16-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు త్రిమూర్తి తండ్రి సంతానము, మీకు మీ మూడు కర్తవ్యములైన స్థాపన, వినాశనము, పాలనలు గుర్తుండాలి ''
ప్రశ్న :- దేహాభిమానమనే కఠినమైన వ్యాధి సోకడము వలన ఏ ఏ నష్టాలు కలుగుతాయి ?
జవాబు :- 1. దేహాభిమానము ఉన్నవారిలో ఈర్ష్య(జెలసి) ఉంటుంది. ఈర్ష్య కారణంగా వారు పరస్పరములో ఉప్పు నీరు వలె ఉంటారు, ప్రీతితో సేవ చేయలేరు. లోలోపల కాలిపోతూ ఉంటారు. 2. నిర్లక్ష్యంగా ఉంటారు. మాయ వారిని చాలా మోసగిస్తూ ఉంటుంది. పురుషార్థము చేస్తూ చేస్తూ అదృశ్యమైపోతారు. అందువలన చదువునే వదిలేస్తారు. 3. దేహాభిమానము వలన హృదయము స్వచ్ఛంగా ఉండదు. కనుక తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. 4. మూడ్ ఆఫ్ అయిపోతారు. వారి ముఖమే మారిపోతుంది.
ఓంశాంతి. కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారా? లేక ఇంకా ఏమైనా గుర్తుకొస్తుందా? పిల్లలకు స్థాపన, వినాశనము, పాలన మూడూ గుర్తుండాలి. ఎందుకంటే ఇవన్నీ జత జతలో జరుగుతాయి కదా. న్యాయశాస్త్రము చదివేవారికి నేను వకీలుగా అవుతాను, కేసులు వాదిస్తానని గుర్తుంటుంది. బ్యారిస్టరీ పనిని పాలన కూడా చేస్తారు కదా. ఏం చదువుతున్నా వారికి లక్ష్యము ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడు మేము నిర్మాణము చేస్తున్నామని మీకు తెలుసు. పవిత్ర నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో యోగము చాలా అవసరము. యోగము ద్వారానే పతితమైన మీ ఆత్మలు పావనంగా అవుతాయి. కావున పవిత్రంగా అయ్యి మళ్లీ పవిత్ర ప్రపంచములోకి వెళ్ళి రాజ్యపాలన చేస్తామని మీ బుద్ధిలో ఉండాలి. ఇది అన్ని పరీక్షల కంటే చాలా పెద్ద పరీక్ష, అన్ని చదువులలో ఉన్నతమైన చదువు. చదువులు అనేక ప్రకారాలున్నాయి కదా. అక్కడంతా మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. ఆ చదువులు ఈ ప్రపంచము కొరకు మాత్రమే పనికొస్తాయి. వాటిని చదువుకొని దాని ఫలమును ఇక్కడే పొందుతారు. ఈ అనంతమైన చదువుకు ఫలము మనకు నూతన ప్రపంచములో లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఆ నూతన ప్రపంచము ఎంతో దూరములో లేదు. ఇప్పుడిది సంగమ యుగము, నూతన ప్రపంచములో మనము రాజ్యపాలన చేయాలి. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు కూడా బుద్ధిలో దీనిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది. మళ్లీ మనము పవిత్రంగా అవుతాము తర్వాత ఈ అపవిత్ర ప్రపంచము తప్పకుండా వినాశమవుతుంది. అందరూ పవిత్రంగా అవ్వలేరు. మీలో కూడా శక్తి గలవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మీలో కూడా నంబరువారు శక్తానుసారము సూర్యవంశీయులుగా, చంద్ర వంశీయులుగా అవుతారు కదా. ప్రతి విషయానికి శక్తి అవసరము. ఇది ఈశ్వరీయ శక్తి, దీనిని యోగబల శక్తి అని కూడా అంటారు. మిగిలినవన్నీ శారీరిక శక్తులు. ఇది ఆత్మిక శక్తి. తండ్రి కల్ప-కల్పము చెప్తున్నారు - ఓ పిల్లలారా, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి(మామేకమ్ యాద్ కరో). సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేయండి. అందరికి తండ్రి వారు ఒక్కరు మాత్రమే. వారిని స్మృతి చేసినందున ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇవి ధారణ చేసేందుకు చాలా మంచి విషయాలు. ఎవరికైతే మేము 84 జన్మలు తీసుకున్నామని నిశ్చయమే ఉండదో వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఎవరైతే సతోప్రధాన ప్రపంచములోకి వచ్చారో వారే ఇప్పుడు