28-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీ అన్ని ఖజానాల(భండారాల)ను పూర్తిగా నింపేందుకు శివబాబా వచ్చారు. భండారము నిండగానే కష్టాలన్నీ దూరమైపోతాయి (భండారా భర్‌పూర్ కాల్‌కంటక్ దూర్) అని అంటారు ''
ప్రశ్న :- జ్ఞానయుక్తమైన పిల్లల బుద్ధిలో ఏ విషయము పై గట్టి నిశ్చయముంటుంది ?
జవాబు :- వారికి మన పాత్ర ఎప్పుడూ అరగదు, తరగదు, తొలగదు అనే దృఢ నిశ్చయముంటుంది. ఆత్మనైన నాలో 84 జన్మల అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. జ్ఞానము బుద్ధిలో ఉంటే వారిని జ్ఞాన స్వరూపులని అంటారు లేకుంటే బుద్ధి నుండి జ్ఞానమంతా ఆరిపోతుంది, ఎగిరిపోతుంది.
ఓంశాంతి. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఏం చెప్తున్నారు ? ఏ సేవ చేస్తున్నారు ? ఇప్పుడు తండ్రి ఈ ఆత్మిక చదువును చదివించే సేవ చేస్తారు. తండ్రి పాత్ర, టీచరు పాత్ర మరియు గురువు పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. మూడు పాత్రలను చాలా బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రే కాక సద్గతినిచ్చే గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. చిన్న, పెద్ద, ముసలివారు, యువకులు అందరికీ ఒక్కరే సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు, అనంతమైన శిక్షణనిస్తున్నారు. మాకు అందరి జీవిత చరిత్రలు తెలుసునని కాన్ఫరెన్స్(సమ్మేళనాలలో) కూడా చెప్పండి. పరమపిత పరమాత్ముని జీవిత కథ కూడా తెలుసునని చెప్పండి. నెంబరువారుగా అంతా బుద్ధిలో స్మృతి ఉండాలి. విరాట రూపమంతా బుద్ధిలో ఉంటుంది. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మళ్లీ మనము దేవతలుగా అవుతాము, ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇది పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు స్మృతిలో ఉండవు. ఉత్థాన-పతనాల పూర్తి రహస్యము బుద్ధిలో ఉండాలి. మనము ఉన్నతంగా ఉండేవారము, తర్వాత పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్య(స్థితి)లో ఉన్నాము, శూద్రులమూ కాము అలాగని పూర్తి బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా అయితే శూద్ర పనులు చేయరాదు. బ్రాహ్మణులలో కూడా అప్పుడప్పుడు శూద్రత్వము వచ్చేస్తుంది. పాపము ఎప్పటి నుండి ప్రారంభమయిందో కూడా మీకు తెలుసు, కామచితి పైకి ఎక్కినప్పటి నుండి మొదలయింది. మీ బుద్ధిలో పూర్తి చక్ర జ్ఞానమంతా ఉంది. పై భాగములో పరమపిత పరమాత్మ తండ్రి, ఆ తర్వాత ఆత్మలైన మీరు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తు ఉండాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, దేవతలుగా అవుతున్నాము. వైశ్య, శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి మనలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు, తర్వాత మనము మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని మళ్లీ వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. పల్టీల ఆట లేక 84 జన్మల చక్రము కూడా మీకు తెలుసు. పల్టీల ఆట ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. మిమ్ములను చాలా తేలికగా చేస్తున్నారు - దాని వలన మీరు బిందువై వెంటనే ఎగిరిపోగలరు. తరగతిలో కూర్చున్నప్పుడు పిల్లల బుద్ధిలో చదువే స్మృతిలో ఉంటుంది, అలాగే మనకు ఈ చదువు గుర్తుకుండాలి. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నాము మళ్లీ ఇదే విధంగా చక్రములో తిరుగుతాము. ఈ చక్రము సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రము మొదలైనవాటి జ్ఞానము బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది. శూద్రులకు గానీ, దేవతలకు గానీ ఈ జ్ఞానము లేదు. భక్తిమార్గములో తయారు చేసిన చిత్రములో లోపాలున్నాయని(డిఫెక్టడ్) ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద ఉండే చిత్రాలు చాలా ఖచ్ఛితమైనవి(ఆక్యురేట్) ఎందుకంటే మీరు సరిగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. అందువలన మీకు ఇప్పుడు భక్తి అంటే ఏమో, జ్ఞానమంటే ఏమో తెలుసు. జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి జ్ఞానసాగరులు. ఇప్పుడు వారు లభించారు. పాఠశాలలో చదువునప్పుడు లక్ష్యముంటుంది కదా, భక్తిమార్గములో లక్ష్యముండదు. మనము శ్రేష్ఠమైన దేవీదేవతలుగా ఉండేవారము, తర్వాత పతితంగా అయ్యాము. అప్పుడు మీకు తెలియదు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకిప్పుడు అన్ని విషయాలు తెలుసు. బి.కె.లుగా ఇంతకుముందు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత మానవుడు కదా. వారికంత మంది పిల్లలున్నారంటే తప్పకుండా దత్తు పిల్లలే అని అర్థము కదా. ఎంతమంది దత్తు పిల్లలుగా అయ్యారు ! ఆత్మ రూపములో అందరూ సోదరులే(భాయి-భాయి) కదా. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో దూరాలకు వెళ్తుంది. పైన ఆకాశములోని నక్షత్రాలు దూరము నుండి ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా మారదు. కానీ మీ పదవి అత్యంత ఉన్నతమైనది. ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నవిగా ఉంటాయి. వాటిని కూడా సూర్య దేవత, చంద్ర దేవత,....... అని అంటారు. సూర్యుని తండ్రి, చంద్రుని తల్లి అని అంటారు. ఇక మిగిలిన ఆత్మలన్నీ నక్షత్రాలు. ఆత్మలన్నీ ఒకే రకంగా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతాయి, మీరు మాత్రమే దేవతలుగా అవుతారు.
మనము చాలా శక్తిశాలురుగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధాన దేవతలుగా అవుతాము. నంబరువారుగా కొద్ది కొద్దిగా తేడా ఉండనే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా అయ్యి సతోప్ర్రధాన దేవతలుగా అవుతాయి. కొన్ని ఆత్మలు సంపూర్ణ పవిత్రంగా అవ్వలేవు. జ్ఞానము కొద్దిగా కూడా తెలియదు. తండ్రి అర్థం చేయించారు. తండ్రి పరిచయము అందరికీ తప్పకుండా లభించాలి. చివరిలోనైనా తండ్రిని గుర్తిస్తారు కదా. వినాశన సమయములో తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొంత మంది భగవంతుడెక్కడో అవతరించి ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలియదని అంటారు. ఏదో ఒక రూపములో వస్తారని భావిస్తారు. మానవ మతాలు(అభిప్రాయాలు) అనేకమున్నాయి కదా. మీది మాత్రము ఒకే ఈశ్వరీయ మతము. ఈ ఈశ్వరీయ మతము ద్వారా మీరు ఎలా తయారవుతారు? ఒకటేమో మానవ మతము రెండవది ఈశ్వరీయ మతము మూడవది దేవతా మతము. దేవతలకు కూడా మతమునిచ్చేదెవరు? తండ్రి. తండ్రి శ్రీమతము శ్రేష్ఠంగా తయారు చేస్తుంది. శ్రీ శ్రీ అని తండ్రినే అనాలి. మానవులను అనరాదు. శ్రీ శ్రీ యే స్వయంగా వచ్చి శ్రీ(శ్రేష్ఠము)గా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్ఠంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని శ్రీ శ్రీ అని అంటారు, నేను మిమ్ములను అలాంటి యోగ్యులుగా తయారుచేస్తాను. వారు కూడా తమకు శ్రీ శ్రీ అనే బిరుదు తగిలించుకున్నారు. సమావేశాలలో కూడా మీరు తెలపండి. తెలిపించేందుకు మీరే నిమిత్తంగా అయ్యారు. శ్రీ శ్రీ అయినవారు ఒక్క శివబాబా మాత్రమే. వారు ఇటువంటి శ్రేష్ఠమైన దేవతలుగా చేస్తారు. వారు శాస్త్రాలు