02-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పిల్లలైన మిమ్ములను అలంకరించేందుకు తండ్రి వచ్చారు, పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారము. ''
ప్రశ్న :- పూర్తి 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులేవి ?
జవాబు :- 1. వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురినీ స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచరును మర్చిపోవాలని కాదు. ముగ్గురుని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్లగలరు అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. 2. మాయా తుఫానులు వారినెప్పుడూ ఓడించలేవు.
ఓంశాంతి. తండ్రి మొదట పిల్లలను అడుగుతున్నారు - తండ్రి సన్ముఖములో, టీచరు సన్ముఖములోనే కాక సద్గురువు సన్ముఖములో కూర్చుని ఉన్నామని మర్చిపోరు కదా. అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారని బాబా అనుకోవడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అర్థ సహితంగా స్మృతి చేయడం. మన బాబా అనంతమైన తండ్రి, టీచరు అంతేకాక పిల్లలందరిని తప్పకుండా వెంట తీసుకెళ్లే సద్గురువు కూడా అయ్యారు. పిల్లలను అలంకరించేందుకే తండ్రి వచ్చారు, పవిత్రతతో అలంకరిస్తూ వస్తారు. అపారమైన ధనరాసులను కూడా ఇస్తారు. మీరు వెళ్లబోయే నూతన ప్రపంచము కొరకు ధనమునిస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యముతో మర్చిపోతారు. అందువలన ఉండవలసిన సంపూర్ణ ఖుషీ తక్కువైపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించనే లభించరు. మనమంతా ఆ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. వారు మనలను చదివిస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా టీచరు కూడా అయ్యారు. మన చదువు నూతన ప్రపంచమైన అమరపురము కొరకని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమ యుగములో కూర్చొని ఉన్నాము. పిల్లలకు ఈ స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కా పక్కాగా స్మృతి చేయాలి. అంతేకాక ఇప్పుడు కంసపురము, ఆసురీ ప్రపంచములో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా దాని వలన ఎవ్వరూ కృష్ణపురములోకి గాని, వారి వంశములోకి గాని వెళ్లలేరు. తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురినీ స్మృతి చేసినప్పుడే వెళ్లగలరు. ఇక్కడ ఆత్మలతోనే మాట్లాడ్తున్నారు. ఆత్మనే చెప్తుంది - ''అవును బాబా, మీరేమో సత్యమే చెప్తున్నారు, మీరు తండ్రి కూడా అయ్యారు, చదివించే టీచరు కూడా అయ్యారు.'' సుప్రీమ్ ఆత్మ (పరమాత్మ) చదివిస్తుంది, లౌకిక చదువు కూడా ఆత్మయే శరీరము ద్వారా చదివిస్తుంది. కానీ అక్కడ ఆత్మా పతితమైనదే, శరీరము కూడా పతితమైనదే. ప్రపంచములోని మానవులకు మేము నరకములో నివసిస్తున్నామని తెలియదు.
