Saturday, November 16, 2019

Telugu Murli 17/11/2019

17-11-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 09-03-1985 మధువనము

'' తండ్రి మరియు సేవ పై స్నేహము - ఇదే బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము ''
ఈ రోజు బాప్‌దాదా పిల్లలందరికి పురుషార్థంలో ఎంత లగ్నముందో చూస్తున్నారు. ప్రతి పుత్రుడు తమ-తమ ధైర్యము - ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. అందరిలో ధైర్యమూ ఉంది, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి. మేము బాప్‌దాదాల సమీప రత్నాలుగా, ప్రకాశ రత్నాలుగా (కంటి వెలుగుగా), హృదయ సింహాసనాధికారులుగా, హృదయాభి రామునికి ప్రియమైన వారిగా అయ్యి తీరాలన్న ఒకే శ్రేష్ఠ సంకల్పము కూడా ఉంది. సంపన్నంగా అవ్వాలన్న లక్ష్యము కూడా అందరిలో ఉంది. స్నేహానికి ప్రతిఫలంగా మేము సమానంగా, సంపన్నంగా అవ్వాలన్న ఒకే శబ్ధము పిల్లలందరి హృదయంలో ఉంది. ఈ లక్ష్యమనుసారంగా ముందుకు వెళ్లడంలో సఫలురుగా కూడా అవుతున్నారు. మీరేమి కోరుకుంటున్నారని ఎవరిని అడిగినా సంపూర్ణంగా, సంపన్నంగా అవ్వాల్సిందేనని అందరి నుండి ఉల్లాసంతో కూడిన ఒకే సమాధానం వెలువడ్తుంది. బాప్‌దాదా అందరి ఉల్లాస-ఉత్సాహాలను చూసి, శ్రేష్ఠ లక్ష్యాలను చూసి హర్షిస్తున్నారు. ఒకే తండ్రి, ఒకే మతము, ఒకే లక్ష్యము మరియు ఒకే ఇంటిలోకి, ఒకే రాజ్యములోకి వెళ్తున్నారని, ఎగురుతున్నారని, ఉల్లాస-ఉత్సాహాలు మరియు ఐకమత్యము యొక్క అభినందనలు పిల్లలందరికి తెలియజేస్తున్నారు. ఒకే తండ్రికి ఇంతమంది యోగ్యులైన మరియు యోగీ పిల్లలు. ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు విశేషతలతో విశేషంగా ముందుకు వెళ్తున్నారు. మొత్తం కల్పంలో ఇటువంటి తండ్రి ఉండరు, ఇటువంటి పిల్లలూ ఉండరు. ఏ ఒక్కరూ ఉల్లాస - ఉత్సాహాలలో తక్కువగా లేరు, విశేషతలతో సంపన్నంగా ఉన్నారు. ఒకే లగ్నములో మగ్నమై ఉన్నారు. ఇలా ఇంకెప్పుడూ జరగజాలదు. కావున బాప్‌దాదాకు కూడా ఇటువంటి పిల్లలంటే గర్వంగా ఉంది, పిల్లలకు కూడా తండ్రి అంటే గర్వంగా ఉంది. ఎక్కడ చూసినా తండ్రి మరియు సేవ అన్న ఒకే విశేష శబ్ధము అందరి హృదయాల నుండి వెలువడుతోంది. తండ్రితో ఎంత స్నేహముందో అంత సేవ పై కూడా స్నేహముంది. ఈ రెండు స్నేహాలు ప్రతి బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము. ఇందులోనే సదా బిజీగా ఉండే ఆధారము మాయాజీతులుగా చేస్తోంది.
