Wednesday, November 6, 2019

Telugu Murli 07/11/2019

07-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీకు ఆత్మిక నైపుణ్యము(కళను)ను నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఆ టెక్నిక్‌ ద్వారా మీరు సూర్య - చంద్రులను కూడా దాటుకొని పరంధామానికి వెళ్తారు ''

ప్రశ్న :- సైన్సు దర్పానికి(గర్వము), శాంతి దర్పానికి గల వ్యత్యాసమేది ?
జవాబు :- సైన్సు గర్విష్టులు చంద్రుడు, నక్షత్రాల పైకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు. శరీరాన్ని కూడా కష్టము(రిస్క్‌)తో తీసుకెళ్తారు. వారికి రాకెట్‌ ఎక్కడ ఫెయిల్‌ అవుతుందోనని భయముంటుంది. పిల్లలైన మీరు శాంతి గర్వస్థులు, చిల్లిగవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య-చంద్రులను కూడా దాటుకొని మూలవతనానికి వెళ్లిపోతారు. మీకు ఏ భయమూ లేదు, ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సైన్సువారు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నము చేస్తూ ఉన్నారని పిల్లలు వింటూనే ఉంటారు. కానీ వారు కేవలం చంద్రుని వరకు మాత్రమే వెళ్లేందుకు ప్రయత్నము చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తున్నారు. పైకి వెళ్లడంలో చాలా భయముంటుంది. మేమెక్కడి నివాసులమని మీరే ఆలోచించండి. వారైతే చంద్రుని వైపు వెళ్తారు. మీరు సూర్య-చంద్రుల కంటే దూరంగా మూలవతనానికి వెళ్తారు. పైకి వెళ్లి వస్తే వారికి చాలా పైకము లభిస్తుంది. పైన ప్రదక్షిణాలు చేసి వస్తే వారికి లక్షల బహుమతులు లభిస్తాయి. శరీరమును రిస్క్‌ తీసుకు వెళ్తారు. వారు సైన్సు గర్విష్టులు. మీ వద్ద సైలెన్స్‌ గర్వముంది. ఆత్మలైన మనము మన శాంతిధామానికి బ్రహ్మాండములోకి వెళ్తామని మీకు తెలుసు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. వారి ఆత్మలు కూడా వారి శరీరాలతో పాటు పైకి వెళ్తాయి. చాలా అపాయకరము. భయపడ్తారు కూడా. పై నుండి క్రింద పడ్తే ప్రాణము పోతుంది. అవన్నీ భౌతికమైన కళలు. మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తారు. ఈ కళ నేర్చుకుంటే మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. 21 జన్మలకు నంబరువారు పురుషార్థానుసారము బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడ్తోంది కదా. ఈ తండ్రి మీకు బహుమతినిస్తారు. అంతేకాక ఇంకా ఏం నేర్పిస్తారు? మిమ్ములను మీ ఇంటికి అత్యంత పైకి తీసుకెళ్తారు. మన ఇల్లు ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు గుర్తు వస్తోంది కదా. అంతేకాక మనము పోగొట్టుకున్న రాజ్యము కూడా జ్ఞాపకమొస్తోంది కదా. అదెక్కడ ఉంది? రావణుడు లాక్కున్నాడు. ఇప్పుడు మళ్లీ మనము మన అసలు ఇంటికి కూడా వెళ్తాము. అంతేకాక రాజ్యము కూడా పొందుకుంటాము. మన ఇల్లు ముక్తిధామము, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడ నుండి వస్తున్నారో చూడండి. ఎంత దూరము నుండి వస్తున్నారు? ఆత్మ కూడా