Monday, December 23, 2019

Telugu Murli 24/12/2019

24-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ దీపాన్ని మీరే సంభాళించుకోవాలి. తుఫానుల నుండి రక్షణ పొందేందుకు జ్ఞాన - యోగాలనే నెయ్యి తప్పకుండా కావాలి ''

ప్రశ్న :- ఏ పురుషార్థము గుప్త తండ్రి నుండి గుప్త వారసత్వమునిప్పిస్తుంది ?
జవాబు :- అంతర్ముఖత అనగా నిశ్శబ్ధంగా ఉంటూ తండిన్రి స్మృతి చేస్తే గుప్త వారసత్వము లభిస్తుంది. స్మృతిలో ఉంటూ ఆత్మ శరీరాన్ని వదిలిపోతే చాలా మంచిది. ఇందులో ఏ కష్టమూ లేదు. స్మృతితో పాటు జ్ఞాన-యోగాల సేవ కూడా చేయాలి. అలా చేయలేకుంటే కర్మణా సేవ చేయండి. చాలా మందికి సుఖమునిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. నడవడికలు, మాటలు కూడా చాలా సాత్వికంగా ఉండాలి.

పాట :- నిర్బలునితో బలవంతుని యుద్ధము,...........( నిర్బల్‌ సే లడాయీ బల్‌వాన్‌ కీ,......)
ఓంశాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇటువంటి పాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరు వారంతకు వారే తమను గురించి విచార సాగర మథనము చేయాలి. మానవులు మరణిస్తే, 12 రోజులు దీపము వెలిగిస్తారని మీకు తెలుసు. మీరు మరణించేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పురుషార్థము చేసి మీ దీపాన్ని మీరే వెలిగించుకుంటున్నారు. పురుషార్థము కూడా మాలలో వచ్చేవారే చేస్తారు. ప్రజలు ఈ మాలలో రారు. మేము విజయ(వైజయంతి)మాలలో మొదట రావాలని పురుషార్థము చేయాలి, మాయ అనే పిల్లి తుఫానులు కల్పించి మీ దీపము ఆరిపోయే వికర్మలు చేయించరాదు. దీని కొరకు జ్ఞాన-యోగాలనే రెండు శక్తులూ కావాలి. యోగముతో పాటు జ్ఞానము కూడా అవసరము. ప్రతి ఒక్కరు తమ - తమ దీపాన్ని సంభాళించుకోవాలి. చివరి వరకు పురుషార్థము జరుగుతూనే ఉండాలి. రేస్‌(పోటీ) నడుస్తూనే ఉంటుంది. కనుక పరుగెత్తునప్పుడు జ్యోతి వెలుగు తగ్గిపోకుండా, ఆరిపోకుండా చాలా సంభాళించుకోవాలి. అలా ఉండేందుకు జ్ఞాన-యోగాలనే నేతిని ప్రతిరోజూ వేస్తూ ఉండాలి. యోగబలము లేకుంటే పరుగెత్తలేరు, వెనుక పడిపోతారు. పాఠశాలలో సబ్జెక్టులుంటాయి. ఏదైనా ఒక సబ్జెక్టులో శక్తివంతముగా లేకుంటే లెక్కల పై చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సేవ అనే సబ్జెక్టు కూడా చాలా మంచిది. చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. కొంతమంది జ్ఞాన సేవ చేస్తారు. రోజురోజుకు సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమంది ధనవంతులకు 6-8 దుకాణాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకే విధంగా జరగవు. కొన్ని దుకాణాలలో తక్కువగా, కొన్నింటిలో ఎక్కువగా గిరాకులుంటారు. మీ దుకాణాలు కూడా రాత్రి ఫుర్సత్తు లేకుండా జరిగే రోజులు వస్తాయి. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి ఉన్నారని, వారు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుతున్నారని అందరికి తెలుస్తుంది. తర్వాత చాలా మంది పిల్లలు వస్తారు. ఎంతమంది వస్తారో అడగొద్దు. ఫలానా చోట ఈ వస్తువులు చాలా చవకగా దొరుకుతున్నాయని ఒకరికొకరు చెప్పుకుంటారు కదా. ఈ రాజయోగ శిక్షణ చాలా సహజమని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఈ జ్ఞానరత్నాల గురించి అందరికీ తెలిస్తే అనేకమంది వస్తూ ఉంటారు. ఈ జ్ఞాన-యోగాల సేవ మీరు చేస్తున్నారు. ఈ జ్ఞాన-యోగాల సేవ చేయలేని వారు కర్మణా సేవ చేసినా మార్కులు లభిస్తాయి. అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకరికొకరు సుఖమును ఇస్తూ ఉండాలి. ఇది చాలా - చాలా చవక భండారము. ఇది అవినాశి వజ్ర వైడూర్యాల గని. అష్టరత్నాల మాల తయారు చేస్తారు కదా, మాలను పూజిస్తారు కూడా. కానీ ఆ మాల ఎవరి జ్ఞాపకార్థంగా తయారయిందో ఎవ్వరికీ తెలియదు.
