13 -11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రి శ్రీమతమును అనుసరించడమే తండ్రిని గౌరవించడం,
ప్రశ్న :- గృహస్థ వ్యవహారములోని వారికి బాబా ఏ పని చేయవద్దని చెప్పరు, కానీ ఆదేశమునిస్తారు - అది ఏమిటి ?
జవాబు :- బాబా చెప్తారు - పిల్లలారా, మీరు భలే అందరి సంబంధములోకి రండి, ఏ ఉద్యోగమైనా చేయండి, సంబంధ - వ్యవహారములలోనికి రండి, రంగు-రంగుల దుస్తులను ధరించండి, ఈ విషయములోనూ బాబా వద్దనరు. తండి కేవలం అదేశిస్తున్నారు - పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటి పై మమత్వాన్ని తొలగించి నన్ను స్మృతి చేయండి.
ఓంశాంతి. శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అనగా తమ సమానంగా తయారుచేసే పురుషార్థమును చేయిస్తారు. నేనెలా జ్ఞానసాగరుడినో అలా పిల్లలు కూడా తయారవ్వాలి. అందరూ ఒకే విధంగా తయారవ్వరని మధురమైన పిల్లలకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థాన్ని చేయాలి. పాఠశాలలో విద్యార్థులు చాలామంది చదువుతారు కానీ అందరూ ఒకే విధంగా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వరు. అయినా ఉపాధ్యాయుడు పురుషార్థము చేయిస్తాడు. పిల్లలైన మీరు కూడా పురుషార్థము చేస్తారు. మీరు ఎలా తయారవుతారని తండ్రి అడుగుతారు. మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మీగా అయ్యేందుకే వచ్చామని అందరూ చెప్తారు. ఇదేమో బాగుంది కానీ తమ నడవడికలను కూడా చూసుకోవాలి కదా. తండ్రి కూడా ఉన్నతాతి ఉన్నతమైనవారు. వారు టీచరే కాక గురువు కూడా అయినారు. ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబా మన తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని పిల్లలైన మీకు తెలుసు కానీ వారెలా ఉన్నారో అలా యదార్థంగా వారిని తెలుసుకోవడం కష్టము. తండ్రిని తెలుసుకుంటే టీచరును మర్చిపోతారు, తర్వాత గురువును కూడా మర్చిపోతారు. పిల్లలు తండ్రిని గౌరవించాలి కూడా. గౌరవించడం అని దేనినంటారు? తండి చదివించిన దానిని బాగా చదువుకుంటే వారిని గౌరవించినట్లే. తండ్రి ఏమో చాలా మధురమైనవారు. ఆంతరికములో ఖుషీ పాదరస మీటరు చాలా పైకెక్కి ఉండాలి. అపారమైన సంతోషము ఉండాలి. నాకు ఇటువంటి ఖుషీ ఉందా? అని ప్రతి ఒక్కరు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అందరూ ఒకే విధంగా ఉండలేరు. చదువులో కూడా చాలా తేడాలున్నాయి. ఆ పాఠశాలలో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది. అక్కడైతే సాధారణ టీచరు చదివిస్తారు, ఇక్కడ చదివించేవారు అసాధారణమైనవారు. ఇలాంటి టీచరు మరెవ్వరూ ఉండనే ఉండరు. నిరాకారుడైన తండ్రి టీచరుగా కూడా అవుతారని ఎవ్వరికీ తెలియదు. భలే శ్రీ కృష్ణుడని అనేశారు కానీ వారు తండ్రి ఎలా అవుతారో తెలియదు. కృష్ణుడు దేవత కదా. ఇప్పుడు కృష్ణుడను పేరు కూడా చాలామందికి ఉంది. కానీ కృష్ణుడని అనగానే శ్రీ కృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. కానీ అతను దేహధారి కదా. ఈ శరీరము శివబాబాది కాదని మీకు తెలుసు. నేను లోన్‌గా తీసుకున్నానని స్వయంగా వారే చెప్తారు. ఇతను ఇంతకుముందు కూడా మానవుడే, ఇప్పుడు కూడా మానవుడే. ఇతను భగవంతుడు కాదు. భగవంతుడనగా నిరాకారులైన వారు ఒక్కరే. పిల్లలైన మీకిప్పుడు ఎన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు! అయినా తండ్రిగా, టీచరుగా గుర్తు పెట్టుకోలేరు. క్షణ - క్షణము మర్చిపోతూ ఉంటారు. దేహధారుల వైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఫైనల్‌గా తండ్రి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా ఉన్నారనే నిశ్చయము ఇంకా బుద్ధిలో లేదు, మర్చిపోతారు. విద్యార్థులు టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా! హాస్టల్‌లో ఉండేవారు ఎప్పుడూ మర్చిపోరు. ఏ విద్యార్థులు హాస్టలులో ఉంటారో వారికి పక్కాగా స్మృతి ఉంటుంది కదా. ఇక్కడైతే ఆ పక్కా నిశ్చయము కూడా లేదు. నంబరువారు పురుషార్థానుసారము హాస్టలులో కూర్చుని ఉన్నారు. విద్యార్థులే కానీ పక్కా నిశ్చయం లేదు. తమ-తమ పురుషార్థానుసారముగా పదవిని పొందుతున్నారని అందరికీ తెలుసు. ఆ చదువులో అయితే కొందరు వకీళ్ళుగా అవుతారు, కొందరు ఇంజనీర్లుగా అవుతారు, డాక్టర్లుగా అవుతారు. ఇక్కడైతే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు. కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి! నడవడిక, సంభాషణలు ఎంత బాగుండాలి!
