Wednesday, November 20, 2019

Telugu Murli 21/11/2019

21-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - కుమారుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు ( సన్‌ షోస్‌ ఫాదర్‌ ). మనుష్యుల మతమును (మన్మతాన్ని) వదిలి శ్రీమతముననుసరిస్తే తండ్రిని ప్రత్యక్షము చేయగలరు ''

ప్రశ్న :- ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు ?
జవాబు :- ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో, వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు, రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యము ఉంటుంది. చదువును పోగొట్టుకోవడం(మిస్‌ చేయడం), సంశయపడడం అనగా ఆంతరికములో ఏదో కొంత అసత్యముంటుంది. వారిని మాయ ఎర్రగా వాచిపోయేలా చెంప దెబ్బ వేస్తుంది.

ప్రశ్న :- ఎటువంటి పిల్లలను మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది ?
జవాబు :- మాయావి సౌందర్యము వైపు ఆకర్షితమయ్యే వారిని మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది. కానీ శ్రీమతమునును అనుసరించే పిల్లలు ఆకర్షింపబడరు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలైన మమ్ములను ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలు నిశ్చయము చేసుకున్నారు. వారి కొరకే ఆత్మలు, పరమాత్మ చాలాకాలము నుండి వేరుగా ఉన్నారు,..........(ఆత్మా పరమాత్మ అలగ్‌ రహే బహుకాల్‌..........) అనే గాయనముంది. మూలవతనములో వేరుగా ఉండరు. అక్కడైతే అందరూ కలిసే ఉంటారు. వేరుగా ఉంటారంటే, అక్కడ నుండి విడిపోయి ఇక్కడకు తప్పకుండా వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. సతోప్రధానము నుండి దిగజారుతూ దిగజారుతూ తమోప్రధానంగా అవుతారు. ''ఓ పతితపావనా! వచ్చి మమ్ములను పావనం చేయండి'' అని పిలుస్తారు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ సృష్టి చక్రమే 5 వేల సంవత్సరాలది. ఇంతకు ముందు మీకు ఈ విషయం తెలియదు. శివబాబా తెలియజేస్తున్నారంటే ఏదో ఒక శరీరము ద్వారానే తెలియజేస్తారు. పై నుండి ఎవ్వరూ శబ్ధము చేయరు, మాట్లాడరు. శక్తి గానీ, ప్రేరణ గానీ కాదు. ఆత్మలైన మీరు కూడా శరీరములోకి వచ్చిన తర్వాతనే మాట్లాడ్తారు. అదే విధంగా నేను కూడా శరీరములో ప్రవేశించిన తర్వాతనే శరీరము ద్వారా ఆదేశమిస్తానని తండ్రి చెప్తున్నారు. ఎవరెంత తండ్రిని అనుసరిస్తారో అంత వారి కళ్యాణము వారే చేసుకుంటారు. శ్రీమతముననుసరించనీ, అనుసరించకపోనీ, టీచరు మాటలు విననీ, వినకపోనీ, కళ్యాణము చేసుకోవడం, అకళ్యాణం చేసుకోవడం పిల్లల పైనే ఆధారపడి ఉంది. చదవకపోతే తప్పకుండా ఫెయిల్‌ అవుతారు. అంతేకాక శివబాబా నుండి నేర్చుకొని ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేయిస్తారు. తండి పిల్లలను పత్య్రక్షము చేస్తున్నారు. ఇది శారీరిక తండ్రిని గురించి కాదు. వీరు ఆత్మిక తండ్రి. మనమెంత బాగా శ్రీమతముననుసరిస్తామో అంత వారసత్వము పొందుతామని కూడా మీకు తెలుసు. పూర్తిగా అనుసరించేవారు, ఉన్నత పదవిని పొందుతారు. అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యములో మీ పై పాప భారము చాలా ఎక్కువగా ఉంది. వికారాల వశమైనందునే పాపాత్మలుగా అవుతారు. పాపాత్మలు, పుణ్యాత్మలు తప్పకుండా ఉంటారు.
