Sunday, December 22, 2019

Telugu Murli 23/12/2019

23-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - అడుగడుగునా శ్రీమతమును అనుసరించడమే అత్యంత ఉన్నతమైన చార్టు. ఏ పిల్లలకు శ్రీమతము పై గౌరవముంటుందో, వారు మురళి తప్పకుండా చదువుతారు ''

ప్రశ్న :- ఈశ్వరుని పిల్లలైన మిమ్ములను ఏ ప్రశ్నను ఎవ్వరూ అడగలేరు ?
జవాబు :- మీరు రాజీఖుషీ(క్షేమము, ఆరోగ్యము)గా ఉన్నారా? అని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా రాజీగానే ఉన్నామని అంటారు. పరబ్రహ్మము లో ఉండు తండ్రిని గురించి చింత ఉండేది,............ వారు లభించారు, ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి ? మీకు జబ్బు చేసినా మేము రాజీఖుషీగానే ఉన్నామని చెప్తారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయములోనూ చింత ఉండదు. వీరి పై మాయ దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు '' పిల్లలూ, రాజీఖుషీగా ఉన్నారా?'' అని అడుగుతారు.

ఓంశాంతి. తండ్రి అర్థము చేయిస్తున్నారు - శివబాబా తండ్రి, టీచరు, సుప్రీం సద్గురువు కూడా అయ్యారని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఈ స్మృతిలో ఉంటారు. ఈ స్మృతి ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు. కల్ప-కల్పము ఆ తండ్రియే వచ్చి నేర్పిస్తారు. వారు జ్ఞానసాగరులు, పతితపావనులు. జ్ఞాన మూడవ నేత్రము దివ్యబుద్ధి లభించినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థము చేసుకున్నా తండ్రినే మర్చిపోతే, మరి టీచరు, గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా శక్తివంతమైనది. అది తండ్రి మూడు రూపాలను కూడా మరిపింపజేస్తుంది, మేము ఓడిపోయామని చెప్తారు. వాస్తవానికి అడుగడుగునా పదమారెట్లు(కోటానుకోట్ల, లెక్కలేనంత) ఉంటుంది, కానీ ఓడిపోతే పదమారెట్లు ఎలా లభిస్తుంది? దేవతలకు మాత్రమే పద్మమును గుర్తుగా ఇస్తారు. ఇది ఈశ్వరీయ చదువు. మానవుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు. భలే దేవతలు మహిమ చేయబడ్తారు కాని అత్యంత ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. పోతే వారి గొప్పతనమేమిటి? ఈ రోజు గాడిద పని(నీచము), రేపు రాజరికము(ఉన్నతము). ఇప్పుడు మీరు పురుషార్థము చేసి ఇలా (లక్ష్మినారాయణ) తయారవుతూ ఉన్నారు. ఈ పురుషార్థములో చాలా మంది ఫెయిల్‌ అవుతారని మీకు తెలుసు. జ్ఞానమేమో చాలా సులభము. అయినా చాలా కొంతమంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఎందుకు? మాయ మాటిమాటికి మరపింపజేస్తుంది. తండ్రి చార్టు పెట్టమంటారు కాని చార్టు వ్రాయలేకపోతారు. చాలా తక్కువగా వ్రాస్తారు. ఒకవేళ వ్రాసినా అప్పుడప్పుడు ఉన్నతంగా, అప్పుడప్పుడు కనిష్ఠంగా ఉంటుంది. అడుగడుగునా శ్రీమతమును అనుసరించువారి చార్టు అత్యంత ఉన్నతంగా ఉంటుంది. పాపం ఈ పిల్లలకు సిగ్గు వస్తూ ఉండవచ్చని తండ్రి భావిస్తారు, లేకుంటే శ్రీమతమును అమలులో ఉంచాలి. అతికష్టం మీద 1-2 శాతము మాత్రమే వ్రాస్తారు. శ్రీమతము పై అంతగా గౌరవము లేదు. మురళి లభిస్తున్నా చదవరు. బాబా సత్యమే చెప్తున్నారు కదా, మేమే మురళి చదవకుంటే ఇతరులకేం నేర్పిస్తామని వారి మనస్సుకు తోస్తూ ఉంటుంది.
