11-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ' మన్మనాభవ ' అనే వశీకరణ మంత్రము ద్వారానే మీరు మాయ పై విజయము పొందగలరు, ఈ మంత్రమునే అందరికీ స్మృతి ఇప్పించండి ''
ప్రశ్న :- ఈ అనంతమైన డ్రామాలో అందరికంటే శక్తిశాలి నౌకర్లు ఎవరెవరు, ఎలా ?
జవాబు :- ఈ పాత ప్రపంచాన్ని శుభ్రము చేసే అందరికంటే శక్తిశాలి నౌకర్లు పక్రృతి ప్రకోపాలు. భూమి కంపిస్తుంది. తుఫానులు, వరదలు వస్తాయి, శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ ఆదేశమివ్వరు. తండ్రి పిల్లలను ఎలా వినాశనము చేస్తారు? ఇది డ్రామాలోని పాత్ర. రావణుని రాజ్యము కదా. వీటిని భగవంతుని ప్రకోపాలు అని అనరు.
ఓంశాంతి. తండ్ర్రే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, ''మన్మనాభవ.'' ''శివబాబా, మన్మనాభవ'' అని పిల్లలు తండ్రికి చెప్పలేరు. వాస్తవములో పిల్లలైన మీరు పరస్పరములో కూర్చుని చర్చించుకుంటారు, సలహాలు ఇచ్చుకుంటారు కానీ ముఖ్యమైన మహామంత్రాన్ని తండ్రియే ఇస్తారు. గురువులు మంత్రమును ఇస్తారు. ఈ ఆచారము ఎక్కడ నుండి వచ్చింది? ఈ తండ్రి ఎవరైతే నూతన సృష్టిని రచించేవారో వారే మన్మనాభవ మంత్రమును మొట్టమొదట ఇస్తారు. దీని పేరే వశీకరణ మంత్రము అనగా మాయ పై విజయము పొందే మంత్రము. ఇది మనసులో జపించుకునే అవసరము లేదు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థ సహితంగా తెలియజేస్తున్నారు - భలే ఈ మంత్రము గీతలో ఉన్నా ఎవ్వరికీ అర్థము తెలియదు. ఇది గీతా అధ్యాయము(గీతా ఎపిసోడ్) కూడా. కాని కేవలం పేరును మార్చేశారు. భక్తిమార్గములో ఎంతో పెద్ద - పెద్ద పుస్తకాలు మొదలైనవి తయారవుతాయి. వాస్తవానికి దీనిని పిల్లలకు తండ్రి కూర్చొని మౌఖికంగా(నోటితో) అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానముంది. పిల్లలలో కూడా ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. సహజంగా అర్థం చేయించేందుకు ఈ చిత్ర్రాలు మొదలైనవి తయారుచేశారు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవి కావని మీకు తెలుసు. తర్వాత ఈ ఖండాలన్నీ ఏర్పడ్డాయి. కావున వాటి చిత్ర్రాలు కూడా ఒకవైపు ఉంచాలి. మీరు చూపించే భారతదేశములో, వీరి రాజ్యమున్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. తర్వాత ఇవన్నీ ఉండవు. ఇది బాబా ప్లాను. పాపం వారైతే చాలా చింతిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సరియైనదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా వ్రాయబడింది - దేనిని? నూతన ప్రపంచాన్ని. యమునా నది తీరములో రాజధాని ఉంటుంది. అక్కడ ఒకే ఒక ధర్మముంటుంది. వృక్షము చాలా చిన్నది. ఈ వృక్షము గురించిన జ్ఞానము కూడా తండ్రియే ఇస్తారు. చక్ర జ్ఞానమును ఇస్తారు. సత్యయుగములో ఒకే భాష ఉంటుంది. ఇతర భాషలేవీ ఉండవు. ఒకే భారతదేశము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేదని మీరు ఋజువు చేయగలరు. స్వర్గములో(ప్యారడైస్‌లో) సుఖ-శాంతులుండేవి. దు:ఖానికి నామ-రూపాలే ఉండేవి కాదు. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ ఉండేవి. పవిత్రంగా ఉండుట వలన నూతన భారతదేశములో ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రంగా ఉండుట వలన మానవులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మానవుల పరిస్థితి ఏమవుతూ ఉందో చూడండి. కూర్చుని ఉండగానే హఠాత్తుగా మృత్యువు కబళిస్తుంది. యుక్త వయసు వారు కూడా మరణిస్తున్నారు. ఎంత దు:ఖము కలుగుతుంది! అక్కడ అకాలమృత్యువు ఉండదు. అక్కడ సంపూర్ణ ఆయువు ఉంటుంది. తరము పూర్తి అయ్యే వరకు అనగా వృద్ధాప్యము వరకు ఎవ్వరూ మరణించరు.