పుణ్యాత్మల ముందు పాపాత్మలు తల వంచి నమస్కరిస్తారు. పుణ్యాత్మలుగా ఉండే దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాపాత్మలుగా అవుతారని మానవులకు తెలియదు. దేవతలు సదా పుణ్యాత్మలుగానే ఉంటారని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానము వరకు వస్తారు. పూర్తి పాపాత్మలుగా
అయినప్పుడు మళ్ళీ తండ్రిని పిలుస్తారు. పుణ్యాత్మలుగా ఉన్నప్పుడు స్మృతి చేసే అవసరమే ఉండదు. కనుక సేవ చేయాలని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తండ్రి వెళ్ళి అందరికీ వినిపించరు. సేవ చేసేందుకు యోగ్యులుగా అయితే పిల్లలే వెళ్ళాలి. మానవులు రోజురోజుకు అసురులుగా అవుతూ ఉంటారు. తెలియనందున మానవులు వ్యర్థ ప్రలాపాలు చేసేందుకు(వాగుటకు) కూడా ఆలస్యము
చేయరు. గీతా భగవానుడు కృష్ణుడని మనుష్యులంటారు. కృష్ణుడు దేహధారి అని, అతడిని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు. కృష్ణుని తండ్ర్రి అని పిలువరు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మల తండ్రి ఇతరులెవ్వరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా చెప్తున్నారు - నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మ శారీరిక తండ్రి అవుతాడు. చాలా బాగా అర్థం చేయిస్తారు. కొంతమంది పూర్తిగా అర్థము చేసుకోనందున వక్ర మార్గములో(వ్యతిరేక, ఉల్టా) అడివిలోకి వెళ్ళిపోతారు. తండ్రి ఏమో స్వర్గంలోకి వెళ్లి మార్గమును చూపిస్తారు. అయినా అడవి వైపే వెళ్ళిపోతారు. అడవి వైపు తీసుకెళ్లేవాడు రావణుడని తండ్రి తెలియజేస్తున్నారు. మీరు మాయతో ఓడిపోతారు. మార్గము మర్చిపోయినందున అడవికి వెళ్ళి మీరు కూడా అడవి ముళ్ళుగా అవుతారు. వారు మళ్లీ స్వర్గానికి ఆలస్యంగా వస్తారు. మీరు స్వర్గములోకి వచ్చే పురుషార్థము చేసేందుకు ఇక్కడకు వచ్చారు. త్రేతా యుగమును కూడా స్వర్గమని అనరు. 25 శాతము తగ్గిపోతుంది కదా. వారు ఫెయిల్‌ అయిన వారి క్రింద లెక్కింపబడ్తారు. మీరు
ఇక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు వచ్చారు. త్రేతా యుగమును నూతన ప్రపంచమని అనరు. పాస్‌ కాని వారు అక్కడకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్గమును కరెక్టుగా పట్టుకోరు. హెచ్చు-తగ్గులవుతూ ఉంటారు. ఎంత స్మృతి ఉండాలో అంత లేదని మీరు అనుభవము చేస్తారు. స్వర్గవాసులుగా అయ్యేవారిని బాగా పాస్‌ అయ్యారని అంటారు. త్రేతా యుగములోని వారు పాస్‌ కాని వారి క్రింద లెక్కింపబడ్తారు. మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు లేకుంటే
పాస్‌ అవ్వలేదని అంటారు. ఆ చదువులో అయితే రెండవసారి చదువుతారు. ఇందులో రెండవసారి చదివే మాటే లేదు. కల్పక్రితము పాస్‌ అయినవారే, జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పము పరీక్షలో పాస్‌ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థము చేసుకోవాలి. మేము నడవలేము, మా వల్లకాదని కొందరు భావిస్తారు. ముసలివారైతే వారిని చేయి పట్టుకుని నడిపిస్తే నడుస్తారు. లేకుంటే క్రింద పడిపోతారు. కానీ అదృష్టములో లేకుంటే పుష్పాలుగా తయారు చేయాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా తయారు కారు. జిల్లేడు పూలు కూడా ఉన్నాయి. ముళ్ళు అయితే గ్రుచ్చుకుంటాయి. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. నిన్నటి వరకు ఏ శివుని మీరు పూజించేవారో ఆ శివుడే ఈ రోజు మిమ్ములను చదివిస్తున్నారు. ప్రతి మాటలో పురుషార్థము చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వబడ్తుంది. మాయ మంచి-మంచి పుష్పాలను(పిల్లలను) కూడా కింద పడేయడం చూస్తున్నారు. ఎముక-ఎముక విరిచేస్తుంది (సంబంధమును తుంచేస్తుంది). వారిని ద్రోహులని అంటారు. ఒక రాజధాని(పార్టీ)ని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులని అంటారు. తండ్రి కూడా అంటున్నారు - నా వారిగా అయ్యి మళ్లీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే. వారి నడవడికలే అలా(ద్రోహులు) అయిపోతాయి. ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. మాయ
చాలా శక్తివంతమైనదని తనవైపు ఆకర్షిస్తుందని పిల్లలు చెప్తారు. మాయ అయస్కాంతము వలె ఉంది. ఇప్పుడది అయస్కాంత రూపమును ధరిస్తుంది. ప్రపంచములో ఎంత సౌందర్యము పెరిగిపోయింది. ఇంతకుముందు ఈ సినిమాలు వగైరా లేవు. ఇవన్నీ గత 100 సంవత్సరాల నుండే వెలిశాయి. బాబా అనుభవశాలి కదా. పిల్లలు ఈ డ్రామాలోని నిగూఢ రహస్యమును బాగా అర్థము చేసుకోవాలి. ప్రతి విషయం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంది. గడిచిన 100 సంవత్సరాల నుండి ఈ ప్రపంచము అపొజిషన్‌ కొరకు మాయావి స్వర్గంగా తయారయ్యింది. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు స్వర్గము వేగంగా తయారవ్వాలి. సైన్సు కూడా చాలా ఉపయోగపడ్తుంది. ఇది చాలా సుఖమునిచ్చేది కూడా. ఈ సుఖము స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి. సత్యయుగ సుఖము కేవలము భారతదేశపు భాగ్యములో మాత్రమే ఉంది. వారంతా భక్తిమార్గము ప్రారంభమైన తర్వాతనే వస్తారు. భారతవాసులు క్రిందపడిన(పతితులైన) తర్వాతనే ఇతర ధర్మాలవారు నంబరువారుగా వస్తారు. భారతదేశము దిగజారుతూ దిగజారుతూ ఒక్కసారిగా క్రింద పడిపోతుంది. మళ్లీ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా పైకి ఎక్కుతారు మళ్లీ క్రింద పడ్తారు. ఎంతగా దిగజారుతారో చెప్పలేము - అడగవద్దు. తండ్రి మమ్ములను చదివిస్తున్నాడంటే కొంతమంది అంగీకరించరు. నమ్మనే నమ్మరు.
మంచి-మంచి సేవాధారులని తండి ఎవరినైతే మహిమ చేస్తారో వారు కూడా మాయ పంజా(పిడికిలి)లోకి వచ్చేస్తారు. కుస్తీ పోటీ జరుగుతుంది కదా. మాయ కూడా అలాగే యుద్ధము చేస్తుంది. ఒక్క దెబ్బలో పూర్తిగా కింద పడేస్తుంది. పోను పోను పిల్లలైన మీకు అర్థమౌతూ ఉంటుంది. మాయ ఒక్కసారిగా పూర్తిగా కింద పడేస్తుంది. అయినా బాబా చెప్తున్నారు - ఒక్కసారి జ్ఞానము విన్నా తప్పకుండా స్వర్గములోకి వస్తారు. కానీ పదవి పొందుకోలేరు కదా. కల్ప క్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో లేక పురుషార్థము చేస్తూ చేస్తూ కిందపడ్డారో, అదే విధంగా ఇప్పుడు కూడా కిందపడుతూ, లేస్తూ ఉంటారు. గెలుపు-ఓటములుంటాయి కదా. అంతా పిల్లల స్మృతి పైననే ఆధారపడి ఉంది. పిల్లలకు ఈ తరగని అవినాశి ఖజానా లభిస్తుంది. వారైతే లక్షల రూపాయలకు దివాలా తీస్తారు. కొంతమంది లక్షాధికారులైన ధనవంతులుగా అవుతారు. అది కూడా కేవలం ఒక్క జన్మకే. మరుసటి జన్మలో అంత ధనముండదు. కర్మభోగము కూడా చాలా ఉంది. అక్కడ స్వర్గములో అయితే కర్మభోగమనే మాటే ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మలకు ఎంతో సంపాదన జమ చేసుకుంటున్నారు. పూర్తిగా పురుషార్థము చేయువారు పూర్తిగా స్వర్గ వారసత్వమును పొందుకుంటారు. మేము స్వర్గ వారసత్వము తప్పకుండా పొందుతామని బుద్ధిలో ఉండాలి. మళ్లీ క్రింద పడిపోతామని అనుకోరాదు. ఇతడు అందరికంటే ఎక్కువగా క్రిందపడ్డాడు. ఇప్పుడు మళ్లీ పైకి ఎక్కే