Monday, November 4, 2019

Telugu Murli 05/11/2019

05-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తున్నా చూడకండి, వాటి పై మమకారమును తొలగించండి, ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది.''

ప్రశ్న :- ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వము చేసే గుప్త కర్తవ్యమేది ?
జవాబు :- ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యము. దీనిని మనుష్యులు అర్థం చేసుకోలేరు. మనుష్యులు దేవతలుగా అయినప్పుడు, నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావము(క్యారెక్టర్‌)ను పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ట స్వభావము గలవారిగా చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము.

ఓంశాంతి. ఓంశాంతి అన్నప్పుడు మన ఆత్మ స్వధర్మము, మన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలాగని ఇంటిలోనే కూర్చుండిపోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము, కనుక స్వర్గ వారసత్వము తప్పకుండా గుర్తుకొస్తుంది. ఓంశాంతి అని అనడం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతిసాగరుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుకొస్తుంది. స్వర్గ స్థాపన చేసే తండ్రే మనలను పవిత్రంగా, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచము. పవిత్ర ప్రపంచములో ఒక్క వికారము కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచములో 5 వికారాలున్నాయి. అందుకే దీనిని వికారాల ప్రపంచమని అంటారు. అది నిర్వికార ప్రపంచము. నిర్వికార ప్రపంచము నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్లీ క్రిందకు అనగా వికారాల ప్రపంచములోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. రామ రాజ్యము, రావణ రాజ్యము అని అంటారు కదా. సమయానుసారము పగలు, రాత్రి అని గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖము, రాతి అంటే దు:ఖము. రాత్రిలో వెతకడం జరుగుతుంది. నిజానికి రాత్రి(చీకటి)లో ఎవ్వరూ వెతకరు. అయితే భక్తిని 'వెతకడము' అని అంటారు. పిల్లలైన మీరు సద్గతి పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఆత్మలైన మీలో పంచ వికారాల కారణంగా పాపముంది. అందులోనూ ముఖ్యమైనది కామ వికారము. దాని వల్లనే మనుష్యులు పాపాత్మలుగా అవుతారు. మనము పతితులుగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారముతోనే జన్మించారు. ఒకే ఒక్క కామ వికారము కారణంగా మీ అర్హతలన్నీ(క్వాలిఫికేషన్స్‌,) పాడైపోతాయి. అందుకే ఈ కామ వికారమును జయిస్తే జగత్‌జీతులుగా, నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అందువలన ఆంతరికములో ఎంత సంతోషముండాలి! మానవులు పతితమైపోయినందున వారు ఏ మాత్రము అర్థం చేసుకోరు. ఈ కామ వికారము కొరకే ఎన్నో గలాటాలు జరుగుతున్నాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచములో హాహాకారాలెందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్మలుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులనబడ్తారు. ఇప్పుడు తండ్రి ద్వారా మనము గవ్వ సమానము, పైసకు కొరగాకుండా(వర్త్‌ నాట్‌ ఏ పెెన్నీ) ఉండేవారమని అర్థం చేసుకున్నారు. పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు(కామదహన పండుగ). ఈ ప్రపంచములో పనికి వచ్చే వస్తువే లేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవమాత్రులందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కనులతో చూచే వాటికంతా నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు(అగ్నిలో కాలదు). ఆత్మ భీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా భీమా చేయిస్తారా! శరీరాన్ని భీమా చేయిస్తారు. ఇది ఆట(డ్రామా) అని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఉపరి భాగములో పంచ తత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచములోని వస్తువులు, పదార్థములన్నీ పంచ తత్వాలతోనే తయారైనవి. ఆత్మ అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ, పాపాత్మగా అవుతూ ఉంటుంది. 