Wednesday, December 18, 2019

Telugu Murli 19/12/2019

19-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, పతితుల నుండి పావనంగా అయ్యేందుకే ఈ చదువు. మీరు దీనిని చదవాలి, చదివించాలి''

ప్రశ్న :- ప్రపంచములో ఏ జ్ఞానము ఉన్నా అజ్ఞాన అంధకారము ఉంది ?
జవాబు :- సైన్సు జ్ఞానము(మాయను గురించిన జ్ఞానము). దీని ద్వారా వినాశనమవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు, ఈ జ్ఞానము చాలా ఉంది కాని కొత్త-పాత ప్రపంచాల జ్ఞానము ఎవ్వరి వద్దా లేదు. అందరూ అజ్ఞాన అంధకారములో ఉన్నారు. జ్ఞాన నేత్రము లేనందున అందరూ అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. ప్రపంచములోని వారి మెదడు(బ్రెయిన్‌)లో వినాశనాన్ని గురించిన ఆలోచనలున్నాయి, మీ బుద్ధిలో స్థాపన జరిగే ఆలోచనలున్నాయని జ్ఞాన సంపూర్ణ పిల్లలైన మీకు తెలుసు.

ఓంశాంతి. తండ్రి ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. దీనిని జీవము(శరీరము) అని అంటారు. ఇందులో(బ్రహ్మ) ఆత్మ కూడా ఉంది, నేను(శివబాబా) కూడా వచ్చి కూర్చున్నాను. మొట్టమొదట ఇది పక్కాగా అవ్వాలి. వీరిని దాదా అని అంటారు. ఈ నిశ్చయము పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయముతోనే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఆనందాన్ని అనుభవము చేయాలి. నేను(శివబాబా) ఇతని(బ్రహ్మ) అనేక జన్మల అంతిమ జన్మలో, అంతిమ సమయంలో తప్పకుండా వస్తానని, బాబా ఎవరిలో ప్రవేశించారో ఆ బాబాయే స్వయంగా చెప్తున్నారు. ఇది సర్వ శాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము ఒక్క భగవంతునిదే. వారి శ్రేష్ఠ మతము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే మీరు భ్రష్ఠ మతమును అనుసరించి పతితులుగా అవుతారో అప్పుడు నేను వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమంటే దాని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. వికారి మనుష్యుల నుండి నిర్వికారీ దేవతలుగా చేసేందుకు తండ్రి వస్తారు. సత్యయుగంలో కూడా మనుష్యులే ఉంటారు కాని వారు దైవీ గుణాలు కలిగినవారు. ఇప్పుడు కలియుగములో అందరూ ఆసురీ గుణాలు కలిగినవారిగా ఉన్నారు. అంతా మనుష్య సృష్టియే. కాని ఇది ఈశ్వరీయ బుద్ధి, అది ఆసురీ బుద్ధి. ఇక్కడ జ్ఞానముంది, అక్కడ భక్తి ఉంది. జ్ఞానము వేరు, భక్తి వేరు. భక్తికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. జ్ఞానము గురించి తెలిపే పుస్తకము ఒక్కటే ఉంది. ఒక్క జ్ఞానసాగరుని పుస్తకము ఒక్కటే ఉండాలి కదా. ఎవరు ధర్మస్థాపన చేసినా, వారి పుస్తకము కూడా ఒక్కటే ఉంటుంది. దానిని ధర్మశాస్త్రమని అంటారు.

