Wednesday, November 13, 2019

Telugu Murli 14/11/2019

14-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అయ్యి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది ''

ప్రశ్న :- ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానము రాదు ?
జవాబు :- మేము ఈశ్వరీయ సేవాధారులమని సదా స్మృతి ఉండాలి. సేవకులకు ఎప్పుడూ దేహాభిమానము రాదు. ఎంతెంత యోగములో ఉంటారో అంత దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది.

ప్రశ్న :- దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది ?
జవాబు :- వారి బుద్ధిలో ఈ జ్ఞానము స్థిరపడనే పడదు. ధనవంతులలో ధనము కారణంగా దేహాభిమానము ఉంటుంది కనుక వారు ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకోలేరు, ఇదే వారికి శిక్ష. పేదవారు సహజంగా అర్థము చేసుకుంటారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహానిస్తున్నారు - ''స్మృతి చేస్తే ఇలా(లక్ష్మీ నారాయణుల వలె) తయారౌతారు, సతోప్రధానంగా అయ్యి తమ స్వర్గ రాజ్యములో ప్రవేశిస్తారు.'' ఇది కేవలం మీకు మాత్రమే చెప్పడము కాదు, ఈ సందేశము పూర్తి భారతదేశములోనే కాకుండా విదేశాలకు కూడా అందరి వద్దకు వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారము కూడా అవుతుంది. ఎవరి సాక్షాత్కారము అవ్వాలి? ఇది కూడా బుద్ధితో పని తీసుకోవాలి. తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారము చేయించి - ''రాకుమారునిగా అవ్వాలంటే బ్రహ్మ లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి'' అని చెప్తారు. `యూరోప్‌ వాసులు కూడా వీరిని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యము ఉండేది? ఇది పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇది సహజ రాజయోగము, దీని ద్వారా భారతదేశము స్వర్గంగా అంటే హెవన్‌గా అవుతుంది. విదేశీయులదైనా బుద్ధి కొంచెం బాగుంది. వారు వెంటనే అర్థము చేసుకుంటారు. ఇప్పుడు సేవాధారి పిల్లలు ఏం చేయాలి? వారికే ఆదేశాలను ఇవ్వవలసి పడ్తుంది. పిల్లలు ప్రాచీన రాజయోగము నేర్పించాలి. మీ వద్ద మ్యూజియం, ప్రదర్శినీలు మొదలైన వాటిని చూసేందుకు చాలా మంది వస్తారు. వీరు చాలా మంచి కార్యము చేస్తున్నారని అభిప్రాయము వ్రాస్తారు. కానీ స్వయం అర్థము చేసుకోరు. కొద్దిగా టచ్‌ అవుతూనే వస్తారు, అయినా పేదవారు తమ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు, అర్థము చేసుకునేందుకు పురుషార్థము చేస్తారు. ధనవంతులు పురుషార్థము చేయరు. దేహాభిమానము చాలా ఉంది కదా అంటే డ్రామానుసారము బాబా శిక్షించినట్లే అవుతుంది. అయినా వారి ద్వారా సందేశము వ్యాపింపజేయవలసి ఉంటుంది. విదేశీయులు ఈ జ్ఞానాన్ని ఇష్టపడ్తారు. విని చాలా సంతోషిస్తారు. ప్రభుత్వ అధికారుల కొరకు పిల్లలు చాలా శ్రమ చేస్తారు కాని వారికి సమయమే లభించదు. వారికి భలే ఇంటిలో కూర్చుని ఉండగా సాక్షాత్కారాలు జరిగినా వారి బుద్ధిలో కూర్చోదు. కనుక పిల్లలకు బాబా సలహానిస్తున్నారు - మంచి మంచి అభిప్రాయాలను సేకరించి ఒక మంచి పుస్తకము