15-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - సర్వ శ్రేష్ఠమైన గుణము శాంతి కనుక శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింపజేయడం మానేయండి ''
ప్రశ్న :- సంగమ యుగములో తండ్రి ద్వారా పిల్లలకు ఏ వారసత్వము లభిస్తుంది ? గుణవంతులైన పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి ?
జవాబు :- 1. జ్ఞానము, 2. శాంతి, 3. గుణముల వారసత్వము లభిస్తుంది. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. ఎవరి అవగుణాలను చూడరు, ఎవరి పైనా ఫిర్యాదులు చేయరు, ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యమును కూడా చేయరు. ఎవరెేమి అన్నా వినీ వినినట్లుండి తమ మస్తీ(ఆనందము)లో ఉంటారు.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకటేమో మీకు తండ్రి ద్వారా జ్ఞాన వారసత్వము లభిస్తూ ఉంది. రెండవది తండ్రి నుండి మరియు ఈ చిత్రాల(లక్ష్మీనారాయణు) నుండి కూడా మీరు గుణాలను తీసుకోవాలి. తండ్రిని శాంతిసాగరులని అంటారు, కావున శాంతిని కూడా ధారణ చేయాలి. శాంతిగా ఉండేందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - పరస్పరములో చాలా శాంతియుతంగా వ్యవహరించండి. ఈ గుణము అలవర్చుకోవాలి. జ్ఞాన గుణము తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానము కేవలం ఈ విచిత్ర తండ్రి మాత్రమే చదివిస్తారు. విచిత్రమైన ఆత్మలు(పిల్లలు) చదువుకుంటారు. ఇదే ఇక్కడి కొత్త విశేషత, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. కృష్ణుని వలె దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి చెప్తున్నారు - నేను శాంతి సాగరుడను కనుక ఇక్కడ శాంతిని స్థాపన చేయాలి. అశాంతిని సమాప్తం చేయాలి. '' నేను ఎంతవరకు శాంతిగా ఉన్నాను? '' అని మీ నడవడికలను పరిశీలించుకోవాలి. అనేకమంది పురుషులు కూడా శాంతినే ఇష్టపడ్తారు. శాంతిగా ఉండడము మంచిదని భావిస్తారు. శాంతి గుణము కూడా చాలా గొప్పది. అయితే శాంతి ఎలా స్థాపనౌతుంది, శాంతి అనగా అర్థమేమిటి? ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు. తండ్రి భారతవాసులకే చెప్తారు. తండ్రి భారతదేశములోనే వస్తారు. ఆంతరికములో కూడా తప్పకుండా శాంతి ఉండాలని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఎవరైనా అశాంతిగా చేస్తే స్వయం కూడా అశాంతిగా అవ్వాలని కాదు. కాదు, అశాంతిగా అవ్వడం కూడా అవగుణమే. అవగుణాలను తొలగించాలి. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. అవగుణాల వైపు చూడను కూడా చూడరాదు. ఎవరైనా జోరుగా శబ్ధము చేస్తూ మాట్లాడ్తున్నా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురూ శాంతిగా ఉంటారు. ఎప్పుడూ కోపపడరు, బిగ్గరగా అరవరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా. ఎంత శాంతిగా ఉంటారో అంత మంచిది. శాంతిగా ఉంటేనే స్మృతి చేయగలరు. అశాంతిగా ఉన్నవారు స్మృతి చెయ్యలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే. దత్తాత్రేయుడు మొదలైనవారి ఉదాహరణలు కూడా ఈ సమయానికే వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులు ఎవ్వరూ ఉండరు. ముఖ్యమైనది ఒకే వికారము. మీరు దాని పై విజయము పొందుకుంటున్నారు. పొందుకుంటూ ఉంటారు. కర్మేంద్రియాల పై విజయము పొందుకోవాలి. అవగుణాలను వదిలేయాలి. అవగుణాల గలవారిని చూడను కూడా చూడరాదు. వారితో మాట్లాడను కూడా మాట్లాడరాదు. ఎవరిలో గుణాలు ఉంటాయో వారి వద్దకే వెళ్ళాలి. ఉండడం కూడా చాలా శాంతిగా, మధురంగా ఉండాలి. కొద్దిగానే మాట్లాడి మీరు అన్ని కార్యాలు చేయగలరు. అందరి నుండి గుణాలను గ్రహించి మీరు గుణవంతులుగా అవ్వాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలుగా ఉంటారో వారు శాంతిగా ఉండేందుకు ఇష్టపడ్తారు. కొందరు భక్తులు జ్ఞానుల కంటేె మంచి నిరహంకారులుగా ఉంటారు. బాబాకు అనుభవము ఉంది కదా. ఇతను ఏ లౌకిక తండ్రికి పుత్రుడో అతడు టీచరుగా ఉండేవాడు. చాలా నిరహంకారిగా, శాంతచిత్తునిగా ఉండేవాడు. ఎప్పుడూ కోపము చేసుకునేవాడు కాదు. సాధు, సన్యాసులను మహిమ చేస్తూ ఉంటారు. వారు భగవంతుని కలిసేందుకు పురుషార్థము చేస్తూ ఉంటారు కదా. కాశీకి, హరిద్వారానికి వెళ్లి అక్కడ ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా, మధురంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అవ్వజాలరు. అశాంతిగా ఉండేవారితో మాట్లాడను కూడా మాట్లాడరాదు. దూరంగా ఉండాలి. వ్యత్యాసము ఉంది కదా. వారు కొంగలు, వీరు హంసలు. హంస అంటే రోజంతా ముత్యాలనే ఏరుకుంటూ ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ, తిరుగుతూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. రోజంతా ఎవరికి ఎలా అర్థం చేయించాలో, తండ్రి పరిచయము ఎలా ఇవ్వాలో బుద్ధిలో తిరుగుతూ ఉండాలి.
