08-12-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్: 18-03-1985 మధువనము
'' సంతుష్టత ''
ఈ రోజు హృదయాభిరాముడైన తండ్రి తన స్నేహీ హృదయ సింహాసనాధికారి పిల్లలతో హృదయపూర్వక ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. హృదయాభిరాముడు తన సత్యమైన హృదయం గలవారితో మనసును ఇచ్చి పుచ్చుకునేందుకు, వారి మనసులోని సమాచారము వినేందుకు వచ్చారు. ఆత్మిక తండ్రి ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఈ ఆత్మల ఆత్మిక సంభాషణ కేవలం ఈ సమయంలోనే అనుభవం చేయగలరు. ఆత్మలైన మీలో ఎంత స్నేహశక్తి ఉందంటే అది ఆత్మల రచయిత అయిన తండ్రిని ఆత్మిక సంభాషణ కొరకు నిర్వాణం నుండి వాణిలోకి తీసుకొస్తారు. మీరు బంధనముక్తుడైన తండ్రిని కూడా స్నేహ బంధనంలో బంధించే శ్రేష్ఠ ఆత్మలు. ప్రపంచం వారు బంధనాల నుండి విడిపించేవారంటూ పిలుస్తున్నారు. అటువంటి బంధనముక్తుడైన తండ్రి పిల్లల స్నేహ బంధనంలో సదా బంధింపబడి ఉన్నారు. మీరు బంధించడంలో తెలివిగలవారు. ఎపుడు స్మృతి చేసినా తండ్రి హాజరవుతారు కదా! ప్రభువు హాజరుగా ఉంటారు. కావున ఈ రోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. ఇప్పుడు సీజన్‌లో ఈ విశేష టర్న్ కూడా డబల్ విదేశీయులది. మెజారిటీ డబల్ విదేశీయులే వచ్చారు. మధువన నివాసులంటేనే శ్రేష్ఠ స్థానమైన మధువనంలో నివసించేవారు. ఒకే స్థానంలో కూర్చొని విశ్వంలోని వెరైటీ ఆత్మల మిలన మేళాను చూసేవారు. వచ్చిన వారు వెళ్తారు కాని మధువన నివాసులైతే సదా ఉంటారు!
ఈ రోజు విశేషించి డబల్ విదేశీ పిల్లలను అడుగుతున్నారు - అందరూ సంతుష్ట మణులుగా అయ్యి బాప్‌దాదా కిరీటంలో మెరుస్తున్నారా? అందరూ సంతుష్ట మణులుగా ఉన్నారా? అప్పుడప్పుడు స్వయంతో అసంతుష్టంగా లేక అప్పుడప్పుడు బ్రాహ్మణ ఆత్మలతో అసంతుష్టంగా లేక అప్పుడప్పుడు స్వంత సంస్కారాలతో అసంతుష్టంగా లేక అప్పుడప్పుడు వాతావరణ ప్రభావంతో అసంతుష్టంగా అవ్వడం లేదు కదా! సదా అన్ని విషయాలతో సంతుష్టంగా ఉన్నారా? అప్పుడప్పుడు సంతుష్టంగా, అప్పుడప్పుడు అసంతుష్టంగా ఉంటే సంతుష్టమణి అని అంటారా? మేము సంతుష్ట మణులమని మీరందరూ చెప్పారు కదా. కాని ఇతరులు అసంతుష్టంగా చేస్తారని చెప్పరు కదా! ఏం జరిగినా సంతుష్ట ఆత్మలుగా ఉన్నవారు ఎప్పుడూ తమ విశేషత అయిన సంతుష్టతను వదిలిపెట్టలేరు. సంతుష్టత బ్రాహ్మణ జీవితంలోని విశేష గుణం లేక ఖజానా లేక విశేష జీవితానికి అలంకారము. ఏదైనా ప్రియమైన వస్తువుగా ఉంటే ఆ ప్రియమైన వస్తువును ఎప్పుడూ వదిలిపెట్టరు. సంతుష్టత ఒక విశేషత. సంతుష్టత బ్రాహ్మణ జీవితంలో విశేష పరివర్తనకు దర్పణము. సాధారణ జీవితము మరియు బ్రాహ్మణ జీవితము. సాధారణ జీవితమనగా అప్పుడప్పుడు సంతుష్టత, అప్పుడప్పుడు అసంతుష్టత. బ్రాహ్మణ జీవితంలో విశేష గుణమైన సంతుష్టతను చూసి అజ్ఞానులు కూడా ప్రభావితమవుతారు. ఈ పరివర్తన అనేక మంది ఆత్మలను పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. అందరి నోటి నుండి వీరు సదా సంతుష్టంగా అనగా సంతోషంగా ఉంటారనే మాటే వెలువడ్తుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో, అక్కడ సంతోషం తప్పకుండా ఉంటుంది. అసంతుష్టత సంతోషాన్ని అదృశ్యం చేస్తుంది. