Tuesday, November 19, 2019

Telugu Murli 20/11/2019

20-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - శివబాబా పై గౌరవముంటే వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీమతమును అనుసరించడం అంటే తండ్రిని గౌరవించడం ''

ప్రశ్న :- పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు - ఎలా ?
జవాబు :- సర్వ శేష్ఠ్రమైన తండ్రిని తమ కుమారునిగా చేసుకోవడం, తనువు-మనసు-ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని సమర్పణగుట - ఇది పిల్లలు చేసే ఇంద్రజాలము. ఇప్పుడు ఎవరైతే భగవంతుని వారసునిగా చేసుకుంటారో, వారు 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు.

ప్రశ్న :- ట్రిబ్యునల్‌(న్యాయాధిపతుల సభ) ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది?
జవాబు :- దానమిచ్చిన వస్తువును వాపసు తీసుకోవాలని సంకల్పము చేసిన వారికి, మాయకు వశమై డిస్‌ సర్వీసు చేయువారి కొరకు, టిబ్య్రునల్‌ కూర్చుంటుంది.

ఓంశాంతి. విచిత్రమైన ఆత్మిక తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అనగా దూరదేశములో నివసించే పరమపిత పరమాత్మ చాలా చాలా దూరదేశము నుండి వచ్చి ఈ శరీరము ద్వారా మిమ్ములను చదివిస్తున్నారు. ఇప్పుడేం చదువుతున్నారో, దానిని చదివించే వారితో స్వతహాగానే యోగముంచుతారు. ఓ పిల్లలూ! టీచరుతో సంబంధము ఉంచుకోమని, స్మృతి చేయమని చెప్పే అవసరమే ఉండదు. కానీ ఇక్కడ తండ్రి - ఓ ఆత్మిక పిల్లలారా, నేను మీ తండ్రి, టీచరు, గురువును కూడా అయ్యాను, ఈ సంబంధాలతో యోగము జోడించండి అనగా తండ్రిని స్మృతి చేయండని చెప్తున్నారు. వీరు విచిత్రులైన తండ్రి. మీరు క్షణ-క్షణము వీరిని మర్చిపోతారు. అందుకే చెప్పవలసి వస్తుంది. చదివించేవారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమైపోతాయి. టీచరు ''నన్ను చూడమని చెప్పడం చట్ట సమ్మతము కాదు.'' కానీ ఇందులో అయితే చాలా లాభముంది. తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతి బలము ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. దీనిని స్మృతియాత్ర అని అంటారు. ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరేమో మాటిమాటికి దేహములోకి వస్తారు. నేనేమో మొత్తం కల్పమంతా శరీరములోకి రాను. కేవలం ఈ సంగమ యుగములో మాత్రము పిల్లలైన మిమ్ములను చదివించేందుకు చాలా దూరదేశము నుండి వస్తాను. బాబా మా తండ్రి, టీచరు, సద్గురువు అని మంచిరీతిగా స్మృతి చేయాలి. వారు విచిత్రులు వారికి తమ స్వంత శరీరము లేదు. అయితే వారెలా వస్తారు? నేను ఈ శరీరములో, నోటిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని చెప్తున్నారు. నేను విచిత్రుడను. మీరందరూ చిత్రములున్న(దేహాలున్న) వారు. నాకు తప్పకుండా రథము కావాలి కదా. గుఱ్ఱం బండిలో అయితే రాను కదా. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను. నెంబరువన్‌గా ఉన్న ఇతనే మళ్లీ చివరి నెంబరుగా అవుతారు. సతోప్రధానంగా ఉన్నవారే తమోప్రధానంగా అవుతారు. వారినే మళ్లీ సతోప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యములో 5 వికారాల పై విజయము పొంది జగజీతులుగా పిల్లలైన మీరే అవ్వాలి. విచిత్రులైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా భస్మమవుతాయి? ఈ మాటలు కూడా కేవలం ఈ సంగమ యుగములోనే మీరు వింటారు. ఒక్కసారి జరిగింది కల్పము తర్వాత మళ్లీ అదే రిపీట్‌(పునరావృతము) అవుతుంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసులు మొదలైనవారి సత్సంగము కాదు. వారిని తండ్రి అని కూడా అంటారు, కుమారుడని కూడా అంటారు. వీరు మన తండ్రే కాదు, కుమారుడు కూడా అని మీకు తెలుసు. మనము సర్వస్వము ఈ కుమారునికి వారసత్వంగా ఇచ్చి తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వము తీసుకుంటాము. పనికిరానిదంతా ఇచ్చి తండ్రి నుండి మనము విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటాము. పిల్లలంటారు - ''బాబా, మేము భక్తిమార్గములో ఉన్నప్పుడు మీరు వస్తే మా తనువు-మనస్సు-ధనము సహితంగా సమర్పణవుతామని అన్నాము.'' లౌకిక తండ్రి కూడా పిల్లలకు సర్వమూ అప్పగించి సమర్పణౌతారు కదా. ఇక్కడ మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారంటే - వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమై మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణము. తండ్రి ఎక్కడ వస్తున్నారో చూడండి! పాత రావణ రాజ్యములో వస్తారు. వారంటున్నారు - నా భాగ్యములో పావన శరీరము లభించనే లభించదు. పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి? నేను పతిత ప్రపంచములోనే వచ్చి మిమ్ములను పావనంగా చేయవలసి వస్తుంది. అటువంటి టీచరు పై గౌరవము కూడా ఉంచాలి కదా. చాలామందికి గౌరవించడమే తెలియదు. అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే. రాజధానిలో అయితే నెంబరువారుగా అందరూ ఉండాల్సిందే కదా. కనుక అన్ని రకాలవారు ఇక్కడే తయారవుతారు. తక్కువ హోదా పొందుకునే వారికి ఈ స్థితి ఉంటుంది. చదువుకోరు, తండ్రి స్మృతిలో కూడా ఉండరు. వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికము. వీరి పాత్ర ఇతరులెవ్వరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. అలాంటివారిని గౌరవించాలి కదా. వారి శ్రీమతమును అనుసరించాలి. కానీ మాయ మాటిమాటికి మరిపింపజేస్తుంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడ వేసేటంత శక్తిశాలి. ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు. కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తుంది. మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్లీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. ఏనుగును మొసలి తినేసింది(గజేంద్ర మోక్షము) అనే పదము కూడా ఉంది కదా. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థము కూడా చేసుకుంటారు కానీ నెంబరువారు పురుషార్థానుసారము. కొంతమందికి కొంచెము కూడా ధారణ జరగదు. చాలా ఉన్నతమైన చదువు కదా. కనుక ధారణ చేయలేరు. వారి అదృష్టములో రాజ్యభాగ్యము లేదని తండ్రి అంటారు. కొంతమంది వాసన లేని జిల్లేడు పూలుగా ఉన్నారు, కొంతమంది సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు. వెరైటీ పుష్పాల ఉద్యానవనము కదా. అటువంటివారు కూడా కావాలి కదా. రాజధానిలో మీకు నౌకర్లు - చాకర్లు కూడా లభిస్తారు. అలాంటివారు లేకుంటే నౌకర్లు - చాకర్లు ఎలా లభిస్తారు? రాజుల రాజ్యమిక్కడే తయారవుతుంది. నౌకర్లు - చాకర్లు, చండాలురు మొదలైన వారంతా లభిస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపనవుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయము. ఇంత ఉన్నతంగా తయారు చేయు తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమభాష్పాలు ప్రవహించాలి.
మీరు మాలలోని ముత్యాలుగా అవుతారు కదా. బాబా మీరు ఎంత విచిత్రమైనవారు! మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేసేందుకు చదివిస్తున్నారని అంటారు. భక్తిమార్గములో భలే శివుని పూజిస్తారు కానీ వీరే పతితపావనులని అర్థమే చేసుకోరు. కానీ '' ఓ పతితపావనా! రండి, మీరు వచ్చి సుగంధ పుష్పాలైన దేవీ దేవతలుగా తయారు చేయండి '' అని పాడుతూ ఉంటారు. పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు. వారు వచ్చినప్పుడు - ''పిల్లలూ! పవిత్రంగా అవ్వండి అని అంటారు''. ఈ విషయములోనే హంగామాలు(గలాటాలు) జరుగుతాయి. తండ్రి అద్భుతమైనవారు కదా. పిల్లలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. తండ్రికి తెలుసు - నేను ఆత్మలతో మాట్లాడ్తాను. సర్వము చేసేది ఆత్మనే. వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది. మీ కొరకు ట్రిబ్యునల్‌ కూర్చుంటుంది. ముఖ్యంగా సేవ చేసేందుకు అర్హులుగా అయ్యి మళ్లీ ద్రోహులుగా అవుతారు. మాయ ఎలా మింగేస్తుందో ఆ తండ్రికే తెలుసు. బాబా మేము ఓడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము(పతితులయ్యాము),......... ఇప్పుడు క్షమించండి అని అంటారు. ఇప్పుడు క్రిందపడ్డారు - మాయకు వశమయ్యారు - ఇక క్షమ ఎక్కడ నుండి లభిస్తుంది! వారు చాలా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. మాయతో ఓడిపోయేవారు చాలా మంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానము ఇచ్చి వెళ్ళండి. మళ్లీ వాపసు తీసుకోరాదు. లేకుంటే సమాప్తమైపోతారు. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానమిచ్చిన తర్వాత వాపస్‌ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ తీసుకుంటే 100 రెట్లు దండన ఉంటుంది. తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది. రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యముండదు. వారి ధర్మమును అనుసరించు వారి సంఖ్య 50 - 60 కోట్లు అయినప్పుడే వారి రాజ్యము స్థాపనవుతుంది, సైన్యము తయారవుతుంది. ప్రారంభములో ఒకరో-ఇద్దరో వస్తారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. ఏసుక్రీస్తు కూడా ఏదో ఒక వేషములో వస్తారని మీకు తెలుసు. భికారి రూపములో ఉన్న మొదటి నెంబరులోని వారే, మళ్లీ తప్పకుండా చివరి నెంబరులో ఉంటారు. ఈ సమయములో ఏసుక్రీస్తు భికారి రూపములో ఉన్నాడని, అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు. పునర్జన్మ తీసుకోవలసిందేనని అర్థము చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమోప్రధానంగా అయ్యే తీరాలి. ఈ సమయంలో ప్రపంచమంతా తమోప్రధానమై శిథిలావస్థలో ఉంది. ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనమయ్యే తీరాలి. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేది, ఆ స్వర్గము మళ్లీ ఇప్పుడు వస్తుంది అని అంటారు కానీ ఈ విషయాలను ఎవరు అర్థము చేయిస్తారు? పిల్లలకు ఇంకా ఆ స్థితి ఎక్కడుందని తండ్రి అంటున్నారు. మేము యోగములో ఉండలేమని పిల్లలు మాటి మాటికీ వ్రాస్తారు. వారి చేష్టలు చూచి బాబానే అర్థం చేసుకుంటారు. తండ్రికి సమాచారము తెలిపేందుకు కూడా పిల్లలు భయపడ్తారు. తండ్రి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. ప్రేమతో నమస్కరిస్తారు. పిల్లలకు అహంకారముంటుంది. మంచి-మంచి పిల్లలను కూడా మాయ మరిపింపజేస్తుంది. బాబా అర్థము చేసుకోగలరు. నేను జ్ఞానసాగరుడనని తండ్రి అంటున్నారు. సర్వజ్ఞుడనగా అందరి ఆంతరికములోనిదంతా నాకు తెలుసని కాదు. నేను వచ్చిందే అందరినీ చదివించేందుకు. నేను ఎవరి ఆంతరికమును రీడ్‌ చేయను(చదవను) అనగా తెలుసుకోను. నాలాగే ఈ సాకారము కూడా ఎవ్వరినీ చదవడు. ఇతను అన్నింటినీ మర్చిపోవాలి. చదివి ఏం చేయాలి? మీరు ఇక్కడకు వచ్చింది చదువుకునేందుకు. భక్తిమార్గమే వేరు. భక్తి క్రింద పడిపోయేందుకు సాధనంగా అవ్వాలి కదా. ఈ భక్తి మాటలతోనే మీరు క్రింద పడిపోతారు. ఇది తయారైన డ్రామా. భక్తి మార్గములో శాస్త్రాలు చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారుతూ మీరు తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండనే ఉండరాదు. కలియుగము నుండి మళ్లీ సత్యయుగములోకి రావాలి. ఇప్పుడిది సంగమ యుగము. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. ప్రపంచములో మిగిలిన వారందరి బుద్ధికి గాడ్రెజ్‌ తాళము వేయబడి ఉంది. వీరు దైవీ గుణాలు గలవారిగా ఉండి తర్వాత వారే మళ్లీ ఆసురీ గుణాలు గలవారిగా అయ్యారని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి మార్గములోని విషయాలన్నీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వినిపించేది మాత్రమే వినండి. చెడు వినకు,........... ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి. మీరు మునిగిపోకుండా పైకి తేల్చేందుకే నేను వచ్చాను.
మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా జన్మించారు కదా. ఎంతమంది దత్తు పిల్లలు ఉన్నారు చూడండి! అందరూ దత్తు పిల్లలే. వారిని ఆదిదేవుడని, మహావీరుడని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులే కదా. మీరు యోగబలము ద్వారా మాయ పై విజయము పొందుతారు. ఆ తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలతో పళ్ళెములు నింపి ఇస్తున్నారు. మిమ్ములను సంపన్నంగా చేస్తున్నారు. ఎవరైతే జ్ఞాన ధారణ చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. ధారణ చేయనివారు తప్పకుండా తక్కువ పదవే పొందుతారు. తండ్రి నుండి మీరు తరగని ఖజానాలు పొందుతారు. అల్లాఉద్ధీన్‌ - అద్భుత దీపము కథ కూడా ఉంది కదా. అక్కడ మనకు అప్రాప్తిగా ఉండు వస్తువే ఉండదు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వము ఇస్తారు. హద్దు వారసత్వము లభించినా '' ఓ పరమాత్మా! దయ చూపండి, కృప చూపండి '' అని బేహద్‌ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారేం ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. బాబా మనలను విశ్వమంతటికీ యజమానులుగా చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రములో కూడా ఉంది. బ్రహ్మ సాధారణ రూపములో ఎదురుగా కూర్చుని ఉన్నారు. స్థాపన చేస్తున్నారంటే తప్పకుండా వారినే తయారుచేస్తారు కదా. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. భక్తి మార్గములో శంకరుని ముందుకెళ్ళి - జోలెను నింపమని వేడుకుంటారు. మేము నిరుపేదలుగా అయ్యామని ఆత్మ అంటుంది. మా జోలెను నింపి, మమ్ములను ఈ విధంగా తయారు చేయమని అంటారు. ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు. మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలని కోరుతారు. ఈ చదువే నరుని నుండి నారాయణునిగా చేస్తుంది. పాత ప్రపంచములోకి రావాలని ఎవరికుంటుంది? కానీ అందరూ నూతన ప్రపంచములోకి రాలేరు. కొందరు 25 శాతము పాతదైన తర్వాత వస్తారు. కొంత తగ్గిపోతుంది కదా. ఏ కొద్దిగానైనా సందేశమిస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు. అక్కడ డబల్‌ కిరీటధారులు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. ఈ రోజులలో అయితే ధర్మము మొదలైన వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు. దేవీదేవతా ధర్మము పూర్తిగా సమాప్తమైపోయింది. ధర్మమే శక్తి అని గాయనముంది. కానీ ధర్మాన్ని అనుసరించని కారణంగా శక్తి లేకుండా పోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలము తర్వాత మనమే క్షత్రియులము,........... బుద్ధిలో ఈ చక్రమంతా మెదులుతుంది కదా. ఈ 84 జన్మల చక్రములో మనము తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికెళ్ళాలి. పతితులైనవారు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. బంగారులో మలినము ఏర్పడ్తుంది కదా. నగలో చేరదు. ఇది 'జ్ఞానాగ్ని'. దీని ద్వారా మురికి అంతా సమాప్తమై మీరు స్వచ్ఛమైన బంగారుగా అవుతారు. తర్వాత మళ్లీ ఆభరణము(శరీరం) కూడా మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే పవిత్రుల ముందుకెళ్లి నమస్కరిస్తారు. చేసేదంతా ఆత్మయే కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత లభిస్తుంది. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. అతను హద్దు తండ్రి, వీరు బేహద్‌ తండ్రి. ఈ తండ్రి స్వర్గ వారసత్వమునిచ్చేందుకు సంగమ యుగములో మాత్రమే వస్తారు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది కదా. టీచరును విద్యార్థి ఎప్పుడైనా మర్చిపోతాడా? కానీ ఇక్కడ మాయ మరిపిస్తూ ఉంటుంది. చాలా హెచ్చరికగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. తండ్రి అంటున్నారు - ఇప్పుడు వికారాలకు వశమవ్వకండి. మైల పడకండి. ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళాలి. పవిత్రంగా అవుతేనే పవిత్ర నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇస్తాను. ఇదేమైనా చిన్న విషయమా! కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే క్రింద పడిపోతారు. ఆకర్షణలు, ప్రలోభాలు చాలా ఉంటాయి. కామము పై విజయం సాధిస్తే మీరు ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పరమపిత పరమాత్మయే జగద్గురువని, ప్రపంచమంతటికి సద్గతినిచ్చేవారని నేరుగా చెప్పండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ జోలెను నింపుకొని సంపన్నంగా అవ్వాలి. ఏ విధమైన అహంకారమును చూపించరాదు.
2. సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్లీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ డిస్‌సర్వీసు చేయరాదు. దానిమిచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాపస్‌ తీసుకునే ఆలోచన కూడా రాకూడదు.

వరదానము :- '' బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత అనే పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ ''
ఈ బ్రాహ్మణ జీవితంలో 'ఏకవ్రత' పాఠాన్ని పక్కాగా చేసుకొని పవిత్రతా రాయల్టీని ధారణ చేస్తే మొత్తం కల్పమంతటిలో ఈ ఆత్మిక రాయల్టీ కొనసాగుతూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతల ప్రకాశము పరంధామములో ఆత్మలన్నిటిలో శ్రేష్ఠమైనది. ఆదికాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ విశేషమైన పర్సనాలిటి ఉండేది. తర్వాత మధ్య కాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము - 'పవిత్రత యొక్క రాయల్టీ'. అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే.

స్లోగన్‌ :- '' మీరు సహనశక్తి దేవీ దేవతలుగా అయితే, నిందించేవారు కూడా కౌగలించుకుంటారు ''

No comments:

Post a Comment