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. ఇందులో తండ్రి, వచ్చేశారు, చదివించే టీచరు కూడా వచ్చేశారు, సద్గతిదాత కూడా వచ్చేశారు. చిన్న-చిన్న పదాలలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. జ్ఞానాన్ని రివైజ్‌ చేసుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు. భలే తండ్రి కూడా ఇదే అర్థము చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతామని స్వయంగా మీరే చెప్తారు. అందుకే రివైజ్‌ చేసుకునేందుకు ఇక్కడకు వస్తారు. భలే కొందరు రివైజ్‌ కూడా చేస్తారు అయినా రివైజ్‌ అవ్వదు. అదృష్టములో లేకుంటే పురుషార్థము కూడా ఏం చేస్తారు. పురుషార్థము చేయించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇందులో పాస్‌ చేయించేందుకు ఎవరి పైనా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉండజాలదు. ఆ చదువులో అయితే ఎక్కువగా చదివించేందుకు(ట్యూషన్‌ కొరకు) టీచరును పిలుస్తారు. వీరైతే అదృష్టాన్ని తయారు చేసేందుకు అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరు వేరుగా ఎంతవరకు చదివిస్తారు? ఎంతమంది పిల్లలున్నారు! ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలుంటే, ఎక్స్‌ట్రా(అదనము)గా కూడా చదువు చెప్తామని ఆఫర్‌ చేస్తారు. డల్‌(మొద్దు)గా ఉన్నాడని టీచరుకు తెలుసు. అందువలన చదివించి వారిని స్కాలర్‌షిప్‌ పొందేందుకు యోగ్యులుగా చేస్తాడు. కాని ఈ టీచరు అలా చేయరు. వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఎక్స్‌ట్రా పురుషార్థము అనగా టీచరు ఏదైనా కృప చూపడం. డబ్బు కూడా తీసుకుంటారు, ప్రత్యేకంగా సమయము తీసుకుని చదివిస్తారు. దీని వలన వారు బాగా చదివి తెలివిగలవారిగా అవుతారు. ఈ తండ్రి అయితే అందరికీ ''మన్మనాభవ'' అను ఒకే మహామంత్రమునిస్తున్నారు. అంతే. తండ్రి ఒక్కరు మాత్రమే పతితపావనులు. వారి స్మృతి ద్వారానే మనము పావనంగా అవుతాము. అది పిల్లలైన మీ చేతులలోనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. పూర్తి ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థము పై ఉంది. వారు తీర్థయాత్రలకు వెళ్తారు. ఒకరిని చూచి ఒకరు వెళ్తూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా చాలా యాత్రలు చేశారు, అయినా ఏమయింది? ఇంకా క్రిందికే పడిపోతూ వచ్చారు. యాత్ర ఎందుకు చేస్తారో దాని వలన ఏం లభిస్తుందో ఏమీ తెలియదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. '' మన్మనాభవ '' అనే ఒకే అక్షరముంది. ఇప్పుడు మీది అనాది యాత్ర. వారు కూడా మేము అనాది కాలము నుండి ఈ యాత్రలు చేస్తూ వచ్చామని అంటారు. కల్ప-కల్పము మేము ఈ యాత్ర చేస్తున్నామని ఇప్పుడు మీరు జ్ఞాన సహితంగా చెప్తారు. ఈ యాత్రను స్వయంగా ఖుదా అయిన తండ్రే వచ్చి నేర్పిస్తున్నారు. ఆ యాత్రలలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. అచ్చట ఎంతో గోల ఉంటుంది. ఇది డెడ్‌-సైలెన్స్‌ యాత్ర(నిశ్శబ్ధము). ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, దీని ద్వారానే పావనంగా అవ్వాలి. మీకు ఆ తండ్రి సత్య-సత్యమైన ఆత్మిక యాత్ర నేర్పించారు. ఆ యాత్రలైతే మీరు జన్మ- జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. నలువైపులా తిరిగాము, అయినా భగవంతునికి దూరంగానే ఉన్నామని(చారో తరఫ్‌ లగాయే ఫేరే ఫిర్‌ భీ హర్‌ దమ్‌ దూర్‌ రహే.....) అంటారు. యాత్రల నుండి వచ్చి మళ్లీ వికారాలలో పడిపోతే లాభమేమిటి? ఎప్పుడు తండ్రి వచ్చారో అప్పుడిది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరూ తెలుసుకుంటారు. చివరికి భగవంతుడెలా లభిస్తాడు? ఇది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అయితే కుక్కలో, పిల్లిలో దొరకుతారని భావిస్తారు. వీటన్నింటిలో భగవంతుడు లభిస్తాడా? ఇది ఎంత పెద్ద అసత్యము! అసత్య