మొదలైన చదువులు చదివి టైటిల్(బిరుదు) తీసుకుంటారు. మిమ్ములను శ్రీ శ్రీ అయిన తండ్రి, శ్రీ అనగా శ్రేష్ఠంగా చేస్తున్నారు. ఈ ప్రపంచము తమోప్రధాన, భ్రష్టాచార ప్రపంచంగా ఉంది. భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. ఆ తండ్రి మహిమలెక్కడ? ఈ పతిత మానవుల బిరుదులెక్కడ? ఈ పతిత మానవులు ఆ తండ్రి బిరుదులు తమ పై ఉంచుకుంటారు. సత్య-సత్యమైన మహాత్మలు దేవీదేవతలు కదా. సతోప్రధాన ప్రపంచములో తమోప్రధాన మానవులుండేందుకు వీలే లేదు. రజోలో రజో మానవులే ఉంటారు. తమో గుణమువారుండరు. వర్ణముల గాయనము ఇప్పుడు మీకు అర్థము అవుతోంది. ఇంతకు ముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ఎంత తెలివిగలవారిగా చేస్తున్నారు! మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. శివబాబా భండారము భర్‌పూర్(నిండు)గా ఉంది. శివబాబా భండారమేది?(అవినాశి జ్ఞాన రత్నాలు) శివబాబా భండారము భర్‌పూర్, కష్టాలు దూరము(భండారా భర్‌పూర్ కాల్‌కంటక్ దూర్). తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. వారు స్వయం సాగరులయ్యారు. జ్ఞానరత్నసాగరుని పిల్లల బుద్ధి బేహద్ వైపుకు వెళ్ళాలి. ఇన్ని కోట్ల ఆత్మలన్నీ తమ తమ శరీరాలనే సింహాసనాలలో విరాజమానమై ఉన్నాయి. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఈ సింహాసనము పై విరాజమానమై ఉంటుంది. ఒక సింహాసనమున్నట్లు మరో సింహాసనము ఉండదు. రూపురేఖలు వేరు వేరుగా ఉంటాయి. దానినే ప్రాకృతికము(కుదరత్) అని అంటారు. ప్రతి ఒక్కరిది అవినాశి పాత్రనే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది, ఇంతకంటే సూక్ష్మమైనది, అద్భుతమైననది వేరేదేదీ లేదు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనములో ఏ పాత్రనూ అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సర్వమూ తెలుసుకుంటారు. జ్ఞానమంటే ఇదే. అంతేగాని అందరి ఆంతర్యాలను తెలుసునని కాదు. ఈ జ్ఞానము మీలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది. దాని ద్వారానే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. దానిని గురించి కూడా మీకు తెలుసు. తండ్రి బీజరూపులు, వారిలో వృక్షం ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. మానవులు లక్షల సంవత్సరాల ఆయువును ఇచ్చేశారు కావున జ్ఞానము వారికి రాదు. ఇప్పుడు మీకు సంగమ యుగములో ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్ర జ్ఞానమంతా తెలుసుకుంటారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇదే మీ అంతిమ జన్మ. పురుషార్థము చేస్తూ చేస్తూ మీరు సంపూర్ణ బ్రాహ్మణులుగా తయారైపోతారు. ఇప్పుడింకా తయారవ్వలేదు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. దానినే మాయతో ఓడిపోవడమని అంటారు. ఓడినందున బాబా ఒడి నుండి రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్ఠముగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడ? భ్రష్టులుగా తయారుచేసే ఒడి ఎక్కడ? ఒక్క సెకండులో జీవన్ముక్తి అలాగే ఒక సెకండులో పూర్తి దుర్దశపాలవుతారు. దుర్దశ ఎలా కలుగుతుందో బ్రాహ్మణ పిల్లలైన మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజు బాబాకు చెందినవారిగా అవుతారు, మళ్లీ రేపటి రోజు మాయ పిడికిలిలో చిక్కుకుని రావణుని వారిగా అవుతారు. మీరు రక్షించేందుకు ప్రయత్నిస్తే కొంతమంది రక్షింపబడ్తారు. మునిగిపోతున్నవారిని చూస్తే రక్షించేందుకు ప్రయత్నము చేస్తూ ఉండండి. కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతాయి.
