఎవరైనా ఉన్నతి పొంది మళ్లీ అధములై వచ్చినట్లైతే స్నేహముతో కూర్చోబెడ్తారు కదా లేక వెళ్ళిపోండి అని అంటారా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎందుకు రాలేదు అని స్థితి-గతులను అడగవలసి ఉంటుంది. మాయ చేతిలో ఓడిపోయానని చెప్తారు కదా. జ్ఞానము చాలా బాగుందని అర్థము కూడా చేసుకుంటారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో గెలుపు - ఓటములు పొందే మాటే లేదు. ఇది జ్ఞానము, దీనిని ధారణ చేయాలి. మీరు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు మొదలైన వారిలో బ్రాహ్మణులు ఉండరు. బ్రాహ్మణుల సంతానము బ్రాహ్మణులుగా అవుతారు. ఈ విషయాలు ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. అల్ఫ్(తండ్రి)ను స్మృతి చేయాలని మీకు తెలుసు. అల్ఫ్‌ను స్మృతి చేయడం వలన 'బే '(ఆస్తి) లభిస్తుంది. మిమ్ములను కలుసుకునేందుకు ఎవరు వచ్చినా, వారికి అల్ఫ్ అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. అల్ఫ్‌నే శ్రేష్ఠమైనవారని చెప్తారు. వేలితో పరమాత్ముని వైపు చూపిస్తారు. నేరుగా వారు అల్ఫ్(పరమాత్మ) అని, అల్ఫ్ ఒక్కరే అని కూడా చెప్తారు(అల్ఫ్ కో ఏక్ భీ కహా జాతా హై). భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా వారి పిల్లలు. తండ్రిని అల్ఫ్ అని అంటారు. తండ్రి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తన పిల్లలుగా కూడా చేసుకుంటారు. కనుక పిల్లలైన మీరు ఎంత ఖుషీగా ఉండాలి! బాబా మనకు ఎంత సేవ చేస్తారు, విశ్వాధికారులుగా చేెస్తారు. కాని వారు స్వయం ఆ పవిత్ర ప్రపంచములోకి రానే రారు. పావన ప్రపంచములో వారిని ఎవ్వరూ పిలవనే పిలవరు. పతిత ప్రపంచములోనే పిలుస్తారు. పావన ప్రపంచములో వచ్చి ఏం చేస్తారు! వారి పేరే పతిత పావనులు. పాత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయడమే వారి కర్తవ్యము. తండ్రి పేరే శివుడు. పిల్లలను సాలిగ్రామాలని అంటారు. ఇరువురికీ పూజ జరుగుతుంది. కాని పూజ చేసేవారికి ఏమీ తెలియదు. పూజించేందుకు ఒక ఆచార సంప్రదాయంగా చేశారు. దేవీలకు కూడా ఫస్ట్‌క్లాస్ వజ్రాలు, ముత్యాలు మొదలైనవాటితో భవనాలు తయారుచేస్తారు, పూజిస్తారు. అక్కడ మట్టి లింగాలను తయారు చేస్తారు, పగులగొట్తారు. లింగాలను తయారు చేయడంలో శ్రమ ఉండదు. దేవీలను తయారు చేయడంలో శ్రమ ఉంటుంది. వారి పూజలో శ్రమ ఉండదు. ఉచితంగా లభిస్తాయి. రాళ్ళు, నీటి రాపిడికి గోళాకారంగా తయారవుతాయి. పూర్తి అండాకారంగా చేస్తారు. ఆత్మ అండాకారములో ఉంటుంది, బ్రహ్మతత్వములో ఉంటుంది అని అంటారు. కను దానిని బ్రహ్మాండము అని అంటారు. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి అధికారులుగా అవుతారు.
కనుక మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి. శివుడిని బాబా అని అందరూ స్మృతి చేస్తారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత కనుక పూర్తి ప్రజలందరికి పిత అయ్యాడు కదా. గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ అయ్యాడు. ఈ పూర్తి జ్ఞానము ఇప్పుడు మీలో ఉంది. ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది చెప్తారు. కాని యథార్థ రీతిలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరమపిత పరమాత్ముని సంతానమని మీరు చెప్తారు. శివబాబా వీరిని దత్తు తీసుకున్నారు. కనుక ఇతడు శరీరధారి కదా. ఈశ్వరునికి అందరూ సంతానమే. ఎప్పుడైతే శరీరము లభిస్తుందో అప్పుడు ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలని చెప్తారు. అది దత్తత కాదు, ఆత్మలను పరమపిత పరమాత్మ దత్తత తీసుకున్నారా? లేదు. పిల్లలైన మిమ్ములను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మకుమార - కుమారీలు. శివబాబా దత్తత తీసుకోరు. ఆత్మలందరూ అనాది, అవినాశి. ఆత్మలందరికీ తమ - తమ శరీరము, తమ-తమ పాత్ర లభించి ఉంది. దానిని అభినయించే తీరాలి. ఈ పాత్రనే అనాది, అవినాశి పరంపరగా వస్తోంది. దాని ఆది-అంత్యములను తెలపలేము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ ధనికత్వము, స్థానాల(హోదా, పొజిషన్) అహంకారాన్ని సమాప్తము చేసుకోవాలి. అవినాశి జ్ఞాన ధనము ద్వారా స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి. సేవలో ఎప్పుడూ అలసిపోరాదు.
2. వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. దు:ఖమునిచ్చే మాటలు వెలువడకుండా గమనముంచాలి. హర్షితముఖులుగా ఉండాలి.
వరదానము :- '' సదా శ్రేష్ఠ సమయానుసారము శ్రేష్ఠ కర్మలు చేస్తూ 'వాహ్ వాహ్' అనే పాట పాడుకునే భాగ్యశాలి ఆత్మా భవ ''
ఈ శ్రేష్ఠమైన సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ ''వాహ్ వాహ్'' అనే పాట మనసులో పాడుకుంటూ ఉండండి. ''వాహ్ నా శ్రేష్ఠ కర్మ'' లేక ''వాహ్ శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా'' కనుక సదా ''వాహ్ వాహ్'' అనే పాట పాడుతూ ఉండండి. ఎప్పుడూ పొరపాటున కూడా దు:ఖము కలిగించే దృశ్యాలను చూస్తున్నా మీ నోటి నుండి హాయ్(అయ్యో) అనే శబ్ధము వెలువడరాదు. ''వాహ్ డ్రామా వాహ్, వాహ్ బాబా వాహ్''. ఏదైతే స్వప్నములో కూడా లేదో, ఆ భాగ్యము ఇంట్లో కూర్చుని ఉండగానే లభించింది. ఈ భాగ్య నశాలో ఉండండి.
స్లోగన్:- ''మనసు-బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనాఅచలంగా, స్థిరంగా ఉంటారు''
No comments:
Post a Comment