Tuesday, November 26, 2019

Telugu Murli 27/11/2019

27-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి దృష్టి హద్దు, బేహద్‌లను కూడా దాటి వెళ్తుంది. మీరు కూడా హద్దు(సత్యయుగము), బేహద్‌(కలియుగము) లను దాటి వెళ్లాలి ''

ప్రశ్న :- శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన జ్ఞానరత్నాల ధారణ ఎటువంటి పిల్లలకు బాగా జరుగుతుంది ?
జవాబు :- బుద్ధియోగము ఒక్క తండ్రి జతలో మాత్రమే ఉన్నవారికి, పవిత్రమైన వారికి జ్ఞానరత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞానరత్నాల ధారణ కొరకు పాత్ర శుద్ధంగా ఉండాలి. ఉల్టా - సుల్టా (వ్యతిరేక, విరుద్ధమైన) సంకల్పాలు కూడా సమాప్తమవ్వాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ జోడిస్తూ పాత్ర బంగారమైనప్పుడు రత్నాలు నిలువగలవు (జ్ఞానరత్నాల ధారణ జరుగుతుంది).

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టిచక్రము జ్ఞానము, భక్తి, వైరాగ్యాలతో తయారైనదని పిల్లలకు అర్థం చేయించబడింది. బుద్ధిలో ఈ జ్ఞానము గుర్తుండాలి. పిల్లలైన మీరు ఈ హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లాలి. తండ్రి అయితే హద్దు, బేహద్‌లకు అతీతంగా ఉన్నారు. ఇది కూడా అర్థము చేసుకోవాలి కదా. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యమనే విషయాన్ని కూడా అర్థం చేయించాలి. జ్ఞానాన్ని పగలు అని అంటారు, అప్పుడు నూతన ప్రపంచముంటుంది. అక్కడ ఈ భక్తి అను అజ్ఞానము ఉండదు. అది హద్దు ప్రపంచము ఎందుకంటే అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత నెమ్మదినెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధ సమయము తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. అక్కడ సన్యాస ధర్మము ఉండదు, సన్యాసము లేక త్యాగము ఉండదు. తర్వాత సృష్టి వృద్ధి చెందుతుంది. పై నుండి ఆత్మలు వస్తూ ఉంటాయి, ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి బేహద్‌కు వెళ్తుంది. తండ్రి దృష్టి హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్తుంది. హద్దులో చాలా కొద్దిమందే ఉంటారని తెలుసు. తర్వాత రావణ రాజ్యములో చాలా వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు హద్దు - బేహద్‌ల నుండి అతీతంగా అవ్వాలి. సత్యయుగములోని ప్రపంచము చాలా చిన్నది. అక్కడ సన్యాసము లేక వైరాగ్యము మొదలైనవేవీ ఉండవు. తర్వాత ద్వాపరము నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మము కూడా ఉంటుంది. అందులో ఇల్లువాకిళ్ళు వదిలేస్తారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. వారిది హఠయోగము, హద్దు సన్యాసము అంటారు. కేవలం ఇల్లు - వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్లిపోతారు. ద్వాపరము నుండి భక్తి మొదలవుతుంది, జ్ఞానము ఉండనే ఉండదు. జ్ఞానమంటే సత్య-త్రేతాయుగాలు. అందులో సుఖముంటుంది. భక్తి అనగా అజ్ఞానము, దు:ఖము. ఇది బాగా అర్థము చేసుకొని చేయించాలి. తర్వాత సుఖ - దు:ఖాల నుండి అతీతంగా వెళ్లాలి. హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లాలి. సముద్రమెంతవరకు ఉందో, ఆకాశమెంతవరకు ఉందోనని మనుష్యులు పరిశోధిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా అంతములను తెలుసుకోలేరు. పరిశోధించేందుకు విమానాలలో వెళ్తారు కాని వాపస్‌ వచ్చేందుకు కూడా తగినంత పెట్రోలు ఉండాలి కదా. ఎంతో దూరాలకు వెళ్తారు. కాని అనంతములోకి (సూక్ష్మలోకము, మూలలోకాలలోకి) వెళ్లలేరు. హద్దు వరకు వెళ్తారు. మీరు హద్దు - బేహద్‌లను దాటి వెళ్లిపోతారు. నూతన ప్రపంచములో మొదట హద్దు(పరిమితము)ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అక్కడ మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. దానిని సత్యయుగమని అంటారు. రచనను గురించిన ఆదిమధ్యాంతాల జ్ఞానముండాలి కదా. