Saturday, November 23, 2019

Telugu Murli 24/11/2019

24-11-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 12-03-1985 మధువనము

'' సత్యతా శక్తి ''
ఈ రోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు తమ సత్యతా శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. సత్యమైన జ్ఞానము లేక సత్యతా శక్తి ఎంత ఉన్నతమైనదో దాని అనుభవం కలిగిన ఆత్మలు మీరు. దూరదేశవాసులైన పిల్లలందరూ భిన్న ధర్మాలు, భిన్న భిన్న విశ్వాసాలు, భిన్న ఆచార వ్యవహారాలలో ఉంటున్నా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము వైపుకు లేక రాజయోగము వైపుకు ఎందుకు ఆకర్షితులయ్యారు? సత్యమైన తండ్రి సత్యమైన పరిచయము లభించింది. అనగా సత్యమైన జ్ఞానము లభించింది, సత్యమైన పరివారం లభించింది, సత్యమైన స్నేహం లభించింది, సత్యమైన ప్రాప్తి అనుభవమయింది. అందుకే సత్యతా శక్తి వెనుక ఆకర్షితులయ్యారు. జీవితముంది, ప్రాప్తి కూడా ఉంది, యథాశక్తి జ్ఞానము కూడా ఉంది. కానీ సత్యమైన జ్ఞానము లేదు. కావున సత్యతా శక్తి సత్యమైన తండ్రికి చెందినవారిగా తయారు చేసింది.
సత్యత అన్న పదానికి రెండు అర్థాలున్నాయి. సత్యము అనగా సత్యము, రెండవది సత్యము అనగా నాశనము లేనిది. కావున సత్యతా శక్తి అవినాశి కూడా. కావున అవినాశి ప్రాప్తి, అవినాశి సంబంధాలు, అవినాశి స్నేహము, అవినాశి పరివారము లభించాయి. ఇదే పరివారము 21 జన్మలు భిన్న భిన్న నామ-రూపాలతో కలుస్తూ ఉంటారు. కానీ తెలుసుకోలేరు. మేమే అనేక రకాల సంబంధాలతో పరివారంలోకి వస్తూ ఉంటామని ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ అవినాశి ప్రాప్తి, పరిచయము దూరదేశములో ఉంటున్నా తమ సత్యమైన పరివారము, సత్యమైన తండ్రి, సత్యమైన జ్ఞానము వైపుకు ఆకర్షించబడ్డారు. ఎక్కడైతే సత్యత కూడా ఉంటుందో, అవినాశిగా కూడా ఉంటుందో అదే పరమాత్మ గుర్తింపు. కావున ఎలాగైతే మీరందరు ఇదే విశేషత ఆధారంగా ఆకర్షితులయ్యారో అలా సత్యతా శక్తిని, సత్య జ్ఞానమును విశ్వములో ప్రత్యక్షం చేయండి. 50 సంవత్సరాలు ధరణిని తయారు చేసారు, స్నేహములోకి తీసుకొచ్చారు, సంపర్కములోకి తీసుకొచ్చారు. రాజయోగము ఆకర్షణలోకి తీసుకొచ్చారు, శాంతిని అనుభవము చేయించడం ద్వారా ఆకర్షణలోకి తీసుకొచ్చారు. ఇంకేం మిగిలి ఉంది? ఎలాగైతే పరమాత్మ ఒక్కరేనని భిన్న-భిన్న ధర్మాల వారు విశ్వసిస్తారో, అలా యథార్థమైన సత్య జ్ఞానము ఒక్క తండ్రిదే, మార్గమూ ఒక్కటే అనే శబ్ధము ఎప్పటి వరకైతే మారుమ్రోగదో అప్పటివరకు ఆత్మలు అనేక గడ్డిపోచల ఆధారం వైపుకు వెళ్లడం సమాప్తమవ్వదు. ఇప్పుడు ఇది కూడా ఒక మార్గమని, మంచి మార్గమని భావిస్తున్నారు. కానీ చివరికి ఒకే తండ్రి, ఒకే పరిచయాన్ని, ఒకే మార్గమని తెలుసుకుంటారు. అనేకత అనే ఈ భ్రాంతి