తీరాలి. స్వతహాగా పురుషార్థము కూడా జరుగుతూ ఉంటుంది. మాయ ఎంత ప్రబలమైనదో గమనించమని అర్థం చేయిస్తూ ఉంటారు. మానవులలో పూర్తిగా అజ్ఞానము నిండుకొని ఉంది. అజ్ఞాన కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అంటారు. భారతదేశమెంతో ఫస్ట్‌క్లాస్‌గా ఉండేది. మనమిలా(దేవతలుగా) ఉండేవారమని, మళ్లీ అలాగే అవుతున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ దేవతలకు ఎంత మహిమ ఉందో తెలియదు. ఇప్పుడు జ్ఞానసాగరులైన బేహద్‌ తండ్రి వచ్చి మమ్ములను చదివిస్తున్నారని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అయినా మాయ చాలామందిని సంశయములోకి తెస్తుంది. అసత్యాన్ని, కపటాన్ని వదిలిపెట్టరు. అందువలన తండి చెప్తున్నారు - మీ చార్టును సత్య సత్యంగా వ్రాయండి. కానీ దేహాభిమానము వలన సత్యము తెలపరు. కనుక ఇది కూడా వికర్మగా అవుతుంది.సత్యము తెలపాలి కదా లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భజైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి. మళ్లీ ఇటువంటి పని చేయనని తోబా-తోబా (ప్రమాణము) అంటూ ఒట్టు వేసుకుని, లెంపలేసుకుని పశ్చాత్తాప పడ్తారు. ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా ఇలా క్షమాపణ అడుగుతారు కదా. శిక్షలు లభించినప్పుడు కూడా అలాగే పశ్చాత్తాపపడ్తారు. మాయా రాజ్యము ఎప్పటి నుండి మొదలయ్యిందో పిల్లలైన మీకు తెలుసు. పాపము చేస్తూ ఉంటారు. పిల్లలు ఇంత(లక్ష్మీనారాయణులు) మధురాతి మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారవ్వడం లేదని తండ్రి గమనిస్తున్నారు. తండ్రి ఎంత సున్నితమైనవారు! చిన్న పిల్లల వలె ఎంతో ములాయంగా నడుస్తున్నారు. ఎందుకంటే డ్రామానుసారము నడుస్తూ ఉంటారు. జరిగిపోయినదంతా డ్రామాలో నిశ్చయింపబడిందని అంటారు. ఇక ముందు అలా జరగరాదని అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా. దాదా మతము దాదాది, ఈశ్వరుని మతము ఈశ్వరునిది. మనకు మతము(సలహా) ఇచ్చిందెవరో అర్థం చేసుకోవాలి. ఇతడు కూడా తండ్రే కదా. తండ్రి మాటేమో వినాలి కదా. బాబా ఏమో పెద్ద(గొప్ప) బాబా కదా. అందుకే ఈ బాబా - శివబాబా చెప్తున్నారనే
భావించమంటున్నారు. అలా భావించకుంటే పదవి కూడా పొందలేరు. డ్రామా ప్లాను అనుసారము తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతము లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే మహావీరులు, పహిల్వానులతో కూడా ఏదో ఒక వికర్మ, వ్యతిరేక కర్మ చేయిస్తుంది. తండ్రి శ్రీమతమును అనుసరించలేదని అర్థమైపోతుంది. నేను నా ఆసురీ మతము అనుసారముగా నడుస్తున్నానని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. శ్రీమతమును ఇచ్చేవారే ఇక్కడ వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతము. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఒకవేళ అటువంటి మతము లభించినా, సరి చేసేందుకు నేను కూర్చొని ఉన్నాను. అయినా నేను రథము తీసుకున్నాను కదా. నేను రథము తీసుకున్నప్పుడే ఇతడు తిట్లు తిన్నాడు. లేకుంటే మునుపెప్పుడూ ఇతడు తిట్లు తినలేదు. నా