బాప్‌దాదా వద్దకు పిల్లలందరూ ఉల్లాస-ఉత్సాహాలతో సేవ కొరకు చేసిన ప్లాన్లు చేరుకుంటూ ఉంటాయి. అన్ని ప్లాన్లు ఎంతో బాగున్నాయి. డ్రామానుసారంగా ఏ విధి ద్వారా అయితే వృద్ధిని పొందుతూ వచ్చారో అది ఆది నుండి ఇంతవరకు ఎంతో బాగుందనే అంటాము. సేవలో లేక బ్రాహ్మణులు విజయీ రత్నాలుగా అవ్వడంలో లేదా సఫలతను పొందడంలో ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు స్వర్ణిమ జయంతి(గోల్డెన్‌ జూబ్లి) వరకు చేరుకున్నారు. స్వర్ణిమ జయంతిని ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రపంచం లెక్కతో జరుపుకుంటున్నారా లేక సమయానుసారంగా విశ్వానికి తీవ్ర వేగంతో సందేశాన్ని అందించాలనే ఉల్లాసంతో జరుపుకుంటున్నారా? నలువైపులా నిదురించి ఉన్న ఆత్మలను పెద్ద శబ్ధము ద్వారా మేల్కొల్పే సాధనాన్ని తయారు చేస్తున్నారా? ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా నలువైపులా ఇప్పుడు స్వర్ణిమ యుగము(గోల్డెన్‌ ఏజ్‌), బంగారు సమయము, బంగారు యుగము రానున్నదనే సర్ణిమ సందేశము ద్వారా సంతోషకరమైన వార్త లభిస్తోందన్న శబ్ధము మారుమ్రోగుతూ వినిపించాలి. ఈ గోల్డెన్‌ జూబ్లి ద్వారా గోల్డెన్‌ ఏజ్‌ రానున్నదన్న విశేష సూచనను లేక సందేశాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు బంగారు యుగము రానే వచ్చిందన్న అల నలువైపులా వ్యాపించాలి. ఎలాగైతే ఉదయం అంధకారము తర్వాత సూర్యోదయము జరుగుతుందో, సూర్యోదయమైన వెంటనే ఆ శుభ సందేశము నలువైపులా వ్యాపిస్తుందో, అందరూ అంధకారాన్ని మరిచి ప్రకాశంలోకి వచ్చేస్తారో అటువంటి దృశ్యము నలువైపులా కనిపించాలి. అలాగే విశ్వాత్మలందరూ దు:ఖము, అశాంతులను కలిగించే సమాచారాలను విని విని వినాశనం జరుగుతుందనే భయములో భయభీతులై నిరుత్సాహులుగా అయిపోయారో, నిరాశావాదులుగా అయిపోయారో అటువంటి విశ్వాత్మలకు ఈ గోల్డెన్‌ జుబిలీ ద్వారా శుభ ఆశల సూర్యోదయమయ్యే అనుభూతిని చేయించండి. ఎలాగైతే వినాశపు అల ఉందో, అలా సత్యయుగ సృష్టి స్థాపన జరుగుతోందనే సంతోషకరమైన వార్తను నలువైపులా వ్యాపింపజేయండి. అందరి హృదయంలో ఈ ఆశా నక్షత్రాన్ని మెరిపింపజేయండి. ఏమవుతుంది? ఏమవుతుంది? అని భావించేందుకు బదులు ఇప్పుడిది జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇటువంటి అలను వ్యాపింపజేయండి. ఈ స్వర్ణిమ జయంతి, స్వర్ణిమ యుగము వచ్చే సంతోషకరమైన వార్తను అందించే సాధనము. ఎలాగైతే పిల్లలైన మీకు దు:ఖధామాన్ని చూస్తున్నా సుఖధామము సదా