పూజ్యులైన మనమే పూజారులుగా ఎలా అవుతామో పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము. దీనిని గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు భాగ్యశాలి నక్షత్రాలు. మేము స్వర్గానికి అధికారులుగా ఉండేవారము, ఇప్పుడు నరకానికి అధికారులుగా అయ్యామని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వర్గానికి అధికారులుగా అయితే పునర్జన్మలు కూడా అక్కడే జరుగుతాయి. ఇప్పుడు మనము మళ్లీ స్వర్గానికి అథికారులుగా అవుతున్నాము. ఈ సంగమ యుగము గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అటువైపు మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. యుగాలు వేరు వేరుగా ఉంటాయి కదా. సత్యయుగములో ఉంటే పునర్జన్మ కూడా సత్యయుగములోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. మీలో ఎవరైనా శరీరము వదిలితే సంస్కారాల అనుసారంగా మళ్లీ ఇక్కడకే వచ్చి జన్మ తీసుకుంటారు. మీరు సంగమ యుగ బ్రాహ్మణులు. వారు కలియుగములోని శూద్రులు. ఈ జ్ఞానమంతా మీకు ఈ సంగమ యుగములోనే లభిస్తుంది. మీరు బి.కె.లు, జ్ఞాన గంగలు ప్రాక్టికల్‌గా ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు మీరు పరుగులు తీయాలి. దుకాణము నడపాలి. జ్ఞాన-యోగములను ధారణ చేయకుంటే దుకాణమును సంభాళించలేరు. సేవకు ప్రతిఫలమైతే బాబా ఇస్తారు. యజ్ఞము రచించినప్పుడు రకరకాల బ్రాహ్మణులు వస్తారు. కొంతమందికి ఎక్కువ దక్షిణ, కొంతమందికి తక్కువ దక్షిణ లభిస్తుంది. ఇప్పుడు ఈ రుద్రజ్ఞాన యజ్ఞమును పరమపిత పరమాత్మ రచించారు. మనము బ్రాహ్మణులము. మానవులను దేవతలుగా మార్చడమే మన వ్యాపారము లేక కర్తవ్యము. ఇలాంటి యజ్ఞము మరేదీ ఉండదు. ఈ యజ్ఞము ద్వారా మేము మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నామని చెప్పగలిగే యజ్ఞము ఇది తప్ప మరొకటి లేదు. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము లేక పాఠశాల అని కూడా అంటారు. జ్ఞాన-యోగాల ద్వారా ప్రతి పుత్రుడు దేవీ దేవతా పదవిని పొందుకోగలడు. బాబా సలహా కూడా ఇస్తారు - మీరు పరంధామము నుండి బాబా జతలో వచ్చారు. మేము పరంధామ నివాసులమని మీరంటారు. ఈ సమయంలో బాబా మతము ద్వారా మనము స్వర్గస్థాపన చేస్తున్నాము. ఎవరైతే స్థాపన చేస్తారో వారే తప్పకుండా యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచములో మనము అత్యంత భాగ్యశాలురమని, జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్రుల జ్ఞాన నక్షత్రాలమని మీకు తెలుసు. అలా తయారు చేయువారు జ్ఞానసాగరులు. ఆ సూర్య, చంద్ర, నక్షత్రాలైతే స్థూలంగా ఉన్నాయి కదా. వాటితో మనలను పోలుస్తున్నారు. కనుక మనము కూడా మళ్లీ జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్ర, జ్ఞాన నక్షత్రాలుగా అవుతాము. మనలను అలా తయారుచేయువారు జ్ఞాన సాగరులు. పేర్లేమో ఉంటాయి కదా. మనము జ్ఞానసూర్యుడు లేక జ్ఞానసాగరుల పిల్లలము. వారిక్కడ నివసించువారు కాదు. బాబా చెప్తున్నారు - నేను వచ్చి మిమ్ములను నా సమానంగా తయారు చేస్తాను. జ్ఞాన సూర్య, జ్ఞాన నక్షత్రాలుగా మీరు ఇక్కడే తయారవ్వాలి. మనము భవిష్యత్తులో మళ్లీ ఇక్కడే స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. పురుషార్థము పైననే అంతా ఆధారపడి ఉంది. మనము మాయ పై విజయము పొందే యోధులము. వారు మనసును వశపరచుకునేందుకు ఎన్నో హఠయోగాలు మొదలైనవి చేస్తారు. మీరు హఠయోగాలు మొదలైనవి చెయ్యలేరు. బాబా చెప్తారు - మీరు ఏ మాత్రము కష్టము మొదలైనవి చేసే అవసరము లేదు. మీరు నా వద్దకు రావాలి కనుక నన్ను స్మృతి చేయండని మాత్రము చెప్తాను. నేను పిల్లలైన మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. ఈ విధంగా ఏ ఇతర మనుష్యులు చెప్పలేరు. భలే తమను ఈశ్వరుడు అని చెప్పుకోవచ్చు, కాని మార్గదర్శకుడను(గైడ్‌ను) అని చెప్పుకోలేరు. బాబా అంటున్నారు - నేను ముఖ్యమైన మార్గదర్శకుడను, కాలులకు కాలుడను. సత్యవంతుడు, సావిత్రి కథ ఉంది కదా. వారిది శారీరిక ప్రేమ అయినందున సావిత్రి దుఃఖపడింది. మీరైతే సంతోషిస్తారు. నేను ఆత్మలైన మిమ్ములను తీసుకెళ్తాను. మీరు ఎప్పుడూ దుఃఖపడరు. మా బాబా మమ్ములను స్వీట్‌హోమ్‌కు తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. దానిని ముక్తిధామము, నిర్వాణధామము అని అంటారు. నేను కాలులకు కాలుడనని అంటున్నారు. ఆ కాలుడు ఒక్కొక్క ఆత్మను తీసుకెళ్తాడు. కాని నేను చాలా గొప్ప కాలుడను. 5 వేల సంవత్సరాల క్రితము కూడా నేను మార్గదర్శకునిగా అయి అందరిని తీసుకెళ్లాను. ప్రియుడు, ప్రేయసులందరినీ వాపసు తీసుకెళ్తాడు. కనుక వారిని స్మృతి చేయవలసి వస్తుంది.