సమాప్తమవ్వడమే విశ్వశాంతికి ఆధారము. ఈ సత్యతా పరిచయము లేక సత్య జ్ఞానమనే శక్తి యొక్క అల ఎప్పటి వరకైతే నలువైపులా వ్యాపించదో అప్పటివరకు ప్రత్యక్షతా జెండా క్రింద సర్వాత్మలం ఆధారము తీసుకోజాలము. కావున ఈ స్వర్ణిమ జయంతి సందర్భంగా విశేష ఆహ్వానమునిచ్చి తండ్రి ఇంటికి పిలుస్తున్నారు. ఇది మన స్టేజ్‌. ఇక్కడ శ్రేష్ఠ వాతావరణముంది, స్వచ్ఛమైన బుద్ధి యొక్క ప్రభావముంది, స్నేహముతో కూడిన ధరణి ఉంది, పవిత్రమైన పాలన ఉంది. ఇటువంటి వాయుమండలం మధ్య మన సత్య జ్ఞానాన్ని ప్రసిద్ధం చేయడంతో ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. ప్రదర్శనల ద్వారా విహంగమార్గ సేవ ప్రారంభమైనప్పుడు ఏం చేసేవారో గుర్తుందా? జ్ఞానములో ముఖ్యమైన ప్రశ్నల ఫారాన్ని నింపించేవారు కదా! అందులో పరమాత్ముడు సర్వవ్యాపి - అవునా? కాదా? గీతా భగవానుడు ఎవరు? ఈ ఫారం నింపించేవారు కదా. అభిప్రాయం వ్రాయించుకునేవారు. చిక్కు ప్రశ్నలు అడిగేవారు. మొదట ఇలా ప్రారంభించారు. కానీ నడుస్తూ నడుస్తూ ఈ విషయాలను గుప్త రూపంలో అందిస్తూ సంపర్కాన్ని, స్నేహాన్ని ముందుంచుతూ సమీపంగా తీసుకొచ్చారు. ఈసారి ఈ ధరణి పైకి వచ్చినప్పుడు సత్య పరిచయమును, స్పష్ట పరిచయమును ఇవ్వండి. ఇది కూడా మంచిదే. ఇదైతే సంతుష్టపరచే విషయం. కానీ ఒకే తండ్రి యొక్క ఒకే యథార్థమైన పరిచయం స్పష్టంగా బుద్ధిలోకి తీసుకొచ్చే సమయాన్ని ఇప్పుడు తీసుకు రావాలి. కేవలం నేరుగా తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు, తండ్రి వచ్చారని చెప్తూ ఉండేవారు. కాని ఇదే పరమాత్ముని జ్ఞానము, ఇక్కడ పరమాత్ముని కర్తవ్యం కొనసాగుతోందని వారు భావించేవారా? జ్ఞానములో నవీనత ఉందని అనుభవం చేసుకుంటున్నారా? ఇటువంటి చర్చను(వర్క్‌షాప్‌ను) ఎప్పుడైనా జరిపారా? పరమాత్ముడు సర్వవ్యాపి అవునా, కాదా? ఒకే సమయంలో వస్తారా? లేక పదే పదే వస్తారా? అన్న స్పష్ట పరిచయము వారికి లభించాలి. తద్వారా ప్రపంచములో వినని దానిని ఇక్కడ విన్నామని భావించాలి. ఈ విధంగా విశేష వక్తలు ఎవరైతే వస్తారో వారితో ఈ జ్ఞాన రహస్యాలను ఆత్మిక సంభాషణ చేయడం ద్వారా వారి బుద్ధిలోకి వస్తాయి. అలాగే మీరు ఏ భాషణలైతే చేస్తారో వాటిలో కూడా తమ పరివర్తనను గురించిన అనుభవాలను వినిపిస్తూ, ఒక్కొక్క వక్త జ్ఞానానికి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేయగలరు. పరమాత్మ సర్వవ్యాపి అవునా, కాదా? అన్న అంశము నేరుగా చెప్పకుండా ఒకే తండ్రిని, ఒకే రూపం ద్వారా తెలుసుకోవడం వలన ఏ ఏ విశేష ప్రాప్తులు లభించాయో ఆ ప్రాప్తులను వినిపిస్తూ, సర్వవ్యాపి కారు అన్న విషయం స్పష్టం చేయగలరు. ఒకే పరంధామ నివాసిగా భావించి స్మృతి చేయడం వలన ఏ విధంగా బుద్ధి ఏకాగ్రమవుతుందో లేక తండ్రి సంబంధం ద్వారా ఏ ప్రాప్తులు అనుభవమవుతాయో