స్వతహాగా స్మృతిలో ఉంటుందో, సుఖధామము యొక్క స్మృతి దు:ఖధామాన్ని మరిపింపజేస్తుందో అంతేకాక సుఖధామము లేక శాంతిధామములోకి వెళ్లే ఏర్పాట్లలో మైమరచిపోయి ఉంటారో, ఇప్పుడిక వెళ్ళాలి మళ్లీ సుఖధామములోకి రావాలి, ఇలా వెళ్లాలి ఇలా రావాలి అనే స్మృతి సమర్థంగా కూడా తయారు చేస్తుంది, చాలా సంతోషంగా సేవకు నిమిత్తంగా కూడా తయారు చేస్తోంది. ఇప్పుడు జనులు దు:ఖము కలిగించే వార్తలు చాలా విన్నారు. ఇప్పుడు ఈ సంతోషకరమైన వార్త ద్వారా దు:ఖధామము నుండి సుఖధామానికి వెళ్లేందుకు చాలా సంతోషంగా ఏర్పాట్లు చేసుకోండి. ఇలా వారిలో మేము కూడా వెళ్లాలన్న ఈ అల వ్యాపించాలి. నిరాశలో ఉన్నవారికి ఆశను కలిగించండి. నిరుత్సాహంలో ఉన్న ఆత్మలకు సంతోషకర వార్తను వినిపించండి. ఎలాంటి విశేష ప్లాను తయారుచేయాలంటే అది విశేషంగా వార్తాపత్రికలలో లేక శబ్ధాన్ని వ్యాపింపజేసే సాధనాలేవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకే సమయంలో ఒకే సంతోషకరమైన వార్త లేక సందేశము నలువైపులా అందరికి చేరుకోవాలి. ఎవరు ఎక్కడ నుండి వచ్చినా ఈ ఒకే విషయము అందరికీ తెలియాలి. అలాంటి విధానము ద్వారా నలువైపులా ఒకే శబ్ధము వినిపించాలి. నవీనత కూడా ఉండాలి. మీ జ్ఞాన స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఇప్పుడు వీరు శాంతి స్వరూప ఆత్మలని శాంతికి సహజ మార్గమును తెలిపించేవారని భావిస్తున్నారు. ఈ స్వరూపము ప్రత్యక్షమయింది ఇంకా అవుతోంది కూడా. కానీ జ్ఞాన సాగరుడైన తండ్రి ఇచ్చే జ్ఞానము ఇదే అనే శబ్ధము ఇప్పుడు వ్యాపించాలి. ఇప్పుడు శాంతినిచ్చే స్థానము ఇది ఒక్కటేనని అంటున్నారో అదే విధంగా సత్యమైన జ్ఞానము ఇది ఒక్కటే అని అందరి నోటి నుండి వెలువడాలి. ఎలాగైతే శాంతిని మరియు స్నేహ శక్తిని అనుభవం చేస్తున్నారో అలా సత్యత నిరూపించబడాలి, తద్వారా మిగిలినవన్నీ ఏమిటో, వాటంతట అవే తెలిసిపోతాయి. చెప్పాల్సిన అవసరముండదు. ఇప్పుడు ఆ సత్యతా శక్తిని ఎలా ప్రత్యక్షం చేయాలో ఏ విధిని ధారణ చేయడం ద్వారా మీరు చెప్పవలసిన అవసరముండదో, ఆ సత్యమైన జ్ఞానము, పరమాత్ముని జ్ఞానము, శక్తిశాలి జ్ఞానమంటే ఇదేనని వారే స్వయంగా చెప్పాలి. దీని కొరకు విధిని తర్వాత వినిపిస్తాము. దీని గురించి మీరు కూడా ఆలోచించండి. ఆ విధిని మరొకసారి వినిపిస్తాము. స్నేహము మరియు శాంతి యొక్క ధరణి అయితే తయారయ్యింది కదా! ఇప్పుడు జ్ఞాన బీజాలు పడాలి. అప్పుడే జ్ఞాన బీజాల ఫలంగా స్వర్గ వారసత్వానికి అధికారులుగా అవుతారు.
