27-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు, మీరు ఇచ్చట ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి ''
ప్రశ్న :- తండ్రి ఏ జ్ఞానము తెలిపినందున మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది ?
జవాబు :- తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించిన జ్ఞానమిచ్చారు. దీని వలన బుద్ధికి వేయబడిన గాడ్రెజ్ తాళము తెరవబడింది. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి గలవారిగా అయ్యారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేర్వేరు పాత్ర, అనాది పాత్ర, కల్పక్రితము ఎవరు ఎంత చదివారో, వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు. పురుషార్థము చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు.
ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు. తండ్రి అయినప్పటి నుండి, అప్పటి నుండే టీచరు కూడా అయ్యారు. అప్పటి నుండే సద్గురువు రూపములో శిక్షణ కూడా ఇస్తున్నారు. వారు తండ్రి, టీచరు, సద్గురువు అయినందున వారు చిన్న బాలుడు కాదు కదా అని పిల్లలు అర్థము చేసుకున్నారు. వారు అత్యున్నతమైనవారు, అత్యంత గొప్పవారు. వీరంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు. మీరు వచ్చి మమ్ములను పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్ళమని డ్రామా ప్లాను అనుసారము పిలిచారు కూడా. కానీ అర్థము తెలియదు. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారని మీకిప్పుడు తెలుసు. బాబా మీరు వచ్చి మమ్ములను రావణుని జైలు నుండి, దుఃఖాల నుండి విడిపించి మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళమని కూడా అంటారు. రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయి. ముక్తి-జీవన్ముక్తి లేక శాంతిధామము - సుఖధామము. శాంతిధామము ఎక్కడ ఉందో, సుఖధామము ఎక్కడ ఉందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. తెలివిగలవారిగా అవ్వడమే మీ లక్ష్యము. తెలివిహీనులైన వారికి, ఇటువంటి తెలివిగలవారిగా అవ్వాలని లక్ష్యముంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యమని అందరికీ నేర్పించాలి. ఇది మానవ సృష్టి, ఆది దేవతల సృష్టి. సత్యయుగములో దేవతల సృష్టి ఉంటుంది. కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగములో ఉంటుంది. ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంగమ యుగమే సరియైన సమయము. వారు దేవతలు, వీరు మానవులు. దేవతలు తెలివిగలవారు. ఆ తండ్రే ఇటువంటి వివేకవంతులుగా చేశారు. విశ్వానికి యజమానులైన తండ్రి, యజమానులుగా అవ్వరు కాని వారిని అలాగే మహిమ చేస్తారు కదా. బేహద్ తండ్రి బేహద్ సుఖమునిచ్చేవారు. అనంతమైన సుఖము నూతన ప్రపంచములోనే ఉంటుంది. అనంతమైన దుఃఖము పాత ప్రపంచములో ఉంటుంది. దేవతల చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి. వారి మహిమ కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే పంచ భూతాలను కూడా పూజిస్తూ ఉన్నారు.
మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక కాలు స్వర్గములో, ఒక కాలు నరకములో ఉందని మీలో కూడా పురుషార్థానుసారము తెలుసు. ఉండేది ఇక్కడైనా బుద్ధి నూతన ప్రపంచములో ఉంటుంది. ఆ నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేవారిని స్మృతి చేయాలి. ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రుంగా అవుతారు. ఇదంతా శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శివజయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. శివరాత్రి జరుపుకుంటారు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు, ఏ పదమును కృష్ణునికి వాడ్తారో ఆ పదమును శివబాబాకు వాడరు. అందుకే శివరాత్రి అని అంటారు. అర్థము తెలియకుండా అంటున్నారు. పిల్లలైన మీకేమో అర్థము చేయించబడ్తుంది. కలియుగాంతములో అపారమైన దుఃఖము, సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానము లభించింది. మీరు ఆదిమధ్యాంతాలు తెలుసుకున్నారు. కల్పక్రితము చదువుకున్నవారే, ఇప్పుడు కూడా చదువుకుంటారు. అప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేశారో, ఇప్పుడు కూడా వారే చేసి, మళ్లీ అదే పదవిని పొందుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. అత్యున్నతమైన పదవి పొందేది మీరే, మళ్లీ అలాగే క్రిందికి కూడా దిగుతారు. మనుష్యులు ఎవరైతే ఉన్నారో ఇది వారందరి మాల కదా. అందరూ నంబరువారుగా వస్తారని తండ్రి అర్థం చేయించారు. ప్రతి పాత్రధారికి తన పాత్ర లభించింది. ఎవరెప్పుడు ఏ పాత్ర చేయాలో ఆ పాత్రను వారు అభినయించే తీరాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా. దీనిని గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకేది అర్థం చేయిస్తున్నారో దానిని మీరు మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5 వేల సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని మీ బుద్ధిలో ఉంది. మనము మళ్లీ మన సోదరులకు అర్థం చేయిస్తాము. సోదరత్వము ఆత్మల సంబంధములో ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. పావనంగా అయ్యేందుకు తన తండ్రిని స్మృతి చేయాల్సింది ఆత్మనే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ అపవిత్రమైతే నగ(శరీరము) కూడా అపవిత్రమే. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. ఒకరి లక్షణాలు, గుణాలు(రూపురేఖలు) ఒకరితో ఒకరివి కలువవు. అందరూ నంబరువారిగా తమ తమ పాత్రలను అభినయిస్తారు, తేడా ఉండదు. నాటకములో (సినిమాలో) నిన్న చూచిన దృశ్యాలే మళ్లీ ఈ రోజు కూడా చూస్తారు. అవే రిపీట్ అవుతాయి కదా. ఇది కూడా నిన్న, రేపుల అనంతమైన డ్రామా. నిన్న మీకు అర్థం చేయించారు. మీరు రాజ్యపదవి తీసుకొని మళ్లీ పోగొట్టుకున్నారు. ఈ రోజు రాజ్య పదవి పొందేందుకు మళ్లీ అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు భారతదేశము పాతదైపోయిన నరకము. రేపు నూతన స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి వెళ్తున్నామని శ్రీమతముననుసరించి శ్రేష్ఠంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్ఠమైనవారు తప్పకుండా శ్రేష్ఠమైన సృష్టిలోనే ఉంటారు. ఈ లక్ష్మీ నారాయణులు శ్రేష్ఠమైనవారు. కనుక వారు శ్రేష్ఠమైన స్వర్గములో ఉంటారు. భ్రష్టులైనవారు నరకములో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ బేహద్ డ్రామాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దానిని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మిమ్ములను రిఫ్రెష్(తాజాగా) చేయాల్సి ఉంటుంది. మీరు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తూ ఉంది. తర్వాత సద్గతి పొందుతారు. నేను స్వర్గములోకి రాను. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి, పావన ప్రపంచంగా తయారు చేయడమే నా పాత్ర. అక్కడ మీ వద్ద అనంతమైన ఖజానా ఉంటుంది. ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు బేహద్ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వమని తండ్రిని పిలుస్తారు. కల్ప-కల్పము బేహద్ వారసత్వము లభిస్తుంది. మళ్లీ నిరుపేదలుగా కూడా అవుతారు. చిత్రాలను చూపి అర్థం చేయిస్తే బాగా అర్థము చేసుకుంటారు. మొదటి నెంబరులోని లక్ష్మీనారాయణులు మళ్లీ 84 జన్మలు తీసుకొని మనుష్యులైపోయారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది. 5 వేల సంవత్సరాల క్రితము ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. దానిని వైకుంఠము, స్వర్గము(పారడైస్) దేవీ దేవతల ప్రపంచమని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడిది ఆసురీ ప్రపంచము. ఇప్పుడు ఆసురీ ప్రపంచ అంత్యము, దేవతా ప్రపంచము ఆదిల సంగమ సమయము. ఈ విషయాలను మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. ఇతరుల నోట ఈ మాటలు వినలేరు. ఆ తండ్రే వచ్చి ఇతని నోరు తీసుకుంటారు. ఎవరి నోరు తీసుకుంటారో అర్థం చేసుకోరు. తండ్రి దేని పై సవారీ అవుతారు? ఉదాహరణానికి ఆత్మలైన మీరు మీ శరీరాల పై సవారి అయ్యి ఉన్నారు కదా. శివబాబాకు తన స్వంత శరీరమైతే లేనే లేదు. అందువలన వారికి నోరు తప్పకుండా అవసరము. లేకుంటే రాజయోగమెలా నేర్పించాలి? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు. కనుక ఈ విషయాలన్నీ హృదయములో గుర్తుంచుకోండి. పరమాత్మ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉంది కదా. మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానము కూర్చోవాలి. ఈ జ్ఞానము బుద్ధి ద్వారా ధారణ చేయాలి. మీ బుద్ధి బాగుంది కదా అని అంటారు కూడా? బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మనే బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటూ ఉంది. మిమ్ములను రాతి బుద్ధి గలవారిగా చేసిందెవరు? రావణుడు మన బుద్ధినెలా చేశాడో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. నిన్న మీకు డ్రామాను గురించి తెలియదు. బుద్ధికి గాడ్రెజ్ తాళము వేయబడి ఉండేది. ఇందులో గాడ్ అనే పదము వస్తుంది కదా. తండ్రి ఇచ్చిన బుద్ధి పరివర్తనై రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి తాళము తెరుస్తారు. సత్యయుగములో ఉండేదే పారసబుద్ధి గలవారు. తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. అందరి బుద్ధి నంబరువారిగా తెరవబడ్తుంది. మళ్లీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. పైన అలాగే ఎవ్వరూ ఉండజాలరు. అక్కడ పతితులుండజాలరు. తండ్రి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు. అక్కడ అంతా పావనాత్మలే ఉంటాయి. అది నిరాకార సృష్టి.
