Monday, November 25, 2019

Telugu Murli 26/11/2019

26-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - శ్రేష్ఠమైన డ్రామా జ్ఞానము పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది, ఈ డ్రామా యథాతథంగా రిపీట్‌ అవుతుందని మీకు తెలుసు ''

ప్రశ్న :- ప్రవృత్తివారు బాబాను ఏ ప్రశ్న అడుగుతారు ? బాబా వారికి ఏమని సలహా ఇస్తారు ?
జవాబు :- చాలా మంది పిల్లలు - ''బాబా మేము వ్యాపారం చేసుకోమా?'' అని అడుగుతారు. బాబా చెప్తారు - పిల్లలూ! భలే వ్యాపారం చేయండి, కానీ రాయల్‌ వ్యాపారం చేయండి. బ్రాహ్మణ పిల్లలు, మద్యము, సిగిరెట్లు, బీడి మొదలైన ఛీ - ఛీ(నీచమైన) వ్యాపారాలు చేయరాదు. ఎందుకంటే వాటి వలన ఇంకా ఎక్కువగా వికారాల ఆకర్షణ ఉంటుంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఒకటి ఆత్మిక తండ్రి ఇచ్చిన శ్రీమతము, రెండవది రావణుని ఆసురీ మతము. తండ్రి మతమును ఆసురీ మతమని అనరు. రావణుడిని, తండ్రి అని అనము కదా! అది రావణుని ఆసురీ మతము. ఇప్పుడు పిల్లలైన మీకు లభించేది ఈశ్వరీయ మతము. రెండిటికి రాత్రింబవళ్ళకున్నంత తేడా ఉంది. ఈశ్వరీయ మతంతో దైవీగుణాలు ధారణ చేస్తూ వచ్చామని బుద్ధిలోకి వస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీరు మాత్రమే తండ్రి ద్వారా వింటారు - ఇంకెవ్వరికీ తెలియదు. సంపద కొరకే తండ్రి లభిస్తారు. రావణుని వలన సంపద తగ్గిపోతూ వస్తుంది. ఈశ్వరీయ మతము ఎక్కడికి తీసుకు వెళ్తుందో, ఆసురీ మతము ఎక్కడకు తీసుకెళ్తుందో మీకు మాత్రమే తెలుసు. ఆసురీ మతము లభించినప్పటి నుండి మీరు క్రిందికి పడిపోతూనే వచ్చారు. క్రొత్త ప్రపంచంలో కొద్ది కొద్దిగానే కింద పడ్తారు. పడిపోవడం ఎలా జరుగుతుందో మళ్లీ ఎక్కడం ఎలా జరుగుతుందో - ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ శ్రేష్ఠంగా తయారయ్యేందుకు పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. మీరు ఇక్కడకు శ్రేష్ఠంగా తయారయ్యేందుకు వచ్చారు. మనం మళ్లీ శ్రేష్ఠ మతము ఏ విధంగా పొందుతామో మీకు తెలుసు. అనేకసార్లు మీరు శ్రేష్ఠ మతముతో ఉన్నతమైన పదవిని పొందారు, మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి పడిపోతూ వచ్చారు, తిరిగి ఒకేసారిగా ఎక్కుతారు. నంబరువారు పురుషార్థం అనుసారంగానే ఇది అవుతుంది. టైమ్‌ పడ్తుందని తండ్రి తెలియజేస్తున్నారు. పురుషోత్తమ సంగమయుగ సమయము కూడా పూర్తి ఆక్యురేట్‌గా ఉంది. డ్రామా చాలా ఆక్యురేట్‌గా నడుస్తుంది అంతేకాక చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది. ''తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి'',.......... అంతే! కాని పురుషార్థం