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రి. ఆ తండ్రి హద్దు బేహద్‌లకు అతీతంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. రచనను గురించిన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి వాటి నుండి అతీతంగా ఉండమని చెప్తున్నారు. అక్కడ ఏమీ ఉండదు. ఎంత దూరము పోయినా ఆకాశమే ఆకాశముంటుంది. దానినే హద్దు - బేహద్‌ల నుండి దూరమని అంటారు. అంతమెవ్వరూ తెలుసుకోలేరు. అంతము లేనిదని, అనంతమని అంటారు. అనంతమని చెప్పడము సులభమే కాని అంతమనగా అర్థము తెలుసుకోవాలి. నాకు హద్దు మరియు బేహద్‌ గురించి కూడా తెలుసు అని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఫలానా ఫలానా ధర్మము, ఫలానా ఫలానా సమయములో స్థాపన అవుతుందని నాకు తెలుసు. హద్దులోని సత్యయుగము వైపుకు దృష్టి పోతుంది, తర్వాత బేహద్‌ కలియుగము వైపుకు వెళ్తుంది. ఆ తర్వాత మనము రెండింటిని దాటి వెళ్లిపోతాము. అక్కడ ఏమీ లేదు. సూర్యచంద్రులను దాటి ఇంకా పైకి వెళ్తాము. అక్కడ మన ఇల్లు శాంతిధామము, మధురమైన ఇల్లు( స్వీట్‌ హోమ్‌) ఉంది. సత్యయుగము కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతితో పాటు రాజ్యభాగ్య సుఖము కూడా ఉంటుంది - రెండూ ఉంటాయి. ఇంటికి వెళ్తే అక్కడ కేవలం శాంతి ఉంటుంది. సుఖమనే పేరే ఎత్తరు. ఇప్పుడు మీరు శాంతి స్థాపన చేస్తున్నారు, అంతేకాక సుఖశాంతులను కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ శాంతితో పాటు సుఖమైన రాజ్యము కూడా ఉంటుంది. మూలవతనములో సుఖమనే మాటే ఉండదు.
అర్ధకల్పము మీ రాజ్యము నడుస్తుంది. అర్ధకల్పము రావణ రాజ్యము నడుస్తుంది. 5 వికారాల వల్లనే అశాంతి కలుగుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యపాలన చేస్తారు, మళ్లీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యము ఉంటుంది. వారేమో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. పూర్తి బుద్ధిహీనులుగా తయారుచేశారు. 5 వేల సంవత్సరాల కల్పమును లక్షల సంవత్సరాలని చెప్పడం బుద్ధిహీనత అనే అంటారు కదా. సభ్యత ఏ మాత్రము లేదు. దేవతలలో ఎంతో దైవీ సభ్యత ఉండేది. ఇప్పుడు అసభ్యంగా అయ్యారు. ఏమీ తెలియదు. ఆసురీ గుణాలు వచ్చేశాయి. ఇదంతా మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. కామఖడ్గము ఆదిమధ్యాంతాలు దు:ఖీలుగా తయారు చేస్తుంది. అందుకే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారని అంటారు. రాముడు వానరసైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపిస్తారు. రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవాడు. అక్కడ కోతులెక్కడివి? అంతేకాక రాముని భార్య సీత అపహరింపబడిందని అంటారు. ఇటువంటి ఘటనలు అక్కడ జరగనే జరగవు. ఇక్కడున్నట్లు 84 లక్షల జీవరాసులు సత్యత్రేతాయుగాలలో ఉండవు. ఈ బేహద్‌ డ్రామా గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు చాలా దూరదృష్టి గలవారిగా ఉండాలి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. మానవులై ఉండి నాటకము గురించి తెలియకుండా ఉండేవారు. అందరిలో గొప్పవారెవరో మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు. శ్లోకాలు కూడా చదువుతారు. మీ పేరు ఉన్నతమే,........ (ఊంచా తేరా నామ్‌, ఊంచా తేరా ధామ్‌.........) ఇప్పుడు మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. తండ్రి హద్దు - బేహద్‌ల రెండింటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వాటి కంటే పైన ఏమీ లేదు. అది మీరుండే స్థానము. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మీరిక్కడ ఆకాశతత్వములో ఉన్నారు. ఇందులో ఏదైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారు. ఈ ఆకాశానికి అంతము లేదు. అంతము చూడలేరు. ఆకాశవాణి అంటే మానవులు ఏమనుకుంటారు? వీరి నోరు పోలార్‌. నోటి నుండి శబ్ధము వెలువడ్తుంది. ఇది సాధారణ విషయము. నోటి నుండి శబ్ధాలు వెలువడుటను ఆకాశవాణి అని అంటారు. తండ్రి కూడా ఆకాశము ద్వారా శబ్ధము చేయవలసి వచ్చింది. పిల్లలైన మీకు తన రహస్యమంతా అర్థం చేయించారు. అందరికీ ఎవరి పాత్ర వారికి లభించింది. అందరికంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన వారు భగవంతుడు. తర్వాత ప్రవృత్తి మార్గములోని జంట పూస(మేరు). ఆ తర్వాత నంబరువారుగా ఉంటారు. మాల చాలా చిన్నది. ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ ఎంతో పెద్దదిగా అవుతుంది. ఎన్ని కోట్ల ఆత్మల మాల. ఇదంతా చదువే. తండ్రి అర్థం చేయించిన దానినంతా బుద్ధిలో బాగా ధారణ చేయాలి. వృక్షాన్ని గురించిన వివరాలు మీరు వింటూనే ఉంటారు. బీజము ఉపరి భాగములో ఉంది. అది వెరైటీ వృక్షము. దాని ఆయుష్షు ఎన్ని సంవత్సరాలు? వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. ఈ సృష్టి అనే కల్పవృక్షము ఆయువు చాలా ఖచ్ఛితంగా ఉంటుంది. 5 వేల సంవత్సరాలకు ఒక్క సెకెండు కూడా వ్యత్యాసము ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు చాలా జ్ఞానముంది. మీరు శక్తిశాలిగా ఉన్నారు. పవిత్రంగా ఉంటే శక్తిశాలిగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర (బుద్ధి) అవసరము. ఆ తర్వాత బాబాకు ఎంత సహజమో, మీకు కూడా అంత సహజంగా అయిపోతుంది. అప్పుడు మిమ్ములను కూడా మాస్టర్‌ జ్ఞానసాగరులని అంటారు. మీరు మాలలోని పూసలుగా అవుతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ(బ్రహ్మ) ఆత్మ కూడా తెలుపుతూ ఉంది, తండ్రి కూడా ఈ శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు, దేవతల శరీరము ద్వారా కాదు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి గురువుగా అవుతారు. అయినా తండ్రి పాత్రను అభినయించాలి. 5 వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చి పాత్ర చేస్తారు.
తండ్రి చేయిస్తున్నారు - నేను సర్వోన్నతమైన వాడిని. నా తర్వాత జంటపూస. ఆదిలో మహారాజ - మాహారాణిగా ఉన్నవారే మళ్లీ ఆదిదేవుడు, ఆదిదేవిగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మీరెక్కడ వినిపించినా ఆశ్చర్యపడ్తారు. వీరు సరిగ్గా చెప్తున్నారు. మానవ సృష్టికి బీజరూపులు ఒక్క జ్ఞానసాగరులు మాత్రమే. వారు తప్ప మరెవ్వరూ జ్ఞానము అర్థం చేయించలేరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. కాని పిల్లలకు ధారణ అవ్వదు. చాలా సులభమైనదే. ఏ కష్టమూ లేదు. మొదటిది స్మృతియాత్ర చేయాలి. పాత్ర పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి, అప్పుడు మాత్రమే జ్ఞానరత్నాలు నిలుస్తాయి. ఇవి అత్యంత శ్రేష్ఠమైన రత్నాలు. బాబా రత్నాల వ్యా.