బాప్‌దాదా ఏమేం చర్చించుకుంటూ ఉంటారో అంతా బాగా గమనిస్తూ ఉంటారు. చాలా ప్రేమగా కూర్చుంటారు, ఆలోచిస్తారు, మథనము బాగా చేస్తున్నారు. వెన్న తినేందుకు మంథనమునైతే చేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణిమ జయంతిని గురించి మంథనము చేస్తున్నారు. శక్తిశాలి వెన్నయే వెలువడ్తుంది. అందరి హృదయాలలో అల బాగుంది. ఈ హృదయపూర్వకమైన ఉల్లాసాల అల వాయుమండలాన్ని తయారు చేస్తుంది. వాయుమండలం తయారవుతూ అవుతూ ఆత్మలలో సమీపంగా రావాలనే ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్లాలి, చూడాలి అన్న ఈ అల వ్యాపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇదేమిటో తెలియదని భావించేవారు. ఇప్పుడైతే ఇది బాగుంది, తెలుసుకోవాలని, చూడాలని భావిస్తున్నారు. ఇక చివర్లో ఇదే అది అని అంటారు. ఇప్పుడు మీ హృదయంలోని ఉల్లాస-ఉత్సాహాలు వారిలో కూడా ఉల్లాసాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు మీ హృదయం నాట్యం చేస్తోంది. దాని ద్వారా వారి నాట్యము మొదలవుతోంది. ఎలాగైతే ఇక్కడ ఎవరైనా చాలా మంచి నాట్యం చేస్తున్నప్పుడు దూరంగా కూర్చున్నవారి పాదాలు కూడా కదులుతూ ఉంటాయో, అలా ఉల్లాస-ఉత్సాహాల వాతావరణము అనేమంది పాదాలను నడిపించడం మొదలు పెడ్తుంది. మంచిది.
సదా స్వయాన్ని స్వర్ణిమ పప్రంచానికి అధికారిగా అనుభవం చేసేవారికి, సదా తమ స్వర్ణిమ యుగ స్థితిని తయారు చేసుకోవాలనే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారికి, సదా దయాహృదయులుగా అయ్యి సర్వ ఆత్మలకు స్వర్ణిమ యుగానికి మార్గాన్ని తెలియజేసే లగనములో ఉండేవారికి, సదా తండి చెప్పిన పత్రి బంగారు మహావాక్యాన్ని(గోల్డెన్‌ వర్షన్‌ను) జీవితంలో ధారణ చేసేవారికి, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులకు, సదా స్నేహములో ఇమిడిపోయి ఉన్న విజయీ రత్నాలకు బాప్‌దాదా పియ్ర స్మృతులు మరియు నమస్తే.
బ్రిజేంద్ర దాదితో అవ్యక్త బాప్‌దాదా కలయిక :- నడిపించేవారు నడిపిస్తున్నారు కదా! ప్రతి సెకను చేయించేవారు నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు. చేయించేవారి చేతిలో తాళంచెవి ఉంది. ఆ తాళంచెవితోనే నడుస్తున్నారు. ఆటోమేటిక్‌గా తాళంచెవి లభించింది. నడుస్తూ-తిరుగుతూ ఎంత అతీతమైన, ప్రియమైన అనుభవమవుతుంది! కర్మల లెక్కఖాతాను సమాప్తం చేసుకుంటున్నా కర్మల లెక్కను కూడా సాక్షిగా ఉండి చూస్తూ, స్నేహితునితో కలిసి ఆనందంలో ఉంటున్నారు. అలాగే ఉన్నారు కదా! మీరైతే స్నేహితునితో కలిసి ఆనందంగా ఉన్నారు. మిగిలిన ఈ లెక్కఖాతా ఎలా సమాప్తమవుతుందో అది సాక్షిగా అయ్యి చూస్తూ కూడా ఆనందంలో ఉన్న కారణంగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఎవరైతే ఆది నుండి స్థాపనకు నిమిత్తంగా అయ్యారో, ఎంతవరకు ఉంటారో, అంతవరకు కూర్చుని ఉన్నా, నడుస్తున్నా స్టేజ్‌ పైన ఉన్నా లేక ఇంట్లో ఉన్నా, మహావీరులైన పిల్లలు సదా తమ శ్రేష్ఠ స్థితిలో ఉన్న కారణంగా సేవా స్టేజ్‌ పైన ఉన్నారు. డబల్‌ స్టేజ్‌ పైన ఉన్నారు. ఒకటి స్వంత శ్రేష్ఠమైన స్థితిలో ఉన్నారు, రెండవది, సేవ చేసే స్టేజ్‌ పైన ఉన్నారు. కావున మొత్తం రోజంతా ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లోనా లేక స్టేజ్‌ పైనా? మంచం మీద ఉన్నారా లేక సోఫా పైన కూర్చున్నారా లేక స్టేజ్‌ పైన ఉంటున్నారా? డబల్‌ స్టేజ్‌ పై అనుభవమవుతోంది కదా! మీ లెక్కను కూడా మీరు సాక్షిగా అయ్యి చూడండి. ఈ శరీరంతో గతంలో ఏదైతే చేసి ఉన్నారో దానిని ఎలా సమాప్తం చేసుకుంటున్నారో సాక్షిగా అయ్యి చూడండి. దీనిని కర్మభోగమని అనరు. అనుభవించడంలో దు:ఖము కలుగుతుంది. కావున అనుభవించడమనే పదాన్ని వాడరు. ఎందుకంటే దు:ఖము, బాధల అనుభవమవ్వదు. మీకిది కర్మభోగం కాదు. ఈ కర్మయోగ శక్తి ద్వారా సేవ అనే సాధనం తయారయ్యింది. ఇది కర్మ అనుభవించడం కాదు, సేవ కొరకు ప్లాను. అనుభవించడం కూడా సేవా ప్లానులోకి మారిపోయింది. అంతే కదా! కావున సదా సాథీతో ఆనందంగా ఉండేవారు. జన్మతోనే తోడుగా ఉండాలనే ఆశ ఉంది. ఈ ఆశ భక్తి రూపంలో పూర్తి అయ్యింది, జ్ఞానంలో కూడా పూర్తయింది. సాకార రూపంలో కూడా పూర్తయింది, ఇప్పుడు అవ్యక్త రూపంలో పూర్తవుతోంది. కావున ఈ జన్మలోని కోరిక వరదాన రూపంగా అయిపోయింది. మంచిది. సాకార తండ్రికి తోడుగా ఉండే అనుభవము వీరికెంతగా ఉందో అంత ఇంకెవ్వరికీ లేదు. తోడుగా ఉండే విశేషమైన పాత్ర లభించింది. ఇదేమైనా చిన్న విషయమా! ప్రతి ఒక్కరి భాగ్యము ఎవరిది వారిదే. ఓ¬! నేను(వాహ్‌రే నేను) అని మీరు కూడా అనండి.
తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు(సన్‌ షోస్‌ ఫాదర్‌) ఆదిరత్నాలు సదా నిమిత్తంగా ఉన్నారు. ప్రతి కర్మ ద్వారా తండ్రి చరిత్రను ప్రత్యక్షం చేసే దివ్య దర్పణాలు. దర్పణము ఎంత అవసరముంటుంది! స్వయాన్ని దర్శించుకునేందుకు లేక ఇతరులను దర్శనము చేయించేందుకు ఎంతో అవసరము కావున మీరందరు తండ్రిని సాక్షాత్కారము చేయించే దర్పణాలు. విశేష ఆత్మలెవరైతే నిమిత్తంగా ఉన్నారో వారిని చూసి అందరికి ఏం గుర్తుకొస్తుంది? బాప్‌దాదా గుర్తుకు వస్తారు. తండ్రి ఏం చేసేవారు? ఎలా నడిచేవారు? ఇదే గుర్తుకు వస్తుంది కదా! కావున మీరు తండ్రిని ప్రత్యక్షం చేసే దర్పణాలు. బాప్‌దాదా అటువంటి విశేషమైన పిల్లలను సదా తమ కంటే ముందుకు తీసుకెళ్తారు. శిరోకిరీటంగా తయారు చేస్తారు. శిరోకిరీటంలో మెరుస్తున్న మణులు మీరు. మంచిది.