కారణంగా ఎన్నో తిట్లు తింటున్నాడు. అందువలన ఇతడిని కూడా సంభాళించాల్సి వస్తుంది(ఓదార్చాలి). తండి తప్పకుండా రక్షిస్తారు. తండి పిల్లలను రక్షిస్తారు కదా. ఎంత సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది. అసత్యంగా ఉన్నవారికి రక్షణ జరగదు. వారికి ఇంకా ఎక్కువ శిక్షలు స్థిరపడ్తాయి. అందుకే తండి అర్థం చేయిస్తున్నారు - మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి సమాప్తము చేసేస్తుంది. పిల్లలు స్వయంగా మాయ తినేసినట్లు అనుభవం చేస్తారు. తర్వాత చదువు మానేస్తారు. తండ్రి చెప్తున్నారు - తప్పకుండా చదువుకోండి, చదివి తీరాలి. మంచిది. అయితే ఎక్కడ ఎవరిది దోషము? ఇందులో ఎవరు ఎలా చేస్తారో, భవిష్యత్తులో వారు అంతే పొందుతారు. ఎందుకంటే ఈ ప్రపంచము ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది. మాయ ఎర్రగా వాచిపోయేటట్లు చెంపదెబ్బ వేస్తుంది. అప్పుడు ఈ ఖుషీ ఉండదు. తర్వాత ''బాబా ఏమయిందో, ఏమో తెలియదని మొరపెట్టుకుంటూ బిగ్గరగా అరుస్తారు. యుద్ధ మైదానములో, ఎవరూ దెబ్బలు కొట్టకుండా, క్రింద పడిపోకుండా జాగరూకతలో ఉండాలి. ఎక్కువ శక్తి కలిగినవారు అవతలి వారిని క్రింద పడేస్తారు. మళ్లీ రెండవ రోజు యుద్ధము ప్రకటిస్తారు. మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. క్రింద-మీద అవుతూనే ఉంటుంది. చాలామంది సత్యము తెలపరు. బాబా ఏమంటారో, అగౌరవము పాలవుతామని భయపడ్తారు. ఎంతవరకు సత్యము చెప్పరో అంతవరకు ముందుకు వెళ్లలేరు. సత్యము చేప్తేనే ఉన్నతమౌతారు. లోలోపల గ్రుచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా వృద్ధి చెందుతుంది. వారంతకు వారు సత్యము ఎప్పుడూ చెప్పనే చెప్పరు. ఎక్కడైనా ఇద్దరుంటే, వీరు బాబాకు వినిపిస్తే అప్పుడు నేను కూడా వినిపిస్తానని అనుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి అదృష్టములో అంత ఉన్నతపదవి లేకుంటే సర్జన్‌ వద్ద దాచిపెడ్తారని అర్థం చేసుకోబడ్తుంది. దాచిపెడ్తే వ్యాధి నయము కాదు. ముదురుతూ పోతుంది. ఎంత దాచి పెడ్తారో అంత క్రింద పడిపోతూనే ఉంటారు. భూతాలేమో అందరిలో ఉన్నాయి కదా. ఎంతవరకు కర్మాతీత స్థితి తయారవ్వదో అంతవరకు చెడు దృష్టి కూడా వదలదు. అన్నింటికంటే పెద్ద శత్రువు కామము. చాలామంది క్రింద పడిపోతారు. శివబాబాను తప్ప ఏ ఇతర దేహాధారిని స్మృతి చేయవద్దని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పక్కాగా ఉన్నారంటే శివబాబా తప్ప వారికెవ్వరూ గుర్తుకే రారు. పతివ్రతా స్త్రీకి ఎప్పుడూ చెడు బుద్ధి(దుర్బుద్ధి) ఉండదు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనలను చదివించేవారు స్వయం జ్ఞానసాగరులు, అనంతమైన తండ్రి. ఇందులో ఎప్పుడూ సంశయము రాకూడదు. అసత్యము, కపటము(మోసము) వదిలి సత్య-సత్యమైన చార్టును ఉంచాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వరాదు.
2. డ్రామాను బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారై ఉండాలి. ఎప్పుడూ అహంకారాన్ని చూపించరాదు. మీ మతమును వదిలి తండ్రి మతమునే అనుసరించాలి.

వరదానము :- '' సాథీని (బాబాను) సదా జతలో ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసుకునే కంబైండ్‌ రూపధారీ భవ ''
సదా ''ఆప్‌ ఔర్‌ బాప్‌''(మీరు మరియు తండ్రి) ఇలా ఎవ్వరూ వేరు చేయలేని కంబైండ్‌ రూపంగా ఉండండి. ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించకండి. అవినాశి తోడును నిభాయించే బాప్‌దాదా మీఅందరికి తోడుగా ఉన్నారు. 'బాబా' అని అంటూనే బాబా హాజరైపోతారు. మనము బాబాకు చెందినవారము, బాబా మనవారు. ప్రతి సేవలో బాబా సహయోగమిచ్చేవారు. కేవలం మీ కంబైండుస్వరూపము యొక్క ఆత్మిక నశాలో ఉండండి.

స్లోగన్‌ :- '' సేవ మరియు స్వ ఉన్నతి రెండిటి బ్యాలన్స్‌ ఉంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది ''

No comments:

Post a Comment