తయారు చేయండి. చూడండి, ఇంతమందికి ఇది నచ్చిందని మీరు ఇతరులకు చూపించవచ్చు. విదేశీయులు లేక భారతీయులు కూడా సహజ రాజయోగమును తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గ దేవీదేవతల రాజధాని సహజ రాజయోగము ద్వారా భారతదేశమునకు ప్రాప్తమౌతున్నప్పుడు ఈ మ్యూజియాన్ని గవర్నమెంట్‌ హౌస్‌(ప్రభుత్వ భవనము)లో ఎందుకు ఉంచరాదు? అక్కడ సమ్మేళనాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఆలోచనలు పిల్లలలో నడవాలి. అందుకు ఇంకా సమయము పడ్తుంది. ఇంత వేగంగా బుద్ధి మెత్తబడదు. బుద్ధికి గాడ్రెజ్‌ తాళము వేయబడి ఉంది. ఇప్పుడే శబ్ధము వెలువడ్తే తిరుగుబాటు జరుగుతుంది. అవును తప్పకుండా జరుగుతుంది. ప్రభుత్వాధికారులకు, అతిథి గృహము(ప్రభుత్వ భవనము)లో కూడా మ్యూజియం ఉంటే చాలా మంది విదేశీయులు వచ్చి చూస్తారని చెప్పండి. పిల్లలకు తప్పకుండా జయము కలుగుతుంది. కావున ఆలోచించాలి. ఆత్మాభిమానులకే ఇలా ఇలా చేయాలని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. పాపం మనుష్యులంతా తెలుసుకొని తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి. పైసా ఖర్చు లేకుండా,....... అని కూడా మనము వ్రాస్తామని మంచి-మంచి పిల్లలు వచ్చి సలహా ఇస్తారు. కావున ఉపప్రధాని ఉద్ఘాటన చేసేందుకు వస్తారు, తర్వాత ప్రధానమంత్రి, ప్రెసిడెంటు కూడా వస్తారు ఎందుకంటే ఇది అద్భుతమైన జ్ఞానమని వారికి కూడా వెళ్ళి చెప్తారు. సత్యమైన శాంతి ఇలాగే స్థాపనవ్వాలని అనిపిస్తుంది. నచ్చే విధంగా అర్థం చేయించాలి. నేడు కాకుంటే రేపైనా నచ్చుతుంది. గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి అని బాబా చెప్తూ ఉంటారు. పోను పోను వారు కూడా అర్థము చేసుకుంటారు. మనుష్యుల బుద్ధి తమోప్రధానమైనందున ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా తమోప్రధానంగా అవుతూ ఉంటారు.
ఈ వికారీ పనులను మాని తమ ఉన్నతిని చేసుకోండని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. పవిత్ర దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రభుత్వ భవనములో కూడా మ్యూజియం తయారయ్యే రోజు వస్తుంది. ఖర్చులు మేమే భరించుకుంటాము అని చెప్పండి. ప్రభుత్వము ఎప్పుడూ ధనము ఇవ్వదు. మేము మా ధనముతో ప్రతి ప్రభుత్వ భవనములో మా మ్యూజియంను పెట్టగలమని చెప్పండి. ఒక పెద్ద ప్రభుత్వ భవనములో ఇలా జరిగితే తర్వాత అన్నింటిలో అయిపోతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. సమయము నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గమును తెలియచేస్తారని, పైసా ఖర్చు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గమును తెలిపిస్తామని అని చెప్పండి. ఇది ఇక ముందు జరుగుతుంది. బాబా పిల్లల ద్వారానే తెలుపుతారు. స్వయాన్ని మహావీరులమని భావించే మంచి-మంచి పిల్లలనే మాయ పట్టుకునేస్తుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. చాలా జాగరూకతతో ఉండాలి. చిన్న మల్లయుద్ధము కాదు. ఇది అత్యంత పెద్ద మల్ల యుద్ధము. రావణుని జయిరచే యుద్ధ మైదానము. నేను ఇలా సర్వీసు చేస్తాను, ఇది