ఎవరికైనా అర్థం చేయించునప్పుడు బేహద్ తండ్రిని స్మృతి చేయండి, వారే పతితపావనులు, వారే సద్గతిదాత అని వారి బుద్ధిలో స్థిరపరచండి. మీరు ఋజువు చేసేందుకు మ్యాప్(చిత్రము) కూడా ఉండాలి. ఇది నేటి చిత్రము, ఇది రేపటి చిత్రము అని చూపించండి. కొందరు బాగా వింటారు. దీనిని పూర్తిగా అర్థం చేయించాలి. ఈ భారతదేశము అవినాశి ఖండము. ఈ దేవీదేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మములేవీ లేవు. ఇప్పుడు ఆ ఆదిసనాతన దేవీదేవతా ధర్మము లేనే లేదు. ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారో ఎవ్వరూ తెలుపలేరు. తెలిపించే శక్తి ఎవ్వరికీ లేదు. పిల్లలైన మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలరు. ఇందులో తికమకపడే అవసరము లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు, మళ్లీ వాటిని రిపీట్ కూడా చేయగలరు కూడా. వీరు(లక్ష్మినారాయణులు) ఎక్కడకు వెళ్లారని మీరు ఎవరినైనా అడగవచ్చు. మీ ప్రశ్న విని వారు ఆశ్చర్యచకితులవుతారు. వీరు కూడా 84 జన్మలు ఎలా తీసుకున్నారో నిశ్చయంతో తెలుపగలరు. మీ బుద్ధిలో ఉంది కదా. సత్యయుగ నూతన ప్రపంచములో మన రాజ్యము ఉండేదని మీరు వెంటనే చెప్పగలరు. ఒక్క ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉండేది. ఏ ఇతర ధర్మమూ లేదు. అంతా కొత్తదే. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. బంగారు కూడా లెక్కలేనంత ఉంటుంది. ఎంత సహజంగా లభిస్తుందంటే, దానితో ఇటుకలు, గృహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అక్కడ అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. గనులన్నీ కొత్తవిగా ఉంటాయి కదా. అసలైనవి చాలా ఉన్నప్పుడు నకిలీవి తయారుచేయరు. ఇక్కడ నిజమనే పేరే లేదు. నకిలీ ప్రభావం చాలా ఉంది. అందుకే అసత్య మాయ, అసత్య శరీరము,.......(ఝూఠీ మాయా, ఝూఠీ కాయా.....) అని అంటారు. సంపద కూడా అసత్యమైనది. అసలైనవా, నకిలీవా? అని తెలుసుకోలేని విధంగా వజ్ర్రాలు, ముత్యాలు అనేక రకాలు వెలువడ్తాయి. సత్యమైనవా, అసత్యమైనవా అని గుర్తించలేని విధంగా కనిపిస్తాయి. అక్కడైతే ఈ నకిలీ వస్తువులు మొదలైనవి ఉండవు. వినాశనమైనప్పుడు అన్నీ భూమిలో కలిసి భూస్థాపితమైపోతాయి. ఎంతో పెద్ద-పెద్ద రాళ్లను, వజ్ర్రాలు మొదలైన వాటిని భవనాలలో పొదుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడ నుండి వచ్చి ఉంటాయి? ఎవరు కట్ చేసి తయారుచేస్తూ ఉంటారు? భారతదేశములో కూడా నిపుణులు చాలామంది ఉన్నారు, చాలా తెలివిగలవారుగా అవుతూ ఉంటారు. అక్కడకు కూడా ఈ తెలివిని తీసుకొస్తారు కదా. కిరీటము మొదలైనవి కేవలం వజ్ర్రాలతోనే తయారవ్వవు. అక్కడ చాలా స్వచ్ఛమైన, నాణ్యమైన వజ్రాలుంటాయి. ఈ విద్యుత్తు, టెలిఫోను, మోటరు మొదలైనవేవీ ఇంతకుముందు లేవు. బాబా జీవిత సమయములోనే ఎన్ని వస్తువులు తయారయ్యాయి! ఇవన్నీ తయారై 100 సంవత్సరాలు అయ్యింది. అక్కడైతే చాలా గొప్ప నిపుణులు ఉంటారు. ఇంతవరకు నేర్చుకుంటూ ఉంటారు, నిపుణులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారము చేయించబడ్తుంది. అక్కడ హెలికాఫ్టర్లు కూడా పూర్తి సురక్షితంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా సతోప్రధానమైన, చురుకైనబుద్ధి గలవారిగా ఉంటారు. పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. తమ దేశానికి సమీపంగా వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నామనే ఆంతరిక ఖుషీ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వచ్చేసిందని సంతోషముంటుంది. చివరిలో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైనవారని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు సుప్రీమ్ ఆత్మ(పరమ ఆత్మ). వారిని అందరూ స్మృతి కూడా చేస్తూ ఉంటారు. భక్తిమార్గములో మీరు కూడా పరమాత్మను స్మృతి చేసేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారో, పెద్దగా ఉంటారో తెలియదు. కనుక భృకుటి మధ్యలో మెరిసే విచిత్రమైన నక్షత్రము,.........