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. సదా సంతుష్టంగా లేకుంటే అది సాధారణ జీవితం. సంతుష్టత సఫలతకు సహజమైన ఆధారము. సంతుష్టత సర్వ బ్రాహ్మణ పరివారాన్ని స్నేహీలుగా చెయ్యడంలో శ్రేష్ఠ సాధనము. సంతుష్టంగా ఉన్నవారి పట్ల స్వతహాగానే అందరికి స్నేహం ఉంటుంది. సంతుష్ట ఆత్మను ఎల్లప్పుడూ అందరూ స్వయం సమీపానికి తీసుకు రావాలని లేక ప్రతి శ్రేష్ఠ కార్యములో సహయోగిగా చేసుకోవాలని ప్రయత్నిస్తారు. నన్ను సమీపానికి తీసుకెళ్ళండి, నన్ను సహయోగిగా చేసుకోండి లేక నన్ను విశేష ఆత్మల లిస్టులోకి తీసుకురండి అని వారు శ్రమ చెయ్యవలసిన అవసరముండదు. ఆలోచించే అవసరం కూడా ఉండదు. చెప్పాల్సిన పని కూడా ఉండదు. విశేష గుణమైన సంతుష్టత ప్రతి కార్యంలో బంగారు ఛాన్స్‌లర్‌గా చేస్తుంది. స్వతహాగానే కార్యార్థము నిమిత్తంగా అయిన ఆత్మలకు సంతుష్ట ఆత్మ పట్ల సంకల్పము తప్పకుండా వస్తుంది, అవకాశము లభిస్తూనే ఉంటుంది. సంతుష్టత సదా సర్వుల స్వభావ సంస్కారాలను కలిపేదిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలతో భయపడేదిగా ఉండదు. ఇలాంటి సంతుష్ట ఆత్మలుగా అయ్యారు కదా! భగవంతుడు మీ వద్దకు వచ్చాడు, మీరు వెళ్లలేదు. స్వయం భాగ్యమే మీ వద్దకు వచ్చింది. ఇంట్లో కూర్చొని ఉండగానే భగవంతుడు లభించాడు, భాగ్యం లభించింది. ఇంట్లో కూర్చుని ఉండగానే సర్వ ఖజానాల తాళంచెవి లభించింది. ఎప్పుడు కావాలనుకుంటే, ఏ ఖజానా కావాలనుకుంటే అది మీదిగా అవుతుంది. ఎందుకంటే అధికారిగా అయ్యారు కదా! ఈ విధంగా సర్వుల సమీపానికి వచ్చే అవకాశము, సేవలో సమీపానికి వచ్చే అవకాశము కూడా స్వతహాగానే లభిస్తుంది. విశేషత స్వతహాగానే ముందుకు తీసుకెళ్తుంది. సదా సంతుష్టంగా ఉన్నవారితో అందరికి హృదయపూర్వక ప్రేమ స్వతహాగానే ఉంటుంది. బాహ్య ప్రేమ కాదు. ఒకటి ఎవరినైనా ప్రసన్నంగా(రాజీగా) చేసేందుకు బాహ్యానికి ప్రేమించడం. ఒకటి హృదయపూర్వక ప్రేమ. కోపంలోకి రాకుండా ఉండేందుకు కూడా ప్రేమించవలసి ఉంటుంది. కాని వారు ప్రేమను సదా తీసుకునేందుకు పాత్రులుగా అవ్వరు. సంతుష్ట ఆత్మకు ఎల్లప్పుడూ అందరి హృదయపూర్వక ప్రేమ లభిస్తుంది. కొత్తవారు కావచ్చు లేక పాతవారు కావచ్చు, ఎవరైనా పరిచయముండవచ్చు లేకపోవచ్చు కాని సంతుష్టత ఆ ఆత్మకు పరిచయాన్ని ఇప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి వీరితో మాట్లాడాలి, వీరితో కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఇలా సంతుష్టంగా ఉన్నారా? పక్కాగా ఉన్నారు కదా! అలా తయారవుతున్నామని అనరు కదా! కాదు! తయారయ్యామని అనాలి.
