19-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్నదానిని ఇతరులకు వినిపించాలి ''
ప్రశ్న :- పిల్లలైన మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి ?
జవాబు :- ఆత్మలైన మీరంతా సోదరులని(భాయీ-భాయీ) బాబా మీకు జ్ఞానమునిచ్చారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి ఎందుకంటే మీరు పూర్తి విశ్వములోని సోదరాత్మలందరి కళ్యాణము చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తులు.
ఓంశాంతి. తరచుగా ''ఓంశాంతి'' అని ఎందుకు అంటారు? ఇది పరిచయమునివ్వడం. ఆత్మ తన పరిచయమును తానే(ఆత్మనే) ఇస్తుంది. శరీరము ద్వారా ఆత్మయే మాట్లాడ్తుంది. ఆత్మ లేకుండా శరీరము ఏ పనీ చేయలేదు. కావున ఈ విధంగా ఆత్మ తన పరిచయమును ఇస్తుంది. మనము ఆత్మలము, పరమపిత పరమాత్ముని సంతానము. ఆత్మనైన నేనే పరమాత్మను అని వారంటారు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడ్తాయి. తండ్రి మనలను పిల్లలూ! - పిల్లలూ! అని అంటారు కదా. ఆత్మిక తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మిక పిల్లలారా! ఈ కర్మేంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్త్తున్నారు - మొట్టమొదట జ్ఞానము తర్వాత భక్తి. మొదట భక్తి తర్వాత జ్ఞానము కాదు. మొదట జ్ఞానమనే పగలు తర్వాత భక్తి అనే రాత్రి. మళ్లీ పగలు ఎప్పుడు వస్తుంది? భక్తి పై వైరాగ్యము కలిగినప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి. జ్ఞాన - విజ్ఞానాలు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చదువును చదువుకుంటున్నారు. తర్వాత సత్య-త్రేతా యుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్ధము లభిస్తుంది. జ్ఞానాన్ని తండ్ర్రి ఇప్పుడే ఇస్తున్నారు. దీని ప్రాలబ్ధము సత్యయుగములో ఉంటుంది. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానమునిస్తున్నారు. తర్వాత మనము జ్ఞానము నుండి కూడా భిన్నంగా, విజ్ఞానము అనగా మన ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతాము. దానిని జ్ఞ్ఞానమని గానీ, భక్తి అని గానీ అనరు. దానిని విజ్ఞానమని అంటారు. జ్ఞానానికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానమును ఎక్కడ కొరకు ఇస్తున్నారు? - భవిష్య నూతన ప్రపంచము కొరకు ఇస్తున్నారు. నూతన ప్రపంచానికి వెళ్ళాలంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్తారు. ముక్తిధామానికి వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో అక్కడకు తప్పకుండా వెళ్తారు కదా. ఈ కొత్త కొత్త విషయాలు మీరు మాత్రమే వింటున్నారు, ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఆత్మలమైన మనమంతా ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలము. ఆత్మిక పిల్లలకు తప్పకుండా ఆత్మిక తండ్రి ఉండాలి. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు. ఆత్మిక పిల్లలకు ఒక్కరే ఆత్మిక తండ్రి. వారు వచ్చి జ్ఞానమును ఇస్తున్నారు. తండ్రి ఎలా వస్తారో - అది కూడా అర్థం చేయించారు. తండ్రి చెప్తున్నారు - నేను కూడా ప్రకృతిని(దేహము) ధరించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా విన్నదే విన్నట్లు(తండ్రి ద్వారానే వినాలి). తండ్రితో తప్ప మరెవ్వరితోనూ వినరాదు. పిల్లలు విని మిగిలిన సోదరులకు వినిపిస్తారు. ఎంతో కొంత తప్పకుండా వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే వారే పతితపావనులు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది. పిల్లలకు అర్థం చేయిస్తే తెలుసుకుంటారు. ఎందుకంటే మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. భక్తిమార్గములో అజ్ఞానులుగా ఉన్నప్పుడు రావణుని పంజాలో చిక్కుకుని ఏం చేస్తూ వచ్చారు! ఎంత అసహ్యమైనవారిగా తయారై పోయారు! మద్యము తాగడం వలన ఎలా తయారౌతారు? మద్యము(సారాయి) చెడును చెడు అలవాట్లను ఇంకా వ్యాపింపజేస్తుంది. ఇప్పుడు బేహద్ తండ్రి నుండి ఆస్తి తీసుకోవాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. కల్ప-కల్పము తీసుకుంటూ వచ్చారు. అలా తీసుకునేందుకు దైవీగుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. కృష్ణుని దైవీ గుణాలకు ఎంత మహిమ ఉంది! వైకుంఠానికి యజమాని ఎంత మధురమైనవాడు! ఇప్పుడు కృష్ణుని వంశమని అనరు. విష్ణు వంశము లేక లక్ష్మీనారాయణుల వంశమని అంటారు. సత్యయుగ రాజధానిని, వంశమును తండ్రియే స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చిత్ర్రాలు మొదలైనవి లేకున్నా ఇతరులకు అర్థం చేయించగలరు. ఇప్పుడు మందిరాలు(దేవాలయాలు) చాలా తయారౌతూ ఉంటాయి. ఎవరిలో జ్ఞానముందో వారు ఇతరులకు కూడా కళ్యాణము చేసేందుకు, తమ సమానంగా తయారు చేసేందుకు పరిగెడ్తూ ఉంటారు. మేము ఎంతమందికి జ్ఞానము వినిపించామని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. కొంతమందికి జ్ఞాన బాణము తగులుతుంది. బీష్మ పితామహుడు మొదలైనవారు కూడా కుమారీలు మాకు జ్ఞాన బాణము వేశారని అన్నారు కదా. వీరందరూ పవిత్ర కుమార-కుమారీలు అనగా పిల్లలు. మీరందరూ పిల్లలే అందుకే బ్రహ్మ సంతానమైన మేమందరమూ బ్రహ్మకుమార- కుమారీలము, సోదర-సోదరీలము అని అంటారు. ఇది పవిత్రమైన సంబంధము. అందరూ దత్తత తీసుకోబడిన పిల్లలే. తండ్రి దత్తత తీసుకున్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. వాస్తవానికి దత్తత అని కూడా అనరు. అందరూ శివబాబా పిల్లలే. అందరూ నన్ను శివబాబా, శివబాబా రండి,........... అని పిలుస్తారు. అయితే జ్ఞానము కొద్దిగా కూడా లేదు. ఆత్మలన్నీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తున్నాయి. కనుక శివబాబా కూడా తప్పకుండా శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా. శివబాబా పాత్ర చేయకుంటే వారు దేనికీ ఉపయోగపడరు. వారికి విలువే ఉండదు. ప్రపంచమంతటికీ సద్గతి కలుగజేసినప్పుడే వారి మహిమను భక్తిమార్గములో గానము చేస్తారు. సద్గతి కల్గిన తర్వాత తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. వారు కేవలం గాడ్‌ఫాదర్ అని అంటారు. టీచర్ అదృశ్యమైపోతాడు. పరమపిత పరమాత్మ పావనంగా చేసేవారని కేవలం మాట వరుసకు అంటారు. వారు సద్గతినిచ్చేవారని కూడా అనరు. భలే సర్వుల సద్గతిదాత ఒక్కరే అని వారి మహిమలో వస్తుంది కానీ అర్థము తెలియకుండా అనేస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా అర్థ సహితంగా చెప్తారు. రాత్రి అయిన భక్తి వేరని, పగలైన జ్ఞానము వేరని మీరు అర్థం చేసుకున్నారు. పగలుకు కూడా ఇంత సమయమని అలాగే భక్తి కూడా ఇంత సమయమని ఉంటుంది. ఇది అనంతమైన(బేహద్) విషయము. పిల్లలైన మీకు బేహద్ జ్ఞానము లభించింది. పగలు అర్ధకల్పము, రాత్రి అర్ధకల్పము. తండ్రి చెప్తున్నారు - నేను రాత్రిని పగలుగా చేసేందుకు వస్తాను.