మొట్టమొదటి ధర్మ శాస్త్రము గీత. మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవీదేవతా ధర్మము, హిందూ ధర్మము కాదు. గీత ద్వారా హిందూ ధర్మస్థాపన జరిగిందని, గీతా జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చారని మనుష్యులు అనుకుంటారు. ఎప్పుడు ఇచ్చారు? పరంపరలో అని చెప్తారు. ఏ శాస్త్రములోనూ శివ భగవానువాచ అని లేదు. ఈ గీతా జ్ఞానము ద్వారా మనుష్యులు దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు, దానిని ఇప్పుడు మనకు తండ్రి ఇస్తున్నారు. దీనినే భారతదేశ ప్రాచీన రాజయోగమని అంటారు. ఈ గీతలోనే కామము మహాశత్రువు అని లిఖించబడింది. ఈ శత్రువు మిమ్ములను ఓడించింది. తండి మిమ్ములను దీని పై విజయులుగా చేసి జగత్‌జీతులుగా, విశ్వాధికారులుగా చేస్తారు. బేహద్‌ తండ్రి కూర్చొని ఇతని(బ్రహ్మ) ద్వారా మిమ్ములను చదివిస్తారు. ఆయన సర్వాత్మల తండ్రి. ఇతను సర్వ మనుష్యాత్మల అనంతమైన తండ్రి, ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరు ఏమిటి? అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు తికమకపడ్తారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు, ఈ ముగ్గురికి తండ్రి ఎవరో ఉండాలి కదా! బ్రహ్మ-విష్ణువు-శంకరులు సూక్ష్మవతనములోని దేవతలు. వారి పైన శివుడు ఉన్నాడు. శివబాబా సంతానమైన ఆత్మలు శరీర ధారణ చేశారని, ఆయన మాత్రము సదా నిరాకార పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ఆత్మయే శరీరము ద్వారా పరమపిత అని చెప్తుంది. ఎంత సహజమైన విషయము. దీనిని అల్ఫ్‌(తండ్రి), బే(వారసత్వము)ల చదువు అని అంటారు. చదివించేవారెవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? కృష్ణుని భగవంతుడని అనరు. అతడు దేహధారి, కిరీటధారి. శివుడు నిరాకారి. వారికి ఏ కిరీటమూ మొదలైనవేవీ లేవు. వారే జ్ఞానసాగరులు. తండ్రి బీజరూపులు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన వారే. అన్ని వృక్షముల ఆది-మధ్యాంతాలు మీకు తెలుసు. భలే మీరు తోటమాలురు కాదు కాని బీజమును ఎలా వేస్తారు, దాని నుండి వ్షృము ఎలా వెలువడ్తుందో మీకు తెలుసు. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఆత్మ చైతన్యమైనదని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానముంది. ఇంకెవ్వరి ఆత్మలోనూ జ్ఞానము ఉండదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు. ఇదే చైతన్యమైన సృష్టి.

అవన్నీ జడ బీజములు. జడ బీజములో జ్ఞానము ఉందని కాదు, వీరు చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి సృష్టి జ్ఞానమంతా ఉంది. వృక్షము యొక్క ఉత్పత్తి-పాలన-వినాశనాల పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంది, మళ్లీ కొత్త వృక్షము ఎలా ప్రారంభమవుతుంది? ఇది గుప్తమైన విషయము. మీకు జ్ఞానము కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు దీని అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితులుగా అయ్యారు. మంచిది, బీజము నుండే మొట్టమొదటి ఆకు వెలువడింది. అతడు ఎవరు? సత్యయుగములోని మొదటి ఆకు అని కృష్ణుడినే అంటారు. లక్ష్మీనారాయణులను అనరు. క్రొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది. తర్వాత పెద్దదవుతుంది. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది. ఇది చైతన్యము కదా, భలే ఇతరులు కూడా వస్తారు, కానీ నెమ్మది-నెమ్మదిగా వారి మహిమ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు, కనుక ముఖ్యమైన విషయము మనము దైవీగుణాలను ధారణ చేయాలి. వీరిలా(లక్ష్మీనారాయణులుగా) అవ్వాలి. చిత్రముంది కదా. చిత్రము(లక్ష్మీనారాయణ) లేనట్లయితే బుద్ధిలో జ్ఞానము ఎలా వస్తుంది? ఈ చిత్రము చాలా ఉపయోగపడ్తుంది. భక్తి మార్గములో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది, జ్ఞాన మార్గములో మేము వీరిలాగా అవ్వాలనే జ్ఞానము మీకు లభిస్తుంది. భక్తిమార్గములో మేము వీరిలాగా అవ్వాలని అనుకోరు. భక్తిమార్గములో ఎన్నో మందిరాలు మొదలైన వాటిని కట్టిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరి మందిరాలు ఉన్నాయి? తప్పకుండా శివబాబావే ఉంటాయి. వారి తర్వాత వారి రచనకు ఉంటాయి. మొట్టమొదటి రచన ఈ లక్ష్మీనారాయణులు కనుక శివుని తర్వాత వీరికి ఎక్కువగా పూజ జరుగుతుంది. జ్ఞానాన్నిచ్చే మాతలకు పూజ జరగదు. వారు చదువుకుంటారు. మీకు ఇప్పుడు పూజ జరగదు, ఎందుకంటే ఇంకా మీరు చదువుతున్నారు. ఎప్పుడైతే మీరు చదువు పూర్తి చేసి, అవిద్యావంతులుగా అవుతారో అప్పుడు మీకు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతారు. సత్యయుగములో చదివించేందుకు తండ్రి రారు. అక్కడ ఇలాంటి చదువు ఉండదు. ఇది పతితుల నుండి పావనంగా చేసే చదువు. మనలను ఎవరు ఇలా తయారుచేస్తారో వారికి పూజ జరుగుతుందని, తర్వాత మనకు కూడా నంబరువారుగా పూజ జరుగుతుందని మీకు తెలుసు. తర్వాత క్రిందకు దిగజారుతూ దిగజారుతూ 5 తత్వాలను కూడా పూజించడం ప్రారంభిస్తారు. 5 తత్వాల పూజ అనగా పతిత శరీరాల పూజ. పూర్తి సృష్టి పై ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని మీ బుద్ధిలో జ్ఞానముంది. ఈ దేవీదేవతలు రాజ్యాన్ని ఎలా, ఎప్పుడు పొందారో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయాలైతే ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. అందుకే ఇది పరంపరగా వస్తోందని అనేస్తారు. దేవీ దేవతా ధర్మమువారు ఇతర ధర్మాలలోకి మారిపోయారని, భారతదేశములో ఉన్నవారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారని ఇప్పుడు మీకు తెలుసు, ఎందుకంటే పతితులుగా అయినందున దేవీ దేవతలుగా చెప్పుకోవడం శోభించదు. అయితే మనుష్యులలో జ్ఞానమెక్కడ ఉంది! స్వయానికి దేవీ దేవతలకన్నా గొప్ప బిరుదులను ఉంచుకుంటారు. పావన దేవీ దేవతలకు పూజ చేసి తల వంచుతారు, కాని తమను తాము పతితులమని అర్థము చేసుకోలేరు.