(భృకుటి కే బీచ్ మే చమక్‌తా హై అజబ్ సితారా.......) అని మహిమ కూడా ఉంది. కావున తప్పకుండా బిందువు వలె ఉంటారు కదా. వారినే సుప్రీమ్ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. వారిలో అన్ని విశేషతలు ఉన్నాయి. జ్ఞానసాగరులు కనుక ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? వారు వినిపించినప్పుడే తెలుస్తుంది కదా. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, కేవలము భక్తి మాత్రమే తెలుసు. ఇది అద్భుతమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను కూడా ఈ కళ్లతో చూడలేము కావున తండ్రిని కూడా మర్చిపోతాము. డ్రామాలో పాత్రయే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వానికి మాలికులుగా చేస్తారో (కృష్ణుడు), వారి పేరును వేసేస్తారు. చేసినవారి పేరు మాయం చేసేస్తారు. కృష్ణుని త్రిలోకనాథుడని, వైకుంఠనాథుడని అనేస్తారు. అర్థమేమీ తెలియదు. కేవలం ప్రశంసిస్తారు. భక్తిమార్గములో కూర్చొని చాలా విషయాలు వినిపించారు. భగవంతునిలో చాలా శక్తి ఉందని, వారు వెయ్యి సూర్యుల కంటే తేజోవంతులని, అందరినీ భస్మము చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలు తయారుచేశారు. నేను పిల్లలను ఎలా కాల్చి వేస్తానని తండ్రి అంటున్నారు. ఇది జరగని పని. పిల్లలను తండ్రి వినాశనము చేస్తారా? చేయరు. ఇది డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచము సమాప్తమవ్వాలి. పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు ఈ ప్రకృతి ప్రకోపాలన్నీ నౌకర్లు. చాలా శక్తిశాలి కూలీలు. అలాగని వినాశనము చేయమని తండ్రి వాటిని ఆదేశించరు. తుఫానులు వస్తాయి, కరువులు వస్తాయి, ఇలా చేయమని తండ్రి చెప్తారా? ఎప్పటికీ చెప్పరు. ఈ విధంగా డ్రామాలో పాత్ర ఉంది. బాంబులు తయారు చేయమని తండ్రి చెప్పరు. ఇవన్నీ రావణుని మతము అని అంటారు. ఇది తయారుచేయబడిన డ్రామా. రావణుని రాజ్యము కనుక ఆసురి బుద్ధి తయారవుతుంది. చాలామంది మరణిస్తారు. చివరికి అంతా కాల్చేస్తారు. ఇది తయారు చేయబడిన ఆట, పునరావృతమవుతూ ఉంటుంది. అంతేగాని శంకరుడు కళ్లు తెరిస్తే వినాశనమవుతుందని కాదు. వీటిని భగవంతుడు సృష్టించిన ఆపదలు అని కూడా అనరు. ఇవి ప్రకృతి సిద్ధమైనవి.
పిల్లలైన మీకిప్పుడు తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు. ఎవ్వరికీ దు:ఖము మొదలైనవి ఇచ్చే మాటే లేదు. తండ్రి సుఖమునిచ్చే మార్గమును తెలిపేవారు. డ్రామా ప్లాను అనుసారము గృహము పాతదిగా అవుతూనే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా పాతదైపోయిందని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడిది సమాప్తమవ్వాలి. పరస్పరము ఎలా కొట్లాడుకుంటున్నారో చూడండి. ఆసురీ బుద్ధి కదా. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవ్వరినీ చంపే విషయము మొదలైనవేవీ ఉండవు. నేను అందరికీ తండ్రిని, అందరి పై నాకు ప్రేమ ఉందని వారు చెప్తారు. తండిన్రి చాలా ప్రేమగా స్మృతి చేసే, సర్వీసు చేసే అనన్య పిల్లలను బాబా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నా సర్వీసు చేసే పిల్లల వైపుకు తండ్రి దృష్టి వెళ్తుంది. అప్పుడప్పుడు డెహరాడూన్ వైపు, అప్పుడప్పుడు మీరఠ్ వైపు, అప్పుడప్పుడు ఢిల్లీ వైపు............ వెళ్తుంది. నన్ను స్మృతి చేసే పిల్లలను నేను కూడా స్మృతి చేస్తాను. నన్ను స్మృతి చేయనివారిని కూడా స్మృతి చేస్తాను ఎందుకంటే నేను అందరినీ తీసుకెళ్లాలి కదా. నా ద్వారా సృష్టిచక్ర జ్ఞానమును అర్థం చేసుకున్నవారు నంబరువారుగా ఉన్నత పదవిని పొందుతారు. ఇవి బేహద్ విషయాలు. ఆ ఉపాధ్యాయులు మొదలైనవారు హద్దులోనివారు. వీరు బేహద్ టీచరు. కావున ఆంతరికంగా పిల్లలకు ఎంత ఖుషీ ఉండాలి. అందరి పాత్ర ఒకే విధంగా ఉండదని తండ్రి చెప్తారు. వీరికి ఉన్న పాత్రను అనుసరించేవారు కోటిలో కొందరే ఉన్నారు. బాబా, ''నేను 7 రోజుల బిడ్డను, ఒక రోజు బిడ్డను'' అని అంటారు. కనుక మీరు పిల్లికూనలు. కావున తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూ ఉంటారు. నదులను కూడా దాటుకొని వచ్చారు. బాబా రావడంతోనే జ్ఞానము ప్రారంభమయింది. వారికి ఎంత మహిమ ఉంది! ఆ గీతా అధ్యాయాన్ని జన్మ-జన్మల నుండి మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడ కృష్ణ భగవానువాచ, ఎక్కడ శివపరమాత్మ వాచ. రాత్రికి - పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనము సత్యఖండములో ఉండేవారమని సుఖము చాలా చూశామని మీ బుద్ధిలో ఉంది. 3/4 భాగము సుఖమును చూస్తారు. తండ్రి డ్రామాను సుఖము కొరకు తయారుచేశారు, దు:ఖము కొరకు కాదు. సుఖము తర్వాత మీకు దు:ఖము కలిగింది. యుద్ధము ఇంత త్వరగా జరగదు. మీకు చాలా సుఖము లభిస్తుంది. సుఖము సగము, దు:ఖము సగము ఉండినా అంత మజా ఉండదు. 3,500 సంవత్సరాల వరకు ఏ యుద్ధమూ జరగదు. రోగాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ చూడండి, ఒక రోగము తర్వాత మరొక రోగము వస్తూనే ఉంది. సత్యయుగములో ధాన్యము మొదలైన వాటిని తిని పాడు చేసే క్రిమికీటకాలు ఉండవు. అందువలన దాని పేరే స్వర్గము. ప్రపంచ పటము కూడా మీరు చూపించాలి అప్పుడే అర్థము చేసుకోగలరు. అసలైన భారతదేశము ఇది అని పటము చూపిస్తూ అర్థం చేయించాలి. అప్పుడు వేరే ఏ ధర్మము ఉండేది కాదని తెలపాలి. తర్వాత క్రమంగా ధర్మస్థాపకులు వస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ప్రపంచ చరిత్ర - భూగోళాలు తెలుసు. మీరు తప్ప మిగిలినవారందరూ తెలియదు-తెలియదు(నేతి-నేతి), మాకు తండ్రి ఎవరో తెలియదని అంటారు. వారికి నామ-రూప-దేశ- కాలాలు లేనే లేవని చెప్పేస్తారు. నామ-రూపాలు లేకపోతే దేశము కూడా ఉండదు. ఏమీ అర్థము కూడా చేసుకోరు. ఇప్పుడు తండ్రి తమ యదార్థ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సదా అపారమైన ఖుషీలో ఉండేందుకు బేహద్ తండ్రి వినిపించే బేహద్ విషయాలను స్మరించాలి. తండ్రిని అనుసరిస్తూ ఉండాలి.
2. సదా ఆరోగ్యంగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రత ద్వారానే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి.
వరదానము :- ''శక్తిశాలి స్మృతి ద్వారా ఒక సెకండులో పదమాల సంపాదన జమ చేసుకునే పదమాపదమ్ భాగ్యశాలి భవ''
మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక సెకండు స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ అయిపోవాలి. ఎవరి ప్రతి అడుగులో పదమాలుంటే ఎన్ని పదమాలు జమ అవుతాయి. అందువలన పదమాపదం భాగ్యశాలి అని అంటారు. ఎవరికైనా మంచి సంపాదన జరిగిందంటే వారి ముఖ ప్రకాశమే వేరుగా ఉంటుంది. కనుక మీ ముఖము ద్వారా కూడా పదమాల సంపాదన చేసుకున్న నశా కనిపించాలి. ఎటువంటి ఆత్మిక నషా, ఆత్మిక ఖుషీ ఉండాలంటే వీరు అతీతమైన వారని అందరికి అనుభవమవ్వాలి.
స్లోగన్ :- ''డ్రామాలో అంతా మంచే జరుగుతుందనే స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులుగా అవ్వండి''
No comments:
Post a Comment