అర్థం చేయించాలి. ఈ విధంగా సత్యత మరియు నిర్మానత(నిరహంకారత) రెండు రూపాల ద్వారా నిరూపించగలరు. దీని ద్వారా వీరు తమ మహిమ చేసుకుంటున్నారని అభిమానం కూడా అనిపించదు. నమ్రత మరియు దయా భావన అభిమానంగా అనిపించదు. మురళీలు వినేటప్పుడు దానిని అభిమానంగా చెప్తున్నారని ఎవ్వరూ అనలేరు. అథారిటీతో చెప్తున్నారనే అంటారు. పదాలు ఎంత కఠినంగా ఉన్నా దానిని అభిమానమని అనరు. అథారిటీని అనుభవం చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంతెంత అథారిటీ ఉంటుందో అంత నమ్రత మరియు దయా భావాలున్నాయి. తండ్రి అయితే ఈ విధంగా పిల్లల ముందే మాట్లాడ్తారు. కానీ మీరందరూ ఈ విశేషతతో స్టేజి పైన ఈ విధి ద్వారా స్పష్టం చేయగలరు. ఏ విధంగా వినిపించారో అలాగే ఒకటి - సర్వవ్యాపి అన్న విషయాన్ని ఉంచండి, రెండవది - నామ-రూపాలకు అతీతుడు అన్న విషయాన్ని ఉంచండి. మూడవది - డ్రామా. డ్రామా పాయింట్లు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆత్మ యొక్క క్రొత్త విశేషతలను బుద్ధిలో ఉంచుకోవాలి. విశేషమైన అంశాలేవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా ఉంచుకొని అనుభవము మరియు ప్రాప్తుల ఆధారంగా స్పష్టం చేస్తూ వెళ్ళండి. తద్వారా ఈ సత్య జ్ఞానము ద్వారానే సత్యయుగ స్థాపన జరుగుతోందని అర్థం చేసుకోవాలి. భగావానువాచలో, భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ వినిపించలేని విశేషత ఏమిటో అర్థం చేసుకోవాలి. మనుష్యులు ఎప్పుడూ మనుష్యులకు సద్గురువుగా, సత్యమైన తండ్రిగా అవ్వజాలరని, మనుష్యులు పరమాత్మ అవ్వజాలరని మీరు స్పష్టమైన పదాలతో స్లోగన్లను చెప్తారో అలా ఏ విశేష పాయింట్లనైతే సమయానుసారంగా వింటూ వచ్చారో దాని రూపురేఖ చేసుకోండి. దాని ద్వారా సత్యమైన జ్ఞానము స్పష్టమవ్వాలి. క్రొత్త ప్రపంచము కొరకు ఇది క్రొత్త జ్ఞానము. దీని ద్వారా నవీనత మరియు సత్యత ఈ రెండూ అనుభవమవ్వాలి. మీరు సమ్మేళనాలు(కాన్ఫరెన్సులు) చేస్తారు. వాటి ద్వారా మంచి సేవ జరుగుతుంది. కాన్ఫరెన్సు ద్వారా ఒకసారి చార్టరు, ఒకసారి మరొక సాధనాన్ని తయారుచేస్తారు. వాటి ద్వారా కూడా సంపర్కాన్ని ముందుకు తీసుకెళ్లే సాధనాన్ని స్వంతం చేసుకుంటారు. ఈ సాధనాలు కూడా మంచివే. ఎందుకంటే తర్వాత కూడా కలుస్తూ ఉండే అవకాశం లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇవి చాలా మంచి విషయాలని, ప్లాను బాగుందని చార్టరు బాగుందని, సేవా సాధనాలు బాగున్నాయని ఏ విధంగా అంటున్నారో, అలా ఈ రోజు క్రొత్త జ్ఞానము స్పష్టమయిందని అనాలి. ఇలా విశేషంగా ఐదారుగురిని తయారు చేయాలి. ఎందుకంటే అందరి మధ్యలో ఈ సంభాషణ జరగజాలదు. విశేషంగా ఎవరైతే వస్తారో, టికెట్‌ను ఇచ్చి తీసుకొస్తారో వారికి విశేష పాలన కూడా లభిస్తుంది. వారిలో ఎవరైతే