పిల్లలైన మీకిప్పుడు అంతా తెలిసిపోయింది. మీ ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది. మీకు మీ ఇంటి పై చాలా ప్రేమ ఉంది. మీకున్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు. మీలో కూడా నెంబరువారిగా ఉన్నారు. ఎవరికైతే తండ్రి పై ప్రేమ ఉందో వారికి ఇంటి పై కూడా ప్రేమ ఉంటుంది. మురిపాల పిల్లలుంటారు కదా. ఇక్కడ మంచి పురుషార్థము చేసి ఎవరు అపురూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారని మీకు తెలుసు. చిన్న లేక పెద్ద శరీరాల పై పదవి ఆధారపడదు. జ్ఞాన-యోగాలలో ఎవరైతే మస్త్‌గా(ఆనందములో మునిగి) ఉంటారో, వారే పెద్దవారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞాన-యోగాలలో తీవ్రంగా ఉంటారు. వారు పెద్దవారిని కూడా చదివిస్తారు లేకుంటే నియమమేమంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లో అయితే చాలా పొట్టిగా నుండి సర్కస్‌లో ప్రేక్షకులకు ఆహ్లాదము చేకూర్చేవారుగా (మిడ్‌గేడ్, మరుగుజ్జులు) ఉన్నారు. వాస్తవానికి ఆత్మలన్నీ మిడ్‌గేడ్‌లే. ఆత్మ బిందువు దానినేం తూకం వేస్తారు? అది ఒక నక్షత్రము. మానవులు నక్షత్రం అనే పదము వింటూనే పైకి చూస్తారు. మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూచుకుంటారు. మీరు భూమి పైనున్న నక్షత్రాలు. అవి ఆకాశమందున్న జడ నక్షత్రాలు. మీరు చైతన్య నక్షత్రాలు. వారి భ్రమణములో మార్పు ఉండదు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. చాలా పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్ర చేస్తూ చేస్తూ ప్రకాశము తగ్గిపోతుంది. బ్యాటరి డిస్‌ఛార్జ్ అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయింది. నింపబడిన శక్తి సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి ద్వారా శక్తి నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఛార్జ్ అవ్వకుండా మాయ అనేక విఘ్నాలు కలుగజేస్తుంది. మీరు చైతన్యమైన బ్యాటరీలు తండ్రితో యోగము చేసినందున మనము సతోప్రధానంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఆ హద్దులోని చదువుకు, ఈ బేహద్ చదువుకు చాలా తేడా ఉంది. నంబరువారుగా ఆత్మలన్నీ ఎలా పైకి పోతాయో, మళ్లీ సమయానుసారము పాత్రను అభినయించేందుకు అలాగే రావాలి. అందరికీ తమ-తమ అవినాశి పాత్రలు లభించే ఉన్నాయి. ఈ 84 జన్మల పాత్ర మీరు అనేకసార్లు అభినయించి ఉంటారు. మీ బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్, ఎన్నిసార్లు డిస్‌ఛార్జ్ అయ్యింది! మీ బ్యాటరి డిస్‌ఛార్జ్ అయ్యిందని తెలుసుకున్న తర్వాత మళ్లీ ఛార్జ్ చేసుకునేందుకు ఆలస్యమెందుకు చేయాలి? కాని మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోనివ్వదు. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలను విషయాన్ని మాయ మరపింపజేస్తుంది. మాటిమాటికి బ్యాటరి డిస్‌ఛార్జ్ చేయిస్తుంది. తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు కాని స్మృతి చేయలేరు. ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతోప్రధానము వరకు దగ్గరగా వస్తున్నారో వారిని కూడా మాయ అప్పుడప్డుడు మరపింపజేసి బ్యాటరీని డిస్‌ఛార్జ్ చేయిస్తుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. యుద్ధము సమాప్తమైనప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి. ఎవరెవరి బ్యాటరి ఎంతెంత ఛార్జ్ అయిందో దాని అనుసారము పదవి పొందుతారు. ఆత్మలందరు తండ్రి పిల్లలే. ఆ తండ్రియే వచ్చి అందరి బ్యాటరీలు ఛార్జ్ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారయింది! తండ్రితో యోగము జోడించకుండా మాటి మాటికి దూరంగా వెళ్తారు. కనుక ఎంత నష్టము జరుగుతుంది! తెగిపోకుండా ఉండేందుకు పురుషార్థము చేయించబడ్తుంది. పురుషార్థము చేస్తూ చేస్తూ సమాప్తమైనప్పుడు మళ్లీ నంబరువారు పురుషార్థానుసారము కల్ప-కల్పము జరిగినట్లే మీ పాత్ర పూర్తి అవుతుంది. ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది.
రుద్రాక్ష మాల, విష్ణు మాల కూడా ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. మొదటి నంబరులో అయితే వారి మాల పెడ్తారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు కదా. రుద్రమాల ఉన్నట్లే. రుండమాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఎప్పుడూ తయారవ్వజాలదు. మార్పు చెందుతూనే ఉంటుంది. రుద్రమాల తయారైనప్పుడు ఫైనల్ అవుతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది. కాని ఇప్పుడు తయారవ్వజాలదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానం మాల కూడా ఉంది. విష్ణుమాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులుగా అయితే, బ్రహ్మకు, శివునికి కూడా మాలగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నంబరువారుగా ఉంది. వినేదేమో అందరూ వింటారు. కాని కొంతమందికి ఆ సమయములోనే చెవుల నుండి బయటకు పోతుంది. విననే వినరు. కొంతమంది అయితే చదవనే చదవరు. భగవంతుడు చదివించేందుకు వచ్చారని వారికి తెలియనే తెలియదు. కనుక చదవనే చదవరు. ఈ చదువును ఎంతో ఖుషీగా చదువుకోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్మృతి యాత్ర ద్వారా ఆత్మ రూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతోప్రధానం వరకు చేరుకోవాలి. బ్యాటరీ డిస్‌ఛార్జ్ అయ్యే విధంగా ఏ పొరపాటు(నిర్లక్ష్యము) చేయరాదు.
2. ప్రియమైన ముద్దు బిడ్డలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటి పై కూడా ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞాన-యోగాలలో మస్త్(ఆనందం)గా అవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి.
వరదానము :- '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్ భవ) '' '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్ భవ) '' '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్ భవ) ''
ఎలాగైతే బ్రహ్మబాబా సేవలో ఉంటూ, సమాచారము వింటూ, ఏకాంతవాసులుగా అయ్యేవారో, ఒక గంట సమాచారాన్ని 5 నిముషాలలో సారాన్ని విని పిల్లలను సంతోషపరచి తమ అంతర్ముఖ ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారో, అలా తండ్రిని అనుసరించండి. బ్రహ్మబాబా 'నేను చాలా బిజీగా ఉన్నాను' అని ఎప్పుడూ అనలేదు. కాని తండ్రి ముందు ఉదాహరణగా అయ్యాడు. సమయ ప్రమాణంగా ఇప్పుడీ అభ్యాసము అవసరము. హృదయపూర్వక లగ్నముంటే సమయం దానంతకు అదే వస్తుంది, అంతేకాక అనేకమందికి ఉదాహరణంగా అవుతారు.
స్లోగన్ :- '' ప్రతి కర్మలో - కర్మ మరియు యోగం అనుభవమవ్వడమే కర్మ యోగము ''
No comments:
Post a Comment