Thursday, November 21, 2019

Telugu Murli 22/11/2019

22-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ సమయంలో నిరాకార తండ్రి సాకారములోకి వచ్చి మిమ్ములను అలంకరిస్తారు, ఒంటరిగా కాదు ''

ప్రశ్న :- పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు ?
జవాబు :- ఎందుకంటే 1. ఈ స్మృతి ద్వారానే మనకు దీర్ఘాయువు లభిస్తుందని, నిరోగులుగా అవుతామని మీకు తెలుసు. 2. స్మృతి చేయడం ద్వారా మన పాపాలు నశిస్తాయి. మనము సత్యమైన బంగారుగా అవుతాము. ఆత్మలో ఏర్పడిన రజో, తమోల మలినాలు తొలగిపోతాయి. ఆత్మ స్వచ్ఛంగా కంచనముగా(బంగారుగా) అవుతుంది. 3. స్మృతి ద్వారానే మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. 4. మీరు అలంకరించబడ్తారు. 5. మీరు గొప్ప ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్ములను పదమాపదమ్‌ భాగ్యశాలురుగా చేస్తుంది.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? కేవలం శాంతి(నిశ్శబ్ధము)గా కూర్చోలేదు. అర్థ సహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చొని ఉన్నారు. తండ్రిని మనమెందుకు స్మృతి చేస్తామో పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి మనకు దీర్ఘాయువునిస్తారు. తండ్రిని స్మృతి చేసినందున మన పాపాలు నశిస్తాయి. మనము సత్యమైన బంగారుగా, సతోప్రధానంగా అవుతాము. మీకు ఎంతో మంచి అలంకారము జరుగుతుంది. మీ ఆయువు వృద్ధి అవుతుంది. మీ ఆత్మ కంచనంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో మలినాలు చేరి ఉన్నాయి. స్మృతియాత్ర ద్వారా రజో-తమో గుణాల ఆ మలినమంతా తొలగిపోతుంది. మీరు ఇంతగా లాభపడ్తారు! ఆయువు వృద్ధి చెందుతుంది. మీరు స్వర్గవారసులుగా అవుతారు. చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. మీరు పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతారు. అందుకే తండ్రి చెప్తున్నారు - ''మన్మనాభవ, మామేకమ్‌ యాద్‌ కరో(నన్ను ఒక్కరినే స్మృతి చేయండి)'', ఏ దేహధారి కొరకు ఇలా చెప్పరు. తండ్రికి శరీరమే లేదు. మీలోని ఆత్మలు కూడా నిరాకారమే. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పారసబుద్ధిగా ఉన్నవారు రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. జన్మ-జన్మాంతరాలుగా నీటితో స్నానము చేశారు, ఈ స్నానాల ద్వారా పావనంగా అవుతామని అనుకున్నారు. కానీ పావనంగా అయ్యేందుకు బదులు ఇంకా పతితమై నష్టపోయారు. ఎందుకంటే ఇది అయినదే అసత్యపు మాయ, అందరికీ అసత్యము చెప్పే సంస్కారమైపోయింది. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను పావనంగా చేసి వెళ్తాను, మళ్లీ మిమ్ములను పతితులుగా చేసేదెవరు? ఇప్పుడు మీరు ఫీల్‌ చేస్తున్నారు కదా. ఎన్నో గంగా స్నానాలు చేస్తూ వచ్చారు కానీ పావనంగా అవ్వలేదు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము పావనధామాలు. ఇది రావణ ప్రపంచము. దీనిని దు:ఖధామమని అంటారు. ఇది సులభంగా అర్థము చేసుకునే విషయము కదా. ఇందులో ఏ కష్టమూ లేదు. ఇతరులకు వినిపించేందుకు కూడా కష్టమేదీ లేదు. ఎవరినైనా కలిసినప్పుడు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ శివుడు. ప్రతి ఒక్కరి శరీరానికి తండ్రి వేరు వేరుగా ఉంటారు. ఆత్మలన్నిటికి తండ్రి ఒక్కరే. ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. అది కూడా హిందీలోనే అర్థం చేయిస్తారు. హిందీ భాషనే ముఖ్యమైనది. పదమాపదమ్‌ భాగ్యశాలురని ఈ దేవతలను అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలురు! వీరు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. ఈ సహజ యోగము ద్వారా ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ఇలా అవుతారు. ఇప్పుడిది పాత, క్రొత్త ప్రపంచాల సంగమము. మళ్లీ మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - కేవలం రెండు పదాలు అర్థ సహితంగా స్మృతి చేయండి. గీతలో మన్మనాభవ అనే పదముంది. పదమునేమో చదువుతారు కానీ దాని అర్థము బొత్తిగా తెలియదు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే నేన్నొక్కరినే పతితపావనుడను. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తున్నారు. మొట్టమొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్లీ మీరు నూతన ప్రపంచములో దేవతలుగా అవుతారు.