తమోప్రధాన ప్రపంచములో ఉన్నారు. వారే త్వరగా వచ్చి నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు. ఏమైనా అర్థము కాకుంటే అడగాలి. పూర్తిగా అర్థము చేసుకుంటే తండ్రిని కూడా స్మృతి చేస్తారు. అర్థము చేసుకోకుంటే స్మృతి కూడా చేయలేరు. ఇది నేరుగా తెలిపిన విషయము. సతోప్రధానంగా ఉన్న ఆత్మలమైన మనమే మళ్లీ తమోప్రధానంగా అయ్యాము. మనము ఎలా 84 జన్మలు తీసుకున్నాము లేక కల్పక్రితము కూడా తండ్రి నుండి ఆస్తి ఎలా తీసుకున్నాము అని సంశయముంటే వారు చదువు పై పూర్తి గమనమే ఉంచరు. అప్పుడు వీరి అదృష్టములో లేదని భావించబడ్తుంది. కల్పక్రితము కూడా అర్థము చేసుకోలేదు, కనుక ఇప్పుడు కూడా వారు స్మృతి చేయలేరు. ఈ చదవు భవిష్యత్తు కొరకు. బాగా చదవకుంటే కల్ప-కల్పము చదవలేదని లేక చాలా కొద్ది మార్కులతో పాస్ అయ్యారని భావించబడ్తుంది. పాఠశాలలో చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. పాస్ కూడా నంబరువారుగానే అవుతారు. ఇది కూడా చదువే. ఇందులో నంబరువారుగా పాస్ అవుతారు. చరుకైనవారు చదువుకొని ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు. నేను పిల్లలైన మీకు సేవకుడనని తండ్రి చెప్తున్నారు. మేము కూడా సేవకులమేనని పిల్లలు కూడా చెప్తారు. సోదరీ-సోదరులందరి కళ్యాణము చేయాలి. తండ్రి మన కళ్యాణము చేస్తారు, మనము మళ్లీ ఇతరుల కళ్యాణము చేయాలి. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయని కూడా అందరికీ అర్థం చేయించాలి. ఎవరు ఎంతమందికి సందేశము చేరుస్తారో, వారిని అంత గొప్ప సందేశకులని అంటారు. వారినే మహారథులు, అశ్వారూఢులని అంటారు. పదాతిదళము వారు ప్రజలలోకి వెళ్లిపోతారు. ఇందులో కూడా ఎవరెవరు ధనవంతులుగా అవ్వగలరో పిల్లలు అర్థము చేసుకుంటారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. ఎవరైతే సేవ కొరకు నిమిత్తమై ఉన్నారో, సేవ కొరకే జీవితాలను ఇచ్చేశారో వారు అటువంటి పదవినే పొందుకుంటారు. వారికి ఎవరి చింతా ఉండదు. మనుష్యులకు తమ కాళ్ళు, చేతులు ఉన్నాయి కదా, బంధింపబడరు. తమను తాము స్వతంత్రముగా ఉంచుకోగలరు. ఇలా బంధనములో ఎందుకు చిక్కుకోవాలి? తండ్రి నుండి అమృతము తీసుకొని అమృతాన్ని ఎందుకు దానము చేయరాదు? నేనేమైనా గొఱ్రెనా లేక మేకపోతునా పట్టి బంధించేందుకు అని బంధించేవారిని అడగాలి. ప్రారంభములో పిల్లలైన మీరు ఎలా మిమ్ములను మీరు విడిపించుకున్నారు, బిగ్గరగా రోధించారు. అయ్యో-అయ్యో అంటూ కూర్చుండిపోయారు. మాకేం చింత, మేము స్వర్గ స్థాపన చేయాలి లేక మేము ఈ పని చేయాలనే నషా ఎక్కిపోతుంది. దీనిని మౌలాయి మస్తి అని అంటారు. మేము మౌలా(బాబా) ప్రేమలో మస్త్‌గా ఉన్నాము. మౌలా ద్వారా మనకు ఏం ప్రాప్తిస్తూ ఉందో మీకు తెలుసు. ఆ మౌలాయే మనలను చదివిస్తున్నారు కదా. వారికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ కొన్ని పేర్లు మాత్రమే చాలా మధురంగా ఉంటాయి. ఇప్పుడు మనము మౌలాయి మస్తీలుగా అయ్యాము. తండ్రి ఆదేశాలనైతే చాలా సహజమైనవి ఇస్తున్నారు. తప్పకుండా మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అయ్యి విశ్వానికి అధికారులుగా కూడా అవుతామని బుద్ధి కూడా అర్థము చేసుకుంటుంది. తండ్రిని ప్రతి సమయములో స్మృతి చేయాలనే చింత పట్టుకొని ఉంది. సన్ముఖములో కూర్చొని ఉన్నారు కదా. ఇక్కడ నుండి వెలుపలికి వెళ్లగానే మర్చిపోతారు. ఇక్కడ ఎంత నషా ఎక్కుతుందో అంత బయట ఉండదు, మర్చిపోతారు. మీరు మర్చిపోరాదు. కానీ అదృష్టములో లేకుంటే ఇక్కడ కూర్చొని ఉన్నా మర్చిపోతారు.