సంతుష్ట ఆత్మలు సదా మాయాజీత్‌లుగానే ఉంటారు. ఇది మాయాజీత్‌లైనవారి సభ కదా! మాయతో భయపడేవారు కాదు కదా! మాయ ఎవరి వద్దకు వస్తుంది? అందరి వద్దకు రానే వస్తుంది. మాయ రానే రాదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అందరి వద్దకు వస్తుంది కాని కొంతమంది భయపడ్తారు, కొంతమంది గుర్తిస్తారు. కనుక రక్షించుకుంటారు. మర్యాద రేఖ లోపల ఉండే తండ్రి ఆజ్ఞాకారి పిల్లలు మాయను దూరం నుండే గుర్తిస్తారు. గుర్తించడంలో ఆలస్యం చేస్తారు లేక పొరపాటు చేస్తారు, అప్పుడు మాయతో భయపడ్తారు. స్మృతిచిహ్నంలో కథ కూడా విన్నారు - సీత ఎందుకు మోసపోయింది? ఎందుకంటే గుర్తించలేదు. మాయ స్వరూపాన్ని గుర్తించనందున మోసపోయింది. ఇతడు బ్రాహ్మణుడు కాడు, భికారి కాదు. రావణుడు అని గుర్తించి ఉంటే శోకవాటికను ఇంతగా అనుభవం అంత చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. కాని ఆలస్యంగా గుర్తించింది కావున మోసపోయింది, అందువలన దు:ఖం అనువించాల్సి వచ్చింది. యోగి నుండి వియోగిగా అయింది. సదా జతలో ఉండటం నుండి దూరమయింది. ప్రాప్తి స్వరూప ఆత్మ నుండి ఆక్రందన చేసే ఆత్మగా అయింది. కారణమేమి? తక్కువగా గుర్తించింది. మాయ స్వరూపాన్ని గుర్తించే శక్తి తక్కువగా ఉన్న కారణంగా మాయను తరిమేందుకు బదులు స్వయం భయపడ్తారు. గుర్తించడం ఎందుకు తగ్గిపోతుంది? సమయానికి గుర్తించడం రాదు. తర్వాత ఎందుకు వస్తుంది? దీనికి కారణం? ఎందుకంటే సదా తండ్రి శ్రేష్ఠ మతమును అనుసరించరు. ఒక సమయంలో స్మృతి చేస్తారు, ఒక సమయంలో స్మృతి చెయ్యరు. ఒక సమయంలో ఉత్సాహ-ఉల్లాసాలతో ఉంటారు, ఒక సమయంలో ఉండరు. ఎవరైతే సదా ఆజ్ఞను ఉల్లంఘిస్తారో అనగా ఆజ్ఞ అనే గీత లోపల ఉండరో, వారిని మాయ సమయానికి మోసం చేస్తుంది. మాయకు పరిశీలనా శక్తి చాలా ఉంటుంది. ఈ సమయంలో బలహీనంగా ఉన్నారని మాయ గమనిస్తుంది. కనుక ఈ విధమైన బలహీనత ద్వారా వీరిని నా వారిగా చేసుకోవచ్చని భావిస్తుంది. మాయ వచ్చే మార్గమే బలహీనత. కొంచెం