25-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీ బలహీనతల(చెడుగుణాల)ను తొలగించుకోవాలంటే హృదయ పూర్వకంగా, సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించుకునే యుక్తిని తెలిపిస్తారు ''
ప్రశ్న :- తండ్రి నుండి కరెంటు(శక్తి) ఎటువంటి పిల్లలకు లభిస్తుంది ?
జవాబు :- ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్‌కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లల పై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికములో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు.
ఓంశాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్వయాన్ని - '' తండ్రి నుండి ఏమైనా లభించిందా? '' అని ప్రశ్నించుకోవాలి. ఏ ఏ విషయాలలో ఇంకా లోపాలున్నాయి? ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా? అని అద్దములో నీ ముఖము నీవే చూచుకోమని చెప్పారు కదా, అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్ములను అడుగుతున్నారు - లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ ఏ లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థము చేస్తున్నారు. బలహీనతలు తొలగించుకునేందుకు పురుషార్థము చేస్తున్నారా లేక చేయడం లేదా? కొంతమంది పురుషార్థము చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు - ''మాలో ఏ బలహీనతలు లేవు కదా?'' అని మీ ఆంతరికములో చూసుకోండి. ఎందుకంటే మీరందరూ దోష రహితంగా సంపూర్ణంగా (పర్‌ఫెక్ట్‌గా) తయారవ్వాలి. తండ్రి పర్‌ఫెక్ట్‌గా తయారు చేసేందుకే వచ్చారు. అందుకే లక్ష్యమును చూపించే చిత్రాన్ని కూడా మీ ముందుంచారు. మీ ఆంతరికములో ప్రశ్నించుకోండి - వారి వలె పర్‌ఫెక్ట్‌గా తయారైనామా? ఇచ్చట భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులకు స్యాంపుల్(నమూనా). అర్ధకల్పము మీరు వీరిని మహిమ చేశారు. కావున ఇప్పుడు - '' మాలో ఏవైనా తొలగించుకోవలసిన లోపాలున్నాయా? '' అని స్వయాన్ని పశ్న్రించుకోండి. ఒకవేళ లోపాలుంటే తండిక్రి, బాబా మాలో ఈ లోపముంది అని తెలపండి. నా నుండి ఈ లోపము తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయము తెలపండి అని చెప్పండి. జబ్బు సర్జన్ ద్వారానే నయమవుతుంది. కొంతమంది మంగలి సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్ నుండి కాంపౌండర్లు నేర్చుకుని తెలివి గల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి - నాలో ఏ లోపాలున్నాయి? ఏ లోపాలున్నందున నేను ఈ(లక్ష్మీ నారాయణ) పదవి పొందుకోలేనని భావిస్తున్నాను? తండ్రేమో చెప్తారు కదా - మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలు తెలిపితే బాబా సలహానిస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి. చాలామందిలో దోషాలున్నాయి. కొంతమందిలో క్రోధము ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభముంది........ ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞాన ధారణ జరగదు. బాబా ప్రతిరోజూ చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు. మంత్రము యొక్క అర్థము తండ్రి తెలిపించారు. తండ్రి ఏమో ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి ఈ వారసత్వము పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలల్లో 5 వికారాలను జయించే విషయమే ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి మీలో దు:ఖమిచ్చే భూతాలు ఏమేమి ఉన్నాయో వాటిని వర్ణన చేస్తే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు. బాబా ఫలాని ఫలాని భూతాలు మమ్ములను విసిగిస్తూ దు:ఖ పెట్తున్నాయని తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా. మీలో ఆ భూతాలు లేవు. ఈ 5 వికారాలనే భూతాలు జన్మ-జన్మాంతరాలవని మీకు తెలుసు. మాలో ఏ భూతముందని చూసుకోవాలి? దానిని తొలగించుకునేందుకు సలహా తీసుకోవాలి. కనులు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసము చేయండి. ఈ యుక్తి ద్వారా మీలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము. శరీరాలు కానే కాదు. ఆత్మలమైన మనమంతా ఇప్పుడు వాపస్ వెళ్ళే వారమని మీకు తెలుసు. సర్వ గుణ సంపన్నంగా అయ్యామా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి లేకుంటే నాలో ఏ అవగుణాలున్నాయి? తండ్రి కూడా ఆ ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషముంటే కరెంటు ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్‌తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా! మీరెంత మధురమైనవారు, ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు! తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతము ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్, వారికి - '' బాబా మాకు యుక్తిని తెలపమని చెప్పండి.'' లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయా భూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారద్రోలుతారు. ఈ 5 భూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి. కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. వీరిలో ఈ భూతముందని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికెళ్తుంది కదా. ఇతను చాలా మంచి పుత్రుడు, లోపల చాలా మంచి మంచి గుణాలున్నాయి. కానీ ఏమీ చెప్పలేడు, ఎవ్వరికీ అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది, గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయునప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా సర్వీసు చేసేందుకు వచ్చారు. జన్మ-జన్మాంతరాల ఈ భూతాలను పారద్రోలాలని చెప్తున్నారు.
తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - వృక్షము క్రమక్రమంగా, నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆకులు రాలుతూ ఉంటాయి. మాయ విఘ్నాలు కల్పిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణానికి సన్యాసులకు అయిష్టత కలిగితే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణము, ఏ మాటలు ఉండవు. అందరి సంబంధము తండ్రితో అయితే ఉంది. పిల్లలు నెంబరువారుగా ఉన్నారు. తండిక్రి సత్యము తెలుపుతే, వారి అవగుణాలు తొలగిపోగలవు, ఉన్నత పదవి పొందగలరు. చాలామంది లోపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్లీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండచిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకు కూర్చున్నది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇక ఏ మాటలు తెలుపలేకున్నా, కేవలం ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఒక్కరు లౌకిక తండ్రి - ఈ తండ్రి సదా లభిస్తారు. సత్యయుగములో కూడా లభిస్తారు, కలియుగంలో కూడా లభిస్తారు. అంతేకాని సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారుచేస్తారు. భక్తిమార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీసు లేదంటారు. అరే! శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్లి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారు? అని అడగండి. వీరికి శరీరము లేదే మరి వీరు ఎవరు? అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరినీ అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరమపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశములో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివజయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవరి వద్దకైనా వెళ్ళవచ్చు. కానీ చాలా చల్లగా, నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశములో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బి.కెలని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయక వ్యక్తులున్నారు. కనుక దేవాలయాలకు వెళ్ళి సర్వీసు చేయడం చాలా సులభము. రండి, మేము మీకు శివుని జీవిత చరిత్ర తెలియజేస్తామని చెప్పండి. మీరు శివుని పూజిస్తున్నారు, వారి నుండి ఏం వేడుకుంటున్నారు? మేము మీకు వీరి జీవితకథను పూర్తిగా తెలుపుతామని చెప్పండి. మరొక రోజు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళండి. మీకు చాలా సంతోషముంటుంది. పల్లెల సేవ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి-వారి తెలివితేటలున్నాయి కదా. మొట్టమొదట శివబాబా మందిరాలకు వెళ్ళమని తండ్రి చెప్తున్నారు. తర్వాత లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి వీరికీ వారసత్వమెలా లభించిందని అడగండి. మీరు వస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తామని చెప్పండి. పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలు, మాట్లాడేది కూడా ఆత్మలే. ఈ శరీరము సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి - నన్ను స్మృతి చేయమంటున్నారని చెప్పండి. ఈ మాటలు వింటూనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు ఎంత దేహీ-అభిమానులుగా ఉంటారో అంత మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడింకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటి పై పూర్తిగా వైరాగ్యము రాలేదు. ఈ పాత దేహము వదలాలని మీకు తెలుసు. అందువలన దీని పై మమకారము ఎందుకుంచాలి? శరీరమున్నా శరీరము పై ఏ మమకారము ఉండరాదు. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలని మనస్సులో తపన ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇటువంటి బాబానెలా వదలాలనిపిస్తుంది. ఇటువంటి బాబా మళ్లీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. అయితే పగలు మీ వ్యాపారాదులు చేసుకోండి. గృహస్థ వ్యవహారములలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తమవుతుందని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి లేకుంటే ఎక్కడకెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి. కానీ ఇదంతా వినాశనమవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము. తర్వాత సుఖధామములోకి వస్తాము. సమయము దొరికినప్పుడంతా స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయముంటుంది, 8 గంటలు వ్యాపారాదులు చెయ్యండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి ఆత్మిక సేవ చేయండి. ఎంత సమయము దొరికితే అంత శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడకెళ్లినా శివుని మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతియాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది. ప్రకృతి దాసిగా అవుతుంది. వారి మొఖము మొదలైనవి కూడా ఆకర్షణ(అలౌకికముగా) చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మములోకి వెళ్ళి లీనమైపోతామని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయములో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసము చేస్తూ ఉంటారు. కాని వారు రాంగ్(తప్పు) మార్గములో ఉన్నారు. బ్రహ్మతత్వములో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తిమార్గములో సాక్షత్కారము కొరకు ఎంతో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు. శరీరము హత్య చేయబడ్తుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది.