చేయడం అంటే చాలామందికి కష్టం అనిపిస్తుంది కూడా. ఇంత ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందడం అంత తేలిక ఏమీ కాదు. తండ్రి స్మృతి మరియు వారసత్వము రెండూ చాలా సహజమైనవి. ఒక సెకండు విషయమే. అయితే పురుషార్థం చేయడంలో మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. రావణుని పై గెలుపు పొందాల్సి వస్తుంది. ఈ మొత్తం సృష్టి పై రావణ రాజ్యముంది. ఇప్పుడు మనము యోగబలముతో రావణుని పై ప్రతి కల్పము గెలుపు పొందుతూ వచ్చామని, ఇప్పుడు కూడా గెలుపు పొందుతున్నామని మీకు తెలుసు. నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తిమార్గంలో కూడా మీరు బాబా అని అంటూ వచ్చారు కానీ మొదట తండ్రిని గురించి తెలియదు. ఆత్మను గురించి తెలుసు. భృకుటి మధ్యలో అజబ్‌ సితారా మెరుస్తూ ఉంటుంది,.......... అని అనేవారు. ఆత్మను గురించి తెలిసినా కానీ తండ్రిని గురించి తెలియదు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా! ఓ పరమపిత పరమాత్మ! అని కూడా అనేవారు. స్మృతి చేసేవారు, అయినా వారిని గురించి తెలియదు. ఆత్మ కర్తవ్యాన్ని గురించి గానీ, పరమాత్మ కర్తవ్యాన్ని గురించి గానీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి లేకుండా ఎప్పుడూ, ఎవరూ రియలైజ్‌ చేయించలేకపోయారు. ఎవ్వరికీ ఆ పాత్రే లేదు! ఈశ్వరీయ సంప్రదాయము, ఆసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయము అని గాయనం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది కానీ ఈ విషయాలు గుర్తుండాలి - ఇందులోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది, మరపింపజేస్తుంది. తండ్రి చెప్తున్నారు - నంబరువారు పురుషార్థానుసారం స్మృతి చేయగా చేయగా డ్రామా అంతమవుతుంది అనగా పాత ప్రపంచం అంత్యమవుతుంది. అప్పుడు నంబరువారీ పురుషార్థానుసారం రాజధాని స్థాపన అవ్వనే అవుతుంది. శాస్త్రాలతో ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. గీత మొదలైన వాటిని ఇతడు కూడా చాలా చదివాడు కదా! ఇప్పుడు వీటికి ఏ విలువా లేదని తండ్రి చెప్తున్నారు. కానీ భక్తిలో చాలా కర్ణ రసం లభిస్తుంది కనుక వదిలి పెట్టరు.
ఆధారమంతా పురుషార్థం పై ఉంది అని మీకు తెలుసు. కొంతమంది వ్యాపారాలు రాయల్‌గా ఉంటాయి, కొంతమంది వ్యాపారాలు ఛీ-చీగా ఉంటాయి. మద్యం, సిగరెట్‌, బీడీ మొదలైనవి అమ్ముతూ ఉంటారు. ఈ వ్యాపారాలు చాలా చెడ్డవి. మద్యం అన్ని వికారాలను ఆకర్షిస్తుంది. ఎవరినైనా మద్యం తాగేవానిగా చేసే ఈ వ్యాపారం మంచిది కాదు. యుక్తితో ఈ వ్యాపారం ఛేంజ్‌ చేసుకోమని తండ్రి సలహా ఇస్తారు లేకుంటే ఉన్నతమైన పదవి పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారంలో తప్ప ఈ అన్ని వ్యాపారాలలో నష్టమే ఉంది. భలే ఇతడు వజ్రాల వ్యాపారం చేసేవాడు(బ్రహ్మ) కాని లాభం అయితే ఏమీ కలుగలేదు కదా! అయితే లక్షాధికారిగా అయ్యాడు. ఈ వ్యాపారంతో ఏం అవుతారు? బాబా ఉత్తరాలలో కూడా పదమాపదం భాగ్యశాలి అని ఎప్పుడూ వ్రాస్తుంటారు. అది కూడా 21జన్మలకు అవుతారు. బాబా చెప్పేది సరైనదేనని మీకు కూడా తెలుసు. మనమే ఈ దేవీ దేవతలుగా ఉండేవారము, మళ్లీ చక్రములో తిరిగి తిరిగి క్రిందికి వచ్చాము. సృష్టి ఆది-మధ్య-అంత్యములు కూడా తెలుసుకున్నారు. నాలెడ్జ్‌ అయితే తండ్రి ద్వారా లభించింది కానీ దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా అని తమను తాము పరిశీలించుకోవాలి. ''నేను నా ఈ శరీరమనే ఇంటిని అద్దెకు ఇచ్చాను'' అని ఈ బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లే కదా! ఇందులో ఆత్మ ఉంటుంది, భగవంతునికి, నేను నా ఇల్లు అద్దెకు ఇచ్చానని నాకు చాలా గర్వంగా ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారం ఇక ఎవ్వరి ఇల్లూ వారు తీసుకోరు. కల్ప-కల్పము ఈ ఇల్లే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతనికైతే సంతోషంగా ఉంటుంది కదా! అయితే హంగామా కూడా ఎంత జరిగింది! ఈ బాబా, హాస్యానికి అప్పుడప్పుడూ బాబాతో - ''బాబా, తమకు రథంగా అయినందున నేను ఇన్ని తిట్లు తినవలసి వస్తోంది'' అని అనేవాడు. అప్పుడు తండ్రి - అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభించాయి, ఇప్పుడు నీ వంతు వచ్చిందని అంటారు. బ్రహ్మకు ఎప్పుడూ తిట్లు లభించలేదు. ఇప్పుడా వంతు వచ్చింది. రథం ఇచ్చినందుకు తండ్రి నుండి తప్పకుండా సహాయం కూడా లభిస్తుంది కదా. అయినా బాబా అంటారు - తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. ఇందులో పిల్లలైన మీరు ఇతని కంటే ఎక్కువ వేగంగా వెళ్లగలరు. ఎందుకంటే ఇతని పై చాలా బాధ్యతలున్నాయి. భలే! డ్రామా అంటూ వదిలేస్తారు. అయినా కొన్ని సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి(ప్రభావము తప్పక పడ్తుంది, బాధ కలుగుతుంది). వీరు పాపం మంచి సర్వీస్‌ చేసేవారు, సాంగత్యదోషంతో చెడిపోయారు. ఎంత డిస్‌సర్వీస్‌ జరుగుతుంది! ఎలాంటి పనులు చేస్తారంటే, కోపము, బాధ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉందని భావించరు. తర్వాత ఇది డ్రామాలో ఉంది కదా అని ఆలోచన వస్తుంది. మాయ స్థితిని పాడు చేయటంతో చాలా డిస్‌సర్వీస్‌ జరిగిపోతుంది. ఎంతమంది అబలలు మొదలైనవారి పై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే పిల్లలే ఎంత డిస్‌సర్వీస్‌ చేస్తారు, ఉల్టా-సుల్టాగా(ఎద్వా, తద్వా) మాట్లాడ్తారు.