ఏ పిల్లలు వచ్చినా వారితో ఫారాన్ని నింపించమని బాబా తెలిపించారు. సేవాకేంద్రాలలో ఎవరైనా కోర్సు తీసుకోవాలనుకుంటే వారితో ఫారాన్ని నింపించాలి. కోర్సు తీసుకోము అని అంటే ఫారం నింపించే అవసరము లేదు. వారి(మనసు)లో ఏముందో, ఏం తెలిపించాలో తెలుసుకునేందుకు ఫారం నింపించబడ్తుంది. ఎందుకంటే ప్రపంచములోని వారికి ఈ విషయాలు ఎవ్వరికీ అర్థం కావు. కావున వారి వివరాలన్నీ ఫారం ద్వారానే తెలుస్తాయి. తండ్రితో ఎవరైనా మిలనము చేయాలన్నా ఫారం నింపించాలి. అప్పుడే ఎందుకు కలుస్తున్నారో తెలుస్తుంది. ఎవరైనా వస్తే వారికి మొదట హద్దు మరియు బేహద్ తండ్రుల పరిచయమును ఇవ్వాలి, ఎందుకంటే మీకు బేహద్ తండ్రి వచ్చి పరిచయమిచ్చారు కనుక మీరు ఇతరులకు తండ్రి పరిచయమునిస్తూ ఉండాలి. వారి పేరు శివబాబా. శివ పరమాత్మాయ నమ:............. అని అంటారు కదా. వారు కృష్ణుని కృష్ణ దేవతాయ నమ: అని అంటారు. శివుడిని శివ పరమాత్మాయ నమ: అని అంటారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ముక్తి- జీవన్ముక్తుల వారసత్వాన్ని పొండేందుకు తప్పకుండా పవిత్ర ఆత్మలుగా అవ్వాలి. అది పవిత్ర ప్రపంచము, దానిని సతోప్రధానమైన ప్రపంచము అని అంటారు. అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజము. ఎవరితోనైనా మొదట ఫారం నింపించిన తర్వాత కోర్సు ఇవ్వండి. మొదటి రోజు ఫారం నింపించి కోర్సు ఇవ్వండి. కోర్సు అయిపోయిన తర్వాత మళ్లీ ఫారం భర్తీ చేయించండి. అప్పుడు వారికి ఎంతవరకు అర్థమయిందో మీకు తెలుస్తుంది. రెండు ఫారాలలో తప్పకుండా వ్యత్యాసముండడం మీరు గమనిస్తారు. వారు ఏం అర్థము చేసుకున్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. మనము అర్థం చేయించిన దాని గురించి ఆలోచించారా లేదా? అని తెలుస్తుంది. ఈ ఫారాలు అందరి వద్ద ఉండాలి. బాబా మురళిలో ఆదేశములిచ్చిన తర్వాత ముందు పెద్ద పెద్ద సేవాకేంద్రాలలో వెంటనే అమలుపరచాలి. ఫారం ఉంచుకోవాలి. లేకుంటే ఎలా తెలుస్తుంది? నిన్న ఏం వ్రాశాను? ఈ రోజు ఏం వ్రాశాను? అని స్వయం వారు కూడా అనుభవము చేస్తారు. ఫారం చాలా అవసరము. వేరు వేరుగా ముద్రించినా ఫర్వాలేదు. లేకుంటే ఒక్క స్థానములో ముద్రించి అన్ని వైపులా పంపవచ్చు. ఇదే ఇతరుల కళ్యాణము చేయడం.
