29-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు ఈ రాజయోగ చదువును రాజ్యము కొరకు చదువుతున్నారు, ఇది మీకు నూతన చదువు ''
ప్రశ్న :- ఈ చదువులో అనేక పిల్లలు నడుస్తూ నడుస్తూ ఎందుకు ఫెయిల్ అవుతారు ?
జవాబు :- ఎందుకంటే ఈ చదువులో మాయతో మల్లయుద్ధము(బాక్సింగ్) ఉంటుంది. మాయతో మల్లయుద్ధము చేయునప్పుడు బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగిలేందుకు కారణము - తండ్రితో పిల్లలు సత్యంగా ఉండరు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు.
ఓంశాంతి. ఆత్మలైన మనలను తండ్రి చదివిస్తున్నారని పిల్లలందరికీ నిశ్చయము ఉంటుంది. అనంతమైన తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత అనంతమైన పిల్లలను ఒక్కసారి మాత్రమే చదివిస్తున్నారు. క్రొత్తవారెవరైనా ఈ మాటలు వింటే వారికివి అర్థము కావు. ఆత్మిక తండ్రి అనగా ఎవరు, ఆత్మిక పిల్లలంటే ఎవరో కూడా అర్థము చేసుకోలేరు. మనమంతా సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచరే కాక సుప్రీమ్(పరమ) గురువు అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీకు ఆటోమేటిక్‌గా(స్వతహాగా) స్మృతిలో ఉంటుంది. '' సర్వాత్మలకు ఆత్మిక తండ్రి ఒక్కరే '' అని ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు. సర్వాత్మలు వారినే స్మృతి చేస్తారు. ఏ ధర్మానికి చెందినవారైనా, మానవ మాత్రులందరూ తప్పకుండా స్మృతి చేస్తారు. అందరిలోనూ ఆత్మ ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మలైన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. పాత్రనెలా అభినయిస్తున్నారో కూడా అర్థం చేయించారు. పిల్లలు కూడా నంబరువారుగా పురుషార్థానుసారమే అర్థము చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారంతా యోగులే. చదివించే టీచరుతో తప్పకుండా యోగముంచాలి. ఈ చదువు ద్వారా ఫలానాగా అవుతామని లక్ష్యము కూడా మీకు తెలుసు. ఇది రాజాధి రాజులుగా తయారుచేసే ఏకైక చదువు. దీని పేరు రాజయోగము కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో యోగము. ఇతర మనుష్యులెవ్వరూ ఎప్పుడూ ఈ రాజయోగమును నేర్పించలేరు. మీకు నేర్పించేది మానవ మాత్రులు కాదు. ఆత్మలైన మీకు పరమాత్మ నేర్పిస్తున్నారు, తర్వాత మీరు ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది జ్ఞాపకము లేకుంటే పదును నిండదు, అందుకే చాలా మంది బుద్ధిలో కూర్చోదు. అందుకే తండ్రి సదా చెప్తూనే ఉన్నారు - యోగయుక్తంగా ఉండండి, స్మృతియాత్రలో ఉండి అర్థం చేయించండి. మన సోదరులకు నేర్పిస్తున్నాము. మీరు కూడా ఆత్మలే. వారు అందరికీ తండ్రి. అంతేకాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఆత్మనే చూడాలి. భలే ఒక్క సెకెండులో జీవన్ముక్తి అనే గాయనమైతే ఉన్నది కానీ ఇందులో శ్రమ చాలా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వనందున మీ మాటలలో శక్తి ఉండదు ఎందుకంటే తండ్రి అర్థం చేయించినట్లు మీరు అర్థం చేయించలేరు. కొంతమంది చాలా బాగా అర్థం చేయిస్తారు. పుష్పాలు ఎవరో, ముళ్ళు ఎవరో తెలిసిపోతుంది. పాఠశాలలో 5 - 6 తరగతులు చదువుకున్న తర్వాత బదిలీ(ట్రాన్స్‌ఫర్) అవుతారు. మంచి మంచి పిల్లలు ఉన్నత తరగతులకు బదిలీ అయినప్పుడు ఆ (మరుసటి) టీచరుకు కూడా వెంటనే తెలిసిపోతుంది. ఈ పిల్లలు మంచి(తీక్షణమైన) పురుషార్థము చేశారు, వీరు బాగా చదువుకున్నారు అందుకే ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని టీచర్లకు తప్పకుండా తెలుస్తుంది కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయమే లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా చెప్పరు, మొదట బాగా చదువుకొని వచ్చారు, అందుకే బాగా చదువుకుంటున్నారని అనరు. అక్కడ పరీక్షలో పాసై బదిలీ అవుతే బాగా కష్టపడి చదువుకున్నారని కనుకనే మొదటి నంబరులో ఉత్తీర్ణులయ్యారని టీచరు భావిస్తారు కాని ఇది నూతన చదువు. ఇంతకుముందు ఈ చదువును ఎవ్వరూ చదువుకోలేదు. చదువు చెప్పేవారు కూడా కొత్తవారే. అందరూ కొత్తవారే. కొత్తవారినే చదివిస్తారు. వారిలో ఎవరు బాగా చదువుకుంటారో, వారిని మంచి పురుషార్థులని అంటారు. ఇది నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. దీనిని చదివించేవారు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఎవరెవరు ఎంతెంత గమనముంచుతారో అంత ఉన్నతమైన నంబరు లభిస్తుంది. కొంతమంది చాలా మధురమైన మంచి ఆజ్ఞాకారులుగా ఉంటారు. చూస్తూనే తెలిసిపోతుంది. ఈ చదివించేవారు చాలా మంచివారు, వీరిలో ఏ అవగుణము లేదు. నడవడికల ద్వారా, మాటలు మాట్లాడుటలోనే తెలిసిపోతుంది. బాబా అందరినీ అడుగుతారు - వీరు ఎలా చదువు చెప్తున్నారు ? వారిలో ఏ లోపమూ లేదు కదా? చాలా మంది అంటారు - మమ్ములను అడగకుండా ఏ సమాచారము ఇవ్వరాదు. కొంతమంది బాగా చదివిస్తారు. కొంతమందికి చురుకైన బుద్ధి ఉండదు. మాయ తీవ్రంగా దాడి చేస్తుంది. మాయ వారిని చాలా మోసము చేస్తుందని తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా మాయ ఎంత శక్తివంతమైనదంటే దేహ అహంకారానికి వశమయ్యారంటే ఇరుక్కుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎటువంటి యోద్ధులైనా మాయ గాయపరుస్తుంది. మాయ బలశాలురతో బలశాలిగా అయ్యి యుద్ధము చేస్తుంది.
బాబా ఎవరిలో అయితే ప్రవేశించారో వారు నంబరువన్‌గా అవుతారని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత నంబరువారుగా చాలామంది ఉన్నారు కదా. బాబా ఉదాహరణ కొరకు ఒకరినో - ఇద్దరినో చూపిస్తారు. నంబరువారుగా అయితే చాలా మంది ఉంటారు. ఉదాహరణానికి ఢిల్లీలో గీతా అక్కయ్య చాలా తెలివిగలది కదా. చాలా మధురమైన బిడ్డ. గీత అంటే సత్యమైన గీత అని బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు. మనుష్యులు ఆ గీతను పఠిస్తూ ఉంటారు కానీ భగవంతుడు రాజయోగమును ఎలా నేర్పించి రాజాధి రాజులుగా తయారు చేశారో తెలియదు. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. ఇది నిన్నటి మాటే. నేను మిమ్ములను ఎంత ధనవంతులుగా చేసి వెళ్లాను. మీరు పదమా పదమ్ భాగ్యశాలురుగా ఉండేవారు, ఇప్పుడు మీరెలా తయారయ్యారో మీరు ఫీల్ చేస్తున్నారు కదా. ఈ గీతను వినిపించేవారికిలా అనిపిస్తుందా? వారు కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్భగవద్గీతకు మహిమ ఉంది. వారు గీత పుస్తకాన్ని చదువుతారు లేక వినిపిస్తారు. తండ్రి పుస్తకము చదవరు. బేధము ఉంది కదా. వారికి స్మృతియాత్ర లేనే లేదు. వారు క్రింద పడ్తూనే(పతితమవుతూ) వచ్చారు. సర్వవ్యాపి