రాకెట్టే. వారు పైకి పోయి చంద్రునిలో ఏముందో, నక్షత్రాలలో ఏముందో చూడాలనుకుంటారు. కానీ ఇవన్నీ ఈ నాటకరంగానికి కాంతినిచ్చే లైట్లు(బత్తీలు) అని పిల్లలైన మీకు తెలుసు. స్టేజికి లైట్లు వేసినట్లు ఇవి లైట్లు మాత్రమే. మ్యూజియంలో కూడా మీరు సీరియల్‌ సెట్లు వేస్తారు కదా. ఇదేమో అనంతమైన ప్రపంచము. ఇందులో ఈ సూర్య-చంద్రులు- నక్షత్రాలు కాంతినిచ్చేవి. మానవులు ఈ సూర్య-చంద్రులను దేవతలని భావిస్తారు. కానీ అవి దేవతలు కానే కాదు. ఆ తండ్రి వచ్చి మానవులైన మనలను దేవతలుగా ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు జ్ఞాన సూర్యులు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన అదృష్ట నక్షత్రాలు(లక్కీ సితారే). జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతోంది. మీరు ఎంత దూర-దూరాలకు వెళ్తారు? ఆ తండి వచ్చి ఇంటికి వెళ్లే మార్గమును చూపిస్తున్నారు. తండి తప్ప మరెవ్వరూ వాపస్‌ ఇంటికి తీసుకు వెళ్లలేరు. తండి వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మలైన మనము పవిత్రమ్రైనప్పుడు మాత్రమే మన ఇంటికి వెళ్లగలమని కూడా తెలుసుకున్నారు. యోగబలము ద్వారా లేక శిక్షలను అనుభవించి పవిత్రులుగా అవ్వాలి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో మీరు అంత పావనమౌతారని తండి అర్థం చేయిస్తున్నారు. స్మృతి చేయకుంటే పతితులుగానే ఉండిపోతారు. ఆ తర్వాత చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. మీరు ఈ విధంగా ఇంటికి వెళ్లగలరని ఆ తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మాండమనగా ఏమిటో, సూక్ష్మవతనమంటే ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. విద్యార్థులకు మొదట తెలియనే తెలియదు. చదవడం మొదలైనప్పటి నుండి జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము కూడా కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉంటుంది. ఐ.సి.ఎస్‌ పరీక్ష వ్రాసినవారిని జ్ఞానసంపన్నులు(నాలెడ్జ్‌ఫుల్‌) అని అంటారు. ఇంతకంటే గొప్ప జ్ఞానమేదీ ఉండదు. ఇప్పుడు మీరు కూడా ఎంతో ఉన్నతమైన జ్ఞానమును నేర్చుకుంటున్నారు. ఆ తండ్రి మీకు పవిత్రంగా అయ్యేందుకు పిల్లలూ! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని పావనమయ్యే యుక్తులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. పైన మన ఇంటిలో పావనంగా ఉండేవారు. మీరు సత్యయుగములో జీవనముక్తిలో ఉన్నప్పుడు, మిగిలినవారంతా ముక్తిధామములో ఉంటారు. ముక్తిధామమును, జీవన్ముక్తిధామమును రెండింటినీ శివాలయమని అనవచ్చు. ముక్తిలో శివబాబా కూడా ఉంటారు. పిల్లలమైన మనము(ఆత్మలము) కూడా ఉంటాము. ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మ జ్ఞానము. వారేమో మేము చంద్రుని పైకి వెళ్లి నివసిస్తామని అంటారు. దానికై ఎంతగానో తలలు బాదుకుంటున్నారు. సాహసము చూపిస్తారు. లక్షల మైళ్లు పైకి వెళ్లినా వారి ఆశలు నెరవేరవు. కాని మీ ఆశలు పూర్తి అవుతాయి. వారిది అసత్యమైన శారీరిక గర్వము. మీది ఆత్మిక గర్వము. వారు మాయావి సాహసాన్ని ఎంతో చూపిస్తారు. అందుకు మానవులు సంతోషముతో, చప్పట్లతో అభినందనలు తెలుపుతారు. చాలా ఎక్కువగా పారితోషకము కూడా లభిస్తుంది. లభిస్తే 5-10 కోట్లు లభించవచ్చు. కానీ వారికి లభించిన ధనమంతా సమాప్తమౌతుందని, వినాశి ధనమని పిల్లలైన మీకు తెలుసు. మిగిలింది చాలా కొద్ది సమయమేనని అర్థం చేసుకోండి. ఈ రోజు ఏముంది? రేపేమౌతుంది? ఈ రోజు మీరు నరకవాసులు, రేపు స్వర్గవాసులుగా అవుతారు. సమయము ఎక్కువగా పట్టదు. వారిది శారీరికమైన భౌతిక శక్తి. మీది ఆత్మిక శక్తి. దీనిని గురించి మీకు మాత్రమే తెలుసు. శారీరిక శక్తితో వారెంత దూరము వెళ్తారు? చంద్రుడు, నక్షత్రాల వరకు వెళ్తారు. యుద్ధము ప్రారంభమైపోతుంది. తర్వాత అవన్నీ సమాప్తమైపోతాయి. వారి కళలు ఇక్కడి వరకే సమాప్తమైపోతాయి. వారిది శారీరిక శక్తిలో అత్యంత పెద్దది. మీది అత్యంత ఉన్నతమైన ఆత్మిక శక్తి. మీరు శాంతిధామములోకి వెళ్తారు. దాని పేరే మధురమైన గృహము(స్వీట్‌ హోం). వారు ఎంత పైకి వెళ్తారో, మీరు ఎంత పైకి వెళ్తారో లెక్కతీయండి - మీరు ఎన్ని మైళ్లు పైకి పోతారు? మీరెవరు? ఆత్మలు. తండ్రి చెప్తున్నారు - నేను ఎన్ని మైళ్లు పైన ఉంటానో లెక్క వేయగలరా? వారి వద్ద అయితే లెక్కాచారముంది. ఇన్ని మైళ్ళు పైకి వెళ్లి మళ్లీ క్రిందకు వచ్చామని తెలుపుతారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విధంగా దిగుతాము, ఇలా చేస్తాము అని చెప్తారు. చాలా పెద్ద శబ్ధమౌతుంది. మీది ఏ శబ్ధమూ ఉండదు. మీరు ఎక్కడకు వెళ్తారో, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీకు ఏ బహుమతి లభిస్తుందో కూడా మీకే తెలుసు. ఇది అద్భుతమైనది. బాబా గొప్పతనము(చమత్కారము) ఎవ్వరికీ తెలియదు. ఇదేమీ కొత్త విషయం కాదని మీరంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వారు అభ్యాసము చేస్తూనే ఉంటారు. మీకు ఈ సృష్టి అనే నాటకములో ఆదిమధ్యాంతాలు, దాని వ్యవధి మొదలైనవన్నీ బాగా తెలుసు. కావున మీకు ఆంతరిక నషా ఉండాలి. బాబా మనకు ఎంత గొప్ప జ్ఞానము నేర్పిస్తున్నారు! చాలా శ్రేష్టమైన పురుషార్థము చేయిస్తున్నారు. మళ్లీ కూడా చేస్తారు. ఈ విషయాలన్నీ ఇతరులెవ్వరికీ తెలియదు. తండి గుప్తంగా ఉన్నారు. మీకు ప్రతి రోజూ ఎంతగానో అర్థం చేయిస్తారు. మీకెంత జ్ఞానమునిస్తున్నారు. వారు హద్దు వరకు మాత్రమే వెళ్తారు. మీరు బేహద్‌(అనంతము)లోకి వెళ్తారు. వారు చంద్రుని వరకు వెళ్తారు. అవి పెద్ద పెద్ద బల్బులు. ఇంకేమీ కాదు. వారికి భూమి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వారి భౌతిక జ్ఞానానికి, మీ ఆత్మిక జ్ఞానానికి ఎంత వ్యత్యాసముంది. మీ ఆత్మ ఎంత సూక్ష్మమైనది! కానీ రాకెట్‌ కంటే తీక్షణమైనది. ఆత్మలు పైన ఉంటాయి. నాటకములో పాత్ర చేసేందుకు మళ్లీ వస్తాయి. వారు కూడా సుప్రీమ్‌ ఆత్మ. కానీ వారినెలా పూజించాలి. భక్తి కూడా తప్పకుండా జరగాల్సిందే.