పిల్లలైన మీరిక్కడకు దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అనే పదము చాలా శ్రేష్ఠమైనది. దైవీ గుణాలను అలవరచుకున్న వారిని దేవతలని అంటారు. మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. కనుక ఎక్కడెక్కడ ప్రదర్శినీ, మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫారాలు చాలా ఉండాలి. అప్పుడే ఎలాంటి స్థితి ఉందో తెలుస్తుంది. మీరు అర్థము చేసుకున్న తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలు సదా గుణాలనే వర్ణించాలి. అవగుణాలను ఎప్పుడూ వర్ణించరాదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలో చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా గుణాలనే నింపుతారు. అవగుణాలున్నవారు ఎప్పుడూ గుణాలను నింపలేరు. సమయము ఎక్కువగా ఏమీ లేదని పిల్లలకు తెలుసు. పురుషార్థము చాలా చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ప్రతి రోజు ప్రయాణము చేస్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. ఏదైతే అతీంద్రియ సుఖము గోప - గోపికలను అడగాలని గాయనము ఉందో అది చివరి సమయానికి సంబంధించిన విషయము. ఇప్పుడింకా నంబరువారుగా ఉన్నారు. కొందరైతే లోలోపలే ఆనంద గీతమును పాడుతూ ఉంటారు. ఆహా! మాకు పరమపిత పరమాత్మ లభించారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని పాడుతూ ఉంటారు. వారి వద్ద ఏ ఫిర్యాదులు ఉండవు. ఎవరైనా ఏమైనా అన్నా వినీ విననట్లుండి మీ మస్తీలో నిమగ్నమై ఉండాలి. ఏదైనా వ్యాధి లేక దు:ఖము ఉంటే మీరు కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాన్ని మీరిప్పుడే సమాప్తము చేసుకోవాలి. తర్వాత 21 జన్మలకు మీరు పుష్పాలుగా అవుతారు. అక్కడ దు:ఖము కలిగించే విషయాలేవీ ఉండవు. ఖుషీ లాంటి ఆహారము(టానిక్) లేదని గాయనము చేయబడింది. సంతోషము ద్వారా నీరసము మొదలైనవి ఎగిరిపోతాయి. ఇందులో సత్యమైన సంతోషముంది. అది అసత్యమైన ఖుషీ, మనుష్యులకు ధనము దొరికింది, ఆభరణాలు దొరికాయి అంటే సంతోషిస్తారు. ఇది బేహద్ విషయము. మీరు అపారమైన సంతోషములో ఉండాలి. మనము 21 జన్మలకు సదా సంతోషంగా ఉంటామని మీకు తెలుసు. ' మేము ఎలా అవుతాము ' అను స్మృతిలో ఉండండి. బాబా అనగానే దు:ఖము పటాపంచలైపోవాలి. ఇది 21 జన్మల ఖుషీ. ఇప్పుడు సమయం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మనము మన సుఖధామానికి వెళ్తాము. మరి ఇంకేమీ జ్ఞాపకముండరాదు. ఈ బాబా తన అనుభవాన్ని తెలిపిస్తున్నారు. ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి. బాబాకు ఏ విషయములోనూ దు:ఖము కలుగదు. వింటారు, మంచిది ఇది డ్రామాలోని నిర్ణయము(డ్రామా కీ భావీ) అని అంటారు. ఇదేమంత పెద్ద విషయము కాదు ఎందుకంటే మీరు తరగని ఖజానాకు అధిపతులుగా అవుతామని అంటారు. తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటే సంతోషము కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు. వారి ముఖము కూడా చాలా సంతోషంగా ఉంటుంది. స్కాలర్‌షిప్ మొదలైనవి లభిస్తూ ఉంటే ముఖము ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణుల వలె హర్షితంగా ఉండేందుకు పురుషార్థము చేస్తున్నారు. వీరిలో జ్ఞానము లేదు. మీలో జ్ఞానము కూడా ఉందంటే ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి. హర్షితంగా కూడా ఉండాలి. ఈ దేవతల కంటే మీరు చాలా శ్రేష్ఠమైనవారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఎంతో శ్రేష్ఠమైన