ఇప్పుడు మనము మన వతనానికి వెళ్తామని మీకు తెలుసు. ఇది మీ వతనము కాదు. ఇది రావణుని పరాయి వతనము. మీ వతనములో అపారమైన సుఖముంటుంది. మనము పరాయి రాజ్యములో ఉన్నామని కాంగ్రెస్ వారు భావించరు. ఇంతకు ముందు ముసల్మానుల రాజ్యములో ఉండేవారము, తర్వాత క్రైస్తవుల రాజ్యములో ఉన్నాము. ఇప్పుడు మనము మన రాజ్యములోకి వెళ్తామని మీకు తెలుసు. మనము ఇంతకు ముందు రావణరాజ్యమును మన రాజ్యంగా భావించేవారము, అంతకంటే ముందు రామరాజ్యములో ఉండేవారమని మర్చిపోయాము. తర్వాత 84 జన్మల చక్రములోకి రావడం వలన రావణ రాజ్యములోకి దు:ఖములోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యములో దు:ఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా ఆంతరికములో ఉత్పన్నమవ్వాలి. తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. కానీ ముగ్గురినీ స్మృతి చేయాలి. ఈ జ్ఞానము కూడా మనుష్యులే తీసుకోగలరు. జంతువులైతే చదువుకోవు. అక్కడ న్యాయశాస్త్రము మొదలైన చదువులేవీ ఉండవని కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి ఇక్కడే మిమ్ములను సంపన్నులుగా చేస్తున్నారు. అలాగని అందరూ రాజులుగా అవ్వరు. వ్యాపారాలు కూడా ఉంటాయి కానీ అక్కడ మీ వద్ద అపారమైన ధనముంటుంది. నష్టపోయే నియమమే లేదు. దోచుకోవడం, చంపడం మొదలైనవి అక్కడ ఉండనే ఉండవు. దాని పేరే స్వర్గము. మేము స్వర్గములో ఉండేవారము తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి వచ్చింది. బాబా కథను కూడా వారికే తెలుపుతారు. 84 జన్మలు తీసుకోనివారిగా ఉంటే వారిని మాయ ఓడిస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫానులు ఎంతో పెద్దవి. చాలామందిని మాయ ఓడించే ప్రయత్నము చేస్తుంది. పోను పోను మీరు చాలా చూస్తారు, వింటారు. తండ్రి వద్ద వారందరి చిత్రాలు(ఫోటోలు) ఉంటే మీరు ఆశ్చర్యపడునట్లు - ఫలానావారు ఇలా ఇన్ని రోజులు వచ్చారు, తండ్రివారైన తర్వాత మాయ తినేసింది అని చూపేవారు. మరణించి మాయతో కలుసుకున్నారు. ఇక్కడెవరైనా శరీరాన్ని వదిలితే వారు ఇదే ప్రపంచములో వచ్చి జన్మ తీసుకుంటారు. మీరిప్పుడు ఈ సమయములో శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన(బేహద్) ఇంటికి వెళ్తారు. అక్కడ బాబా-మమ్మా, పిల్లలు అందరూ ఉంటారు కదా. కుటుంబము ఇలాగే ఉంటుంది. మూలవతనములో తండ్రి, వారితో పాటు సోదరులందరూ ఉంటారు. ఇతర సంబంధాలేవీ ఉండవు. ఇక్కడ తండ్రి, వారితో పాటు సోదరీ-సోదరులందరూ ఉన్నారు. తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. చిన్నాన్న, మామ మొదలైన అనేక సంబంధాలు ఈ ప్రపంచములో ఏర్పడ్తాయి. ఈ సంగమ యుగములో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందినవారిగా అయ్యారు కనుక మీరు సోదర-సోదరీలు. శివబాబాను స్మృతి చేస్తారు కనుక మీరంతా సోదరులు(భాయీ-భాయీ). ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. తండ్రి ఏమో అర్థం చేయిస్తూనే ఉంటారు. పిల్లలను ప్రేమించి తల పై కూర్చోపెట్టుకోవడం తండ్రి కర్తవ్యము. అందుకే తండ్రి నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థము కూడా తెలిపిస్తున్నారు. భక్తిమార్గములోని సాధు-సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తికి మార్గము తెలియజేయలేరు. వారు ముక్తి కొరకే పురుషార్థము చేస్తూ ఉంటారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు రాజయోగమునెలా నేర్పించగలరు? రాజయోగము ప్రవృత్తి మార్గానికి చెందింది. ప్రజాపిత బ్రహ్మకు నాలుగు భుజాలు చూపిస్తారు అనగా ప్రవృత్తి మార్గము కదా. ఇక్కడ వీరిని తండ్రి దత్తత తీసుకొని బ్రహ్మ-సరస్వతులు అని పేరు పెట్టారు. డ్రామాలో ఎలా నిర్ణయింపబడిందో చూడండి! వానప్రస్థ అవస్థలోనే, 60 సంవత్సరాల తర్వాత మానవులు గురువులను ఆశ్రయిస్తారు. అలాగే ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి ఇతనిలో ప్రవేశించి తండ్రి, టీచరు, సద్గురువుగా అయ్యారు. ఇప్పుడు(కలియుగములో) నియమాలు కూడా చెడిపోయాయి. చిన్న పిల్లలను కూడా గురువు దగ్గరకు పంపుతారు. వీరు నిరాకారులు. ఆత్మలైన మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అవుతారు. నిరాకార ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు. అలాగని ప్రపంచమే కాదని అనరు. దానిని శాంతిధామమని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. పరమాత్మకు నామ-రూప-దేశ -కాలాలు లేనిచో పిల్లలెక్కడ నుండి వస్తారు?
ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్(పునరావృతము) అవుతాయో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చరిత్ర చైతన్యానికి సంబంధించినది. భూగోళము జడానికి సంబంధించినది. మనము ఎంతవరకు రాజ్యము చేస్తామో ఆత్మలైన మీకు తెలుసు. చరిత్ర గాయనము చేయబడ్తుంది. దానిని కథ అని అంటారు. భూగోళము అంటే దేశానికి సంబంధించింది. చైతన్యంగా ఉన్నవారే రాజ్యపాలన చేస్తారు. జడ పదార్థమైతే రాజ్యమును పాలించదు. ఎంత సమయము నుండి ఎవరి రాజ్యముండినది, క్రైస్తవులు భారతదేశములో ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యము చేశారో తెలుసు. కాని ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. సత్యయుగము గడిచి లక్షల సంవత్సరాలయిందని చెప్తారు. అందులో ఎవరు రాజ్యపాలన చేశారో, ఎంతకాలము చేశారో ఎవ్వరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యము, శరీరము జడము. మొత్తం ఆటంతా జడము, చైతన్యానికి సంబంధించినది. మానవ జీవితమే ఉత్తమమైనదని గాయనముంది. జనాభా లెక్కలు(జనసంఖ్య) కూడా మానవులదే లెక్కిస్తారు. జంతువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. మొత్తం ఆట అంతా మీ పైనే ఉంది. చరిత్ర-భూగోళాలు కూడా మీరు వింటున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. దీనిని బేహద్ చరిత్ర- భూగోళము అని అంటారు. ఈ జ్ఞానము లేనందున మీరు చాలా తెలివిహీనులుగా అయ్యారు. మనుష్యులై ఉండి ప్రపంచ చరిత్ర-భూగోళాలను తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ప్రపంచ చరిత్ర-భూగోళాలను వింటున్నారు. ఈ చదువు ఎంత బాగుంది! చదివించేది ఎవరు? తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రే అత్యంత ఉన్నతమైన పదవినిప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వారితో స్వర్గములో నివసించేవారి పదవి అత్యంత శ్రేష్ఠమైనది కదా. అక్కడ బ్యారిస్టర్ చదువు మొదలైనవి ఉండవు. అక్కడ కేవలం కళలు నేర్చుకోవలసి ఉంటుంది. ఆ కళలు నేర్చుకోకుంటే భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తారు? పరస్పరములో కళలు(నైపుణ్యాలు) నేర్చుకుంటారు లేకుంటే ఇన్ని భవనాలు మొదలైనవి ఎవరు నిర్మిస్తారు? వాటంతకవే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారము ఉంటాయి. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని ఇంత సమయము రాజ్యము చేసి మరలా రావణ రాజ్యములోకి వస్తామని మీకు తెలుసు. రావణ రాజ్యములో ఉన్నామని బయటి ప్రపంచము వారికి తెలియదు. ''బాబా! రావణరాజ్యము నుండి ముక్తులుగా చేయండి'' అని తండ్రిని పిలుస్తారు. కాంగ్రెస్‌వారు క్రైస్తవుల రాజ్యము నుండి తమను ముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ''ఓ గాడ్‌ఫాదర్, మమ్ములను విడుదల