పిల్లలు మ్యూజియమ్‌లో గ్రామ గ్రామాలలో సేవ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తండ్రి చెప్తున్నారు - ఎంత సమయము లభించినా త్వరత్వరగా ఆ సమయములో సేవ చేయండి. కానీ డ్రామాలో త్వరగా జరగదు. తండ్రి చెప్తున్నారు - చేయి పెట్టిన వెంటనే వస్తువు తయారయ్యే యంత్రముండాలి. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. మంచి-మంచి పిల్లలను మాయ ముక్కు లేక చెవితో గట్టిగా పట్టుకుంటుంది. ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికే మాయా తుఫానులు చాలా వస్తాయి. తర్వాత వారు ఎవ్వరినీ లక్ష్యము చేయరు. దాచి పెట్టుకుంటారు. ఆంతరికముగా హృదయములో సత్యముగా ఉండరు. సత్యమైన హృదయము గలవారే స్కాలర్‌షిప్ తీసుకుంటారు. సైతానీ(రావణ) మనస్సున్న వారు కొనసాగలేరు. సైతాని మనసున్నవారు తమ నావను తామే ముంచేసుకుంటారు. అందరికీ శివబాబాతో పని ఉంది. ఇది మీకు సాక్షాత్కారమవుతుంది. బ్రహ్మను కూడా తయారు చేసేవారు శివబాబాయే. శివబాబాను స్మృతి చేస్తే ఇలా(లక్ష్మీనారాయణులు) అవుతారు. మాయ చాలా శక్తిశాలి అని బాబాకు కూడా తెలుసు. ఎలుక కొరికితే ఎలా తెలియనే తెలియదో, అలా మాయ కూడా మదించిన ఎలుక. మహారథులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మాయ మమ్ములను క్రింద పడేసిందని వారికి అర్థమే కాదు. ఉప్పునీరుగా తయారు చేసేస్తుంది. ఉప్పునీరుగా అయినందున మేము తండ్రి సేవ చేయలేమని అర్థము చేసుకోవాలి. లోలోపలే కాలిపోతూ ఉంటారు. దేహాభిమానము ఉన్నందునే కాలిపోతూ ఉంటారు. ఆ స్థితి లేనే లేదు. స్మృతి పదును నిండడము లేదు. అందువలన చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ చాలా తీక్షణమైనది. మీరు యుద్ధ మైదానములో ఉన్నందున మాయ కూడా వదిలిపెట్టదు. అర్ధము లేక ముక్కాలు భాగము సమాప్తము చేసేస్తుంది. ఎవ్వరికీ అర్థము కూడా కాదు. ఎటువంటి మంచి-మంచి కొత్త-కొత్త పిల్లలు కూడా చదువు చాలించి ఇంట్లో కూర్చుండిపోతారు. మంచి-మంచి ప్రసిద్ధమైన వారి పై కూడా మాయ దాడి జరుగుతుంది. తెలిసి కూడా నిర్లక్ష్యము చేస్తారు. చిన్న-చిన్న విషయాలకు కూడా వెంటనే ఉప్పునీరుగా అయిపోతారు. దేహాభిమానము వల్లనే ఉప్పు నీరుగా అవుతారని స్వయాన్ని మోసపుచ్చుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది కూడా డ్రామాలో ఉందని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో అది కల్పక్రితము వలె డ్రామా నడుస్తూ ఉంటుంది. స్థితిలో హెచ్చు-తగ్గులు అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది, అప్పుడప్పుడు బాగా సేవ చేసి సంతోషంగా సమాచారము వ్రాస్తూ ఉంటారు. హెచ్చు-తగ్గులవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు గెలుపు. పాండవులు అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు. అప్పుడప్పుడు విజయము పొందుతారు. మంచి మంచి మహారథులు కూడా కదిలిపోతారు. కొందరు మరణిస్తారు కూడా కనుక ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. మీరు సేవ కొరకు నిమిత్తమయ్యారు. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు కదా. గృహస్థ వ్యవహారములో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారి కంటే చాలా తీక్షణంగా వెళ్ళగలరు. మాయతో యుద్ధము పూర్తిగా జరుగుతూ ఉంటుంది. సెకండు సెకండు కల్పక్రితము వలె మీ పాత్ర నడుస్తూ వచ్చింది. ఇంత సమయము గడిచిపోయిందని, ఆ సమయములో ఏమేమి జరిగిందో అదంతా బుద్ధిలో ఉందని మీరు అంటారు. జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఎలాగైతే తండ్రిలో జ్ఞానముందో అలా ఈ దాదాలో కూడా రావాలి. ఈ దాదా కూడా తప్పకుండా చెప్తూ ఉంటారని బాబా చెప్తున్నారు. ఎవరెవరి హృదయాలు శుద్ధంగా ఉన్నాయో మీకు కూడా తెలుసు. హృదయము శుద్ధంగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అధిరోహించగలరు. వారిలో ఉప్పునీరుగా అయ్యే స్వభావము ఉండదు. సదా హర్షితంగా ఉంటారు. వారి మూడ్ ఎప్పుడూ ప్రక్కకు తిరగదు. ఇక్కడ చాలామంది మూడ్ తిరిగిపోతుంది. అడగనే అడగవద్దు. ముఖము పాకీ పని చేసేవారి ముఖము వలె అయిపోతుంది. మాయ ఈ సమయములో అందరినీ పాకీవారిగా చేసేసింది. మేము పతితులమని కూడా వారే చెప్పుకుంటారు. పతితపావనుడైన తండ్రిని రమ్మని పిలిచి పావనంగా తయారు చేయమని వేడుకున్నారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ దుస్తులు(ఆత్మలు) శుభ్రమైపోతాయి. నా శ్రీమతమును అనుసరించండి. శ్రీమతమును అనుసరించని వారి దుస్తులు శుభ్రమవ్వవు. వారి ఆత్మ శుద్ధము కానే కాదు. స్వయాన్ని ఆత్మగా భావించండని తండ్రి రాత్రింబవళ్ళు జోరు చేస్తారు(చెప్తూనే ఉంటారు). దేహాభిమానము వలన పిల్లలైన మీరు గుటకలు వేస్తూ ఉంటారు. ఎంతెంత పైకి ఎదుగుతూ పోతారో, ఆనందంగా ఉంటారో అంత హర్షితముఖులుగా ఉంటారు. మంచి మంచి ఫస్ట్‌క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. కానీ లోలోపల స్థితిని గమనిస్తే కాలిపోతూ ఉంటారు. దేహాభిమానమనే అగ్ని కాలుస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కడ నుండి వస్తుందో అర్థము చేసుకోరు. దేహాభిమానము వలన ఈ వ్యాధి వస్తుందని తండ్రి చెప్తున్నారు. ఆత్మాభిమానులకు ఎప్పుడూ ఈ జబ్బు రాదు. లోలోపల చాలా కాలిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! 'దేహీ-అభిమానీ భవ'. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందని అడుగుతారు? తండ్రి చెప్తారు - ఈ దేహాభిమానమనే జబ్బే అటువంటిది దానిని గురించి అడగనే అడగకండి. ఎవరికైనా ఈ వ్యాధి పట్టుకుంటే అది జిడ్డు వలె అంటుకునేస్తుంది. వదలనే వదలదు. శ్రీమతమును అనుసరించకుండా దేహాభిమానములో నడుస్తూ ఉంటే చాలా గట్టి దెబ్బ జోరుగా తగులుతుంది. బాబా వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని క్రింద పడేస్తుంది. బుద్ధిని పూర్తిగా చంపేస్తుంది. సంశయబుద్ధి గలవారైపోతారు. మమ్ములను రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా తయారు చేయమని భగవంతుని పిలుస్తారు. ఆ భగవంతునికే విరుద్ధమైతే వారికి ఏ గతి పడ్తుంది! ఒక్కసారిగా క్రింద పడి రాతిబుద్ధిగా తయారైపోతారు. పిల్లలు ఇక్కడ కూర్చొని సంతోషంగా ఉండాలి. విద్యార్థి జీవితము సర్వోన్నతమైనది(ది బెస్ట్). తండ్రి చెప్తున్నారు - ఇంతకంటే శ్రేష్ఠమైన చదువు ఏదైనా ఉందా? అత్యంత శ్రేష్ఠమైనది(ది బెస్ట్) ఈ చదువే 21 జన్మలకు ఫలమునిస్తుంది. ఇటువంటి చదువు పై ఎంత గమనమివ్వాలి! కొందరు పూర్తిగా