5 వికారాల వలన ఎంతో మురికిగా తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకు తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు(క్యారెక్టర్లు) చెడిపోతాయి. క్యారెక్టరు అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పాండవ రాజ్యము, కౌరవ రాజ్యము అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. మనము ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందినవారమని మీరు భావిస్తున్నారు. రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయములో ఈశ్వరీయ ప్రభుత్వము ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడ నుండి వస్తారు! ఇది ఎవ్వరికీ తెలియదు. అందుకే దీనిని 'గుప్త ప్రభుత్వము' అని అంటారు. ఇది కూడా మానవులదే కానీ దేవతలుగా ఎలా తయారవ్వాలి, ఎవరు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గములోనే ఉంటారు అయితే వారిని స్వర్గవాసులుగా చేసింది ఎవరు? స్వర్గవాసులే మళ్లీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్లీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలియదు. మీకే తెలియకుంటే ఇతరులకెలా తెలుస్తుంది? స్వర్గమని సత్యయుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతితుల నుండి పావనంగా చేయుటకే. ఆత్మయే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రే మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచములోకి వెళ్తారు. ఆత్మయే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానము మీకు ఈ సంగమ యుగములో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతితపావనుడని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్ములను పావనంగా చేయండి అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. శ్యామము, సుందరము(పతితము, పావనము) వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుష్యులకు దాని అర్థము తెలియదు. కృష్ణుడంటే ఎవరో స్పష్టమైన జ్ఞానము కూడా లభిస్తుంది. ఇందులో రెండు ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచము. అదే ప్రపంచము క్రొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు, వారే పెరిగి పెద్దవారై వృద్ధులుగా అవుతారు. అలాగే ఈ ప్రపంచము కూడా కొత్తది నుండి పాతదిగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను అర్థం చేయించేందుకు మీరెంతగానో తలను బాదుకుంటారు(కష్టపడతారు). మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ జ్ఞానము ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. భగవంతుడు మనలను ఎంతో తెలివిగలవారిగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తున్నారు. శివాలయానికి వెళ్లి నమస్కరిస్తారు. అయితే వారెవరు? ఏమిటి? అనేది ఎవ్వరికీ తెలియదు. శివకాశి విశ్వనాథ గంగ,.............. అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు. కానీ అర్థం కొంచెము కూడా తెలియదు. మీరు తెలిపితే, మీరు మాకేం చెప్తారు? మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నామని అంటారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నెంబరువారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తి రాతిబుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారస(బంగారు) బుద్ధిగా అయినవారి కర్తవ్యము - ఇతరులను కూడా పారసబుద్ధిగా తయారు చేయడం. రాతి బుద్ధిగలవారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే హంసలు-కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖము ఇవ్వరు. కొంగలు దు:ఖమునిస్తారు. అటువంటి వారిని అసురులని అంటారు. వారిని గుర్తు పట్టలేము. చాలా సెంటర్లకు కూడా ఇలాంటి వికారులు చాలామంది వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు. కానీ చెప్పేదంతా అసత్యము. అసత్య ప్రపంచము.......... అని కూడా అంటారు. ఇప్పుడిది సంగమ యుగము. ఎంత వ్యత్యాసముంది. అసత్యము చెప్పేవారు, అసత్య కర్మలు చేయువారు మూడవ గ్రేడ్‌గా అవుతారు. ఫస్ట్‌, సెకెండు, థర్డ్‌ గ్రేడులు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు - ఇది థర్డ్‌ గ్రేడ్‌.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పవిత్రతకు పూర్తి ఋజువునివ్వండి. ఉదాహరణంగా అవ్వండి. మీరిరువురూ (స్త్రీ, పురుషులు) కలిసి పవిత్రంగా ఉండడం అసంభవమని చాలామంది అంటారు. కానీ పిల్లలలో యోగబలము లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్ణ రీతిగా అర్థము చేయించలేరు. ఇక్కడ మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారనే విషయము వారికి ఎవ్వరూ అర్థం చేయించలేరు. పవిత్రులవ్వడం వలన మీరు 21 జన్మలు స్వర్గానికి అధికారులవుతారని భగవంతుడు చెప్తున్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహము చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీ దేవతలు పవిత్రులు కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాలను గురించి కూడా అర్థం చేయించారు. జ్ఞానము సగము, భక్తి సగము, భక్తి తర్వాత వైరాగ్యము. ఇప్పుడు ఈ పతిత ప్రపంచములో ఉండరాదు, ఈ శరీరమనే వస్త్ర్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్లాలి. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యింది. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదట అల్ఫ్‌(శివబాబా)ను మర్చిపోరాదు. పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుందని పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్లీ నరకము వినాశనమవుతుంది. నరకము చాలా పెద్దది. స్వర్గము చాలా చిన్నది. నూతన ప్రపంచములో ఒకే ధర్మము ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. శంకరుని ద్వారా వినాశనమవుతుందని వ్రాయను కూడా వ్రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక ధర్మము స్థాపనవుతుంది. ఈ ధర్మాన్ని స్థాపించిన వారెవరు? బ్రహ్మ అయితే చేయలేడు. ఈ బ్రహ్మనే పతితము నుండి మళ్లీ పావనంగా అవుతాడు. నన్ను ఎప్పుడూ పతితము నుండి పావనంగా అవుతానని అనరు. పావనులనగా లక్ష్మీనారాయణులు. పతితమంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. వారిని(శివబాబాను) అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. నన్ను ఆత్మల సృష్టికర్త అని అనరు. అందుకే ఆత్మలను అనాది అని అంటారు. తండి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారుచేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల వ్యవధి గురించిన జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందినవారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యములో అనాథలైపోతారు. ఆ స్వభావము, గుణాలు చెడిపోతాయి. వికారాల వశమైపోతారు. నరకము, స్వర్గము కలిసి నడుస్తాయని మానవులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడ్తుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. పిల్లలెంతో గందరగోళములో పడి ఉన్నారు. మేమెందుకూ పనికి రాకుండా ఉన్నామని, మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండి అని తండ్రిని పిలుస్తారు. వారు వచ్చి మీ స్వభావమును, మీ వ్యక్తిత్వమును ఎంతగా బాగు చేస్తారు! చక్కదిద్దుతారు! కొంతమంది బాగుపడేందుకు బదులు ఇంకా పాడవుతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈ రోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏ మాత్రము కనిపించదు. బయటకు వెళ్తూనే కనిపిస్తుంది. మళ్లీ ఆశ్చర్యంగా వింటారు, చెప్తారు....... పారిపోతారు. ఎముకలు విరుగునట్లు వేగంగా క్రింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థము. వెంటనే తెలిసిపోతుంది. అటువంటివారు మళ్లీ సభలోకి రాకూడదు. కొద్దిగా జ్ఞానము విన్నా స్వర్గములోకి రానే వస్తారు. జ్ఞానము నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పురుషార్థము చేసి ఉన్నత పదవి పొందుకోండి. వికారాలకు వశమైతే పదవి భ్రష్ఠమైపోతుంది. ఇప్పుడు సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతుంది. అయినా మాయ మళ్లీ తప్పకుండా మోసము చేస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరికా మిగిలిపోలేదు కదా. అలా ఉంచుకుంటే పైసకు కొరగాకుండా అయిపోతారు. మంచి-మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తుంది. అటువంటివారు మళ్లీ హృదయమును అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనుకాడరు, ఆలస్యము చేయరు. కుటుంబాన్ని కూడా సమాప్తము చేసేస్తారు. వారు మహాపాపాత్మలు. రావణుడు ఏమేమో చేయిస్తాడు. చాలా అసహ్యము కలుగుతుంది. ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది! దీని పై ఎప్పుడూ మనసు ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యముండాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రత విషయములో ఎన్నో గలాటాలు జరుగుతాయి. గాంధీ కూడా ''ఓ పతితపావనా! రండి'' అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - చరిత్ర, భూగోళాలు మళ్లీ రిపీట్‌ అవుతాయి. అందరూ వాపస్‌ రావలసిందే. అప్పుడే అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవ్వరూ ఇంటికి వెళ్లలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మాయ చేసే మోసము నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. ఇచ్ఛా మత్రం అవిద్యగా అవ్వాలి.
2. విశ్వ చక్రవర్తిత్వ పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యము వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి.

వరదానము :- '' దయా భావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ (లగావ్‌) ముక్త్‌ భవ ''
వర్తమాన సమయంలో ఆత్మలందరు అలసి, నిరాశ చెంది దయ, కరుణను వేడుకుంటున్నారు. ఇప్పుడు దాత పిల్లలైన మీరు మీ సోదరి - సోదరుల పై దయాహృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారైనా వారి పై కూడా దయా భావన కలిగి ఉంటే ఎప్పుడూ ఘృణ, ఈర్ష్య లేక క్రోధ భావన రాదు. దయా భావన సహజంగా నిమిత్త భావమును ఉత్పన్నము చేస్తుంది. ఆకర్షణ వలన దయ కలగదు. సత్యమైన దయ ఆకర్షణ ముక్తులుగా చేస్తుంది. ఎందుకంటే అందులో దేహ భావముండదు.

స్లోగన్‌ :- '' ఇతరులకు సహయోగమివ్వడమే స్వంత ఖాతాను జమ చేసుకోవడం ( పెంచుకోవడం ) ''

No comments:

Post a Comment