కానీ పిల్లలైన మీరు సేవ చేయాలని కుతూహలముతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి, యోగము చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగములో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి - నాలో ఎలాంటి మాయా భూతము లేదు కదా? మాయా భూతములున్నవారు ఎవ్వరూ విజయము పొందలేరు. సర్వీసు చాలా ఉంది. బాబా వెళ్ళలేరు కదా. ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి, అపవిత్రములోకి ఎలా తీసుకెళ్ళాలి. ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీసు చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తారనే(సన్ షోస్ ఫాదర్) గాయనము కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగలవారిగా చేశారు కదా. సర్వీసు చేసేందుకు ఆసక్తి గల మంచి-మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా? అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు కేవలం ఫోల్డింగు (మడిచే) చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుండా ఎవరికి అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషీ కూడా ఉంటుంది. బాబా ఇతను 8-9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటివారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. పత్రి ఒక్కరికి నేను నా గామ్రాన్ని ఉన్నతము చేయాలి, నా సోదరుల సేవ చేయాలని పత్రి ఒక్కరికీ ఆలోచన మరియు కోరిక ఉంటుంది(చారిటి బిగిన్స్ అట్ హోం). సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారౌతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పక్రితము వలె కూర్చుని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షము పెరుగుతుంది. నిరాకార వృక్షము నుండి ఆత్మలు నెంబరువారుగా వస్తారు. శివబాబాగారి మాల లేక వృక్షము చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
కానీ పిల్లలైన మీరు సేవ చేయాలని కుతూహలముతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి, యోగము చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగములో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి - నాలో ఎలాంటి మాయా భూతము లేదు కదా? మాయా భూతములున్నవారు ఎవ్వరూ విజయము పొందలేరు. సర్వీసు చాలా ఉంది. బాబా వెళ్ళలేరు కదా. ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి, అపవిత్రములోకి ఎలా తీసుకెళ్ళాలి. ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీసు చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తారనే(సన్ షోస్ ఫాదర్) గాయనము కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగలవారిగా చేశారు కదా. సర్వీసు చేసేందుకు ఆసక్తి గల మంచి-మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా? అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు కేవలం ఫోల్డింగు (మడిచే) చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుండా ఎవరికి అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషీ కూడా ఉంటుంది. బాబా ఇతను 8-9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటివారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. పత్రి ఒక్కరికి నేను నా గామ్రాన్ని ఉన్నతము చేయాలి, నా సోదరుల సేవ చేయాలని పత్రి ఒక్కరికీ ఆలోచన మరియు కోరిక ఉంటుంది(చారిటి బిగిన్స్ అట్ హోం). సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారౌతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పక్రితము వలె కూర్చుని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షము పెరుగుతుంది. నిరాకార వృక్షము నుండి ఆత్మలు నెంబరువారుగా వస్తారు. శివబాబాగారి మాల లేక వృక్షము చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కనీసము 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా, నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో విజయము పొందేందుకు మీలో ఎలాంటి మాయా భూతమూ ఉండరాదు.
2. మీతో మీరే మాట్లాడుకోవాలి - '' మేము ఇప్పుడు చూసేదంతా వినాశనమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత సుఖధామములోనికి వస్తాము. ''
వరదానము :- '' విశ్వంలో ఈశ్వరీయ పరివార స్నేహమనే బీజాన్ని నాటే విశ్వ సేవాధారీ భవ ''
విశ్వ సేవాధారీ పిల్లలైన మీరు విశ్వములో ఈశ్వరీయ పరివార స్నేహమనే బీజాన్ని నాటుతారు. ఆస్తికులు గానీ, నాస్తికులు గానీ అందరికీ అలౌకిక లేక ఈశ్వరీయ స్నేహాన్ని, నిస్వార్థ స్నేహాన్ని అనుభూతి చేయించడమే విత్తనం నాటడం. ఈ బీజము సహయోగులుగా అయ్యే వృక్షాన్ని స్వతహాగా ఉత్పన్నము చేస్తుంది. అంతేకాక సమయానికి సహయోగులుగా అయ్యే ఫలము కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క ఫలము త్వరగా వెలువడ్తుంది, ఒక్కొక్క ఫలము సమయానికి వెలువడ్తుంది.
స్లోగన్ :- '' భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకోవడం, గుర్తించడం, వారికి డైరక్టు పిల్లలుగా అవ్వడం, అన్నిటికంటే గొప్ప భాగ్యము ''
No comments:
Post a Comment