మార్గం లభించినా వెంటనే చేరుకుంటుంది. ఈ రోజులలో దొంగలు ఏం చేస్తారు? వాకిలి వేసి ఉన్నా వెంటిలేటర్స్ ద్వారా కూడా వచ్చేస్తారు. కొంచెం సంకల్పం మాత్రం కూడా బలహీనంగా అవ్వడం అనగా మాయకు దారి ఇవ్వడం. అందువలన మాయాజీత్‌లుగా అయ్యేందుకు సహజ సాధనం - సదా తండ్రి తోడుగా(జతలో) ఉండండి. జతలో ఉండడం అనగా స్వత:గానే మర్యాదల రేఖ లోపల ఉండడం. ఒక్కొక్క వికారము వెనుక విజయులుగా అయ్యే శ్రమ చెయ్యడం నుండి విడుదల అవుతారు. జతలో ఉన్నట్లయితే స్వత:గానే తండ్రి ఎలా ఉంటారో మీరు కూడా అలా ఉంటారు. సాంగత్య రంగు స్వత:గానే అంటుకుంటుంది. బీజాన్ని వదిలి కేవలం శాఖలను కత్తిరించే శ్రమ చెయ్యకండి. ఈ రోజు కామాన్నీ, రేపు క్రోధాన్ని జయించడం కాదు. సదా విజయులుగానే ఉండాలి. బీజరూపం ద్వారా బీజాన్ని సమాప్తం చేసినట్లయితే మాటిమాటికి శ్రమ చెయ్యడం నుండి స్వతహాగానే విడుదల అవుతారు. కేవలం బీజరూపాన్ని జతలో ఉంచుకోండి. తర్వాత ఈ మాయ బీజము ఎలా భస్మం అవుతుందంటే తర్వాత ఎప్పుడూ ఆ బీజం నుండి అంశం కూడా వెలువడదు. అగ్నిలో కాలిపోయిన బీజం నుండి ఎప్పుడూ ఫలం వెలువడదు కదా.
కనుక జతలో ఉండండి, సంతుష్టంగా ఉంటే మాయ ఏం చేస్తుంది? సరెండర్ అయిపోతుంది. మాయను సమర్పణ చెయ్యడం రాదా? స్వయం సమర్పణ అయితే వారి ముందు మాయ సమర్పణ అయ్యే ఉంది. కావున మాయను సరెండర్ చేశారా? లేక ఇంకా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారా? పరిస్థితి ఎలా ఉంది? ఎలాగైతే సమర్పణ అయ్యే ఉత్సవం జరుపుకుంటారో అలా మాయను సరెండర్ చేసే ఉత్సవం జరుపుకున్నారా లేక జరుపుకోవాలా? హోలీ గా అయ్యారంటే ఉత్సవం జరిగిపోయినట్లే, కాలిపోయింది. తర్వాత అక్కడకు వెళ్లి ఏం చెయ్యాలి? మాయ వచ్చిందని జాబు వ్రాయరు కదా! సంతోషకరమైన సమాచారము తెలిపే పత్రము వ్రాస్తారు కదా! ఎన్ని సమర్పణ ఉత్సవాలు జరిపించారు? ''నాదైతే అయిపోయింది కాని ఇతర ఆత్మల ద్వారా కూడా మాయను సమర్పణ చేయించాను'' - ఇలాంటి సమాచారం వ్రాస్తారు కదా! మంచిది.
