30-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పిల్లలైన మిమ్ములను భక్తాత్మల నుండి జ్ఞానీ ఆత్మలుగా, పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు ''
ప్రశ్న :- జ్ఞానయుక్తమైన పిల్లలు ఎల్లప్పుడూ ఏ చింతనలో ఉంటారు ?
జవాబు :- నేను అవినాశి ఆత్మను, ఈ శరీరము వినాశనమయ్యేది. నేను 84 శరీరాలు ధరించాను, ఇప్పుడిది అంతిమ జన్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. చిన్నదిగా, పెద్దదిగా అయ్యేది శరీరమే. ఈ కనులు శరీరములో ఉన్నాయి. కానీ కనులతో చూచేది ఆత్మనైన నేను. బాబా ఆత్మలకే జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. వారు కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోనంతవరకు చదివించలేరు. జ్ఞానయుక్తమైన పిల్లలెప్పుడూ ఇలాంటి చింతనే చేస్తారు.
ఓంశాంతి. ఇలా అనింది ఎవరు? ఆత్మనే. అవినాశి ఆత్మ శరీరము ద్వారా అంటుంది. శరీరము మరియు ఆత్మలో ఎంత తేడా ఉంది. ఈ పంచ తత్వాల శరీరము పెద్ద తోలుబొమ్మ వలె తయారవుతుంది. భలే చిన్నదిగా ఉన్నా, ఆత్మ కంటే ఎప్పుడూ పెద్దదిగానే ఉంటుంది. మొదట చాలా చిన్నదిగా ఉన్న పిండము కొంచెము పెద్దదైనప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. శరీరము పెద్దదవుతూ, అవుతూ ఇంత పెద్దదైపోతుంది. ఆత్మ చైతన్యమైనది కదా. ఆత్మ ప్రవేశించనంత వరకు శరీరము దేనికీ పనికిరాదు. ఎంతో గొప్ప తేడా ఉంది. మాట్లాడేది, నడిచేది కూడా ఆత్మనే. అది ఎంతో సూక్ష్మమైన బిందువు. అది ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు, వినాశనమవ్వదు. నేను అవినాశి ఆత్మను. శరీరము వినాశనమయ్యేదని ఇప్పుడు పరమాత్మ తండ్రి అర్థం చేయించారు. అందులో నేను ప్రవేశించి పాత్రను అభినయిస్తాను. ఈ విషయాల గురించి మీరు ఇప్పుడు మాత్రమే ఆలోచిస్తారు. ఇంతకుముందు మీకు ఆత్మ గురించి గానీ, పరమాత్మ గురించి గానీ తెలియదు. కేవలం ఓ పరమపిత పరమాత్మా ! అని నామమాత్రానికి అనేవారు. స్వయాన్ని ఆత్మగా భావించేవారు. తర్వాత ఎవరో, మీరే పరమాత్మ అని అనేశారు. అలా తెలిపినవారు ఎవరు? - ఈ భక్తిమార్గపు గురువులు, శాస్త్రాలు. సత్యయుగములో ఇలా ఎవ్వరూ చెప్పరు. మీరు నా పిల్లలు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఆత్మ సహజమైనది. శరీరము అసహజమైన మట్టితో తయారైనది. ఆత్మ ఉంటేనే శరీరము మాట్లాడ్తుంది, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన ఆత్మలకు ఆ తండ్రే వచ్చి అర్థం చేయించారు. నిరాకార శివబాబా ఈ సంగమ యుగములోనే, ఈ శరీరములో వచ్చి వినిపిస్తున్నారు. ఈ కళ్ళు శరీరములోనే ఉంటాయి, ఇప్పుడు తండ్రి జ్ఞాన చక్షువునిస్తారు. ఆత్మలో జ్ఞానము లేకుంటే అజ్ఞాన చక్షువు అని అంటారు. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మకు జ్ఞాన నేత్రము లభిస్తుంది. అంతా చేసేది ఆత్మనే. ఆత్మ శరీరము ద్వారా కర్మ చేస్తుంది. ఇప్పుడు తండ్రి ఈ శరీరాన్ని ధరించి ఉన్నారని మీరు గ్రహించారు. తన రహస్యాన్ని కూడా తెలుపుతున్నారు అంతేకాక సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా తెలుపుతున్నారు. నాటకాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానమును కూడా ఇస్తున్నారు. మొదట మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. అవును, ఇది నాటకమే. సృష్టి చక్రము తిరుగుతూ ఉంది, కానీ ఎలా తిరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తోంది. మిగిలినదంతా భక్తియే. తండ్రియే వచ్చి మిమ్ములను జ్ఞానీ ఆత్మలుగా చేస్తున్నారు, మొదట మీరు భక్తాత్మలుగా ఉండేవారు. ఆత్మలైన మీరు భక్తి చేసేవారు, మీరిప్పుడు జ్ఞానమును వింటున్నారు. భక్తిని అంధకారమని అంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అనరు. భక్తి పాత్ర మరియు జ్ఞాన పాత్ర కూడా ఉందని తండ్రి అర్థం చేయించారు. భక్తి చేయునప్పుడు ఏ సుఖము లభించలేదని మీకు తెలుసు. భక్తి చేస్తూ మోసపోతూ ఉండేవారు. తండ్రి కోసము అన్వేషిస్తూ ఉండేవారు. యజ్ఞతపాలు, దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ వెతుకుతూ వెతుకుతూ మోసపోతూ అలసిపోయి విసిగిపోతారని మీరు అర్థం చేసుకున్నారు. దిగజారారు కనుక తమోప్రధానంగా అయిపోయారు. అసత్య పనులు చేసి ఛీ-ఛీగా తయారవుతారు, పతితులుగా కూడా అయ్యారు. పావనంగా అయ్యేందుకు భక్తి చేశారని కాదు. భగవంతుని ద్వారా పావనంగా అవ్వకుండా మనము పావన ప్రపంచానికి వెళ్లలేము. పావనంగా అవ్వకుండా భగవంతునితో కలవలేము అందుకే వచ్చి పావనంగా చేయమని భగవంతుని వేడుకుంటారు. పతితులే పావనంగా అయ్యేందుకు భగవంతునితో మిలనము చేస్తారు. పావనుల(సత్యయుగములో)తో భగవంతుడు కలవరు. సత్యయుగములోని లక్ష్మీనారాయణులతో భగవంతుడు మిలనము చేస్తారా ? భగవంతుడే వచ్చి పతితులైన మిమ్ములను పావనంగా చేస్తారు, తర్వాత మీరు ఈ శరీరాన్ని వదిలేస్తారు. పావనంగా అయితే ఈ తమోప్రధాన పతిత సృష్టిలో ఉండలేరు. తండ్రి మిమ్ములను పావనంగా చేసి అదృశ్యమైపోతారు. డ్రామాలో వారి పాత్రే అద్భుతమైనది. ఈ కనులకు ఆత్మ కనిపించదు ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైనా అర్థము చేసుకోలేరు. వీరు ఫలానావారు, ఫలనావారు అని అందరి గురించి తెలుసుకోగలరు, స్మృతిస్తారు. ఫలానావారిది చైతన్యములో సాక్షాత్కారము చేసుకోవాలని కోరుకుంటారు, ఇంకేమీ లక్ష్యపెట్టరు. సరే చైతన్యంగా సాక్షాత్కారము అవుతారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది? సాక్షాత్కారమై మళ్లీ అదృశ్యమైపోతారు. అల్పకాల క్షణ భంగుర సుఖము పొందే ఆశ పూర్తి అవుతుంది, దానిని అల్పకాల క్షణభంగుర సుఖమని అంటారు. సాక్షాత్కారమవ్వాలనే కోరిక ఉండేది, అది పూర్తి అయింది. కాని ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటంటే - పతితుల నుండి పావనంగా అయితే దేవతలుగా అవుతారు అనగా స్వర్గములోకి వెళ్తారు.
శాస్త్రాలలో కల్పము లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలుందని భావిస్తారు కాని వాస్తవానికి కల్పమంతా కలిసి 5 వేల సంవత్సరాలే అని తండ్రి తెలిపిస్తున్నారు. కనుక మానవులు అంధకారములో ఉన్నారు కదా. దీనినే గాడాంధకారమని అంటారు. జ్ఞానము ఎవరిలోనూ లేదు. అదంతా భక్తి. రావణుడు వచ్చినప్పటి నుండే భక్తి ప్రారంభమయింది. తండ్రి జ్ఞానముతో వస్తారు. తండ్రి నుండి ఒక్కసారి మాత్రమే జ్ఞాన వారసత్వము లభిస్తుంది. పదే పదే లభించదు. అక్కడ మీరు ఎవ్వరికీ జ్ఞానమివ్వరు, అవసరమే లేదు. అజ్ఞానములో ఉన్నవారికే జ్ఞానము లభిస్తుంది. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. వారిని నిందించకుండా మాట్లాడరు. ఈ విషయము కూడా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని మీరంటారు. వారు ఆత్మలైన మనకు తండ్రి. వారేమో పరమాత్మ రాళ్లు-రప్పలలో ఉన్నారని అంటారు, భక్తి పూర్తిగా భిన్నమైనదని, అందులో జ్ఞానము కొద్దిగా కూడా లేదని పిల్లలైన మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. సమయం పూర్తిగా మారిపోతుంది. భగవంతుని పేరు కూడా మారిపోతుంది, తర్వాత మనుష్యుల పేరు కూడా మారిపోతుంది. మొదట దేవతలు తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు. వారు దైవీగుణాలు గల మానవులు. వీరు ఆసురీగుణాలు ఉండే మనుష్యులు. పూర్తి ఛీ-ఛీ (అసహ్యము, మురికి)గా ఉన్నారు. గురునానక్ కూడా పరమాత్ముని - అశంక్ చోర్ అని అన్నారు. మనుష్యులెవరినైనా కోరికల దొంగ(అశంక్ చోర్) అని అంటే వెంటనే ఎందుకిలా తిడుతున్నారని అంటారు. ఇవన్నీ ఆసురీ సంప్రదాయాలని తండ్రి అంటున్నారు. రావణ సంప్రదాయమేదో, రాముని సంప్రదాయమేదో, తండ్రి మీకు స్పష్టపరచి తెలుపుతున్నారు. గాంధీజీ కూడా మాకు రామరాజ్యము కావాలని అనేవారు. రామరాజ్యములో అందరూ నిర్వికారులుగా ఉంటారు. రావణ రాజ్యములోనివారంతా వికారులుగా ఉన్నారు. దీని పేరే వేశ్యాలయము, రౌరవ నరకము కదా. ఇప్పటి మానవులు విషయవైతరణీ నదిలో పడి ఉన్నారు. మనుష్యులు, జంతువులు అందరూ సమానంగా ఉన్నారు. మనుష్యులకు ఏ మహిమా లేదు. 5 వికారాల పై పిల్లలైన మీరు విజయము పొంది మనుష్యుల నుండి దేవతా పదవిని పొందుతారు, మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని, అసురులను సంపూర్ణ వికారులని అంటారు. వారు 16 కళా సంపూర్ణులు, వీరు ఏ కళలు లేనివారు. అందరూ కళావిహీనమైనవారు. ఇప్పుడీ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పాత ఆసురీ ప్రపంచాన్ని పరివర్తన(చేంజ్ / జష్ట్రaఅస్త్రవ) చేసేందుకు తండ్రి వస్తారు. రావణ రాజ్యపు వేశ్యాలయమును శివాలయంగా చేస్తారు. వారు ఇక్కడే త్రిమూర్తి భవనము, త్రిమూర్తి మార్గము(త్రిమూర్తి హౌస్, త్రిమూర్తి రోడ్) అని పేర్లు పెట్టారు. ఇంతకుముందు ఈ పేర్లేవీ ఉండేవి కావు. ఇప్పుడేం జరగాలి? ఈ మొత్తం ప్రపంచమంతా ఎవరిది? పరమాత్మదే కదా. పరమాత్ముని ప్రపంచము అర్ధకల్పము పవిత్రంగా, అర్ధకల్పము అపవిత్రంగా ఉంటుంది. సృష్టికర్త (క్రియేటర్) అని బాబాకే చెప్తారు కదా. కనుక ఈ ప్రపంచము వారిదే కదా. యజమాని నేనే అని తండ్రి అంటున్నారు. నేను బీజరూపాన్ని, చైతన్యాన్ని, జ్ఞానసాగరుడను. నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది, మరెవ్వరిలోనూ ఈ జ్ఞానము లేదు. ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము బాబాలోనే ఉందని మీరు తెలుసుకోగలరు. మిగిలినవన్నీ కట్టుకథలే, ప్రలోభాలే, ప్రగల్భాలే. ముఖ్యమైన అసత్యమేమిటి అంటే మీరు నన్ను రాయి-రప్పలలో, కుక్క- పిల్లిలో ఉన్నారని అనుకొని కూర్చుని ఉన్నారు. మీకు ఎంత దుర్దశ పట్టింది.