జగదీశ్‌ భాయితో :- తండ్రి నుండి వరదానములో ఏ విశేషతలు లభించాయో ఆ విశేషతలను కార్యంలోకి తీసుకొస్తూ సదా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. బాగుంది. సంజయుడు ఏం చేసాడు? అందరికి దృష్టినిచ్చాడు కదా! కావున ఈ జ్ఞాన దృష్టినిస్తున్నారు. ఇదే దివ్యదృష్టి. జ్ఞానమే దివ్యమైనది కదా! జ్ఞాన దృష్టి అన్నిటికంటే శక్తిశాలి దృష్టి. ఇది కూడా వరదానమే. లేకుంటే ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలోని జ్ఞానమేదైతే ఉందో దానిని గురించి ఎలా తెలుస్తుంది? వినడమైతే చాలా తక్కువ మంది వింటారు కదా! సాహిత్యము ద్వారా స్పష్టమవుతుంది. ఇది కూడా ఒక వరదానంగా లభించింది. ఇది కూడా ఒక విశేషాత్మ యొక్క విశేషత. ప్రతి సంస్థలోని అన్ని సాధనాల ద్వారా, దాని విశేషత ప్రసిద్ధమవుతుంది. ఎలాగంటే ఉపన్యాసాల ద్వారా, సమ్మేళనాల ద్వారా, అలాగే సాహిత్యము, చిత్రాల వంటి సాధనాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా సంస్థ లేక విశ్వ విద్యాలయం యొక్క విశేషతను ప్రసిద్ధం చేసే సాధనాలు. ఇవి కూడా బాణాలు. ఎలాగైతే బాణము పక్షిని(క్రిందకు) తీసుకొస్తుందో, అలా ఇది కూడా ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే ఒక బాణము. డ్రామాలో ఈ పాత్ర కూడా లభించి ఉంది. జనులకు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఏ ప్రశ్న తలెత్తుతుందో దానిని స్పష్టీకరణ చేసేందుకు సాధనం అవసరము. సన్ముఖంగా కూడా వినిపిస్తారు. కానీ ఈ సాహిత్యము కూడా మంచి సాధనము. ఇది కూడా అవసరమే. ప్రారంభం నుండి బ్రహ్మబాబా ఎంత ఆసక్తితో ఈ సాధనాలు తయారు చేశారో చూడండి. పగలు - రాత్రి స్వయం కూర్చుని వ్రాస్తూ ఉండేవారు కదా! కార్డులు తయారు చేసి, తయారు చేయించి, మీ అందరికి ఇస్తూ ఉండేవారు కదా! మీరు వాటిని రత్న జడితముగా చేస్తుండేవారు. కావున ఇది కూడా చేసి చూపించారు కదా! కావున ఈ సాధనాలు కూడా మంచివి. సమ్మేళనము(కాన్ఫరెన్స్‌) తర్వాత ఆశయాలను సమర్థించేందుకు అధికార పత్రాలు(చార్టర్లు) ఏవైతే వెలువడ్తాయో(ఫీడ్‌ బ్యాక్‌ పాఠాలు) అవి కూడా అవసరమే. సాధనమేదైనా తప్పకుండా కావాలి. మొదట ఇది, రెండవది ఇది, మూడవది ఇది. దీని ద్వారా చాలా నియమ ప్రమాణంగా ఈ విశ్వ విద్యాలయము లేక యూనివర్సిటి ఉందని వారు కూడా భావిస్తారు. కావున ఇది మంచి సాధనము. శ్రమ చేస్తారు కావున అందులో బలము నిండుతుంది. ఇప్పుడు స్వర్ణిమ జయంతి ప్లాను తయారు చేస్తారు. తర్వాత జరుపుకుంటారు. ఎంతగా ప్లాను చేస్తారో అంతగా బలము నిండుతూ ఉంటుంది. అందరి సహయోగంతో అందరి ఉల్లాస-ఉత్సాహాల సంకల్పంతో సఫలత అయితే లభించే ఉంది. కేవలం రిపీట్‌ చేయాలి. ఇప్పుడైతే స్వర్ణిమ జయంతి గురించి చాలా ఆలోచిస్తున్నారు కదా! మొదట పెద్దగా అనిపిస్తుంది, తర్వాత చాలా సహజమైపోతుంది. కావున సహజ సఫలత ఉండనే ఉంది. సఫలత ప్రతి ఒక్కరి మస్తకం పైన వ్రాయబడే ఉంది.