ప్రసిద్ధులుగా ఉంటారో వారితో ఈ ఆత్మిక సంభాషణ చేసి తప్పకుండా వారి బుద్ధిలో స్పష్టం చేయవలసిన అవసరముంది. ఇటువంటి ప్లాను ఏదైనా తయారు చేయండి. తద్వారా వారికి, మీలో నశా చాలా ఉందన్న భావనే కాక, ఇది సత్యమైనదని అనిపించాలి. దీనినే బాణమ తగలాలి, బాధ ఉండరాదని అంటారు. బాధతో అరవరాదు. సంతోషంతో నాట్యం చేయాలి. ఉపన్యాసాల రూపురేఖలను కూడా కొత్తగా తయారు చేయండి. విశ్వశాంతికి సంబంధించిన చాలా ఉపన్యాసాలు చేసారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అవసరముంది. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఏమీ జరగజాలదు. ఈ విషయం వార్తాపత్రికలలో వస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటో, ఆధ్యాత్మిక జ్ఞానమంటే ఏమిటో, దీనికి మూలం ఎవరో అక్కడ వరకు చేరుకోలేదు. భగవంతుని కార్యం జరుగుతోందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మాతలు చాలా మంచి కార్యం చేస్తున్నారని అంటున్నారు. సమయానుసారం ఈ భూమిని కూడా తయారు చేయాలి. ఎలాగైతే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారో, అలా తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు. కావున ఈ పెద్ద శబ్ధము ప్రత్యక్షతా జెండాను ఎగురవేస్తుంది. అర్థమయిందా!
స్వర్ణిమ జయంతి సందర్భంగా ఏం చెయ్యాలో అర్థమయింది కదా! ఇతర స్థానాలలో అయితే వాతావరణాన్ని చూడవలసి ఉంటుంది. కానీ తండ్రి ఇంటిలో..... ఇది మన ఇల్లు, మన స్టేజ్‌ కావున ఇటువంటి స్థానంలో ఈ ప్రత్యక్షతా శబ్ధాన్ని మారుమ్రోగించగలరు. ఈ విధంగా కొద్దిమందైనా ఈ విషయంలో నిశ్చయబుద్ధి గలవారిగా అయితే వారే ఆ శబ్ధాన్ని ప్రఖ్యాతం చేయగలరు. ఇప్పుడు రిజల్టు ఎలా ఉంది? ఇప్పుడు సంపర్కము మరియు స్నేహంలోకి వారంతకు వారే వచ్చి సేవ చేస్తున్నారు. ఇతరులను కూడా స్నేహ సంపర్కాలలోకి తీసుకొస్తున్నారు. ఎంతవరకు స్వయం తయారయ్యారో అంత సేవ కూడా చేస్తున్నారు. దీనిని కూడా సఫలత అనే అంటారు కదా! కాని ఇప్పుడింకా ముందుకు వెళ్లాలి. మొదట పేరు చెడ్డ పేరుతో(చెడుగా) మారుమ్రోగింది. ఇంతకు ముందు భయపడేవారు. ఇప్పుడు రావాలనుకుంటున్నారు. ఈ తేడా అయితే వచ్చింది కదా! ఇంతకుముందు పేరు వినేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆ పేరును ప్రస్తావించాలని కోరుకుంటున్నారు. యాభై సంవత్సరాలలో ఈ సఫలతను పొందారు. ధరణిని తయారు చేయడంలో సమయం పడ్తుంది. ఇందులోనే 50 సంవత్సరాలు పడితే ఇంకేమవుతుందని అనుకోకండి. మొదట నాగలి నడిపించి ధరణిని యోగ్యంగా చేయడంలో సమయం పడ్తుంది. బీజాలను నాటడంలో సమయం పట్టదు. శక్తిశాలి బీజానికి శక్తిశాలి ఫలము వెలువడ్తుంది. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, అది జరగవలసి ఉంది. అదే యథార్థంగా జరిగింది. అర్థమయిందా!