జ్ఞానమునిస్తున్నారు. అవినాశి జ్ఞానరత్నాల లాటరీ లభిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉండాలి. ఇది మీ వజ్ర తుల్యమైన జన్మ అని మహిమ చేయబడ్తుంది. జ్ఞానసాగరులని తండ్రినే అంటారు, ఈ దేవతలను అలా అనరు. బ్రాహ్మణులైన మీరే జ్ఞానసాగరులు కనుక మీకు జ్ఞాన సంబంధమైన సంతోషం ఉంటుంది. ఒకటేమో తండ్రి లభించారన్న సంతోషము. మీకు తప్ప ఈ సంతోషము ఎవ్వరికీ ఉండదు. భక్తిమార్గములో అణువు అణువులో సుఖము ఉండదు. భక్తిమార్గములో కృత్రిమమైన అల్పకాలిక సుఖము ఉంటుంది. దాని పేరే స్వర్గము. సుఖధామము, హెవెన్. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. ఇక్కడ అపారమైన దు:ఖము ఉంది. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతూ ఉంది. రావణ రాజ్యములో మనమెంత ఛీ-ఛీ(అసహ్యము)గా అయిపోయాము! మెల్ల-మెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము. ఇది విషయ సాగరము. ఇప్పుడు తండ్రి ఈ విషయ సాగరము నుండి వెలుపలికి తీసి మిమ్ములను క్షీర సాగరములోనికి తీసుకెళ్తారు. పిల్లలకు ఇక్కడ చాలా మధురంగా ఉంటుంది. మర్చిపోగానే ఎటువంటి స్థితి తయారవుతుంది!. తండ్రి సంతోష పాదరస మట్టమును ఎంతగానో పెంచుతారు. ఇది జ్ఞానామృతాన్ని గురించిన మహిమ. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నషా ఎక్కుతుంది. మళ్లీ వెలుపలకు వెళ్ళగానే ఆ నషా తగ్గిపోతుంది. బాబా స్వయంగా అనుభవము చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు చాలా మంచి అనుభవమవుతుంది - ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్లిపోతాము, తండ్రి శ్రీమతమనుసారంగా రాజధానిని స్థాపన చేస్తున్నాము. మనము గొప్ప యోధులము ఈ జ్ఞానమంతా మన బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు ఇంత(లక్ష్మీ నారాయణులు) శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. చదివించే వారెవరో చూడండి. అనంతమైన తండ్రి పూర్తిగా పరివర్తన చేసేస్తారు. కావున పిల్లల మనస్సులో ఎంత సంతోషముండాలి. ఇతరులకు కూడా సంతోషమును పంచాలనిపిస్తుంది. రావణుని ద్వారా శాపము, తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. రావణుని శాపము వలన మీరు ఎంతో దు:ఖితులుగా, అశాంతిగా అయిపోయారు. సర్వీసు చేయాలని అనేకమంది గోపులకు అనిపిస్తుంది. కానీ కలశము మాతలకు లభిస్తుంది. శక్తిదళము కదా. వందేమాతరం అని మహిమ చేయబడ్తుంది. జతలో వందేపితరమ్ ఉండనే ఉంది. కానీ పేరు మాతలదే. మొదట లక్ష్మి తర్వాత నారాయణ. మొదట సీత తర్వాత రాముడు. ఇక్కడ మొదట పురుషుని పేరు తర్వాత స్త్రీ పేరు వ్రాస్తారు. ఇది కూడా ఆటయే కదా. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. భక్తిమార్గములోని రహస్యాలు కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేం జరుగుతుందో తెలుపుతారు. జ్ఞానము తెలియనంతవరకు కొద్దిగా కూడా అర్థము కాదు. మొదట అవిద్యావంతులుగా, సభ్యత లేనివారిగా ఉండేవారము. మలినములో పడి ఉంటిమి. ఇప్పుడు అందరి నడవడికలు చక్కబడ్తాయి. మీది దైవీ స్వభావంగా తయారవుతూ ఉంది. పంచ వికారాల వలన రాక్షస స్వభావంగా అయిపోతుంది. ఎంత పరివర్తన జరుగుతోంది! కనుక మార్పు రావాలి కదా. శరీరము వదిలేసిన తర్వాత పరివర్తనవ్వలేరు. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో పరివర్తన తెస్తున్నారు. చాలా మంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు - మేము చాలా కాముకులుగా, తాగుబోతులుగా ఉండేవారము, మాలో చాలా పరివర్తన వచ్చింది. ఇప్పుడు చాలా ప్రేమతో ఉంటాము అని వ్రాస్తారు. ప్రేమభాష్పాలు కూడా వచ్చేస్తాయి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తారు. కానీ ఈ విషయాలన్నీ మర్చిపోతారు. లేకుంటే వాస్తవానికి ఖుషీ పాదరస మట్టము పెరిగే ఉండాలి. మనము అనేమంది కళ్యాణము చేయాలి. మనుష్యులు చాలా దు:ఖములో ఉన్నారు. మనము వారికి దారి చూపించాలి. తెలిపించేందుకు కూడా ఎంతో కష్టపడవలసి వస్తుంది. తిట్లు కూడా తినవలసి వస్తుంది. వీరు అందరినీ సోదరీ-సోదరులుగా చేసేస్తారని ముందే ప్రచారముంది. అరే! సోదరీ-సోదరుల సంబంధము మంచిదే కదా. ఆత్మలైన మీరు సోదరులు(భాయి-భాయి) కానీ జన్మ-జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది త్వరగా వదలదు. బాబా వద్దకు చాలా సమాచారము వస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి పిల్లలైన మీ మనసు పూర్తిగా తొలగిపోవాలి. పుష్పాలుగా అవ్వాలి. ఇంత జ్ఞానమును విని కూడా మర్చిపోతారు. జ్ఞానము పూర్తిగా ఎగిరిపోతుంది. కామము మహాశత్రువు కదా. బాబా చాలా అనుభవీ. ఈ వికారాలకు వశమై అనేక రాజులు తమ రాజ్యాలనే పోగొట్టుకున్నారు. కామము చాలా చెడ్డది. బాబా, ఇది చాలా కఠినమైన శత్రువని అందరూ చెప్తారు. తండ్రి చెప్తున్నారు - కామమును జయించడం వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ కామ వికారము ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసి మళ్లీ పడిపోతారు. చాలా శ్రమిస్తే ఎవరో ఒకరు బాగుపడ్తారు. ఈ సమయములో పూర్తి ప్రపంచ స్వభావము దిగజారి ఉంది. పావన ప్రపంచము ఎప్పుడు ఉండేదో, అది ఎలా తయారయిందో, వీరు రాజ్యభాగ్యమును ఎలా పొందుకున్నారో ఎవ్వరూ తెలపలేరు.
పోను పోను మీరు విదేశాలకు కూడా వెళ్ళే సమయము వస్తుంది. వారు కూడా వింటారు. స్వర్గము ఎలా స్థాపనౌతుంది. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా కూర్చున్నాయి. కావున మీకు ఇదే చింత ఉండాలి, ఇతర విషయాలన్నీ మర్చిపోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లేస్తూ-కూర్చుంటూ-నడుస్తూ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ముత్యాలు ఏరుకునే హంసలుగా అవ్వాలి. అందరి నుండి గుణాలనే గ్రహించాలి. పరస్పరములో గుణాలనే నింపాలి.
2. మీ ముఖము సదా హర్షితంగా ఉండేందుకు మీతో మీరే ఇలా మాట్లాడుకోండి - ఓహో! మేము తరగని ఖజానాకు(కుబేరనుని ఖజానాలకు) అధికారులుగా అవుతాము. జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మాకు జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తూ ఉంది.
వరదానము :- '' సదా సంతుష్టంగా ఉంటూ మీ వృత్తి, దృష్టి, కృతి (కర్మ) ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణి భవ ''
బ్రాహ్మణ కులంలో ఎవరైతే సదా సంతుష్టత అనే విశేషత ద్వారా స్వయం సంతుష్టంగా ఉంటూ తమ వృత్తి, దృష్టి, కర్మల ద్వారా ఇతరులకు కూడా సంతుష్టతను అనుభవం చేయిస్తారో, వారే విశేషమైన ఆత్మలు. ఎవరైతే సదా సంకల్పము, మాట, సంబంధ-సంపర్కాలు లేక కర్మలలో బాప్‌దాదా ద్వారా తమ పై సంతుష్టత అనే సువర్ణ పుష్పాలను అనుభవం చేస్తారో వారే సంతుష్టమణులు. ఇటువంటి సంతుష్టమణులే బాప్‌దాదాకు కంఠహారంగా అవుతారు, రాజ్యాధికారులుగా అవుతారు, భక్తుల స్మరణ మాలగా అవుతారు.
స్లోగన్ :- '' నెగటివ్‌ను(నకారాత్మకతను), వ్యర్థాన్ని సమాప్తం చేసి మెహనత్ (శ్రమ) ముక్తులుగా అవ్వండి ''
No comments:
Post a Comment