ఇప్పుడు తండ్రి ఏం వినిపిస్తున్నారో పిల్లలకు తెలుసు. శాస్త్రాలు మొదలైనవేవీ వినిపించరు. ఇప్పుడు మనము శ్రీమతంతో ఎంత శ్రేష్ఠంగా తయారవుతాము! ఆసురీ మతముతో ఎంత భ్రష్టులుగా అయ్యాము. టైమ్‌ పడ్తుంది కదా! మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు తప్పకుండా విజయం లభిస్తుంది. శాంతిధామము, సుఖధామాల పై విజయం మనదే అని మీకు తెలుసు. కల్ప-కల్పము మనం విజయం పొందుతూ వచ్చాము. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే స్థాపన మరియు వినాశనం జరుగుతాయి. ఇది మొత్తం వివరంగా మీ బుద్ధిలో ఉంది. ఖచ్ఛితంగా తండ్రి మన ద్వారా స్థాపన చేయిస్తున్నారు, మళ్లీ మనమే రాజ్యపాలన చేస్తాము. బాబాకు థాంక్స్‌ కూడా చెప్పరు. ఇది కూడా డ్రామాలో ఉంది అని తండ్రి అంటారు. నేను కూడా ఈ డ్రామాలో పాత్రధారిని. డ్రామాలో అందరి పాత్ర రచింపబడి ఉంది. శివబాబాకు కూడా పాత్ర ఉంది, నా పాత్ర కూడా ఉంది. థాంక్స్‌ చెప్పే పనే లేదు. శివబాబా అంటారు - ''ఇంకెవ్వరూ ఇవ్వలేని శ్రీమతం నేను మీకు ఇచ్చి మార్గం తెలియజేస్తాను'' సతోప్రధాన క్రొత్త ప్రపంచం స్వర్గం ఉండేది కదా అని ఎవరు వచ్చినా చెప్పండ.ి ఈ పాత ప్రపంచాన్ని తమోప్రధాన ప్రపంచమని అంటారు. మళ్లీ సతోప్రధానంగా అయ్యేందుకు దైవీగుణాలు ధారణ చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి. ''మన్మనాభవ, మద్యాజీభవ'' ఇదే మంత్రం! అంతే! నేను సుప్రీమ్‌ గురువును అని కూడా చెప్తున్నాను.
పిల్లలైన మీరిప్పుడు స్మృతియాత్రతో సృష్టి మొత్తాన్ని సద్గతికి చేరుస్తారు. జగద్గురువు ఒక్క శివబాబాయే. వారు మీకు కూడా శ్రీమతమును ఇస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనకు ఈ శ్రీమతం లభించిందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈనాడు పాత ప్రపంచం ఉంది, రేపు క్రొత్త ప్రపంచము ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సహజం. ఇది జ్ఞాపకం ఉన్నా ఎవరికైనా అర్థం చేయించగలరు కానీ ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే ఇక జ్ఞానం మొత్తం సమాప్తమైపోతుంది. కళలను, కాయమును మాయ తీసేసుకుంటుంది. కళలన్నీ తీసేసి కళారహితంగా చేసేస్తుంది. వికారాల్లో ఎలా చిక్కుకుపోతారంటే అడగనే వద్దు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మ-జన్మాంతరాలుగా వేశ్యాలయంలో ఉండి, వేల కొలది పాపాలు చేస్తూ వచ్చారు. జన్మ-జన్మల పాపిని నేను, అని అందరి ఎదుట అన్నారు. మనమే మొదట పుణ్యాత్మలుగా ఉండేవారము, తర్వాత పాపాత్మలుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ పుణ్యాత్మలుగా అవుతాము. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభిస్తోంది. మళ్లీ ఈ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి, తమ సమానంగా తయారు చేస్తారు. గృహస్థ వ్యవహారములో ఉండడం వలన తేడా అయితే ఉంటుంది కదా! మీరు అర్థం చేసుకున్నంతగా వారు అర్థం చేసుకోలేరు. కానీ అందరూ వదిలేయలేరు. తండ్రి స్వయంగా చెప్తారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. అందరూ వదిలేసి వస్తే ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు. తండ్రి నాలెడ్జ్‌ఫుల్‌ వారు శాస్త్రాలు మొదలైనవేవీ చదవరు. ఇతడు శాస్త్రాలు మొదలైనవి చదివాడు. ''నన్ను అయితే ఫాదర్‌ ఈజ్‌ నాలెడ్జ్‌ఫుల్‌ '' అని అంటారు. తండ్రి వద్ద ఏ జ్ఞానముందో కూడా ఈ మనుష్యులకు తెలియదు. ఇప్పుడు సృష్టి ఆది-మధ్య-అంత్యముల మొత్తం నాలెడ్జ్‌ అంతా మీకు ఉంది. ఈ భక్తి మార్గ శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని మీరు తెలుసుకున్నారు. భక్తిమార్గంలో ఈ శాస్త్రాలు కూడా తప్పకుండా వెలువడ్తాయి. పర్వతం విరిగిపోతే మళ్లీ ఎలా తయారవుతుంది అని అంటారు. కానీ ఇది డ్రామాయే కదా! శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి - మళ్లీ సమయం వచ్చినప్పుడు అవే తయారవుతాయి.