(విదేశీ పిల్లలను చూసి) ఈ ఛాత్రకులు బాగున్నారు. బ్రహ్మాబాబా చాలాకాలం ఆహ్వానం తర్వాత మీకు జన్మనిచ్చారు. విశేష ఆహ్వానము ద్వారా మీరు జన్మించారు. ఆలస్యం అయితే తప్పకుండా జరిగింది. కానీ ఆరోగ్యంగా, మంచిగా జన్మించారు. తండ్రి పిలుపు చేరుకుంది కానీ సమయం వచ్చినప్పుడు సమీపానికి వచ్చి చేరుకున్నారు. విశేషంగా బ్రహ్మాబాబా సంతోషిస్తారు. తండ్రి సంతోషిస్తే పిల్లలు కూడా సంతోషిస్తారు. కానీ విశేషంగా బ్రహ్మాబాబా స్నేహముంది. కావున మెజారిటి బ్రహ్మబాబాను చూడకపోయినా చూసినట్లుగానే అనుభవం చేసుకుంటున్నారు. చిత్రములో కూడా చైతన్యతను అనుభవం చేసుకుంటారు. ఇది విశేషత. బ్రహ్మబాబా విశేష స్నేహము, సహయోగము ఆత్మలైన మీకు లభించింది. బ్రహ్మలోనే ఎందుకు? ఇక్కడే ఎందుకు? అని భారతదేశంవారు ప్రశ్నిస్తారు. కానీ విదేశీ పిల్లలు వస్తూనే బ్రహ్మబాబా ఆకర్షణలో బంధింపబడ్తారు. కావున ఇది విశేష సహయోగము యొక్క వరదానము. కావున చూడకపోయినా, పాలన ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటారు. బ్రహ్మబాబా అని హృదయపూర్వకంగా అంటారు. కావున ఇది విశేష సూక్ష్మ స్నేహానికి సంబంధించింది. వీరు మా వెనుక ఎలా వచ్చారని తండ్రి ఆలోచించరు. మీరూ ఆలోచించరు, బ్రహ్మా ఆలోచించరు. ఎదురుగానే ఉన్నారు. ఆకార రూపము కూడా సాకార సమానంగా పాలన అందిస్తోంది. ఆ విధంగా అనుభవం చేస్తున్నారు కదా! కొద్ది సమయంలో ఎంతమంది టీచర్లు తయారయ్యారు! విదేశీ సేవలో ఎంత సమయం గడిచింది? ఎంతమంది టీచర్లు తయారయ్యారు? బాగుంది. బాప్‌దాదా పిల్లల సేవా లగ్నాన్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే విశేషమైన సూక్ష్మ పాలన లభిస్తోంది కదా! బ్రహ్మబాబాలో ఏ విశేష సంస్కారాన్ని చూశారు? సేవ లేకుండా వారు ఉండగలిగేవారా? కావున విదేశాలలో దూరంగా ఉండేవారికి ఈ విశేష పాలన యొక్క సహయోగమున్న కారణంగా సేవ చేయాలనే ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది.
స్వర్ణిమ జయంతిలో ఇంకా ఏం చేశారు? స్వయం కూడా స్వర్ణిమంగా అయ్యారు మరియు జయంతి కూడా స్వర్ణిమ జయంతిగా జరుపుకున్నారు. బాగుంది. బ్యాలెన్సు(సమతుల్యత) పై అటెన్షన్‌ తప్పకుండా ఉంచండి. స్వయం మరియు సేవ. స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి. బ్యాలన్స్‌ ఉంచడం ద్వారా అనేక ఆత్మలకు స్వ సహితంగా దీవెనలు ప్రాప్తింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. అర్థమయిందా! సేవకు ప్లాను తయారుచేస్తూ మొదట స్వస్థితి పై అటెన్షన్‌ ఉంచాలి. అప్పుడు ప్లానులో శక్తి నిండుతుంది. ప్లాను(ప్రణాళిక) బీజము వంటిది. కావున బీజములో ఒకవేళ శక్తి లేకుంటే, శక్తిశాలి బీజము కాకపోతే ఎంతగా శ్రమ చేసినా శ్రేష్ఠ ఫలమునివ్వదు. కావున ప్లానుతో పాటుగా స్వ స్థితిలో తప్పకుండా శక్తిని నింపుకుంటూ ఉండండి. మంచిది.
ఇలా సత్యతను పత్య్రక్షం చేసేవారికి, సదా సత్యత మరియు నమత్రల బ్యాలెన్స్‌ ఉంచేవారికి, పత్రి మాట ద్వారా ఒక్క తండి పరిచయాన్ని నిరూపించేవారికి, సదా స్వ ఉన్నతి ద్వారా సఫలతను పొందేవారికి, సేవలో తండి పత్య్రక్షతా జెండాను ఎగురవేసేవారికి, ఇటువంటి సద్గురువు, సత్యమైన తండి యొక్క సత్యమైన పిల్లలకు బాప్‌దాదాల పియ్రస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయంలో దాదీజీ భోపాల్‌ వెళ్లేందుకు శెలవు తీసుకుంటున్నారు :-
వెళ్లడంలో కూడా సేవ ఉంది, ఉండడంలో కూడా సేవ ఉంది. సేవకు నిమిత్తంగా అయిన పిల్లల ప్రతి సంకల్పంలో, ప్రతి సెకనులో సేవ ఉంది. మిమ్ములను చూసి ఎంతగా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. సేవలో ముందుకు వెళ్తారు. కావున సఫలత సదా జతలో ఉండనే ఉంది. తండ్రిని కూడా వెంట తీసుకెళ్తున్నారు. సఫలతను కూడా జతలో తీసుకు వెళ్తున్నారు. ఏ స్థానానికి వెళ్తారో, అక్కడ సఫలత ఉంటుంది. (మోహినీ బెహన్‌తో) నలువైపులా తిరిగేందుకు వెళ్తున్నారు. తిరగడం అనగా అనేక ఆత్మలకు స్వ ఉన్నతి యొక్క సహయోగమునివ్వడం. తోడు తోడుగా స్టేజ్‌ పై అవకాశము లభించినప్పుడు క్రొత్త ఉపన్యాసములాంటిది(భాషణ) చేసి రండి. మొదట మీరు ప్రారంభించండి, నెంబర్‌వన్‌గా అయిపోతారు. ఎక్కడికి వెళ్లినా అందరూ ఏమంటారు? బాప్‌దాదా ప్రియస్మృతులు తీసుకొచ్చారా? కావున ఎలాగైతే బాప్‌దాదా స్నేహము, సహయోగాల శక్తినిస్తారో, అలా మీరు కూడా తండ్రి నుండి తీసుకున్న స్నేహము, సహయోగ శక్తులను ఇస్తూ వెళ్లండి. అందరినీ ఉత్సాహ-ఉల్లాసాలలోకి ఎగిరింపజేసేందుకు ఆకర్షించేటట్లుగా మాట్లాడుతూ ఉండండి. అందరూ సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. ఆత్మీయతా సంతోషంలో అందరినీ నాట్యం చేయించండి మరియు రమణీకత ద్వారా అందరికీ చాలా సంతోషంతో పురుషార్థంలో ముందుకు వెళ్లడం నేర్పించండి. మంచిది.

వరదానము :- '' స్వంత చక్రాన్ని(స్వదర్శన చక్రాన్ని) తెలుసుకొని జ్ఞానయుక్త ఆత్మగా అయ్యి ప్రభు ప్రియగా అవ్వండి ''
ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉందో దానిని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం. పూర్తి చ జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థ రీతిగా ధారణ చేయడమే స్వదర్శన చక్రమును నడిపించడం. స్వంత చక్రమును తెలుసుకోవడం అనగా జ్ఞానయుక్త ఆత్మగా అవ్వడం. అటువంటి జ్ఞానయుక్త ఆత్మలే ప్రభు ప్రియులు. వారి ముందు మాయ నిలబడజాలదు. ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది.

స్లోగన్‌ :- '' ప్రతి పుత్రుడు తండ్రి సమానం ప్రత్యక్ష ప్రమాణంగా అయితే ప్రజలు త్వరగా తయారవుతారు.''

No comments:

Post a Comment