ఇప్పుడు మనము చదువుకుంటున్నామని మళ్లీ ఇక్కడకు వస్తామని మీకు తెలుసు. మొదట స్వీట్‌ హోమ్‌కు వెళ్తారు. మళ్లీ క్రిందకు వస్తారు. పిల్లలైన మీరు స్వర్గములోని నక్షత్రాలు. ఇంతకు ముందు నరకములోని నక్షత్రాలు. పిల్లలను నక్షత్రాలని అంటారు. మీరు నంబరువారీగా పురషార్థానుసారము భాగ్యశాలి నక్షత్రాలు. మీకు తాతగారి ఆస్తి లభిస్తుంది. ఇది చాలా శక్తిశాలి గని(ఖజానా). ఈ గని ఒక్కసారి మాత్రమే వెలువడ్తుంది. ఆ గనులైతే చాలా ఉన్నాయి కదా. ఆ గనులు వెలువడ్తూనే ఉంటాయి. ఎవరైనా వెతికితే చాలా కనిపిస్తాయి. ఈ గని అయితే ఒక్కసారి మాత్రమే ఒక్కటే లభిస్తుంది. ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా. ఆ పుస్తకాలైతే చాలా ఉన్నాయి. కాని వాటిని రత్నాలని అనరు. బాబాను జ్ఞానసాగరులని అంటారు. అవినాశి జ్ఞాన రత్నాల నిరాకార గని. ఈ రత్నాలతో మనము జోలెలు నింపుకుంటూ ఉంటాము. పిల్లలైన మీకు ఖుషీ ఉండాలి. ప్రతి ఒక్కరికీ నషా కూడా ఉంటుంది. దుకాణములో వ్యాపారము ఎక్కువగా జరిగితే పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ప్రజలనే కాకుండా వారసులను కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ రత్నాలతో జోలెను నింపుకొని వెళ్ళి అక్కడ దానము చేయాలి. ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే జ్ఞాన రత్నాలతో జోలెను నింపే జ్ఞానసాగరుడు. అంతేకాని వారు చెప్పినట్లు దేవతలకు రత్నాలతో నింపిన పళ్ళెములనిచ్చే సాగరము కాదు. ఆ సాగరము నుండి రత్నాలు లభించవు. ఇది జ్ఞాన రత్నాల విషయము. డ్రామానుసారము మీకు మళ్లీ రత్నాల గనులు కూడా లభిస్తాయి. అక్కడ మీకు లెక్కలేనన్ని వజ్ర వైడూర్యాలుంటాయి. వాటితోనే భక్తిమార్గములో మళ్లీ మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. భూకంపాలు మొదలైనవి జరిగినందున మందిరాలన్నీ లోపల భూస్థాపితమైపోతాయి. అక్కడ భవనాలు మొదలైనవి చాలా నిర్మిస్తారు, ఒకటి కాదు. ఇక్కడ కూడా రాజులకు చాలా పోటీ ఏర్పడ్తుంది. కల్పక్రితము భవనాలు ఎలా నిర్మించారో మళ్లీ అలాగే నిర్మిస్తారని మీకు తెలుసు. అక్కడ ఇండ్లు మొదలైనవి చాలా సులభంగా తయారవుతూ ఉంటాయి. సైన్సు చాలా పని చేస్తుంది. కాని అక్కడ సైన్సు అను పదమే ఉండదు. హిందీలో సైన్సును విజ్ఞానము అని అంటారు. ఈ రోజులలో విజ్ఞాన భవనమనే పేరు కూడా ఉంచారు. విజ్ఞానమనే పదము జ్ఞానము జతలో ఉంటుంది. జ్ఞానము మరియు యోగాలను విజ్ఞానమని కూడా అంటారు. జ్ఞానము ద్వారా రత్నాలు లభిస్తాయి, యోగము ద్వారా మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతాము. ఇది జ్ఞాన-యోగాల నాలెడ్జ్‌. దీని ద్వారా మళ్లీ వైకుంఠములో పెద్ద - పెద్ద భవనాలు తయారవుతాయి. మనమిప్డుడు ఈ జ్ఞానమంతా తెలుసుకున్నాము. భారతదేశాన్ని మనము స్వర్గంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. ఈ దేహము పై మీకు ఎలాంటి మమకారము లేదు. మనము ఆత్మలము ఈ శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్లి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. అక్కడ కూడా ఒక పాత శరీరాన్ని వదిలి కొత్తదానిని తీసుకుంటామని భావిస్తాము. అక్కడ ఎలాంటి దు:ఖము లేక శోకము ఉండదు. నూతన శరీరాన్ని ధరిస్తే మంచిదే కదా. కల్పక్రితము తయారైనట్లు ఇప్పుడు మళ్లీ మనలను బాబా తయారు