జ్ఞానము వలన అందరూ ఎలా అయ్యారో చూడండి. కల్ప-కల్పము ఇలాగే అవుతుందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - మీకు నేర్పించి విషయ సాగరము నుండి దాటిస్తాను. ఎంత తేడా ఉంది. శాస్త్రాలు చదివేది భక్తిమార్గము కదా. తండ్రి చెప్తున్నారు - అవి చదివినందున నాతో ఎవ్వరూ కలవలేరు. ఎటువైపు నుండి వెళ్లినా అందరూ ఒకే చోటికి చేరుతారని భావిస్తారు. భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చి చదివిస్తారని కూడా అప్పుడప్పుడు అంటారు. తండ్రే వచ్చి చదివిస్తారన్నప్పుడు మీరు ఏం చదివిస్తున్నారు ? గీతలో పిండిలో ఉప్పు వేసినంత సత్యముంది అనగా చాలా కొన్ని పదాలే సత్యము. వాటిని మీరు పట్టుకోగలరు అనగా తెలుసుకోగలరు. సత్యయుగములో శాస్త్ర్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. అవి భక్తిమార్గములోని శాస్త్ర్రాలు, ఇవి అనాది కాదు. ఎప్పటి నుండో పరంపరగా రావడం లేదు. మనుష్యులకు అనాది అంటే ఏమిటో అర్థము తెలియదు. తప్పకుండా ఈ డ్రామా అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను, తర్వాత ఉండనే ఉండను, అదృశ్యమైపోతాను. మా రాజ్యము అనాది అని మీరంటారు. రాజ్యమేమో అదే. కేవలం పావనంగా ఉండేది, మారిపోయి పతితమైపోయినందున పేరు మారిపోతుంది. దేవతలకు బదులు హిందువులని పిలిపించుకుంటారు. నిజానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారే కదా! ఇతరులు ఎలాగైతే సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తారో మీరు కూడా అదే విధంగా క్రిందకు దిగుతారు. రజో గుణములోకి వస్తూనే అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులని అనబడ్తారు. లేకుంటే హిందు అనేది హిందూస్థానానికి పేరు. మీరు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు కదా. దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడు మనుష్యులు పతితమైపోయారు. అందువలన హిందువులని పేరుంచుకున్నారు. హిందూ ధర్మము ఎప్పుడు, ఎలా రచింపబడింది? అని అడగండి. ఎవ్వరూ తెలుపలేరు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మముండేది. దానిని స్వర్గమని(ప్యారడైస్) మొదలైన మంచి మంచి పేర్లతో పిలుస్తారు. జరిగిపోయింది మళ్లీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రారంభము నుండి చివరి వరకు అంతా తెలుసుకున్నారు. తెలుసుకుంటూ పోతే జీవిస్తూ ఉంటారు. చాలా మంది మరణించనూ మరణిస్తారు. తండ్రికి చెందినవారిగా అయితే మాయతో యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరిగినందున విద్రోహులుగా అవుతారు. రావణునికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు రామునివారిగా అయ్యారు. మళ్లీ రావణుడు రాముని పిల్లల పై విజయము పొంది తన వైపుకు తీసుకెళ్తాడు. కొంతమంది జబ్బు పడ్తారు. అప్పుడు వారు ఇక్కడకూ లేకుండా, అక్కడకూ లేకుండా పోతారు. సంతోషమూ ఉండదు, అలాగని దు:ఖమూ ఉండదు. మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. మీ వద్ద కూడా మధ్యలో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పూర్తి బాబావారిగానూ అవ్వరు, పోనీ అటు పూర్తి రావణునివారిగా కూడా అవ్వరు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఉత్తమ పురుషునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థము చేసుకోవలసిన విషయాలు. బాబా అడిగినప్పుడు చాలా మంది పిల్లలు చేతులెత్తుతారు. కానీ బుద్ధి లేదని బాబా అర్థం చేసుకుంటారు. భలే శుభాన్నే పలకండని బాబా అంటారు. అందరూ మేము నరుని నుండి నారాయణునిగా అవుతామనే అంటారు. నరుని నారాయణునిగా చేసే కథ ఇదే. అజ్ఞాన కాలములో కూడా సత్యనారాయణ కథ విన్నారు కదా. అక్కడ ఎవ్వరూ ఏమీ అడగరు. ఈ తండ్రి ఒక్కరే అడిగేవారు. ఇంత ధైర్యముందా? మీరు తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. ఈ జన్మలో ఏ పాపకార్యము చేయలేదా? అని ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. జన్మ-జన్మాంతరాలుగా పాపం చేస్తూనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలు తెలిపితే తేలికైపోతారు. చాలా మంది పిల్లలు సత్యము చెప్పనందున మాయ ఒక్కసారిగా తీవ్ర్రంగా ముష్ఠిఘాతాలు తగిలిస్తుంది. మీది చాలా కఠినమైన ముష్ఠి యుద్ధము(బాక్సింగ్). ఆ బాక్సింగ్‌లో శరీరానికి దెబ్బ తగులుతుంది. ఇందులో బుద్ధికి పెద్ద గాయమవుతుంది. ఇది బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ చెప్తున్నారు - నేనిప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నాను. అందరికంటే ఎక్కువ పవిత్రంగా ఉన్నాను, ఇప్పుడు అందరికంటే ఎక్కువ పతితంగా అయ్యాను మళ్లీ పావనంగా అవుతాను. అలాగని నేను మహాత్మనని చెప్పను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమైనాడని తండ్రి కూడా చెప్తున్నారు. నేను పరాయి దేశములో, పరాయి శరీరములో వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతడే పూర్తిగా 84 జన్మలు తీసుకున్న ఆత్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అయ్యే పురుషార్థము చేస్తున్నాడు. చాలా జాగరూకతతో ఉండాలి. తండ్రికి తెలుసు కదా. బాబాకు ఇతడు చాలా సమీప పుత్రుడు. తండ్రి నుండి ఎప్పుడూ విడిపోడు. వదిలి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు. నా ప్రక్కనే కూర్చున్నారు. నా తండ్రి కదా, నా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. బాబాకు తెలుసు. బాబాతో తమాషాగా మాట్లాడ్తాడు - బాబా నాకు స్నానము చేయించు, భోజనము తినిపించు, నేను చిన్న బాలుని కదా.... ఇలా అనేక విధాలుగా బాబాను స్మృతి చేస్తాను. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను - ఈ రీతిగా నన్ను స్మృతి చేయండి. బాబా, మీరు చాలా మధురమైనవారు. మమ్ములను విశ్వమంతటికీ చక్రవర్తులుగా చేస్తారు. ఈ మాటలు మరెవ్వరి బుద్ధిలో ఉండవు. తండ్రి అందరినీ తాజా(రిఫ్రెష్)గా చేస్తున్నారు. అందరూ పురుషార్థము చేస్తున్నారు కానీ నడవడికలు కూడా అలా ఉండాలి కదా. తప్పు జరిగితే వెంటనే బాబా, మా వలన ఈ తప్పు జరిగింది అని తండ్రితో చెప్పేయాలి. కొంతమంది బాబా, ఈ తప్పు చేశాము, మమ్ములను క్షమించండి అని కూడా వ్రాశారు. నా పిల్లలుగా అయ్యి తప్పు చేస్తే నూరు రెట్లు శిక్ష పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే అక్కడే అలాగే ఉండిపోతారు. నిస్తేజులైపోతారు. చాలామంది ఓడిపోతుంటారు. ఇది చాలా గొప్ప మల్లయుద్ధము. రామ-రావణుల యుద్ధములో వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపించారు. ఇదంతా పిల్లల నాటకము వలె తయారయ్యింది. చిన్న పిల్లలకు తెలివి తక్కువగా ఉంటుంది కదా. వారికి పైసా భాగము తెలివి కూడా లేదు. ప్రతి ఒక్కరు ఈశ్వరుని రూపమే అని అంటారు. అలాగైతే ప్రతి ఒక్కరు ఈశ్వరుడై సృష్టిస్తారు, పాలన, వినాశనము కూడా చేసేవారు. ఈశ్వరుడు ఎవరినైనా వినాశనం చేస్తాడా? వినాశనము చేస్తారనడం పూర్తిగా అజ్ఞానము. అందుకే బొమ్మలాట అని అంటారు. విచిత్రము కదా. మానవుల బుద్ధి ఏమైపోతుంది? ఎంతగా ఖర్చులు చేస్తుంటారు. తండ్రి అడుగుతున్నారు. నేను ఇంత గొప్పగా తయారు చేసి పోయాను, మీరు ఏం చేశారు! మనమే దేవతలుగా ఉండేవారమని చక్రములో తిరిగి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్లీ మనము దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉంది కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా జ్ఞానసాగరులు కదా. భలే శాంతిధామములో ఉన్నా వారిని జ్ఞానసాగరులని అంటారు. మీ ఆత్మలో కూడా జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానము వలన మా కనులు తెరచుకున్నాయని అంటారు కదా. ఆ తండ్రి మీకు జ్ఞాన నేత్రమునిస్తారు. ఆత్మకు సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసిపోయాయి. చక్రము తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రము లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవ్వరూ ఉండరు. వారికి శిక్షణ అవసరము లేదు. దేవతలుగా తయారయ్యేందుకు చదవాల్సింది మీరే. ఇప్పుడు తండ్రి కొత్త - కొత్త విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ కొత్త చదువును చదువుకొని మీరు ఉన్నతంగా అవుతారు. ఫస్ట్(ఆది)లోని వారే లాస్ట్‌గా(చివరివారిగా) అయ్యారు. తిరిగి లాస్ట్‌లోని వారే ఫస్ట్(ప్రథమము)గా అవుతారు. ఇది చదువు కదా. ప్రతి కల్పము వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చాలా చాలా ఆజ్ఞాకారులుగా, మధురంగా తయారై నడుచుకోవాలి. దేహ అహంకారములోకి రాకూడదు. తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఏ తప్పులు చేయరాదు. మాయతో చేసే మల్ల యుద్ధములో(బాక్సింగ్‌లో) చాలా హెచ్చరికగా ఉండాలి.
2. మీ మాటలలో శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. స్మృతి ఉండాలి - తండ్రి నేర్పించిన దానిని మేము వినిపిస్తున్నామని భావిస్తే అందులో పదును నిండుతుంది.
వరదానము :- '' అపవిత్ర అంశమైన సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్నిత్యాగము చేసే సంపూర్ణ నిర్వికారి భవ ''
దినచర్యలో ఏ కర్మలోనైనా హెచ్చు-తగ్గులుగా అగుట, సోమరితనము లేక నిర్లక్ష్యంగా ఉండుట - ఇది వికారాల అంశము. దీని ప్రభావము పూజ్యనీయులుగా అవ్వడం పై పడ్తుంది. ఒకవేళ మీరు అమృతవేళలో స్వయాన్ని జాగృత స్థితిలో అనుభవం చేయకుంటే, విధి లేక గానీ, సోమరితనంతో గానీ కూర్చుంటే మీ పూజార్లు కూడా విధి లేక లేక సుస్తీగా(సోమరితనంతో) పూజిస్తారు. కనుక సోమరితనం లేక నిర్లక్ష్యాన్ని కూడా త్యాగం చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలరు.
స్లోగన్ :- '' సేవ భలే చేయండి కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి. ''
No comments:
Post a Comment