పారము చేసేవారు. చాలా మంచి మంచి వజ్రాలు, మణులు వస్తే వాటిని వెండి డబ్బీలలో, దూది మొదలైన వాటిలో భద్రంగా ఉంచేవారు. ఎవరైనా చూస్తే ఇది చాలా ఫస్ట్‌క్లాస్‌ వస్తువు అని అనేవారు. ఇది కూడా అంత మంచిది. మంచి - మంచి వస్తువులు మంచి పాత్రలలో శోభిస్తాయి. మీ చెవులు వింటున్నాయి. అందులో ఈ జ్ఞానము ధారణ అవుతుంది. పవిత్రంగా ఉంటే బుద్ధియోగము తండ్రి జతలో ఉంటుంది. ధారణ బాగా జరుగుతుంది లేకుంటే ఉన్నదంతా వెలుపలికి పోతుంది. ఆత్మ ఎంతో చిన్నది. అందులో ఎంతో జ్ఞానము నిండి ఉంది. చాలా మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఏ ఇతర సంకల్పమూ రాకూడదు. ఉల్టా - సుల్టా(అపవిత్ర) సంకల్పాలన్నీ పూర్తిగా నిలిచిపోవాలి. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించాలి. నాతో యోగము చేస్తూ - చేస్తూ పాత్రను బంగారుగా(పవిత్రంగా) చేసుకోండి. అందులో రత్నాలు నిలవాలి. తర్వాత ఇతరులకు దానము చేస్తూ ఉంటారు. భారతదేశాన్ని మహాదాని దేశమని అంటారు. వారు ధనదానము చేస్తారు. కాని ఇది అవినాశి జ్ఞానరత్నాల దానము. దేహ సహితము ఉన్నదంతా వదిలి ఒక్కరితోనే బుద్ధియోగముంచాలి. మనము తండ్రి వారిగా అయ్యాము. ఇందులోనే శ్రమ ఉంది. లక్ష్యమేమో తండ్రి అర్థం చేయించారు, పురుషార్థము చేసేది పిల్లల కర్తవ్యము. ఉన్నత పదవి పొందుకునేది ఇప్పుడు మాత్రమే. ఏ వికారి సంకల్పాలు, వికల్పాలు రాకూడదు. జ్ఞానసాగరులు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. వారు హద్దు - బేహద్‌లకు దూరంగా ఉండేవారు. అన్ని విషయాలు కూర్చునే అర్థం చేయిస్తారు. నేను మిమ్ములను చూస్తున్నానని మీరు అనుకుంటారు. కానీ నేను హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్లిపోతాను. నేను అక్కడే నివసించేవాడిని. మీరు కూడా హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్లిపోండి. సంకల్ప, వికల్పాలేవీ రాకూడదు. దాని కొరకు శ్రమించాలి. గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పని చేస్తూ ఉండాలి, మనస్సు భగవంతుని స్మృతి చేస్తూ ఉండాలి(హత్‌ కార్‌ డే, దిల్‌ యార్‌ డే). గృహస్థులు చాలా మంది ఉన్నారు. గృహస్థులు ఎంత తీసుకుంటారో, ఇంట్లో ఉండే పిల్లలు అంత తీసుకోలేరు. సేవాకేంద్రాలు నడిపేవారు, మురళి వినిపించేవారు కూడా పాస్‌ అవ్వలేరు. కాని చదువుకునే వారు ఉన్నతంగా అవుతారు. పోను పోను మీకంతా తెలిసిపోతుంది. బాబా చాలా సరిగ్గా చెప్తున్నారు. మనలను చదివించేవారిని మాయ తినేసింది. మహారథులను మాయ ఒక్కసారిగా మింగేసింది. వారిప్పుడు లేనే లేరు. మాయావి విద్రోహులుగా(ట్రైటర్‌లుతీaఱ్‌శీతీ)గా అవుతారు. విదేశాలలో కూడా ద్రోహులుగా అవుతారు కదా. ఎక్కడెక్కడికో వెళ్లి శరణు తీసుకుంటారు. ఎవరు శక్తిశాలురుగా ఉంటారో ఆ వైపుకు వెళ్లిపోతారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది కదా. అందువలన చాలా శక్తి గలవారే ఉత్తీర్ణులవుతారు. ఇప్పుడు తండ్రియే శక్తివంతులని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి సర్వశక్తివంతులు, మనకు నేర్పిస్తూ - నేర్పిస్తూ విశ్వమంతటికి అధికారులుగా చేస్తారు. అక్కడ సర్వస్వము లభిస్తాయి. లభించని వస్తువేదీ ఉండదు. ఏ వస్తువు కొరకు కూడా పురుషార్థము చేసే పనే ఉండదు. మీ వద్ద లేని వస్తువేదీ ఉండదు. అయినా నంబరువారు పురుషార్థమనుసారము పదవి లభిస్తుంది. తండ్రికి తప్ప ఇటువంటి విషయాలు వేరెవ్వరికీ తెలియదు. అందరూ పూజారులే, గొప్ప గొప్పవారు శంకరాచార్యులు మొదలైనవారున్నారు. బాబావారి గొప్పతనము గురించి కూడా తెలుపుతారు. మొదట పవిత్రతా శక్తి ద్వారా సహాయము చేసి భారతదేశాన్ని సంభాళించేందుకు వారు నిమిత్తంగా