చేస్తున్నారు. మనము మానవుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము. కల్పక్రితము కూడా తప్పకుండా అనేక ధర్మాలుండేవి. గీతలో ఇది ఏ మాత్రమూ లేదు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవతా ధర్మము స్థాపన అవుతుందని గాయనముంది. అనేక ధర్మాల వినాశమెలా జరుగుతుందో మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. దేవీ దేవతా ధర్మము లోపించినప్పుడే బాబా ఇక్కడకు వచ్చారు. అటువంటప్పుడు పరంపర నుండి ఎలా నడుస్తుంది? ఇవి చాలా సహజమైన విషయాలు. వినాశమయ్యేది ఏది? అనేక ధర్మాలు. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి కదా. ఇది అంతిమ సమయము. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. అంతేకాని శివబాబాయే అర్థం చేయిస్తారని కాదు. ఈ బాబా ఏమీ తెలుపరా? ఇతనికి కూడా పాత్ర ఉంది. శ్రీమతము బ్రహ్మదనే గాయనము కూడా ఉంది. కృష్ణుని శ్రీమతమని అనరు. అక్కడ అందరూ శ్రేష్ఠంగానే ఉంటారు. వారికి మతము అవసరమే లేదు. ఇక్కడ బ్రహ్మ నుండి కూడా మతము(సలహా) లభిస్తుంది. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ - అందరి మతము శ్రేష్ఠంగానే ఉంటుంది. తప్పకుండా ఎవరో ఆ మతమునిచ్చి ఉంటారు. దేవతలు శ్రేష్ఠ మతానికి చెందినవారు. శ్రీమతము ద్వారానే స్వర్గము తయారవుతుంది. ఆసురీ మతము ద్వారా నరకము తయారయ్యింది. శ్రీమతము శివునిది. ఈ విషయాలన్నీ సహజంగా అర్థము చేసుకునేవి. ఇవన్నీ శివబాబా దుకాణాలే. పిల్లలైన మనము నడిపేవారము. ఎవరు దుకాణాన్ని బాగా నడిపిస్తారో, వారి పేరు కూడా ఉంటుంది. వ్యాపారంలో జరిగినట్లే జరుగుతుంది. కాని ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. అందరూ వ్యాపారము చేయాల్సిందే. చిన్న పిల్లలు కూడా జ్ఞాన-యోగాల వ్యాపారము చేయవచ్చు. బుద్ధి ద్వారా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తే చాలు. వారు రామ్‌-రామ్‌ అని అంటారు. ఇక్కడ నిశ్శబ్ధంగా ఉండి స్మృతి చేయాలి. ఏమీ మాట్లాడరాదు. శివపురి, విష్ణుపురి ఇవి చాలా సహజమైన మాటలు. స్వీట్‌ హోమ్‌, స్వీట్‌ రాజధానుల స్మృతి ఉంది. వారు స్థూలమైన మంత్రమునిస్తారు, ఇది సూక్ష్మ మంత్రము. అతి సూక్ష్మమైన స్మృతి. కేవలం ఇది స్మృతి చేసినందున మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము. జపించే విషయమేదీ లేదు, కేవలం స్మృతి చేయాలి. ఏ శబ్ధమూ చేయనవసరము లేదు. గుప్తమైన బాబా ద్వారా గుప్త ఆస్తిని నిశ్శబ్ధంగా ఉండుట వలన, అంతర్ముఖులుగా అవ్వడం వలన మనము పొందుకుంటాము. ఈ స్మృతిలోనే ఉంటూ దేహాన్ని వదిలేస్తే చాలా మంచిది. ఏ కష్టమూ లేదు, ఎవరికి స్మృతి నిలువదో, వారు స్వయం అభ్యాసము చేయాలి. నన్ను స్మృతి చేస్తే అంతమతి సో గతి అవుతారని బాబా చెప్తున్నారని అందరికీ చెప్పండి. స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయి. నేను మిమ్ములను స్వర్గములోకి పంపిస్తాను. బుద్ధియోగాన్ని శివబాబాతో జోడించడం చాలా సులభము. మొత్తం పథ్యము కూడా ఇక్కడే ఉండాలి. సతోప్రధానంగా అవ్వాలంటే అన్నీ సాత్వికంగా ఉండాలి. నడవడికలు సాత్వికమే, మాట్లాడడం కూడా సాత్వికంగానే ఉండాలి. ఇది మీతో మీరు మాట్లాడుకోవడం. తోటివారితో ప్రియంగా మాట్లాడాలి. పాటలో కూడా ఉంది కదా - ప్రియాతి ప్రియంగా మాట్లాడడం సదా అత్యంత విలువైనది.