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పాఠశాలలో చదువుతున్నారు కదా. మనము చక్రములో ఎలా తిరుగుచున్నామో మీకు తెలుసు. ఈ విధంగా చేయమని పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. ఇవన్నీ భగవానువాచ(భగవంతుడే తెలిపిన విషయాలు). వారిది శ్రీమతము కూడా అయ్యింది కదా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్ములము శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగములో ఉండేది శూద్ర సంప్రదాయము, కలియుగము ముగుస్తోందని మీకు తెలుసు. మీరు సంగమ యుగములో కూర్చొని ఉన్నారు. ఈ తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. తయారైన శాస్త్రాలన్నిటిలో మానవ మతాలున్నాయి. ఈశ్వరుడు శాస్త్రాలను తయారుచేయరు. ఒక్క గీతా శాస్త్రము పైననే ఎన్నో పేర్లు ఉంచారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైనవి అనేక పేర్లు ఉన్నాయి. గీతను మానవులు ఎందుకు ఇంతగా చదువుతున్నారో కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. అదే అధ్యాయాన్ని పట్టుకొని వారి వారి వాఖ్యానాలు వేరు వేరుగా చేస్తుంటారు. అవన్నీ మానవులు చేసినవి కదా. మానవులు తయారు చేసిన గీతను చదువడం వల్లనే ఈనాటి భారతదేశ పరిస్థితి ఇలా తయారయిందని మీరు చెప్పండి. మొదటి నంబరు శాస్త్రము గీతనే కదా. అది సనాతన దేవీదేవతా ధర్మపు శాస్త్రము. ఇది మీ బ్రాహ్మణ కులము, ఇది బ్రాహ్మణ ధర్మము కదా. ఎన్ని ధర్మాలున్నాయి! ఎవరెవరు ఏ ఏ ధర్మాన్ని స్థాపించారో వారి పేరు మీదే నడుస్తూ ఉంటాయి. జైనులు మహావీరుడని అంటారు. పిల్లలైన మీరంతా మహావీరులు - మహావీర వనితలు. మందిరాలలో మీ స్మృతిచిహ్నాలు ఉన్నాయి. రాజయోగులు కదా. క్రింద యోగ తపస్సులో కూర్చుని ఉన్నారు, పైన రాజ్యమును చూపించే చిత్రాలున్నాయి. రాజయోగము గురించి తెలిపే సరియైన మందిరము(దిల్వాడా మందిరము). కానీ ఎవరెవరో ఏవేవో పేేర్లు ఉంచారు. స్మారకచిహ్నాలు సరిగ్గా(ఆక్యురేట్‌గా) ఉన్నాయి. బుద్ధికి పని కలిగించి సరిగ్గా తయారుచేశారు. తర్వాత ఏ పేరు చెబితే ఆ పేరుంచారు. దానిని స్మృతిచిహ్నముగా (మాడల్‌గా) తయారుచేశారు. స్వర్గము మరియు సంగమయుగ రాజయోగాల మాడల్స్ తయారుచేశారు. మీరు ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరు చూశారు, ఆది అని సంగమ యుగమును అనాలా? లేక సత్యయుగమును అనాలా? సంగమయుగ దృశ్యమును క్రింద చూపిస్తారు, రాజ్యమును పై కప్పులో చూపిస్తారు. కావున సత్యయుగము ఆదియుగము, ద్వాపరము మధ్యయుగము. అంత్యమును మీరు చూడనే చూస్తారు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. పూర్తి స్మారకచిహ్నాలు తయారు చేయబడ్డాయి. దేవీదేవతలు వామమార్గములోకి వెళ్తారు. ద్వాపరము నుండి వామమార్గము మొదలవుతుంది. స్మారకచిహ్నము నూటికి నూరుపాళ్ళు సరిగ్గా ఉంది. స్మృతిచిహ్నాలుగా చాలా మందిరాలను నిర్మించారు. అన్ని గుర్తులు ఇక్కడనే ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీదేవతలైన భారతదేశ వాసులే రాజ్యమును పాలించి వెళ్లిపోయారు. వారి తర్వాత ఎన్నో మందిరాలు తయారయ్యాయి. సిక్కుల సంఖ్య వృద్ధి అయినప్పుడు వారి మందిరాలను వారు నిర్మించుకుంటారు. మిలట్రీవారు తమ మందిరాలను ట్టుకుంటారు. భారతదేశ వాసులు వారి కృష్ణ మందిరము లేక లక్ష్మీనారాయణుల మందిరాలను తయారు చేసుకుంటారు. హనుమంతుడు, గణేశుల మందిరాలను తయారుచేస్తారు. సృష్టి అంతా ఎలా తిరుగుతుందో, ఎలా స్థాపించబడిందో, ఎలా వినాశమవుతుందో, ఎలా పాలన జరుగుతుందో ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. దీనిని అంధకార రాత్రి అని అంటారు. బ్రహ్మపగలు - బ్రహ్మ రాత్రిని గురించిన గాయనముంది ఎందుకంటే బ్రహ్మయే చక్రములోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైనవారు బ్రహ్మ కదా. బ్రహ్మను ఉంచుకోవచ్చు లేక విష్ణువును ఉంచుకోవచ్చు. బ్రహ్మను రాత్రికి, విష్ణువును పగలుకు ఉంచుతారు. మళ్లీ వారే రాత్రి నుండి పగలుకు వస్తారు. పగలు నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇదెంతో సులభంగా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోరు. పూర్తిగా చదువుకోరు కనుక నంబరువారు పురుషార్థానుసారము పదవిని పొందుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో, అంత సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్న భారతదేశమే తమోప్రధానంగా అవుతుంది. పిల్లలలో జ్ఞానము చాలా ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి ఇచ్చే ఈ జ్ఞానము నూతన ప్రపంచము కొరకే. మానవులంతా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంగ్లీషువారు కూడా ఓ గాడ్‌ఫాదర్, లిబరేటర్, గైడ్ అని స్మృతి చేస్తారు. దీని అర్థము మీకు బాగా తెలుసు. తండ్రి వచ్చి దు:ఖ ప్రపంచము నుండి బంగారు యుగములోకి తీసుకెళ్తారు. బంగారు యుగము గతములో తప్పకుండా ఉండేది. అందుకే దానిని అందరూ స్మృతి చేస్తారు. పిల్లలైన మీకు ఆంతరికములో చాలా ఖుషీ ఉండాలి. దైవీ కర్మలు ఆచరించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి లభిస్తున్న తరగని అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను స్మృతిలో ఉంచుకొని బుద్ధిని అనంతములోకి తీసుకెళ్లాలి. ఈ అనంతమైన నాటకములో ఆత్మలు తమ తమ సింహాసనాల పై విరాజమానమై ఉన్నాయి. ఈ ప్రాకృతికాన్ని(స్వాభావిక నాటకమును) సాక్షిగా చూస్తూ ఉండాలి.
2. సదా బుద్ధిలో మేము సంగమ యుగంలోని బ్రాహ్మణులము, మాకు శ్రేష్ఠమైన తండ్రి ఒడి లభించింది, రావణుని ఒడిలోకి వెళ్లము అని గుర్తుండాలి. మునిగేవారిని రక్షించడం కూడా మీ కర్తవ్యము.
వరదానము :- '' సేవా భావంతో సేవ చేస్తూ, ముందుకు వెళ్తూ ఇతరులను తీసుకెళ్లే నిర్విఘ్న సేవాధారీ భవ ''
సేవా భావము సఫలతనిప్పిస్తుంది. ఒకవేళ సేవలో అహంభావము వచ్చిందంటే, దానిని సేవా భావమని అనరు. ఏ సేవలో అయినా అహం భావం మిక్స్ అయ్యి ఉంటే ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం పడ్తుంది. అంతేకాక స్వయం సంతుష్టంగా కూడా ఉండరు. సేవా భావమనగా పిల్లలు స్వయం వారు కూడా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తారు. వారు సదా ఎగిరేకళను అనుభవం చేస్తారు. వారి ఉమంగ-ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి, అంతేకాక ఇతరుల కళ్యాణము కూడా చేస్తాయి.
స్లోగన్ :- '' ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో, వారే జ్ఞానయుక్త ఆత్మలు ''
No comments:
Post a Comment