బాబా అర్థం చేయించారు - అర్ధకల్పము జ్ఞానము పగలు, అర్ధకల్పము భక్తి రాత్రి. ఇప్పుడు సంగమ యుగములో మీరు జ్ఞానము తీసుకుంటున్నారు. సత్యయుగములో అయితే జ్ఞానమే ఉండదు. అందుకే దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. అందరినీ ఉత్తమ పురుషులుగా చేస్తారు. మీ ఆత్మ ఎంతో దూర-దూరాలకు వెళ్తుంది. మీకు ఖుషీ ఉంది కదా. వారు వారి కళలు చూపిస్తే వారికి చాలా ధనము లభిస్తుంది. ఎంత లభించినా అదేమీ వెంటరాదని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ మరణించాల్సిందే. అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకెంత విలువైన రత్నాలు లభిస్తున్నాయి! దాని విలువనెవ్వరూ కట్టలేరు. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ గలది. ఎంతోకాలము నుండి మీరు వింటూనే వస్తున్నారు. గీతలో ఎంత విలువైన జ్ఞానముంది. ఈ ఒక్క గీత మాత్రమే అత్యంత విలువైనది. శ్రీమద్భగవద్గీత సర్వ శాస్త్రములకు శిరోమణి. వారు భలే పఠిస్తారు కానీ అర్థము ఏమాత్రము తెలియదు. గీత చదివితే ఏమవుతుంది. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని ఆ తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. వారు భలే గీతను పఠిస్తారు కానీ తండ్రితో ఒక్కరికి కూడా యోగము లేదు. వారు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. పవిత్రంగా కూడా అవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రము మీ ముందు ఉంది. వీరిని దేవతలని అంటారు. ఎందుకంటే వారిలో దైవీ గుణాలున్నాయి. ఆత్మలైన మిమ్ములనందరినీ పవిత్రంగా చేస్తారు. అందరూ ఇంటికి వెళ్లాలి. నూతన ప్రపంచములో అయితే ఇంతమంది మనుష్యులుండరు. మిగిలిన ఆత్మలంతా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఈ తండ్రి అద్భుతమైన జ్ఞానమునిస్తారు. దీని వలన మీరు మానవుల నుండి దేవతలుగా, చాలా ఉన్నతమైనవారిగా అవుతారు. అటువంటి చదువు పై ఎంత గమనముంచాలి. కల్పక్రితము ఎవరు ఎంత గమనముంచారో ఇప్పుడు కూడా అలాగే ఉంచుతూ ఉంటారని కూడా మీకు తెలుసు. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తండ్రి సేవా సమాచారము విని సంతోషడ్తారు కూడా. తండ్రికి ఎప్పుడూ ఉత్తరము కూడా వ్రాయరు. అందువలన వారి బుద్ధియోగము ఎక్కడో రాయి-రప్పల పై ఉందని భావిస్తారు. దేహాభిమానములోనికి వచ్చి తండ్రిని మర్చిపోతారు లేకుంటే ప్రేమించి వివాహము(లవ్‌ మ్యారేజ్‌) చేసుకుంటే వారి మధ్య పరస్పరము ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. కొంతమంది ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వివాహమాడిన స్త్రీని చంపను కూడా చంపుతారు. మీది కూడా వారితో ప్రేమ వివాహము. తండ్రి వచ్చి మీకు తన పరిచయమునిస్తారు. మీకు పరిచయము కూడా తెలియదు. తండ్రి అయితే రావలసి వస్తుంది. ఈ ప్రపంచము పాతదైనప్పుడు తండ్రి వస్తారు. పాతదానిని క్రొత్తదిగా చేసేందుకు తప్పకుండా ఈ సంగమ యుగములోనే వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం తండ్రి కర్తవ్యము. మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తారు. కనుక అటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి. బాబా మేము మర్చిపోతామని ఎందుకంటారు? ఎంత ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి! ఇంతకంటే ఉన్నతమైనవారు లేనే లేరు. మానవులు ముక్తి కొరకు ఎన్నో ఉపాయాలు చేసి తలలు బాదుకుంటూ ఉంటారు. ఎంతో అసత్యము, మోసము నడుస్తూ ఉంది. మహర్షి మొదలైనవారికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. వారికి ప్రభుత్వము వారు 10-20 ఎకరాల భూమినిచ్చేస్తారు. అలాగని ప్రభుత్వము ధార్మికము కాదని కాదు. మినిష్టర్లు కొంతమంది ధార్మికంగా, కొంతమంది అధార్మికంగా ఉంటారు. కొంతమంది ధర్మమును ఒప్పుకోనే ఒప్పుకోరు. మతమే శక్తి(రిలీజియన్‌ ఈజ్‌ మైట్‌) అని అంటారు. క్రైస్తవులలో శక్తి ఉండేది కదా. భారతదేశమంతటినీ మింగేసింది. ఇప్పుడు భారతదేశములో ఏ శక్తీ లేదు. ఎన్నో కొట్లాటలు, మారణహోమాలు జరుగుతున్నాయి. అదే భారతదేశమెలా ఉండేది! తండ్రి ఎప్పుడు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మగధ దేశములో వస్తారని మీకు తెలుసు. అక్కడ మొసళ్ళు ఉంటాయి. మానవులు అన్నీ తినేవారిగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ వైష్ణవముగా భారతదేశముండేది. ఇది వైష్ణవ రాజ్యము కదా. ఆ మహాన్‌ పవిత్ర దేవతలెక్కడ, ఈ రోజు అన్నీ తినేవారెక్కడ? మనుష్యులను కూడా చంపేవారిగా అయిపోతారు. దేనికి పనికి రానివారిగా అవుతున్నారు. భారతదేశానికి ఏ గతి పట్టింది. ఇప్పుడు మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. పై నుండి క్రింది వరకు పూర్తి జ్ఞానమునిస్తున్నారు. మొట్టమొదట మీరే ఈ భూమి పైకి వస్తారు. ఆ తర్వాత మనుష్యులు వృద్ధి చెందుతారు. ఇక కొద్ది సమయములో హాహాకారాలౌతాయి. తర్వాత అయ్యో అయ్యో అంటూ ఉంటారు. స్వర్గములో ఎంత సుఖముంటుందో చూడండి. ఇది లక్ష్యమునకు గుర్తు. ఇవన్నీ పిల్లలైన మీరు ధారణ కూడా చేయాలి. ఇది ఎంతో గొప్ప చదువు. తండ్రి చాలా స్పష్టం చేసి అర్థం చేయిస్తున్నారు. మాల రహస్యమును కూడా అర్థం చేయించారు. మాల పై భాగములో పుష్పము శివబాబా, తర్వాత మేరు(జంటపూసలు).......... ప్రవృత్తి మార్గము కదా. నివృత్తి మార్గము వారికైతే మాల తిప్పే అనుమతి లేదు. ఇది దేవతల మాల. వారు రాజ్యమునెలా పొందుకున్నారు. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. మీరు వస్తే ఇతరులెవ్వరూ అర్థం చేయించలేని విషయాలు తెలుపుతామని భయపడకుండా చెప్తారు. శివబాబాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వారికి(దేవతలకు) ఈ రాజయోగమును నేర్పించారు? కూర్చుని చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి. 