మీరు ఎంత ఉమంగ-ఉత్సాహాలతో వచ్చారో అంత బాప్‌దాదా కూడా ఇటువంటి ఉమంగ - ఉత్సాహాలతో పిల్లలను సదా సంతుష్ట ఆత్మల రూపంలో చూడాలనుకుంటున్నారు. లగ్నమైతే ఉండనే ఉంది. ఇంత దూరము నుండి సమీపానికి చేరుకోవడమే లగన్‌కు గుర్తు. రాత్రి పగలు లగ్నముతో రోజులు లెక్కిస్తూ - లెక్కిస్తూ ఇక్కడకు చేరుకున్నారు. లగ్నము లేకుంటే చేరుకోవడం కష్టమవుతుంది. లగ్నము ఉంది కాబట్టే ఇందులో పాసయ్యారు. పాస్ సర్టిఫికెట్ లభించింది కదా! ప్రతి సబ్జెక్టులో పాసయ్యారు. అయినా బాప్‌దాదా పిల్లలకు ఆఫరీన్ ఇస్తున్నారు - ఎందుకంటే గుర్తించే దృష్టి తీవ్రంగా ఉంది. దూరంగా ఉంటున్నా తండ్రిని గుర్తించారు. జతలో అనగా దేశంలో ఉండేవారు గుర్తించలేదు కాని మీరు దూరంగా కూర్చుని ఉన్నా గుర్తించారు. గుర్తించి తండ్రిని తమవారిగా చేసుకున్నారు లేక తండ్రికి చెందినవారిగా అయ్యారు. అందుకు బాప్‌దాదా విశేషంగా మెచ్చుకుంటున్నారు. కనుక గుర్తించడంలో ఎలా ముందుకు వెళ్లారో అలా మాయాజీత్‌లుగా అవ్వడంలో నెంబర్‌వన్‌గా అయ్యి సదా తండ్రి ఇచ్చే ఆఫరీన్‌ను తీసుకునేందుకు తప్పకుండా యోగ్యులుగా అవుతారు. బాప్‌దాదా మాయతో భయపడే ఆత్మను ఎవరినైనా మీ వద్దకు పంపిస్తారు. ఈ పిల్లల వద్దకు వెళ్లి మాయాజీత్‌లుగా అయ్యే అనుభవం గురించి అడగండి అని అనాలి. ఇటువంటి ఉదాహరణగా అయ్యి చూపించండి. ఎలాగైతే మోహజీత్ పరివారము ప్రసిద్ధంగా ఉందో, అలా మాయాజీత్‌లైన సెంటర్లు ప్రసిద్ధమవ్వాలి. ఇది ఎలాంటి సెంటరంటే ఇక్కడ మాయ యుద్ధం ఎప్పుడూ జరగదు. రావడం వేరు, యుద్ధం చేయడం వేరు. కనుక ఇందులో కూడా నెంబర్ తీసుకునేవారిగా ఉన్నారు కదా! ఇందులో నెంబర్‌వన్‌గా ఎవరు అవుతారు? లండన్, ఆస్ట్రేలియా అవుతుందా లేక అమెరికా అవుతుందా? ప్యారిస్ అవుతుందా, జర్మనీ అవుతుందా, బ్రెజిల్ అవుతుందా, ఎవరు అవుతారు? ఎవరైనా అవ్వండి. బాప్‌దాదా ఇలాంటి చైతన్య మ్యూజియాన్ని ప్రకటిస్తారు. ఎలాగైతే ఆబూలోని మ్యూజియం సేవలోనూ, అలంకరణలో కూడా నంబరువన్‌గా ఉందో అలాంటి మాయాజీత్ పిల్లల చైతన్య మ్యూజియంగా ఉండాలి. ధైర్యముంది కదా? అందుకు ఇప్పుడింకా ఎంత సమయం కావాలి? స్వర్ణ మహోత్సవంలో కూడా వారికి బహుమతి ఇస్తాము ఎందుకంటే వారు మొదటే కొంచెం చేసి చూపిస్తారు కదా! చివర్లో వచ్చినా త్వరగా తయారై చూపించండి. భారతదేశం వారు కూడా పరుగు తీయాలి. కాని మీరు వారి కంటే ముందు వెళ్లండి. బాప్‌దాదా ముందు వెళ్లే అవకాశం అందరికి ఇస్తున్నారు. 