గమనమే ఇవ్వరు. మాయ ముక్కు, చెవులు రెండూ కోసేస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు - అర్ధకల్పము మాయ రాజ్యము నడుస్తుంది. అందుకే ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే అడగకండి. అందువలన చాలా హెచ్చరికగా ఉండండి. ఒకరికొకరు సావధాన పరుచుకుంటూ ఉండండి. శివబాబాను స్మృతి చేయకుంటే ముక్కు, చెవులు కోసేస్తుంది. తర్వాత దేనికీ పనికిరారు. చాలామంది మేము లక్ష్మినారాయణుల పదవి పొందుకోవడం అసంభవమని అర్థము కూడా చేసుకుంటారు. అలసిపోయి అదృశ్యమైపోతారు. మాయతో ఓడిపోయి ఒక్కసారిగా బురదలో పడిపోతారు. మన బుద్ధి పాడవుతూ ఉంటే మాయ ముక్కుతో పట్టుకుందని అర్థము చేసుకోవాలి. స్మృతియాత్రలో చాలా బలముంది. అందులో చాలా సంతోషము నిండి ఉంది. ఖుషీ వంటి ఖురాక్(టానిక్, ఆహారము) లేదని అంటారు కూడా. దుకాణానికి కొనుగోలుదారులు(గ్రాహకులు) వస్తూ ఉంటే సంపాదన అవుతూ ఉంటే వారికి ఎప్పుడూ అలసట అనిపించదు, ఆకలితో మరణించరు. చాలా సంతోషంగా ఉంటారు. మీకు లెక్కలేనంత ధనము లభిస్తుంది. మీకు చాలా సంతోషముండాలి. మా నడవడిక దైవీగా ఉందా లేక ఆసురీగా ఉందా? అని పరిశీలించుకోవాలి. సమయం చాలా కొద్దిగా మాత్రమే ఉంది. అకాలమృత్యువు కూడా చాలా వేగంగా రేస్ వలె జరుగుతోంది. ప్రమాదాలు మొదలైనవి ఎలా జరుగుతున్నవో చూడండి. తమోప్రధాన బుద్ధి గలవారిగా అవుతూ ఉంటారు. వర్షము కుండపోతగా కురుస్తుంది. దానిని కూడా ప్రాకృతిక ఆపద అని అంటారు. మృత్యువు రానే వస్తుంది. అణుబాంబుల యుద్ధము చెలరేగుతుందని కూడా తెలుసు. ఎటువంటి అపాయకరమైన పనులు చేస్తుంటారు! విసిగిస్తే, సతాయిస్తే మళ్లీ యుద్ధము కూడా ప్రారంభమైపోతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మౌలాయి మస్తీ(అపారమైన ఆనందము)లో ఉండి స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి. ఏ విధమైన బంధనములో బంధింపబడరాదు. మాయా ఎలుకతో చాలా చాలా కాపాడుకుంటూ ఉండాలి. మనస్సులో ఎప్పుడూ సైతాని(రావణ) ఆలోచనలు రాకూడదు.
2. తండ్రి ద్వారా లభించే అంతులేని ధనము(జ్ఞాన) యొక్క ఖుషీలో ఉండాలి. ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయ బుద్ధి గలవారిగా అయ్యి అలసిపోరాదు. విద్యార్థి జీవితము సర్వ శ్రేష్ఠ(ది బెస్ట్) జీవితము. కనుక చదువు పై పూర్తి గమనమివ్వాలి.
వరదానము :- '' సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులుగా అయ్యి కార్యములో ఉపయోగించే సదా సంతుష్ట ఆత్మా భవ ''
సంగమ యుగంలో విశేష వరదానం సంతుష్టత(తృప్తి). సంతుష్టతకు బీజం సర్వ ప్రాప్తులు. అసంతుష్టతకు బీజం స్థూల లేక సూక్ష్మమైన అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలలో అప్రాప్తి వస్తువేదీ లేదనే గాయనముంది. పిల్లలందరికి ఒకరి ద్వారా ఒకే విధమైన తరగని ఖజానా లభిస్తుంది. ఆ ప్రాప్తించిన ఖజానాలను కేవలం ప్రతి సమయం కార్యములో ఉపయోగించండి అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. బేహద్ ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకుంటే సదా సంతుష్టంగా ఉంటారు.
స్లోగన్ :- '' ఎక్కడైతే నిశ్చయముంటుందో, అక్కడ విజయమనే భాగ్యరేఖ మస్తకం పై ఉండనే ఉంటుంది ''
No comments:
Post a Comment