మీరు రూపబసంతులు(యోగీ-జ్ఞానీ ఆత్మలు) ఆత్మకు రూపమేర్పడుతుంది. తండ్రి జ్ఞాన సాగరులైనందున వారు వచ్చి తప్పకుండా జ్ఞానమే వినిపిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వచ్చి శరీరాన్ని ధరిస్తానని చెప్తున్నారు. ఇదేమీ తక్కువైన ఇంద్రజాలము కాదు! బాబా కూడా రూపబసంతులే. అయితే నిరాకారులు కనుక మాట్లాడలేరు. అందువలన శరీరాన్ని తీసుకున్నారు. కాని వారు పునర్జన్మలలో రారు. ఆత్మలైతే పునర్జన్మలు తీసుకుంటాయి.
పిల్లలైన మీరు బాబాకు సమర్పణ అవుతారు. అందువలన బాబా అంటున్నారు - నాకు సమర్పణైన తర్వాత ఎవ్వరి పై మమకారముంచరాదు. 'నాది' అని ఏ మాత్రమూ భావించరాదు. మమకారాన్ని నశింపజేసేందుకే బాబా యుక్తి రచించారు. అడుగడుగునా తండ్రిని అడగాల్సి ఉంటుంది. మాయ చెంపదెబ్బ వేస్తుంది. మల్లయుద్ధము చేస్తుంది. చాలామంది దెబ్బ తిని మళ్లీ లేచి నిలబడ్తారు. బాబా, మాయ చెంపదెబ్బ కొట్టి ముఖాన్ని నల్లగా చేసేసిందని కూడా వ్రాస్తారు. 4 అంతస్థుల నుండి క్రింద పడినట్లు అవుతుంది. క్రోధము చేసుకుంటే 3 అంతస్థుల నుండి పడినట్లుంటుంది. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. ఇప్పుడు పిల్లలు టేప్‌ కొరకు కూడా అడుగుతున్నారు - బాబా టేపు పంపితే మేము ఖచ్ఛితమైన మురళి పూర్తిగా వింటాము అని అంటారు. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది వింటే వారి బుద్ధి వికసిస్తుంది. అనేకమందికి కళ్యాణము జరుగుతుంది. మనుష్యులు కాలేజి తెరిస్తే మరుసటి జన్మలో వారికి చదువు ఎక్కువగా అబ్బుతుంది. బాగా చదువు వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు - టేపు మిషన్‌ కొంటే చాలామందికి కళ్యాణమవుతుంది - మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సతోప్రధానంగా అయ్యేందుకు చాలా - చాలా పథ్యముండాలి. మీ ఆహారపానీయాలు, మాటలు నడవడికలన్నీ సాత్వికంగా ఉంచుకోవాలి. తండ్రి సమానంగా రూప బసంతులుగా అవ్వాలి.
2. అవినాశి జ్ఞానరత్నాల నిరాకార గని(ఖజానా) నుండి మీ జోలెను నింపుకొని అపారమైన ఖుషీలో ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞాన రత్నాలను దానమివ్వాలి.

వరదానము :- '' మనసు, బుద్ధిని ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యములో ఉపయోగించే నిరంతర యోగీ భవ ''
నిరంతర యోగి అంటే స్వరాజ్య అధికారి. అలా అయ్యే విశేష సాధనం - మనసు మరియు బుద్ధి. మంత్రము పేరే 'మన్మనాభవ,' యోగాన్ని బుద్ధి యోగమని అంటారు. కనుక ఈ విశేష ఆధార స్తంభం మీ అధికారంలో ఉంది అంటే ఆజ్ఞానుసారము విధి పూర్వకంగా పని చేస్తారు. ఏ సంకల్పం ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చెయ్యగలరు. బుద్ధిని ఎక్కడ లగ్నము చేయాలో అక్కడ లగ్నము చేయగలరు. రాజులైన మిమ్ములను బుద్ధి భ్రమింపచేయరాదు. విధి పూర్వకంగా కార్యము చేయాలి. అప్పుడు నిరంతర యోగులని అంటారు.

స్లోగన్‌ :- '' మాస్టర్‌ విశ్వ శిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి ''

No comments:

Post a Comment