రచయిత మరియు రచన, రెండింటి గురించి మీరు తెలుసుకున్నారు. అందువలన ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఇంతకుముందు జన్మ-జన్మాంతరాలు మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి వినిపించే ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియనే తెలియవు. ఎక్కడికైనా వెళ్లండి, ఎవ్వరూ మీకు ఈ విషయాలు వినిపించరు. ఒకవేళ చెప్పినా, ఈ విషయాలు ఎవ్వరూ ఎక్కడా వినిపించలేరు. ఇప్పుడు ఇరువురు తండ్రులు కలిసి మిమ్ములను అలంకరిస్తున్నారు. మొట్టమొదట తండ్రి ఒంటరిగా ఉండేవారు. శరీరము లేకుండా ఉండేవారు. పైన కూర్చొని మిమ్ములను అలంకరించలేరు. ఒకటి రెండు కలిస్తే 12 అవుతుంది అని అంటారు కదా. పోతే ప్రేరణ లేక శక్తి మొదలైనవేవీ లేవు. పై నుండి మిమ్ములను అలంకరిస్తారు. బాబా మనలను సుఖధామానికి తీసుకెళ్తున్నారని అర్థము కూడా చేసుకుంటారు. డ్రామా ప్లాను అనుసారము బాబా బంధితులై ఉన్నారు. వారికి డ్యూటీ(కర్తవ్యము) లభించింది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లలైన మీ కొరకు వస్తారు. ఈ యోగబలము ద్వారా మీరు ఎంతో కంచనంగా(సతోప్రధానంగా) అవుతారు. ఆత్మ మరియు శరీరము రెండూ కంచనంగా అవుతాయి. మళ్లీ ఛీ-ఛీగా అవుతాయి. ఈ పురుషార్థము ద్వారా మేము ఈ విధంగా అలంకరించబడిన వారిగా అవుతామని మీరు సాక్షాత్కారములో చూస్తారు. అక్కడ చెడు దృష్టి ఉండదు. అది కూడా అవయవాలన్నీ దాచబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, రావణ రాజ్యములో ఛీ-ఛీ మాటలు నేర్చుకుంటారు. ఈ లక్ష్మీనారాయణుల వస్త్రాలంకరణ మొదలైనవి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారిని దేహాభిమానులని అనరు. వారిది సహజ సౌందర్యము. తండ్రి మిమ్ములను ఇంత సహజ సుందరంగా చేస్తున్నారు. ఈ రోజులలో అసలైన నగలు ఎవ్వరూ ధరించను కూడా ధరించలేరు. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు. అక్కడైతే ఇటువంటి మాటలుండవు. అటువంటి తండ్రి మీకు లభించారు. కానీ ఇతను లేకుండా మీరు అలా అవ్వలేరు. మేము శివబాబా నుండి డైరక్టుగా వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. కానీ వారు ఎలా ఇస్తారు? నేరుగా అడిగి ప్రయత్నము చేయండి. లభిస్తుందేమో చూడండి. మేము శివబాబా నుండి వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. బ్రహ్మను అడిగే అవసరమేముందని అంటారు. శివబాబా ప్రేరణ ద్వారా ఏమైనా ఇచ్చేస్తారని అంటారు. మంచి-మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలా కాటేస్తుంది. ఒక్కరినే అంగీకరిస్తారు. అయితే ఒంటరిగా ఏం చేస్తారు? నేను ఒక్కరినే ఎలా వస్తానని తండ్రి అంటున్నారు. నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోటికి గాయనముంది కదా. గోముఖము నుండి అమృతము తీసుకునేందుకు ఎన్నో దెబ్బలు తింటారు(కష్టపడ్తారు). శ్రీనాథ ద్వారానికి వెళ్ళి దర్శనము చేసుకుంటారు. కానీ దర్శనము వలన ఏం లభిస్తుంది. దానిని భూతపూజ అని అంటారు. వాటిలో(విగ్రహాలలో) ఆత్మ లేనే లేదు. కేవలం 5 తత్వాలచే చేయబడిన బొమ్మ అనగా మాయను స్మృతి చేయడమే. పంచ తత్వాలంటే ప్రకృతి కదా. వాటిని స్మృతి చేస్తే ఏమౌతుంది? అందరికీ ప్రకృతి ఆధారముండనే ఉంది. కానీ అక్కడ సతోప్రధాన ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఉండేది తమోప్రధానమైన ప్రకృతి. తండ్రి సతోప్రధాన ప్రకృతిని(శరీరమును) ఎప్పుడూ తీసుకోరు. ఇక్కడ సతోప్రధాన ప్రకృతి లభించదు. తండ్రి చెప్తున్నారు - ఈ సాధువులు- సన్యాసులు అందరినీ నేనే ఉద్ధరించాల్సి వస్తుంది. నేను నివృత్తి మార్గములో రానే రాను. ఇది అయ్యిందే ప్రవృత్తి మార్గము. అందరికీ చెప్తున్నాను. పవిత్రులుగా అవ్వండి. అక్కడ నామ-రూపాలన్నీ మారిపోతాయి. ఈ నాటకమెలా తయారయ్యిందో గమనించమని తండ్రి చెప్తున్నారు. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్లమంది ఉన్నారు. అందరి రూపాలు, ముఖ కవళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. దీనిని ప్రాకృతికము, అద్భుతమని అంటారు. స్వర్గమును అద్భుతమని అంటారు కదా. ఎంత శోభాయమానంగా ఉంటుంది! మాయ యొక్క అద్భుతాలు 7. తండ్రిది ఒకే అద్భుతము. త్రాసులో ఆ 7 అద్భుతాలు ఒకవైపు, ఈ ఒక్క అద్భుతము రెండవ వైపు ఉంచినా ఇదే భారంగా ఉంటుంది. ఒకవైపు జ్ఞానము, ఒకవైపు భక్తిని ఉంచండి. జ్ఞానము వైపే తూగుతుంది. భక్తి నేర్పించేవారు అనేకమంది ఉన్నారు. జ్ఞానమిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు, అలంకరిస్తున్నారు. తండ్రి పవిత్రంగా అవ్వండి అంటూ ఉంటే, లేదు మేము ఛీ-ఛీగా అవుతామని అంటారు. గరుడ పురాణంలో కూడా విషయవైతరిణీి నదిని చూపిస్తారు కదా. తేలు, మండ్రగబ్బ, సర్పము మొదలైనవన్నీ ఒక దానిని ఒకటి కాటేసుకుంటూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు - మీరు ఎంత అనాథలుగా అయిపోతారు! పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. బయట ఎవరికైనా ఇలా నేరుగా చేప్తే వారు కోపపడ్తారు. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలకు మాట్లాడేది కూడా తెలియదు. చిన్న పిల్లలు పూర్తి అమాయకులుగా ఉంటారు. అందుకే వారిని మహాత్ములని అంటారు. మహాత్ముడైన కృష్ణుడెక్కడ? నివృత్తి మార్గములోని సన్యాసులనబడే మహాత్ములెక్కడ? నివృత్తిమార్గము వారు మహాత్ములని పిలువబడ్తారు. అది ప్రవృత్తి మార్గము. అక్కడ ఎప్పుడూ భ్రష్టాచారముతో జన్మించరు. కృష్ణుని శ్రేష్ఠాచారుడని అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురూ కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. వీరు మీకు తప్పకుండా బాగా అలంకరిస్తారు. వీరిని ఇంత బాగా అలంకరించిన వారి వద్దకు మేము కూడా వెళ్ళాలని అనుకుంటారు కదా. అందుకే మీరు ఇక్కడకు రిఫ్రెష్‌(తాజా)గా అయ్యేందుకు వస్తారు. తండ్రి వద్దకు రావాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పూర్తి నిశ్చయమున్నవారు - చంపినా ఏం చేసినా, మేము ఎప్పుడూ తండ్రి జతను వదలము అని అంటారు. కొంతమంది ఏ కారణము లేకుండా వదిలేస్తారు. ఇది కూడా నాటకములో తయారయ్యే ఉంది. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు.