కొత్త ప్రపంచ మానవులకు, పాత ప్రపంచ మానవులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. అర్ధకల్పము నుండి అపవిత్ర మనుష్యులు పవిత్ర దేవతలకు నతమస్తకులై(తల వంచి) నమస్కరిస్తారు. మొట్టమొదట శివబాబానే పూజిస్తారని పిల్లలకు అర్థం చేయించారు. ఆ శివబాబాయే మిమ్ములను పూజారుల నుండి పూజ్యులుగా చేస్తారు, రావణుడు మిమ్ములను పూజ్యుల నుండి పూజారులుగా చేస్తాడు మళ్లీ తండ్రి డ్రామా ప్లాను అనుసారంగా మిమ్ములను పూజ్యులుగా చేస్తారు. రావణుడు మొదలైన పేేర్లు అయితే ఉన్నాయి కదా. దశరా ఉత్సవాలకు బయట(విదేశాల) నుండి ఎంతోమందిని ఆహ్వానిస్తారు, కానీ అర్థము ఏ మాత్రము తెలియదు. దేవతలను ఎంతగానో నిందిస్తారు. ఇలాంటి విషయాలు అసలు లేనే లేవు. ఈశ్వరుడు నావ-రూపాలకు భిన్నమని అంటారు అనగా లేరని అర్థము. అలాగే ఇక్కడ తయారుచేసే నాటకాలు మొదలైనవేవి వాస్తవానికి లేనే లేవు. ఇదంతా మానవుల బుద్ధి. మనుష్య మతమును ఆసురీ మతమని అంటారు. యథారాజా-రాణి తథా ప్రజలు......... అందరూ అలానే తయారవుతారు. దీనిని దానవ(డెవిల్) ప్రపంచమంటారు. అందరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఆత్మ అని తెలుసుకొని తండ్రి స్మృతిలో కూర్చోండి. అజ్ఞాన కాలములో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. కానీ ఇప్పుడు తండ్రి ఇక్కడకు వచ్చారని తెలుసు. అందువలన పైన ఉంటారని అనుకోరు. మీరు తండ్రిని ఇక్కడకు పిలిచారు, ఈ శరీరములోకి రమ్మని పిలిచారు. మీరు మీ మీ సేవాకేంద్రాలలో ఉన్నప్పుడు శివబాబా మధువనములో వీరి శరీరములో ఉన్నారని భావిస్తారు. భక్తిమార్గములో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. ఓ భగవంతా!........... ఇప్పుడు మీరు బాబాను ఎక్కడ స్మృతి చేస్తారు? కూర్చుని ఏం చేస్తారు? బ్రహ్మ శరీరములో ఉన్నారంటే ఇక్కడే స్మృతి చేయాలని మీకు తెలుసు. పైన లేరు. పురుషోత్తమ సంగమ యుగములో ఇక్కడకు వచ్చారు. మిమ్ములను ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చాను. పిల్లలైన మీరు ఇక్కడే స్మృతి చేస్తారు. భక్తులు ఇప్పుడు కూడా పైననే స్మృతి చేస్తారు. మీరు విదేశాలలో ఉన్నా బ్రహ్మ శరీరములో శివబాబా ఉన్నారని అంటారు. శరీరమేమో తప్పకుండా కావాలి కదా. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా ఇక్కడే స్మృతి చేస్తారు కదా. బ్రహ్మ శరీరములోనే స్మృతి చేయవలసి వస్తుంది. చాలామంది బుద్ధిహీనులు బ్రహ్మను గౌరవించరు, బ్రహ్మను స్మృతి చేయవద్దని బాబా చెప్పరు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా గుర్తుకు వస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇందులో నన్ను స్మృతి చేయండి. అందుకే మీరు బాప్(తండ్రి) దాదా(అన్న) - ఇద్దరినీ స్మృతి చేస్తారు. వీరిలో వీరి ఆత్మ ఉందని బుద్ధిలో జ్ఞానముంది. శివబాబాకు తన స్వంత శరీరము లేదు. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. తండ్రి కూర్చుని ఈ బ్రహ్మాండము మరియు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలిపిస్తున్నారు. ఇతరులెవ్వరికీ ఇది తెలియనే తెలియదు. మీరు, నేను నివసించేది బ్రహ్మతత్వములోనే. సుప్రీమ్ అయిన పరమాత్మ మరియు సుప్రీమ్ కానీ ఆత్మలుంటున్న ఆ బ్రహ్మలోకము శాంతిధామమే. శాంతిధామము చాలా మధురమైన పేరు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మనము వాస్తవానికిి బ్రహ్మమహాతత్వ నివాసులము. దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తిమార్గములో ఉన్నప్పుడు ఒక్క అక్షరము జ్ఞానము కూడా తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. పరివర్తన చెందే సమయము. పాత ప్రపంచములో అసురులుంటారు, నూతన ప్రపంచములో దేవతలుంటారు. వారిని పరివర్తన చేసేందుకు తండ్రి రావల్సి వచ్చింది. సత్యయుగములో మీకు ఏ మాత్రము గుర్తుండదు. కలియుగములో కూడా ఏమీ గుర్తు లేదు. నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ పాత ప్రపంచము గుర్తుండదు. అదే విధంగా పాత ప్రపంచములో ఉన్నప్పుడు నూతన ప్రపంచము ఎలా ఉండేదో కూడా తెలియదు, అది ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. వారేమో లక్షల సంవత్సరాలని అంటారు. పిల్లలైన మీకు బాగా తెలుసు - ఆ తండ్రి కల్ప-కల్పము ఈ సంగమ యుగములోనే వస్తారు. వారు వచ్చి ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అంతేకాక ఈ చక్రమెలా తిరుగుతూ ఉందో తెలుపుతారు. ఇవన్నీ అర్థం చేయించడమే మీ వ్యాపారము(కర్తవ్యము). ఒక్కొక్కరికి అర్థం చేయించాలంటే చాలా సమయము పడ్తుంది. మీరిప్పుడు చాలామందికి తెలియజేస్తున్నారు, చాలామంది తెలుసుకుంటారు. ఈ మధురాతి మధురమైన విషయాలు మీరు ఇంకా చాలామందికి అర్థం చేయించాలి. మీరు ప్రదర్శనీలు మొదలైన వాటిలో తెలిపిస్తారు కదా. శివజయంతి పండుగనాడు అందరినీ ఆహ్వానించి బాగా అర్థం చేయించండి. ఈ డ్రామా ఎంత కాలముదో మీరు సరిగ్గా అర్థం చేయించగలరు. ఇవన్నీ టాపిక్‌లు. నేనే ఇదంతా మీకు తెలుపుచున్నాను. మీకు తండ్రి తెలిపే జ్ఞానము వలన మీరు దేవతలుగా తయారవుతారు. మీరు అర్థము చేసుకొని దేవతలుగా అవుతారో, అలా ఇతరులను కూడా తయారుచేస్తారు. తండ్రి మనకు ఈ విషయాలు అర్థం చేయించారు. మనము ఎవ్వరినీ నిందించము. జ్ఞానాన్ని సద్గతిమార్గమని, ఒక్క సద్గురువు మాత్రమే ఆవలి తీరానికి దాటించేవారని మనము తెలుపుతాము. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లు వెలికి తీసి అర్థం చేయించండి. ఈ జ్ఞానమునంతా తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. జ్ఞానవంతులై స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకోవాలి. అల్పకాలిక సుఖాల వెంట వెళ్లరాదు.
2. బాప్ మరియు దాదా ఇరువురిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ లేకుంటే శివబాబా గుర్తు రారు. భక్తిమార్గములో శివబాబాను ఉపరిభాగములో స్మృతి చేశారు, ఇప్పుడు బ్రహ్మ శరీరములో వచ్చారు, కావున ఇద్దరూ గుర్తు రావాలి.
వరదానము :- '' హద్దు కోరికల నుండి ముక్తముగా ఉండి అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్నచిత్త్ భవ ''
ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తంగా ఉంటారో, వారి ముఖము పై ప్రసన్నతా మెరుపు కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులుగా ఉండేవారు ఏ విషయంలోనూ ప్రశ్నచిత్తులుగా ఉండరు. వారు సదా నిస్వార్థంగా ఉండి, సదా అందరిని నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఎవ్వరి పైనా దోషమును ఆపాదించరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఏదైనా లెక్కాచారాన్ని చుక్త చేసుకునే ఆత్మ ఎదురుగా వచ్చినా, శారీరిక కర్మభోగము ఎదురైనా సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.
స్లోగన్ :- '' వ్యర్థాన్ని అటెన్షన్‌తో చెక్ చేయండి, నిర్లక్ష్యంగా కాదు ''
No comments:
Post a Comment