14-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు రిఫ్రెష్(ఉత్సాహము, తాజా) అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. తండ్రితో మిలనము చేయడం వలన భక్తిమార్గములోని అలసట అంతా దూరమైపోతుంది ''
ప్రశ్న :- పిల్లలైన మిమ్ములను బాబా ఎలా రిఫ్రెష్(తాజాగా) చేస్తారు ?
జవాబు :- 1. బాబా జ్ఞానము వినిపించి వినిపించి మిమ్ములను రిఫ్రెష్ చేస్తారు. 2. స్మృతి ద్వారా కూడా మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యయుగం సత్యమైన విశ్రామపురము. ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏదీ అప్రాప్తి అనేదే ఉండదు. 3. శివబాబా ఒడిలోనికి వస్తూనే మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసట అంతా దూరమైపోతుంది.
ఓంశాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - జతలో ఈ దాదా కూడా అర్థము చేసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు. మీరు ఎలా అర్థము చేసుకుంటున్నారో, అలా ఈ దాదా కూడా అర్థము చేసుకుంటారు. దాదాను భగవంతుడని అనరు, ఇది భగవానువాచ. తండ్రి ఏం తెలియజేస్తున్నారు? ''దేహీ-అభిమాని భవ.'' ఎందుకంటే స్వయాన్ని ఆత్మ అని భావించకుండా పరమపిత పరమాత్మను స్మృతి చేయలేరు. ఈ సమయంలో ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు. పతితులనే మనుష్యులని అంటారు. పావనంగా ఉండేవారిని దేవతలని అంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు. పతితులను పావనము చేసేవాడా ఓ పతిత పావనా! రండి అని మనుష్యులే పిలుస్తారు. దేవతలు ఇలా ఎప్పుడూ పిలువరు. పతితపావనులైన తండ్రి పతితుల పిలుపు పైనే వస్తారు. ఆత్మలను పావనంగా చేసి మళ్లీ కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది, శరీరము పిలువదు. సదా పావనమైన పారలౌకిక తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. ఇది పాత ప్రపంచము. బాబా నూతన పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కొందరు మాకు ఇక్కడే అపారమైన సుఖముంది, ధన-సంపదలు ఉన్నాయని అంటారు. వారు మాకు ఇదే స్వర్గమని అనుకుంటారు. అలాంటివారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం కూడా అవివేకము. ఎంత శిథిలమైన స్థితి వచ్చింది! అయినా మేము స్వర్గములో ఉన్నామని మనుష్యులు అంటారు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించకుంటే మీరు రాతి బుద్ధిగలవారా? ఇతరులకు అర్థం చేయించలేరా? అని తండ్రి అంటారు. ఎప్పుడైతే స్వయం పారసబుద్ధి గలవారిగా అవుతారో అప్పుడే ఇతరులను కూడా తయారు చేయగలరు. పురుషార్థం బాగా చేయాలి. ఇందులో సిగ్గు పడాల్సిన పని లేదు. కాని మనుష్యుల బుద్ధిలో ఉల్టా మతాలు నిండి ఉన్నందున వాటిని అంత త్వరగా మర్చిపోలేరు. ఎంతవరకు తండ్రిని యథార్థ రీతిలో గుర్తించరో అంతవరకు శక్తి రాదు. ఈ వేదశాస్త్ర్రాలు మొదలైన వాటి ద్వారా మనుష్యులు కొద్దిగా కూడా పరివర్తన అవ్వరు. రోజురోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతూనే వచ్చారని తండ్రి చెప్తున్నారు. సతోప్రధాన దేవీ దేవతలుగా ఉండే మేము ఎలా క్రిందకు పడ్డామో అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎవ్వరికీ ఏమీ తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని చెప్పారు కనుక తెలిపేందుకు కూడా అవకాశము లేదు. తండ్రి తప్ప జ్ఞాన ప్రకాశాన్నిచ్చేవారెవరూ లేరు. అందరూ ఒకరి వెనుక ఒకరు గడప-గడప వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉన్నారు. క్రిందపడుతూ పడుతూ పూర్తిగా పడిపోయారు. శక్తి అంతా సమాప్తమైపోయింది. తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. తండ్రే వచ్చి అందరి బుద్ధి రూపీ తాళాన్ని తెరుస్తారు. కనుక ఎంత రిఫ్రెష్ అవుతారు. తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇంటిలో విశ్రాంతి లభిస్తుంది కదా. తండ్రితో మిలనము చేయడం వలన భక్తిమార్గములోని అలసట అంతా దూరమవుతుంది. సత్యయుగాన్ని కూడా విశ్రాంతిపురమని అంటారు. అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది! శ్రమ చేసేందుకు అక్కడ ఏ అప్రాప్తి ఉండదు. ఇక్కడ తండ్రి మరియు దాదా ఇరువురూ రిఫ్రెష్ చేస్తారు. శివబాబా ఒడిలోకి రావడం వలన ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి అంటేనే శాంతి. మనుష్యులు కూడా అలసిపోయి విశ్రాంతిని తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి విశ్రాంతి కొరకు వెళ్తారు కదా. కాని ఆ విశ్రాంతిలో రిఫ్రెష్‌మెంట్ లేదు. ఇక్కడైతే తండ్రి మీకు జ్ఞానము వినిపించి రిఫ్రెష్ చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా కూడా ఎంతో రిఫ్రెష్ అవుతారు. అంతేకాక తమోప్రధానము నుండి సతోప్రధానంగా కూడా అవుతారు. సతోప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి చెప్తారు - మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేయండి. పూర్తి సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో, సర్వాత్మలకు విశ్రాంతి ఎక్కడ, ఎలా లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు. అందరికి తండ్రి సందేశము ఇవ్వడం పిల్లలైన మీ కర్తవ్యము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీరు ఈ ఆస్తికి యజమానులుగా అవుతారు. తండ్రి ఈ సంగమ యుగములో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడకు మీరు వెళ్లి అధికారులుగా అవుతారు. మళ్లీ ద్వాపర యుగములో మాయా రావణుని ద్వారా మీకు శాపము లభిస్తుంది. కనుక పవిత్రత, సుఖము, శాంతి, ధనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. నెమ్మది నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయో అది కూడా తండ్రి అర్థం చేయించారు. దు:ఖధామములో విశ్రాంతి ఉండదు. సుఖధామములో పూర్తి విశ్రాంతి ఉంటుంది. మనుష్యులకు భక్తి ఎంతో అలసట కలిగిస్తుంది. జన్మ-జన్మాంతరాలుగా భక్తి ద్వారా ఎంత అలసిపోతారు! ఒక్కసారిగా ఎలా భికారులుగా అయిపోయారో ఈ పూర్తి రహస్యాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. క్రొత్తవారు వచ్చినప్పుడు వారికి ఎంతగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రతి విషయము గురించి మనుష్యులు ఎంతగా ఆలోచిస్తారు! ఇక్కడ ఏదైనా ఇంద్రజాలము చేస్తారేమో అని అనుకుంటారు. అరే! భగవంతుడు ఇంద్రజాలికుడని మీరే చెప్తారు, కనుక తండ్రి చెప్తున్నారు - అవును నేను నిజంగా ఇంద్రజాలికుడనే. అయితే ఇది మనుష్యులను మేకలుగా, గొఱ్ఱెలుగా చేసే ఇంద్రజాలము కాదు. అయితే బుద్ధి ద్వారా మనుష్యులు గొఱ్ఱెల వలె ఉన్నారని అర్థము చేయించబడ్తుంది. సురమండల సంగీతమును(దివ్యత్వమును)................ అని గాయనము కూడా ఉంది. ఈ సమయంలో మనుష్యులందరూ అరిచే మేకల వంటివారు. ఈ మాటలన్నీ ఇక్కడివే. ఈ సమయములోని గాయనాలే. కల్పము అంత్యాన్ని కూడా మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఛండికకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. వారు ఎవరు అని అడిగితే ఆమె ఒక దేవి అని చెప్తారు. అలాంటి పేర్లు అక్కడ ఉండవు. సత్యయుగములో ఎంతో మంచి అందమైన పేర్లు ఉంటాయి. సత్యయుగ సంప్రదాయాన్ని శ్రేష్ఠాచార సంప్రదాయము అని అంటారు. కలియుగ సంప్రదాయానికి ఎన్నో ఛీ - ఛీ బిరుదులు ఇచ్చారు. ఇప్పటి మనుష్యులను శ్రేష్ఠమైనవారని అనరు. దేవతలను శ్రేష్ఠమైనవారని అంటారు. మనుష్యులను దేవతలుగా చేసేవారి మహిమను వర్ణించలేమని మహిమ కూడా ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా ఎలా అవుతారో అను రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మనుష్య ప్రపంచమని అంటారు. పగలును ప్రకాశమని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానము ప్రకాశము, భక్తి అంధకారము. అజ్ఞాన నిద్ర అని అంటారు కదా. మొదట మనకేమీ తెలియదని అందుకే నేతి నేతి అనగా మాకేమీ తెలియదని చెప్పేవారని మీరు కూడా అర్థము చేసుకున్నారు. మనము కూడా మొదట నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి గురించి కూడా తెలియదు. వారు నిజమైన అవినాశి తండ్రి వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. ఇప్పుడు మనము ఆ బేహద్ తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము మనుష్యుల వద్ద ఎక్కడా లభించదు. ఆత్మ కూడా గుప్తము, గుప్త జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మనే నోటి ద్వారా వినిపిస్తుంది. ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది.
తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, దేహాభిమానులుగా అవ్వకండి. దేహాభిమానము ద్వారా ఆత్మిక శక్తి సమాప్తమైపోతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది. డ్రామా రహస్యాన్ని బాగా తెలుసుకొని నడవాలని తండ్రి చెప్తున్నారు. ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో, వారు సదా హర్షితంగా ఉంటారు. ఈ సమయంలో మనుష్యులు పైకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నిస్తున్నారు! పైన ప్రపంచము ఉందని అనుకుంటారు. పైన ప్రపంచము ఉందని శాస్త్ర్రాలలో విన్న కారణంగా అక్కడికి వెళ్లి చూడాలనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రపంచాన్ని చాలానే తయారు చేసుకున్నారు కదా. భారతదేశంలో ఒకే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. మరే ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. తర్వాత ఎంత విస్తారము చేసుకున్నారు. భారతదేశములో ఎంత కొద్ది స్థానములో దేవతలు ఉండేవారో మీరే ఆలోచించండి. యమునా నది తీరములోనే ఫరిస్తాన్(స్వర్గము) ఉండేది. అక్కడ ఈ లక్ష్మినారాయణులు రాజ్యము చేసేవారు. ఎంతో సుందరమైన, శోభాయమానమైన సతోప్రధాన ప్రపంచముండేది. సహజ సౌందర్యముండేది. చమత్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. శ్రీ కృష్ణుని జన్మ ఎలా జరుగుతుందో పిల్లలకు చూపించడం జరిగింది. పూర్తి గదంతా ప్రకాశవంతమౌతుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. అంతేగాని సరోవరంలో మునగడం వలన దేవతలుగా అవ్వరు. అన్ని అసత్యపు పేర్లు పెట్టేశారు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారము మరపులేనివారిగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మ శరీరము ద్వారా ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి. మళ్లీ శరీరము నుండి ఆత్మ వెళ్లిపోయినప్పుడు శరీరము గతి ఎలా అయిపోతుందో చూడండి. పాత్ర చేసేది ఆత్మనే. ఇది ఎంతగా ఆలోచించే విషయము! పూర్తి ప్రపంచములోని పాత్రధారులు తమ-తమ పాత్రానుసారమే అభినయము చేస్తారు. ఏ వ్యత్యాసమూ ఉండదు. పూర్తి పాత్ర అంతా అదే విధంగా మళ్లీ పునరావృతమవుతూ ఉంటుంది. ఇందులో సంశయము ఉంచుకోరాదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో వ్యత్యాసముంటుంది. ఎందుకంటే ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంటుంది కదా. స్కాలర్‌షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలిసినందున మనస్సులో ఖుషీ ఉంటుంది. ఇక్కడ కూడా లోనికి వస్తేనే లక్ష్యమును ఎదురుగా చూసిన వెంటనే తప్పకుండా ఖుషీ కలుగుతుంది. మనము ఈ దేవీ దేవతలుగా అయ్యేందుకే ఇక్కడ చదువుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మరు జన్మలోని లక్ష్యమును చూడగలిగే ఇతర పాఠశాలలేవీ లేవు. మేము లక్ష్మీనారాయణుల వలె అవుతున్నామని అవుతున్నామని మీరు గమనిస్తారు. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నాము. భవిష్యత్తులో వీరి వలె లక్ష్మీనారాయణులుగా అయ్యే చదువు చదువుతున్నాము. ఇది ఎంత గుప్తమైన చదువు! లక్ష్యమును చూసి ఎంత సంతోషము కలగాలి. ఖుషీకి హద్దులే ఉండవు. స్కూలు లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఎంత గుప్తమైనది కానీ చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో అంత మంచి సౌకర్యాలు ఉంటాయి. కాని ఇక్కడ మీరు క్రింద కూర్చుని చదువుతారు. క్రింద కూర్చుని గాని, సింహాసనము పైన కూర్చుని గాని ఆత్మ చదవనే చదవాలి. ఈ చదువులో పాసైన తర్వాత మేము ఇలా అవుతామని సంతోషంగా చంకలు ఎగిరేస్తూ ఉండండి. ఇతనిలో ప్రవేశించి మిమ్ములను ఎలా చదివిస్తారో తండ్రి ఇప్పుడు మీకు తన పరిచయాన్నిచ్చారు. తండ్రి దేవతలను చదివించరు. దేవతలకు ఈ జ్ఞానము ఎక్కడ ఉంది. దేవతలలో జ్ఞానము లేదా అని మనుష్యులు తికమక పడ్తారు. దేవతలు ఈ జ్ఞానము ద్వారానే దేవతలుగా అవుతారు. దేవతలు అయిన తర్వాత మళ్లీ ఈ జ్ఞానముతో అవసరమేముంది! లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ సంపాదన చేస్తూ ఉంటే మళ్లీ బ్యారిస్టర్ చదువు చదువుతారా? మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థము చేసుకొని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తున్నారు.
2. ముఖ్య లక్ష్యమును ఎదురుగా ఉంచుకొని సంతోషంగా భుజాలను ఎగిరేయాలి. మేము ఈ చదువు ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని బుద్ధిలో ఉండాలి.
వరదానము :- '' బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు సుఖమయ స్థితిని అనుభవం చేసే సంపూర్ణ పవిత్ర ఆత్మా భవ ''
పవిత్రతనే సుఖ-శాంతుల జనని అని అంటారు. ఏ విధమైన అపవిత్రత అయినా దు:ఖము, అశాంతిని అనుభవం చేయిస్తుంది. బ్రాహ్మణులు అనగా ప్రతి సెకండు సుఖమయ స్థితిలో ఉండేవారు. దు:ఖము కలిగించే దృశ్యాలైనా, ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉందో, అక్కడ దు:ఖము అనుభవమవ్వజాలదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలుగా అయి దు:ఖాన్ని ఆత్మిక సుఖమనిచ్చే వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు.
స్లోగన్ :- '' సాధనాలను ఉపయోగిస్తూ సాధనను పెంచడమే బేహద్ వైరాగ్యవృత్తి ''
No comments:
Post a Comment