అర్ధకల్పము రావణ రాజ్యమని అందులో అనేక రకాలైన దు:ఖములున్నాయని మీకు తెలుసు. తండ్రి మళ్లీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖము లభిస్తుంది. అందుకే ఇది సుఖ-దు:ఖముల నాటకమని కూడా అంటారు. సుఖము అనగా రాముడు, దు:ఖము అనగా రావణుడు. రావణుని పై విజయము పొందుతారు మళ్లీ రామరాజ్యము వస్తుంది. మళ్లీ అర్ధకల్పము తర్వాత రావణుడు రామరాజ్యము పై విజయము పొంది రాజ్యపాలన చేస్తాడు. ఇప్పుడు మీరు మాయ పై విజయము పొందుతారు. ప్రతి అక్షరాన్ని(శబ్ధమును) మీరు అర్థసహితంగా మాట్లాడ్తారు. ఇది మీ ఈశ్వరీయ భాష, ఇది ఇతరులెవ్వరికీ అర్థము కాదు. ఈశ్వరుడు ఎలా మాట్లాడ్తారో ఎవ్వరికీ తెలియదు. ఇది గాడ్‌ఫాదర్(ఈశ్వరీయ) భాష అని మీకు తెలుసు. ఎందుకంటే గాడ్‌ఫాదర్ జ్ఞానసాగరులు. వారు జ్ఞానసాగరులని, నాలెడ్జ్‌ఫుల్ అని మహిమ కూడా చేయబడ్తారు. కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానమిస్తారు కదా. బాబా జ్ఞానమెలా ఇస్తారో ఇప్పుడు మీకు తెలుసు. వారు తమ పరిచయమును కూడా ఇస్తారు. అంతేకాక సృష్టిచక్ర జ్ఞానమును కూడా ఇస్తారు. ఆ జ్ఞానము తీసుకున్నందువలన మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇది స్వదర్శన చక్రము కదా. దీనిని స్మృతి చేయడం వలన మన పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇది అహింసక చక్రమును స్మృతి చేయడము. వారు చూపే చక్రము హింసక చక్రము. తలలు తెంచే చక్రము. అజ్ఞాన మానవులు ఒకరి తలలు ఒకరు నరుక్కుంటూ ఉంటారు. మీరు ఈ స్వదర్శన చక్రమును తెలుసుకోవడం వలన చక్రవర్తి పదవిని పొందుతారు. కామము మహాశత్రువు. దీని వలన ఆదిమధ్యాంతాలు దు:ఖము లభిస్తుంది. అది దు:ఖమునిచ్చే చక్రము. మీకు తండ్రి ఈ చక్ర జ్ఞానమును అర్థం చేయిస్తున్నారు. స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. శాస్త్రాలలో అయితే దీనిని గురించి ఎన్నో కథలు తయారు చేశారు. ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోవలసి వస్తుంది. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి ద్వారా మాత్రమే మీరు స్వర్గ వారసత్వమును తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వము తీసుకోవాలి. ఎంత సులభము! బేహద్ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కనుక వారసత్వము తీసుకునేందుకు స్మృతి చేస్తారు. ఇదే 'మన్మనాభవ, మధ్యాజీభవ.' తండ్రిని, వారసత్వమును స్మృతి చేస్తే పిల్లలకు ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉండాలి. మనము అనంతమైన తండ్రి పిల్లలము, మన తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు, మనము దానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్లీ తప్పకుండా అవుతాము. మళ్లీ మీరే నరకవాసులుగా అయ్యారు. సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. భక్తిమార్గములో కూడా మనమే వచ్చాము. చక్రము ఆల్‌రౌండ్(పూర్తి)గా చుట్టి వచ్చాము. భారతవాసులైన మనమే సూర్య వంశీయులుగా ఉండేవారము తర్వాత చంద్ర వంశీయులుగా, వైశ్య వంశీయులుగా............ అవుతూ క్రింద పడిపోయాము. భారతవాసులైన మనమే దేవీదేవతలుగా ఉండేవారము, తర్వాత మనమే క్రిందకు దిగజారినాము. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వామమార్గములో వెళ్లి ఎంత ఛీ-ఛీ(అపవిత్రులు)గా తయారైపోతారు. మందిరములో కూడా ఇటువంటి ఛీ-ఛీ చిత్రాలను తయారుచేసి ఉన్నారు. ఇంతకుముందు గడియారాలలో కూడా ఇటువంటి చిత్రాలను తయారుచేసేవారు. మనమెంత పుష్ప సమానంగా ఉండేవారమో, మనమే పునర్జన్మలను తీసుకుంటూ ఎంత ఛీ-ఛీ గా తయారైనామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు సత్యయుగాధిపతులుగా ఉన్నప్పుడు ఎంతో దైవీగుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఆసురీగుణాలు గలవారిగా అయ్యారు. ఇతర ఏ వ్యత్యాసమూ లేదు. తోక కలిగిన లేక తొండము కలిగిన మనుష్యులు ఉండరు. కేవలం ఇవి దేవతల గుర్తులు. పోతే స్వర్గము ప్రాయ: లోపమైపోయి ఈ చిత్రాలు గుర్తుగా మిగిలి ఉన్నాయి. చంద్రవంశీయుల గుర్తు కూడా ఉంది. ఇప్పుడు మీరు మాయ పై విజయము పొందేందుకు యుద్ధము చేస్తున్నారు. యుద్ధము చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిన దానికి గుర్తుగా బాణము, విల్లంబులను చూపించారు. భారతవాసులు వాస్తవానికి దేవీదేవతా వంశస్థులు. లేకుంటే ఏ వంశము వారిగా లెక్కింపబడాలి. కానీ భారతవాసులకు తమ వంశము గురించి తెలియనందున స్వయాన్ని హిందువులని చెప్పుకుంటున్నారు. లేకుంటే వాస్తవానికి మీది ఒకే వంశము. భారతదేశములో అందరూ దేవతా వంశమువారు, దీనిని బేహద్ తండే స్థాపన చేస్తారు. భారతదేశపు శాస్తమ్రు కూడా ఒక్కటే. దైవీవంశము స్థాపన జరుగుతుంది తర్వాత అదే భిన్న-భిన్న కొమ్మలుగా విభజనైపోతుంది. తండి దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తారు. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. దేవీ దేవతా ధర్మమే పునాది. వాస్తవానికి అందరూ ముక్తిధామములోనే ఉండేవారు, తర్వాత మీరు మీ దేవీ దేవతా ధర్మపు విభాగములోనికి వెళ్లిపోతారు. భారతదేశములో ఒకే ఒక ధర్మము ఉండేది. ఇతర ధర్మాలు ఏవీ లేవు. మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత డ్రామా ప్లాను అనుసారముగా ఇతర ధర్మాలు వెలువడ్డాయి. భారతదేశపు వాస్తవిక ధర్మము దేవీ దేవతా ధర్మము, దానిని స్థాపించేవారు స్వయంగా తండ్రియే. తర్వాత కొత్త కొత్త ఆకులు వెలువడ్తాయి. ఇదంతా ఈశ్వరీయ వృక్షము. నేను ఈ వృక్షానికి బీజరూపమును అని తండ్రి చెప్తున్నారు. ఇది పునాది. తర్వాత దీని నుండి అనేక కొమ్మ-రెమ్మలు వెలువడ్తాయి. ముఖ్యమైన విషయము ఆత్మలైన మనమందరము సోదరులము. సర్వాత్మల తండ్రి ఒక్కరే. వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు తండి చెప్తున్నారు - ఈ కనుల ద్వారా మీరు ఏమేం చూస్తున్నారో అదంతా మర్చిపోవాలి. ఇది బేహద్ వైరాగ్యము, వారిది హద్దులోని వైరాగ్యము. కేవలం ఇల్లు-వాకిళ్ల పై వైరాగ్యము వస్తుంది. మీకు ఈ పూర్తి పాత పప్రంచము పై వైరాగ్యముంది. భక్తి తర్వాత పాత ప్రపంచము పై వైరాగ్యము. తర్వాత వయా శాంతిధామము ద్వారా నూతన ప్రపంచములోకి వెళ్తాము. తండి కూడా చెప్తున్నారు - ఈ పాత పప్రంచము భస్మమవ్వనున్నది. ఈ పాత పప్రంచము పై ఇప్పుడు మనసునుంచరాదు. అర్హులయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. లెక్కాచారమునంతా చుక్తా చేసుకోవాలి.
మీరు అర్ధకల్పము కొరకు సుఖమును జమ చేసుకుంటారు. దాని పేరే శాంతిధామము, సుఖధామము. మొదట సుఖము ఉంటుంది, తర్వాత దు:ఖముంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పై నుండి ఏవైతే కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయో, ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది, వారికి మొదటే దు:ఖము కలుగదు, ఈ ఆటలో మొదట సుఖము తర్వాతే దు:ఖము. కొత్త కొత్తగా వచ్చేవారు సతోప్రధానంగా ఉంటారు. ఎలాగైతే మీకు సుఖము మోతాదు ఎక్కువగా ఉందో, అలా వారికి దు:ఖము మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు. తండ్రి ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని ధరించాను. అనేక జన్మల అంత్యములో అనగా తమోప్రధాన శరీరములో నేను ప్రవేశిస్తాను. తర్వాత అతనే మొదటి నెంబరుగా అవుతాడు. ఫస్ట్(మొదటివారే) సో లాస్ట్(చివరి వారు), లాస్ట్ సో ఫస్ట్, ఇది కూడా అర్థము చేయించవలసి ఉంటుంది. ఫస్టు తర్వాత ఎవరు? - మమ్మా. మమ్మాగారి పాత్ర ఉండాలి. ఆమె అనేకమందికి శిక్షణనిచ్చారు. తర్వాత పిల్లలైన మీలో నెంబరువారుగా అనేమందికి శిక్షణనిచ్చువారు, చదివించువారు ఉన్నారు. చదువుకునేవారు కూడా ప్రయత్నించి మీ కంటే ఉన్నతంగా వెళ్లిపోతారు. అనేక సేవాకేంద్రాలలో చదివించే టీచరు కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనింపబడ్తారు. అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా. కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని సమాప్తము చేసేస్తుంది. వికారాలలో పడిపోతారు. పోను పోను మీరు చాలామందిని గురించి వింటూ ఉంటారు, ఆశ్చర్యమనిపిస్తుంది. వీరు మాకు జ్ఞానమును ఇస్తూ ఉండేవారు, వీరు ఎలా వెళ్ళిపోయారు! పవిత్రమవ్వమని మాకు చెప్పి స్వయం ఛీ-ఛీ గా అయిపోయారు. తప్పకుండా అర్థము చేసుకుంటారు కదా. చాలా ఛీ-ఛీగా అయిపోతారు. బాబా చెప్తున్నారు - పెద్ద పెద్ద మహారథులను కూడా మాయ జోరుగా ఇబ్బంది పెడ్తుంది. మీరు ఎలాగైతే మాయను ఎదిరించి విజయులుగా అవుతారో, అలా మాయ కూడా మిమ్ములను సతాయిస్తుంది. తండి ఎంతెంత మంచి-మంచి ఫస్ట్‌క్లాసైన, రమణీయమైన పేర్లు కూడా ఉంచారు! కానీ ఓహో! మాయ, ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోయి......... కింద పడిపోయారు. మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. మాయతో మీకు ఎంతో పెద్ద యుద్ధము జరుగుతుంది! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మీరు అర్ధకల్పము కొరకు సుఖమును జమ చేసుకుంటారు. దాని పేరే శాంతిధామము, సుఖధామము. మొదట సుఖము ఉంటుంది, తర్వాత దు:ఖముంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పై నుండి ఏవైతే కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయో, ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది, వారికి మొదటే దు:ఖము కలుగదు, ఈ ఆటలో మొదట సుఖము తర్వాతే దు:ఖము. కొత్త కొత్తగా వచ్చేవారు సతోప్రధానంగా ఉంటారు. ఎలాగైతే మీకు సుఖము మోతాదు ఎక్కువగా ఉందో, అలా వారికి దు:ఖము మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు. తండ్రి ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని ధరించాను. అనేక జన్మల అంత్యములో అనగా తమోప్రధాన శరీరములో నేను ప్రవేశిస్తాను. తర్వాత అతనే మొదటి నెంబరుగా అవుతాడు. ఫస్ట్(మొదటివారే) సో లాస్ట్(చివరి వారు), లాస్ట్ సో ఫస్ట్, ఇది కూడా అర్థము చేయించవలసి ఉంటుంది. ఫస్టు తర్వాత ఎవరు? - మమ్మా. మమ్మాగారి పాత్ర ఉండాలి. ఆమె అనేకమందికి శిక్షణనిచ్చారు. తర్వాత పిల్లలైన మీలో నెంబరువారుగా అనేమందికి శిక్షణనిచ్చువారు, చదివించువారు ఉన్నారు. చదువుకునేవారు కూడా ప్రయత్నించి మీ కంటే ఉన్నతంగా వెళ్లిపోతారు. అనేక సేవాకేంద్రాలలో చదివించే టీచరు కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనింపబడ్తారు. అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా. కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని సమాప్తము చేసేస్తుంది. వికారాలలో పడిపోతారు. పోను పోను మీరు చాలామందిని గురించి వింటూ ఉంటారు, ఆశ్చర్యమనిపిస్తుంది. వీరు మాకు జ్ఞానమును ఇస్తూ ఉండేవారు, వీరు ఎలా వెళ్ళిపోయారు! పవిత్రమవ్వమని మాకు చెప్పి స్వయం ఛీ-ఛీ గా అయిపోయారు. తప్పకుండా అర్థము చేసుకుంటారు కదా. చాలా ఛీ-ఛీగా అయిపోతారు. బాబా చెప్తున్నారు - పెద్ద పెద్ద మహారథులను కూడా మాయ జోరుగా ఇబ్బంది పెడ్తుంది. మీరు ఎలాగైతే మాయను ఎదిరించి విజయులుగా అవుతారో, అలా మాయ కూడా మిమ్ములను సతాయిస్తుంది. తండి ఎంతెంత మంచి-మంచి ఫస్ట్‌క్లాసైన, రమణీయమైన పేర్లు కూడా ఉంచారు! కానీ ఓహో! మాయ, ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోయి......... కింద పడిపోయారు. మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. మాయతో మీకు ఎంతో పెద్ద యుద్ధము జరుగుతుంది! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇక్కడే అన్ని లెక్కాచారాలు సమాప్తము చేసుకొని అర్ధకల్పము కొరకు సుఖము జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచము పై ఇప్పుడు మనసునుంచరాదు. ఈ కనులకు ఏమేమి కనిపిస్తోందో, అదంతా మర్చిపోవాలి.
2. మాయ చాలా ప్రబలమైనది, కావున దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్నదానిని ఇతరులకు వినిపించాలి.
వరదానము :- '' సదా ఏకరస స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సుఖము - శాంతి - ప్రేమల చలిని(దోసిలిని) ఇచ్చే మహాదాని భవ ''
పిల్లలైన మీ మూడ్ (స్థితి) సదా సంతోషంగా, ఏకరసంగా ఉండాలి. ఒకసారి మూడ్ ఆఫ్, ఒకసారి చాలా సంతోషంగా,............ ఇలా ఉండరాదు. సదా మహాదానిగా అయ్యే వారి మూడ్ ఎప్పుడూ మారిపోదు. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. మీకు ఎవరు ఏం ఇచ్చినా మహాదాని పిల్లలైన మీరు అందరికి సుఖము, శాంతి, ప్రేమల అంచలిని(దోసిలిని) ఇవ్వండి. శరీరంతో సేవ చేయడంతో పాటు ఇటువంటి మనసా సేవలో బిజీగా ఉంటే డబల్ పుణ్యము జమ అవుతుంది.
స్లోగన్ :- '' మీ విశేషతలు ప్రభువు ప్రసాదంచినవి. వీటిని కేవలం స్వయం పట్ల ఉపయోగించకండి, పంచండి, పెంచండి ''
No comments:
Post a Comment