84 జన్మలెలా తీసుకుంటారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఎలా అవుతారో తండ్రి ఎంతో సహజంగా జ్ఞానము తెలుపుతున్నారు. పవిత్రంగా కూడా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. విశ్వమంతటా శాంతిస్థాపన చేసేవారు మీరే. ఆ తండ్రి మీకు రాజ్య భాగ్యమునిస్తారు. వారు దాత కదా. వారు ఏమీ తీసుకోరు. మీరు చదువుకున్న దానికిది బహుమతి. ఇటువంటి బహుమతి ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇటువంటి తండ్రిని ప్రీతిగా ఎందుకు స్మృతి చేయరు! లౌకిక తండ్రినైతే జన్మంతా గుర్తుంచుకుంటారు. పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు! తండ్రి తెలిపిస్తున్నారు - ఇది యుద్ధ మైదానము, పవితంగా అయ్యేందుకు సమయం పడ్తుంది. యుద్ధము పూర్తి అయ్యేవరకు సమయము పడ్తుంది. అంతేగాని ప్రారంభములో వచ్చిన వారు పూర్తి పావనంగా అవుతారని కాదు. తండ్రి చెప్తున్నారు - మాయతో యుద్ధము చాలా తీవ్రంగా జరుగుతుంది. మంచి-మంచి వారిని కూడా మాయ జయిస్తుంది. మాయ అంత శక్తివంతమైనది. క్రిందపడినవారు మురళి కూడా వినలేరు. సెంటరుకే రాకుంటే వారికెలా తెలుస్తుంది. మాయ ఒక్కసారిగా పైసకు కొరగాకుండా చేసేస్తుంది. మురళి వింటేనే కదా మేల్కునేది. మురికి(అపవిత్ర) పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా తెలివిగల పిల్లలు, మాయతో వారెలా ఓడిపోయారో అర్థం చేయించాలి. బాబా మీకు ఏం వినిపిస్తున్నారు, మళ్లీ మీరెక్కడకు వెళ్తున్నారు. మాయ ఎవరినైనా తింటూ ఉందని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి. మాయ పూర్తిగా మింగేయకుండా చూడాలి. మళ్లీ వారు మేల్కోవాలి. లేకుంటే ఉన్నత పదవి పొందలేరు. సద్గురువును నిందలపాలు చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా శాంతిగా ఉండే కళను నేర్చుకొని, ఈ హద్దు ప్రపంచమును దాటి బేహద్‌లోకి వెళ్లాలి. ఆ తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానమునిచ్చి ఎంతో గొప్ప బహుమతినిస్తున్నారనే నషా ఉండాలి.
2. నిర్భయంగా చాలా రసవత్తరంగా సేవ చేయాలి. మాయతో చేసే యుద్ధములో శక్తివంతులై విజయము పొందుకోవాలి. మురళి విని సుజాగృతమై ఉండాలి. అందరినీ జాగృతము చేయాలి.

వరదానము :- ''స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మా భవ ''
చాలాకాలము రాజ్యాధికారులుగా అయ్యే సంస్కారము, చాలాకాలము భవిష్య రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతులుగా అయితే అధికారులుగా అయ్యే సంస్కారముండదు. కనుక రాజ్యాధికారుల రాజ్యములో ఉంటారు. రాజ్య భాగ్యము ప్రాప్తించదు. కనుక జ్ఞాన దర్పణంలో మీ భాగ్యశాలి ముఖాన్ని చూసుకోండి. చాలా సమయం అభ్యాసము చేయడం ద్వారా మీ విశేష సహయోగం చేసే కర్మచారులు లేక రాజ్య కార్యభారము నిర్వహించే సాథీలను మీ అధికారంతో నడిపించండి. రాజులుగా అవ్వండి అప్పుడు భాగ్యశాలి ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :- ''సకాశ్‌నిచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేయండి''

No comments:

Post a Comment