8 లోకి(అష్టరత్నాలలోకి) వచ్చేయండి. బహుమతి 8 మందికే లభిస్తుంది. కేవలం ఒక్కరికే లభిస్తుందని కాదు. లండన,్ ఆస్ట్రేలియా పాతవి, మేమైతే ఇప్పుడిప్పుడే కొత్తవాళ్లము కదా అని అనుకోకండి. అందరికంటే చిన్న కొత్త సెంటర్ ఎవరిది? అందరికంటే చిన్నగా ఉన్నవారు అందరికీ ప్రియంగా ఉంటారు. పెద్దవారు పెద్దవారే కాని చిన్నవారిని(పిల్లలను) తండ్రి సమానమని అంటారు. అందరూ చెయ్యవచ్చు. పెద్ద విషయమేమీ కాదు. గ్రీస్, టెంపా, రోమ్ ఇవన్నీ చిన్నవే. వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. టెంపా ఏం చేస్తుంది? టెంపుల్(మందిరము) తయారు చేస్తారా? ఆ రమణీయమైన బచ్చీ వచ్చింది కదా! టెంపాను టెంపుల్‌గా చేయమని ఆమెకు చెప్పడం జరిగింది. టెంపాలోకి ఎవరు వచ్చినా ప్రతి చైతన్య మూర్తిని చూసి సంతోషించాలి. మీరు శక్తిశాలిగా తయారవ్వండి. కేవలం మీరు రాజులుగా అవ్వండి. తర్వాత ప్రజలు వెంటనే తయారవుతారు. రాయల్ కుటుంబం తయారయ్యేందుకు సమయం పడ్తుంది. ఈ రాయల్ కుటుంబము, రాజధాని తయారవుతూ ఉంది. తర్వాత ప్రజలు అనేకమంది వచ్చేస్తారు. ఎంతమంది వస్తారంటే మీరు చూసి చూసి విసిగిపోతారు. బాబా ఇక ఆపండి అని అంటారు. కాని మొదట రాజ్యాధికారి, సింహాసనాధికారులైతే తయారవ్వాలి కదా! కిరీటధారులు, తిలకధారులు తయారైనప్పుడు ప్రజలు కూడా చిత్తం ప్రభూ! అని అంటారు. కిరీటధారులుగా అవ్వకుంటే ప్రజలు వీరు రాజు అని ఎలా అంగీకరిస్తారు? రాయల్ కుటుంబం తయారవ్వడంలో సమయం పడ్తుంది. మీరు మంచి సమయానికి వచ్చి చేరుకున్నారు. రాయల్ కుటుంబంలోకి వచ్చే అధికారులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు వచ్చే సమయం. రాజుగా అయ్యే వారి గుర్తు తెలుసు కదా! ఇప్పటి నుండే స్వరాజ్యాధికారి, విశ్వరాజ్యాధికారులుగా అవ్వండి. ఇప్పటి నుండే రాజ్యాధికారిగా అయ్యేవారికి సమీపంగా, సహయోగులుగా అయ్యేవారు అక్కడ కూడా సమీపంగా, రాజ్యము నడిపించడంలో సహయోగులుగా అవుతారు. ఇప్పుడు సేవలో సహయోగులు తర్వాత రాజ్యము నడిపించడంలో సహయోగులు. కావున ఇప్పటి నుండే పరిశీలించుకోండి. రాజులుగా ఉన్నారా లేక అప్పుడప్పుడు రాజుగా, అప్పుడప్పుడు ప్రజలుగా అవుతున్నారా? అప్పుడప్పుడు అధీనంగా, అప్పుడప్పుడు అధికారులుగా ఉంటారా? సదా రాజులుగా ఉన్నారా? కావున మీరు ఎంత అదృష్టవంతులు? మేము వెనుక వచ్చామని అనుకోకండి. అది వెనుక వచ్చేవారు ఆలోచించాల్సి వస్తుంది. మీరు మంచి సమయానికి చేరుకున్నారు. అందువలన అదృష్టవంతులు. మేము వెనుక వచ్చాము, రాజుగా అవుతామో లేదో, రాయల్ ఫ్యామిలీలోకి రాగలమో లేదో అని ఆలోచించకండి. మేము రాకపోతే ఇంకెవరు వస్తారని భావించండి. రావాల్సిందే. ఇది చెయ్యగలమో లేదో తెలియదు, ఇది జరుగుతుందో లేక ఏమి జరుగుతుందో..... అని కాదు. మేము ప్రతి కల్పము చేశాము, చేస్తూ ఉన్నాము, సదా చేస్తామని అనాలి. అర్థమయిందా!