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, మీరు ఎప్పుడూ ఏడ్వరాదు. మీరు విశ్వాధికారులుగా అవుతారు, కావున ఎప్పుడూ భగవంతుడా!(యా హుస్సేన్) అని గట్టిగా ఏడ్వరాదు. యా హుస్సేన్ అని ఏడ్వడం అత్యధికంగా ఏడ్వడం. బాబా చెప్తున్నారు - ఎవరు ఏడుస్తారో, వారు పోగొట్టుకుంటారు,............. (విశ్వానికి అత్యంత ఉన్నతమైన చకవ్రర్తి పదవిని పోగొట్టుకుంటారు). మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని అంటారు కానీ అటువంటి నడవడికలు ఎక్కడ ఉన్నాయి! నంబరువారు పురుషార్థానుసారంగా అందరూ పురుషార్థము చేస్తున్నారు. కొందరైతే బాగా చదువుకొని ఉత్తీర్ణులై ఉపకారవేతనము(స్కాలర్‌షిప్) తీసుకుంటారు, కొంతమంది పాస్ అవ్వలేరు. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. మీలో కూడా కొందరు చదువుకుంటారు, కొంతమంది అసలు చదవరు. ఉదాహరణానికి పల్లె పిల్లలకు చదువుకోవడం ఇష్టముండదు, గడ్డి కోసేందుకు వెళ్లమంటే సంతోషంగా వెళ్తారు. అందులో స్వతంత్ర జీవితముందని భావిస్తారు. చదవడమంటే బంధనమని భావిస్తారు. ఇలాంటివారు కూడా చాలామంది ఉంటారు. ధనవంతులలో జమీందార్లు ఏమీ తక్కువ కాదు. స్వయాన్ని స్వతంత్రంగా చాలా ఖుషీగా భావిస్తారు. ఉద్యోగమనే పేరు లేదు కదా. ఆఫీసులు మొదలైన వాటిలో మనుష్యులు ఉద్యోగాలు చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి మిమ్ములను విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తున్నారు. నౌకరి కొరకు చదివించడం లేదు. మీరు ఈ చదువు ద్వారా విశ్వాధికారులుగా అవుతారు కదా. ఇది చాలా గొప్ప శేష్ఠ్రమైన చదువు. మీరు విశ్వాధికారులుగా పూర్తి స్వతంతులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయము. ఒకే చదువు ద్వారా మీరు ఇంత శేష్ఠ్రమైన పవిత్రమ్రైన మహారాజ-మహారాణులుగా అవుతారు. ఏ ధర్మమువారైనా వచ్చి చదువుకోవచ్చని మీరు చెప్తారు. ఈ చదువు చాలా శేష్ఠ్రమైనదని భావిస్తారు. విశ్వానికి అధికారులుగా అవుతారు. అటువంటి చదువును తండ్రి చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలమైపోయింది. హద్దు బుద్ధి నుండి బేహద్ బుద్ధిలోకి నంబరువారు పురుషార్థానుసారము వచ్చారు. ఇతరులను కూడా విశ్వాధికారులుగా చేయాలని ఎంతో సంతోషము ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి, దాస-దాసీలు, నౌకర్లు మొదలైనవారైతే కావాలి కదా. చదివినవారి ముందు చదవనివారు బరువులు మోస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు - బాగా చదువుకుంటే మీరిలా తయారవ్వవచ్చు. మేమిలా(లక్ష్మినారాయణులు) అవుతామని కూడా చెప్తారు. కానీ చదవకుంటే ఎలా తయారవుతారు. చదువుకోలేదంటే తర్వాత ఇంత గౌరవంతో తండ్రిని స్మృతి చేయలేరు. తండ్రి చెప్తున్నారు - మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలు వినాశనమవుతాయి. పిల్లలు చెప్తారు - బాబా, మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తాము. తండ్రి తన మతమును ఇతని ద్వారానే ఇస్తారు కదా. కాని ఇతని మతమును కూడా తీసుకోరు. మళ్లీ ఆ చెడిపోయిన(కుళ్లిపోయిన) మనుష్య మతానుసారంగానే