చేయండి'' అని పిలుస్తారు. స్మృతిలోకి వస్తోంది కదా. ఈ విధంగా ఎందుకు అంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడీ మొత్తము సృష్టి పై రావణ రాజ్యముందని మీరు అర్థం చేసుకున్నారు. అందరూ రామరాజ్యము కావాలని కోరుకుంటారు. కానీ ముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్‌ఫాదర్ ముక్తినిచ్చి మార్గదర్శకులై తీసుకెళ్తారని భావిస్తారు. భారతవాసులకు ఇంత తెలివి లేదు. వీరు పూర్తిగా తమోప్రధానమై ఉన్నారు. ఇతరులకు ఇంత దు:ఖమూ లేదు, సుఖమూ లేదు. అందరికంటే ఎక్కువ సుఖంగా ఉండేవారు, ఎక్కువ దు:ఖంగా ఉండేవారు భారతీయులే. అంతా లెక్కాచారమే కదా. ఇప్పుడెంతో దు:ఖముంది. ఓ గాడ్‌ఫాదర్, లిబరేటర్(విముక్తిదాత)! అని ధార్మిక పరాయణులు పిలుస్తూ ఉంటారు. ''బాబా, మీరు వచ్చి మా దు:ఖాలను హరించి సుఖధామములోకి తీసుకెళ్లమని మీ హృదయాలలో కూడా ఉంది. వారేమో శాంతిధామానికి తీసుకెళ్లమంటారు. కానీ మీరు శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్లమని అంటారు. ఇప్పుడా తండ్రి వచ్చి ఉన్నారంటే చాలా సంతోషముండాలి. భక్తిమార్గములో చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. అందులో సత్యమైన మాట ఒక్కటి కూడా లేదు. పిండిలో ఉప్పు వేసినంత ఉంది. చండికా దేవికి కూడా జాతర(మేళా) జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది? చండిక అంటే ఎవరు? ఛండాల జన్మ కూడా ఇక్కడే తయారుచేసుకొని వెళ్తారని బాబా తెలిపించారు. ఇక్కడే ఉండి తాగి, తిని ఏదైనా కొంత ఇచ్చి మళ్లీ మేమిచ్చింది మాకు వాపస్ ఇవ్వమని అంటారు. మాకు ఇష్టము లేదు, ఒప్పుకోము అని అంటారు. సంశయపడి వెళ్లిపోతే వారు ఎలా తయారవుతారు? ఇలాంటి చండికల జాతర కూడా జరుగుతుంది. అయినా సత్యయుగ వాసులుగా ఏమో అవుతారు కదా. కొంత సమయానికైనా సహాయకారులుగా అవుతే స్వర్గములోకేమో వచ్చేస్తారు. భక్తులకు తెలియదు. జ్ఞానమైతే ఎవ్వరి వద్దా లేదు. ఆ చిత్రాల గీత ద్వారా ఎంత ధనము సంపాదిస్తారు! ఈ రోజులలో చిత్రాలంటే అందరికీ ఇష్టమే. దానిని కళ అని అనుకుంటారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుష్యులకేం తెలుసు! వాస్తవానికి మీరు ఎంతో ఫస్ట్‌క్లాస్‌గా ఉండేవారు తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు ఎవ్వరూ ఉండరు. దేవతలలో సహజమైన శోభ ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యముంటుంది. అందువలన తండ్రి కూడా అంతా అర్థం చేయించిన తర్వాత ''పిల్లలూ! తండ్రిని స్మృతి చేయండి'' అని చెప్తున్నారు. ఆ తండ్రి, తండ్రి మాత్రమే కాదు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. మూడు రూపాలలో స్మృతి చేస్తే మూడు వారసత్వాలు లభిస్తాయి. వెనుక వచ్చేవారు మూడు రూపాలలో స్మృతి చేయలేరు. మళ్లీ ముక్తిలోకి వెళ్లిపోతారు.