మనము మొట్టమొదట శివపూజ చేస్తాము. శివుని భక్తి ఏ విధంగా చేయబడ్తుందో, ఎన్ని శ్లోకాలు మొదలైనవి పాడ్తారో కూడా శాస్త్రాలలో ఉంటుంది కదా! మీరు కేవలం స్మృతి చేస్తారు. శివబాబా జ్ఞానసాగరులు, వారు ఇప్పుడు మనకు జ్ఞానం ఇస్తున్నారు. ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు అర్థం చేయించారు. శాస్త్రాలలో ఎంత పెద్ద బడాయిలు వ్రాశారంటే అవి ఎప్పుడూ గుర్తు కూడా రావు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీ ఆంతరికములో ఎంత ఖుషీ ఉండాలి. స్టూడెంట్‌ లైఫ్‌ ఈజ్‌ ది బెస్ట్‌(ూ్‌బసవఅ్‌ కూఱటవ ఱర ్‌ష్ట్రవ దీవర్‌) అని మహిమ చేస్తారు.
భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. ఇక ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. ఇదే ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తి. వాస్తవానికి అందరికీ సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భలే స్థాపన చేయువారిని కూడా గురువు అనవచ్చు కానీ సద్గతినిచ్చేవారే గురువు. వీరైతే తమ వెనుక అందరినీ పాత్ర చేసేందుకు తీసుకెళ్లరు. వాపసు తీసుకెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తారు. శివుని ఊరేగింపే కీర్తించబడుతోంది, మరి ఏ ఇతర గురువులది కాదు. మనుష్యులైతే శివ, శంకరులను కలిపేశారు. ఆ సూక్ష్మవతన వాసి ఎక్కడ, ఆ మూలవతన వాసి ఎక్కడ! ఇద్దరూ ఒక్కటే ఎలా అవుతారు? భక్తిమార్గంలో ఇలా వ్రాసేశారు. బ్రహ్మ, విష్ణు, శంరులు ముగ్గురు పిల్లలు కదా! బ్రహ్మ గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. వీరిని దత్తత చేసుకోవడం వలన ఇతడు శివబాబా పుత్రునిగా అయ్యాడు కదా! తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. పోతే ఇతడు వారి రచన. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి 21 జన్మలకు పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా? మేము వికారాలు ఉత్పత్తి అయ్యే ఏ వ్యాపారము చేయడం లేదు కదా? అని మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి.
2. స్మృతియాత్రలో ఉండి మొత్తం సృష్టిని సద్గతిలోకి చేర్చాలి. సద్గురువైన తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. మాయ ఎప్పుడూ కళా రహితంగా తయారు చేయకుండా గమనముంచాలి.

వరదానము :- '' శుభ భావన, శుభ కామనల సహయోగం ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ ''
ఎప్పుడైతే ఏదైనా కార్యములో బ్రాహ్మణ పిల్లలందరూ సంఘటిత రూపంలో తమ శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగమిస్తారో అప్పుడు ఈ సహయోగం ద్వారా వాయుమండలంలో ఒక కోట తయారవుతుంది. ఈ కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఎలాగైతే అయిదు వ్రేళ్ల సహయోగం ద్వారా ఎంత పెద్ద కార్యమైనా సులభమైపోతుందో అలా ప్రతి బ్రాహ్మణ పుత్రుని సహయోగం, సేవలలో సఫలతా సంపన్నంగా చేస్తుంది. సహయోగానికి ఫలితము సఫలత.

స్లోగన్‌ :- '' అడుగడుగులో పదమాల సంపాదన జమ చేసుకునేవారే, అందరికంటే గొప్ప ధనవంతులు. ''

No comments:

Post a Comment