మేము విదేశీయులము, వీరు దేశీయులు. వీరు భారతీయులు, మేము విదేశీయుము. మా పద్ధతి మాది, వీరి పద్ధతి వీరిది అని ఎప్పుడూ అనుకోకండి. పరిచయం కొరకు వీరు డబల్ విదేశీయులు అని అంటాము. ఇక్కడ కూడా వీరు కర్ణాటక వారు, వీరు యు.పి. వారు అని అంటాము. అందరూ బ్రాహ్మణులే కదా! భారతీయులైనా, విదేశీయులైనా అందరూ బ్రాహ్మణులే. మేము విదేశీయులమని అనుకోవడమే తప్పు. కొత్త జన్మ తీసుకోలేదా ఏమి? పాత జన్మ విదేశంలోది. కొత్త జన్మ బ్రహ్మ ఒడిలో జరిగింది కదా! ఇది కేవలం పరిచయం కొరకే చెప్పడం జరుగుతుంది. కాని సంస్కారంలో లేక అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ బేధంగా భావించకండి. బ్రాహ్మణ వంశానికి చెందినవారే కదా! అమెరికా, ఆఫ్రికా వంశంవారైతే కాదు కదా! అందరి పరిచయం ఏమని ఇస్తారు? శివవంశి బ్రహ్మకుమారి, కుమారులని చెప్తారు. ఒకే వంశం అయింది కదా! ఎప్పుడూ మాట్లాడడంలో తేడా ఉంచుకోకండి. భారతీయులు ఇలా చేస్తారు, విదేశీయులు ఇలా చేస్తారు అని కాదు. మనం ఒక్కరము, మన తండ్రి ఒక్కరే, మన మార్గము ఒక్కటే, పద్ధతి ఆచారము ఒక్కటే, స్వభావ-సంస్కారము ఒక్కటే. కనుక దేశీయులు, విదేశీయులు అనే అంతరము ఎక్కడి నుండి వచ్చింది? స్వయాన్ని విదేశీయులమని అనుకుంటే దూరమవుతారు. అందరమూ బ్రహ్మవంశీ బ్రాహ్మణులము. మేము విదేశీయులము, మేము గుజరాత్ వారము..... అందువలన ఇలా జరుగుతుందని అనుకోకండి. అందరం ఒక్క తండ్రికి చెందినవారము. భిన్న-భిన్న సంస్కారాలు కలిసి ఒక్కటిగా అయ్యారు. ఇదే కదా విశేషత. భిన్న-భిన్న ధర్మాలు, భిన్న-భిన్న జాతి, ప్రదేశాలు అన్నీ సమాప్తమైపోయాయి. ఒక్కరి వారిగా అయ్యారు అనగా ఒక్కటిగా అయ్యారు. అర్థమయిందా! మంచిది.
సదా సంతుష్టతను విశేషతగా గల విశేష ఆత్మలకు, సదా సంతుష్టత ద్వారా సేవలో సఫలత పొందే పిల్లలకు, సదా రాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారి శేష్ఠ్ర ఆత్మలకు, సదా నిశ్చయం ద్వారా పత్రి కార్యములో నెంబర్‌వన్‌గా అయ్యే పిల్లలకు బాప్‌దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.

వరదానము :- '' సాధనాలను నిర్లేపిగా లేక అతీతంగా అయ్యి కార్యములో ఉపయోగించే బేహద్ వైరాగి భవ ''
బేహద్ వైరాగి అనగా ఎవ్వరిలోనూ ఆకర్షణ ఉండరాదు. సదా తండ్రికి ప్రియంగా ఉండాలి. ఈ ప్రియత్వమే అతీతంగా చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకపోతే అతీతంగా కూడా అవ్వలేరు. తగుల్పాటులోకి (లగావ్‌లోకి) వచ్చేస్తారు. తండ్రికి ప్రియంగా ఉంటే సర్వ ఆకర్షణలకు దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లేపస్థితి అని అంటారు. ఏ హద్దు ఆకర్షణ ప్రభావంలోకి వచ్చేవారు కాదు. రచన లేక సాధనాలను నిర్లేపంగా అయ్యి కార్యములోకి తీసుకు రండి. ఇలాంటి బేహద్ వైరాగులే రాజఋషులు.
స్లోగన్ :- ''హృదయం సత్యంగా, స్వచ్ఛంగా ఉంటే సాహెబ్ (బాబా) రాజీ అవుతారు.''
No comments:
Post a Comment