అవుతారు, అది కూడా వారు సతోప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు వారు కూడా తమోప్రధానంగా ఉన్నారు. వారిలో ఇప్పుడు అంత శక్తి లేదు. ఇప్పుడు పూజారులుగా ఉండిన మీరు మళ్లీ పూజ్యులుగా అవుతారు. అర్థము చెప్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. బుద్ధిలో ధారణ చేస్తూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆ తండ్రి వృక్ష రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఇంత మధురంగా తయారవ్వాలి. యుద్ధము కదా. మాయావీ తుఫానులు కూడా చాలా వస్తాయి. అన్నీ సహించవలసి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉంటే అన్ని తుఫానులు తొలగిపోతాయి. హాతమ్‌తాయి నాటకము గురించి తెలుపుతారు కదా. నోటిలో తావీజు(గులకరాయి) వేసుకుంటే మాయ పారిపోతుంది. అది తీసేస్తే మాయ తిరిగి వచ్చేస్తుంది. లజ్జావతి(అత్తిపత్తి, తాకగానే ముడుచుకునే ఒక మొక్క) ఆకు ఉంటుంది కదా. మాయ చాలా తీక్షణమైనది. ఇంతటి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లుండి క్రిందకు తోసేస్తుంది. అందుకే తండ్రి తెలుపుతున్నారు - మీరంతా భాయి - భాయి(సహోదరులు) అని భావిస్తే హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లిపోతారు. శరీరమే ఉండదు. అప్పుడు దృష్టి ఎక్కడకెళ్తుంది? అంత శ్రమించాలి. వింటూ వింటూ అలసిపోయి క్రిందపడరాదు. కల్ప-కల్పము మీరు పురుషార్థము చేస్తారు. మీ భాగ్యాన్ని పొందుకుంటారు. తండ్రి అంటున్నారు - ఇంతవరకు చదివిందంతా మర్చిపోండి. ఇంతవరకు చదవనిది, విననిది ఇప్పుడు వినండి, స్మృతి చేయండి. దానిని భక్తిమార్గమని అంటారు. మీరు రాజఋషులు కదా. మీరు జడలు విరబోసుకుని మురళి వినిపించండి. సాధు-సన్యాసులు వినిపించేదంతా మానవుల మురళి, ఇది బేహద్‌ తండ్రి వినిపించే మురళి. సత్య-త్రేతా యుగాలలో జ్ఞాన మురళి అవసరము లేదు. అక్కడ జ్ఞానము గానీ, భక్తి గానీ అవసరము లేదు. ఈ సంగమ యుగములోనే మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఇచ్చేవారు ఆ తండ్రి మాత్రమే. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బుద్ధిలో జ్ఞాన రత్నాలను ధారణ చేసుకొని దానము చేయాలి. హద్దు, బేహద్‌లకు దూరంగా వికల్పాలు, అపవిత్ర సంకల్పాలు రాకుండా ఉండు స్థితిలో ఉండాలి. మనమంతా ఆత్మలము, భాయి - భాయి అను స్మృతిలో ఉండాలి.
2. మాయావి తుఫానుల నుండి రక్షణ పొందేందుకు తండ్రి స్మృతి అనే గులకరాయి వేసుకోవాలి. అన్నీ సహించాలి. లజ్జావతి(తాకగానే ముడుచుకునే అత్తపత్తి)గా అవ్వరాదు. మాయతో ఓడిపోరాదు.

వరదానము :- '' సర్వ శక్తులను సహయోగిగా చేసుకొని ప్రత్యక్షతా పర్దాను తెరిచే సత్యమైన సేవాధారి భవ ''
ఎప్పుడైతే అన్ని సత్తాలు (శక్తులు) కలిసి శ్రేష్ఠమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, అధ్యాత్మిక శక్తి లేక పరమాత్మ శక్తి ఒక్కటే, అందరూ ఒకే స్టేజి పై కలిసి ఇటువంటి స్నేహమిలనము చేయాలి. అందుకు అందరిని స్నేహ సూత్రములో బంధించి సమీపానికి తీసుకురండి, సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతంగా అయి అందరిని ఒకేసారి సంఘటన రూపంలో తండ్రి స్టేజి పైకి చేరుస్తుంది. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షము చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడే మిమ్ములను సత్యమైన సేవాధారులని అంటారు.

స్లోగన్‌ :- '' సేవ ద్వారా అందరి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే ముందుకు వెళ్లే లిఫ్ట్‌ ''

No comments:

Post a Comment