12-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరిప్పుడు టీచర్లుగా అయ్యి అందరికీ మనసును వశీకరణము చేసుకునే మంత్రమును వినిపించాలి, ఇది పిల్లలైన మీ అందరి కర్తవ్యము.''
ప్రశ్న :- బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు ?
జవాబు :- నేను ఇంత ఇస్తాను, నేను ఇంత సహయోగము చేయగలుగుతాను,...... ఇటువంటి అహంకారము గలవారిది బాబా కొద్దిగా కూడా స్వీకరించరు. బాబా చెప్తున్నారు - నా చేతిలో తాళంచెవి ఉంది. అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా, శ్రీమంతులుగా తయారుచేస్తాను. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. ఈ రోజు ఎవరికైతే తమ షాహుకారుతనపు అహంకారముందో, వారు రేపు భికారులైపోతారు కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యములో సఫలము చేసుకొని ధనవంతులైపోతారు.
ఓంశాంతి. తండ్రి మనకు నూతన ప్రపంచ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తామో అంతంత పవిత్రంగా అవుతామని పిల్లలకు పక్కా నిశ్చయముంది. మనము ఎంత మంచి టీచరుగా అవుతామో అంత ఉన్నత పదవిని పొందుతాము. తండ్రి మీకు టీచరు రూపములో చదివించడము నేర్పిస్తున్నారు. తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి. మీరు చదివించే టీచరుగా తప్పకుండా అవుతారు కానీ గురువుగా అవ్వలేరు, కేవలం టీచరుగా మాత్రమే అవ్వగలరు. గురువు అనగా ఒక్క సద్గురువు మాత్రమే, వారే నేర్పిస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరు మాత్రమే. వారే టీచరుగా తయారుచేస్తారు. మీరు సర్వులకు శిక్షణనిస్తూ మన్మనాభవ మార్గమును అర్థం చేయిస్తూ ఉంటారు. తండి మీ అందరికి ''నన్ను స్మృతి చేయండి'' మరియు టీచరుగా అవ్వండి అనే కర్తవ్యాన్ని అప్పగించారు. మీరెవరికైతే తండ్రి పరిచయమును ఇస్తున్నారో వారి కర్తవ్యము కూడా తండ్రిని స్మృతి చేయడమే. టీచరు రూపములో సృష్టిచక్ర జ్ఞానము ఇవ్వవలసి వస్తుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశించాలి. మనము పాపాత్మలమని అందుకే స్వయాన్ని ఆత్మగా భావించి తనను స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబాయే పతితపావనులు, పావనమయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. మధురమైన పిల్లలారా! - మీ ఆత్మ పతితమైపోయింది. అందువలన మీ శరీరము కూడా పతితమైపోయింది. మొదట మీరు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు మీరు అపవిత్రమైపోయారు. ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారు గంగా స్నానాలు చేస్తారు కనుక గంగను స్మృతి చేస్తారు. గంగను పతితపావనిగా భావిస్తారు. మరి గంగను స్మృతి చేయగానే పావనమవ్వాలి కానీ తండ్రి చెప్తున్నారు - ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. నీటి ద్వారా పావనంగా ఎలా అవ్వగలరు? తండి చెప్తున్నారు - నేను పతితపావనుడను. ''ఓ పిల్లలారా, దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలను వదిలి నన్ను స్మృతి చేస్తే మీరు పావనులై తిరిగి మీ ఇల్లైన ముక్తిధామాన్ని చేరుకుంటారు.'' కల్పమంతా ఇంటిని మర్చిపోయారు. పూర్తి కల్పములో తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి వీరి నోటి ద్వారా తన స్వంత పరిచయమును ఇస్తున్నారు. ఈ నోటికి ఎంతో గొప్ప మహిమ ఉంది. గోముఖమని అంటారు కదా. ఆ గోవు అనగా జంతువు. ఇది మానవ సంబంధమైన విషయము.
వీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు. ఈ తల్లి ద్వారానే శివబాబా మిమ్ములనందరిని దత్తు చేసుకున్నారు. మీరిప్పుడు బాబా-బాబా అనడము మొదలు పెట్టారు. ఈ స్మృతియాత్ర ద్వారానే మీ పాపాలు నశిస్తాయని తండ్రి కూడా చెప్తున్నారు. పిల్లలకు తండ్రి గుర్తు వస్తారు కదా. వారి ముఖము మొదలైనవి మనసులో కూర్చునేస్తాయి. మనమెలా ఆత్మలమో అలా వారు పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ముఖములో ఇంకేమీ తేడా లేదు. శారీరిక సంబంధాలలో అయితే రూపురేఖలు మొదలైనవి వేరుగా ఉంటాయి, కానీ ఆత్మ ఒకేలాగ ఉంటుంది. మన ఆత్మ ఎలా ఉంటుందో మన తండ్రి పరమాత్మ కూడా అలాగే ఉంటారు. తండ్రి పరంధామములో ఉంటారు, మనము కూడా పరంధామములో ఉంటామని, మన ఆత్మకు, తండ్రి ఆత్మకు ఏ వ్యత్యాసము లేదని, వారు కూడా బిందువే, మనము కూడా బిందువే అని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. మీకు మాత్రమే తండ్రి తెలియచేశారు. తండ్రిని గురించి కూడా ఏమేమో అనేస్తారు. సర్వవ్యాపి అని అంటారు, రాళ్ళు, రప్పలలో ఉన్నారు.......... ఎవరికి ఏం తోస్తే అది అనేస్తూ ఉంటారు. డ్రామా ప్లాను అనుసారము భక్తిమార్గములో తండ్రి నామ-రూప-దేశ-కాలాలను మర్చిపోతారు. మీరు కూడా మర్చిపోతారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది. బిడ్డ తండ్రిని మర్చిపోతే ఇంకేమి తెలుసుకుంటారు అనగా అనాథలైపోయారు. తండ్రిని స్మృతియే చేయరు. తండ్రి పాత్ర గురించే తెలియనే తెలియదు. స్వయాన్ని కూడా మర్చిపోతారు. మర్చిపోయామని మీకు బాగా తెలుసు. మొదట మనము ఇటువంటి దేవీదేవతలుగా ఉండేవారము, ఇప్పుడు జంతువుల కంటే హీనమైపోయాము. ముఖ్యమైనది మనము ఆత్మలమనే విషయాన్ని మర్చిపోయాము. ఇప్పుడు అర్థము చేయించేది ఎవరు? మేము ఆత్మలమని, పాత్రాభినయము చేస్తున్నామని ఏ జీవాత్మకూ తెలియదు. మనమంతా సోదరులము(భాయి-భాయి) అనే ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు. ఈ సమయంలో పూర్తి సృష్టియే తమోప్రధానమై ఉంది. జ్ఞానమే లేదు. మీలో ఇప్పుడు జ్ఞానముంది. ఆత్మలమైన మనము ఇంతవరకు తండ్రిని గ్లాని చేస్తూ వచ్చామని గ్రహించారు. గ్లాని చేసినందున తండ్రి నుండి దూరమవుతూ వచ్చారు. డ్రామా ప్లాను అనుసారము మెట్లు దిగుతూనే వచ్చారు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. తండ్రి ఇంకే కష్టమును ఇవ్వరు. పిల్లలకు కేవలం తండ్రిని స్మృతి చేసే శ్రమ మాత్రమే ఉంది. తండ్రి ఎప్పుడైనా పిల్లలకు కష్టమును ఇవ్వగలరా! చట్టము అలా చెప్పదు. తండ్రి చెప్తున్నారు - నేను ఎటువంటి కష్టమును ఇవ్వను. ఏవైనా ప్రశ్నలు అడిగితే, ఈ విషయాలలో సమయాన్ని ఎందుకు వ్యర్థము చేస్తారని అడుగుతాను. తండ్రిని స్మృతి చేయండి. నేను మిమ్ములను తీసుకెళ్లేందుకే వచ్చాను. కావున పిల్లలైన మీరు స్మృతియాత్ర ద్వారా పావనమవ్వండి. నేనే పతితపావనుడైన తండ్రిని. తండ్రి యుక్తిని తెలియచేస్తున్నారు - భలే ఎక్కడికైనా వెళ్ళండి, తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మల చక్ర రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి - ఎంతవరకు మేము తండ్రిని స్మృతి చేస్తున్నాము? అంతే ఇక వేరే ఏ వైపూ ఆలోచించరాదు. ఇది అత్యంత సులభము. తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు కొద్దిగా పెద్దవారవ్వగానే స్వతహాగా తల్లిదండ్రులను స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఆత్మలమైన మేము తండ్రి పిల్లలమని భావించండి. తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి? మన పై ఏదైతే పాపము పేరుకొని ఉందో, ఆ పాపము కేవలం స్మృతి ద్వారానే సమాప్తమవుతుంది. అందుకే ఒక సెకండులో జీవన్ముక్తి అని గాయనముంది. జీవన్ముక్తికి ఆధారము చదువు, ముక్తికి ఆధారము స్మృతి. ఎంతెంత మీరు తండ్రిని స్మృతి చేస్తారో, చదువు పై గమనమిస్తారో అంతంత శ్రేష్ట పదవిని పొందుతారు. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చేస్తూ ఉండండి, తండ్రి చేయవద్దని అనరు. మీరు చేస్తూ ఉన్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ రాత్రింబవళ్ళు గుర్తుకు వస్తాయి కదా. కనుక బాబా ఇప్పుడు ఆత్మిక కర్తవ్యాన్ని ఇస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి, 84 జన్మల చక్రమును స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తేనే మీరు సతోప్రధానంగా అవుతారు. ఇప్పుడుండేది పాత శరీరము తర్వాత సతోప్రధానమైన నూతన శరీరము లభిస్తుందని కూడా తెలుసు. మీ బుద్ధిలో సారమును ఉంచుకోవాలి. దీని వలన చాలా లాభము కలుగుతుంది. పాఠశాలలో చాలా సబ్జక్టులు ఉంటాయి. వాటిలో కూడా ఆంగ్లభాష పై చాలా గమనముంచుతారు ఎందుకంటే ఆంగ్ల భాష ముఖ్యమైనది. మొదట వారి రాజ్యముండేది. కనుక అది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు కూడా భారతీయులు ఋణగ్రస్థులే. భలే ఎంత ధనవంతులైనా, మన దేశములోని నాయకులు ఋణగ్రస్థులే అనగా భారతీయులైన మనము ఋణగ్రస్థులమని బుద్ధిలో ఉంటుంది. మేము ఋణగ్రస్థులమని ప్రజలు తప్పకుండా అంటారు కదా. ఈ బుద్ధి కూడా ఉండాలి కదా ఎందుకంటే మీరిప్పుడు రాజ్యమును స్థాపిస్తున్నారు. మేమిప్పుడు ఈ అప్పుల నుండి విడుదలై సంపన్నులౌతామని తర్వాత అర్ధకల్పము వరకు ఎటువంటి అప్పులు ఉండవని పిల్లలైన మీకు తెలుసు. ఋణగ్రస్థులు పతిత ప్రపంచానికి అధికారులు. ఇప్పుడు మనము ఋణగ్రస్థులమే కాక పతిత ప్రపంచానికి అధికారులము. మా భారతదేశము ఇలా ఉందని పాడ్తారు కదా.
మేము చాలా ధనవంతులుగా ఉండేవారమని పిల్లలైన మీకు తెలుసు. దేవీదేవతలుగా ఉండేవారము. ఇది స్మృతిలో ఉంటుంది. మనము ఇటువంటి(లక్ష్మీనారాయణులు) విశ్వాధికారులుగా ఉండేవారము. ఇప్పుడు పూర్తి ఋణగ్రస్థులుగా, పతితులుగా అయిపోయాము. ఈ ఆట ఫలితాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫలితము ఏమయింది? పిల్లలైన మీకు సత్యయుగములో మనమెంత ధనవంతులుగా ఉండేవారమో మనలను ఎవరు అంత ధనవంతులుగా చేశారో అంతా స్మృతి వచ్చింది. పిల్లలు చెప్తారు - బాబా, మీరు మమ్ములను ఎంత ధనవంతులుగా తయారుచేశారు? ధనవంతులుగా తయారు చేయువారు ఒక్క తండి మాత్రమే. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన అంతా మర్చిపోయారు, ఏమీ తెలియదు. మీరిప్పుడు అంతా తెలుసుకున్నారు. మనము పదమాపదమ్ శ్రీమంతులుగా ఉండేవారము. అత్యంత పవిత్రులుగా, అత్యంత సుఖీలుగా ఉండేవారము. అక్కడ అసత్యము, పాపము మొదలైనవేవీ జరగవు. పూర్తి విశ్వము పై, మీరు విజయాన్ని పొందారు. అందుకే - ''శివబాబా, మీరేం ఇస్తారో దానిని మరెవ్వరూ ఇవ్వలేరు'' అని గాయనముంది. అర్ధకల్పము సుఖమునిచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. బాబా చెప్తున్నారు - భక్తిమార్గములో కూడా మీ వద్ద అనంతమైన సుఖము, ధనము ఉండేది. లెక్కలేనన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి మళ్లీ చివర్లో వచ్చేవారి చేతిలోకి వస్తాయి. ఇప్పుడు ఆ వస్తువులు కనిపించనే కనిపించవు. మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా. మీరే పూజ్య దేవీదేవతలుగా ఉండేవారు మళ్లీ మీరే పూజారులుగా అయిపోయారు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు కానీ పూజార్ల ప్రపంచములోకి వస్తారు కదా. తండ్రి సదా పూజ్యులుగానే ఉంటారు. వారెప్పుడూ పూజారిగా అవ్వరు. కానీ మిమ్ములను పూజారి నుండి పూజ్యులుగా చేయడమే వారి కర్తవ్యము. రావణుని కర్తవ్యము - మిమ్ములను పూజార్లగా చేయడం. ఇది ప్రపంచములోని వారెవ్వరికీ తెలియదు. మీరు కూడా మర్చిపోతారు. ప్రతి రోజు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరినైనా షాహుకార్లుగా తయారు చేయడం లేక నిరుపేదలుగా తయారుచేయడం - ఇది తండ్రి చేతిలో ఉంది. తండ్రి చెప్తున్నారు - ఎవరు ధనవంతులుగా ఉన్నారో వారు తప్పకుండా పేదలుగా అవ్వాలి, అవ్వనే అవుతారు. వారి పాత్ర అలా ఉంది. వారు ఎప్పుడూ నిలువలేరు. ధనవంతులకు చాలా అహంకారము కూడా ఉంటుంది కదా. నేను ఫలానా, మా వద్ద ఇవన్నీ ఉన్నాయి. అటువంటివారు సేవ కొరకు ఇస్తామని వచ్చినప్పుడు వారి అహంకారాన్ని పారద్రోలేందుకు - అవసరము లేదని, మీ వద్దనే ఉంచుకోండి, అవసరమైతే తీసుకుంటానని బాబా చెప్తారు. ఎందుకంటే అహంకారముతో ఇచ్చేదని, అది పనికిరాదని బాబా గమనిస్తారు. కావున అంతా బాబా చేతిలోనే ఉంది. తీసుకోవడం, తీసుకోకపోవడం అంతా బాబా చేతిలో ఉంది కదా. బాబా ధనము తీసుకొని ఏం చేస్తారు, అవసరము లేదు. ఈ భవనాలన్నీ పిల్లల కొరకు తయారు చేస్తున్నారు వచ్చి బాబాతో మిలనము చేసి వెళ్లాలి. సదా ఇక్కడే ఉండరు. ధనము అవసరమేముంటుంది. ఏ సైనిక శిబిరాలు గానీ, ఫిరంగులు గానీ అవసరము లేదు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. మీరిప్పుడు యుద్ధ మైదానములో ఉన్నారు, మీరు ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇంకేమీ చేయరు. తండి ఆజ్ఞాపించారు - మీరు నన్ను స్మృతి చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది. మీ ధర్మము చాలా సుఖమునిచ్చేది. బాబా సర్వశక్తివంతులు. మీరు తండ్రి వారిగా అవుతారు. ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది. మీరిక్కడ వింటారు తర్వాత దానిని గురించి మథనము(మనన చింతన) చేస్తారు. ఎలాగైతే ఆవు గడ్డి తిన్న తర్వాత నెమరు వేస్తుందో, నోరును కదిలిస్తూనే ఉంటుంది కదా. అలాగే పిల్లలైన మీకు కూడా చెప్తున్నారు - జ్ఞాన విషయాలను గురించి బాగా ఆలోచించండి. బాబాను మనమేం అడగాలి! బాబా చెప్తారు - మన్మనాభవ, దీని ద్వారానే మీరు సతోపధ్రానంగా అవుతారు. ఈ ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది.
సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా అవ్వాలని మీకు తెలుసు. ఇది మీకు స్వతహాగా(ఆటోమేటిక్‌గా) ఆంతరికములో కలగాలి. ఇతరులను నిందించడం, పాప కర్మలు చేయడం మొదలైనవేవీ చేయరాదు. ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు. ఈ దేవీ-దేవతలే నంబర్‌వన్. పురుషార్థము చేసి శేష్ఠ్ర పదవిని పొందుకున్నారు కదా. వారిని గురించే అహింసో పరమో దేవీ దేవతా ధర్మము అని గాయనముంది కదా. ఇతరులను చంపడం హింసయే కదా. అందుకే బాబా తెలుపుతున్నారు - పిల్లలారా, అంతర్ముఖులై మేము ఎలా తయారయ్యాము? అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాను స్మృతి చేస్తున్నామా? ఎంత సమయము బాబాను స్మృతి చేస్తున్నాము? ఎప్పుడూ మర్చిపోని విధంగా బాబా స్మృతిలో మనసు లగ్నమవ్వాలి. ఇప్పుడు బేహద్ తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరు నా సంతానము, అందులో కూడా మీరు అనాది సంతానము. ఆ ప్రేయసీ-ప్రియులది శారీరిక స్మృతి. ఎలాగైతే సాక్షాత్కారమై మళ్లీ అదృశ్యమైపోతారో, అలా వారు కూడా ఎదురుగా వచ్చేస్తారు. ఆ ఖుషీలోనే తింటూ-త్రాగుతూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ ఈ స్మృతిలో చాలా బలముంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. తర్వాత మళ్లీ మీకు మీ భవిష్యత్తు గుర్తుకు వస్తుంది. వినాశనము కూడా సాక్షాత్కారమవుతుంది. పోను పోను చాలా త్వరత్వరగా వినాశనము సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు వినాశనము అవ్వనున్నదని, తండ్రిని స్మృతి చేయండని మీరు చెప్పవచ్చు. బాబా ఇదంతా వదిలేశారు కదా. చివరిలో ఏదీ గుర్తు రాకూడదు. ఇప్పుడు మనము మన రాజధానికి వెళ్లాలి. నూతన ప్రపంచములోకి తప్పకుండా వెళ్లాలి. యోగబలముతో సర్వ పాపాలను భస్మము చేయాలి. ఇందులోనే చాలా శ్రమ చేయాలి. క్షణ-క్షణము తండ్రిని మర్చిపోతారు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయము. సర్పము, భ్రమరముల ఉదాహరణాలు ఏవైతే ఇస్తారో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరి అద్భుతము చేస్తుంది కదా. దాని కంటే మీరు చేసే అద్భుతము ఇంకా విచిత్రము. బాబా వ్రాస్తూ ఉంటారు కదా - జ్ఞానాన్ని భూ - భూ చేస్తూ ఉండండి. చివరికి మేలుకుంటారు, ఇంకెక్కడకు వెళ్తారు! మీ వద్దకే వస్తారు. మీతో కలుస్తూ ఉంటారు. మీ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది. ఇప్పుడైతే మీరింకా కొద్దిమందే ఉన్నారు కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానాన్ని బాగా విచార సాగర మథనము చేయాలి. ఏదైతే విన్నారో దానిని నెమరు వేయాలి. ఎప్పుడూ మర్చిపోని విధంగా నా మనసు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి.
2. ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోండి. అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు - ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయండి.
వరదానము :- '' జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్రులకు సాథీలుగా అయ్యి రాత్రిని పగలుగా చేసే ఆత్మిక సితారే భవ ''
ఎలాగైతే ఆ నక్షత్రాలు రాత్రి వేళలో ప్రకటమౌతాయో అలా ఆత్మిక జ్ఞ్ఞాన నక్షత్రాలైన మీరు కూడా మెరుస్తూ బ్రహ్మ రాత్రిలో ప్రకటమౌతారు. ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా మార్చవు. కానీ మీరు జ్ఞానసూర్య, చంద్రులకు సాథీలుగా అయ్యి రాత్రిని పగలుగా చేస్తారు. అవి ఆకాశములోని నక్షత్రాలు. మీరు ఈ భూమి పై ప్రకాశించే నక్షత్రాలు. అవి ప్రకృతిలోని నక్షత్రాలు, మీరు పరమాత్ముని నక్షత్రాలు. ఎలాగైతే ప్రకృతిలోని నక్షత్ర మండలంలో అనేక విధాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయో, అలా మీరు పరమాత్మ తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక నక్షత్రాలు.
స్లోగన్ :- ''సేవకు అవకాశం లభించడం అనగా ఆశీర్వాదాల జోలెను నింపుకోవడం''
No comments:
Post a Comment