భారతదేశములో ముఖ్యంగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తారు, గౌరవిస్తారు. కుమారులను అంతగా గౌరవించరు. పురుషులకన్నా ఎక్కువగా స్త్రీలకు నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృతము మొదట ఈ మాతలకు లభిస్తుంది. శివబాబా ఇతనిలో(బ్రహ్మలో) ప్రవేశిస్తారు. బ్రహ్మాబాబా జ్ఞానపు పెద్ద నది అని కూడా అర్థం చేసుకున్నారు. జ్ఞాన నది కూడా అయ్యాడు, పురుషుడు కూడా అయ్యాడు. బ్రహ్మాపుత్రా నది అన్నింటికంటే పెద్ద నది. ఇది కలకత్తా వైపు సాగరములోకి వెళ్ళి కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరగుతుంది. కాని ఇది ఆత్మ-పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మాపుత్ర అని పేరు పెట్టారు. వారు బ్రహ్మ తత్వాన్ని ఈశ్వరుడని అంటారు. కనుక బ్రహ్మాపుత్ర నది పావనమైనదని అనుకుంటారు. వాస్తవానికి గంగా నదిని పతితపావని అని అనరు. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మా నదుల మిలనము జరుగుతుంది. బాబా చెప్తారు - ఇతని ద్వారా దత్తు తీసుకునేందుకు ఇతను స్త్రీ కాదు. ఇవి చాలా గుహ్యమైన అర్థము చేసుకోవాల్సిన విషయాలు. ఇవి మళ్లీ ప్రాయ: లోపమైపోతాయి. తర్వాత మళ్లీ మనుష్యులు ఈ ఆధారముతో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మొదట చేతితో లిఖంపబడ్డ శాస్త్ర్రాలుండేవి. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రింపబడ్డాయి. సంస్కృతములో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కాదు. ఇవి పూర్తిగా సహజమైన విషయాలు. నేను ఇతని(బ్రహ్మ) ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను. తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్ర్రాలు మొదలైనవేవీ ఉండవు. మళ్లీ భక్తిమార్గములో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి పరంపరగా వసున్నాయని మనుష్యులు భావిస్తారు. దీనిని అజ్ఞానాంధకారమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తారు. దీని ద్వారా మీరు ప్రకాశములోకి వచ్చారు. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గముండేది, కలియుగములో అందరూ అపవిత్ర ప్రవృత్తి కలిగిన వారున్నారు. ఇది కూడా డ్రామాయే. తర్వాత నివృత్తి మార్గముంటుంది. దీనిని సన్యాస ధర్మమని అంటారు. అడవిలోకి వెళ్ళి ఉంటారు. అది హద్దులోని సన్యాసము. ఈ పాత ప్రపంచములోనే ఉంటారు. మీరిప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన మూడవ నేత్రము లభించింది. కనుక మీరు ఎంతో నాలెడ్జ్‌ఫుల్‌గా అవుతారు. దీని కంటే గొప్ప జ్ఞానము ఉండనే ఉండదు. అది మాయా జ్ఞానము. దాని ద్వారా వినాశనమవుతుంది. వారు చంద్రుని పైకి వెళ్ళి పరిశోధనలు చేస్తారు. మీకు కొత్త విషయాలేవీ లేవు. ఇదంతా మాయ ఆడంబరము. చాలా ప్రదర్శన(షో) చేస్తారు. ఏదైనా అద్భుతము చేసి చూపించాలని చాలా లోతుగా వెళ్తారు. చాలా అద్భుతము చేయడం వలన నష్టము కలుగుతుంది. వారి మెదడులో వినాశనము గురించిన ఆలోచనలే వస్తాయి. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. దీని ద్వారా వినాశనమవుతుందని తయారు చేసిన వారికి తెలుసు. ట్రైయల్‌(పరీక్షలు) కూడా చేస్తూ ఉంటారు. రెండు పిల్లులు జగడాలాడితే, మూడవది వెన్న తిని పోయిందని అంటారు. కథ చిన్నదే కాని ఆట ఎంత పెద్దది! వీరి పేరే ప్రసిద్ధమైనది. వీరి ద్వారానే వినాశనము నిర్ణయించబడింది. ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు కదా. స్వర్గముండేది (ప్యారడైజ్‌) కాని ఆ సమయంలో మేము(క్రిస్టియన్‌లు) లేమని క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. ఇస్లాం వారు, బౌద్ధులు కూడా లేరు. అయినా క్రైస్తవులకు మంచి తెలివి ఉంది. దేవీదేవతా ధర్మము లక్షల సంవత్సరాల క్రితము ఉండేదని భారతవాసులంటారు. కనుక వారు అవివేకులు అయినట్లే కదా. తండ్రి భారతదేశములోనే వస్తారు. ఎవరైతే మహాన్‌ అవివేకులుగా ఉంటారో వారినే అతిమహాన్‌ వివేకవంతులుగా చేస్తారు, కానీ స్మృతి ఉన్నప్పుడు మాత్రమే.