చేస్తాను......... అని కొద్దిగా కూడా దేహాభిమానము రాకూడదు. మనము ఈశ్వరీయ సేవాధారులము. మనము సందేశము ఇవ్వనే ఇవ్వాలి. ఇందులో గుప్త శ్రమ చాలా ఉంది. మీరు జ్ఞాన-యోగాల బలముతో మిమ్ములను మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో గుప్తముగా ఉండి విచార సాగర మథనము చేస్తే నషా పెరుగుతుంది. బేహద్‌ తండ్రి వారసత్వము ప్రతి కల్పములో భారతవాసులకు లభిస్తుంది అని ప్రీతిగా అర్థం చేయించండి. 5 వేల సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడైతే వేశ్యాలయమని అనబడ్తుంది. సత్యయుగము శివాలయము. అది శివబాబా స్థాపన, ఇది రావణుని స్థాపన. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. మేమెలా అయిపోయి ఉంటిమని పిల్లలు ఫీల్‌ చేస్తారు. బాబా తమ సమానంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయము ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేడు మేము వెళ్ళి ఫలానా ప్రధానమంత్రికి అర్థం చేయించాలని, ఆత్మాభిమానులుగా అయ్యి ఆలోచించాలి. వారికి దృష్టినిస్తే సాక్షాత్కారము జరగవచ్చు. మీరు దృష్టినివ్వవచ్చు. దేహీ-అభిమానిగా ఉంటే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చుని, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగము జోడిస్తే బ్యాటరీ నిండగలదు. పేదవారు త్వరగా తమ బ్యాటరీని నింపుకోగలరు ఎందుకంటే తండ్రిని చాలా స్మృతి చేస్తారు. జ్ఞానము బాగుండి యోగము తక్కువైతే బ్యాటరీ నిండదు ఎందుకంటే దేహ అహంకారము చాలా ఉంటుంది. యోగము కొద్దిగా కూడా లేదు. అందుకే జ్ఞాన బాణములో పదును నిండదు. ఖడ్గములో కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గము 10 రూపాయలు, అదే ఖడ్గము 50 రూపాయలు కూడా ఉంటుంది. గురుగోవింద్‌ సింగ్‌ గారి ఖడ్గానికి మహిమ ఉంది. అందులో హింస అను మాటే లేదు. దేవతలు డబుల్‌ అహింసకులు. నేటి భారతదేశము ఇలా ఉంది, రేపటి భారతదేశము ఇలా అవుతుంది. కనుక పిల్లలకు ఎంత ఖుషీ ఉండాలి. నిన్న మనము రావణ రాజ్యములో ఉన్నందున ముక్కులో ప్రాణముండినది(కొన ఊపిరిలో). నేడు మనము పరమపిత పరమాత్ముని జతలో ఉన్నాము.
ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారములో ఉన్నారు. సత్యయుగములో మీరు దైవీ పరివారము వారిగా అవుతారు. ఇప్పుడు స్వయం భగవంతుడు మనలను చదివిస్తున్నారు. మనకు భగవంతుని ప్రీతి ఎంత లభిస్తుంది. అర్ధకల్పము రావణుని ప్రీతి లభించినందున కోతులుగా అయిపోయాము. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రీతి లభించడం వలన మీరు దేవతలుగా అయిపోతారు. 5 వేల సంవత్సరాల విషయము. వారు లక్షల సంవత్సరాలని అనేశారు. ఇతను కూడా మీ వలె పూజారిగా ఉండేవాడు. వృక్షములో చిట్ట చివర నిల్చొని ఉన్నారు. సత్యయుగములో మీ వద్ద అంతులేని ధనముండేది. తర్వాత మీరు తయారు చేసిన మందిరాలలో కూడా ఎంత అపారమైన సంపద ఉండేది, ఆ సంపదనంతా దోచుకున్నారు. మందిరాలు ఇంకా ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటారు. ఇది చాలా మురికి ప్రపంచము. అన్నిటికంటే మురికి ప్రదేశము(సిటి) కలకత్తా. దీనిని పరివర్తన చేసేందుకు పిల్లలైన మీరు శ్రమ చేయాలి. ఎవరు చేస్తారో, వారు పొందుకుంటారు(జో కరేగా, సో పాయేగా). దేహాభిమానము వస్తే పడిపోతారు. 