భోజనము, అసత్య పానీయము, అసత్యమైన రాత్రిని గడుపుట. అందుకే ఇది అసత్య ఖండము. సత్య ఖండమని స్వర్గమునంటారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. స్వర్గములో అందరూ భారతదేశవాసులే ఉండేవారు. ఈ రోజు ఆ భారతదేశవాసులే నరకములో ఉన్నారు. మనము తండ్రి ద్వారా శ్రీమతమును తీసుకొని భారతదేశమును మళ్లీ స్వర్గంగా చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. అప్పుడు భారతదేశములో ఇతరులెవ్వరూ ఉండనే ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రమైపోతుంది. ఇప్పుడు లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. తండ్రి వృక్ష జ్ఞానమంతా వినిపిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండి తర్వాత వైశ్యులు, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని తండ్రి మీకు మళ్లీ స్మృతినిప్పిస్తున్నారు. ఈ విషయము సన్యాసులు, ఉదాసీనులు, విద్వాంసుల ద్వారా ఎప్పుడైనా విన్నారా? హమ్‌ సో............ అను పదానికి అర్థమును తండ్రి ఎంతో సహజము చేసి వినిపిస్తున్నారు. హమ్‌ సో అనగా నేను ఆత్మను, ఈ విధంగా చక్రములో తిరిగాను అని అర్థము. వారు హమ్‌ ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో హమ్‌ ఆత్మ(ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ) అని చెప్తారు. హమ్‌ సో ఆత్మ అను దానికి అర్థము ఏ ఒక్కరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - ఈ హమ్‌ సో మంత్రము సదా బుద్ధిలో జ్ఞాపకముంచుకోండి లేకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? వారికి 84 జన్మల చక్రము అర్థము కూడా తెలియదు. సతోప్రధానము, సతో, రజో, తమో.............. సూర్య వంశము, చంద్ర వంశము,............. అని భారతదేశ ఉత్థాన-పతనాలకే గాయనముంది.
ఇప్పుడు పిల్లలైన మీకు సర్వమూ తెలిసిపోయింది. ఒక్క బీజరూప తండ్రిని మాత్రమే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ సృష్టిచక్రములో రారు. అలా అని ఆత్మలైన మనమే పరమాత్మగా అవుతామని కాదు. తండ్రి తన సమానంగా జ్ఞాన సంపన్నులు గా చేస్తారు. తన సమానం గాడ్‌(భగవంతుని)గా చేయరు. ఈ విషయాలను బాగా అర్థము చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. మనము 84 జన్మల చక్రములో ఎలా వస్తామో మీరు బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు. దీనిలో సమయము, వర్ణము, వంశావళి మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఈ జ్ఞానము ద్వారానే అత్యంత ఉన్నతంగా అవుతారు. జ్ఞానముంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ పాఠశాలలో పరీక్షలు జరిగినప్పుడు పేపరు మొదలైనవి వ్రాయిస్తారు. పరీక్ష పేపరు విదేశాల నుండి వస్తుంది. విదేశాలలో చదివేవారిలో కూడా ఎవరైనా పెద్దవారు విద్యాశాఖ మంత్రి మొదలైనవారు చెక్‌ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ పేపర్లు ఎవరు చెక్‌ చేస్తారు? మీ పేపర్లు మీరే చెక్‌ చేసుకుంటారు. మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. బాగా చదువుకొని ఏ పదవి కావాలంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఇతరులకు ఎంత సేవ చేస్తారో అంతే ఫలితము లభిస్తుంది. వారికి సేవ చేయాలనే చింత ఉంటుంది. రాజధాని స్థాపన అవుతున్నది కావున ప్రజలు కూడా కావాలనే చింత ఉండినవారు సేవ కూడా చేస్తారు. అక్కడ మంత్రులు మొదలైనవారి అవసరమే ఉండదు. ఇక్కడైతే తెలివి తగ్గిపోయినప్పుడు మంత్రుల అవసరముంటుంది. బాబా మా వద్ద ధనముంది ఏం చేయమంటారు? వ్యాపారమెలా చేయాలి? అని తండ్రిని సలహా అడుగుతారు. తండ్రి చెప్తున్నారు - ఈ ప్రపంచములోని వ్యాపారాదుల సంగతి ఇక్కడకు తీసుకు రాకండి. ఎవరైనా చాలా వ్యాకులపడి ఉంటే కొద్దిగా ధైర్యము చెప్పేందుకు తెలుపుతారు, కానీ ఇది నా పని కాదు. మిమ్ములను పతితుల నుండి పావనంగా చేసి