తండ్రి పిల్లలైన మీకు చాలా సులభము చేసి అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు బంగారు పాత్రగా అవుతారు. అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతియాత్ర ద్వారానే పాపము సమాప్తమవుతుంది. మురళి వినకుంటే జ్ఞానము అదృశ్యమైపోతుంది. తండ్రి దయా హృదయులైనందున మళ్లీ ఉన్నతి పొందే యుక్తిని తెలియజేస్తారు. చివరి వరకు నేర్పిస్తూనే ఉంటారు. మంచిది, నేడు భోగ్‌ ఉంది. భోగాన్ని స్వీకరింపజేసి త్వరగా వాపస్‌ రావాలి. వైకుంఠములోకి వెళ్ళి దేవీ-దేవతలు మొదలైన సాక్షాత్కారాలు మొదలైనవి చేసుకోవడం, ఇదంతా వ్యర్థము. ఇందులో చాలా సూక్ష్మబుద్ధి అవసరము. తండ్రి ఈ రథము ద్వారా చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, నేనే పతితపావనుడైన మీ తండ్రిని. మీ జతలోనే తింటాను........ మీ జతలోనే కూర్చుంటాను........... ఇవన్నీ ఇక్కడి కొరకే. పైన ఎలా ఉంటాయి? మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఈ దాదాలో ప్రవేశించి మనలను మనుష్యుల నుండి దేవతలుగా అనగా వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ నిశ్చయముతో ఆనందంగా ఉండాలి. శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠమైన గుణవంతులుగా అవ్వాలి.
2. స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. జ్ఞానము సదా బుద్ధిలో ఉండాలి. అందుకు మురళి తప్పకుండా చదవాలి లేక వినాలి.

వరదానము :- '' శారీరిక వ్యాధుల చింతన నుండి ముక్తులుగా అయి జ్ఞాన చింతన లేక స్వ చింతన చేసే శుభచింతక్‌ భవ ''
ఒకటేమో శరీరానికి వ్యాధి రావడం, మరొకటి వ్యాధిలో కదిలిపోవడం(చలించడం). వ్యాధి రావడం డ్రామాలో నిశ్చయమై ఉంది. కాని శ్రేష్ఠ స్మృతి కదిలిపోవడం - బంధనయుక్తుల గుర్తు. ఎవరైతే శారీరిక వ్యాధిని గురించిన చింత నుండి ముక్తులుగా ఉండి, స్వచింతనలో ఉండి జ్ఞాన చింతన చేస్తూ ఉంటారో వారు శుభచింతకులు. ప్రకృతిని(దేహాన్ని) గురించిన చింతన ఎక్కువగా చేస్తే అది చిత(చితి) రూపమైపోతుంది. ఈ బంధనము నుండి ముక్తులుగా అవ్వడాన్నే కర్మాతీత స్థితి అని అంటారు.

స్లోగన్‌ :- '' స్నేహ శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది ''

No comments:

Post a Comment