వీరు రావణ వంశము వారని తండ్రికి తెలుసు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. విడాకులిచ్చిన వారిలో కొంతమంది మళ్లీ వచ్చేస్తారు. తండ్రి చేతిని వదిలేస్తే పదవి తగ్గిపోతుందని అర్థం చేయిస్తారు. మేము ఎప్పటికీి ఇలాంటి తండ్రిని వదలమని సన్ముఖములో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కాని మాయా రావణుడు కూడా తక్కువైనవాడు కాదు. వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. కానీ మళ్లీ సన్ముఖములోకి వస్తే వారికి అర్థం చేయించబడ్తుంది. బాబా ఎప్పుడూ బెత్తము తీసుకోరు, కొట్టరు. తండ్రి ఇంకా ప్రేమతోనే అర్థం చేయిస్తారు. నిన్ను మాయావి మొసలి తినేసిందా? తప్పించుకొని రావడము చాలా మంచిదయ్యింది. గాయపడ్తే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసములో ఉంటారో వారు ఎప్పుడూ దూరంగా పోరు, ఎప్పుడూ చేయి వదలరు. ఇక్కడ నుండి తండ్రిని వదిలి, మరణించి మాయా రావణునికి చెందినవారిగా అయితే వారిని మాయ ఇంకా గట్టిగా తినేస్తుంది. తండ్రి అంటున్నారు - మిమ్ములను ఎంతగా అలంకరిస్తున్నాను! మంచిగా నడుచుకోండి అని అర్థం చేయిస్తారు. ఎవ్వరికీ దు:ఖమివ్వకండని చెప్తారు. రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు. మళ్లీ అలాగే అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ముక్కు, చెవులు పట్టుకొని చాలా విలవిలలాడిస్తుంది. ఇప్పుడు మీకు తండ్రి జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. అందువలన వికారి దృష్టితో ఎప్పుడూ చూడరాదు. విశ్వానికి అధికారులుగా అవ్వాలంటే కొంచెమైనా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీ శరీరము మరియు ఆత్మ రెండూ తమోప్రధానంగా ఉన్నాయి. ఆత్మలో తుప్పు(మురికి) ఏర్పడింది. ఈ మురికిని భస్మము చేసేందుకు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. మీరు అలాంటి తండ్రిని స్మృతి చేయలేకుంటే సిగ్గు వేయదా? స్మృతి చేయకుంటే మాయా భూతము మింగేస్తుంది. మీరు ఎంత ఛీ-ఛీ(వికారులు)గా అయ్యారు. రావణరాజ్యంలో వికారాల నుండి జన్మించని వారు ఒక్కరు కూడా లేరు. అక్కడ వికారమనే పేరే ఉండదు. రావణుడే ఉండడు. రావణరాజ్యము ద్వాపరయుగము నుండి వస్తుంది. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఈ ఒక్క జన్మ మాత్రమే పవిత్రంగా ఉండండి. ఆ తర్వాత వికారాల మాటే ఉండదు. అది నిర్వికార ప్రపంచము. వీరు పవిత్ర దేవీదేవతలుగా ఉండేవారని 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే శివబాబా, మమ్ములను ఈ పతిత ప్రపంచము నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చినందున ఇది పతిత కార్యమని మీకు అర్థమయింది. ఇంతకుముందు మీకు తెలియదు. ఎందుకంటే మీరు రావణరాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - సుఖధామానికి వెళ్ళాలంటే ఛీ-ఛీగా అవ్వడం వదిలేయండి. అర్ధకల్పము మీరు ఛీ-ఛీగా అయ్యారు. తల పై పాపభారము చాలా ఉంది. అంతేకాక మీరు చాలా నిందించారు, తిట్టినారు. తండ్రిని తిట్టినందున పాపభారము చాలా పెరిగింది. అయితే ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఆత్మలైన మీకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. అది చేసే తీరాలి. ప్రతి ఒక్కరు తమ-తమ పాత్ర చేయాల్సిందే. అలాంటప్పుడు ఏడ్చేదెందుకు? సత్యయుగములో ఎవ్వరూ ఏడ్వరు. జ్ఞానదశ పూర్తయినప్పుడు ఆ దేవతలే ఏడ్చుట, గుండెలు బాదుకొనుట ప్రారంభమవుతుంది. మోహజీత్‌ కథ కూడా మీరు విన్నారు. ఇది ఒక అసత్యపు దృష్టాంతము. కథగా తయారు చేశారు. సత్యయుగములో ఎవ్వరూ అకాలమృత్యువు పాలు అవ్వరు. మోహజీతులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పరమపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారు మిమ్ములను ఈ విశ్వానికి యజమానులుగా చేస్తారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము(ఆత్మలము) వారికి వారసులుగా ఉన్నామా? పోతే ఈ భౌతిక చదువులో ఏముంది? ఈ రోజులలో పతిత మనుష్యుల మొఖము కూడా మీరు చూడరాదు. మీ పిల్లలకు కూడా చూపించరాదు. బుద్ధిలో మేము సంగమ యుగములో ఉన్నామని సదా భావించండి. మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము, ఇతరులను చూస్తున్నా చూడనట్లు ఉంటాము. మనము నూతన ప్రపంచమును మాత్రమే చూస్తాము. మనము దేవతలుగా అవుతాము. ఆ నూతన సంబంధాలను మాత్రమే చూస్తాము. పాత సంబంధాలను చూస్తున్నా చూడము. ఇవన్నీ భస్మమైపోయేవి. మనము ఒంటరిగా వచ్చాము, మళ్లీ ఒంటరిగానే వెళ్తాము. ఆ తండ్రి ఒక్కసారి మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు వస్తారు. దానిని శివబాబావారి పెళ్ళి ఊరేగింపు (మెరవణి) అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వ చక్రవర్తి పదవినిస్తారు. మానవులను దేవతలుగా చేస్తారు. ఇంతకుముందు విషము కక్కేవారు, ఇప్పుడు అమృతమును వర్షిస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని సంగమయుగ నివాసినని భావించి నడుచుకోవాలి. పాత సంబంధాలను చూస్తున్నా చూడనట్లుండాలి. మేము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి.
2. ఆత్మ, శరీరము రెండింటిని కంచనము(పవిత్రముగా) చేసుకునేందుకు జ్ఞాన మూడవ నేత్రముతో చూచే అభ్యాసము చేయాలి. అపవిత్ర(క్రిమినల్‌) దృష్టిని సమాప్తము చేయాలి. జ్ఞాన-యోగాల ద్వారా స్వయాన్ని అలంకరించుకోవాలి.

వరదానము :- '' తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసి, చేయించే విశేష ఆత్మా భవ ''
తండ్రి ఛత్రఛాయ ఎక్కడుంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయలోకి మాయ రాజాలదు. శ్రమ నుండి స్వతహాగా దూరమైపోతారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శ్రమ మజాను అనుభవమవ్వనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషమైన ఆత్మలు ఉన్నతమైన చదువు చదువుతున్నా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారికి 'మేము కల్ప-కల్పము విజయీ ఆత్మలమే, పాస్‌ అయ్యే ఉన్నాము' అనే నిశ్చయముంటుంది. కనుక సదా ఆనందంగా ఉండండి, ఇతరులకు ఆనందంగా ఉండేందుకు సందేశమిస్తూ ఉండండి. ఇదే మీరు చేయాల్సిన సేవ.

స్లోగన్‌ :- '' డ్రామా రహస్యము(రాజ్‌) తెలియని వారు నారాజ్‌గా (అసంతుష్టంగా) ఉంటారు ''

No comments:

Post a Comment