సూక్ష్మవతనము మొదలైన వాటిలో చూచేవన్నీ సాక్షాత్కార విషయాలని తండ్రి అర్థం చేయించారు. ఇక మిగిలిన చరిత్ర-భూగోళాలన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. తర్వాత మీరు ఇతరులెవ్వరికైనా అర్థం చేయించగలరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆ బేహద్ తండ్రిని సుప్రీమ్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎవ్వరూ పరమాత్మ అని గానీ, సుప్రీమ్ ఆత్మ అని గానీ అనరు. ఒక్కరు మాత్రమే సుప్రీమ్. వారిని భగవంతుడని అంటారు. వారు జ్ఞానసాగరులు కనుక మీకు జ్ఞానము నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలము. జ్ఞానములో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్ఠము ఉంటాయి కదా. తండి అత్యంత ఉన్నతులు కనుక ఈ చదువు కూడా అత్యున్నతమైనది. పదవి కూడా ఉన్నతమైనదే. చరిత్ర, భూగోళాలనైతే వెంటనే అర్థం చేసుకోగలరు. కానీ స్మృతియాత్రలోనే యుద్ధము జరుగుతుంది. దానిలో ఓడిపోతే జ్ఞానములో కూడా ఓడిపోతారు. ఓటమి చెంది పారిపోతే జ్ఞానములో కూడా ఉండకుండా పారిపోతారు. ముందెలా ఉండేవారో అలాగే అవుతారు. ఇంకా అంతకంటే హీనంగా అవుతారు. తండ్రి ముందు మీ నడవడికల ద్వారా మీ దేహాభిమానము వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది. కానీ చాలామందికి ఇక్కడ ఎలా నంబరువారుగా కూర్చొని ఉన్నామో తెలియదు. దేహాభిమానముంది కదా. నిశ్చయమున్న వారికి తప్పకుండా చాలా ఖుషీ ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రాకుమారులుగా అవుతామని నిశ్చయము ఎవరికి ఉంది?(అందరూ చేతులు ఎత్తారు) పిల్లలకు ఇంత ఖుషీ ఉంటుంది. మీ అందరిలో దివ్యగుణాలు పూర్తిగా ఉండాలి. అప్పుడే నిశ్చయమున్నట్లు తెలుస్తుంది. నిశ్చయబుద్ధి అనగా విజయమాలలో కూర్చబడ్తారు అనగా చక్రవర్తులు గా అవుతారు. విదేశీయులంతా ఎక్కువగా ఆబూలో వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవాలని అభిలాషించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇతర తీర్థయాత్రలకు వెళ్లడం వదిలేస్తారు. భారతదేశ రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. స్వర్గమును(ప్యారడైజ్) స్థాపన చేసిందెవరు? కల్పక్రితము జరిగి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా మ్యూజియమ్ తయారైపోతుందని పురుషార్థము చేస్తారు. ఇటువంటి ప్రదర్శినీని సదా కాలానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. 4-5 సంవత్సరాలకు భవనాలు లీజుకు తీసుకొని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారతదేశమునే సుఖధామంగా మార్చేందుకు సేవ చేస్తున్నాము, ఇందులో అనేకమందికి కళ్యాణము జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్ములను అలంకరిస్తున్నారు, వారు మాకు అనంతమైన ధన సంపదలను ఇస్తున్నారు, నూతన ప్రపంచమైన అమరపురము కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి.
2. విజయ మాలలో కూర్చబడేందుకు నిశ్చయబుద్ధి గలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలనే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయబుద్ధి గలవారిగా అయ్యి మీ పదవిని పోగొట్టుకోరాదు.
వరదానము :- '' విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీ భవ ''
విఘ్నాలు రావడం మంచిదే. కానీ వాటికి ఓడిపోరాదు. శక్తిశాలిగా చేసేందుకే విఘ్నాలు వస్తాయి. అందువలన విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి. అప్పుడు నిర్విఘ్న విజయీలని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నప్పుడు భయపడే విషయమేదీ ఉండదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీ గా ఉంటే విఘ్నాలు వస్తాయి లేక మాయ వస్తుంది. బిజీగా ఉంటే మాయను, విఘ్నాలను దాటుకుంటారు.
స్లోగన్ :- '' సుఖ ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదా పూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమునివ్వండి. ''
No comments:
Post a Comment