విశ్వానికి యజమానులుగా చేయడమే నా కర్తవ్యము. మీరు తండ్రి నుండి శ్రీమతము సదా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడేమో అందరిదీ ఆసురీ మతమే. అక్కడ ఉండేది సుఖధామము. అక్కడ రాజీ ఖుషీగా ఉన్నావా? ఆరోగ్యము బాగుందా? అని ఎప్పుడూ అడగరు. ఇలా అడిగేది ఇక్కడ మాత్రమే. అక్కడ ఇలా అడగనే అడగరు. ఈ పదాలే ఉండవు. దుఃఖధామములోని ఏ పదమూ అక్కడ ఉండదు. కాని పిల్లలలో మాయ ప్రవేశించినందున తండ్రి పిల్లలను - పిల్లలూ, బాగా రాజీఖుషీగా ఉన్నారా? అని అడుగుతూ ఉంటారు. మనుష్యులు అక్కడి పదాలను అర్థము చేసుకోలేరు. ఎవరైనా అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము, మమ్ములను క్షేమ సమాచారాలు అడిగే పనే లేదు అని చెప్తారు. పరబ్రహ్మములో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది, ఇప్పుడు వారు లభించారు, ఇప్పుడింకేం చింత ఉంది? మనమెవరి పిల్లలము? అని ఎల్లప్పుడూ గుర్తుండాలి. బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనము పావనమైనప్పుడు యుద్ధము మళ్లీ ప్రారంభమవుతుంది. మిమ్ములను తప్పకుండా క్షేమ సమాచారాలు అడుగుతారు. మేము సదా రాజీగా ఉన్నామని మీరు చెప్తారు. అస్వస్థతగా ఉన్నా మీరు రాజీగానే ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటే ఇక్కడ స్వర్గము కంటే ఎక్కువ రాజీగా, ఖుషీగా ఉంటారు. స్వర్గ చక్రవర్తి పదవినిచ్చే తండ్రే లభించారు, మనలను ఎంతో యోగ్యులుగా తయారు చేస్తారు. మనకు ఇక దేనిని గురించి చింత ఉంది? ఈశ్వరుని పిల్లలు దేని కొరకు చింతించాలి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల కంటే ఉన్నతమైనవారు ఈశ్వరుడు. కనుక ఈశ్వరుని పిల్లలకేం చింత ఉంటుంది? బాబా మనలను చదివిస్తున్నారు. బాబా మన టీచరు, సద్గురువు కూడా అయ్యారు. బాబా మన పై కిరీటముంచుతారు. దీనిని ఆంగ్లములో క్రౌన్‌ ప్రిన్స్‌(రాకుమారుడు) అని అంటారు. తండ్రి కిరీటాన్ని పిల్లలు ధరిస్తారు. సత్యయుగములో సుఖమే సుఖముంటుందని మీరు అర్థం చేసుకోగలరు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ సుఖమును ప్రాక్టకల్‌గా పొందుతారు. అది మీకు మాత్రమే తెలుస్తుంది. సత్యయుగములో ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి మేమెచ్చటకు వెళ్తాము? ఇప్పుడు మిమ్ములను తండ్రి ప్రాక్టికల్‌గా చదివిస్తున్నారు. మనము సత్య-సత్యంగా స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని వారంటారు. కాని వారికి స్వర్గమంటే ఏమిటో, నరకమంటే ఏమిటో తెలియదు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. జన్మ-జన్మాంతరాలు ఈ జ్ఞానము వింటూ - వింటూ క్రింద పడ్తూనే వచ్చారు. ఇప్పుడు మనము ఎక్కడ నుండి ఎక్కడకు వచ్చి క్రింద పడ్డామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి క్రింద పడ్తూనే వచ్చారు. ఇప్పుడు మనము ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చేరుకున్నాము. కల్ప-కల్పము తండ్రి మనలను చదివించేందుకు వస్తారు. తండ్రి వద్ద మీరు ఉంటారు కదా. వారే మన సత్య-సత్యమైన సద్గురువు. వారు ముక్తి- జీవన్ముక్తులకు మార్గము తెలుపుతున్నారు. ఈ బాబా కూడా ఎలా నేర్చుకుంటున్నారో, అలా వారిని చూచి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగడుగునా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనసా, వాచా, కర్మణా చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికములో మురికి ఏ మాత్రమూ ఉండరాదు. మాటి-మాటికి తండ్రిని పిల్లలు మర్చిపోతారు. తండ్రిని మర్చిపోయినందున తండ్రి శిక్షణలను కూడా మర్చిపోతారు. మనము విద్యార్థులమని కూడా మర్చిపోతాము. స్మృతి చాలా సులభమైనది. తండ్రి స్మృతిలోనే చమత్కారముంది. ఇటువంటి చమత్కారాన్ని మరే తండ్రీ నేర్పించలేరు. ఈ చమత్కారము ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు.
శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన చేశారని పిల్లలైన మీకు తెలుసు. ఏ ధర్మము సత్య-త్రేతా యుగాలలో ఉంటుందో అది అర్ధకల్పము వరకు నడుస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వారు వృద్ధి చెందుతారు. ఉదాహరణానికి మొట్టమొదట ఏసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా కొద్దిమందే ఉండేవారు. సంఖ్య ఎక్కువైనప్పుడు రాజ్య పాలన చేశారు. క్రిష్టియన్ ధర్మము ఇప్పటి వరకూ వృద్ధి చెందుతూనే ఉంది. క్రీస్తు ద్వారా మేము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటి నుండి 2000 సంవత్సరముల క్రితము ఏసుక్రీస్తు వచ్చాడు, ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మేము క్రీస్తుకు చెందినవారమని క్రైస్తవులు చెప్తారు. మొదట ఒక్క ఏసుక్రీస్తు వచ్చారు తర్వాత వారి ధర్మస్థాపన జరుగుతుంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు,........ తర్వాత ఇలానే వృద్ధి అవుతూ పోతుంది. ఇప్పుడు క్రైస్తవ ధర్మ వృక్షము ఎంత పెద్దదిగా అయిందో చూడండి. పునాది దేవీ దేవతా వంశము. అందుకే బ్రహ్మను గ్రేట్‌-గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌(ముత్తాతలకు తాత) అని అంటారు. కాని మనము పరమపిత పరమాత్మ శివుని డైరెక్టు(ప్రత్యక్ష) పిల్లలమని భారతవాసులు మర్చిపోయారు.
క్రైస్తవులకు కూడా - ఆదిదేవుడు ఉండి వెళ్లారు, ఈ మానవ వంశావళి వారిదే అని తెలుసు. పోతే వారు తమ క్రీస్తునే ఒప్పుకుంటారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును, బౌద్ధులు బుద్ధుని తండ్రి అని భావిస్తారు. వంశావళి కదా! ఎలాగైతే క్రీస్తు స్మృతిచిహ్నము క్రిస్టియన్‌ దేశములో ఉందో, అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు, కనుక మీ స్మృతిచిహ్నము కూడా ఇక్కడే(ఆబూలో) ఉంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. డెడ్‌సైలెన్స్‌(సంపూర్ణ నిశ్శబ్ధము)ను అనుభవం చేసే సత్య-సత్యమైన ఆత్మిక యాత్ర చేయాలి. '' హమ్‌ సో '' మంత్రమును సదా గుర్తుంచుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు.
2. మనసా, వాచా, కర్మణా చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికములో ఎలాంటి అపవిత్రత(మురికి) ఉండరాదు. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతమును గౌరవించాలి.

వరదానము :- '' 'బాబా' శబ్ధమనే తాళంచెవితో సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మా భవ ''
జ్ఞాన విస్తారాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయినా, వినిపించలేకపోయినా 'బాబా' అనే ఒక శబ్ధాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి, హృదయపూర్వకంగా ఇతరులకు వినిపిస్తే విశేష ఆత్మగా అయిపోతారు. ప్రపంచము ముందు మహాన్‌ ఆత్మ స్వరూపంలో మహిమా యోగ్యులుగా అవుతారు. ఎందుకంటే 'బాబా' శబ్ధము సర్వ ఖజానాలకు లేక భాగ్యానికి తాళంచెవి. తాళంచెవిని ఉపయోగించే విధి - హృదయపూర్వకంగా తెలుసుకోవడం మరియు అంగీకరించడం. హృదయపూర్వకంగా 'బాబా' అని అనండి, సర్వ ఖజానాలు మీ ముందు సదా హాజరుగా ఉంటాయి.

స్లోగన్‌ :- '' బాప్‌దాదాతో స్నేహముంటే, స్నేహంలో పాత ప్రపంచాన్ని త్యాగం చేయండి ''

No comments:

Post a Comment