నడుచుకుంటారు. శివబాబా ఈ రథము ద్వారా సలహా ఇస్తున్నారని కూడా గమనిస్తారు. అయినా తమ ఇష్టానుసారము నడుచుకుంటారు. పైసాకు పనికిరాని గవ్వలాంటి ఆ మతానుసారంగా నడుచుకుంటారు. రావణుని మతానుసారముగా నడుస్తూ నడుస్తూ ఈ సమయములో గవ్వ సమానమైపోయారు. ఇప్పుడు రాముడైన శివబాబా మతమునిస్తున్నారు. నిశ్చయములోనే విజయముంది. ఇందులో ఎప్పుడూ నష్టము రాదు. నష్టమును కూడా తండ్రి లాభములోకి పరివర్తన చేసేస్తారు, కానీ ఇది నిశ్చయబుద్ధి ఉన్నవారికే అన్వయిస్తుంది. సంశయబుద్ధి గలవారు లోపల గుటకలు మ్రింగుతూ ఉంటారు. నిశ్చయబుద్ధి గలవారు ఎప్పుడూ గుటకలు మ్రింగరు, నష్టము కలగదు. బాబా స్వయంగా గ్యారంటీ ఇస్తున్నారు - శ్రీమతానుసారముగా నడుచుకుంటే ఎప్పుడూ అకళ్యాణము జరగదు. మనుష్య మతమును దేహధారుల మతమని అంటారు. ఇక్కడ ఉండేదే మనుష్య మతము. మనుష్య మతము, ఈశ్వరీయ మతము, దైవీ మతము అని గాయనము కూడా ఉంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభించింది. దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. తర్వాత మీరు అక్కడ స్వర్గములో సుఖమునే పొందుతారు. ఎటువంటి దు:ఖపు మాటే ఉండదు. అది కూడా స్థిరమైన సుఖంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో భావనలోకి తీసుకు రావలసి ఉంటుంది, భవిష్య భావనలు వస్తాయి.
ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పము కల్పపు సంగమ యుగములో వస్తాను, ఈ విషయము మీకు తెలుసు. వారి మతానుసారము మీరు నడుచుకుంటారు. తండి చెప్తున్నారు - పిల్లలారా, గృహస్థ వ్యవహారములో భలే ఉండండి. మిమ్ములను దుస్తులు మొదలైనవి మార్చుకోమని ఎవరు చెప్తారు? భలే ఏ దుస్తులైనా ధరించండి. అనేకుల సంబంధ వ్యవహారములోకి రావాల్సి పడ్తుంది. రంగు దుస్తులు ధరించరాదని ఎవ్వరూ చెప్పరు. ఏ దుస్తులైనా ధరించండి, దీనితో ఏ సంబంధము లేదు. తండి చెప్తున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలేయండి. పోతే అన్నీ ధరించండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది పక్కాగా నిశ్చయము చేసుకోండి. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుందని కూడా మీకు తెలుసు. మహాత్ములను కూడా మహాన్ ఆత్మలని అంటారు కానీ మహాన్ పరమాత్మ అని అనరు. అలా అనడం బాగుండదు కూడా. అర్థము చేసుకునేందుకు ఎంత మంచి పాయింట్లున్నాయి. సద్గురువు సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. అక్కడ ఎప్పుడూ అకాలమృత్యువు సంభవించదు. బాబా మనలను మళ్లీ అటువంటి దేవతలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇంతకు ముందు ఇది బుద్ధిలో ఉండేది కాదు. కల్పాయువు ఎంతో కూడా తెలిసేది కాదు. ఇప్పుడంతా గుర్తుకు వచ్చింది. ఆత్మనే పాపాత్మ లేక పుణ్యాత్మ అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. పాప పరమాత్మ అని ఎప్పుడూ అనరు. పరమాత్మ సర్వవ్యాపి అని అనడం కూడా ఎంత తెలివి తక్కువ. ఇది తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు - 5 వేల సంవత్సరాల తర్వాత పాపాత్మలను పుణ్యాత్మలుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఒక్కరినే కాదు, పిల్లలందరినీ తయారుచేస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను తయారు చేసేది బేహద్ తండ్రినైన నేనే. తప్పకుండా పిల్లలకు బేహద్ సుఖమునిస్తాను. సత్యయుగములో ఉండేదే పవిత్రాత్మలు. రావణుని పై విజయము పొందడం వల్లనే మీరు పుణ్యాత్మలుగా అవుతారు. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తుందో మీరు ఫీల్ అవుతారు. ఒకేసారి ముక్కు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తుంది, మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. వారు కౌరవుల-పాండవుల యుద్ధమని, సైన్యము మొదలైనవి ఏవేవో కథలను కూర్చుని తయారుచేశారు. ఈ యుద్ధము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది గుప్తమైనది. దీని గురించి మీకు మాత్రమే తెలుసు. మాయతో ఆత్మలైన మనము యుద్ధము చేస్తాము. తండి చెప్తున్నారు - మీకు అన్నింటికంటే పెద్ద శత్రువ్రు, కామ వికారము. యోగబలముతో మీరు దీని పై విజయం పొందుతారు. యోగబలము యొక్క అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. సతోప్రధానంగా ఉన్నవారే తమోప్రధానంగా అయ్యారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - అనేక జన్మల అంత్యములో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. వారే తమోప్రధానంగా అయినారు, తతత్వమ్. బాబా ఒక్కరి గురించే చెప్పడం లేదు. నంబరువారుగా అందరికీ చెప్తారు. నంబరువారుగా ఎవరెవరున్నారో మీకు ఇక్కడ తెలిసింది. పోను పోను మీకు ఇంకా చాలా తెలుస్తుంది. మాలను మీకు సాక్షాత్కారము చేయిస్తారు. స్కూలులో బదిలీ అయినప్పుడు అంతా తెలుస్తుంది కదా. ఫలితమంతా వెలువడ్తుంది.
బాబా ఒక బిడ్డను - మీ పరీక్ష పేపర్లు ఎక్కడ నుండి వస్తాయి? అని అడిగారు. లండన్ నుండి అని చెప్పింది. ఇప్పుడు మీ పేపర్లు ఎక్కడ నుండి వస్తాయి? పై నుండి. మీ పేపర్ పై నుండి వస్తుంది. అందరూ సాక్షాత్కారము చేసుకుంటారు. ఎంత అద్భుతమైన చదువు. ఎవరు చదివిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కృష్ణ భగవానువాచ అని అనేస్తారు. చదువులో అందరూ నంబరువారుగా ఉన్నారు. కావున ఖుషీ కూడా నంబరువారుగా ఉంటుంది. అతీంద్రియ సుఖము ఏదైతే గోప-గోపికలను అడగాలని అంటారో అది చివరి సమయపు విషయము. భలే బాబాకు తెలుసు - ఈ బిడ్డ ఎప్పుడూ క్రింద పడేవాడు కాదు అని, కానీ ఏమవుతుందో ఏమీ చెప్పలేము. చదవనే చదవరు, అదృష్టములో లేదు. ఆ ప్రపంచములోకి వెళ్లి జీవించండి అనగానే వెళ్లిపోతారు. ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళ్లిపోతారు. వారి మాటలు, నడవడికలు, చేతలు అలా ఉంటాయి. కొంత లభించగానే, వెళ్లి వేరుగా ఉండాలని భావిస్తారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది అనగా నిశ్చయము లేదని, బలవంతంగా కూర్చుని ఉన్నారని అర్థమైపోతుంది. అనేకమందికి జ్ఞానములో 'జ'ఞ కూడా తెలియదు అనగా ఒక్క అక్షరము కూడా రాదు, బుద్ధిలో ఎప్పటికీ కూర్చోదు. మాయ చదవనివ్వదు. ఇటువంటివారు అన్ని సేవాకేంద్రాలలో ఉన్నారు. ఎప్పుడూ చదువుకునేందుకు రారు. విచిత్రము కదా. చాలా శేష్ఠ్రమైన జ్ఞానము, స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ పని చేయకండి అని బాబా చెప్పినా వారి మాట వినరు. తప్పకుండా వ్యతిరేక పనులే చేసి చూపిస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. పై నుండి కింద వరకు అందరూ తయారవుతారు. పదవులలో వ్యత్యాసముంటుంది కదా. ఇక్కడ కూడా పదవులు నంబరువారుగా ఉంటాయి. తేడా ఏమిటంటే అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది, సుఖము ఉంటుంది. ఇక్కడ తక్కువ ఆయువు దు:ఖము ఎక్కువగా ఉంది. పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలున్నాయి. కల్ప-కల్పము మనము మళ్లీ అదే పాతన్రు అభినయిస్తాము. కల్ప-కల్పము అభినయిస్తూనే ఉంటాము. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత నిండి ఉంది. అదే రూపురేఖలు, అదే కర్మలు,.........ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. తయారు చేయబడిన, తయారవుతున్న,......... ఈ చక్రము మళ్లీ రిపీట్ అవుతుంది. సతోపధ్రానము, సతో, రజో, తమోలోకి వస్తారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. మంచిది, మిమ్ములను మీరు ఆత్మగా భావిస్తున్నారా? ఆత్మల తండ్రి శివబాబా అని అర్థమయింది కదా. సతోప్రధానమైనవారే మళ్లీ తమోప్రధానంగా అవుతారు మళ్లీ తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ఇది మంచిదే కదా. ఇక్కడ వరకే నిలపాలి. అనంతమైన తండ్రి ఈ స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని చెప్పండి. పతితపావనులు వారే. తండ్రి జ్ఞానమిస్తున్నారు. ఇందులో శాస్త్రాలు మొదలైనవాటి విషయమే లేదు. శాస్త్ర్రాలు ఆరంభములో ఎక్కడ నుండి వస్తాయి! చాలామంది తయారైన తర్వాత కూర్చుని శాస్త్రాలు తయారు చేస్తారు. సత్యయుగములో శాస్త్ర్రాలు ఉండవు. పరంపరగా ఏ వస్తువూ ఉండదు. నామ-రూపాలైతే పరివరనైపోతాయి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎప్పుడూ అయ్యో భగవంతుడా!(యా హుసేన్) అని బిగ్గరగా ఏడ్వరాదు. మేము విశ్వానికి మాలికులుగా అయ్యేవారము కనుక మా నడవడిక, మా వార్తాలాపము..... చాలా బాగుండాలి అని బుద్ధిలో ఉండాలి. ఎప్పుడూ ఏడ్వరాదు.
2. నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యి ఒక్క తండ్రి మతమునే అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడూ తికమక అవ్వరాదు లేక గుటకలు మింగరాదు. నిశ్చయములోనే విజయముంటుంది కావున పైసకు విలువలేని మీ స్వంత మతమును అనుసరించరాదు.
వరదానము :- '' మీ పురుషార్థ విధిలో స్వంత ప్రగతిని అనుభవం చేయు సఫలతా సితారే భవ ''
ఎవరైతే తమ పురుషార్థ విధిలో స్వంత ప్రగతిని లేక సఫలతను అనుభవం చేస్తారో, వారే సఫలతా నక్షత్రాలు. వారి సంకల్పంలో స్వంత పురుషార్థం పట్ల కూడా ఎప్పుడూ '' జరుగుతుందో లేదో తెలియదు, చేయగలనో చేయలేనో '' - ఇటువంటి అసఫలత యొక్క అంశ మాత్రము కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికార రూపంలో అనుభవం చేస్తారు. వారికి సహజంగా, స్వతహాగా సఫలత లభిస్తూ ఉంటుంది.
స్లోగన్ :- '' సుఖ స్వరూపులుగా అయ్యి సుఖమునిస్తే పురుషార్థంలో ఆశీర్వాదాలు చేర్తాయి (యాడ్ అవుతాయి) ''
No comments:
Post a Comment