'మన్మనాభవ' కు అర్థము కూడా తెలియదు. కేవలం శ్లోకాలను కంఠాపాఠము చేస్తారు. బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానము ఉండదు. ఇతర ఏ మఠము వారు గాని, మార్గము వారు గాని దేవతలుగా అవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? కల్పక్రితము అయినవారే ఇప్పుడు కూడా అవుతారు. సమయం పడ్తుంది. వృక్షము పెద్దదవుతే వృద్ధి చెందుతూ ఉంటుంది. చీమ మార్గము నుండి విహంగ(ఆకాశ) మార్గమైపోతుంది. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రమును తిప్పండి. మీ బుద్ధిలో పూర్తి 84 జన్మల చక్రముంది. బ్రాహ్మణులైన మీరే మళ్లీ దేవతలుగా, క్షత్రియ వంశస్థులుగా అవుతారు. సూర్యవంశ, చంద్ర వంశముల అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. కష్టపడి అర్థం చేయించవలసి వస్తుంది. అయినా అర్థము చేసుకోకుంటే వారు వచ్చే సమయము ఇంకా అవ్వలేదని గ్రహించాలి. ఎంతగా అర్థం చేయించినా వారు రారు. తర్వాత అయినా తప్పకుండా వస్తారు. బ్రహ్మకుమారీల పేరు బయట ప్రపంచములో ఇలా ఉందని భావిస్తారు, లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారని అంటారు. వీరు మనుష్యమాత్రుల స్వభావాలను(క్యారెక్టర్లను) చక్కబరుస్తారు. దేవతల స్వభావము ఎలా ఉంటుందో చూడండి. సంపూర్ణ నిర్వికారి,......... తండి చెప్తున్నారు -''కామము మహాశతువ్రు.'' ఈ పంచ భూతాల వల్లనే మీ స్వభావము చెడిపోయింది. అర్థం చేయించినప్పుడు మాత్రము మంచిగా అవుతారు, వెలుపలకు వెళ్లగానే అంతా మర్చిపోతారు. ఎంతగా(నూరు నూరుసార్లు) శృంగారించినా......... మురికిలోనే పడ్తుంది అని అంటారు. ఈ బాబా తిట్టరు, అర్థము చేయిస్తారు. దైవీ నడవడికలు కలిగి ఉండండి, కోపానికి వశులై ఎందుకు మొరుగుతారు! స్వర్గములో క్రోధముండదు. ఎదురుగా తండ్రి ఏం అర్థం చేయించినా ఎప్పుడూ కోపము వచ్చేది కాదు. తండ్రి అంతా రిఫైన్‌ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారము నడుస్తూ ఉంటుంది. డ్రామాలో ఏ దోషము(తప్పు) లేదు. ఇది అనాది, అవినాశిగా తయారైనది. ఏదైతే మంచిగా జరిగిందో అది 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ జరుగుతుంది. విరిగి పడి ఉన్న ఈ పర్వతము మళ్లీ ఎలా తయారవుతుందిదని కొంతమంది అడుగుతారు. నాటకము(సినిమా) చూస్తారు కదా, భవనము విరిగిపోతుంది, నాటకము రిపీట్‌ అయినప్పుడు మళ్లీ అదే భవనాన్ని చూస్తారు. అదే విధంగా ఈ నాటకము కూడా ఉన్నదున్నట్లు పునరావృతము అవుతూ ఉంటుంది. అర్థం చేయించే బుద్ధి ఉండాలి. కొంతమంది బుద్ధిలో నిలవడం చాలా కష్టము. ప్రపంచ చరిత్ర - భూగోళాలు కదా. రామరాజ్యములో ఈ దేవీదేవతల రాజ్యముండేది. వారిని మీరు పూజిస్తూ ఉండేవారు. మీరే పూజ్యులు, మీరే పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. హమ్‌ సో అర్థమును కూడా పిల్లలకు తెలిపించారు. మనమే దేవతలము, మనమే క్షత్రియులము........ ఇది పల్టీలాట(బాజోలీ, పిల్లిమొగ్గల) కదా. దీనిని బాగా అర్థము చేసుకోవాలి, ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారాలు మానేయమని బాబా చెప్పరు. కేవలం సతోప్రధానంగా తయారవ్వాలి, చరిత్ర-భూగోళముల రహస్యము అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించండి. ముఖ్యమైనది ''మన్మనాభవ.'' స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. స్మృతియాత్ర నంబరువన్‌. నేను పిల్లలందరినీ నా జతలో తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే మనుష్యులుంటారు. కలియుగములో లెక్కలేనంతమంది మనుష్యులున్నారు. అందరినీ ఎవరు వాపసు తీసుకెళ్తారు. ఇంత పెద్ద అడవినంతా ఎవరు శుభ్రము చేశారు? తోట యజమాని, నావికుడని తండ్రినే అంటారు. వారే దు:ఖము నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకెళ్తారు. చదువు ఎంతో మధురమనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానము సంపాదనకు మూలము. మీకు తరగనంత(కారూన్‌ కా) ఖజానా లభిస్తుంది. భక్తిమార్గములో కొంచెము కూడా లభించదు. ఇక్కడ పాదాలు పట్టుకునే మాటే లేదు. వారు గురువుల ముందు సాష్ట్రాంగ నమస్కారము చేస్తారు. తండ్రి దీని నుండి విడిపిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. వారు మన తండ్రి అని అర్థము చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుందనే ఖుషీ ఉంటుంది. మేము ధనవంతుల వద్దకు వెళ్తే పేదవారమని సిగ్గుపడేవారమని పిల్లలు వ్రాస్తారు. పేదవారైతే ఇంకా మంచిదని తండ్రి చెప్తారు. మీరు ధనవంతులుగా ఉండి ఉంటే ఇక్కడకు వచ్చేవారే కాదు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందినవారము, స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు, వారి ప్రేమ మాకు లభిస్తున్నది, ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతామనే ఖుషీ లేక నషాలో సదా ఉండండి.
2. తయారైన ఈ డ్రామాను కరెక్ట్‌గా అర్థము చేసుకోవాలి. ఇందులో ఎలాంటి తప్పు ఉండేందుకు వీలు లేదు. ఇప్పుడు ఏ నటన జరుగుతూ ఉందో అది మళ్లీ పునరావృతము అవుతుంది. ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థము చేసుకొని నడుచుకుంటే ఎప్పుడూ కోపము రాదు.

వరదానము :- '' శ్రేష్ఠమైన జ్ఞాన ఖజానాలను మహాదానులుగా అయ్యి దానం చేసే మాస్టర్‌ జ్ఞానసాగర్‌ భవ ''
ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరులో, అలా మీరు మాస్టర్‌ జ్ఞానసాగరులుగా అయ్యి ఇతరులకు సదా జ్ఞాన దానము చేస్తూ ఉండండి. పిల్లలైన మీ వద్ద ఎంతో శ్రేష్ఠమైన జ్ఞాన ఖజానా ఉంది. ఆ ఖజానాతో భర్‌పూర్‌గా(నిండుగా) అయ్యి యోగ అనుభవాల ద్వారా ఇతరులకు సేవ చేయండి. ఏ ఏ ఖజానాలు లభించాయో, మహాదానులుగా అయ్యి వాటిని దానం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలను ఎంతెంత దానం చేస్తారో, అంత ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. మహాదానులుగా అవ్వడం అనగా ఇవ్వడం కాదు, ఇంకా నింపుకోవడం.

స్లోగన్‌ :- '' జీవన్ముక్తితో పాటు దేహము నుండి అతీతంగా అవ్వడమే పురుషార్థంలో చివరి స్థితి ''

No comments:

Post a Comment