పార్టీలతో :- సదా డబల్‌ లైట్‌గా ఉన్నారా? ఏ విషయంలోనూ స్వయాన్ని ఎప్పుడూ భారంగా తయారు చేసుకోకండి. సదా డబల్‌ లైట్‌గా ఉండడం వలన సంగమ యుగములోని సుఖమైన రోజులు, ఆత్మిక ఆనందాల రోజులు సఫలమవుతాయి. ఒకవేళ కొద్దిగా భారమున్నా ఏమవుతుంది? తికమకపడ్తారా లేక ఆనందముంటుందా? భారీతనముంటే తిమకపడ్తారు. తేలికదనము ఉన్నట్లయితే ఆనందముంటుంది. సంగమ యుగములోని ఒక్కొక్క రోజు ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఎంత సంపాదించుకునే సమయము! అటువంటి సంపాదించుకునే సమయాన్ని సఫలం చేసుకుంటూ ఉండండి. రహస్యయుక్తమైన మరియు యోగయుక్తమైన ఆత్మలు సదా ఎగిరేకళను అనుభవం చేస్తారు. కావున బాగా స్మృతిలో ఉండండి. చదువులో, సేవలో ముందుకు వెళ్లండి. ఆగిపోయేవారు కాదు. చదువు మరియు చదివించేవారు సదా తోడుగా ఉండాలి. రహస్య యుక్తులు మరియు యోగ యుక్తులైన ఆత్మలు సదా ముందే ఉంటారు. తండ్రి సూచనలేవైతే లభిస్తాయో, అందులో సంఘటిత రూపంలో ముందుకు వెళ్తూ ఉండండి. నిమిత్తంగా అయిన విశేష ఆత్మలెవరైతే ఉన్నారో వారి విశేషతలను, ధారణలను గ్రహించి వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లండి. తండ్రికి ఎంతగా సమీపంగా ఉంటారో అంత పరివారానికి సమీపంగా ఉంటారు. ఒకవేళ పరివారానికి సమీపంగా లేకుంటే మాలలోకి రారు. మంచిది.

వరదానము :- '' ఈ అంతిమ జన్మలో లభించిన సర్వ శక్తులను ఉపయోగించే సంకల్ప శక్తి (విల్‌ పవర్‌) సంపన్న భవ ''
ఈ మధురమైన డ్రామా చాలా బాగా తయారై, తయారు చేయబడి ఉంది. దీనినెవ్వరూ మార్చలేరు. కానీ ఈ డ్రామాలో శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి. తండ్రి విల్లు చేశారు కావున విల్‌పవర్‌(సంకల్ప శక్తి) ఉంది. ఈ శక్తిని ఉపయోగించండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీర బంధనాలకు అతీతంగా, కర్మాతీత స్థితిలో స్థితులవ్వండి. అతీతంగా ఉన్నాను, యజమానిగా ఉన్నాను, తండ్రి ద్వారా నిమిత్తమైన ఆత్మను - ఈ స్మృతి ద్వారా మనసు, బుద్ధిని ఏకాగ్రం చేసుకోండి. అప్పుడే విల్‌ పవర్‌తో సంపన్నమైనవారని అంటారు.

స్లోగన్‌ :- '' హృదయ పూర్వకంగా సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారము తెరుచుకుంటుంది.''

No comments:

Post a Comment